పుష్కర నిధులొచ్చాయ్..!
Published Wed, Aug 17 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
తొలి విడత రూ.77 కోట్లు మంజూరు
విజయవాడ సెంట్రల్ :
నగర పాలక సంస్థకు ఎట్టకేలకు ప్రభుత్వం పుష్కర నిధులను విడుదల చేసింది. కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తొలి విడతగా రూ.77 కోట్లను బుధవారం విడుదల చేసింది. పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, భోజన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాల్సిందిగా కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మా సంగతేంటి
పారిశుద్ధ్యం, ఫుడ్ కాంట్రాక్టర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మా సంగతేంటని సివిల్ వర్క్స్ చేసిన కాంట్రాకర్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.97 కోట్లతో 55 రోడ్లు విస్తరణ చేశారు. అధికార పార్టీ అండదండలతో మొత్తం తొమ్మిది మంది కాంట్రాక్టర్లు ఎక్సెస్ టెండర్లు వేశారు. నిధులు మంజూరైన నేపథ్యంలో వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement