ఇప్పటికే హస్తినలో భట్టి, ఉత్తమ్.. రుణమాఫీ కృతజ్ఞత సభకు కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. రైతు రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో వరంగల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే యోచనలో ఉన్న ఆయన, ఈ సభకు రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వనించనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌లతో కలసి ఆయన రాహుల్ గాందీని కలవనున్నట్టు తెలుస్తోంది. కాగా, డిప్యూటీ సీఎం భట్టి శనివారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శనివారం ఉదయం హస్తినకు చేరుకుని ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరూ ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కూడా ఆదివారం ఢిల్లీ వెళ్తారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment