న్యూఢిల్లీ: అక్రమ సాఫ్ట్‌వేర్‌తో రైల్వే తత్కాల్ టికెట్ల కుంభకోణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ తరహా సాఫ్ట్‌వేర్లపై సీబీఐ దృష్టి సారించింది. సీబీఐలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తూ ‘నియో’ పేరిట అక్రమ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన అజయ్ గార్గ్ అనే వ్యక్తిని ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాఫ్ట్‌వేర్లతో పీఎన్‌ఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఒకేసారి పలు యూజర్ ఐడీలతో పెద్దమొత్తంలో టికెట్లు పొందే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఆటో ఫిల్ విధానంలో ఈ సాఫ్ట్‌వేర్లు పనిచేయడంతో తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు టికెట్లను పొందుతున్నారని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. ఈ తరహా సాఫ్ట్‌వేర్‌లపై దృష్టి సారించామని, ఎవరైనా తప్పుచేశారని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అక్రమ సాఫ్ట్‌వేర్ వినియోగించడం నేరమని, సాఫ్ట్‌వేర్‌ల ద్వారా పొందిన టికెట్లను ఏజెంట్లు అధిక ధరకు విక్ర యిస్తూ పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment