తాడ్వాయి: మేడారానికి అప్పుడే భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడం, ఈనెల 31నుంచి జాతర నిర్వహించనుండడంతో భక్తజనులు సమ్మక్క, సారలమ్మ తల్లులను ముందస్తుగానే దర్శించుకున్నారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవతల గద్దెలకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, గాజులు, ఒడి బియ్యం, కానుకలను సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా మేడారం తరలివచ్చారు. సుమారు 2 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అంచనా. భక్తులు ఇబ్బందులు పడకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment