Sammakka Saralamma Jatara
-
మేడారం జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
-
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలివే!
సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే జాతరను ఈసారి 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని పూజారుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభిస్తారు. దాదాపు పది నెలల ముందే జాతర తేదీలు.. మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఈ సారి దాదాపు 10 నెలల ముందుగానే ప్రకటించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత అనుభవాల దృష్ట్యాఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సమ్మక్క–సారలమ్మ పూజారులు కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకటనకు ముందు పూజలు.. మేడారం మహాజాతర తేదీల ఖరారు కోసం బుధవారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్, పూజారులు సిద్దబోయిన మునేందర్, సిద్దబోయిన మహేశ్, లక్ష్మణ్‌రావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేశ్, భోజారావు, జనార్దన్, అరుణ్‌కుమార్‌లు సమావేశం అయ్యారు. కాగా, సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలను ప్రకటించే ముందు పూజారులు ఆనవాయితీగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఏడాది మహాజాతర విజయవంతంగా సాగాలని అమ్మవార్లను వేడుకున్నారు. జాతర తేదీలు ఇవే.. ఫిబ్రవరి 21: మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఫిబ్రవరి 22: చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక. ఫిబ్రవరి 23: సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ. ఫిబ్రవరి 24: మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశం, మహా జాతర ముగింపు. ఫిబ్రవరి 28: మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజున తిరుగువారం పండుగ. చదవండి: ఢిల్లీ సిగలో ‘గులాబీ’.. -
మేడారం జాతర: దేవతలకు తిరుగువారం పండగ..
-
మేడారం జాతర.. ముగింపు ముంగిట మురిపెం
-
మేడారం సమ్మక్మ-సారలమ్మ గద్దెల వద్ద బంగారం తొలగింపు సబబేనా..?
పున్నమి వెలుగున గద్దెనెక్కిన వనదేవతలు.. భక్త‘కోటి’ ఆరాధ్య దైవాలు.. ఇంటి ఇలవేల్పులు. వరాలిచ్చే దేవరలు.. చెంతకొచ్చినా.. మదిలో తలచినా నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే కల్పవల్లులు. రెండేళ్లకోసారి దర్శనభాగ్యం కల్పించేందుకు కళ్లెదుటే సాక్షాత్కరించగా.. జై సమ్మక్క.. జై సారలమ్మ తల్లీ అంటూ మొక్కుల చెల్లింపునకు అశేష భక్తజనం పోటెత్తింది. ఎత్తు బెల్లం(బంగారం), పసుపు, కుంకుమ, చీర సారె సమర్పిస్తూ తల్లుల సేవలో తరించారు. చల్లని చూపులను ప్రసాదిస్తూ.. కోరిన కోర్కెలు తీర్చేందుకు అభయమిచ్చితిరి ఆ అమ్మలు. సాక్షి, మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం): తల్లుల గద్దెలపై ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలను పూజారులు తప్పుబడుతున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ కొలువుదీరిన గద్దెలపై బెల్లం(బంగారం), ఒడిబియ్యం, కొబ్బరి కుడుకలు, పోక, ఖర్జూర, చీర సారె భక్తులు సమర్పించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఇవన్నీ చుట్టూరా ఉంటేనే అమ్మవార్లు అక్కడ ఉన్నట్లు భావిస్తారు. అయితే.. జాతర పూర్తి కాకముందే ఎప్పటికప్పుడు కానుకలు తొలగించడం సంప్రదాయానికి విరుద్ధమని పలువురు పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూజారిని అడగగా.. బంగారం తొలగించడాన్ని తాము తప్పుబడుతున్నామని, అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన నాటి నుంచి వనప్రవేశం చేసే వరకు రాశిగా ఉంటేనే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. చదవండి: మేడారం జాతర: గట్టి మంత్రి.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. కాగా.. వనప్రవేశం ముందు ఆచారంగా ఆదివాసీలు, మేడారం ఆడబిడ్డలు, స్థానికులు గద్దెలపై ఉన్న బెల్లం, చీర సారెలను ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడంతా తొలగించడంతో ఈసారి ప్రసాదం స్థానిక ఆదివాసీలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని పూజారులు వాపోయారు. జాతరకు ముందు జరిగిన సమీక్షలో సైతం గద్దెలపై కేవలం ప్లాస్టిక్ కవర్లు మాత్రమే తొలగించాలని పూజారులు సూచించారు. దీనిపై డీపీఓ వెంకయ్యను వివరణ కోరగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి జాతరలో ఇలానే తొలగిస్తామని, ఈసారి కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. -
Medaram Jatara 2022 : మేడారం మహాజాతర మూడో రోజు (ఫోటోలు)
-
వైభవంగా మేడారం జాతర మహోత్సవం
-
మినీ మేడారం.. 40 ఏళ్లుగా గోలివాడ సమ్మక్క జాతర
ఆహ్లాదకరమైన వాతావరణం.. సేద తీరేందుకు పచ్చటిచెట్లు.. మెరుగైన రవాణా సౌకర్యం.. గోదావరినది తీరప్రాంతంలో కొలువుదీరిన అమ్మవారు.. రెండేళ్లకోసారి వైభవంగా జరిగే గోలివాడ సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు. – రామగుండం కుంకుమగా అవతరించి.. కలలో వచ్చి గోలివాడ గ్రామానికి చెందిన జాలిగామ కిషన్‌రావు ఊరాఫ్ బయ్యాజీ గోదావరిలో స్నానానికి వెళ్లాడు. గోదావరి ఒడ్డున ఇసుకకుప్పలో ఎరుపు బట్టలో కుంకుమ భరిణె మూట లభ్యమైంది. దానిని తీసుకొని ఇంటికి వచ్చిన బయ్యాజీకి రాత్రి నిద్రలో వనదేవతలు కలలోకి వచ్చి నీకు లభ్యమైన కుంకుమ భరణి స్థానంలో శ్రీసమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజుల గద్దెలు నిర్మించి ప్రతీ రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించినట్లు వారు చెబుతుంటారు. అదే ఏడాది 1982లో గోదావరినది ఒడ్డున వనదేవతల గద్దెలను నిర్మించి జాతరను ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామానికి చెందిన 41మందితో వ్యవస్థాపక కమిటీ ఏర్పాటు చేసుకొని జాతరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు. బ్యాక్ వాటర్లోకి వనదేవతల గద్దెలు ► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో బ్యాక్‌వాటర్‌తో వనదేవతల గద్దెలు ముంపులోకి చేరా యి. నెలరోజుల క్రితం ఒడ్డునే నూతన గద్దెలు నిర్మించారు. భక్తులు విడిది చేసేందుకు, నాలుగు వైపుల పబ్లిక్ టాయిలెట్స్ తదితర ఏర్పాట్లకు 60ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ► జాతరకు గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాల వారుకూడా వస్తారు. గతేడాది రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ► జాతరలో నాలుగు వైపుల నాలుగు బోర్లు, స్నానాలు చేసేందుకు షవర్స్, ప్రత్యేక టాయిలెట్స్, ఐదు సెంట్రల్ లైటింగ్స్, 400 అంతర్గత వీధి దీపాలు, పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు రైల్వేట్రాక్ వరకు రహదారి ఏర్పాట్లు చేశారు. ► గోదావరిఖని నుంచి బస్సులు, ప్రయివేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇత ర రాష్ట్రాలు, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి రైలు సౌకర్యం ఉంది. ఐదు లక్షల మంది వచ్చే అవకాశం గోదావరినదిలో బ్యాక్‌వాటర్‌తో మంచిర్యాల వైపు నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. 2018లో ఐదు లక్షల మంది భక్తులు రాగా ఆదాయం రూ.30 లక్షలు సమకూరింది. 2020లో భక్తుల సంఖ్య 2 లక్షలకు పడిపోయి రూ.17లక్షలు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఏడాది విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుండడంతో చేస్తుండగా.. ఐదులక్షల మంది వచ్చే అవకాశం ఉంది. – గీట్ల శంకర్‌రెడ్డి, జాతర కమిటీ చైర్మన్ ముస్తాబైన సమ్మక్క,సారలమ్మ గద్దెలు కొలనూర్‌లో 48 ఏళ్లుగా... ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం కొలనూర్‌లో సమ్మక్క, సారలమ్మ జాతరను 48 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి నాలుగు లక్షలకు పైగా భక్తులు వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. మేడారం నుంచి కోయపూజారులు వచ్చి నాలుగు రోజులపాటు పూజలు చేయడం ప్రత్యేకత. జాతర చుట్టూ మూడుగుట్టలు ఉన్నాయి. వాటి మధ్య జాతర ఆకర్షణీయంగా జరగుతుంది. అల్లీమాసాని చెరువులో స్నానాలు చేసే అవకాశముంది. జాతరకు కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి ఆటోలూ నడుస్తాయి. రైలులో వచ్చేవారు కొలనూర్ రైల్వే స్టేషన్లో దిగి జాతరకు రావొచ్చు. ఏర్పాట్లు చేశాం జాతరకు వచ్చే భక్తులకు నీడ, మంచినీటి సౌకర్యం, రహదార్లు ఏర్పాటు చేశాం. వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం. మహిళలకు మరగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశాం. – బండారి ఐలయ్య యాదవ్, జాతర చైర్మన్ -
మేడారం జాతరపై తెలంగాణ జాగృతి డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి పరిరక్షకులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సమర్పణలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరి రూపొందించిన ‘మేడారం సమ్మక్క–సారక్క జాతర’ డాక్యుమెంటరీని కవిత శనివారం తన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యంలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని, బాలాజీని కవిత అభినందించారు. -
మేడారంలో భక్తజన సందడి
సాక్షి, ములుగు: ములుగు జిల్లా మేడారం జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని.. జంపన్న వాగులో స్నానాలు చేసి.. గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. వాహనాలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాకపోకలను పునరుద్ధరించారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
18న మేడారానికి సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 18న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లిం చుకుంటారని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జాతరపై సందేహాలున్నాయని అయి తే మహాజాతర కచ్చితంగా జరుగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాకే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి, వసతులు పెరిగి నేడు దక్షిణ భారత కుంభమేళాగా సమక్క–సారలమ్మ జాతర మారిందని పేర్కొన్నారు. జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం శనివారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ. 75 కోట్లతో మేడారంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై శాఖలవారీగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్, క రోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు రూ.కోటి కేటాయించామని చె ప్పారు. 2020 జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందునుంచే లక్షల్లో వస్తున్నారని తెలిపారు. సీఎస్, డీజీపీ దిశానిర్దేశం సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6,400 టాయిలెట్లు, వెయ్యి ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి 10 వేల మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉం చుతున్నామని తెలిపారు. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు దయాకర్, మాలోతు కవిత పాల్గొన్నారు. కాగా, సమీక్షకు ముందు ఇంద్రకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్, మహేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వచ్చే ఏడాది మాఘమాసంలో నాలుగురోజులపాటు జరగనుంది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర నిర్వహించనున్నట్లు మేడారం ఆలయపూజారులు ఇదివరకే ప్రకటించారు. ఈ జాతరకు జనవరి నుంచే భక్తుల రద్దీ పెరగనుంది. అయితే ఆ ప్రాంతంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చేవిధంగా అభివృద్ధి పనులు ఇంకా మొదలుకాలేదు. జాతరను పురస్కరించుకొని చేపట్టాల్సిన పనుల కోసం సుమారు రూ.114.95 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ.75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నెల 15 నాటికి టెండర్లు పూర్తిచేసి పనులు మొదలెట్టాల్సి ఉండగా, ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. అరకొర నిధులు.. అత్తెసరు పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ మహాజాతర అభివృద్ధికి ప్రభుత్వాలు అరకొరగా నిధులు కేటాయించి తాత్కాలిక పనులు చేపట్టాయి. స్వరాష్ట్రంలో మహాజాతర అంటే ఇలా నిధుల కేటాయిం పు ఉండాలే అనేలా.. రూ.150.50 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. మేడారం జాతర చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదు. భక్తులకు కూడా తాగునీరు, శానిటేషన్, రోడ్ల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఈ–ప్రొక్యూర్ దశలో టెండర్లు... పెండింగ్‌లో రోడ్ల పనులు మేడారం జాతర పేరుతో 2016, 2018, 2020లలో వివిధ ప్రాంతాలకు మంజూరైన రోడ్లు ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో వన్–వే ట్రాఫిక్, వాహనాల రాకపోకల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది వన్–వే చేసిన క్రమంలో ఏటూరునాగారం, ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన ప్రైవేటు వాహనాలను కొండాయి మీదుగా మేడారం వైపు మళ్లించారు. ఈసారి ఆ రోడ్లు గుంతలమయంగా మారడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈసారి రూ.75 కోట్ల విడుదలకు ముందు, తర్వాత ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష లు నిర్వహించారు. అయినా పనులన్నీ ఇంకా టెండర్ల దశ దాటకపోవడంతో అవి ఎప్పటికీ పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 15కల్లా మహాజాతర పనులు మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్నందున ఆయా శాఖల అధికారులు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల నియమావళి పాటిస్తూ నడుస్తున్న పనులకు టెండర్లు పిలిచి, 2022 జనవరి 15 కల్లా అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్, ములుగు -
ఆ రోజు వీఐపీలకు అనుమతివ్వకండి
సాక్షి, హైదరాబాద్: ‘‘మేడారం.. శుక్రవారం.. సమ్మక్క, సారలమ్మ దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్షల్లో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీ మరీ పెరిగిపోవటంతో దర్శించుకున్నవారిని వేగంగా ఆ ప్రాంతం నుంచి తరలించేందుకు అధికారుల సూచనతో ఆర్టీసీ బస్సులు బయలుదేరుతున్నాయి. నిమిషానికి 20 బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు జరిగాయి. కానీ అదే సమయంలో కొందరు వీఐపీలు వస్తున్నా రన్న సమాచారంతో పోలీసులు ప్రధాన రోడ్డుపైకి బస్సులను రాకుండా ఆపేశారు. అలా 2 గంటలపాటు బస్సులు నిలిచిపోవటంతో, ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. భక్తుల్లో అసహనం పెరిగింది. క్యూలైన్లు అదుపుతప్పాయి. అంతా గందరగోళం.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిలసలాటకు దారితీస్తుండగా... అతికష్టమ్మీద అధికారులు అదుపు చేశారు’’ఇది గత జాతరలో నెలకొన్న పరిస్థితి.. ఉన్నత స్థానాల్లో ఉండీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన రాజకీయ నేతలు, వారికి దారి ఇప్పించే అత్యుత్సాహంతో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. ఏమాత్రం అదుపుతప్పి తొక్కిసలాట జరిగినా... పర్యవసానం భయంకరంగా ఉండేది. రద్దీని నివారించేందుకు ముందస్తు సన్నాహాలు... ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకూడదంటే, సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువుదీరిన రోజు వీఐపీలకు అనుమతివ్వొద్దని.. ఆర్టీసీ, పోలీసు అధికారులకు సూచించింది. వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న మేడారం జాతరకు మెరుగైన రవాణా వసతి కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా ఆర్టీసీ అధికారులు భేటీ అయి గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఈసారి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈసారి 4500 బస్సులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉత్సవాలు జరిగే రెండో వారంలో గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందులో శుక్రవారం ఇద్దరు దేవతలు గద్దెమీద ఆసీనులై సంయుక్తంగా దర్శనమిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఆ సమయంలో అక్కడే ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో రద్దీ పెరుగు తుంది. దర్శనం ముగిసిన వారిని వీలైనంత వేగంగా అక్కడి నుంచి తరలించటం ద్వారా, రద్దీని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పెద్దమొత్తంలో బస్సులను సిద్ధంగా ఉంచి, నిమిషానికి కనీసం వేయి మందిని తరలించాలని నిర్ణయించారు. ఇది జరగాలంటే ప్రధాన రోడ్డు క్లియర్‌గా ఉండాలి. గత జాతరలో సరిగ్గా అదే సమయంలో వీఐపీలు వచ్చారు. సాధారణ భక్తుల రాకపోకలపై రెండుగంటలపాటు పోలీసులు ఆంక్షలు విధించారు. అది సమస్యలకు కారణమైంది. ఈసారి ఆ కీలక తరుణంలో వీఐపీలు రాకుండా, వారు ముందుగానే దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. -
మేడారం జాతరలో సీఎం కేసీఆర్
-
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యక బస్సులు
-
సార్ హామీ.. నెరవేరదేమి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరొందిన మేడారం మహాజాతర అభివృద్ధి పనులు మళ్లీ అటకెక్కాయి. జాతర జరిగే నాలుగు రోజుల్లో ఇక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు ఎడాపెడా హామీలు గుప్పించడం, అంతకు ముందు రెండు నెలల పాటు పనుల పేరుతో అధికారులు హడావుడి చేయడం తప్ప.. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడంపై ఎవరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా ఇచ్చిన హామీలు నాలుగున్నర నెలలు గడిచినా ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటికి పైగా మంది భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని సమ్మక్క– సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడో రోజు సీఎం రాక.. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో మహా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర మూడో రోజున సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారాన్ని సందర్శించారు. వనదేవతల దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తాం.. 2018–19 బడ్జెట్లోనే ఈ నిధులు మంజూరు చేస్తాం.. జాతరకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖకు ఇక్కడ తగినంత స్థలం అందుబాటులో లేదు.. జాతర ఏర్పాట్ల కోసం కనీసం 200 నుంచి 300 ఎకరాల స్థలం కావాలి.. ఎంత ఖర్చయినా ఇక్కడ భూమిని సేకరిస్తాం.. ఈ విషయాలపై చర్చించేందుకు జాతర ముగిసిన తర్వాత తాను 15 రోజుల్లో మరోసారి మేడారం వచ్చి అధికారులతో మాట్లా డతా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు జంపన్న వాగులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీరు ఉండేలా డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైనందుకు తాను మొక్కులు చెల్లించానని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలని తిరిగి వనదేవతలను మొక్కుకున్నట్లు చెప్పారు. ఒక్కటీ జరగలేదు.. జాతర ముగిసి నాలుగున్నర నెలలు గడిచినా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. 15 రోజుల్లో మళ్లీ మేడారం వచ్చి అ«ధికారులతో సమావేశం ఏర్పా టు చేస్తానన్న సీఎం.. ఇటువైపు కన్నెత్తి కూడా చూ డడం లేదు. దీంతో 200 ఎకరాల స్థల సేకరణ అంశం మరుగున పడిపోయింది. తర్వాత రాష్ట్ర బడ్జెట్ 2018–19లో మేడారం జాతరకు ఒక్క రూ పాయి కూడా కేటాయించలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్న అభివృద్ధి పెరి గింది. అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో జాతర ప్రాధాన్యత పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ వంటి వీఐపీలు గత జాతరలో మేడారం వచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ మంత్రులు వస్తున్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారం వచ్చే భక్తు ల సంఖ్య పెరిగింది. సెలవుదినాల్లో వందల వాహనాలు మేడారం వైపు పరుగులు పెడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జాతర సమయంలో తప్పితే ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడక పోవడంతో అభివృద్ధి పనుల్లో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 2016 జాతర సమయంలో రూ. 14 కోట్లతో తలపెట్టిన నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం నేటికీ పూర్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఒక్క ఎకరమే.. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఈ పల్లెలో 155.8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. సమ్మక్క–సారలమ్మకు కేవలం ఎకరం భూమి మాత్రమే ఉంది. మేడారం పరిసరాల్లో మొత్తం 155.08 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో 8 ఎకరాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాం కేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. జాతర జరిగే సమయంలో యంత్రాంగం ఈ భూముల ను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. అయితే శాశ్వతంగా వనదేవతలకు భూములను కేటాయించలేదు. జాతర సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చాలని భక్తులు కోరుతున్నారు. -
‘మేడారానికి’ హోదా హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఆశలు గల్లంతయ్యాయి. ఈ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి జశ్వంత్‌సింగ్ బబోర్ ఇటీవల లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.2 కోట్లు ఇచ్చిందని, వచ్చేసారి ఈ నిధిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మాత్రం పేర్కొన్నారు. రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం వల్లే.. సమ్మక్క–సారలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. గిరిజనులు, ఆదివాసీలతో పాటు వివిధ వర్గాలకు చెందిన కోటి మందికి పైగా భక్తులు జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు హాజరవుతున్న సందర్భంగా మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ అంశంపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సైతం మొదట్లో సానుకూలంగా స్పందించింది. జాతరకు రావాలన్న రాష్ట్ర ఆహ్వానాన్ని సైతం అంగీకరించిన కేంద్ర బృందం, ఉత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించింది. జాతర తీరును పరిశీలించి నిర్ణయాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కేంద్ర బృందం వచ్చే ముందు పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వీఐపీ తాకిడి ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర బృందం పర్యటనకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో జాతరకు హాజరయ్యే నిర్ణయాన్ని మంత్రుల బృందం విరమించుకుంది. జాతీయ ఉత్సవమైతే... మేడారం జాతరకు జాతీయ ఉత్సవ హోదా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ నిబంధనల్లో భాగంగా పది లక్షలకు పైగా గిరిజనులు హాజరయ్యే ఉత్సవానికి జాతీయ హోదా అర్హతలుంటాయి. కానీ సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏకంగా కోటి మందికి పైగా హాజరవుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడంతో చేజేతులా అవకాశం వదులుకున్నట్లైంది. ఈ ఉత్సవానికి జాతీయ హోదా దక్కితే నిధులు, నిర్వహణ అంతా కేంద్రం చూసుకోవడమే కాకుండా, జాతరకు మరింత ప్రచారం దక్కేదని గిరిజన మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
మహాజాతర ఆదాయం రూ. పది కోట్ల పైనే..
హన్మకొండ కల్చరల్: మేడారం మహాజాతర ఆదాయం రూ.10,17,50,363గా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద పెట్టిన 452 ఇనుపరేకు హుండీలు, 24 వస్త్ర హుం డీలు, 3 ఒడిబాల బియ్యం హుండీలను ఏ ర్పాటు చేశారు. వాటిని ఫిబ్రవరి 5న హన్మకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపంలోకి చేర్చారు. అ నంతరం ఆరో తేదీన లెక్కింపు మొదలు పెట్ట గా.. సోమవారం ముగిసింది. మొత్తం జాతర ఆదాయం రూ.10,17,50,363 వచ్చింది. వాటిని ఆంధ్రా బ్యాంక్ నక్కలగుట్ట బ్రాంచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో జమ చేసినట్లు దేవాదాయశాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు. వందలాది అమెరికన్ డాలర్లతోపాటు సుమారు 32 దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు వివరించారు. అలాగే, 47 కిలోల 470 గ్రాముల వెండి, బంగారు బిస్కెట్లు, బంగారు కిడ్నీ రూపాలు, బంగారు బాసింగాలు, మూడంతస్తుల బంగారు ఇల్లు వంటి వాటిని కూడా కలుపుకొని మొత్తం 824 గ్రాముల బంగారాన్ని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు వెల్లడించారు. కాగా, గత జాతరలో 8.90 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ జాతరలో రూ. కోటికి పైగా ఆదాయం పెరిగింది. -
మేడారం హుండీ ఆదాయం రూ. 7 కోట్లు
హన్మకొండ కల్చరల్: జయశంకర్భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారక్క మహాజాతర హుండీల లెక్కింపు మూడో రోజు గురువారం కొనసాగింది. హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు రాత్రి 8 గంటల వరకు జరిగింది. దేవాదాయ శాఖ ఎస్జీఎఫ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయశాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈఓగా వ్యవహరించిన తాళ్లూరి రమేష్‌బాబు, దేవాదాయశాఖ జేఈఓ కట్టా అంజనీదేవి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రాముల సునీత, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ బెయిల్సింగ్, మేడారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, ధర్మకర్తలు జవహర్లాల్, సారయ్య, లింగయ్య, ట్రస్ట్ బోర్డు కోఆప్షన్ సభ్యులు, మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర వడ్డె చింతబోయిన నర్సింగరావు పాల్గొని పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు మూడో రోజు లెక్కింపు ముగించిన తర్వాత తాళ్లూరి రమేష్‌బాబు ఆదాయం వివరాలు ప్రకటించారు. మూడో రోజు 140 హుండీలను లెక్కించగా ఆదాయం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ.2,48,46,341 ) రూపాయలు లభించాయని, మొదటి రోజు ఆదాయం రూ. 1,72,40,000, రెండో రోజు ఆదాయం రూ. 3,15,00,000లతో కలుపుకుని ఏడు కోట్ల మూఫ్పై ఏడు లక్షల ఎనభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ. 7,35,86,341) ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా 342 హుండీలను తెరిచి లెక్కించామని పేర్కొన్నారు. గురువారం నగదును హెచ్డీఎఫ్ఫీ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు నక్కలగుట్ట బ్రాంచ్‌లో జమ చేశారు. పోలీస్ బందోబస్తు కొనసాగింది. 350 మంది సిబ్బంది లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల మొక్కుబడుల్లో వింతలు.. ఒకే భక్తుడు రూ.2 లక్షల యాబై వేల రూపాయలను.. రూ.2 వేలు, రూ.5 వందల నోట్ల కట్టలను మూటగా కట్టి వేశాడు. మరో భక్తుడు రూ.లక్ష పదహారువేలను హుండీలో వేసి ‘తన కూతురికి వివాహం కావాలని, మనవడు పుట్టాలని.. వచ్చే జాతర నాటికి తన భార్య కూతురు, అల్లుడు మనవడితో జాతరకు వస్తానని ఓ పేపర్‌పై రాశాడు. మరొకరు రూ.5 వందల నోటుపై ‘సేవ్ వాటర్, సేవ్ ట్రీస్’ అని రాశారు. అలాగే, ఒకే వ్యక్తి 400 అమెరికన్ డాలర్లు వేయడం విశేషం. కంబోడియా, నేపాల్ మలేషియా, అరబ్ దేశాల కరెన్సీ ఎక్కువగా వచ్చాయి. -
ఆహ్వానం అనిర్వచనీయం
భూపాలపల్లి : వనం నుంచి జనంలోకి సమ్మక్క రాకను పురస్కరించుకుని చిలకలగుట్ట దగ్గర ప్రభుత్వం తరపున గాలిలో కాల్పులు జరిపి ఆహ్వానం పలకడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందని జయశంకర్ జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ అన్నారు. ట్రైనీ ఐపీఎస్‌గా, భద్రాచలం ఓఎస్డీగా గతంలో రెండు సార్లు జాతరలో నిర్వహణలో పాల్గొన్నా.. తన కెరీర్లో 2018 జాతర ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. మహా జాతర విజయవంతంగా ముగిసిన సందర్భంగా.. జాతరలో తన అనుభూతులు, అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. టెక్నాలజీ సాయంతో.. గతంతో పోల్చితే ఈసారి జాతర నిర్వహణలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాం. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు పొందాం. ముఖ్యంగా రద్దీ నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో సహకరించాయి. గత జాతరలో ఐటీడీఏ గెస్ట్‌హౌస్ వైపు ఉన్న క్యూలైన్ ద్వారా ఎక్కువ మంది దర్శనం చేసుకునేవారు. ఆర్టీసీ క్యూలైన్ వైపు రద్దీ తక్కువ ఉండేది. దీంతో ఐటీడీఏ క్యూలైన్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకున్నాం. ఈ క్యూలైన్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని గమనించిన వెంటనే హరిత హోటల్ దగ్గర ఉన్న చెక్‌పోస్టు సిబ్బందిని అలర్ట్ చేశాం. వారు జంపన్న వాగు నుంచి వచ్చే భక్తులను ఆర్టీసీ క్యూ లైన్ వైపు మళ్లించాం. డ్రోన్ కెమెరాల వినియోగంతో అన్ని రోడ్లను మానిటరింగ్ చేశాం. ఎక్కడైనా రద్దీ పెరిగిపోతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడికి అదనపు సిబ్బందిని పంపాం. వీడియో మానిటర్ స్క్రీన్లు ఉపయోగపడ్డాయి. వీటి ద్వారా 33 మంది తప్పిపోయిన వారిని వెతికి పట్టుకున్నాం. క్రౌడ్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలు సాధ్యమైనంత కచ్చితత్వంతో సేకరించాం. లైటింగ్ పెరగాలి... జాతర జరిగే మేడారం, ఊరట్టం, ఆర్టీసీ బస్‌స్టేషన్, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, రెడ్డిగూడెం, జంపన్నవాగు వంటి ప్రదేశాల్లో రాత్రి వేళ లైటింగ్‌ను పెంచాలి. అన్ని చోట్ల మంచినీటి సౌకర్యం కల్పించాలి. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి గట్టమ్మ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. గుట్ట మలుపులో ఈ ఆలయం ఉంది. పక్కన ఎక్కువ స్థలం అందుబాటులో లేదు. ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పార్కింగ్ ఏరియాను విస్తరించాలి. మేడారం జాతరను సందర్భంగా అనుమానితులుగా ఉన్న దొంగలను ముందుగానే అదుపులోకి తీసుకున్నాం. ఇలా సుమారు 70 మందిని అదుపులో ఉంచుకున్నాం. జాతర సందర్భంగా వివిధ నేరాలకు పాల్పడుతున్న మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నాం. -
ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘గత జాతరలో ఐటీడీఏ పీఓ హోదాలో పనిచేశాను. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే విధుల్లో పాల్గొన్నాను. తల్లిని ఆలయం బయటకు తీసుకువచ్చే సమయంలో వచ్చే జాతరలో నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించు అని మొక్కుకున్నా.. ఆ తర్వాత జిల్లాల విభజన కావడం జయశంకర్ జిల్లాకు నేను జాయింట్ కలెక్టర్‌గా నియమించబడ్డాను. అంతేకాదు జాతరకు ముందే నాకు ఐఏఎస్ హోదా వచ్చింది. ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. టీడీఏ పీఓగా, జాయింట్ కలెక్టర్‌గా రెండు సార్లు ఆయన జాతర విధులు నిర్వర్తించారు. ఈ జాతర అనుభవాలు, వచ్చే జాతరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేసీ ‘సాక్షి’ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... కలిసికట్టుగా పని చేశారు... జాతర నిర్వహణకు సరిపడా ఉద్యోగులు జయశంకర్ జిల్లాలో ఉన్నారు. అయితే వీరికి జాతరలో పని చేసిన అనుభవం లేదు. అందువల్లే ఇతర జిల్లాల నుంచి అధికారులు, సిబ్బందిని రప్పించాం. అందరు ఇది మన జాతర అన్నట్లుగా పని చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి సరైన వసతి, సమయానికి భోజనం అందించాం. ఎవరు ఏ విధులు నిర్వహించాలో చెప్పాం. అంతా కలిసికట్టుగా పని చేశారు. అంతేకాదు వచ్చే జాతరకు అనుగుణంగా జిల్లాలో ఉన్న 400 మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వచ్చే జాతర పూర్తిగా జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగంతో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం. నెల రోజుల ముందే... గతంతో పోల్చితే మేడారం భక్తుల సంఖ్య పెరిగిపోయింది. జాతరకు నెల రోజు ముందు నుంచే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలన్నీ నెల రోజులు మందుగానే పూర్తి చేయాలి. అంతేకాదు ఇక నుంచి జాతరకు వచ్చే వీఐపీల సంఖ్య పెరుగుతుంది. వీఐపీల రాక సందర్భంగా భక్తుల క్యూ లైన్లను ఆపేయాల్సి వస్తుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలు, భక్తులు ఒకే సారి దర్శనం చేసుకోవాల్సి వస్తే.. భక్తులు గద్దెల మీదకు బెల్లం విసరకుండా చూడాలి. దీని కోసం భక్తులకు అవగాహన కల్పించాలి. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక టైమ్ కేటాయించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. సౌకర్యాలు పెరగాలి.. జాతర సందర్భంగా ప్రతీసారి తాత్కాలిక ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నాం. ఇకపై శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలి. జాతర సమయంలో సిబ్బంది బస చేసేందుకు విరివిగా డార్మిటరీలు నిర్మించాలి. సాధారణ రోజుల్లో వీటిని భక్తులకు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వల్ల నీటి వృథాతో పాటు జాతర పరిసరాల్లో బురద ఎక్కువ అవుతోంది. దీన్ని నివారించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా నీటి సరఫరా చేయాలి. చెత్త నిర్వహణకు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. కోళ్లు, మేకల వ్యర్థాల కోసం ఇన్సులేటర్లు అందుబాటులో ఉంచాలి. ఇంటింటికీ వైద్యం... గతంలో జాతర తర్వాత మేడారం పరిసర ప్రాంత ప్రజల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించే వాళ్లు. ఈసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేశాం. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడే చికిత్స అందిస్తున్నారు. జాతర తర్వాత 15 రోజుల వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. టాయిలెట్ల నిర్మాణం కోసం నిర్మించిన బేస్మెంట్లను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తొలగిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం. -
నేడు తిరుగువారం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో సమ్మక్క–సారలమ్మకు నేడు (బుధవారం) తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగిన మహా జాతర తల్లుల వనప్రవేశంతో ముగిసిన విషయం తెలిసిందే. గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనప్రవేశం అయ్యేంత వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన పూజారులు బుధవారం తిరుగు వారం పండుగ నిర్వహించనున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఒర్చుకుని తల్లుల చెంతకు వచ్చిన మొక్కులు చెల్లించిన భక్తజనాన్ని, గ్రామస్తులను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ తిరుగువారం పండుగ సందర్భంగా దేవతలను వేడుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా దేవతలను మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలిరానున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు తిరుగువారం పండుగా నిర్వహిస్తారు. పూజారులు గుడిని నీటితో శుద్ధి చేయనున్నారు. పూజారులు తలస్నానాలు అచారించి గుడిలో సమ్మక్క తల్లికి ధూప, దీపాలతో ప్రత్యేక పూజాలు నిర్వహిస్తారు. యాటను బలిచ్చి నైవేద్యంగా పెడతారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో కూడా పూజారులు తిరుగువారం పండుగాను నిర్వహిస్తారు. ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. వడెరాల కుండాలను పసుపు, కుంకుమలతో అలకరిస్తారు. సారలమ్మకు ధూప, దీపాలతో పూజలు నిర్వహిస్తారు. తిరుగువారం పండుగతో తల్లుల పూజలు ముగిస్తాయి. మహా జాతరలో తల్లుల సేవలో తరించిపోయిన పూజారులు తిరుగువారం పండుగ పూజల అనంతరం మళ్లీ ఏడాది మధ్యలో నిర్వహించే మినీ జాతర వరకు సా«ధారణ వ్యక్తులుగా మారిపోతారు. పూజారుల ఇళ్లలో కూడా.. మేడారం కన్నెపల్లిలోని సమ్మక్క–సారలమ్మ పూజారులు, ఆదివాసీలు తమతమ ఇళ్లలో తిరుగువారం పండుగాను ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసుకుని ఇంటిì గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. అమ్మవార్ల గుడికి వెళ్లి కూడా పూజలు నిర్వహిస్తారు. కోళ్లు, యాటలను సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. పండుగ సంరద్భంగా సమ్మక్క గుడి వద్ద కూడా ఆదివాసీలు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా ఇంటికి ఆహ్వానించిన బంధువులు, ఆడబిడ్డలకు కొత్త దుస్తులు పెట్టి సాగనంపుతారు. ఈ సందర్భంగా బంధువులు పూజారుల ఆశీస్సులు తీసుకుంటారు. మంగపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ముగిసి మూడు రోజులు అవుతోంది. నేడు తిరుగువారం పండుగ అయినప్పటికీ భక్తులు ఇంకా మేడారానికి వస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించి గద్దెల సమీపం ప్రాంతాలు, ఆర్టీసీ బస్‌పాయింట్ వద్ద వంటలు వండుకుని భోజనాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. బుధవారం తిరుగువారం పండుగ రోజు సమక్క–సారలమ్మను దర్శించుకునేందుకు కూడా భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
ఆర్టీసీకి కలిసొచ్చిన జాతర
మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. ప్రయాణికుల చేరవేత ద్వారా అదనంగా ఆదాయం గడించింది. గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం మరింత మెరుగుపడింది. రీజినల్‌లో అన్ని డిపోలకు చెందిన అధికారులు నష్టాలను పూడ్చుకునేందుకు అందివచ్చిన జాతరపై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బస్సులు నడిపించారు. మంచిర్యాల జిల్లా నుంచి మేడారం జాతరకు అత్యధికంగా భక్తులు వెళ్లడాన్ని గ్రహించిన యాజమాన్యం ఈ దఫా అక్కడి నుంచే బస్సులు నడిపించే ఏర్పాటు చేసుకుంది. రీజినల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ ఆయా డిపోల మేనేజర్లతో సమన్వయం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మందమర్రి, శ్రీరాంపూర్‌లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా డిపోల డీఎంలు పర్యవేక్షిస్తూ బస్సులు నడిపించారు. మొత్తం 294 బస్సులు నడిపి 68,975 వేల మంది ప్రయాణికులను ఆర్టీసీ చేరవేసింది. బస్సుల నడపడం ద్వారా రూ.2.08 కోట్ల ఆర్జించింది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పొల్చితే రూ.78 లక్షలు అదనంగా సాధించారు. డిపోల వారీగా.. మంచిర్యాల డిపోకు చెందిన 94 బస్సులను జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి నడిపించారు. లక్షా 61 వేల కిలోమీటర్లు బస్సులు నడిపి రూ.60.16 లక్షల ఆదాయాన్ని సాధించారు. భైంసా డిపోకు చెందిన బస్సులను శ్రీరాంపూర్ నుంచి నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. 83 వేలు కిలోమీటర్ల బస్సులు తిప్పి రూ.28,37,373 సంపాదించారు. ఆసిఫాబాద్ డిపో 60 బస్సులను బెల్లంపల్లి కేంద్రంగా నడిపి రూ.41,69,608 ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన 53 బస్సులను చెన్నూరు కేంద్రంగా 33 వేల కిలోమీటర్లు నడిపి ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.41.03 లక్షల ఆదాయం సాధించారు. నిర్మల్ డిపోకు చెందిన 52 బస్సులను మందమర్రి కేంద్రంగా నడిపారు. ప్రయాణికులను మందమర్రి నుంచి మేడారం చేరవేయడం ద్వారా రూ.36.18 లక్షల ఆదాయం సమకూరింది. మంచిర్యాల డిపో నుంచి 2016లో 127 బస్సులు నడిచాయి. 844 ట్రిప్పులతో 32,743 మంది భక్తులను చేరవేశారు. ఈసారి 94 బస్సులు 672 ట్రిప్పులతో 18,492 మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గత జాతర కంటే అధికం.. గత మేడారం జాతరతో పోల్చితే ఈసారి అదనపు ఆదాయం సమకూరింది. 2016లో అత్యధికంగా 364 బస్సులు కేటాయించారు. రూ.2.33 కోట్లు ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. మహదేవ్పూర్, కాళేశ్వరం, మంథని కేంద్రాలు రీజినల్ బస్సులు నడిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బస్సులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా లేకపోవడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డిలకు చెందిన ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకువచ్చి నడిపారు. బస్సు నడిచినా లేకపోయినా రోజుకు రూ.11.500 చెల్లించారు. ఈదఫా జాతర కంటే గతంలో 70 బస్సులను అదనంగా తిప్పారు. ఈ జాతర సందర్భంగా అద్దె బస్సులు, ఇతర జిల్లాల నుంచి బస్సులు నడపకపోవడం వల్ల అదనపు ఖర్చు తగ్గింది. ఈసారి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలు నుంచి 294 బస్సులు నడిపి రూ.2.08 కోట్లు సాధించారు. మహా శివరాత్రి ఉత్సవాలపై దృష్టి మహా శివరాత్రి నేపథ్యంలో జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి వేలాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు బస్సులు నడపాలని యోచిస్తున్నారు. 25 బస్సులు నడిపి ప్రయాణికులను చేరేవేసేలా చర్యలు చేపట్టారు. కరీంనగర్‌కు బస్సులు నడపడంతోపాటు రద్దీ ఉంటే ఒకటి, రెండు బస్సులను వేములవాడకు తిప్పాలని చూస్తున్నట్లు డీఎం రజనికృష్ణ తెలిపారు. ఆసిఫాబాద్ డిపో నుంచి బుగ్గరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి బస్సులు నడపనున్నట్లు తెలుస్తోంది. సమన్వయంతో లక్ష్యాన్ని సాధించాం.. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, అధికారులంతా సమన్వయంతో పనిచేశారు. జాతర వెళ్లే భక్తులకు ఎక్కడ ఇక్కట్లు ఎదురుకాకుండా చూశాం. రీజియన్ నుంచి 294 బస్సులు నడిపి రూ.2.06 కోట్లు ఆదాయం సాధించాం. మంచిర్యాల–మేడారం–మంచిర్యాలకు 68,975 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. సాధారణ రోజుల కంటే రూ.78 లక్షల అదనపు ఆదాయం ఆర్టీసీకి సమకూరడం సంతోషాన్ని కలిగిస్తోంది. – రాజేంద్రప్రసాద్, రీజినల్ మేనేజర్ ఆదిలాబాద్ -
అప్పుడే తేలిపోయింది
ములుగు: మేడారం జాతరలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, నల్లాల పనితీరు తేలిపోయింది. రూ. కోట్లు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. వాస్తవానికి సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినప్పటికీ, సంప్రదాయం ప్రకారం మరో వారంపాటు తిరుగు వారం పేరుతో వేలాది మంది అమ్మలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం అమ్మలు వన ప్రవే శం చేసినా.. ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. పలు ప్రాంతాల్లో మరుగుదొడ్ల, మంచినీటి నల్లాలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్లు లేవు.. నీళ్లు రావు.. మహా జాతరను పురస్కరించుకుని ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఈసారి 10 వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఇందులో సుమారు 6 వేల మరుగుదొడ్లను ప్రధానంగా చిలుకలగుట్ట, జంపన్న వాగు స్నానఘట్టాలు, పడిగాపురం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, ఆర్టీసీ బస్ పాయింట్, కొంగల మడుగు, నార్లాపురం, చింతల్‌క్రాస్‌తో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో నిర్మించారు. వాటికి నీటి సరఫరా విషయంలో మొదట్లో తడబడిన అధికారులు జాతర ముగింపు సమయంలో తేరుకుని భక్తుల అవసరాలకు అనుగణంగా అందించడంతో సఫలీ కతమయ్యారు. కాని, శనివారం రాత్రి నుంచి మరుగుదొడ్ల తీ రు అధ్వానంగా మారింది. అత్యవసరానికి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసిన భక్తులకు నిరాశను కల్పించిం ది. ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల ద్వారాలు, బేషన్లు పూర్తిగా ధ్వంసమై ఉం డడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జాతర పరిసరాల్లో మహిళాలు తంటాలు పడ్డా రు. జంపన్న వాగు పక్కన సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, శాశ్వ త ప్రాదిపదికన నిర్మించిన సులభ్ కాం పెక్స్‌లను ఆశ్రయిం చారు. మరుగుదొడ్ల సంగతి ఇలా ఉండగా.. వంటలు, ఇతర అవసరాల కోసం అధికారులు ఏర్పా టు చేసిన నల్లాలు అలంకార ప్రాయంగానే మారాయి. నల్లా ల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో నల్లాలు నేలకొరిగి కనిపించాయి. మొత్తానికి జాతర జరిగిన నాలుగు రోజులు మాత్రమే పనికి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని భక్తులు వాపోయారు. -
నాలుగు రోజులు.. మొక్కుల పరవళ్లు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం.. ఓ అద్భుతం.. సమ్మక్క–సారలమ్మ జాతర పేరుకే నాలుగు రోజుల పండుగ.. కానీ, ఈ మహా ఘట్టం నడక మాత్రం దాదాపు నెల రోజులకుపైగా సాగింది. జనవరి నెలలో సంక్రాంతి సెలవులతో ఊపందుకున్న భక్తుల రాకపోకలు తల్లుల వన ప్రవేశం ముగిసినా.. ఇంకా కొనసాగుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మహా జాతర ఎంతో కనుల పండువగా సాగింది. సంక్రాంతి పండుగ తర్వాత రోజుకు లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు జాతరకు ముందస్తుగా తరలివచ్చి మొక్కులు చెల్లించారు. గుడిమెలిగె, మండమెలిగె పండుగతో ప్రారంభమైన జాతర సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి వచ్చేంత వరకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి తరలివచ్చారు. ఆనాటి నుంచి జాతర నాలుగు రోజుల్లో కోటి మంది భక్తులు తరలివచ్చి దేవతలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 31న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనంతో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 1న వరాల తల్లి సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరడంతో భక్తులతో మేడారం పోటెత్తింది. 2న సర్వత్ర మొక్కులు చెల్లించి మనసార అమ్మలను దర్శించుకున్నారు. 3న సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపెల్లికి వనమెళ్లగా, పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు వెళ్లారు. అయినప్పటికీ ఆదివారం రోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన మొక్కులు చెల్లించారు. ఇబ్బందు పడిన భక్తులు... జాతర ప్రారంభానికి ముందుగా భక్తులకు అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లు భక్తుల రద్దీ పెరగడంతో కులాయి వద్ద నీళ్లు లేకపోవడంతో భక్తులు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడ్డారు. జాతరకు వారం రోజుల ముందే మేడారానికి తరలిచ్చిన భక్తులకు తాగునీటి సమస్య వెంటాడింది. అధికారులు మేల్గొనప్పటికీ అంతంతా మాత్రంగానే తాగునీటిని సరఫరా చేశారు. రెడ్డిగూడెం రోడ్లన్నీ కూడా బురదగా మారడంతో రోడ్లపై నడిచేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి బుధ, ఆదివారాల్లో సైతం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి విడిది చేసి అమ్మలకు మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. సెలవు రోజుల వచ్చిదంటే ఆ రోజు మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతోంది. మాయమైన మహా నగరం... తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులతో కుగ్రామంగా ఉన్న మేడారం మహా నగరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ప్రాంతంలో గుడారులు వేసుకుని అమ్మల రాక కోసం ఎదురుచూశారు. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలకు మొక్కులు చెల్లించారు. దేవతల వనప్రవేశంతోనే భక్తులు సైతం తమ గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో మహా నగరం ఒక్కసారి గా మాయమైనట్లుగా కనిపిస్తోంది. -
ప్రయత్నం.. మిశ్రమ ఫలితం
అమ్మల చెంత కిక్కిరిసి జనం మొక్కులు చెల్లించి తరించారు.. ఈ భక్తప్రవా హానికి తగిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర టూరిజం, ఎకో టూరిజం, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు అందరిని ఆకట్టుకున్నాయి. వాటిలో సేదతీరిన వీఐపీ భక్తులు టూరిజం శాఖ సేవలు భేష్ అని, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మిశ్రమ స్పందనను వెలిబుచ్చారు. ములుగు: మేడారం మహా జాతరకు రెండురోజుల ముందు నుంచి టూరిజం శాఖ ఆన్లైన్ పద్ధతిన అటవీశాఖ ఏకోటూరిజం సెల్‌ఫోన్ నంబర్ ద్వార బుకింగ్ ఆహ్వానించారు. తెలంగాణ టూరిజం తరఫున ఏర్పాటు చేసిన లగ్జరీ గుడారాలకు సౌకర్యాల విషయంలో మంచి స్పందన వచ్చింది. ఏకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. మొత్తానికి టూరిజం శాఖ భళా..అనిపించుకోగా, ఏకో టూరిజం శాఖ తరఫున ఏర్పాటు చేసిన గుడారాలు ఢీలా పడ్డాయి. ప్రత్యేక ఆకర్షణగా టూరిజం గుడారాలు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల, గిరిజన ఆదివాసీ మ్యూజియంల మధ్యలో ఈ జాతరలో భాగంగా 47 గుడారాలను ఏర్పాటు చేశారు. ఇందులో 20 లగ్జరీ గుడారాలు, 10 వీఐపీ, మరో 10 వీవీఐపీ గుడారాలు ఉన్నాయి. బుధవారం– 27, గురువారం –32, శుక్రవారం –44, శనివారం–45 గుడారాలు బుకింగ్ అ య్యా యి. ఇందులో రెండు లగ్జరీ గుడారాలను ఇంటర్నేషనల్ ప్రిలాన్స్ మీడియాకు కేంద్రం తరుపున బుకింగ్ చేయించారు. గుడారాల్లో ఏర్పాటు చేసిన బెడ్లు, ఫ్యాన్, కూలర్ల సౌకర్యాలు బాగున్నాయని వీవీఐపీ భక్తులు తెలిపారు. ఈ గుడారాలు మేడారం సమ్మక్క–సారమ్మల గద్దెలకు దగ్గరగా ఉండడంతో వీఐపీల దర్శనం సులువుగా మారింది. పైగా బుకింగ్ చేసుకున్న భక్తుల వాహనాలను నేరుగా గుడారాల వద్దకు పార్కింగ్ చేసుకునే విధంగా టూరిజంశాఖ తగిన ఏర్పాట్లు చేసింది. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో సఫలమయింది. అటవీశాఖకు ఆదరణ కరువు అటవీశాఖ ఏకోటూరిజం ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుక భాగంలో 100 గుడారాలను ఏర్పాటు చేశారు. 12 గంటల సమయానికి రూ.800, 24 గంటల పాటు ఉండడానికి రూ.1500లను కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా బుకింగ్‌కు ఆహ్వానించారు. గుడారాలను ఏర్పాటు చేసిన రెండోరోజు నుంచి బుకింగ్ ప్రారంభమైనా భక్తుల నుంచి ఆదరణ కరువైంది. కేవలం ఫోన్‌నెంబర్ల ఆధారంగా మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండడంతో అధికారుల ప్రయత్నం విఫలమైనట్లు తెలిసింది. జాతర జరిగిన బుధవారం–27, గురువారం–,80 శుక్రవారం–60 శనివారం– 30 గుడారాలు మాత్రమే బుకింగ్ అయినట్లు సంబంధిత శాఖ సిబ్బంది తెలిపారు. గుడారాల్లో రాత్రి పూట పడుకునే సమయంలో పొలాల్లోని మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డామని, ఆలయానికి సుదూరంగా గుడారాలను ఏర్పాటు చేయడంతో దర్శనం విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని భక్తులు వాపోతున్నారు. పైగా జంపన్నవాగు సమీపంలో ఏర్పాటు చేయడంతో దర్శనానికి సాధారణ భక్తులతో పాటు కిలో మీటరుకు పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఫొటో షూట్ చేసి అంతర్జాతీయ మీడియాకు అందిస్తున్నాం. మేడారంలో జాతర జరుగుతుందని తెలిసి అంతర్జాతీయ మీడియా తరుపున గత నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. టూరిజం శాఖ తరుపున కేటాయించిన లగ్జరీ గుడారాలు బాగున్నాయి. రెండు బెడ్లు, ఫ్యాన్, కూలర్లు సౌకర్యంగా ఉన్నాయి. మరుగుదొడ్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. టూరిజం గుడారాలు ఏర్పాట్లు పూర్తిగా నచ్చాయి. – క్రిస్టియానా, జూలియట్ (బ్రెజిల్, జర్మనీ వాసులు) ఇబ్బందులు పడ్డాం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో 12 గంటల పాటు ఉండడానికి రూ.1000 చెల్లించి బుకింగ్ చేసుకున్నాం. వీఐపీ భక్తులుగా బుక్ చేసుకున్నా వాహనాలు కన్నెపల్లి పార్కింగ్ ప్రాంతంలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి గుడారాలకు సామగ్రిని మోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డాం. టూరిజం శాఖ తరుపున బుకింగ్ చేసుకున్న వారికి గుడారాల వరకు అనుమతి ఇచ్చిన అధికారులు, ఏకో టూరిజం గుడారాలను బుకింగ్ చేసుకున్న మాకు అనుమతి ఇవ్వలేదు. – జీవన్ కుమార్, వరంగల్ పరుపులు లేక ఇబ్బంది పడ్డాం అటవీశాఖ తరుపున గుడారాలను ఏర్పాటు చేశారని తెలిసి 24గంటల పాటు ఉండడానికి రూ.1500 చెల్లించి ప్రకటించిన ఫోన్ నెంబర్ అధారంగా గుడారాన్ని బుకింగ్ చేసుకున్నాం. గుడారంలో ఎనిమిదిమంది పడుకునే విధంగా సౌకర్యం ఉంది. కాకపోతే పడుకోవడానికి వీలుగా గుడారంలో పరుపులు ఏర్పాటు చేస్తే బాగుండేది. పొలాల్లో గుడారాలు ఉండడంతో మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డాం. – గడ్డం శ్రీనివాస్,కొత్తగూడెం -
బోసిపోయిన మేడారం
మహా నగరంగా మారిన మేడారం ఖాళీ అవుతోంది. ఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మ శనివారం వన ప్రవేశం చేడయంతో జాతర వచ్చిన భక్తులు, వ్యాపారస్తులు ఇంటి దారి పట్టారు. దీంతో ఆదివారం జాతర ప్రాంగణం ఖాళీగా దర్శనమిచ్చింది. నిన్నమొన్నటి వరకు భక్తులతో కిటకిటలాడిన జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. ట్రాఫిక్ రోదనలు, భక్తుల కోలాహలం కనిపించిన మేడారం ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. ఏటూరునాగారం: ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అశేష భక్తజనం తరలివచ్చారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన మహా జాతర శనివారం దేవతల వనప్రవేశంతో ముగిసింది. భక్తులంతా వచ్చిన దారికి తిరుగు పయనమయ్యారు. జనవరి 12 నుంచి ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు జాతరకు వచ్చి భక్తులకు తన వస్తువులను అమ్ముకుని వ్యాపారాన్ని సాగించుకున్నారు. ఆశించిన మేర వ్యాపారం సాగకపోవడంతో మిగిలిన సామానును వెనుకకు పట్టుకుపోలేక రూ. 50, వంద రూపాలయ విక్రయించడం మొదలు పెట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వీరికి బొమ్మలు, ఇతర వస్తువులను అగ్గువకు విక్రయించడం గమనార్హం. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చాయని, లాభాలు రాలేదని వాపోయారు. మిగిలిన సామానును తీసుకెళ్లే ట్రాస్టుపోర్ట్ భారం మీద పడుతుందని, ఇక్కడే తక్కువకు విక్రయిస్తున్నట్లు అన్నం కృష్ణ అనే వ్యాపారి తెలిపారు. కొంత మంది వ్యాపారులు వారి సామగ్రిని సర్దుకుని తిరుగు ప్రయాణం కట్టారు. మేడారం జాతరలోని షాపులన్ని దాదాపుగా ఖాళీ కావడంతో అంతా బోసిపోయి కనిపిస్తోంది. మళ్లీ రెండేళ్లకు వస్తా.. తల్లీ సల్లంగా చూడు.. అని వ్యాపారులు వారివారి సొంత గ్రామాల దారిపట్టారు. దీంతో మేడారం అంతా ప్యాకప్ అయ్యింది. మ్యూజియం మూసివేత... మేడారం వచ్చే పర్యాటక భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆదివాసీ మ్యూజియాన్ని మూసివేశారు. మేడారం జాతర సందర్భంగా హడావుడి చేసి ప్రారంభించిన మ్యూజియానికి ఎవరు రావడం లేదనే సాకుతో మూసివేయడం బాధాకరం. సెలవు దినాలు, ఇతర సమయాలో కూడా మ్యూజియాన్ని ప్రదర్శనకు ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. మేడారం వచ్చే వారికి దేవతలను దర్శించుకోవడమే కాకుండా ఇలాంటి పూర్వపు కాలపు చరిత్రలను తెలిపే మ్యూజియం పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు. పేరుకుపోయిన ఖాళీ సీసాలు జాతరకు వచ్చిన భక్తులు తాగి పడేసిన బీరు సీసాలు, వాటర్ బాటిళ్లను ప్రతి ఒక్కటిని సేకరించే పనిలో పడ్డారు కొంత మంది పాతసామాను సేకరించే వ్యాపారులు. మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వేలాది బాటిళ్లు కుప్పలు తెప్పలు పేరుకుపోయాయి. వాటిని కొంత మంది పాతసామాను వ్యాపారులు పోగు చేసి రిసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే బస్తాల్లో నింపి బాటిళ్లు సుమారు పది లారీల, ఇతర వాహనాల్లో వరకు తరలించుకుపోయారు. -
వనంలోకి జనదేవత!
-
మేడారం జాతర సంపూర్ణం
-
వనంలోకి జనదేవత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: భక్తుల ఇలవేల్పు.. కొంగు బంగారమై కోరికలు తీర్చే కల్పవల్లులు.. భక్త కోటిని చల్లగా కాచిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు వన ప్రవేశం చేశారు. భక్తులను కాపాడేందుకు మళ్లీ రెండేళ్లకు వస్తామంటూ వీడ్కోలు పలికారు. దీంతో సమ్మక్క–సారలమ్మ నినాదాల హోరుతో మార్మోగిన మేడారం గిరులు నిశ్శబ్దంలోకి జారిపోయాయి. భక్తుల పాద స్పర్శతో రేగిన ధూళిమేఘాలు ఆగిపోయాయి. సమ్మక్క–సారలమ్మతో పాటే పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు పయనమయ్యారు. వచ్చే జాతర నాటికి వస్తామంటూ భక్తులు ఇంటిముఖం పట్టారు. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు తప్ప మేడారం జాతర ప్రశాంతంగా ముగిసింది. మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించేందుకు తులాభారం వేసుకుంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ మళ్లీ వస్తాం.. వనదేవతల వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం 6.30 గంటలకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజలు ప్రారంభమయ్యాయి. డోలు వాయిద్యాలు, బూరలు లయబద్ధంగా వాయిస్తూ గద్దెలపై పూజలు చేశారు. ఎవరికీ కనిపించకుండా చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత 6.50 గంటలకు సమ్మక్కను తీసుకుని పూజారులు గద్దె దిగారు. ఆ తర్వాత విడిది గృహం వద్దకు చేరుకుని నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలకలగుట్టకు పయనమయ్యారు. సాయంత్రం 6.51 గంటలకు పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకుని మరికొందరు పూజారులు గద్దె దిగారు. చివరగా సాయంత్రం 6.55 గంటలకు సారలమ్మను తీసుకుని కన్నెపల్లికి బయల్దేరారు. అమ్మల వనప్రవేశ కార్యక్రమం జరిగినంత సేపూ భక్తులు రెప్ప వాల్చకుండా తన్మయత్వంతో తిలకించారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. మేడారం జాతర తొలిరోజు వరంగల్–పస్రా మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అనేకచోట్ల టాయిలెట్లకు నీటి సరఫరా కాలేదు. తాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేడారంలో 4 రోజుల పాటు బస చేసి స్వయంగా పర్యవేక్షించారు. జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు కోటి మంది భక్తులు వనదేవతలను సందర్శించుకున్నట్లు అంచనా. జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ కర్ణన్, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ భాస్కరన్ నిరంతరం జాతరను పర్యవేక్షించారు. ప్రముఖుల తాకిడి ఆదివాసీలు, సామాన్యుల జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈసారి వీఐపీల తాకిడి పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరలో భాగంగా లగ్జరీ టెంట్లు, ఎకోటెంట్లు, హరిత హోటల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర నిఘాలో డ్రోన్ కెమెరాలను వినియోగించారు. వీఐపీల తాకిడి పెరగడంతో పలుమార్లు క్యూలైన్లు గంటల పాటు నిలిపేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన భక్తులు తరలివచ్చి నాలుగు రోజులు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర విశేషాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ మీడియా ఈసారి ఇక్కడే 4 రోజుల పాటు ఉంది. తొలిసారిగా ఇటలీ, అమెరికా, సింగపూర్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు 4 రోజుల పాటు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం, క్యూలైన్లలో కొబ్బరి చిప్పలు, బెల్లం ముద్దలు పేరుకుపోవడంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మళ్లీ రెండేళ్లకు.. జాతర ముగియడంతో తిరిగి 2020 మాఘమాసంలో మేడారం జాతర జరగనుంది. మేడారం జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. ఆర్టీసీ బస్సులు నిర్విరామంగా సేవలందించాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య పస్రా–తాడ్వాయి–మేడారం మధ్య ట్రాఫిక్ రద్దీ పెరగడంతో వన్‌వే విషయంలో సడలింపు ఇచ్చారు. ప్రైవేట్ వాహనాలను పస్రా–మేడారం మార్గంలో అనుమతించారు. -
తనువంతా.. తన్మయం
కరీంనగర్ : డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య.. కోయపూజారులు వనంలోంచి తీసుకురాగా.. కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్క, సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరారు. ఇద్దరు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లావ్యాప్తంగా జాతర ప్రాంగణాలు కిటకిటలాడాయి. పల్లె, పట్నం తేడాలేకుండా భక్తులదారులన్నీ జాతరవైపే కదిలాయి. మదినిండా అమ్మవార్లను ఉంచుకుని మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం వనదేవతలైన తల్లీబిడ్డలకు ఒడిబియ్యం సమర్పించారు. పసుపు, కుంకుమతోపాటు ఎత్తుబంగారం(బెల్లం) సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు. పోటెత్తిన జనం... జిల్లావ్యాప్తంగా 31 చోట్ల జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. కరీంనగర్‌కు అనుకుని ఉన్న రేకుర్తి జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు, హుజూరాబాద్‌లోని రంగనాయకులగుట్ట జాతరకు రెండున్నర లక్షలు, చింతకుంట, నగునూర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, ఇరుకుల్ల, బొమ్మకల్, జూపాక, సైదాపూర్, జమ్మికుంట, కేశవపట్నం, చొప్పదండి , ఆర్నకొండ, గుమ్లాపూర్, రాగంపేట, గంగాధర మండలం బూరుగుపల్లి, రామడుగు, తిర్మలాపూర్, గుండి, జమ్మికుంట, తనుగుల, వావిలాల, ఇల్లందకుంట, గన్నేరువరం, మానకొండూర్, దేవంపల్లి, కొండపల్కల, లింగాపూర్ జాతరకు సుమారు 50 వేల నుంచి లక్ష మధ్య భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పలుచోట్ల జాతరలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకుని భక్తుల ఏర్పాట్లు పరిశీలించారు. నేడు వనంలోకి.. నాలుగు రోజులపాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మ శనివారం సాయంత్రం కోయపూజారుల మధ్య వనం బాట పట్టనున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర ఘట్టం ముగిసినట్లవుతుంది. నగర రోడ్లు నిర్మానుష్యం.. ఎప్పుడూ వాహనాల రద్దీతో గజిబిజిగా ఉండే జిల్లాకేంద్రంలోని రోడ్లన్నీ నాలుగు రోజులుగా నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రధాన చౌరస్తాలైన తెలంగాణచౌక్, కోర్టుచౌక్, కమాన్‌చౌక్, టవర్‌సర్కిల్, మంకమ్మతోట లేబర్ అడ్డా, మంచిర్యాల చౌరస్తా, రాంనగర్ చౌరస్తాలు సైతం బోసిపోయాయి. -
మేడారంలో పోటెత్తిన భక్తులు
సాక్షి, భూపాలపల్లి: చివరి రోజైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. నాలుగు రోజుల పాటు జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతర శనివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో భారీ ఎత్తున భక్తులు మేడారానికి తరలివచ్చారు. అదేవిధంగా తెలంగాణ సీఎస్ ఎస్కె జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు సమీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
నా జన్మ ధన్యమైంది...
మేడారం: మేడారం సమక్క–సారలమ్మలను వనం నుంచి జనంలోకి తీసుకువచ్చే బృహత్తర ఘట్టంలో అవకాశం లభించడంతో తన జన్మ ధన్యమైందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మేడారంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మలను తీసుకొచ్చే బృందంలో తనకు చోటు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనిని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ ప్రస్థానంలో ఈ స్థాయికి చేరుకుని సేవలు అందించే భాగ్యం కలగడానికి కారణం అమ్మల ఆశీస్సులే అని అన్నారు. మేడారంలో ఉంటూ జాతరలో భక్తులకు సేవలు అందిస్తానని తాను ఊహించలేదన్నారు. మేడారంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. మేడారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 56 స్వచ్ఛ ఆటోలు, 20 ట్యాంకర్లు, 600మంది పారిశుద్ధ్య కార్మికులు, 30మంది జవాన్లు, ఆరుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఒక సూపర్వైజర్తో పాటు ఎంహెచ్ఓలు జాతరలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారని మేయర్ చెప్పారు. ఇక నాలుగు రోజులుగా మేడారంలో సారలమ్మ, సమ్మక్క దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తించినట్లు తెలిపారు. ఇక జాతరలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన, వసతులు ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్ట్‌ల్లో కార్మికులు జాతరలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నారని, తాను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కాగా, గత పాలకుల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేడారం జాతరలో భక్తులకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించుకున్న భక్తులకు అదే తరహాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సేవలు అందిస్తోందని చెప్పారు. -
ఆర్టీసీ ఆదాయం రూ. 9 కోట్లు
మేడారం: మేడారం మహాజాతరకు భక్తులను చేర్చడంతో ఆర్టీసీ కీలకపాత్ర పోషించిందని ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నంనాటికి ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాల నుంచి జాతరకు సు మారు 5 లక్షల మంది ప్రయాణికులను, జాతర నుంచి గమ్యస్థానాలకు సుమారు 2 లక్షల మందిని చేర్చినట్లు తెలిపారు. ఇలా ఆర్టీసీకి సుమారు రూ.9 కోట్ల ఆదా యం వచ్చిందని ఆయన వెల్లడించారు. పాత జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి సుమారు 2,200 బస్సులు నడుపగా ఇతర జిల్లాల నుంచి సుమారు 2000 బస్సులను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. తొలిసారి ఉచితంగా.... నార్లాపూర్ నుంచి జంపన్న వాగుకు భక్తులను చేర్చేందుకు ఆర్టీసీ తొలిసారిగా ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసింది. జంపన్నవాగుకు ఉచిత బస్సుల ద్వారా సుమారు 40 వేల మందిని చేర్చారు. మహారాష్ట్ర సిరొంచ ప్రాంతం నుంచి జాతరకు తొలిసారిగా బస్సు సౌకర్యం కల్పించారు. సుమారు 40 బస్సు సర్వీసులు నడిపారు. జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో ములుగు రోడ్డులో దిగి వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులను లింక్ బస్సుల ద్వారా ఉచితంగా చేర్చినట్లు ఎండీ రమణరావు తెలిపారు. దీంతోపాటు జాతరకు 6 వజ్ర 85 సూపర్ లగ్జరీ, 27 ఏసీ బస్సులు నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. సేవలు అమోఘం : రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి భూపాలపల్లి: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 8 లక్షలమందికిపైగా భక్తులను తరలించినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న అనంతరం ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్‌లోని కంట్రోల్ కమాండ్ రూంలో ప్రయాణికుల క్యూరేలింగ్లను ఎండీ రమణారావు, ఈడీలు రవీందర్, పురషోత్తంనాయక్, సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎంలు సూర్యకిరణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆర్టీసీ సేవలు భేష్.. మేడారం: మేడారం మహాజాతరకు అశేష భక్తజనాన్ని తరలిస్తున్న ఆర్టీసీ సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనం కోసం వచ్చిన ఆయన ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులను క్షేమంగా ఇంటికి చేర్చాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా అంతకు ముందు ఆయన వాహనం భక్తుల మధ్య ఇరుక్కుపోవడంతో ద్విచక్ర వాహనంపై ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో అధికారులు ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు, పురుషోత్తం, సత్యనారాయణ, వెంకట్రావు, సూర్యకిరణ్, మునిశేఖర్, రాములు తదితరులు ఉన్నారు. -ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ -
పోలీసుల ఓవరాక్షన్
ములుగు: సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడానికి శుక్రవారం మేడారానికి చేరుకున్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు దూకుడు ప్రదర్శిం చారు. నిబంధనల పేరుతో సామాన్య భక్తులను ము ప్పుతిప్పలు పెట్టారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు, సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో గంటపాటు భక్తులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అప్పటికే అమ్మలను దర్శించుకోవడానికి క్యూలైన్లలో ఉన్న భక్తులు తాగునీటి సౌకర్యం లేక, ఉక్కపోతతో తంటాలుపడ్డారు. ఉపరాష్ట్రపతి, సీఎంలు దర్శించుకొని తిరుగుపయనమైన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. భక్తులపై అరవడంతోపాటు వారిని నెట్టివేశారు. ముఖ్యంగా ఎగ్జిట్ గేటు వద్ద ఉన్న పోలీసులు తొందరగా ఖాళీ చేయాలంటూ మహిళలు, పురుషులు అని చూడకుండా పరుషభాషను ప్రయోగిస్తూ గేటు అవతలికి చొక్కాపట్టి మరీ లాగేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సింగరేణి రెస్క్యూటీం, కేయూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు స్ట్రెచర్ల ద్వారా బాటధితులను హుటాహుటిన టీటీడీ కళ్యాణ మండపంలోని 50పడకల ఆస్పత్రికి తరలించారు. ప్రముఖుల రాకతో నిలిచిన దర్శనాలు ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమ్మవార్లకు మొక్కులు సమర్పించే క్రమంలో గద్దెల ప్రాంగణంలో భక్తులు ఎవరు లేకుండా పోలీసులు ఖాళీ చేయించారు. ఓపిక నశించిన భక్తులు క్యూలైన్ల నుంచే కేకలు వేశారు. పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం అసహనం కాటారం: మేడారం జాతరలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీసుల తీరుపై శుక్రవారం ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీస్ సిబ్బంది భక్తులను అదుపుచేయాల్సింది పోయి గుంపులుగుంపులు గా గద్దెల వద్దకు వెళ్లి బంగారం తీసుకోవడాన్ని వారు గమనించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు పలుమార్లు మైక్సెట్లో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పోలీస్ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతోపాటు మంచె వద్దగల ఎమర్జెన్సీ గేట్‌ను తమ కుటుంబ సభ్యుల కోసం ఓ పోలీస్ అధికారి ఓపెన్ చేయించగా ఒకేసారి వందలాది మంది భక్తులు లోపలికి వెళ్లడానికి అక్కడికి చేరుకోవడంతో పెద్దఎత్తున తోపులాట జరిగింది. ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఓ పోలీస్ ఉన్నతాధికారిని అప్రమత్తం చేసి గేట్ వెంటనే మూసి వేయాలని ఆదేశించారు. మొన్న కాళిదాసు.. నిన్న కంపాటి.. నేడు సాయి చైతన్య.. ప్రతి మహాజాతర సమయంలో జిల్లా పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. 2014 మహాజాతరలో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ కాళీదాసు ప్రణాళిక లోపంతో వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రా వరకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 2016 జాతరలో ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ జాతరలో యువ ట్రైనీ ఐపీఎస్ అధికారి సాయి చైతన్య, మరో ఇద్దరు ట్రైనీ పోలీసు అధికారులు డీఎస్.చౌహాన్, చేతన కలిసి గద్దెల వద్ద వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఉన్నప్పటికీ నెట్టివేయడంతో ముగ్గురు రిపోర్టర్లు పడిపోయారు. దీంతో మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద ఉన్న వాచ్ టవర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఐజీ నాగిరెడ్డి వచ్చి మీడియా ప్రతినిధులకు నచ్చజెప్పినా శాంతించలేదు. ప్రతి జాతరలో పోలీసులు ఇదేతీరుగా వ్యవహరిస్తున్నారని ఆయనతో చెప్పారు. పోలీసులు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేయడాన్ని వనదేవతల దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గమనించారు. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే మీడియా ప్రతినిధులు బహిష్కరించే అవకాశాలుండడంతో ఐజీ నాగిరెడ్డి వచ్చి ఇప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చినప్పటికీ మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద కవరేజీని బహిష్కరించారు. -
వనదేవతకు బంగారం సమర్పించిన కేసీఆర్
-
నిలువెత్తు బంగారం సమర్పించిన కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి: మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రానున్న బడ్జెట్లోనే రెండువందల కోట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దంపతులు శుక్రవారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన నిలువెత్తు బంగారంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పోరాట పటిమకు సమ్మక్క-సారలమ్మ నిదర్శనమన్నారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం వనదేవతకు మొక్కుకున్నట్లు తెలిపారు. సమైఖ్య పాలనలో జాతర నిర్లక్ష్యానికి గురైందని, రాబోయే జాతరను కనివినీ ఎగరని రీతిలో నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఆటంకాలు కలగకుండా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరను ఆయన దక్షిణ భారతదేశ కుంభమేళగా అభివర్ణించారు. ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి...సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రులు,అధికారులను సీఎం అభినందించారు. -
వనదేవతకు మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్
-
రాయల్ స్టాగ్ రూ.1,050 !
వరంగల్: మేడారం జాతరలో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. జాతరలో అధికారికంగా 22 మద్యం షాపులు ఏర్పాటుచేయగా.. యజమానులు సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సిండికేట్ వద్ద భారీ మొత్తంలో అధికారులు మాముళ్లు మాట్లాడుకున్నందునే పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జాతరలోని హోల్‌సేల్ షాపుల నిర్వహకులు ఎంఆర్పీ రూ. 560 ఉన్న రాయల్‌స్టాగ్ బాటిల్‌ను చిరు వ్యాపారులకు రూ. 900 – 950కు ఇవ్వగా వారు రూ.100 కలిపి విక్రయిస్తున్నారు. ఇక ఆఫీసర్స్ ఛాయిస్ ఎమ్ఆర్పీ 110 అయితే.. ఇద్దరు చేతులు మారాక రూ.150, బీరు ధర రూ.150 చేరినా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం. కొబ్బరికాయ రూ. 40 .. కొత్తిమీర రూ.50 ములుగు రూరల్/వెంకటాపురం(కె): మండలంలోని గట్టమ్మ వద్ద టెండరు దక్కించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇదంతా చూస్తూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు వెళ్తున్న భక్తులు గట్టమ్మకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నెల రోజులుగా భక్తుల సంఖ్యలో పెరిగింది. ఇదే అదనుగా కొబ్బరికాయల దుకాణదారుడు ఉదయం రూ. 40 చొప్పున, సాయంత్రం వరకు రూ.35 చొప్పున విక్రయిస్తున్నాడు. కాగా మేడారం మహాజాతరలో కొత్తిమీర కట్ట రూ.50కు విక్రయిస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మేకలు, కోళ్లతో మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం మాంసం కూర వండుకుంటున్నారు. వాటిలో వేసుకునే కొత్తమీర కొనాలం టే ధర భారీగా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు. అయినా తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. (కొత్తిమీర విక్రయిస్తున్న వ్యాపారులు ) ఏస్కో కల్లు సారా.. మేడారం జాతర అంటేనే కోళ్లు, యాటలు, కల్లు, మందుతో మజా చేసే ఉత్సవం. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూంటారు. తొలుత వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. అనంతరం విడిది చేసే ప్రాంతంలో కోళ్లు, యాటలు కోసుకుని సరదాగా గడుపుతుంటారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మేడారం సమీపంలోని కొంతమంది ప్రజలు చీప్‌లిక్కర్ మందు, తాటికల్లు, గుడాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. -
గద్దె వద్ద తొక్కిసలాట
ఏటూరునాగారం: గద్దెపైన సమ్మక్కను ప్రతిష్ఠించిన తర్వాత మొదటి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు గద్దెలపైకి ఎగబాకారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళలు కింద పడి పోలీసుల కాళ్లను పట్టుకుని పైకి లేచే ప్రయత్నిం చేశారు. ఈ క్రమంలో పలువురు భక్తులు తమ సెల్ఫోన్లు, పర్సులు పోగొట్టుకున్నారు. పోలీసుల ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుని కొందరు గాయపడ్డారు. సమ్మక్కకు మొక్కుల పరవళ్లు మేడారం: వనదేవత సమ్మక్కకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమక్కను మేడారంలోని గద్దెకు తీసుకొచ్చే ఆపూర్వ ఘట్టంలో ఆదివాసీ, గిరిజన సంస్కృతి అడుగడుగునా ప్రతిబింబించింది. అడవితల్లి సమ్మక్కను స్మరించుకుంటూ చిలకలగుట్ట నుంచి గద్దె వరకు భక్తులు నీళ్లతో అలికి వివిధ రకాలు ముగ్గుల వేసి తరించారు. రోడ్డుపై కోళ్లు, గొర్రెలు, మేకలు బలిచ్చి కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మను మనసారా వేడుకున్నారు. కొందరు ముగ్గులపై పూలు వేసి, నిమ్మకాయలు పెట్టి పసుపు, కుంకుమ రుద్దీ కొబ్బరికాయలు కొట్టి అక్కడే మొక్కులు చెల్లించారు. మరికొంత మంది ఆనందంతో బాణాసంచి కాల్చి సమ్మక్కకు స్వాగతం పలికారు. చెట్లు, బస్సులు ఎక్కి.. చిలకలగుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్కను తీసుకొచ్చే అపురూప క్షణాలను కనులారా వీక్షించేందుకు భక్తులు వివిధ మార్గాలను ఆశ్రయించారు. రోడ్డు పక్కన ఉన్న పెద్దపెద్ద చెట్లను, రోడ్డు పక్కన నిలిచిన బస్సులను ఎక్కి జై సమ్మక్క.. జై జై సమ్మక్క అంటూ నినాదాలు చేశారు. భక్తుల ఈలలు, కేరింతలతో చిలకలగుట్ట నుంచి మేడారం మార్గమంతా మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు శివసత్తులు రోడ్డుపైన డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. మహిళలు పూనకంతో ఊగిపోయి సమ్మక్కను స్మరించారు. తల్లీ.. చల్లంగా చూడు అంటూ వేడుకున్నారు. -
సాహో సమ్మక్క
ఎస్ఎస్ తాడ్వాయి/ఏటూరునాగారం: కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవత.. వీరవనిత.. సమ్మక్క తల్లి అధికారిక లాంఛనాలు, భక్తుల జయజయధ్వానాలు, ఉయ్యాల పాటలు, ఒడిబియ్యపు జల్లులు, శివసత్తుల పూనకాల నడుమ చిలకలగుట్టను వీడి భక్తులను దీవించేందుకు మేడారంలోని గద్దెను అధిష్టించింది. తొలుత ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు, వడ్డెలు సమ్మక్కను గుట్ట నుంచి కిందకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జయశంకర్భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్, ఎస్పీ ఆర్. భాస్కరన్ ప్రభుత్వ లాంఛనాలతో అమ్మకు ఘనస్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి మేడారంలోని గద్దెల వరకు 2.19 గంటల పాటు జరిగిన సమ్మక్క ప్రయాణం ఆద్యంతం కనుల పండుగగా, ఉద్విగ్నభరితంగా సాగింది. హోరెత్తిన చిలకలగుట్ట.. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తోడ్కొని వచ్చేందుకు పూజారులు సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూప వడ్డే నాగేశ్వర్రావు, కొమ్ము బూర జనార్దన్ సాయంత్రం 4 గంటల సమయంలో చిలకలగుట్ట పైకి ఎక్కారు. ఈ సందర్భంగా అమ్మ రాక కోసం భక్తులు, ప్రభుత్వ అధికారులు గుట్ట కింద ఎదురుచూశారు. రెండు గంటల పాటు డప్పు వాయిద్యాలతో ఆది వాసీ నృత్యాలు చేశారు.జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్‌పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ భాస్కరన్, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, జాతర చైర్మన్ కాక లింగయ్య నృత్యాలు చేశారు. గాలిలోకి నాలుగు సార్లు కాల్పులు.. సమ్మక్క ఆగమనం కోసం రెండు గంటలుగా అలుపెరుగకుండా భక్తులు చిలకలగుట్ట కింద ఎదురు చూశారు. ఈ క్రమంలో గుట్టపై నుంచి పూజారులు, వడ్డెలు దిగుతున్న ఆనవాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం సరిగ్గా 6:14 గంటలకు సమ్మక్కను తీసుకుని ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట దిగారు. ఆయనకు తోడుగా ప్రధాన పూజారులు, వడ్డెలు వచ్చారు. సమ్మక్క రాక సందర్భంగా ప్రభుత్వ లాంఛనంగా జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. గుట్ట నుంచి సమ్మక్క కొద్దిగా ముందుకు కదలగానే మొదటిసారిగా 6:15 గంటలు, రెండోసారి 6:17 గంటలకు, మూడోసారి 6.19, నాలుగోసారి చిలకలగుట్ట ఫెన్సింగ్ గేటు వద్ద 6:32 నిమిషాలకు గాలిలోకి కాల్పులు జరిపి అమ్మ రాకను భక్తులకు తెలిపారు. కాగా, రెండోసారి కలెక్టర్, ఎస్పీ ఇరువురు కలిసి గాలిలోకి కాల్పులు జరిపారు. దారిపొడవునా నీరాజనం.. మేడారంలోని గద్దెల వైపు సమ్మక్క ప్రయాణం ప్రారంభంకాగానే మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఒడిబియ్యం విసిరారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క రాక అపురూప క్షణాలను పురస్కరించుకుని యాటలు, కోళ్లు బలిచ్చారు. సమ్మక్కను కనులారా వీక్షించేందుకు దారికి ఇరువైపులా ఉన్న గోడలు, ఇళ్లు, చెట్లు, వాహనాలు ఎక్కి వరుసగా నిలబడి చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి 8:33 గంటలకు గద్దెపైకి.. గద్దెల ప్రాంగణంలోకి 8:20 గంటలకు సమ్మక్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడ పది నిమిషాల పాటు పూజారులు రహస్య పూజ లు నిర్వహించారు. తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆలయ ప్రాంగణంలో వెలు గులు ప్రసరించే సమయానికి పగిడిద్దరాజు గద్దె వద్ద సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సరిగ్గా 8:33 గంటలకు సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిం చారు. అక్కడ పూజ లు నిర్వహించిన తర్వాత 8:40 గంటలకు సారలమ్మ గద్దె వద్దకు వెళ్లిన సమ్మక్క పూజారులు బిడ్డకు తల్లి ఆశీస్సులు అందించారు. నలుగురు ఒక్కచోట.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరా జు లు గద్దెలపై ఉండడంతో తల్లులను దర్శించుకునేందు కు భక్తులు పోటీపడ్డారు. జంపన్నవాగు, గద్దెల అన్ని దారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తొలి రోజు ట్రాఫిక్ జామ్ కారణంగా రాని భక్తులు గురువారం మేడారానికి పెద్దసంఖ్యలో వచ్చారు.తల్లులను దర్శిం చుకున్న భక్తులు తిరుగుపయనమయ్యారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించిన వెంటనే జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు గద్దెపైకి చేరుకుని తొలి మొక్కులు చెల్లించారు. -
మేడారం జాతరకు వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మేడారం జాతరలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శిస్తారు. ఈ సందర్భంగా వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించి వెంకయ్య మొక్కులు చెల్లించుకోనున్నారు. -
మేడారంలో భారీ సంఖ్యలో భక్తులు
-
సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగిన సీఎం!
సాక్షి, వరంగల్ : మేడారం జాతరకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే... సీఎం రమణ్‌సింగ్ గురువారం జారతకు వచ్చారు. ఆయన సమ్మక్కను దర్శించుకుని సారలమ్మ వద్దకు వెళుతుండగా మరోవైపు...క్యూలైన్లోని భక్తులు సమ్మక్క గద్దెపైకి కొబ్బరి కాయలు విసిరారు. అదే సమయంలో సీఎం రమణ్ సింగ్ అక్కడే ఉండటంతో కొబ్బరికాయలు వేగంగా వచ్చి పడ్డాయి. అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన సురక్షితంగా అక్కడ నుంచి బయటపడ్డారు. దీంతో ఆయన సారలమ్మను దర్శించుకోకుండా తిరుగు ప్రయాణం అయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,గవర్నర్ నరసింహన్, కేంద్ర కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఓరం తదితరులు శుక్రవారం మేడారం జాతరకు రానున్నారు. ఈ నేపథ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారం చేరుకొని, 1.25 గంటలకు గద్దెల ప్రాంగణానికి వస్తారు. ఇరవై నిమిషాలపాటు అక్కడే ఉండి, సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. -
పరిమితంగా బీఎస్ఎన్ఎల్ సేవలు
మేడారం: జాతరలో భక్తులకు ఉచితంగా ఇంటర్నెట్ డాటా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేసిన బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పరిమితంగా అందుబాటులోకి వచ్చాయి. జాతర జరిగే ప్రాంతాల్లో 20 హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసి ఒకరికి 500 ఎంబీ డాటా ఉచితంగా లక్షలాది మందికి అందిస్తామని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రకటించారు. కానీ ఐటీడీఏ, అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో తప్పా, రెడ్డిగూడెం, శివరాంసాగర్, కొత్తూరు, బస్టాండ్, నార్లాపూర్, కాల్వపల్లి తదితర ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉచిత డాటా సౌకర్యం అధికారులకు మాత్రమే ఉపయోగపడ్డాయి తప్పా భక్తులు వినియోగించుకోలేకపోయారు. ఇతర ప్రైవేట్ సంస్థలకు సైతం డాటా ప్రొవైడ్ చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. డాటా లేకున్నా కాల్స్ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు ఆవేదన చెందారు. కాల్స్ కూడా అంతంతే... మేడారం జాతరలో పెద్ద సంఖ్యలో టవర్లు ఏర్పాటు చేసి భక్తులకు సిగ్నల్ అందిస్తామని ఊదర కొట్టిన సెల్ కంపెనీలు వాస్తవంలో ఎలాంటి సదుపాయాలు అందించడంలో ఘోరంగా విఫలమయ్యా యి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సుమారు 16 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు రోజూ ఒకేసారి 3.5లక్షల మంది మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేయగా, అందుబాటులోకి తేలేకపోయింది. దీంతో భక్తులు సెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. -
మేడారానికి పయనమైన గోవిందరాజులు
ఏటూరునాగారం: సమ్మక్క మరిది గోవిందరాజులు బుధవారం మేడారానికి బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. గుడిలో గోవిందరాజుల ప్రధాన పూజారి దబ్బగట్ల జనార్దన్, వడ్డె పొదెం బాబు, దబ్బగట్ల కిష్టయ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముం దుగా గోవిందరాజుల ఆలయం వద్ద తహసీల్దార్ నరేందర్ సమక్షంలో దబ్బగట్ల వంశస్తులు గోవిందరాజులను వడ్డెలకు అప్పగించారు. డప్పుచపుళ్ల నడుమ గోవిందరాజుల పడగను వడ్డె పొదెం బాబు ఎత్తుకొని నాగుల చుట్టూ ప్రదక్షిణలు చేసి బయలుదేరడంతో భక్తులు, గ్రామస్తులు బెల్లపు శాకను ఆరబోశారు. నీళ్లతో స్వాగతం పలుకుతూ మల్యాలలోని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. వడ్డె పాదాలకు పసుపు, కుంకుమ్మపూసి దూపం వేసి పూజలు చేశారు. అనంతరం సమ్మక్కను సాదుకున్న మల్లెల మూర్తి ఇంటిలోకి కింద నేలను తాకకుండా చాపలు, చద్దర్లను వేసి లోనికి పూజారులు, వడ్డెలను పడగను పట్టుకొని వెళ్లడంతో వారి సంప్రదాయబద్ధంగా ముడుపులు చెల్లించి వడ్డెలకు పాలను ఇచ్చారు. పాలు తాగిన వడ్డెలు మళ్లీ గోవిందరాజులను కొండాయికి తీసుకువచ్చేవరకు ఇలా ఉపవాసంతో ఉండడం వారి ఆనవాయితీగా వస్తోంది. గోవిందరాజులు వెళ్లే క్రమంలో అందరు నేలపై పడుకుంటే వారిపై నుంచి ఆయన దాటిపోతే సకల సౌభాగ్యాలు కలుగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. అనంతరం అడవి మార్గంలో గోవిందరాజులను మేడారానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై బత్తుల సత్యనారాయణ, స్పెషల్ పార్టీ పోలీసులు భారీ బందోబస్తు నడుమ గోవిందరాజులను మేడారానికి సాగనంపారు. అంతేకాకుండా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో గ్రేహౌండ్స్ దళాలు అడవిలో పెద్ద ఎత్తున మోహరించాయి. కాగా గోవిందరాజులను తీసుకెళ్లే రోడ్డు మార్గం బాగాలేదని పూజారి దబ్బగట్ల గోవర్ధన్, అట్టం నాగరాజు, దబ్బగట్ల రాజారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అన్న కుడితేనే చెల్లికి సంబురం
ఎస్ఎస్ తాడ్వాయి: కన్నెపల్లి జాబిలమ్మ సారలమ్మను గద్దెల మీదకు తీసుకువచ్చే ముందు ప్రధాన పూజారి కాక సారయ్యను సారలమ్మ రూపంలో అలంకరించి పట్టు చీరె, పట్టు జాకెట్ తొడిగించి ఆదివాసీ సంప్రదాయంగా తీసుకువస్తారు. ఈ వస్త్రాలను ప్రత్యేకంగా ఆదివాసీ బిడ్డ అయిన మంగపేటకు చెందిన మద్దెల పాపారావు కుట్టిన వస్త్రాలను తొడగడం ఆనవాయితీగా వస్తోంది. సారలమ్మ అవతారమెత్తిన కాక సారయ్యకు వరుసకు అన్న అయిన పాపారావు కుట్టిన దుస్తులనే ధరిస్తారు. అన్న కుడితేనే చెల్లెకు సంబురంగా పండుగ జరుపుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పాపారావుకు సారలమ్మకు ప్రత్యేకంగా దుస్తులను కుట్టడంతో పాటు, హనుమాన్ జెండాను స్వయంగా పవిత్రంగా ఉపవాస దీక్షలతో తయారు చేయడం విశేషం. ఈ దుస్తులు కూడా కాక సారయ్య ఇంటి వద్దనే నియమనిష్టలతో కుట్టడం విశేషం. -
తొలిరోజే ట్రా‘ఫికర్’
సాక్షి ప్రతినిధి, వరంగల్: సారలమ్మ గద్దెలపైకి రావడానికి ముందే భక్తులు మేడారం చేరుకోవడం ఆనవాయితీ. మంగళవారం ఉదయం నుంచే మేడారం వచ్చే భక్తుల రాక మొదలై, మ«ధ్యాహ్నం సమయానికి రద్దీ పెరిగిపోయి సాయంత్రానికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఆర్టీసీ 2,450 బస్సులు మేడారానికి కేటాయించింది. మరోవైపు ప్రైవేట్ వాహనాల ద్వారా వరంగల్ నుంచి మేడారం వచ్చే భక్తుల రద్దీ సాయంత్రానికి పెరిగింది. దీంతో వరంగల్–మేడారం మధ్య వాహనాల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. మేడారం వెళ్లే భక్తులు తొలి మొక్కులు గట్టమ్మ వద్ద చెల్లించుకోవడం ఆనవాయితీ. మేడారం వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు గట్టమ్మ వద్ద ఆపారు. ఇక్కడ పార్కింగ్‌కు తక్కువ స్థలం కేటాయించడంతో వాహనాలు నిలిపేందుకు స్థలం లేదు. దీంతో గట్టమ్మ నుంచి వరంగల్ వైపు వాహనాలు జాకారం వరకు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం సాయంత్రం 6:30 గంటలకే తొలిట్రాఫిక్ జామ్ ఎదురైంది. కొరవడిన వ్యూహం గట్టమ్మ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇక్కడ వాహనాలు ఆపకుండా ముందుకు వెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. దీంతో గట్టమ్మ దాటి ముందుకు వెళ్లిన వాహనదారులు డిగ్రీ కాలేజీ సమీపంలో ఆపి, వెనక్కి వచ్చి దర్శనాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆప్పటికే హన్మకొండ, వరంగల్, కాజీపేట బస్స్టేషన్లలో భక్తుల తాకిడి పెరిగిపోవడంతో మేడారం వెళ్లిన బస్సులు త్వరగా రావాలనే ఆదేశాలు ఆర్టీసీ సిబ్బందికి అందాయి. దీంతో మేడారం వెళ్లే వాహనాలు.. మేడారం నుంచి తిరుగుప్రయాణమైన ఆర్టీసీ బస్సులు, గట్టమ్మ దర్శనం కోసం నిలిపిన వాహనాలతో ములుగు నుంచి గట్టమ్మ వరకు రెండోసారి ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ములుగు, గట్టమ్మ, మల్లంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. మధ్యాహ్నం వరకు అదే పరిస్థితి.. బుధవారం నుంచి జాతర మొదలవడంతో అన్ని వైపుల నుంచి వాహనాల రద్దీ పెరిగిపోయింది. మంగళవారం సాయంత్రం మేడారం బయల్దేరిన వాహనాలు అప్పటికీ రోడ్లపై ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వరకు వచ్చాయి. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం అయింది. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ట్రాఫిక్ అదుపులోకి రాలే దు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టింది. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఉదయం 8 వరకు ట్రాఫిక్ క్లియర్ అయింది. ప్రణాళిక లేమి.. మేడారం జాతరలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. అయితే.. మేడారం వెళ్లే దారిలో హాల్టింగ్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హాల్టింగ్ పాయింట్లకు సంబంధించి కనీస ప్రచారం నిర్వహించలేదు. వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టలేదు. çహాల్టింగ్ పాయింట్లలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో మేడారం వెళ్లే వాహనదారులు మార్గమధ్యలో ఎక్కడా ఆగేందుకు ఆసక్తి చూపలేదు. మంగళవారం సాయంత్రం మేడారానికి పోటెత్తే వాహనాల రద్దీని అంచనా వేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల ప్రణాళిక లేమి కారణంగానే ట్రాఫిక్ కష్టాలు వచ్చాయని భక్తులు అంటున్నారు. -
చిలకలగుట్టపై సమ్మక్క శక్తి
ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క. కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దేవత. చిలకలగుట్టపై కొలువైన సమ్మక్కను జాతర సందర్భంగా గద్దెల మీదకు తీసుకురావడం ఉద్విగ్న ఘట్టం. రెండేళ్లకోసారి సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి కిందకు తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు.. గురువారం సమ్మక్క రాకను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -సాక్షి ప్రతినిధి, వరంగల్ మేడారంలో ఆలయంలో సమ్మక్క తల్లి వడేరా కుండ రూపంలో కొలువై ఉంటుంది. సమ్మక్క పూజారులు, గ్రామస్తులకు ఈ దేవత దర్శనం ఉంటుంది. అదే.. సమ్మక్క తల్లి గద్దెలపై సకల జనులకు వెదురు రూపంలో దర్శనమిస్తుంది. పూజారులకు సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండని సమ్మక్క రూపం అత్యంత శక్తిభరితం. ఈ శక్తిని అన్ని వేళలా భరించడం సామాన్యులకు కష్టం. అందువల్లే పూజారులు అత్యంత రహస్య పద్ధ్దతుల్లో సమ్మక్కను చిలకలగుట్టపై ఉంచుతారు. ప్రతీ రెండేళ్లకోసారి సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం సందర్భంగా సమ్మక్క శక్తి స్వరూపాన్ని చిలకలగుట్ట నుంచి కిందకు తీసుకొస్తారు. ఇందుకోసం మొత్తం 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండు వారాల ముందుగా.. సమ్మక్క శక్తిని మేలుకొలిపే ప్రక్రియ జాతరకు రెండు వారాల ముందుగా మొదలవుతుంది. గుడిమెలిగె పండగ రోజు సమ్మక్క వడ్డెలు(పూజారులు), ఇంటి ఆడపడుచులు మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఒక్కడే చిలకలగుట్టకు చేరుకుని సమ్మక్కకు ఆదివాసీ పద్ధతుల ప్రకారం శక్తిని మేల్కొలిపే ప్రక్రియ చేపడతారు. అనంతరం మండె మెలిగే రోజు మరోసారి చిలకలగుట్టకు చేరుకుని రహస్య పూజలు నిర్వహిస్తారు. చిలకలగుట్టపై సమ్మక్క ఎక్కడ ఉంటుందనేది ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌కు సైతం తెలియదు. చిలకలగుట్ట సగం వరకు ఎక్కిన తర్వాత సమ్మక్క పూనుతుంది. ఆ తర్వాత సమ్మక్క ఆదేశాల ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో సమ్మక్క.. గుట్ట దిగేందుకు సిద్ధమవుతుంది. శాంతి ప్రక్రియ గద్దెలపైకి గురువారం సాయంత్రం చేరిన సమ్మక్క శుక్రవారం అక్కడే ఉండి జాతర నాలుగో రోజు శనివారం తిరిగి చిలకలగుట్టకు చేరుకుంటుంది. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్, వడ్డె కొక్కెర కృష్ణయ్య ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జాతర అనంతరం వచ్చే బుధవారం రోజున తిరుగు వారం పండగ జరుపుతారు. ఈ రోజు గద్దెల ప్రాంగణం శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. సిద్ధబోయిన మునీందర్ మూడోసారి చిలకలగుట్టకు చేరుకుని శక్తి రూపం ధరించిన సమ్మక్క తల్లిని శాంతపరుస్తారు. మళ్లీ రెండేళ్లకు సమ్మక్కను మేలుకొలుపుతామని మాట ఇచ్చి తిరుగుపయనమవుతారు. సమ్మక్క గుడి, గద్దెపై ప్రత్యేక పూజలు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలగుట్ట నుంచి గురువారం సమ్మక్క తల్లిని గద్దెల మీదికి తీసుకురానున్న నేపథ్యంలో సమ్మక్క పూజారులు, వడ్డెలు సంప్రదాయ బద్దంగా సిద్దబోయిన మునేందర్ ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు, కుంకుమ వడేరాల కుండల్లో గద్దె మీ దకు తీసుకు వచ్చారు. అక్కడ గద్దెపైన అలికి సమ్మక్క ముగ్గులను వేసి పూజ నిర్వహించారు. సమ్మక్క బిడ్డ సారక్క గద్దెపై న కూడా ముగ్గులతో అలంకరించారు. అనంతరం నాగుల వి డిది వద్ద వెళ్లి అక్కడ పూజలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. శక్తి మేలుకోవడం.. సారలమ్మ గద్దెలపైకి చేరిన(బుధవారం) మరుసటి రోజు(గురువారం) సమ్మక్క పూజారులు, వడ్డెలు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేశ్(బాల పూజారి), దోబె పగడయ్య కుమారుడు నాగేశ్వర్రావు, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతోపాటు మేడారం గ్రామానికి చెందిన ఆదివాసీలు చిలకలగుట్టకు బయల్దేరుతారు. చిలకలగుట్టపైకి ఎక్కి దారిలో అందరూ ఆగిపోతారు. అక్కడి నుంచి సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేష్(బాల పూజారి), దోబె నాగేశ్వరరావు.. చిలకలగుట్టపై ఉన్న రహస్య ప్రాంతానికి చేరుకుంటారు. దోబె నాగేశ్వరావు ధూపం పడతారు. మిగిలినవారు అక్కడ రహస్య క్రతువులు నిర్వహించి సమ్మక్కను కిందకు తీసుకొస్తారు. సమ్మక్క రాక కోసం గుట్టపై ఎదురుచూస్తున్న కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతో పాటు మిగిలిన వడ్డేలు, పూజారులు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. జనసంచారం లేని వనంలో కొలువై ఉండే సమ్మక్క, కాళ్ల తొక్కుళ్లు ఉండే జనంలోకి వస్తుండడంతో.. దీనికి నివారణగా అక్కడ ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మరోసారి రహస్య పద్ధతిలో పూజలు చేస్తారు. తుపాకులగూడెం సమీపంలో ఉన్న ఇప్పచెట్ల నుంచి సేకరించిన ఇప్ప పువ్వుతో చేసిన సారాను సమ్మక్కకు ఆరగింపు చేస్తారు. ఆ తర్వాత ఆదివాసీ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి చేర్చే బాధ్యతను కొక్కెర కృష్ణయ్యకు సిద్ధబోయిన మునీందర్ అప్పగిస్తారు. అప్పటికే పూజా క్రతువు నిర్వహిస్తుండగానే కొక్కెర కృష్ణయ్యను దేవత ఆవహించగా... అచేతన స్థితిలోకి వెళ్తాడు. కొక్కెర కృష్ణయ్యను ఇద్దరు వడ్డెలు పట్టుకుని ముందుకు నడిపిస్తారు. మల్లెల ముత్తయ్య జలకం పట్టితో కృష్ణయ్య పక్కనే ఉంటూ ముందుకు సాగుతారు. దారి మధ్యలో ఎలాంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా జలకంలోని నీళ్లు చల్లుతాడు. వసంతరావు, స్వామి, జనార్దన్ కొమ్ముబూరలు ఊదుతూ వేగంగా సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కింది వైపుకు తీసుకువస్తారు. కొమ్మబూరల శబ్దం వినగానే చిలకలగుట్ట పొదల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమవుతారు. సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతారు. చిలకలగుట్ట కిందకు చేరిన సమ్మక్కకు ఎదుర్కోళ్ల పూజా మందిరం వద్ద మరోసారి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించకుంటే సమ్మక్క అస్సలు ముందుకు కదలదని చెప్తారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్కను మేడారం గ్రామం వైపునకు వడివడిగా తీసుకొస్తారు. గ్రామ పొలిమేరలో మేడారానికి చెందిన 11 మంది మహిళలు బిందెలు, కుండల్లో నీళ్లు పట్టుకుని ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. బొడ్రాయికి కోడిపిల్లను తిప్పేస్తారు. -
కన్నుల పండువగా తెలంగాణ కుంభమేళా
-
గద్దెనెక్కిన సారలమ్మ
మేడారం నుంచి సాక్షిప్రతినిధి: వనమంతా జనంతో నిండిపోయింది. జంపన్నవాగు భక్తజన హోరుతో మార్మోగింది. అడవితల్లుల మహాజాతర మొదలైంది! కన్నెపల్లి నుంచి సారలమ్మ.. పూనుగొండ నుంచి పగిడిద్దరాజు.. కొండాయి నుంచి గోవిందరాజులు.. ఈ ముగ్గురి రాకతో బుధవారం మేడారం వన జాతర అంగరంగవైభవంగా షురూ అయింది. సుమారు రాత్రి 12.20 గంటల సమయంలో భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ గద్దెనెక్కింది. అంతకుముందు సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8.12 గంటల సమయంలో గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పగిడిద్దరాజు–సమ్మక్క వివాహం కనులపండువగా సాగింది. అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ముగ్గురి రూపాలను అర్ధరాత్రి మేడారం గద్దెలపై చేర్చారు. సంతాన ‘వరం’కోసం.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె(వెదురు బుట్ట)లో తీసుకొస్తుండగా ఆలయం ప్రహరీ నుంచి వంద మీటర్ల పొడవునా సంతాన భాగ్యం ఎదురు చూసే భక్తులు నేలపై పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అక్కడ్నుంచి జంపన్నవాగుకు సారలమ్మ చేరుకుంది. వంతెన ఉన్నా.. నీటిలో నుంచే నడుస్తూ సారలమ్మ పూజారులు వాగును దాటారు. ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ దుగ్యా ల అమయ్‌కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే సీతక్క పూజా కార్యక్రమాలను దగ్గరుండి వీక్షించారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సారలమ్మ ప్రయాణించే సమయంలో చంద్రగ్రహణం ఉంది. అయినా ఆదివాసీ వడ్డెలు దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. గ్రహణం కొనసాగుతున్నా.. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జంపన్నవాగులో జనహోరు సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం నలువైపులా కిలోమీటర్ల మేర దారులు వాహనాలు, భక్తులతో నిండిపోయాయి. నేడు సమ్మక్క రాక మేడారం జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ఘట్టం గురువారం జరుగనుంది. సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకువచ్చేందుకు వెళ్తారు. అశేష భక్త జనులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతుండగా.. సమ్మక్కను భరిణె రూపంలో గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వన దేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గర్భిణి, మరొకరి మృతి నిర్మల్ జిల్లా బాసర మండలం గాంధీనగర్‌కు చెందిన గర్భిణి సారాబాయి(33) మేడారం వస్తుండగా.. తాడ్వాయి వద్ద పురిటి నొప్పులు వచ్చాయి. ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. బాబు జన్మించాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో సారాబాయిని అంబులెన్స్‌లో వరంగల్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో పస్రా–జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్ జాంలో సుమారు 3 గంటలపాటు కాలయాపన జరిగింది. ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జంపన్న వాగు సమీపంలో సొమ్మసిల్లి పడిపోయిన భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన తాటికొండ రాజనర్సయ్య (50)ను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మరణించాడు. తీరని ట్రాఫిక్ చిక్కులు జాతర ప్రారంభానికి ముందే ట్రాఫిక్ సమస్యలు చుట్టుముట్టాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల పాటు వరంగల్–మేడారం మార్గం మధ్యలో మల్లంపల్లి, గట్టమ్మ, ములుగు, జంగాలపల్లి, పస్రాల వద్ద ట్రాఫిక్ జాం అయింది. వరంగల్ నుంచి మేడారం వరకు సగటున మూడు గంటల ప్రయాణం కాగా.. ఆరేడు గంటల సమయం పట్టింది. ట్రాఫిక్, బందోబస్తును డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. పోటెత్తిన భక్తజనం కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకువచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. మాజీ ఎమ్మెల్యే సీతక్క కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. రాత్రి 7:15 గంటలకు సారలమ్మ పూజారులు కాక సారయ్య, లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావు సారలమ్మ పూజా క్రతువులు ప్రారంభించారు. అనంతరం కన్నెపల్లి ఆలయం నుంచి మేడారం బయల్దేరారు. సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్సైట్ సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్‌సైట్‌ను గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఐ–యుగ సీఈవో రజిత్ ఆకుల, ప్రతినిధులు వెంకట్, రజనీకాంత్ తదితరులు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనిలో మేడారం సమ్మక్క–సారక్క చరిత్ర, ముఖ్య ఘట్టాలు, భక్తులకు అందే సేవలు, అత్యవసర సమయంలో కావాల్సిన వివిధ శాఖల సమాచారం, అధికారుల ఫోన్ నంబర్లు, జాతరకు వెళ్లే మార్గాలు, గూగుల్ మ్యాప్ లింకులు, సమీప ప్రాంతాల్లో దర్శనీయ స్థలాల వివరాలుంటాయని మంత్రి పేర్కొన్నారు. 2006 నుంచి మేడారం జాతరకు ఐ–యుగ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుందని వివరించారు. -
మేడారం ప్రయాణంలో విషాదం: బాలింత మృతి
సాక్షి, వరంగల్: మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతరకు వచ్చిన ఓ బాలింత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని మృతి చెందింది. వివరాలు.. నిర్మల్ జిల్లా సాద్గం కు చెందిన కళాభాయ్ కుటుంబం సమ్మక్క- సారక్క జాతరకు వచ్చింది. కళా భాయ్ గర్భిణి కావడంతో ఆమెకు జాతర లో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన ఆమెను ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చిన కలాభాయికి అధిక రక్త స్రావం కావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ వెళ్లాల్సిందిగా స్థానిక వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాలింతను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుంగా.. జాతరకు వెళ్లే వాహనాలతో ములుగు నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు, మూడు గంటల పాటు ట్రాఫిక్‌జాం ఏర్పడటంతో మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
జాతరకు ముందే రూ. కోటి ఆదాయం
భూపాలపల్లి: జాతరకు ముందే ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. జాతర బుధవారం నుంచి జరుగనుండగా మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు మేడారం వచ్చారు. 52 పాయింట్ల నుంచి వచ్చిన 2,490 బస్సుల్లో 1,04,000 మంది భక్తులు మేడారం చేరుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆర్టీసీకి ఒక్కరోజే సుమారు రూ.కోటి ఆదాయం లభించింది. కాగా, 48 వేల మంది భక్తులు మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 60 వేల మంది భక్తులు జాతరలోనే ఉన్నారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెలకు రానున్న నేపథ్యంలో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం నడిపిస్తున్న సుమారు 2,500 బస్సులతోపాటు అదనంగా మరో 2 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం సూర్యకిరణ్ తెలిపారు. అందుబాటులో అద్దె బండ్లు.. ఎస్ఎస్ తాడ్వాయి: జాతరకు వచ్చిన భక్తులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఎడ్ల బండ్లు మేడారానికి చేరుకుంటున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సులో మేడారం వచ్చే భక్తులను బస్టాండ్ వద్ద దింపుతున్నారు. ఇక ముల్లెమూటలతో వచ్చిన భక్తులు అద్దె బండ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగు వరకు, అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులను తరలించి వారి నుంచి రూ.200 తీసుకుంటున్నారు. అద్దె బండ్లను తీసుకున్న భక్తులు వాటిపై హైహై నాయక అంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ( ఎడ్లబండ్లలో జంపన్నవాగుకు వెళ్తున్న భక్తులు ) -
మేడారం భక్తులకు కాంటెస్ట్
సాక్షి, వరంగల్ రూరల్: మేడారం జాతరలో ఎక్కడ చూసినా భక్తులు సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు.. ఏంటి ఈ సెల్ఫీ పిచ్చి అనుకుంటున్నారా.. ప్రభుత్వం ఈసారి మేడారం జాతర కాంటెస్ట్–2018 పేరుతో సెల్ఫీ, ఫొటో, షార్ట్‌ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌కు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం ఈ కాంటెస్ట్‌ను భక్తుల ముందుకు తీసుకొచ్చింది. విజేతలకు నగదు బహుమతులు.. పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తం రూ.4.25 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు. సెల్ఫీ మొద టి బహుమతి రూ.25 వేల నగదు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, బెస్ట్ ఫొటోగ్రఫీ విభాగంలో మొదటి బహుమతి రూ.75 వే లు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు, షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొదటి బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు అందించనున్నారు. ప్రచారం కోసమే.. జాతర విశేషాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్ ఇటీవల స్థానిక యువతతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. కొత్తకొత్త ఆలోచనలతో యువకులు షార్ట్ ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. ఈ పోటీల ద్వారా జాతర ప్రచారం విశ్వ వ్యాప్తమవుతుందనే ప్రభుత్వం భావిస్తోంది. 12,561 మంది లైక్‌లు.. ప్రస్తుతం సోషల్ మీడియాపై అందరూ దృష్టి పెట్టారు. దీంతో ప్రభుత్వం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 12,561 మంది ఫేస్బుక్ లైక్ పేజీకి లైక్ కొట్టారు. సెల్ఫీలు, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్‌ల కాంటెస్ట్ కోసం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీలో పోస్ట్ చేయాలని పేర్కొన్నారు. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గద్దెల వద్ద, గంట కొడుతూ, ఎదురుకోళ్లను ఇస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తున్నారు. జంపన్నవాగులో స్నానం చేస్తున్నవి, ఎడ్ల బండ్లలో జాతరకు వస్తున్న ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 5వ వరకు పోటీలు ఇటీవల హైదరాబాద్‌లో వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ దగ్గర సెల్ఫీ దిగి ప్రమాదం బారిన పడడంతో ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ప్రయాణిస్తూ, గుట్టలు ఎక్కుతూ, విద్యుత్ తీగల దగ్గర, జంతువుల దగ్గర, ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు దిగొవద్దని సూచించారు. ఫిబ్రవరి 5 వరకు ఫేస్బుక్ ద్వారా ఫొటోగ్రఫీ, సెల్ఫీ, షార్ట్ ఫిల్మ్‌లను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. జాతరకు ప్రచారం వస్తుంది.. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా సెల్ఫీలకు బహుమతులు పెట్టడం చాలా బాగుంది. అన్ని వయస్సుల వారు సెల్ఫీలు ఎక్కువగా దిగుతున్నారు. సెల్ఫీతోపాటు ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మా ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోను అప్లోడ్ చేశాం. చాలా మంది లైక్‌లు సైతం కొట్టారు. దీంతో జాతరకు చాలా ప్రచారం కూడా వస్తుంది. –మడిపెల్లి సుశీల్, వరంగల్ -
మేడారం బైలెల్లిన పగిడిద్దరాజు
గంగారం(ములుగు): మేడారం మహాజాతర వేదికగా సమ్మక్కను పరిణయమాడేందుకు పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మంగళవారం బయల్దేరారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును గ్రామస్తులు అటవీమార్గంలో కాలినడకన సంప్రదాయ డోలు వాయిద్యాల మధ్య మేడారం తీసుకువెళ్తున్నారు. అంతకుముందు గ్రామంలో పెనుక వంశీయుల పూజారి తలపతి ఇంట్లో పగిడిద్దరాజును నలుగు పూజలతో పెళ్లికుమారుడిగా తయారుచేశారు. అనంతరం ఇక్కడి పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులైన పూజారులు బుచ్చిరాములు, సురేందర్, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు దర్శనమిచ్చారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తాకి తన్మయత్వం పొందారు. తలపతి ఇంట్లో నుంచి పానుపు (పూజా సామగ్రి) తీసుకువస్తుండగా, ఆలయంలో పూజల తర్వాత పడిగెను మేడారానికి తీసుకెళ్తుండగా గ్రామస్తులు బిందెలతో నీళ్లు తెచ్చి పూజారుల కాళ్లు కడిగి సాగనంపారు. శివసత్తుల పూజనకాలతో మేడారం బయల్దేరారు. మంగళవారం రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకొని పెనుక వంశీయుల ఇంట్లో నిద్రిస్తారు. అక్కడి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య పస్రా, నార్లాపురం, కొండాయి మీదుగా మొత్తం 65 కిలోమీటర్లు కాలినడకన మేడారంలోని చిలుకల గుట్టకు చేరుకుంటారు. పానుపు తరలింపు నుంచి పడిగె వెళ్లే వరకు పూర్తి కార్యక్రమాలను స్థానిక సర్పంచ్ ఈసం కాంతారావు పర్యవేక్షించారు. మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ ఇర్ప సూరయ్య, మర్రిగూడెం, ఎంపీటీసీ సభ్యురాలు వనిత, టీఆర్ఎస్ నాయకుడు ఈసం సమ్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జాతరలో అతి ముఖ్య ఘట్టం
ఎస్ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తేవడం.. సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి చేరుకోక ముందే అక్కడికి కంకవనం చేరుకుంటుంది. అమ్మలతో పాటు గద్దెలపై కొలువై ఉండే కంకవనాలను ఆలోపే అక్కడ ప్రతిష్ఠిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని ఇక్కడి ఆదివాసీలు పాటిస్తున్నారు. గద్దెలపై వనదేవతలతో పాటు ప్రతిష్ఠించే కంకవనాలను తెచ్చేందుకు పూజారులు, కుటుంబీకులు మంగళవారం సిద్ధమయ్యారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు, మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్తారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేసి, తెల్లవారుజామున 3 గంటల వరకు పూజలు నిర్వహించారు. ఈ పూజల వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. పూజా పద్ధతులను వంశపార్యంపరంగా ఒకతరం నుంచి మరో తరానికి నేర్పుతారు. పూజ ముగిసిన తర్వాత నాలుగు గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుని తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున అడవి నుంచి కంకలను గద్దెల వద్దకు తీసుకొస్తారు. మార్గ మధ్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు నిర్వహిస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. -
ధూపం వేస్తేనే తల్లి గుట్ట దిగేది..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పడిగాపూర్‌కు చెందిన దొబె నాగేశ్వర్రావు.. సమ్మక్క తల్లి ధూపం వడ్డెగా వ్యవహరిస్తారు. వయస్సు పైబడడంతో తండ్రి దొబె పగడయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2015 మినీ జాతర నుంచి ధూపం వడ్డెగా నాగేశ్వర్రావు కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఆయన తల్లి సేవలో తరిస్తున్నారు. తల్లికి ధూపం వేసే పెద్ద బాధ్యతను ఆయన యుక్తవయస్సులోనే భుజాన వేసుకున్నారు. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర సందర్భంగా చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తారు. నాగేశ్వర్రావు ధూపం వేస్తేనే సమ్మక్క తల్లి చిలుకలగుట్ట దిగుతుంది. డోలు దరువు తల్లులకు ఇష్టం జాతరలో డోలు వాయిద్య కళాకారులకు ప్రత్యేక కథ ఉంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు. డోలు వాయిద్య కళాకారుల దరువుతోనే తల్లులు కదిలొస్తారు. డోలు దరువు అంటే తల్లులకు మహా ఇష్టం. దరువు కొట్టనిది తల్లులు ఆవహించిన ప్రధాన పూజారుల అడుగు ముందుకు కదలదు. దేవతలను గద్దెలపై తీసుకురావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు డోలులు వాయిస్తూనే ఉండాలి. చిలుకలగుట్ట దద్దరిలేలా కళాకారులు తన ఒంట్లో ఉన్న శక్తిని ఉపయోగించి డోలును వాయించాలి. తల్లులను గద్దెలపై తీసుకువచ్చే క్రమంలో సమయం తెలియదని, తమకు ఏమాత్రం అలసట అనిపించదని, ఇదంతా తల్లుల మహిమేనని డోలు వాయిద్య కళాకారులు చెబుతున్నారు. అదేవిధంగా జాతరకు రెండు నెలలపాటు వచ్చిపోయే వందల మంది ప్రముఖులు, అధికారులకు డోలు వాయిద్య కళాకారులు స్వాగతం పలుకుతుంటారు. కానీ, వీరికి దేవాదాయశాఖ అధికారులు ఇచ్చే వేతనం అంతంత మాత్రమే. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డోలు వాయిద్య కళాకారులు కోరుతున్నారు. సమ్మక్కను తీసుకొస్తా జాతరకు పది రోజుల ముందే చిలుకలగుట్ట వనంలో లభించే ఔషధ మూలికలతో గుగ్గిలం తయారు చేస్తాం. ఆ గుగ్గిలంతోనే ధూపం వేస్తా. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను గద్దెకు రప్పిస్తా. తండ్రి నుంచి ధూపం వడ్డె బాధ్యతలను స్వీకరించి సమ్మక్క తల్లికి సేవ చేయడం నేను మహా అదృష్టంగా భావిస్తున్నా. –నాగేశ్వర్రావు, సమ్మక్క ధూపం వడ్డె -
నేడు సమ్మక్క కల్యాణం
సాక్షి ప్రతినిధి, వరంగల్: లక్షలాది మంది భక్తుల సాక్షిగా వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం వైభవంగా జరగనుంది. మాఘమాసంలో మేడారం గ్రామం ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదీవాసీ సంప్రదాయం. ఇందుకోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వారికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంట లేని వారు కోళ్లు, మేకల వంటివాటిని సమర్పించుకునేవారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. సమ్మక్క ఆలయమే వేదిక.. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. ఈ సారి బుధవారం, పౌర్ణమి ఒకేరోజున(జనవరి 31) రావడం విశేషం. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి బయల్దేరారు. ప్రధాన పూజారి పెనక బుచ్చిరాములుతోపాటు ఇతర పూజారులు సురేందర్, మురళీధర్ పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకుని 65 కిలోమీటర్లు కాలినడకన మేడారానికి తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో తాడ్వాయి మండలం లక్ష్మీపురంలో పెనక వంశీయుల ఇంట్లో మంగళవారం రాత్రి బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం కాలినడకన మేడారం బయల్దేరుతారు. ఇక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారి కాక సారయ్య, కాక కిరణ్ ఇతర పూజారులు తీసుకొస్తారు. సమ్మక్కకు కల్యాణం.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న విడిది గృçహానికి వస్తారు. సమ్మక్క నుంచి ఆహ్వానం రాగానే వీరు మేడారంలోని ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెళ్లికొడుకు పగిడిద్దరాజు వచ్చాడంటూ సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. ఈ కబురు అందుకున్న సమ్మక్క పూజారులు పసుపు, కుంకుమలతో ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును సమ్మక్క గుడిలోనికి ఆహ్వానిస్తారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు నైవేద్యం సమర్పించి ఆకలి తీరుస్తారు. అనంతరం సమ్మ క్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలిసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతాడు. (ఎడ్లబండ్లపై మేడారానికి తరలివస్తున్న భక్తులు) లక్షలాది మంది రాక సమ్మక్క–పగిడిద్దరాజు వివాహం అనంతరం గద్దెలపై కొలువైన సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. అమ్మలను దర్శించుకుని కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనేది వారి నమ్మకం. మరుసటిరోజు(గురువారం) శక్తి రూపంలో చిలకలగుట్టపై కొలువైన సమ్మక్క తల్లి.. మేడారం గద్దెల మీదకు చేరుకుంటుంది. దీంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. సారలమ్మ ఆగమనం నేడే.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యా ణం జరిగిన తర్వాత సారలమ్మతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. -
నేటి నుంచే మహా జాతర
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క– సారక్క జాతర బుధవారం మహావైభవంగా ప్రారంభమవుతోంది. ఆదివాసీ పూజా క్రతువుల మధ్య సారలమ్మ తల్లి మేడారంలో గద్దెపైకి చేరుకోనుంది. మరుసటి రోజున (గురువారం) సమ్మక్క గద్దెపైకి చేరనుంది. రెండు రోజుల పాటు వన దేవతల దర్శనం అనంతరం.. శనివారం తల్లుల వన ప్రవేశం జరగనుంది. జాతర కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. భక్త జన సంద్రం మహా జాతర కోసం మంగళవారం సాయంత్రానికే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. మేడారం, జంపన్నవాగు, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్ ప్రాంతా లు భక్తుల గుడారాలతో నిండిపోయా యి. మేడారం వెళ్లే దారుల న్నీ కిక్కిరిసిపోయాయి. జాతర కోసం ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తం గా 52 కేంద్రాల నుంచి 2,490 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో భక్తులు వస్తున్నారు. దీంతో నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. యథావిధిగా పూజలు.. బుధవారం సాయంత్రం 5.18 గంటల నుంచి 8.42 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. షెడ్యూల్ ప్రకారం సారలమ్మ ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి మేడారానికి బయలుదేరాలి. అయితే గ్రహణం నేపథ్యంలో పూజా క్రతువు సమయంలో మార్పులు ఉం టాయనే ఊçహాగానాలు వచ్చాయి. అయితే ఆదివాసీ పూజా విధానాల్లో గ్రహణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోమని పూజారులు స్పష్టం చేశారు. అయితే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో పూజా క్రతువులను మాత్రం గ్రహణానికి ముందే పూర్తి చేస్తామని చెప్పారు. జాతర ఇలా... తొలిరోజు (బుధవారం) సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. అదేరోజు పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం గద్దెలకు చేరుకుంటారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంటుంది. శుక్రవారం సమ్మక్క– సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఉంటారు. జాతర చివరి రోజు (శనివారం) సమ్మక్క తల్లి వన ప్రవేశం చేస్తుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ ప్రాంతాలు ప్రయాణం కావడంతో జాతర ముగుస్తుంది. కాగా.. మహబూబా బాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు పడిగె రూపంలో మంగళవారమే మేడారం మహాజాతరకు బయల్దేరారు. పూజారులు గ్రామంలోని ఆలయంలో పెనుక వంశీయులు పూజలు చేసిన తర్వాత అటవీమార్గంలో కాలినడకన మేడారానికి బయల్దేరారు. మహాజాతరలో పగిడిద్ద రాజు సమ్మక్కను వివాహమాడతారు. ‘సాక్షి’ టీషర్ట్స్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ కర్ణన్ ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరలో వలంటీర్ల కోసం ‘సాక్షి’యాజమాన్యం అందించిన టీషర్ట్స్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జేసీ అమయ్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. ‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో జాతరలో వలంటీర్ల కోసం టీషర్ట్స్‌ను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సారలమ్మ ప్ర«ధాన పూజారి కాకసారయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన అరుణ్‌కుమార్ చేతుల మీదుగా గద్దెల ప్రాంగణంలో వలంటీర్లకు టీషర్ట్స్‌ను అందజేశారు. -
మేడారం.. కథ కాదు ఓ చరిత్ర
సాక్షి, హైదరాబాద్: కోయ, ఆదివాసీల వీరగాథలపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని ప్రముఖ రచయిత, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. సమ్మక్క – సారక్కపై ఎన్నో కట్టు కథలున్నాయని, ఇప్పుడు చారిత్రక దృక్కోణంలోంచి వాటిని చూడాల్సి ఉందన్నారు. మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర నేపథ్యంలో వారి గాథలపై అధ్యయనం చేసిన ఆయన ‘వీరుల పోరు గద్దె –మేడారం’ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం జయధీర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక్క కథ చరిత్ర సృష్టించింది.. సమ్మక్క–సారలమ్మ ఒక్క గాథే చరిత్రను సృష్టించింది. మరి మిగిలిన ఎనిమిది గాథల మాటేమిటి..? ఈ గాథలోనే కాదు పగిడిద్దరాజు, గడికామరాజు, ఎరమరాజు, గాదిరాజు, గోవిందరాజు, తోటుమనెడి కర్ర, గుంజేటి ముసలమ్మల కథలు కూడా ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో సమక్క సారాలమ్మల చరిత్ర నుండి ప్రేరణ పొందినందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం పరిశోధనల వైపు దృష్టి సారించాలి. అప్పుడే అసలు గాథలు బయటికి వచ్చి ఆదివాసీలకు మేలు జరుగుతుంది. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తూ స్థానిక కోయ సంస్కృతి, పుజా విధానం మారకుండా కాపాడాలి. బ్రాహ్మణ పురోహితులు అక్కడ కన్పించకూడదు. చరిత్ర విషయంలో చరిత్రకారులు ఇలాంటి పరిశోధనలు చేసి ప్రజల పక్షం వహించినపుడే ఆ చరిత్రకు సార్థకత ఉంటుంది. ఇంతవరకు సమక్క–సారాలమ్మలకు సంబంధించి కాల్పానిక గాథలే ఉన్నాయి. ఇప్పుడు చారిత్రక ఘటనల క్రమం నుంచి వీరి చరిత్రను వెలికి తీశా. అంతేకాదు చరిత్ర ఆధారాలు కనిపించని చోట కోయల జ్ఞాపకాల్లోని మౌఖిక ఆధారాలే చరిత్రగా మార్చాలి. సమ్మక్క – సారక్క జాతరగానే పిలవాలి ఇప్పటి వరకు సమక్క – సారలమ్మ జాతరగా పిలుస్తున్నాం. ఇది సరికాదు. ‘సమ్మక్క–సారక్క’ జాతరగా పిలవడం సుమచితం. ఆదివాసీలకు అక్క దేవతలు ఉంటారు. ‘అక్కలు’ అని పిలవడం సరైన పద్ధతి. ఒకరు ఒకలాగా మరొకరు మరోలా కాకుండా.. అందరూ ఒకే తీరుతలో పిలవాలి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరను సమ్మక్క – సారక్క జాతరగా పిలవడం ప్రాచర్యంలోకి తేవాలి. ఈ విషయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. కోయ వీరుల పాటలకు ప్రాచుర్యం అవసరం ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క – సారక్క జాతరకి ఎనిమిది మంది కోయ వీరుల పగిడె పాటలు తీసుకరావాలి. వాటికి జాతరలో నాలుగు రోజుల పాటు వారి గాథలు చెప్పించటం అవసరం. అప్పడే ఆ వనదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. చరిత్రకు న్యాయం జరుగుతుంది. గొప్ప చారిత్రక ప్రదేశం.. మేడారంలో సమ్మక్క – సారక్క జాతర జరిగే స్థలం గొప్ప చారిత్రక ప్రదేశం. అక్కడ యుద్ధం జరిగింది. పడిపోయిన తన భర్తను సమక్క మోసుకొని వచ్చింది. మేడారం వద్దకు రాగానే అలసిపోయి అక్కడే ఆగింది. ఆ తర్వాత ఆమె తన కూతురు సారక్క అక్కడే ఉండి, కొంత కాలానికి మరణించారు. కాబట్టి కోయలకు అది పవిత్ర స్థలం. నిజానికి అది ఓ చారిత్రక ప్రదేశం మాత్రమే. 14 ఏళ్ల అన్వేషణ ఇది.. ‘వీరుల పోరు గద్దె–మేడారం’ పేరుతో సమ్మక్క, సారక్కలపై కోయడోలీల కథ పుస్తకం తీసుకరావటానికి 14 ఏళ్లు పట్టింది. ఇది ఒకరితో సాధ్యమైంది కాదు. ప్రొఫెసర్ గూడూరు మనోజ, పద్దం అనసూయ.. వీరితో పాటు ఎంతో మంది శ్రమించారు. తొలుత ఖమ్మం జిల్లా తొగ్గూడెం ప్రారంభించి మేడారం వరకు చరిత్ర అన్వేషణ ప్రయాణం సాగించాం. అక్కడ పగిడె తీశారు. మౌఖిక కథనాలకి ఆధార భూతాలు పగిడెలు మాత్రమే. అవసరమైన చోట పాఠ్యగానం సకిన రామచంద్రయ్య బృందం అందించారు. -
ఇంటింటా సమ్మక్క..
సాక్షి, వరంగల్ రూరల్: సమ్మక్క జాతర నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొలంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ముందుగా ఇంట్లో సమ్మక్కను చేసి జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవడం అనావాయితీగా వస్తోంది. గత వారం పది రోజుల నుంచి గ్రామాల్లో ఎక్కడ చూసినా సమ్మక్క–సారలమ్మ పూజలే కనిపిస్తున్నాయి. కోరికలు నేరవేడంతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఎత్తు బంగారం (బెల్లం), కోడి, యాటలతో మొక్కులు చెల్లిస్తున్నారు. పండుగ సందర్భంగా తమ బంధువులందరిని పిలిచి విందు చేస్తున్నారు. జాతరలో సమ్మక్క–సారలమ్మల గద్దెల వద్ద మొక్కులు చెల్లించిన తర్వాత ఎత్తు బంగారాన్ని బంధువులు, ఇంటి చుట్టు ప్రక్కన వాళ్లను పంచిపెట్టడం అనవాయితీగా వస్తోంది. ఒడి బియ్యం కోరుకున్న కోరిక నేరవేరితే ఒడి బియ్యం పోస్తామని మొక్కుతారు. ఇలా మొక్కుకున్న వారు ఒక్కరి నుంచి తొమ్మిది మంది వరకు ఒడి బియ్యం పోస్తున్నారు. ఇంట్లో సమ్మక్కను చేసేప్పుడు జోగినికి (దేవుడు ఉన్న వ్యక్తి) ఒడి బియ్యాలు పోస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో బెల్లం, కొబ్బరి కాయలు, కోళ్లు, గొర్రెలు, మేకల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కొబ్బరికాయ ధరలు కొండెక్కడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదపు రూ.60 కోట్లకు పైగా బెల్లం వ్యాపారం, రూ.2 కోట్లకు పైగా గొర్రెలు, కోళ్లు, కొబ్బరికాయల విక్రయాలు జరగనున్నాయి. -
మేడారంలో ఉచిత వైఫై షురూ...
వరంగల్: మేడారం జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఉచితంగా వైఫై సేవలను సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ పీజీఎం కందగట్ల నరేందర్ ప్రకటించారు. ఉచిత వైఫై సేవలు ఈనెల 31వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జాతరకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రం నుంచి సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. జాతర ప్రాంగణంలో 13 టవర్లతో సిగ్నల్స్ అందిస్తున్నామన్నారు. 20 హాట్స్పాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హాట్స్పాట్లకు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ కల్పిస్తున్నామన్నారు. ఒక్కో హాట్‌స్పాట్‌తో ఒకేసారి 12 వేల మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. వైఫై సేవలు ఫ్రీగా అందించేందుకు ఎంపీ సీతారాంనాయక్ కృషితో ప్రభుత్వం రూ.20 లక్షలు బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెల్లించారని తెలిపారు. జాతర పరిసరాలకు వెళ్లడంతోనే సెల్లో లాగిన్ పేజీ వస్తుందని, దానిలో అప్షన్ ఎన్నుకుంటే వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్)తో కనెక్ట్అయి ప్రతి రోజు 500 ఎంబీ డాటాను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉచిత సేవలు అన్ని నెట్వర్కులతో సంబంధం లేకుండా కేవలం వైఫై ఆప్షన్‌తోనే డాటాను అందిస్తామని నరేందర్ తెలిపారు. -
దాహం.. దాహం
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. తల్లుల దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చున్న వారు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జాతరలో తాగునీటి వసతి కల్పించేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖకు ప్రభుత్వం రూ.19.80 కోట్లను కేటాయించింది. ఇందులో సుమారు రూ.10 కోట్ల వరకు తాగునీటి వసతికి వెచ్చించారు. కాగా, గత జాతరలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారానే నీళ్లను అందిస్తున్నారు. కేవలం మిషన్ భగీరథ నీళ్లపైనే ఆశలు పెట్టుకుని అధికారులు కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. –ములుగు క్యూ లైన్లలో ఇబ్బందులు భక్తులు సోమవారం భారీగా గద్దెలకు చేరుకోవడంతో రద్దీ ఎక్కువై అమ్మల దర్శనం ఆలస్యమైంది. మధ్యాహ్నం కావడంతో ఎండ ఎక్కువగా ఉండి తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చంటి పిల్లల పరిస్థితి అగమ్యగోచరం. క్యూలో భక్తుల కోసం డ్రమ్ములు, నల్లాల ద్వారా నీటిని అందిస్తామన్న అధికారులు ఇప్పటి వరకు ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వంటావార్పునకు.. భక్తులు నీళ్ల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్‌పాయింట్, నార్లాపూర్, చింతల్‌క్రాస్, వెంగళాపురం, పడిగాపురం, కొత్తూరు, కన్నెపల్లి, ఊరట్టం ప్రాంతాల్లో నీళ్లులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది ప్రైవేట్ వాహనాల ద్వారా సమీపంలోని బోరింగ్ పంపులు, ట్యాప్స్‌ల ద్వార నీటిని తీసుకొస్తున్నారు. మరి కొందరు వాగు నీళ్లను వంటలకు వాడుతున్నారు. మినరల్ వాటర్ క్యాన్‌కు రూ.70 ఆర్డబ్ల్యూఎస్ తరుఫున డిమాండ్ మేర మంచినీరు అందకపోవడంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు మినరల్ వాటర్ క్యాన్ల ధరలను అమాంతంగా పెంచేశారు. 20 రోజుల క్రితం క్యాన్‌కు రూ.15 నుంచి రూ.20 ధర పలుకగా ప్రస్తుతం ఆ ధర రూ.50 నుంచి రూ.70 దాకా పలుకుతూ ఉండడం విశేషం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మేడారానికి వచ్చే భక్తులకు ఈ సారి శుద్ధమైన గోదావరి జలాలను అందించాలని ప్రభుత్వం యంత్రాంగం భావించింది. అనుకున్న విధంగానే పనులను వేగవంతం చేసింది. కానీ, అధికారుల ప్రయత్నం సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఇంగ్లిష్ మీడియం పాఠశాల సమీపంలో 4 లక్షల లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించింది. ఇదంతా బాగానే ఉన్నా అధికారులు నీటిని అందించని పక్షంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా భగీరథ పథకం ద్వార నీటిని అందిస్తే మేలని భక్తులు సూచిస్తున్నారు. మంచినీటికి ఇబ్బందులు పడుతున్నాం.. జాతరలో మంచినీటి సౌకర్యం ఉంటుంనే భావనతో ఇంటి నుంచి నీళ్లను తీసుకురాలేదు. తీరా ఇక్కడికి వచ్చాక నీళ్లు అందుబాటులో లేవు. మినరల్ వాటర్ ప్లాంట్‌కు వెళితే ఎక్కడా లేని ధరలు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. తాగడానికి, వంట చేయడానికి రెడ్డిగూడెం సమీపంలోని నల్లాల దగ్గరకు వచ్చాం. నీళ్లు బాగాలేకున్నా తాగుతున్నాం. విజయ, సికింద్రాబాద్ -
రారండోయ్.. రామప్పకు..
వెంకటాపురం(ఎం): మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకొని రామప్ప ఆలయాన్ని సందర్శించే మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. భక్తులు రామలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు గతంలో నిర్మించిన మినీవాటర్ ట్యాంకులకు మరమ్మతు చేసి వినియోగంలోకి తెచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం తహసీల్దార్ ఇరుకుల శివకుమార్, ఎస్సై పోగుల శ్రీకాంత్, రామప్ప ఈఓ చిందం శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రామప్ప ఆలయం ఎదుట ఉన్న కట్ట సమీపంలో 20 మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ వాటికి తడకలు అమర్చకపోవడంతో వినియోగంలోకి రాలేదు. సాయంత్రం 6 గంటలకే ఆలయ ప్రధాన గేట్లు మూసి వేస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరస్సు కట్టకు కాలినడకన... భక్తుల వాహనాలను పోలీసులు రామప్ప ఆలయ శివారులోనే నిలిపివేస్తుండడంతో ఆలయాన్ని సందర్శించిన భక్తులు కాలినడకన పిల్లపాపలతో కలిసి సరస్సుకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 300 మంది పోలీసులచే బందోబస్తు మేడారం జాతర సందర్భంగా రామప్పకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 300 మంది పోలీసు సిబ్బందిచే సేవలు అందిస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్ తెలిపారు. జంగాలపల్లి నుంచి గణపురం క్రాస్‌రోడ్ వరకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. రామప్పలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. పెరుగుతున్న భక్తజనం మేడారం జాతర దగ్గర పడుతున్నకొద్దీ రామప్పలో భక్తుల రాక పెరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రతిరోజు సుమారు 15 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు రామప్పను సందర్శిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో రామప్ప ఆలయ పరిధిలో మిఠాయి దుకాణాలు, బొమ్మల దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపులు, హోటళ్లు తదితర దుకాణాలు వెలిశాయి. రామప్ప పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. -
మేడారం జాతరకు 4200 బస్సులు
సాక్షి, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 50 కేంద్రాల నుంచి 4200 లకు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ సందర్బంగా భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. రెండేళ్ల క్రితం జాతర సందర్భంగా ఆర్టీసీ 3700 ప్రత్యేక బస్సులను నడపగా.. సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరకు అదనంగా మరో 500 బస్సులను నడపునున్నట్టు తెలిపారు. ఈసారి సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, గోదావరి ఖని, పెద్దపల్లి వంటి 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. జాతరకు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని మేడారం స్పెషల్ ఆపరేషన్స్ విధుల్లో నియమించారని ఆయన వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సుల ఏర్పాట్లు చేయడంతో పాటు, మేడారం వద్ద ఆర్టీసీ తాత్కాలిక బస్ టర్మినల్ కూడా ఏర్పాటుచేశామన్నారు. కాగా మేడారంలో ఏర్పాటు చేసిన వసతులను ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. వరంగల్‌లో అధికారులతో ఎండీ సమీక్ష నిర్వహించారు. జాతరలో బస్సుల నిర్వహణ, ప్రయాణికుల కోసం ఏర్పాట్లు, బస్ టర్మినల్, భక్తుల డిమాండ్ మేరకు ఆయా రూట్లలో బస్సుల నిర్వహణపై ఆర్ఎంలు, డిపో మేనేజర్లు, అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. -
మేం చెప్పిందే రేటు!
బాబోయ్ ఏంటీ రేట్లు అనుకుంటున్నారా..? ఇదంతా మాఫియా మాయాజాలం. కృత్రిమ కొరత సృష్టించి, ఇసుకను గుప్పిటపట్టి వ్యాపారులు ఆడుతున్న నాటకం. సర్కారు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఈ నాటకంలో మాఫియాకు కోట్లు.. జనానికి పాట్లు!! మహమ్మద్ ఫసియుద్దీన్: రాష్ట్రంలో ఇసుక బంగారమైంది. ధరలను మాఫియా శాసిస్తోంది. సామాన్యులతోపాటు బిల్డర్లకూ చుక్కలు చూపుతోంది. మేడారం జాతర నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహా పరిసర ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లలో ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు ప్రభుత్వం తవ్వకాలను నిలిపేయడంతో.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న మాఫియా కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలను పెంచేసింది. హైదరాబాద్‌లో మూడ్రోజుల కింద రూ.1,150–1,200కు లభించిన టన్ను దొడ్డు రకం ఇసుక ఇప్పుడు అకస్మాత్తుగా రూ.1,500కు చేరింది. సన్న రకం ఇసుక రూ.1,250 నుంచి రూ.1,700కు పెరిగింది. లారీ ఇసుక (సగటున 30 టన్నులు) రూ.50 వేలకు పైనే పలుకుతోంది. ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం.. వ్యాపారులకు విక్రయించే ఇసుక ధరలను మాత్రమే నిర్ణయిస్తున్నారు. రిటైల్ ధరలను వ్యాపారుల అభీష్టానికే వదిలేయడంతో వారు చెప్పిందే రేటుగా సాగుతోంది. తగ్గిన లభ్యత కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు, ఉప నదులు, జలాశయాల్లో ఉన్న ఇసుక తవ్వకాల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కి బదలాయించింది. గతేడాది పాత 7 జిల్లాల పరిధిలో 56 చోట్ల ఇసుక తవ్వకాలకు టీఎస్ఎండీసీ ద్వారా అనుమతులిచ్చారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 18 రీచ్‌లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 రీచ్‌లు కలిపి 21 రీచ్‌లలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. మిడ్ మానేరుకు నీళ్లు వదలడంతో కరీంనగర్ జిల్లాలోని కాజీపేట్, కొత్తపల్లి రీచ్‌లు 8 నెలలుగా మూతబడ్డాయి. ఇసుక విక్రయానికి రాష్ట్రవ్యాప్తంగా 289 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయగా 50 పాయింట్లలోనే ఇసుక లభ్యత ఉంది. కృష్ణా నదిలో ఇసుక లభ్యత లేనందున తవ్వకాల్లేవు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. వారికి పంట.. సామాన్యులకు తంటా ప్రభుత్వం రీచ్‌ల వద్ద ఇసుకను క్యూబిక్ మీటర్‌కు రూ.550 (టన్నుకు రూ.357.5) చొప్పున విక్రయిస్తోంది. టీఎస్ఎండీసీ పేరిట మీ సేవా, ఆన్లైన్ కేంద్రాలకు డబ్బులు చెల్లించి రశీ దు పొందితే బుకింగ్ ఆర్డర్ మేరకు స్టాక్ పాయింట్ల వద్ద లారీల్లో ఇసుక నింపుతారు. ఇసుక వ్యాపారులే ఆన్లైన్లో బుక్ చేసుకొని హైదరాబాద్‌లో టన్నుకు రూ.1500– 1700లు, జిల్లాల్లో రూ.1200 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా విక్రయాలు జరుపు తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సామాన్యులకు ప్రయోజనం లేకుండా పోయింది. తాజా విధానంతో ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.500 కోట్ల ఆదాయం వస్తుండగా.. వ్యాపారులూ రూ.కోట్లల్లో సంపాదించుకుంటున్నారు. జిల్లాల్లోనూ అంతే.. మానేరు ఇసుక క్వారీ నుంచి వరంగల్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరం ఉంది. జిల్లా కేంద్రానికి ఇసుక తీసుకొచ్చేందుకు లారీ రవాణాకయ్యే డీజిల్, డ్రైవర్, కూలీల ఖర్చులు కలిపి గరిష్టంగా రూ.1,800 మించదు. ఇలా 21 టన్నుల ఇసుక ధర (రూ.7,425) రవాణా ఖర్చులు కలిపి రూ.9,225 అవుతుంది. ఈ లెక్కన వ్యాపారులకు టన్నుకు రూ.448 మాత్రమే లభిస్తుండగా, వినియోగదారులుకు మాత్రం రూ.1,000 నుంచి రూ.1200కు విక్రయిస్తున్నారు. దీంతో 21 టన్నుల ఇసుక లారీ వినియోగదారులకు చేరే సరికి రూ.25 వేలు అవుతోంది. వ్యాపారులకు రూ.15 వేల లాభం మిగులుతోంది. ఇదీ అడ్డగోలు దోపిడీ స్టాక్‌యార్డ్‌ల వద్ద టన్ను రూ.357.5 చొప్పున వ్యాపారులకు టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. లారీల్లో లోడింగ్ పరిమాణం ఆధారంగా క్వారీల్లో ధర 13.5 క్యూబిక్ మీటర్ల (21 టన్నులు)కు రూ.7,425.. 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నులు)కు రూ.5,775 గా ఉంది. ప్రభుత్వ ధరకు రవాణా ఖర్చులు కలిపి ఇసుకను విక్రయించాలి. ఇసుక లారీలు సగటున లీటరు డీజిల్‌కు 2–3 కి.మీ. ప్రయాణిస్తాయి. లీటర్ డీజిల్ ధర రూ.69 ఉండగా ఇసుకను హైదరాబాద్ తరలించేందుకు రాకపోకలు కలిపి గరిష్టంగా 600 కి.మీ.లు ప్రయాణించాలి. ఈ లెక్కన సగటున రవాణా వ్యయం రూ.13,800 నుంచి రూ.20,700 అవుతుంది. 30 టన్నుల ఇసుకకు ప్రభుత్వ ధర రూ.10,725 కాగా.. హైదరాబాద్‌కు తరలించేందుకు రవాణా, ఇసుక వ్యయం కలిపి రూ.24 వేల నుంచి రూ.30 వేల వ్యయం అవుతుంది. వ్యాపారులు రూ.45 వేల నుంచి రూ.51 వేలకు విక్రయిస్తున్నారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రిటైల్ పాయింట్ ప్రారం భించి రూ.950 (క్యూబిక్ మీటర్‌కు రూ.1,425) చొప్పున టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఎస్ఎండీసీ ద్వారా విక్రయ కేంద్రా లు ఏర్పాటు చేస్తే ఇసుక ధరలు సామాన్యులకు కాస్త అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర ఇసుక అవసరాలు నెలకు - 4లక్షల క్యూబిక్ మీటర్లు ఆన్లైన్ ద్వారా విక్రయాలు - లక్ష క్యూబిక్ మీటర్లు ప్రభుత్వ వార్షిక ఆదాయం - రూ.500 కోట్లు రీచ్‌ల వద్ద క్యూబిక్ మీటర్ ఇసుక ధర - రూ.550 రీచ్‌ల వద్ద టన్ను ఇసుక ధర - రూ.357.5 హైదరాబాద్‌లో టన్నుఇసుక ధర - రూ. 1,5001,700 హైదరాబాద్‌లో లారీ ఇసుక ధర (30 టన్నులు) - రూ.50 వేలకు పైనే జిల్లాల్లో టన్ను ఇసుక ధర - రూ. 1,000 - 1,200 జిల్లాల్లో 21 టన్నుల లారీ ఇసుక ధర - రూ.25 వేలు -
తొలిరోజు మేడారానికి 450 బస్సులు
హన్మకొండ: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన తొలి రోజు 450 బస్సులు నడిచాయి. వరంగల్ నగరంతో పాటు, జిల్లాలోని ఇతర ప్రత్యేక పాయింట్లు, ఇతర జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాత్రి 8 గంటల వరకు 450 బస్సులు 1800 ట్రిప్పుల ద్వారా 72 వేల మంది భక్తులను జాతరకు చేరవేశాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు. భక్తుల రాక, సంఖ్యను బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వెంట వెంటనే పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
ఆదివాసీ ఆచారాలతోనే..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరను ఆదివాసీ ఆచారాలతోనే భక్తులు గౌరవంగా జరుపుకోవాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అన్నారు. జాతరలో ఆధునిక టెక్నాలాజీ అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లతోనే జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. వనదేవతలపై ఉన్న నమ్మకం, విశ్వాసంతో జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తున్నారన్నారు. భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని తెలిపారు. జాతరలో భక్తులు, అధికారులు, ప్రజలు పాటించాల్సిన సమన్వయంపై ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తొక్కిసలాటకు గురికావొద్దు.. జాతర సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, మేడారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలను తీసుకువచ్చేటప్పుడు భక్తులు దూరం నుంచి దేవతలను తనవితీరా చూడాలి. కాని ఆరాటంతో రోడ్లపై వచ్చి తొక్కిసలాటకు గురికావొద్దు. పోలీసులు పనిభారంతో భక్తులపై దురుసుగా ప్రవర్తించొద్దు. గద్దెల వద్ద భక్తులకు అధికారులు సహకరించాలి. మనోభావాలు దెబ్బతీయొద్దు సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఆదివాసీ సంస్కృతి, ఆచారాల మధ్య సాగుతుంది. ఆచారాలను భక్తులు, అధికారులు గౌరవించాలి. ఆచార పద్ధతి ప్రకారం జాతర నిర్వహించడం వల్లే రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులకు దేవతల చల్లని చూపుల కోసం వ్యయప్రయాసలకోర్చి మేడారం తరలివస్తున్నారు. పూజారుల మనోభావాలను దెబ్బతీయొద్దు. అధికారులను గౌరవించాలి.. జాతరలో భక్తులకు సేవలందించే అధికారులకు తల్లుల దీవెనలు ఉంటాయి. కోట్లమంది భక్తజనంలో నాలుగు రోజులు 24 గంటల పాటు ఓపికగా భక్తులకు సేవలందించడం.. అధికారుల పనితనం చాలా గొప్పది. జాతరలో సేవలందించే అధికారులను భక్తులు ఎంతో గౌరవంగా చూడాలి. భక్తులు అధికారుల సూచనలను పాటించి ప్రశాతంగా అమ్మలను దర్శించుకోవాలి. ఫ్రెండ్లీగా పనిచేస్తాం.. జాతరలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా పోలీసులు, అధికారులు ఆదివాసీలు, పూజారులందరం ప్రెండ్లీగా పని చేసి జాతరను సక్సెస్ చేసేందుకు కృషి చేస్తాం. జాతరలో విధులు పనిచేసే అధికారులతో మర్యాదపూర్వకంగా మెదలాలి. ఆదివాసీ యువకులకు, సంఘాల నాయకులకు పూజా రుల సంఘం తరఫున కోరినాం. జాతరలో ఎన్నో ఇబ్బందులు తట్టుకుని భక్తుల భద్రత, సేవల కోసం పని చేసే అధికారుల మనసు నొప్పించకుండా జాతరను విజయవంతం చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందాలని పూజారుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. -
జాతరలో ఏం పనులు చేశారు ?
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఏం పనులు చేశారు.. ఏం విధులు నిర్వర్తిస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్‌లో పది శాఖల సెక్టోరియల్ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. వనదేవతలను దర్శించుకున్న ఆయన సాయంత్రం అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించి లోపాలను సరిచేయాలన్నారు. ఉదయం ఆయన జంపన్నవాగు నుంచి గద్దెల వరకు కాలినడకన తిరిగి అక్కడ నెలకొన్న సమస్యలు, భక్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యం లేక కంపుకొడుతున్నాయని, వాటి ని క్లీన్ చేయడంతోపాటు నీటి వసతి ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. ఆకస్మికంగా తనిఖీ చేసి మంచిగ లేకుంటే చర్యలు తీసుకుంటానని ఎస్ఈ రాంచంద్రు, ఈఈ నిర్మలపై మండిపడ్డారు. స్కావేంజర్లను ఏర్పాటు చేసి క్లీన్ చేయాలన్నారు. కరెంట్ పనులు ఇంకా చేయడం ఏమిటని ఎస్ఈ నరేష్‌ను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాళ కరెంటు పనులు ముగించుకొని తనకు రిపోర్ట్ చెప్పాలన్నారు. రేపటి నుంచి ఐజీ నాగిరెడ్డి, ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తారని కడియం అన్నారు. పది కిలోమీటర్ల వరకు భద్రత పోలీసులు గద్దెల వద్ద విధుల్లో ఉన్నా భక్తుల జేబులను దొంగలు కొట్టడం ఏమిటని డీఎస్పీ రాఘవేంద్రరెడ్డిని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అన్నారు. గద్దెల వద్ద దొంగలు లోపలికి వచ్చి జేబులు కొడుతున్నారని స్వయంగా భక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని కడియం అన్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, పోలీసుల రక్షణ చర్యలు అంతగా బాగాలేవన్నారు. ఈ నెల 30 నుంచి ఒక్క వాహనం కూడా జంపన్నవాగు, గద్దెల వద్ద కనిపించొద్దని డీఎస్పీని కడియం తీవ్ర స్వరంతో ఆదేశించారు. అమ్మలకు విశ్రాంతి భక్తులు వేసే బంగారం, కొబ్బరి ఇతర పదార్థాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా ఉంచాలన్నారు. ఫైర్‌సిబ్బంది గద్దెలను నీటితో శుభ్రం చేయాలన్నారు. అమ్మలకు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు విశ్రాంతి అని భక్తులకు చెప్పి ఆ ప్రాంగణమంతా శుభ్రం చేసి ఉంచాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబును ఆదేశించారు. మురుగు నీరు తొలగించాలి జంపన్నవాగులో ఉన్న మురికి నీరు ప్రధాన జాతర సమయంలో తొలగించేలా చూడాలని ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ నెల 30 నుంచి భక్తులు తేట నీటిలో స్నానాలు చేసేలా చూడాలన్నారు. వాగులో క్లోరినేషన్ చేయించి భక్తులకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూడాలని ఎస్ఈని ఆదేశించారు. మేడారం గద్దెల నుంచి పది కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా దుమ్ముదూళి ఉండొద్దని, రోజూ బ్లీచింగ్ చల్లించాలని, చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని డీపీఓ చంద్రమౌళిని ఆదేశించారు. ఫిబ్రవరి 2న సీఎం వస్తారు ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఆయన పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారని తెలిపారు. ఆ సమయంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాగ్రత్తగా పనిచేసి జాతరను సక్సెస్ చేయాలన్నారు. అనంతరం గద్దెల వద్ద ఉన్న మంచెపైకి వెళ్లి అక్కడ భక్తుల దర్శనాలను పరిశీలించారు. సమీక్షలో కలెక్టర్ కర్ణన్, జేసీ అమయ్ కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, సబ్‌కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ ఆర్ఎం సూర్యకిరణ్, సీపీఓ కొమురయ్యతోపాటు అధికారులు ఉన్నారు. -
మొక్కుల మేడారం
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. మహాజాతరకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం, ఆదివారం సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు 12 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు అంచనా వేశారు. భక్తుల రాకతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్ ఆర్టీసీ పాయింట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తోపులాట.. మేడారానికి భక్తులతోపాటు వీఐపీలు సైతం భారీగా వచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాం నాయక్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్‌తోపాటు వచ్చిన ప్రజాప్రతినిధులతో వీఐపీ గేటు వద్ద గందరగోళం ఏర్పడింది. వీఐపీలు అమ్మవార్లను దర్శించుకునేందుకు గద్దెలకు వెళ్లిన క్రమంలో తోపులాట జగింది. వీఐపీ గేటు పక్కనే సాధారణ భక్తులు అమ్మవార్లను దర్శించుకునే క్యూలైనన్లు ఉండడంతో రద్దీ ఎక్కువై ఓ బాలిక మోచేయికి తీవ్రగాయమైంది. భక్తుడి తలకు గాయాలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలను నేరుగా గద్దెల వద్దకు పంపించారు. ఈ సమయంలో గద్దెల బయట ఉన్న భక్తులు తమ మొక్కులో భాగంగా బంగారం(బెల్లం), కొబ్బరికాయల ముక్కలను గద్దెల లోపలికి విసరడంతో చాలామంది వీఐపీ భక్తులకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన చంద్రారెడ్డి తలపై కొబ్బరికాయపడి రక్తస్రావమైంది. ఇక చిన్నపిల్లలతో వీఐపీ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగారం ముద్దలను సేకరించడానికి వచ్చిన ఆదివాసీ వలంటీర్ల వద్ద ఉన్న హెల్మెట్లను చిన్నారుల తలలపై ఉంచి అప్రమత్తమయ్యారు. తీరు మారని దేవాదాయ శాఖ.. గత మహాజాతరలో అమ్మలను దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో భక్తులు విసిరిన బంగారం ముద్ద తగిలి స్వయంగా తనకే గాయమైందని, ఈసారి వీఐపీ భక్తులకు గద్దెల వద్ద ఇబ్బందులు రాకుండా చూడాలని, వారం రోజుల క్రితం మేడారానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. భక్తులు సమర్పించేందుకు తమ వెంట తీసుకొచ్చే బంగారం, కొబ్బరికాయలను గద్దెలపై అమ్మవార్లకు అందేలా సులవైన మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని వీఐపీ భక్తులు వాపోతున్నారు. క్యూలైన్లు కిటకిట... భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి భక్తులకు క్యూలైన్ల ద్వారా అనుమతి ఇచ్చారు. రెడ్డిగూడెం వైపు నుంచి అమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గంటపాటు క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతోపాటు వీఐపీలు రావడంతో చాలా సేపు వేచిచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో మంచినీటి సౌకర్యం లేక అధికారుల ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. హెలీకాపర్ట్లో వచ్చిన ఎంపీలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బాల్క సుమన్, గుత్త సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ మేడారం పోలీస్ క్యాంపులోని హెలిప్యాడ్‌లో దిగారు. ఎంపీ సీతారాంనాయక్, జేసీ అమయ్‌కుమార్, చైర్మన్ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు వారికి హెలీప్యాడ్ నుంచి స్వాగతం పలికారు. వారి వెంట ఎంపీ పసులేటి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీలు వలీయాబీతోపాటు పలువురు అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరిని భారీ పోలీసులు బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. -
జాతర్లకే అమ్మ మేడారం జాతర
అది శతాబ్దాల నాటి వన జాతర. తరతరాల గిరిజన జాతర. రాచరికపు అహంకారాన్ని, అన్యాయాన్ని ఎదిరించి, జనం కోసం ప్రాణత్యాగం చేసిన అడవిబిడ్డలైన ఆడపడచులను తల్లులుగా భక్తజనకోటి ఆరాధించుకునే అపురూప జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారి కళకళలాడుతూ కన్నుల పండుగ చేసే అద్వితీయ జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా రికార్డులకెక్కిన అరుదైన జాతర మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మల జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తల్లీ కూతుళ్లయిన సమ్మక్క సారలమ్మల వీరగాథ కాకతీయుల కాలం నాటిది. అప్పట్లో దండకారణ్యంలోని మేడారంలో కోయగూడెం ఉండేది. ఆ గూడేనికి చెందిన కోయలు ఒకనాడు వేట కోసం అడవిలోకి వెళ్లారు. కొంతదూరం వెళ్లాక అడవిలో ఒకచోట పులుల రక్షణ వలయంలో ఉన్న ఒక పసిబిడ్డ కనిపించింది. ఆ మహత్తర దృశ్యం చూసి వారు దిగ్భ్రమ చెందారు. భక్తిపారవశ్యంతో కళ్లు మూసుకుని కొండదేవరకు మొక్కారు. కళ్లు తెరిచి చూసేసరికి పులులు మాయమయ్యాయి. బోసినవ్వులొలికిస్తూ పసిబిడ్డ మాత్రం అక్కడే ఉంది. ఆ పసిబిడ్డను వారు పల్లకిలో గూడేనికి తీసుకొచ్చారు. వెదురు పందిళ్లు వేసి, ఆమెను గద్దె మీద కూర్చుండబెట్టి కొండదేవత కానుకగా కొలవసాగారు. అడవిలోని పెద్దపులులు అప్పుడప్పుడు పసిపాప ఉండే గద్దె వద్దకు వచ్చి బుద్ధిగా సాధుజంతువుల్లా ప్రవర్తించేవి. ఈ అద్భుతాన్ని తిలకించిన గిరిజనులు ఆమెను కొండదేవత అవతారంగా తలచి, సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. ఆమె కొన్ని మహిమలను చూపడంతో సమ్మక్కను గిరిజనులంతా దేవతగా ఆరాధించసాగారు. సమ్మక్క క్రమంగా యుక్తవయసులోకి వచ్చింది. కాకతీయ సామ్రాజ్యంలోని సామంతరాజ్యమైన పోలవాస రాజ్యాన్ని పాలించే మేడరాజు మేనల్లుడైన పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం చేశారు. వివాహం తర్వాత సమ్మక్క, పగిడిద్దరాజు మేడారం ప్రాంతాన్ని సామంతులుగా పాలించడం ప్రారంభించారు. ఏటా క్రమం తప్పకుండా కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించేవారు. సమ్మక్క, పగిడిద్దరాజులకు సారలమ్మ, నాగులమ్మ అనే కూతుళ్లు, జంపన్న అనే కొడుకు పుట్టారు. కొన్నేళ్లు సజావుగానే గడిచాయి. కాలం అనుకూలించక కొన్నేళ్లు వరుసగా కరువు కాటకాలొచ్చాయి. కాకతీయ సేనలపై తిరుగుబాటు వరుస కరువుల వల్ల పగిడిద్దరాజు కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయాడు. ఆగ్రహించిన కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడు. సమ్మక్క, పగిడిద్దరాజు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. సమ్మక్క, పగిడిద్దరాజు, జంపన్న, పగిడిద్దరాజు సోదరుడైన గోవిందరాజు మేడారం సరిహద్దుగా ఉన్న సంపెంగవాగు దాటకుండా కాకతీయ సైన్యాలను నిలువరించి, వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. యుద్ధం అక్కడితో ముగిసిపోలేదు. కాకతీయ సేనలు మరింతగా వచ్చి, గిరిజన బలగాలపై విరుచుకుపడ్డాయి. యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు ప్రాణాలు కోల్పోయారు. సంపెంగవాగు వద్ద కాకతీయ సేనలను ఎదిరించిన జంపన్న ఆ వాగులోనే పడి వీరమరణం చెందాడు. జంపన్న నెత్తుటితో తడిసిన సంపెంగవాగుకు అప్పటి నుంచి జంపన్నవాగు అనే పేరు స్థిరపడింది. యుద్ధంలో కాకతీయులదే పైచేయి కావడంతో కోయలంతా సమ్మక్క వద్దకు వెళ్లి ‘నీ మహిమలేమైపోయాయి తల్లీ’ అంటూ విలపించారు. వారి బాధకు చలించిపోయిన సమ్మక్క తానే యుద్ధరంగంలోకి దూకింది. సమ్మక్కను ముఖాముఖి ఎదుర్కొనే సాహసం లేని సైనికుడు ఒకరు ఆమెకు బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు. ఆమె గాయాన్ని అదిమిపట్టి, ఈశాన్య దిశగా అడవిలో చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెదుకుతూ వెళ్లిన కోయదొరలకు చిలుకలగుట్ట మీద ఒక పెద్ద నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణ కనిపించింది. దానినే సమ్మక్కతల్లి గుర్తుగా భావించారు. తల్లి మళ్లీ అక్కడకు వస్తుందనే ఆశతో కొన్నిరోజులు ఎదురు చూశారు. ప్రతాపరుద్రుడి పశ్చాత్తాపం యుద్ధ వినాశనం తర్వాత కాకతీయుల ఇలవేల్పు ఏకవీరాదేవి ప్రతాపరుద్రుడికి కలలో కనిపించింది. మేడారంలో జరిగిన నాశనాన్ని వివరిస్తూ కంటతడిపెట్టింది. అశేష గిరిజనుల గుండెల్లో దేవతగా కొలువుదీరిన సమ్మక్క, ఆమె కుటుంబం చేసిన ప్రాణత్యాగానికి ప్రతాపరుద్రుడు ఎంతగానో ఆవేదన చెందాడు. కప్పం కోసం తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది, మేడారం చేరుకున్నాడు. జరిగిన దానికి గిరిజనులకు క్షమాపణలు వేడుకుని, మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. సమ్మక్క తల్లి పేరిట రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ముత్తయిదువుల జాతరగా జరుపుకోవాలని ఆదేశించాడు. అప్పటి నుంచి నెమిలినార చెట్టు కింద పుట్ట వద్ద దొరికిన కుంకుమ భరిణను సమ్మక్క, సారలమ్మలకు ప్రతిరూపంగా పూజిస్తూ గిరిజన జాతరను వైభవోపేతంగా జరుపుకొంటూ వస్తున్నారు. ఇదీ సమ్మక్క, సారలమ్మల గురించి భక్తుల్లో ప్రచారంలో ఉన్న గాథ. మేడారం ఒక జాతరే కాదు... చరిత్ర కూడా! మహాసామ్రాజ్యాల నిర్మాణాలు – చక్రవర్తులు చేసే యుద్ధాలు – ఇవి మాత్రమే చరిత్రలో నమోదవుతాయి. విజయస్తంభాల్లో శాసనాల్లో శిలాక్షరమై మనగ్గలుగుతాయి. ఆ సామ్రాజ్యాల నిర్మాణాల్లో రాళ్లెత్తిన వాళ్లు అనామకులై మట్టిగలిసిపోతారు. యుద్ధాల్లో పరాజితులు చరిత్రహీనులవుతారు. ప్రాణాలు కోల్పోయిన, త్యాగాలు చేసిన వీరులు విస్మృతికి గురవుతారు. కానీ అన్నిసార్లూ అలాగే జరగదు. ప్రజలు తమ జాతి మనుగడ కోసం నిలబడిన వీరులను దైవాల్లా పూజిస్తారు. వాళ్లకు తమ గుండెల్లో ‘గద్దె’ కడతారు. వారి మరణాన్ని ఉన్నతీకరిస్తూ పాటలు కడతారు. గాథలు నిర్మిస్తారు. వీరులకు ఒక్కోసారి అలౌకిక మహిమలను సైతం ఆపాదిస్తారు. అయితే మౌఖికంగా ప్రచారమయ్యే ఆ పాటల్ని, గాథల్ని– వాటిలో, కల్పన కారణంగా – పండిత చరిత్రకారులు అకడమిక్ విలువలు లేని అప్రామాణికాలనీ చరిత్రగా ఒప్పుకోరు. ‘పుక్కిటి పురాణాలు’ అని తిరస్కరిస్తారు. శతాబ్దాలుగా ఆదివాసీ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచి, యివ్వాళ ఏడెనిమిది రాష్ట్రాల గిరిజన జాతులకు ఆరాధ్య దైవాలుగా కొలువులందుకుంటున్న సమ్మక్క–సారలమ్మల చరిత్రను కూడా అదేవిధంగా అనుమాన దృక్కులతో చూస్తున్నాం. లిఖిత ఆధారాలతోనో, తారీఖులు, దస్తావేజులతోనో చరిత్ర నిర్మించే వాళ్లకు కోయరాజుల చరిత్ర మౌఖికంగా పాడి వినిపించే ‘డోలీ’ల గాథలు అంటరానివి అయ్యాయి. అసలు ‘డోలీ’ అనే కోయ ఉపజాతి కళాకారులు ఇటువంటి పాటలు పాడుతూ తమ జాతి చరిత్ర కాపాడుకొంటూ వస్తున్నారనే చాలామందికి తెలీదు. ఇప్పుడు తొలిసారిగా జయధీర్ తిరుమలరావు నేతృత్వంలో కోయ చరిత్ర – సంస్కృతుల్ని అధ్యయనం చేయడానికి పూనుకున్న పరిశోధన బృందం దాదాపు పదిహేనేళ్లపాటు అన్వేషించి డోలీలు చెప్పే కోయవీరుల చరిత్రను ‘పోరువీరుల గద్దె మేడారం’ అనే పుస్తకరూపంలో తెస్తోంది. డోలీలు చెప్పే ఈ కథ రూపంలోనూ, సారంలోనూ అద్భుతమైంది. ఓరుగల్లు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడికి ‘కరువు కాలంలో కప్పం కట్టం’ – అని తేల్చిచెప్పిన పగిడిద్దరాజు, అతని భార్య సమ్మక్క చేసిన అపూర్వమైన పోరాటాన్ని తరతరాలుగా డోలీలు కళ్లకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. అయితే ఈ కళాకారులు అంతరించబోయే జాతి అని తెలుసుకోవడమే భయంకర విషాదం. మేడారం జాతరలో నిర్వహించే క్రతుకాండద్వారా యెన్నో ప్రతీకల్లో డోలీలు తమ జాతి చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కథలో ప్రస్తావించే అనేక ప్రదేశాలు – కొండలు గుట్టలు వాగులు వంకలు చెరువులు దొరువులు చెట్టుపుట్టా – అన్నీ చరిత్రకు ఆధారాలే. ప్రజలు నిర్మించే చరిత్ర ఎప్పటికైనా సమ్మక్క శౌర్యంలా గద్దెనెక్కి కూర్చుంటుంది. – ఎ.కె.ప్రభాకర్, రచయిత, సాహితీ విమర్శకులు చరిత్రకు ఆధారం... పగిడె చిత్రం! కోయల చరిత్రను దాచి ఉంచినవి పగిడెలు. కోయ పురుషుల చరిత్రను అద్దం పడతాయి. పగిడెలు చూసి కోయవీరుల చరిత్రను గానం చేసే సంప్రదాయం ఉంది. అందుకే ఈ పగిడె చిత్రం కోయల చరిత్రకు పురా ఆధారం అని అంటారు. పగిడె ఒక్కొక్కటి రెండు గజాల నుంచి నాలుగు గజాల పొడవు ఉంటుంది. ఒకవైపు మూడడుగులు, మరోవైపు గజంపైగా వెడల్పు కలిగి ఉంటుంది. ఇది దీర్ఘ త్రికోణాకృతి కలిగి ఉంటుంది. దీనిలో ఆదివాసీల బొమ్మలు వేసి ఉంటాయి. వీటిలో కోయల పుట్టుక, గోత్రాలు, గోత్రపురుషులు, ఇంటిపేర్లు, కోయ దేవరల ప్రాంతీయత తదితర వివరాలు ఉంటాయి. చేసిన పోరాటాలు, మహిమలు, దేవదేవతల వివరాలు కూడిన బొమ్మలు ఉంటాయి. – ప్రొఫ్రెసర్ గూడూరి మనోజ, పాలమూరు విశ్వవిద్యాలయం మేడారం జాతర చారిత్రక మూలాలు పేరంబోయిన రాజు సాంబశివరాజుకు, ఆయన భార్య తూలుముత్తికి నలుగురు కూతుళ్లు. వారిలో సమ్మక్క పెద్దది. చెడాలమ్మ, నాగులమ్మ, కొమ్మాలమ్మలు ఆమె చెల్లెళ్లు. వీరితో కలసి గుంజేటి ముసలమ్మ కూడా కాకతీయ రాజులతో పోరాడుతుంది. పినపాక మండలంలోని సొప్యాల గ్రామంలో ఆమె జాతర జరుగుతుంది. వెదురువనం ధ్వంసం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సమ్మక్కను వెదుక్కుంటూ పారెడుగట్టు రాజులు వస్తారు. తమ పెద్ద కొడుకు పగిడిద్దరాజుకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. అలా వారి పెళ్లి జరుగుతుంది. ఓరుగల్లు పట్టణం చూసి తిరిగి తాడ్వాయి ప్రాంతం వస్తారు. పగిడిద్దరాజుకు గోవిందరాజు, గడికామయ్య, కొండాయి అనే సోదరులు ఉన్నారు. వరుసగా వర్షాలు పడకపోవడం వల్ల కాకతీయ ప్రతాపరుద్రుడికి రకం (కప్పం) చెల్లించలేకపోతారు. ప్రతాపరుద్రుడు ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు చెట్లలో నక్కి ‘మూర్ఛబాణం’ వేయడంతో పగిడిద్దరాజు పడిపోతాడు. ఆ విషయం తెలుసుకుని, ‘బాణాలవరస’ సైన్యంలో ఉన్న సమ్మక్క ఒకవైపు శత్రుమూకలతో తలపడుతూనే వచ్చి, అతడిని తన వీపు మీద వేసుకుని పోతుంది. పోతూ పోతూ యుద్ధం జరిగిన ఊళ్లకు, ప్రదేశాలకు కొత్తగా పేర్లు పెట్టింది. చివరకు నందిమేడారం దగ్గర ఆగి కోయదొరలందరినీ పిలిచి తాను చిలుకూరిగుట్టకు పోయి వస్తానని చెప్పింది. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి ధూంధాంగా జాతర జరపాలని చెప్పింది. కోయ వీరనారీమణులను కోయేతరులు కూడా పూజించడం అప్పటి నుంచి ఆచారంగా మారింది. ఇంతవరకు పగిడిద్దరాజు, సమ్మక్కల పుట్టుపూర్వోత్తరాల సమాచారం సాధికారికంగా తెలియదు. అయితే, గిరిజన ప్రజల అధికారిక గాయకులైన డోలీలు, వడ్డెలు, పట్టెడ పూజారులు సమ్మక్క సారక్క జాతర గురించి కొన్ని ఉదంతాలను విడివిడిగా చెప్పారు. డోలీలు అనే కోయతెగ దేవర కొలుపులు చేసేవారు. వారు ‘పోరువీరుల గద్దె మేడారం’ అనే సమ్మక్క సారక్క పోరాటగాథను గానం చేస్తారు. దానివల్ల అక్కడ ఆనాడు జరిగిన యుద్ధ క్రమం, కోయరాజుల వివరాలు తెలుస్తాయి. సమ్మక్క బిడ్డ సారమ్మ. ఈమె తల్లి తరఫున నిలబడి పోరాడింది. ఈమె భర్త సూరే పాపయ్య. తమ్ముడు జంపన్న. వీరి చరిత్రలను వెలికితీయాలంటే, మరో ఆరు కథలను సేకరించాలి. ఎరమరాజు, ముసలమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు వంటి వారికి గల ‘పగిడె’లను విప్పి వారిపై పాడే గాథలను వినాలి. నిజానికి ఇవి కోయ పురాణాలు. వీటిలో ఎన్నో చారిత్రకాంశాలు సంకేతింపబడి ఉన్నాయి. వీటిలో పేర్కొన్న చరిత్రను తవ్వి తీయాల్సి ఉంది. ఏది ఏమైనా సమ్మక్క సారమ్మలు చారిత్రక వ్యక్తులు అని చెప్పవచ్చు. – ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కవి, పరిశోధకులు గద్దె దగ్గర పడుకోబెడితే జబ్బు తగ్గింది నాకు ఏడాది వయసప్పుడు విపరీతంగా జబ్బు చేసింది. ఒళ్లంతా వాపులు వచ్చాయి. తల బాగా ఉబ్బిపోయింది. ‘ఈ పిలగాడు ఇక బతకడు’ అని బంధువులంతా అనుకున్నారట. దిక్కుతోచని పరిస్థితిలో మా అమ్మా నాన్నలు అడవి తల్లులైన సమ్మక్క సారలమ్మలనే నమ్ముకున్నారు. మేడారం జాతరకు నన్ను 1956లో తీసుకు వెళ్లారు. జంపన్నవాగులో స్నానం చేయించి, నన్ను సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర పడుకోబెట్టారు. జాతర తర్వాత నా జబ్బు తగ్గిపోయింది. అప్పటి నుంచి మా అమ్మకు సమ్మక్క సారలమ్మల మీద విపరీతమైన భక్తి ఏర్పడింది. ఆమె ఉన్నన్నాళ్లూ ప్రతిసారీ జాతరకు వెళ్లేవాళ్లం. ఇప్పటికీ అదే ఆనవాయితీ పాటిస్తున్నాం. – ఎర్ర జగన్మోహన్రెడ్డి, ఉపాధ్యాయుడు, నర్సంపేట అవి సమ్మక్క పలుకులే జంపన్న వాగుకు వెళ్లగానే నాకు సమ్మక్క పూనుతుంది. జాతరకు వచ్చిన వాళ్లలో చాలామంది తమ సమస్యలు చెబుతుంటారు. వాళ్లకుబదులిస్తుంటాను. అప్పుడు నా నోట వచ్చేవి నా మాటలు కావు. అవి సమ్మక్క పలుకులే. అవి కచ్చితంగా జరుగుతాయని భక్తుల నమ్మకం. – చింతకుంట్ల నర్సమ్మ, ఏటూరునాగారం ఇలా జరుగుతుంది జాతర సమ్మక్క సారలమ్మల జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈసారి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటి ఇరవై లక్షల మంది వరకు భక్తులు తరలి రావచ్చని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచే కాకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఈ జాతరకు తండోప తండాలుగా తరలి వస్తారు. మన దేశంలో కుంభమేళా తర్వాత భారీసంఖ్యలో జనం గుమిగూడే వేడుక ఇదే. తొలిరోజు... తొలిరోజు బుధవారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకొస్తారు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు జరిపి, సాయంత్రం ఆంజనేయస్వామి తోడు రాగా సారలమ్మ మేడారం బయలు దేరుతుంది. ఈసారి జనవరి 31న చంద్రగ్రహణం ఉన్నందున రాత్రి 8గంటల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మేడారానికి దక్షిణాన ఉన్న అడవిలోకి వెళ్లి, అక్కడ గద్దెలపై ప్రతిష్ఠించే కంకవనాన్ని ఎంపిక చేస్తారు. వేకువ జామున సుమారు మూడు గంటలకు కంకవనానికి పూజలు జరిపి, సూర్యోదయ సమయానికి కంకలను అడవి నుంచి మేడారంలోని గద్దెల మీదకు చేరుస్తారు. రెండోరోజు జాతర రెండోరోజైన గురువారం సాయంత్రం సమ్మక్క ఆగమనానికి గుర్తుగా వేలాది జంతువులను బలి ఇస్తారు. సమ్మక్కకు గౌరవ సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె మీదకు తీసుకొచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె (పూజారి) తన్మయత్వంతో ఒక్క ఉదుటన చిలుకల గుట్ట నుంచి మేడారం వైపు పరుగున బయలుదేరుతాడు. సమ్మక్క రాకకు సూచకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి తుపాకులు కాల్చి దేవతకు ఆహ్వానం పలుకుతారు. మూడోరోజు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నలుగురూ గద్దెల మీద ఆసీనులై ఉండే రోజు కావడంతో ఈ రోజు లక్షలాదిగా భక్తులు జాతరకు తరలి వస్తారు. కోర్కెలు తీర్చమని సమ్మక్క, సారలమ్మలను వేడుకుంటారు. కోర్కెలు తీరిన వారు కానుకలు సమర్పించుకుంటారు. వనదేవతలను ఆడపడచులుగా భావించి, పసుపు కుంకుమలు, చీర సారెలు పెట్టి, ఒడి బియ్యం పోస్తారు. మొక్కులు మొక్కుకున్న భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగోరోజు జాతర నాలుగోరోజు శనివారం సాయంత్రం ముగుస్తుంది. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకువెళతారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో ఈ తతంగమంతా పూర్తవుతుంది. దేవతలను గద్దెల మీదకు చేర్చే సమయంలో రక్షణ కల్పించే విధంగానే, వనప్రవేశం సమయంలోనూ పోలీసులు కట్టుదిట్టమైన రక్షణతో వనదేవతలను సాగనంపుతారు. ఇన్పుట్స్: కృష్ణ గోవింద్, సాక్షి వరంగల్ ప్రతినిధి యాత్రికుల కోసం ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం మేడారం వద్ద హరిత హోటల్‌ను నిర్మిస్తోంది. భక్తుల వసతి కోసం తాత్కాలికంగా లగ్జరీ టెంట్లను అందుబాటులోకి తెచ్చారు. జాతర ప్రాంతంలో దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో సెమీ పర్మినెంట్ టాయిలెట్లు, మంచినీరు యాత్రికులకు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ సంస్థ 53 పాయింట్ల నుంచి దాదాపు నాలుగువేల బస్సులను నడిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ నుంచి మేడారానికి జాతర రోజుల్లో ఏసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. రైల్వేశాఖ వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, మేరా ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. మేరా ఈవెంట్స్, మేడారం జాతర అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
మేడారం భక్తులకు జియో ఆఫర్
మేడారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో డిజిటల్ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో సంసిద్ధమైంది. ఈ ఆదివాసీ మహా జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు 4జీ మొబైల్ సేవలను నిరంతరాయంగా అందించనున్నట్టు తెలిపింది. జాతర ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలలో కూడా భక్తులకు జియో నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మేడారం జాతరలో జియో భాగస్యామ్యం పట్ల రిలయన్స్ జియో తెలంగాణా సీఈఓ కె.సి.రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఈ జాతరలో పాల్గొనేందుకు తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రానుండటంతో జియో సేవలను విస్తరిస్తున్నాం. దేశవ్యాప్తంగా 4జీ టెలికాం సేవలను అందిస్తూ రిలయన్స్ జియో బ్రాండ్ ఇప్పటికే ప్రతి ఒక్కరికీ చేరువైంది. డిజిటల్ విప్లవాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరువ చేయడం మా ప్రధాన ఉద్దేశం. మా సరికొత్త ఫీచర్ ఫోన్ 'జియోఫోన్' ద్వారా ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం'' అని అన్నారు. ఇటీవలే జియోఫోన్ వినియోగదారులకు ప్రవేశపెట్టిన సంచలన ఆఫర్ రూ.49ను జాతరలో ప్రత్యేక స్టాళ్లలో అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 49 చెల్లించి నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా మాట్లాడేందుకు ఈ ఆఫర్ వీలు కల్పిస్తోంది. ఈ ప్లాన్ ఎంచుకునేందుకు, కొత్తగా జియోఫోనే కొనేందుకు జాతరలో జియో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ భారతంలో జియోఫోన్ సరికొత్త శకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ భారతంలో ఫీచర్ ఫోన్ వాడుతున్న 60 లక్షల మంది వినియోగదారులు ఇప్పడు జియో ఫోన్ అందించే జియో డిజిటల్ లైఫ్‌ను సాధికారికంగా వినియోగిస్తున్నారు. గతంలో కేవలం వాయిస్ నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించే ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు అందుబాటు ధరలోని జియో ఫోన్, సరసమైన ధరలో ఉండే జియో ఎల్టీఈ టారిఫ్ ప్లాన్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ అంతులేని మధురానుభూతికి లోనవుతున్నారు. -
20 లక్షల మంది భక్తులు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల బస్సులు.. 11 వేల మంది సిబ్బంది.. 20 లక్షల మంది ప్రయాణికుల తరలింపు లక్ష్యం.. సీసీ కెమెరాలు, ఉపగ్రహం ద్వారా ట్రాకింగ్‌తో పర్యవేక్షణ.. గిరిజన కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక ఇది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అప్పటికప్పుడు సిద్ధంగా ఉన్న ప్రయాణికులెందరు, వారికి ఎన్ని బస్సులు అవసరమన్నది క్షణాల మీద గుర్తించి.. అంతేవేగంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. కనీసం 20 లక్షల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చటం లక్ష్యంగా పెట్టుకున్నందున 4 వేల బస్సులను సిద్ధం చేసింది. మరో ఐదారు వందల బస్సులను స్పేర్‌లో పెట్టుకుంది. హైదరాబాద్ నుంచి మేడారం వద్దకు బస్సును తరలించే వరకు మొత్తం 11 వేల మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. మేడారంలో పెద్ద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రద్దీని తెలుసుకునేందుకు.. సీసీ కెమెరాలు జాతర జరిగే ప్రాంతంలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 20 సీసీ కెమెరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆర్టీసీ ప్రాంగణంవైపు వస్తున్న భక్తులు, బస్సుల కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ప్రయాణికుల సంఖ్యను క్షణక్షణం పర్యవేక్షిస్తూ బస్సులను సమాయత్తం చేయనుంది. ఏ బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసేందుకు వీలుగా జాతరకు ఏర్పాటు చేసిన బస్సులన్నింటినీ ఉపగ్రహం ద్వారా ట్రాక్ చేసే విధానంతో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. సిబ్బంది వద్ద వాకీటాకీలు ఉంటాయి. జంపన్నవాగు నుంచి ఉచిత బస్సులు జాతరకు వచ్చే వారు తమ వాహనాలను సమీపంలో ఉండే నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ యార్డులో నిలపాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జాతర వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగుకు కూడా మినీ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిలోనూ ప్రయాణికులను ఉచితంగా తరలించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం: ఆర్టీసీ ఎండీ రమణారావు ‘ఈ సారి జాతరలో ఆర్టీసీ కీలక సేవలందించనుంది. దాదాపు 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు తరలించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను వాడుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నేను జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తాను’. -
మారని రైల్వే...
సాక్షి ప్రతినిధి, వరంగల్: కుంభమేళాను తలపించే మేడారం జాతరకు రైళ్లను ప్రకటించడంలో రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పెరిగే రద్దీకి అనుగుణంగా ఇప్పటివరకు ఒక్క ప్రత్యేక రైలునూ ప్రకటించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో సగం మేడారం బాటపట్టనున్నాయి. ఈ మేరకు ఇతర మార్గాల్లో ప్రత్యామ్నాయంగా రైళ్లను నడిపించాలి. జాతర తేదీలు సమీపిస్తున్నా రైల్వేశాఖ నుంచి ఉలుకుపలుకు లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంత పెద్ద ఉత్సవానికి ప్రత్యేక రైళ్లు నడిపించడంలో రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. సంక్రాంతి, దసరా పండగల సందర్భంగా రైల్వేశాఖ నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. ఇందులో 90 శాతం రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుకు వెళ్తాయి. కానీ.. ఆసియాలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించే విషయంలో ప్రతిసారి తాత్సారం జరుగుతోంది. జాతరకు వారం రోజుల ముందు వరకు ప్రత్యేక రైళ్లు ఉంటాయా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. రోడ్డుమార్గంలో సరిపడా బస్సులు లేని వారు రైలుమార్గం ద్వారా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం చేరుకోవచ్చు. కాజీపేట రైల్వేజంక్షన్ ఉత్తర–దక్షిణ–పశ్చిమ ప్రాంతాలకు మధ్య వారధిగా ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది రైళ్లు కిక్కిరిన ప్రయాణికులతో వెళ్తుంటాయి. జాతర సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే అదనపు భక్తులకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవు. ముఖ్యంగా ఖమ్మం–డోర్నకల్–కాజీపేట–బల్లార్షా, సికింద్రాబాద్–బల్లార్ష మార్గంలో రద్దీకి అనుగుణంగా రైళ్లను నడిపించాల్సి ఉంది. ఈ దిశగా రైల్వేశాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడారం రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్ రైల్వేశాఖకు లేఖ రాసినా.. ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. బస్సులకేదీ ప్రత్యామ్నాయం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో 95 డిపోలు ఉండగా.. సుమారు 10,479 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులను మినహాయిస్తే పూర్తిస్థాయి కండిషన్లో 8,000 బస్సుల వరకు ఉన్నాయి. 2018 జాతర సందర్భంగా వీటిలో దాదాపు 4,000 బస్సులను మేడారం జాతరకు నడిపించేందుకు సిద్ధమని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ బస్సులు జనవరి 28 నుంచి నుంచి ఫిబ్రవరి 4 వరకు జాతర కోసం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఉమ్మడి పది జిల్లాల పరిధిలో నిత్యం తిరిగే బస్సుల సంఖ్య తగ్గిపోనుంది. ఇందుకనుగుణంగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కాజీపేట–సికింద్రాబాద్–నిజామాబాద్, సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా, కరీంనగర్–సిర్పూర్ కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్డు–డోర్నకల్–కాజీపేట, మహబూబ్‌నగర్–కాచిగూడ–కాజీపేట మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా మరికొన్ని రైళ్లను నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మహా జాతర
-
స్వయంపాలనను చాటే జాతర
యావత్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా జరిగే మహత్తర జాతర ఈ ఆదివాసీ జాతర. ఇంత పెద్ద ఆదివాసీ జాతర ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఆదివాసీలు, ఆదివాసీయేతరులు లక్షలాదిగా తరలివచ్చే ఎంతో ప్రకృతి రమణీయమైన జాతర. మేడారం జాతరలో విగ్రహ ఆరాధన ఉండదు. కేవలం ప్రకృతి ఆరాధన, పసుపు కుంకుమలు తప్ప మరే ఇతర ఆచా రాలు ఉండని జాతర మేడారం జాతర. ఏదో ఒక పేరుతో ఆదివాసీల్ని అడవినుండి వెళ్లగొ ట్టాలనే కుట్రలు మన పాలక ప్రభుత్వాల విధానాలుగా ఉన్నాయి. అందుకే ఆధ్యాత్మికతను జోడించి ప్రశ్నించే తత్వాన్ని పారదోలేందుకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీల రాగా లాపన ఈ మేడారం జాతరలో కనిపిస్తుంది. ఆదివాసీల ప్రాకృతిక ఆరాధనకు, ఆధిపత్య ప్రతిఘటనకు ప్రతీకగా ఈ మేడారం జాతర నిలుస్తుంది. ఆధిపత్య సంస్కృ తుల్ని సవాల్ చేస్తూ ప్రత్యామ్నాయ సంస్కృతుల్ని రూపొందిం చుకునే క్రమానికి స్థానికంగా ఆదివాసీ సమాజం ఎది గింది. అందువలనే ప్రకృతిని తప్ప మరో మనిషి ముందు సాగిలపడే సంస్కృతికి ఆదివాసీ సమాజంలో స్థానం లేదు. ఇక్కడ ఫ్యూడల్ మంత్రతంత్రాల ప్రసక్తి లేదు. నిర ర్థకమైన క్రతువులకు చోటు లేదు. అంతటా ప్రకృతికి, మానవ ప్రత్యామ్నాయానికి పెద్ద పీట వేయటం ఈ జాత రలో కనిపించే దృశ్యం. మరోవైపు మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించి, జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వాన్ని అధికారికంగా కోరింది. అదే గనుక జరిగితే ఆదివాసీల అస్తిత్వం అంతమవుతుంది. మేడారం జాతరపై పాలక వర్గాల ఒత్తిడి, ఆధిపత్యం ఎక్కువవుతుంది. ఆదివాసీలు జాతరకు దూరమవు తారు. గిరిజనేతరుల వలసలు, ఆధిపత్యం ఎక్కువై జాతర నిర్వహణ గిరిజనేతరుల చేతిలోకి, దేవాదాయ శాఖ చేతిలోకి పోతుంది. ఆదివాసీల పోరాట చరిత్ర కనుమరుగు అవుతుంది. ఆదివాసీల చట్టాలు, జీవోల రాజ్యాంగ రక్షణలు, భూములు ఎలాగో పోయాయి. ఆదివాసీల అస్తిత్వమైన మేడారం జాతరను సైతం ఆదివాసీలకు దూరం చేయా లని పాలకులు, గిరిజనేతరులు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా, ఆదివాసీలు కాక తీయులపై కత్తులు దూసి ఆదివాసీ స్వయంపాలన కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మల పోరాట వార సత్వాన్ని పుణికిపుచ్చుకొని మేడారం జాతరను కాపా డుకోవాలి. (జనవరి 25 నుండి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో జరుగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా) – వూకె రామకృష్ణ దొర ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు 98660 73866 -
తెలంగాణ కుంభమేళాకు ప్రభుత్వం ఏర్పాట్లు
-
వనదేవతల ఆశీస్సులతో జగన్ సీఎం కావాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం కావాలని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తు(72 కిలోలు) బంగారాన్ని మొక్కుగా చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని తల్లులను వేడుకున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో జాతర అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేసి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వైఎస్ సీఎం హోదాలో జరిగిన రెండు జాతరలకు హాజరయ్యారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతరకు హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డికి వనదేవతలపై ఎంతో నమ్మకం ఉందన్నారు. 2019లో ఏపీ సీఎం అయితే దర్శనం కోసం సమ్మక్క సన్నిధికి తీసుకుస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి నాడెం శాంతకుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ తదితరులున్నారు. -
తీరు మారలేదు..?
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల పనితీరు ఇంకా మారనేలేదు. సరిగ్గా నెలరోజుల క్రితం వివిధ విభాగాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆలయ పర్యవేక్షకుడు రాజేందర్ నివాసాలపై ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు సోదాలు చేసిన నిఘా విభాగం.. రాజన్న ఆలయ అధికారులు, ఇన్చార్జీల నుంచి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయినా, కొందరు ఉద్యోగులు దాందా సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. శుక్రవారం రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీనిని ఆసరా చేసుకున్న స్పెషల్ కోడెల టికెట్ కౌంటర్లోని సిబ్బంది.. కోడెల టికెట్లపై లడ్డూ ప్రసాదం ఇవ్వకుండా నొక్కేశారు. కేవలం టికెట్లు మాత్రమే భక్తుల చేతికి ఇచ్చి దందా సాగించారు. రూ.200 విలువైన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వాల్సి ఉన్నా.. ఆపని చేయకుండా సిబ్బంది తమ జేబులో వేసుకున్నారు. స్పెషల్ కోడె భక్తులకు టికెట్‌పై ఇచ్చే ఉచిత లడ్డూను కౌంటర్ సిబ్బంది రీసైక్లింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇండెంట్ ప్రకారం ప్రసాదాల గోదాం నుంచి స్పెషల్ టికెట్ల సంఖ్యకు అనుగుణంగా లడ్డూలు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రసాదాల విభాగానికి లడ్డూలు అందజేస్తారు. ఈక్రమంలో భక్తులకు ఇవ్వని ఉచిత లడ్డూ ఎక్కడికి వెళ్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమ్మక్క– సారలమ్మ జాతర సమీపిస్తోంది. ఈక్రమంలో రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని వెనువెంటనే తిరుగుపయనమవుతున్నారు. ఈక్రమంలో రూ.200 విలువైన స్పెషల్ కోడె టికెట్‌ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈటికెట్ ఇచ్చే కౌంటర్ ఒకచోట ఉంటే... టికెట్‌పై ఉచితంగా ఇచ్చే లడ్డూ ప్రసాదం కౌంటర్‌ను మరోచోట ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలియని భక్తులు.. లడ్డూ తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. అయితే రూ.100 కోడె టికెట్లు ఇచ్చిన చోటనే లడ్డూ ప్రసాదం అందించడం గమనార్హం. కొందరు భక్తులు మాత్రం ఇదేమిటని ప్రశ్నిస్తే.. ప్రచార శాఖలో లడ్డూలు ఇస్తున్నారని ఆ తర్వాత సిబ్బంది చెప్పడం గమనార్హం. జెల్ది ఇంటికి పోదామని రెండువందల రూపాయల కోడెల టికెట్టు దీసుకున్నం. దీనిమీద ఉచితంగా లడ్డూ ఇస్తమని రాసిండ్రు. దీనిగురించి కౌంటర్ల అడిగితే.. అక్కడిత్తరని, ఇక్కడిత్తరని జెప్పిం డ్రు. ఎక్కడ తిరిగినా లడ్డూ ఇయ్యలే. మాలాంటోళ్లను గిట్ల గోసవెట్టుడు మంచిదిగాదు. అధికారులు స్పందించి అందరికీ లడ్డూలు ఇప్పించాలె. – రామవ్వ, భక్తురాలు, నర్సంపేట ఇండెంట్ ప్రకారం లడ్డూలు మాకు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం కౌంటర్లకు లడ్డూలు అందజేస్తాం. అక్కడివారు వాటిని ఏం ఎలా పంపిణీ చేస్తున్నారో మాకు తెలియదు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు వేరు. మేం కేవలం లడ్డూలు అందిస్తాం. అయితే కోడెల టికెట్ ఇచ్చే కౌంటర్ వద్ద కాకుండా మరోచోట ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారట. అలాగే ప్రచారశాఖలోనూ లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. కానీ భక్తులకు ఇది అందుబాటులో లేదు. ఉన్నతాధికారులు దీనిపై చర్య తీసుకోవాలి. – రాజేశం, ప్రసాదాల గోదాం ఇన్చార్జి