పుష్కర నిధులు బొక్కేస్తున్నారు.. | puskara funds diverted | Sakshi
Sakshi News home page

పుష్కర నిధులు బొక్కేస్తున్నారు..

Published Fri, Sep 2 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

పుష్కర నిధులు బొక్కేస్తున్నారు..

పుష్కర నిధులు బొక్కేస్తున్నారు..

 అనుమతి లేని ఘాట్‌కు నిధుల కేటాయింపు
ఏర్పాట్లు చేయని ఘాట్‌కు కౌన్సిల్‌ ఆమోదం
 
మచిలీపట్నం (ఈడేపల్లి):
 కృష్ణా పుష్కరాల సందర్భంగా పట్టణంలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిధుల కేటాయించేందుకు మునిసిపాలిటీ నిధులు కేటాయించింది. పుష్కరాల ఏర్పాట్లుకు గాను మున్సిపాలిటీ పరిధిలో రూ.1.60 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. బుధవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో అజెండాలోని నాలుగో అంశం నుంచి 21 వరకు ఉన్న అంశాలను ప్రతిపక్ష అభ్యంత రాలు లెక్కచేయకుండా ఆమోదించారు.
స్థానిక బందరుకోటలోని ఘాట్‌ ఏర్పాటు చేయలేదు. అయినా అక్కడ కాలువ గట్లు, పలు అభివృద్ధి పనులు చేశామని రూ.4.88 లక్షలకు ఆమోదం పొందారు. అయితే ఆ ఘాట్‌ విషయం బయటికి రాకుండా, నాగులేరు ఘాట్‌ను కలిపి చాకచక్యంగా వ్యవహరించారు. 
నాగులేరు ఘాట్‌వద్ద వాహనాల పార్కింగ్‌కు, భక్తుల విశ్రాంతి నిమిత్తం తాత్కాలిక షెడ్లు ఏర్పాట్లు చేయకుండానే చేసినట్లు రూ.23.25 లక్షలకు లెక్కలు చూపించి ఆమోదం పొందారు. పుష్కరాల ప్రారంభానికి ముందురోజు కాలువలో నీరు లేకపోవడంతో ట్రాక్టర్‌ ట్యాంకర్లతో నీటిని పోశారు. అందుకు గాను రూ.7.85 లక్షలు స్వాహా చేశారు. అయితే వాస్తవానికి ట్యాంకర్లతో నీరు తరలించడం మొదలు పెట్టగానే పట్టణ ప్రజలు, సామాజిక మాధ్యమాల్లో దుమ్మేత్తి పోశారు. దీంతో వంద ట్యాంకర్ల నీటిని పోసి నిలుపుదల చేశారు.
పట్టణంలోని ముడు స్థంభాల సెంటరు, హౌసింగ్‌ బోర్డు, కోతిబొమ్మ సెంటరు, పరాసుపేట, గాంధీ విగ్రహం ప్రాంతాల్లో విద్యుత్‌ కాంతులకు రూ.42 లక్షలు ఖర్చు చేసినట్లు కౌన్సిల్‌లో ఆమోదం తెలిపారు. వీటికి సంభంధించిన కేబుళుల, పలు రకాల పరికరాలకు మరో రూ.79 లక్షలను కేటాయించాలని తీర్మానాన్ని కూడా పెట్టారు.
పుష్కరాల నిమిత్తం కొట్లాది రూపాలయను నిధులను విడుదల చేసినప్పటికీ నాగులేరు ఘాట్‌ వద్ద జలుస్నానాలకు కేవలం వెయ్యి నుంచి 1200 మంది మాత్రమే పుష్కర స్నానాలు చేశారు. కానీ పుష్కరాలు ముగిసిన తర్వాత కోట్లాధి రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి, అమోదాలను తెలపడం కొసమెరుపుగా మిగిలింది.
పనులు పరిశీలించి బిల్లులు చెల్లిస్తాం .. జస్వంతరావు, మునిసిపల్‌ కమిషనర్‌ 
పుష్కరాల నిమిత్తం పట్టణంలో చేపట్టిన కార్యక్రమాలకు మునిసిపల్‌ కౌన్సిల్‌లో నిధులు విడుదల చేయాలని తీర్మానం చేసింది. కాని చేపట్టిన పనులను కొలతలు, అంచనాలు వేసి అనంతరం వారికి ఎంతెంత చెల్లించాలో ఆమేరకే చెల్లిస్తాం. తీర్మానం చేసినప్పటికీ నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement