ధర్నాలో పాల్గొన్న సీపీఎం నేతలు
సాక్షి, విజయవాడ: టీడీపీ సర్కారుపై కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) తీవ్ర విమర్శలు చేసింది. విజయవాడలో 3,774 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతికి, భూ కబ్జాలకు విజయవాడను అడ్డాగా మార్చారని విమర్శించారు. ఎంతో గొప్ప పేరున్న నగరాన్ని కాల్‌మనీ, ముజ్రా డ్యాన్స్‌లతో టీడీపీ నేతలు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పరిష్కారించాల్సిందిపోయి సొంత సంపాదనకే టీడీపీ నేతలు పరిమితమయ్యారంటూ నిరసనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment