fumes
-
Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
ఢిల్లీ: లోక్‌సభ లోపలికి ఆగంతకులు ప్రవేశించి బుధవారం గందరగోళం సృష్టించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు. అసలు ఏంటి ఈ గ్యాస్ క్యానిస్టర్లు? ఎక్కడ ఉపయోగిస్తారు? Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 గ్యాస్ క్యానిస్టర్ల అంటే..? గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని బహిరంగంగా ఉపయోగించేందుకు చట్టబద్ధత ఉంది. సినిమాలు, ఫొటోషూట్లలో పొగ తెరలను సృష్టించడానికి, మిలిటరీ విభాగాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి వాడుతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను సైనిక ఆపరేషన్లలో వాడతారు. దట్టమైన పొగ తెరలను సృష్టించడం ద్వారా దళాల కదలికలు అస్పష్టంగా మారుతాయి. తద్వారా శత్రువుల కంటపడకుండా కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో దోహదం చేస్తాయి. గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. నిందితుల వివరాలు.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. ఈ కుట్ర వెనుక మరో కీలక సూత్రదారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టారు. "Main conspirator someone else" in Parliament security breach: Police sources Read @ANI Story | https://t.co/A1Tn7NerpO#ParliamentSecurityBreach #India #Delhi pic.twitter.com/qSRwgdGVPB — ANI Digital (@ani_digital) December 14, 2023 ఇదీ చదవండి: Parliament Issue: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి -
విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. గాలి నాణ్యతా సూచీ(AQI) శుక్రవారం ఉదయం అత్యధికంగా 404గా నమోదైంది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది. ఢిల్లీలో గురువారం గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు.. మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా ఉన్నాయి. రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి. Delhi's air quality remains in 'severe' category Read @ANI Story | https://t.co/vJd7cKWoNZ#Delhi #AQI #DelhiAirPollution pic.twitter.com/FzrD2O2eqt — ANI Digital (@ani_digital) November 17, 2023 ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం గురువారం స్పెషల్ టాక్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అటు.. గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు స్మోగ్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని పేర్కొంది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్డుపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్తత -
తిరుపతి- హైదరాబాద్ వందే భారత్ ట్రైన్లో పొగలు..
తిరుపతి: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైలు ప్రాజెక్టు నాణ్యతా లోపాలపై తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. వందేభారత్‌పై రాళ్లు రువ్వడం నుంచి అనేక ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా వందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదీ చదవండి:రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్ సమయస్ఫూర్తితో.. -
మహానందిలో అపశ్రుతి
మహానంది: మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి సన్నిధిలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. హారతిపళ్లెంలోని దీపానికి సంబంధించి నిప్పు రవ్వలు ఎగిసి హుండీలో పడడంతో పొగలు వచ్చాయి. భక్తులకు హారతి ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే ఆలయానికి చేరుకొని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుండీలో ఇసుక పోశారు. హుండీలోని కానుకలు కొంత మేరకు కాలిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ సూపరింటెండెంట్ ఓ.వెంకటేశ్వరుడు మాట్లాడుతూ దీపం హుండీలో పడలేదని, హారతి పళ్లెంలో ఉన్న చిల్లరను అర్చకుడు హుండీలో వేస్తుండగా దీపానికి ఉన్న వత్తి కాయిన్లకు అతుక్కుని పొగవచ్చి ఉండవచ్చన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పెద్దయ్యనాయుడు ఆలయానికి చేరుకుని హుండీలను పరిశీలించడంతోపాటు సీసీ పుటేజీ దృశ్యాలు చూసి వివరాలు తెలుసుకున్నారు. -
‘రాజహంస’ కోసం క్యూ కట్టారు..
ఏవియేషన్ షోలో రెండో రోజూ సందర్శకుల కిటకిట హైదరాబాద్: పొగలు కక్కుతూ ఆకాశంలోకి దూసుకుపోవడం... అంతలోనే కిందపడుతుందేమో అనిపించడం.. మళ్లీ వేరే డెరైక్షన్‌లో విమానం దూసుకుపోవడం.. దానికి వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్ అయిపోతాయేమో అని భ్రమ కల్పించడం.. మొత్తం గా ఏవియేషన్ షోలో వైమానిక విన్యాసాలు సందర్శకులను ఊపిరి బిగబట్టేలా చేశాయి. రెండో రోజు కూడా ఏవియేషన్ షో కిటకిటలాడింది. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వైమానిక విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. మరోవైపు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎగ్జిబిషన్లో తమ ఉత్పత్తుల స్టాల్స్‌ను ప్రదర్శించారు. విమానయానానికి అనుబంధంగా ఆయా ఉత్పత్తులు అధునాతన టెక్నాలజీని సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అందరి బాటా... రాజహంస వైపే.. ఏవియేషన్ షోకే హైలైట్‌గా నిలుస్తోన్న ఎమిరేట్స్(రాజహంస)ను చూసేందుకే సందర్శకులు మక్కువ కనబరుస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ ఆ డబుల్ డెక్కర్ విమానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు సైతం ఏవియేషన్ షోను సందర్శించి ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కి అందులోని ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఇక సందర్శకులైతే మండుటెండలో క్యూలో నిలబడి ఆ విమానాన్ని చూసి మహదానందం పొందారు. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
డోర్నకల్ (వరంగల్) : మహారాష్ట్రలోని షిర్డీ సాయి నగర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్ శనివారం డోర్నకల్ సమీపంలోకి రాగానే ఏసీ బోగీ కింది భాగంలో సమస్య తలెత్తడంతో.. బోగీలో పొగలు కమ్ముకున్నాయి. ఈ సమస్యను గుర్తించిన డ్రైవర్ వెంటనే డోర్నకల్ రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది మూడో ఏసీ బోగీ కింద బ్రేక్ జామ్ అయిన విషయాన్ని గుర్తించి దాన్ని సరిచేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో షిర్డీ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్‌లో అరగంటకు పైగా ఆగిపోయింది. -
హౌరా-మైసూర్ ప్రత్యేక రైలు నుంచి పొగలు
తుని, న్యూస్‌లైన్: హౌరా నుంచి మైసూర్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలులో శనివారం ఉదయం పొగలు వచ్చాయి. విశాఖ జిల్లా గుల్లిపాడు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత బీ-1 ఏసీ బోగీ అడుగుభాగం నుంచి పొగలు రావడాన్ని పాయకరావుపేట 451 రైల్వే గేట్‌మన్ రమణ గమనించి తుని స్టేషన్ సూపరింటెండెంట్ శర్మకు సమాచారమిచ్చారు. దాంతో రైలును తుని స్టేషన్లో నిలిపివేసి అగ్నిమాపక పరికరాలతో బోగీ అడుగున స్ప్రే చేశారు. ఏసీ మెషీన్లకు విద్యుత్ సరఫరా చేసే డైనమో బెల్టు పట్టివేయడం వల్ల పొగలు వచ్చాయి. దీనివల్ల విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలురైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఫలక్‌నుమాలో కూడా.. నందిగాం/పలాస: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో కూడా శనివారం మంటలు రేగాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం సాయంత్రం 6.55 గంటలకు రైలు బయలుదేరింది. పూండి సమీపంలోకి వచ్చేసరికి ఎస్-5, 6 బోగీల కింది భాగంలో మంటలు వచ్చాయి. విషయం తెలుసుకున్న డ్రైవర్ రైలును రౌతుపురంలో నిలిపివేశారు. బ్రేకులు పట్టేయడంవల్ల మంటలు రేగినట్లు తేలింది. మరమ్మతుల అనంతరం రైలు బయల్దేరింది. -
హైదరాబాద్ శివార్లలో SVR ట్రావెల్స్ బస్సు నుంచి పొగలు
-
‘కోస్టల్ గోల్డ్’ నుంచి విషవాయువులు
ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: మండలంలోని ధర్మవరం వద్ద ఉన్న కోస్టల్ గోల్డ్‌రొయ్యల పరిశ్రమ నుంచి గురువారం విడుదలయిన విషవాయువుల కారణం గా 11మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం తో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ పరిశ్రమలో ఒడిశాతోపాటు విశాఖ, విజయనగరం, కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి రొయ్యలను తీసుకువచ్చి ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇందులో సుమారు 100 మంది మహి ళా కార్మికులు పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కార్మికులు విధుల్లో ఉండగా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఘాటైన వాయువులు విడుదలయ్యాయి. విధుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి మండలం డి.ఎల్.పురం, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట గ్రామాలకు చెందిన గంపల గంగ, జి.రమాదేవి, జి.సువర్ణ, బొంది మణి, గరికిన రత్నం, గరికిన భవానీ, యజ్జల అపర్ణ, సారిపల్లి రాము, కోడ నూకరత్నం, పైడికొండ జ్యోతి, ఎస్.రాయవరం మండలం ఉప్పరాపల్లికి చెందిన కోన వరలక్ష్మి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వారి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. బాధితులను నక్కపల్లి 30పడకల ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన సారిపల్లి రామును ఎకాయెకిన విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పరిశ్రమలో విషవాయువులు పీల్చడమే ఇందుకు కారణమని అక్కడి వైద్యులు తెలిపారు పరిశ్రమను ఎస్.రాయవరం తహశీల్దార్ బాబుసుందరం పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికే దీనిపై యాజమాన్యాన్ని హెచ్చరించామని తహశీల్దార్ విలేకరులకు తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు నివేదిక పంపుతామన్నారు. దీనిపై ఎస్.రాయవరం పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.