రైళ్లలో 42 లక్షల మంది పుష్కర యాత్రికులు
రైళ్లలో 42 లక్షల మంది పుష్కర యాత్రికులు
Published Tue, Aug 23 2016 10:53 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
రైల్వేమంత్రి సురేష్‌ప్రభు వెల్లడి
రైల్వేస్టేషన్ :
పుష్కర యాత్రికులకు మెరుగైన సేవలందించామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు అన్నారు. మంగళవారం స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో నంద్యాల–ఎర్రగుంట్ల కొత్త రైల్వే లైనును, నంద్యాల–కడప ప్యాసింజర్ రైలును వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించారు. 42 లక్షల మంది యాత్రికులు వివిధ ప్రాంతాలనుంచి రైళ్లలో విచ్చేశారన్నారు. ఏ.పీ లో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒలింపిక్స్‌లో రజిత పతాక విజేత పి.వి.సింధు రైల్వే ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడం రైల్వేకు గర్వకారణమన్నారు.
నంద్యాల లైను చరిత్రాత్మకం: సీఎం
సి.ఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నంద్యాల–ఎర్రగుంట్ల లైను ప్రారంభం కావడం చరిత్రాత్మకమైనదన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధికి ఈరైల్వే లైను ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాయ్‌పూర్– విశాఖపట్నం, రైల్వేలైను అభివృద్ధి చేయాలన్నారు. ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నంద్యాల– ఎర్రగుంట్ల లైను దివంగత భారత ప్రధాని పి.వి.నరసింహారావు కల అన్నారు. ఏ.పీలో గుంతకల్–వాడితో పాటు మరిన్ని కొత్త రైల్వేలైన్ల పనులు త్వరలో చేపడతామన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు ప్రకటించిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావడానికి 40 ఏళ్లు పడుతుందన్నారు. 2016–2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని రైల్వేల అభివృద్ధికి రూ. 3200 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ.కే.గుప్తా, రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, డి.ఆర్.ఎం అశోక్‌కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావు, సీనియర్ డీ.సీ.ఎం షిఫాలి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement