
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ తొలుత తెలంగాణలోనే పర్యటించనున్నట్లు సమాచారం. జనవరి నుంచి రాహుల్ బహిరంగ సభలు ఉంటాయని, ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ఆయనను ఆహ్వానిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
త్వరలోనే పార్టీలో మార్పులు : సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువున్న నేపథ్యంలో పార్టీలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, మున్ముందు మరింతగా బలపడుతుందన్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment