krishna puskaralu
-
పుష్కర నిధులు బొక్కేస్తున్నారు..
అనుమతి లేని ఘాట్‌కు నిధుల కేటాయింపు ఏర్పాట్లు చేయని ఘాట్‌కు కౌన్సిల్ ఆమోదం మచిలీపట్నం (ఈడేపల్లి): కృష్ణా పుష్కరాల సందర్భంగా పట్టణంలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిధుల కేటాయించేందుకు మునిసిపాలిటీ నిధులు కేటాయించింది. పుష్కరాల ఏర్పాట్లుకు గాను మున్సిపాలిటీ పరిధిలో రూ.1.60 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని నాలుగో అంశం నుంచి 21 వరకు ఉన్న అంశాలను ప్రతిపక్ష అభ్యంత రాలు లెక్కచేయకుండా ఆమోదించారు. స్థానిక బందరుకోటలోని ఘాట్ ఏర్పాటు చేయలేదు. అయినా అక్కడ కాలువ గట్లు, పలు అభివృద్ధి పనులు చేశామని రూ.4.88 లక్షలకు ఆమోదం పొందారు. అయితే ఆ ఘాట్ విషయం బయటికి రాకుండా, నాగులేరు ఘాట్‌ను కలిపి చాకచక్యంగా వ్యవహరించారు. నాగులేరు ఘాట్‌వద్ద వాహనాల పార్కింగ్‌కు, భక్తుల విశ్రాంతి నిమిత్తం తాత్కాలిక షెడ్లు ఏర్పాట్లు చేయకుండానే చేసినట్లు రూ.23.25 లక్షలకు లెక్కలు చూపించి ఆమోదం పొందారు. పుష్కరాల ప్రారంభానికి ముందురోజు కాలువలో నీరు లేకపోవడంతో ట్రాక్టర్ ట్యాంకర్లతో నీటిని పోశారు. అందుకు గాను రూ.7.85 లక్షలు స్వాహా చేశారు. అయితే వాస్తవానికి ట్యాంకర్లతో నీరు తరలించడం మొదలు పెట్టగానే పట్టణ ప్రజలు, సామాజిక మాధ్యమాల్లో దుమ్మేత్తి పోశారు. దీంతో వంద ట్యాంకర్ల నీటిని పోసి నిలుపుదల చేశారు. పట్టణంలోని ముడు స్థంభాల సెంటరు, హౌసింగ్ బోర్డు, కోతిబొమ్మ సెంటరు, పరాసుపేట, గాంధీ విగ్రహం ప్రాంతాల్లో విద్యుత్ కాంతులకు రూ.42 లక్షలు ఖర్చు చేసినట్లు కౌన్సిల్లో ఆమోదం తెలిపారు. వీటికి సంభంధించిన కేబుళుల, పలు రకాల పరికరాలకు మరో రూ.79 లక్షలను కేటాయించాలని తీర్మానాన్ని కూడా పెట్టారు. పుష్కరాల నిమిత్తం కొట్లాది రూపాలయను నిధులను విడుదల చేసినప్పటికీ నాగులేరు ఘాట్ వద్ద జలుస్నానాలకు కేవలం వెయ్యి నుంచి 1200 మంది మాత్రమే పుష్కర స్నానాలు చేశారు. కానీ పుష్కరాలు ముగిసిన తర్వాత కోట్లాధి రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి, అమోదాలను తెలపడం కొసమెరుపుగా మిగిలింది. పనులు పరిశీలించి బిల్లులు చెల్లిస్తాం .. జస్వంతరావు, మునిసిపల్ కమిషనర్ పుష్కరాల నిమిత్తం పట్టణంలో చేపట్టిన కార్యక్రమాలకు మునిసిపల్ కౌన్సిల్లో నిధులు విడుదల చేయాలని తీర్మానం చేసింది. కాని చేపట్టిన పనులను కొలతలు, అంచనాలు వేసి అనంతరం వారికి ఎంతెంత చెల్లించాలో ఆమేరకే చెల్లిస్తాం. తీర్మానం చేసినప్పటికీ నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయం. -
రైళ్లలో 42 లక్షల మంది పుష్కర యాత్రికులు
రైల్వేమంత్రి సురేష్‌ప్రభు వెల్లడి రైల్వేస్టేషన్ : పుష్కర యాత్రికులకు మెరుగైన సేవలందించామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు అన్నారు. మంగళవారం స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్లో నంద్యాల–ఎర్రగుంట్ల కొత్త రైల్వే లైనును, నంద్యాల–కడప ప్యాసింజర్ రైలును వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించారు. 42 లక్షల మంది యాత్రికులు వివిధ ప్రాంతాలనుంచి రైళ్లలో విచ్చేశారన్నారు. ఏ.పీ లో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒలింపిక్స్‌లో రజిత పతాక విజేత పి.వి.సింధు రైల్వే ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడం రైల్వేకు గర్వకారణమన్నారు. నంద్యాల లైను చరిత్రాత్మకం: సీఎం సి.ఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నంద్యాల–ఎర్రగుంట్ల లైను ప్రారంభం కావడం చరిత్రాత్మకమైనదన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధికి ఈరైల్వే లైను ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాయ్‌పూర్– విశాఖపట్నం, రైల్వేలైను అభివృద్ధి చేయాలన్నారు. ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నంద్యాల– ఎర్రగుంట్ల లైను దివంగత భారత ప్రధాని పి.వి.నరసింహారావు కల అన్నారు. ఏ.పీలో గుంతకల్–వాడితో పాటు మరిన్ని కొత్త రైల్వేలైన్ల పనులు త్వరలో చేపడతామన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు ప్రకటించిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావడానికి 40 ఏళ్లు పడుతుందన్నారు. 2016–2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని రైల్వేల అభివృద్ధికి రూ. 3200 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ.కే.గుప్తా, రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, డి.ఆర్.ఎం అశోక్‌కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావు, సీనియర్ డీ.సీ.ఎం షిఫాలి తదితరులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన రైళ్లు
రైల్వేస్టేషన్ : పుష్కరాలు మరి కొద్ది గంటల్లో ముగుస్తున్న తరుణంలో రైల్వేస్టేషన్ యాత్రికుల రద్దీతో కిక్కిరిసింది. విశాఖ, సికింద్రాబాద్, చెన్నై, సికింద్రాబాద్, తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లు రద్దీతో నడిచాయి. విశాఖ వైపు వెళ్లే రత్నాచల్, లింక్, జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్, కోణార్క్,సికింద్రాబాద్ వైపు వెళ్లే శాతవాహన,గోల్కొండ, జన్మభూమి,తిరుపతి వైపు కృష్ణా ఎక్స్‌ప్రెస్, చెన్నై వైపు వెళ్లే పినాకినీ, కోరమాండల్, జనశతాబ్ధి రైళ్లు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాలకు నడుపుతున్న పుష్కర ప్రత్యేక రైళ్లలోను కాసింత చోటు కోసం ప్రయాణికులు అపసోపాలు పడ్డారు. మరో రెండురోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉంది.