loan waiver farmers
-
పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం!
ఆంధ్రప్రదేశ్‌లో మరో వంచన పర్వానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడులో వచ్చిన ఒక కథనం చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. ఆర్టీసీకి ఎన్నో సమస్యలున్నాయని చెప్పే ఈ కథనాన్ని బట్టి చూస్తే.. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇక అమలు జరగదనే అనిపిస్తుంది. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 25 హామీల్లో ఇది ప్రముఖమైంది. తెలంగాణలో ఎన్నికల హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడు నెలలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్ధానాల అమలుపై నానా రచ్చ చేసేవి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినా ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలూ పెట్టేవి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం.. ఇచ్చిన ఆరంటే ఆరు హామీలకూ మంగళం పాడుతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెగలడం లేదు. పైపెచ్చూ జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చలేకపోతున్నారన్న కలరింగ్ ఒకటి! ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు అనకుండా.. వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య ఫించన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టారు. ఇస్తామన్న మూడూ ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి సంగతేమిటి? రాష్ట్రం పరిస్థితి చూస్తూంటే భయమేస్తోందని అనడంతోనే చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చమీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతోంది కదా?ఎన్నికలకు ముందు... జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయికి పోయారు. మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. తీరా అధికారం చేతికొచ్చిన తరువాత చేసిందేమిటి? జగన్ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రూ.70 వేల కోట్ల అప్పూ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో రూ.15 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతింత అప్పులెందుకు అని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు బాబుగారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్ ప్రయాణం హామీకి మంగళం పలకడమో, తూతూ మంత్రంగా అమలు చేయడమో చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉప సంఘం, ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్ స్కీమ్ అమలుకు 2000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు మరో 11500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పైగా పెరుగుతుందని. ఆర్టీసికి నెలకు రూ.ఆరు కోట్ల నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు! అన్ని కలిపి ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్లు, ఏటా రూ.2400 కోట్లూ నష్టమని లెక్కకట్టారు.ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తరువాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అదనపు సిబ్బంది పేరు చెప్పి.. వీరి నియామకానికి సమయం పడుతుందని.. వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తోందన్నమాట. అయితే.. రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే.. గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు.. అదనపు సిబ్బంది నియామకమూ జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగొట్టడానికే అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలుకు ఏటా రూ.1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినా టీడీపీ తమకు అనుభవముందని చెప్పేవాళ్లు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట! అప్పట్లో బాబు తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తానని పదే, పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికెట్ల పేరుతో ఆఫీస్‌ల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం రూ.15 వేల కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. ఈ సారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్ హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా, గతంలో రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నాలుగో విడత రుణమాఫీకి మరో రూ. 2,747.67 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచి్చన రూ. 2 లక్షల రుణమాఫీ హామీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది. ఇప్పటివరకు మూడు విడతల్లో 22.37 లక్షల మంది రైతుల రుణాల కింద రూ. 17,933 కోట్లు బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం, శనివారం పాలమూరు వేదికగా నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెక్కును రైతులకు అందజేశారు. తద్వారా ఇప్పటివరకు రూ.20.68 వేల కోట్లు రుణమాఫీ కింద బ్యాంకులకు విడుదల చేసినట్లయింది. శనివారం పాలమూరులో ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని 3,13,897 మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. తద్వారా నాలుగు విడతల్లో రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరిగినట్టు. భవిష్యత్తులో రూ.2 లక్షలపైన ఉన్నవారికి.. రూ. 2 లక్షలపైన రుణాలు పొందిన రైతులకు కూడా రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గతంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే రూ. 2 లక్షలపైన ఉన్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి ఈ రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులు లెక్కలు తీశారు. శనివారం సీఎం ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని రేషన్‌కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు, పేర్లలో తప్పులు దొర్లిన 3,13,897 మంది రైతుల రుణ ఖాతాలకు జమచేస్తారు. తరువాత రూ. 2లక్షల పైన అప్పులున్న రైతులకు జమచేయాల్సి ఉంది. -
12 వేల మంది రైతులేరీ?
సాక్షి, వరంగల్: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందాలన్న ఉద్దేశంతో చేపట్టిన కుటుంబ నిర్ధారణ ప్రక్రియ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ఇందుకు అనేకమంది రైతులు స్థానికంగా లేకపోవడం ఒక కారణం. మరణించిన రైతు పేరుపై రుణమాఫీ ఉండడంతో సదరు మరణ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డుతో సరిపోకపోవడం, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ముందుకు రాకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 12 వేల మంది రైతుల కుటుంబ నిర్ధారణ కాలేదని సమాచారం. కాగా మొత్తం 48,297 కుటుంబాలకు.. ఇప్పటి వరకు 36,279 కుటుంబాల నిర్ధారణ జరిగింది. ఈ వివరాలను ఆయా రైతుల కుటుంబాలతో సెల్ఫీ ఫొటోలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో.. నిర్ధారణ కాని 12 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తించదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చేసిన ఈ సర్వేతో.. చాలామంది సమయానికి రాలేక రుణమాఫీకి దూరమవుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో 2.63 లక్షల మందికి రూ.2,312 కోట్ల రుణమాఫీ చేయడం తెలిసిందే. ఏ జిల్లాలో ఎంత మంది రైతులు..వరంగల్ జిల్లాలో 8,252 మంది రైతులకు 6,263 మంది, హనుమకొండలో 8,359 మంది రైతులకు 6,934 మంది, జనగామలో 9,947 మంది రైతులకు 7,762 మంది, మహబూబాబాద్‌లో 10,937 మంది రైతులకు 6,652 మంది, భూపాలపల్లిలో 5,815 మంది రైతులకు 4,713 మంది, ములుగు జిల్లాలో 4,987 మంది రైతులకు 3,955 రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తంగా దాదాపు 12 వేల మంది రైతుల వివరాలు నమోదు కాలేదు. రుణమాఫీకి అర్హులైనా రేషన్ కార్డు లేకపోవడంతో అనేకమందికి రుణమాఫీ వర్తించలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన కుటుంబాల నిర్ధారణ చేపట్టినట్టు వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి పంచాయతీ, రైతు వేదికల్లో రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల నిర్ధారణ చేపట్టామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరితో సెల్ఫీ తీసుకొని ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సమయంలోనే స్థానికంగా ఉండకపోవడం, ఆధార్ కార్డు సమస్యలు, కొందరు విదేశాల్లో ఉండడం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు నిర్ధారణకు దూరంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే కుటుంబ నిర్ధారణ జరిగిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము ఎప్పుడు వేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. -
రుణమాఫీపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతోపాటు మొత్తం దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 లక్షల పంట రుణాలను విజయవంతంగా మాఫీ చేసినట్టు మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని ఎండగడుతూ హరీశ్‌రావు ఆదివారం బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించే విధానాలను అనుసరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. లేఖలో ఏముందంటే.... ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాఫీ గడువును ఈ ఏడాది ఆగస్టు 15 వరకు పెంచింది. కానీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని సీఎం రేవంత్ చేసిన ప్రకటన పూర్తి అబద్ధమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రూ.లక్ష లోపు రుణం 2.99 లక్షల మందికి, రూ.లక్షన్నర లోపు 1.30లక్షల మందికి, రూ.2లక్షల వరకు 65,231 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. ఎస్బీఐ సమాచారం ప్రకారం 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. ఇతర బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. రూ.2లక్షలకు పైబడి చెల్లించినా... రూ.2 లక్షలకు పైగా రుణం ఉంటే రైతులు పైబడిన మొత్తాన్ని చెల్లిస్తే రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని హామీ ఇచ్చింది. రైతులు ఈ మొత్తాన్ని చెల్లించినా రుణమాఫీ జరగలేని ఎస్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు చాలా మంది రైతులు సీఎం మాటను నమ్మి పంట రుణమాఫీకి అర్హత కోసం ప్రైవేట్ రుణాలు అధిక వడ్డీకి తీసుకున్నారు. అయితే రుణమాఫీకి ప్రభుత్వం 31 రకాల షరతులు పెట్టి రైతులను అనర్హులుగా చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు ద్వారా రూ.72వేల కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దసరా ఇది. ఈ ఖరీఫ్ పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఇప్పటికీ ఇవ్వలేదు’అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఎస్బీఐ ఇచి్చన వివరాలు, రూ.2 లక్షలకు మించిన రుణాన్ని చెల్లించిన రైతుల బ్యాంకు రశీదులను లేఖకు జత చేశారు. కాంగ్రెస్ మోసాలను అలయ్ బలయ్‌లో చర్చించండి దసరాకు గ్రామాలకు వస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులతో అలయ్ బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి చర్చించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును పక్కన పెట్టడంతోపాటు వృద్ధులకు ఆసరా పెన్షన్ కూడా పెంచలేదన్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయిందని, ధాన్యం బోనస్ బోగస్‌గా మారిందని చెప్పారు. ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతికి అతీగతీ లేదన్నారు. -
27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగానికి రూ. 2లక్షల రుణమాఫీ ప్రక్రియను మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ లో ఆ వివరాలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు మాఫీ చేయలేదని, ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దంటూ వ్యా ఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ లేఖను ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ హామీ అంటే బంగారు హామీ అని తెలంగాణ రైతులు నమ్మారని, అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రుణమాఫీ చేసి దేశానికి కొత్త పంథా చూపెట్టామని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ అభివృద్ధికి భవిష్యత్‌లో కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. లేఖలో ఏం రాశారంటే...!ప్రధాని మోదీకి రాసిన లేఖలో మూడు దఫాలు గా రైతు రుణమాఫీని తెలంగాణలో అమలు పరిచిన తీరును సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది జూలై 18న రూ.లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి 11,34,412 రైతు ఖాతాల్లో రూ. 6,034.97 కోట్లు జమ చేశామని, జూలై 30న రూ.1.50 లక్షలలోపు మాఫీ కోసం 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేశామని, ఆగస్టు 15వ తేదీన రూ.2లక్షల వరకు మాఫీ కోసం 4,46,832 మంది ఖాతాల్లో రూ. 5,644.24 కోట్లు జమ చేశామని వెల్లడించారు.మొత్తం కేవలం 27 రోజుల వ్యవధిలో రూ.17,869.22 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు ఆ ఎక్కువ ఉన్న రుణాన్ని బ్యాంకుల్లో కడితే రూ. 2 లక్షలు ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని, ఈ ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూ ర్తి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లో పారదర్శకత కోసం అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని, అప్పు ల ఊబి నుంచి రైతులను విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వెల్లడించారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
ఒక్కసారే ఎక్కువ.. రెండోసారి పగటి కలే..
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుడే ఎక్కువ.. రెండుసార్లు గెలుస్తారని అనడం పగటి కలలు కనడమే’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గెలిí³స్తే ఐదేళ్లలోపు ప్రభుత్వాలు పోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ‘అదృష్టం బాగుంటే ఐదేళ్లు ఉంటావు.మంచిగా ప్రవర్తించు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది. రెండుసార్లు అధికారంలో ఉంటానని పగటి కలలు కనకు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ తీస్తున్నావు. సీఎం కుర్చీ గౌరవం తగ్గిస్తున్నావు. రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఒకటి వర్షాలతో వచ్చిన వరద అయితే...రెండోది చిల్లర ముఖ్యమంత్రి అబద్ధాల వరద. మోరీల కంపును మించిపోయింది ముఖ్యమంత్రి నోటి కంపు. ప్రభుత్వంలో ఉన్నాననే సోయి..ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నా అనే ఇంగితం లేక మాట్లాడుతున్నాడు.పదే పదే నా పొడుగును గురించి దుర్భాషలాడుతున్నావు. నేను పొడుగే. తెలంగాణ ఉద్యమం నన్ను మరింత ఎత్తుకు చేర్చింది. నీ బుద్ధి కురుచ. నీ చరిత్ర కురుచ. నీ భాష కురుచ. నీ కురుచతనం వల్ల నీకు కలిగిన ఆత్మనూన్యత వల్ల పదేపదే నా పొడుగు గురించి మాట్లాడుతున్నావు. నేను తాటి చెట్టంత ఎదిగిన. నువ్వు వెంపలి చెట్టంత కూడా ఎదగలే. నిన్ను లిల్లీపుట్ అని నేను అనలేనా. సన్నాసి అని నేను అనలేనా.. నా ఎత్తు ఎంత ఉంటే ఎందుకు. ఇప్పటికీ 20 సార్లు మాట్లాడివ్ నా ఎత్తు గురించి’అని తీవ్రస్థాయిలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు.రుణమాఫీ ఎక్కడ అయిందో చెప్పు...‘రుణమాఫీ పూర్తి చేశా అని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అబద్ధాలు చెప్పినవ్. రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తావా? కొండారెడ్డిపల్లి చౌరస్తా లేదా మా సిద్దిపేట వెంకటాపురం పోదామా? వెంకటాపురం గ్రామంలో 122 మంది ఉంటే.. 82 మందికి కాలేదు. రుణమాఫీ విషయంలో సీఎంకు, వ్యవసాయశాఖ మంత్రి మాటల మధ్య తేడాలున్నాయి. రెండు లక్షలపైన మిత్తి ఉంటే కట్టిన వాళ్ల లిస్ట్ పంపుతున్నానని, దమ్ముంటే వాళ్లకు మాఫీ చెయ్యి అని ఆ వివరాలు హరీశ్‌రావు వెల్లడించారు. -
మాకెప్పుడు మాఫీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఫిర్యాదులు తీసుకుంటున్నా, గ్రామాల్లో సర్వే చేస్తున్నా తమకు న్యాయం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదనీ ప్రభుత్వం చెబుతూ సర్వే చేస్తున్నç³్పటికీ.. వారికి ఎప్పుడు రుణమాఫీ జరుగుతుందో స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకెందుకు రుణమాఫీ జరగడం లేదని వ్యవసాయశాఖ అధికారులను నిలదీస్తున్నారు. సురేందర్‌రెడ్డి అనే 52 ఏళ్ల రైతు తనకు రుణమాఫీ కాలేదనే ఆవేదనతో శుక్రవారం మేడ్చల్ వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. మాఫీకి దూరంగా లక్షలాది మంది గత ఆర్థిక సంవత్సరం (2023–24) మార్చి 31 నాటికి బ్యాంకులు రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. ఇందులో డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్ల వరకు అవసరమని మొదట్లో కాంగ్రెస్ సర్కారు ప్రాథమిక అంచనా వేసింది. అనంతరం రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయంటూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తీరా బడ్జెట్ కేటాయింపుల్లో దాన్ని రూ.26 వేల కోట్లకు కుదించారు.చివరికు మూడు విడతల్లో రుణమాఫీకి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే కావడంతో లక్షలాది మంది రుణమాఫీకి దూరమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష మాఫీకి 36.68 లక్షల రైతులు అర్హులు కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే ఉండటం విస్మయం కలిగించే అంశం. కాగా రూ.లక్ష రుణమాఫీతో పోల్చితే రూ.2 లక్షల మాఫీలో రైతుల సంఖ్య ఏకంగా 14.31 లక్షలు తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. లక్షలాది మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రైతుల వివరాల సేకరణ పూర్తయ్యేదెప్పుడు?రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, ఇతర సాంకేతిక కారణాలతో రూ.2 లక్షల వరకు మాఫీకాని రైతుల కుటుంబస భ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో సర్వే చేపట్టారు. బ్యాంకు డేటా ఆధారంగా 4.5 లక్షల మంది రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షన్నర మంది రైతుల వివరాలను గుర్తించినట్లు చెబుతున్నారు. సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల ఆధార్ నంబర్లు, వారి వయస్సులు, ఇతర వివరాలు సేకరించడంతో పాటు కుటుంబ పెద్దతో ఫొటో తీయాల్సి ఉంది.వారి సెల్ఫీ ఫొటోలను, రైతులు ఇచ్చిన అఫిడవిట్లను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వరదలు, వర్షాల కారణంగా ఈ ప్రక్రియ చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల సేకరణ ఎప్పుడు పూర్తి అవుతుందో, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అంతుబట్టడం లేదనే నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత ఐదేళ్ల కాలంలో కుటుంబ పెద్ద చనిపోయిన రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి రుణమాఫీ కాలేదని అనేకచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాట్లో ఎలాంటి కాలమ్ లేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. అదనపు మొత్తంపై మార్గదర్శకాలెప్పుడు?ప్రస్తుతం రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపై ఒక్క రూపాయి అదనంగా రుణం తీసుకుని ఉన్నా మాఫీ వర్తింపజేయలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణం సొమ్మును రైతులు చెల్లించాకే ప్రభుత్వం నుంచి సొమ్ము జమ అవుతుందని అంటున్నారు. అయితే ఇందుకు వ్యవసాయాధికారులు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే అదనపు మొత్తం చెల్లించి అధికారులను సంప్రదించారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని చెబుతున్న అధికారులు, కనీసం అవి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.రుణమాఫీ కాలేదని..మేడ్చల్‌లో దుబ్బాక రైతు ఆత్మహత్యబ్యాంకులో తల్లి, కుమారుడికి వేర్వేరుగా పంట రుణాలుఒకే రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లూ ఉండటం, ఇద్దరి రుణాలూ కలిపి రూ.3 లక్షలకు పైగా ఉండటంతో జరగని రుణమాఫీమనస్తాపంతో వ్యవసాయ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణంమేడ్చల్/దుబ్బాక రూరల్: రుణమాఫీ కాలేదని మనో వేదనకు గురైన ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్బర్పేటభూంపల్లి మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట సురేందర్‌రెడ్డి (52) మేడ్చల్ హౌసింగ్ బోర్డు కాలనీలో భార్య మంజుల, కుమారుడు నితిన్రెడ్డితో కలిసి నివాసముంటున్నాడు. కండ్లకోయలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డికి చిట్టాపూర్‌లో ఆయన పేరుపై 4.5 ఎకరాల భూమి, తల్లి సుశీల పేరిట రెండు ఎకరాల భూమి ఉంది. ఇద్దరూ చిట్టాపూర్‌లోని ఆంధ్రప్రదేశ్æ గ్రామీణ వికాస బ్యాంకులో 2012లో పంట రుణం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ రాగా ప్రస్తుతం సుశీల పేరిట రూ.1,15,662, సురేందర్‌రెడ్డి పేరిట రూ.1,92,440 పంట రుణం ఉంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. కాగా సురేందర్‌రెడ్డి, సుశీల ఇద్దరి రుణాలూ కలిపి రూ.3,08,102 ఉండటంతో వారి రుణాలు మాఫీ కాలేదు. దీంతో సురేందర్‌రెడ్డి పలుమార్లు బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారులను సంప్రదించాడు. తనకు మాఫీ ఎందుకు కాలేదని వారిని అడగగా.. తల్లి, కుమారుడి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉన్నాయని, రుణం రూ.3 లక్షల పైచిలుకు ఉండటం వల్ల మాఫీ కాలేదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం రేషన్ కార్డుకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేసిందని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇద్దరికీ వేర్వేరు రేషన్‌కార్డులు ఉండి ఉంటే మాఫీ అయ్యేదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయమై పలుమార్లు తన సోదరుడు రవీందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రేషన్‌కార్డు నుంచి తల్లి పేరు తొలగించేందుకు దరఖాస్తు కూడా చేశాడు. సురేందర్‌రెడ్డికి గతంలోనూ రుణమాఫీ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసమని ఇంట్లో నుండి వెళ్లిన సురేందర్‌రెడ్డి మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేçహాన్ని నగరంలోని గాంధీ మార్చురీకి తరలించారు.రెండురకాల సూసైడ్ నోట్లుమృతుడి జేబులో నుంచి పోలీసులు రెండు రకాల సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం (ఎస్బీఐ)లోంచి వచ్చే స్లిప్పులపై ఇవి రాసి ఉన్నాయి. ఒక దానిపై ‘నా చావుకు కారణం నా అమ్మ’ అని రెండు సార్లు, మరో పత్రంపై ‘చిట్టాపూర్ బ్యాంకులో లోన్ మాఫీ కాలేదని, అందుకే నా ఆత్మహత్య’ అని రాసి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు సురేందర్ రెడ్డి బ్యాంకు రుణం రూ.192440, తల్లి సుశీల బ్యాంకు రుణం రూ.115662 ఇద్దరిది కలిపి మొత్తం రూ.308102రైతు రుణమాఫీ కాని కుటుంబాల వివరాలు నమోదురామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శుక్రవారం రుణమాఫీ కాని రైతు కుటుంబాల ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న రామన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు వందల సంఖ్యలో ఉదయం 10 గంటలకే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రైతులు రెండుగంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మూడు ఫోన్ల ద్వారా వివరాలను అప్లోడ్ చేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లది హైడ్రామా
లింగోజిగూడ: ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్తో కలిసి డ్రామాకు తెరలేపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజేపీ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 3 నుంచి చేపట్టనున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా అర్బన్ సభ్యత్వ శిక్షణా తరగతులను శుక్రవారం నాగోల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కవిత తరఫున వాదించి ఆమెకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీయేనని అందరికీ తెలుసన్నారు. అందుకే తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి పోటీ చేస్తే 38 ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ కనీసం నామినేషన్ కూడా వేయ లేదని పేర్కొన్నారు. త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు. 2019లో నార్త్ బ్లాక్‌లోకి వెళ్లలేకపోయా.. ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాబీజేపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని బండి సంజయ్ అన్నారు. 2019లో నార్త్ బ్లాక్‌లోకి వెళ్లలేక బయటి నుంచే సెల్ఫీ తీసుకున్న తాను... ఇప్పుడు అదే నార్త్ బ్లాక్‌లో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నానని చెప్పారు. 2028 రాష్ట్రంలో బీజీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కొత్త రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా ‘హైడ్రా’
సాక్షి, హైదరాబాద్: ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నా, రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. డైవర్షన్ పాలిటిక్స్‌తో మైండ్‌గేమ్ ఆడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ‘హైడ్రా’పేరుతో డ్రామా నడుపుతోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా రాజకీయ కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు.తెలంగాణ ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేలా రాజకీయం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే ఇబ్బంది పెడతాం.. అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని మండిపడ్డారు. పటాన్చెరు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారని, రూ.300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారని అన్నారు. కాంగ్రెస్ కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కిందని, ఇప్పుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా ఇబ్బందిపెట్టేలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని, ఆయన భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారని విమర్శించారు. అధికారం ఉందని రాత్రికి రాత్రే కూల్చడాలు సరికాదన్నారు. రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దవద్దని పేర్కొన్నారు. మంత్రులు రుణమాఫీపై కుంటిసాకులు చెపుతున్నారని, రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయమంటే స్పందించడం లేదని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో రూ.65 వేల కోట్ల అప్పు చేసిందని, అంటే నెలకు రూ.8,125 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో చేయబోయే అప్పు రూ.4.87 లక్షల కోట్లు అని లెక్కించారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలలో రూ.4,26,000 కోట్ల అప్పు మాత్రమే చేసిందన్నారు. -
రుణమాఫీపై చర్చకు సిద్ధమా?
జనగామ: కాంగ్రెస్ తొలుత రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ చేసినట్టు భావిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి తనతో చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా పోలీస్ కంట్రోల్ రూం ఏరియాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్నారు.ఎక్కడైనా తేదీ ఖరారు చేసి కబురు పంపిస్తే జనగామ ఎమ్మెల్యే పల్లాను వెంట బెట్టుకుని వస్తామని.. ఆ దమ్ము, ధైర్యం సీఎంకు ఉందా? అని హరీశ్ అన్నారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న, వరంగల్‌కు వెళ్లి భద్రకాళి, ములుగు సభలో సమ్మక్క, సారలక్క, భువనగిరికి వెళ్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామిపై.. ఇలా ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో పంట రుణమాఫీపై ఒట్టు వేసిన రేవంత్.. ఎలక్షన్లు ముగియగానే దైవ ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్, క్యామ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌ను క్షమించాలని యాదాద్రి స్వామిని ప్రార్థించా: హరీష్ రావు
సాక్షి, యాదాద్రి: ఎన్ని కేసులు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రపంచం తలకిందులు అయినా ఆగష్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్.. మాట తప్పారని విమర్శించారు. రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ హరీష్ రావు ఆలయాల పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని ఆరోపించారు. పాలకుడు మాట తప్పితే తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు చేసినట్లు తెలిపారు.‘రైతులనే కాదు దేవుడిని రేవంత్ మోసం చేశాడు. కేసీఆర్ ఆదేశిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. పార్టీ మారిన చరిత్ర నీది. రేవంత్ రుణమాఫీ అయింది అంటున్నాడు. మంత్రులు కాలేదని అంటున్నారు. ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల రుణమాఫీ పూర్తిగా కాలేదని అంటున్నారు. 42 లక్షల మందిలో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది. 46 శాతం మాత్రమే రుణమాఫీ పూర్తి అయ్యింది. దేవుళ్లపై ప్రమాణం చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్‌ది.బహిరంగంగా రేవంత్ క్షమాపణ చెప్పాలి. దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మొఖం చూసి రేవంత్ ను క్షమించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించా. బోనస్ ఇస్తామని మోసం చేశాడు. రైతులు, అన్ని వర్గాల పక్షాన పోరాడే శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరాం. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మూడు వందల రోజులు వచ్చినా అమలు కాలేదు. ఎంత మందికి రుణమాఫీ చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలి. రైతు భరోసా కింద 7500 కోట్లు గతంలో కేసీఆర్ ఇచ్చేవారు. అవెప్పుడు ఇస్తావు? స్పీకర్, ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి చిన్న చిన్న ఉద్యోగులకు ఎందుకు కోత పెడుతున్నావు? రేవంత్ ఏ చోట ప్రమాణం చేశాడో అన్ని చోట్లకు పోతాం. రేవంత్ దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలి. కాంగ్రెస్ మంత్రులు వెరైటీగా ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయమంటే నన్ను రాజీనామా చేయమంటున్నారుకాంగ్రెస్ ప్రజా పాలనలో ధర్నాలు నిషేదం అంటూ రైతులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. జర్నలిస్ట్ సరితపై రేవంత్ అనుచరులు దాడి చేశారు. ఆదిలాబాదులో పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారు. వీటన్బింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. లాఠీలతో మోసాన్ని అడ్డుకోలేరు. రుణమాఫీ చేస్తామని రైతులతో రైతులతో రణం చేస్తున్నాడు. రుణమాఫీ కాలేదంటే రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నావు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమా?’ అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. -
12 ఏళ్ల క్రితం చనిపోయిన రైతుకు రుణమాఫీ!
నేలకొండపల్లి: ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ తమకు అమలు కాలేదని ఒకవైపు అనేక మంది రైతులు ఆందోళనచేస్తుంటే, మరో వైపు ఎప్పుడో మృతి చెందిన రైతు పేరు రుణమాఫీ జాబితాలో వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంకు చెందిన తుళ్లూరి వెంకయ్య 12 సంవత్సరాల కిందటే మృతి చెందారు. ఆయనకు టేకులపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో ఖాతా ఉండగా.. ఆయన కానీ, ఆయన చనిపోయాక కుటుంబీకులు కానీ రుణం తీసుకోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన రుణ మాఫీ జాబితాలో వెంకయ్య పేరు వచ్చింది. ఈ విషయమై వెంకయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ తండ్రి కానీ, తాము కానీ ఏనాడు బ్యాంక్‌లో రుణం తీసుకోలేదని.. ఇప్పుడు రుణమాఫీ జాబితాలో పేరు ఎలా వచ్చిందో తెలియదని వెల్లడించారు. -
రవ్వంత చేసి కొండంత డబ్బా
హైదరాబాద్, సాక్షి: రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, అందుకు మంత్రుల మాటలే సాక్ష్యం అని చెబుతూ.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులకు టోపీ పెట్టారు. రుణమాఫీ పచ్చి బూటకమనేది అర్థమవుతోంది. రవ్వంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో వాళ్లలో వాళ్లకే సమన్వయం లేనట్లుంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అందుకే.. అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది. తెలంగాణ రైతాంగం రగిలిపోతోంది. రైతులకు ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతాం అని కేటీఆర్ అన్నారు. -
‘రుణమాఫీ’ని పక్కదోవ పట్టించేందుకే విలీన డ్రామాలు
సాక్షి, హైదరాబాద్ / సుల్తాన్‌బజార్: రుణమాఫీ సహా ఆరు గ్యారంటీల అమలు అంశాన్ని పక్క దోవ పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విలీన డ్రామాలు మొదలు పె ట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకే అవసరం ఉంది తప్ప బీజేపీకి కాదని అన్నారు. అవుట్ డేటెడ్, అవినీతి పార్టీ అయిన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవలసిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఆదివారం కోఠిలోని ది యంగ్మ్యాన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలసి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ‘విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి.. వాటితో ప్రజలకేం సంబంధం?’అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు.ఎన్నికల్లో రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో కేవలం రూ. 26 వేల కోట్లు కేటాయించారని, చివరకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తారని సంజయ్ నిలదీశారు. కాగా, ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంపై కుట్రలు చేస్తున్నాయని వాటిని ప్రధాని మోదీ సమర్థంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. గురుకుల ఉద్యోగాల్లో మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయండితెలంగాణ రెసిడెన్షియల్ విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
రేవంత్ తదుపరి మజిలీ బీజేపీయే!
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి పల్లెత్తు మాట అనడం లేదు. అంతేకాదు తన రాజకీయ ప్రస్థానం బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో కాషాయ జెండాతోనే ప్రారంభమైందని మోదీకి రేవంత్ చెప్పారు. బీజేపీ కాషాయ జెండా కప్పుకుని చనిపోవాలన్నదే తన కోరిక అని కూడా మోదీకి రేవంత్ చెప్పినట్లు మాకు సమాచారం.ప్రధానితో ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో రేవంత్ వెల్లడించాలి. రేవంత్ తదుపరి మజిలీ బీజేపీయే..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ రేవంత్ తమకు పదవులు కూడా పంచుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే తన బృందంతో కలిసి రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు.రుణమాఫీ వైఫల్యాలపై గ్రామాలకు..: ‘‘రాష్ట్రంలో రైతు రుణ మాఫీ డొల్ల. వంద శాతం రైతు రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ చెప్తుంటే.. మరోవైపు రుణమాఫీ కాని వారికోసం ప్రత్యేక కౌంటర్లు పెడతామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీ కాని రైతుల వివరాలను గ్రామస్థాయి నుంచి సేకరించి రాష్ట్ర ప్రభుత్వా నికి అందిస్తాం..’’ అని కేటీఆర్ చెప్పారు. సోమవారం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల వారీగా ప్రతీ గడపకు వెళ్లి వివరాలు సేకరిస్తాయన్నారు.రైతు పేరు, కుటుంబ వివరాలు, తీసు కున్న రుణం, బ్యాంకు పేరు తదితర వివరాలతో ఒక ప్రొఫార్మా తయా రు చేసి కార్యకర్తలకు ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు లేదా నియో జకవర్గ ఇన్చార్జులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారని వివరించారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాకా ఈ వివరాలను అందజేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతా మని... మాఫీ చేయని పక్షంలో గ్రామస్థాయి నుంచీ ప్రత్యక్ష నిర సన కార్యక్రమాలతో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ దాడులు: సర్కారు రుణమా ఫీలో విఫలం కావడంతో దాని నుంచి దృష్టి మళ్లించేలా కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగుతోందని కేటీఆర్ ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ ఆఫీసుపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కమలాసన్‌రెడ్డి వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులపై సీఎం సొంత మీడియా దాడి చేస్తుంటే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం రేవంత్, ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారని ఆరోపించారు.24న మహిళా కమిషన్ ముందుకు..: మహిళా కమిషన్ ముందు హాజరుకావాలంటూ తనకు నోటీసులు అందాయని కేటీఆర్ ధ్రువీకరించారు. 24న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు తాను స్వయంగా హాజరై 8 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన దురాగతాల వివరాలను అందజేస్తానని చె ప్పారు. కొల్లాపూర్, షాద్‌నగర్ తదితర చోట్ల మహిళలపై జరిగిన దాడులు, అఘా యిత్యాలను గుర్తుచేస్తానని తెలిపారు. అసెంబ్లీ లో మహిళా ఎమ్మెల్యేలను సీఎం దూషించినా ఆయ నపై చర్యలు లేవని చెప్పారు. ఆర్టీసీలో మహిళల ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పానని గుర్తు చేశారు.రుణం తీరలే.. రైతు బతుకు మారలే‘సాక్షి’ కథనాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్ట్సాక్షి, హైదరాబాద్: ‘‘రైతు రుణం తీరలేదు, రైతు బతుకు మా రలేదు. ఒకే విడతలో రూ. రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రభుత్వా న్ని ప్రశి్నస్తే కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తూ.. నిలదీస్తే బెదిరింపులకు దిగుతోంది. అయినా తగ్గేదే లేదు. నిగ్గదీసి అడుగు తాం, నిజాలే చెబుతాం. కాంగ్రెస్ డొల్లమాటల గుట్టు విప్పుతూనే ఉంటాం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు.‘రుణం తీరలే’ శీర్షికన సాక్షి ప్రధాన సంచికలో శనివారం ప్రచురితమైన కథనాన్ని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘రైతు రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో లెక్కవేశారు. కానీ కేబినెట్ సమావేశంలో రూ.31 వేల కోట్లు అని చెప్పి, బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ మూడు విడతల్లో రుణమాఫీ కింద రైతులకు ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే’’ అని పేర్కొన్నారు. -
రుణమాఫీపై తెలంగాణ సీఎంవో కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రుణమాఫీ వర్తించే రైతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రూ. 2 లక్షల లోపు రుణాలుండీ ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి.. అందుకు కారణం తెలుసుకోవాలని కోరింది. తద్వారా త్వరగతిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. రూ.2 లక్షల లోపు రుణమున్నప్పటికీ, మాఫీ కాని రైతులెవరైనా ఉంటే ఆ బ్యాంకు బ్రాంచీ ఉన్న మండలం వ్యవసాయ అధికారిని (MAO) కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్ లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణ మాఫీ వర్తించిందా? లేదంటే వర్తించకపోవడానికి కారణమేమిటో ఉంటుంది. ఉదాహరణకు.. ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏవోకు అందించాలి. ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్‌తో పాటు, ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈవోకు అందించాలి. వాటిని పోర్టల్‌లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ.. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే.. ఎంఈవో క్షేత్రస్తాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకోని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆధార్ లో, బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిపోలకపోతే, రైతులు సరైన పేరున్న అప్ డేటేడ్ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది అని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. -
రేపు మూడో విడత రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మూడో విడత కింద గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ నెల 2వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. గతనెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. కాగా అధికారంలోకి వచి్చన తర్వాత 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది.ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత రుణమాఫీ చేయనుంది. అయితే రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు.. ఆ అదనపు మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఆ అదనపు మొత్తాలను చెల్లించారు? ఇంకా ఎంతమంది చెల్లించాల్సి ఉంది? చెల్లించని వారికి ఇప్పుడు రుణమాఫీ కాకపోతే తర్వాత చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
16 మంది పీఏసీఎస్‌ల కార్యదర్శులపై వేటు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌లు) కార్యదర్శులపై.. రాష్ట్ర సహకార శాఖ చర్యలు చేపడుతోంది. పంట రుణాల మంజూరు, వాటి రెన్యువల్‌కు సంబంధించిన సమాచారాన్ని అసంబద్ధంగా పంపారనే కారణంతో 16 మంది పీఏసీఎస్‌ల కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందులో 11 పీఏసీఎస్‌లు వాణిజ్య బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొనసాగు తుండగా, మిగతా 5 పీఏసీఎస్‌లు డీసీసీబీ ఆర్థిక సాయంతో కొనసాగు తున్నాయి. మరో 13 పీఏసీఎస్‌ల కార్యదర్శులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సహకార శాఖ డైరెక్టరేట్.. వారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. అదేవిధంగా మరో 92 పీఏసీఎస్‌లకు సంబంధించి కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తక్షణమే స్పందించాలని ఆదేశించింది. బకాయిలు, వడ్డీ లెక్కల్లో తప్పులు!రాష్ట్ర వ్యాప్తంగా 105 పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. పంట రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్యలో రుణాలు పొందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే 16 పీఏసీఎస్‌లు నిర్ణీత వ్యవధి మధ్యలో లేని వారిని కూడా పంట రుణమాఫీకి అర్హులుగా గుర్తించి పంపినట్లు వెల్లడైంది. పలు పీఏసీఎస్‌ల్లో రైతుల రుణ బకాయిలు, వడ్డీ లెక్కించడంలో పెద్ద ఎత్తున పొరపాట్లు దొర్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సహకార శాఖ ఉన్నతాధికారులు ఆయా పీఏసీఎస్‌ల కార్యదర్శుల సంజాయిషీ కోరారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా సహకార అధికారులను సహకార శాఖ డైరెక్టరేట్ ఆదేశించింది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాలని, పీఏసీఎస్‌ల కార్యదర్శులను సహకార శాఖ రిజిస్ట్రార్ ఆదేశించారు. -
రుణమాఫీ.. కోతలే!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీలో భారీగా కోతలు పడ్డాయి. ఈసారి మూడు విడతల రుణ మాఫీలో మొత్తం రైతు కుటుంబాల సంఖ్య 35,49,870 కాగా, వారికి మాఫీ చేస్తున్న సొమ్ము రూ. 24,449 కోట్లు అని వ్యవసాయశాఖ వర్గాలు తేల్చాయి. మొదటి విడతలో 11,34,412 మంది రైతు కుటుంబాలకు రూ.6,034 కోట్లు ఇచ్చారు. ఇక మంగళవారం రెండో విడతలో 6,40,223 మంది రైతు కుటుంబాలకు రూ. 6,190 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఇక మూడో విడతకు సంబంధించి వ్యవసాయశాఖ వర్గాల లెక్క ప్రకారం 17,75,235 మంది రైతు కుటుంబాలకు రూ.12,225 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2018లో ప్రకటించిన లక్షలోపు రుణమాఫీకి ప్రకటించిన రైతుల కంటే ఇప్పుడు రైతుల సంఖ్య తగ్గడం గమనార్హం. 2018లో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని నిర్ణయించింది. లక్షలోపు రుణమాఫీతో పోలిస్తే, ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నా అప్పటికంటే ఇప్పుడు 1.19 లక్షల మంది రైతులు తగ్గడం గమనార్హం. మొదటి విడతలోనే తగ్గిన సొమ్ము మొదటి విడతలో 11.34 లక్షల మందికి రూ. 6,034 కోట్లు జమ చేశారు. వీరంతా రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులే. కాగా 2018లో లక్ష వరకు రుణమాఫీ రూ.19 వేల కోట్లకు పైబడి ఉండగా, ఇప్పుడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కేవలం రూ.6,034 కోట్లతో, కేవలం మూడోవంతుకే పరిమితమైంది. భారీగా రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము కూడా తగ్గింది. పీఎం కిసాన్, రేషన్‌కార్డు తదితర నిబంధనల వల్ల పెద్దఎత్తున అర్హులైన రైతులు తగ్గుతున్నారని రైతునేతలు అంటున్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణాలున్న రైతులందరికీ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు నిబంధనలు పెడుతోందని వారు ప్రశి్నస్తున్నారు. కాగా, అనేక జిల్లాల్లో ఇప్పటికీ రైతులు తమకు రైతు రుణమాఫీ రాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకేచోట 50 మందికి రుణమాఫీ జరగలేదు ఆదిలాబాద్ కలెక్టరేట్లో మంగళవారం రుణమాఫీ సంబరాలు నిర్వహిస్తుండగా జైనథ్ మండలానికి చెందిన 50 మందికి పైగా రైతులు అక్కడకు వచ్చారు. కలెక్టర్‌ను కలిసి తాము రెండో విడతలో లక్షన్నర రుణమాఫీకి అర్హులైనా, తమకు ఆ ప్రయోజనం దక్కలేదని వినతిపత్రం అందజేశారు.ఆ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారులైన ఆ రైతులు తమకు రుణమాఫీ దక్కలేదని మొదట వ్యవసాయశాఖ అధికారులను అడిగితే బ్యాంక్ అధికారులు అసలు వారి వివరాలను ప్రభుత్వానికి పంపలేదని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. దీంతో వారు కలెక్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. కలెక్టర్..రాష్ట్ర నోడల్ అధికారితోపాటు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు దృష్టికి కూడా తీసుకెళ్లారు. బ్యాంకు అధికారులు ఎందుకు పంపలేదో అంతుబట్టడం లేదని అంటున్నారు. మాఫీకి నిబంధనలు ఏమైనా అడ్డువచ్చాయా? లేక ఏదైనా కారణం ఉందా తెలియడం లేదు. పేర్లు సరిపోలక 18మందివి రిజెక్ట్ నారాయణపేట సింగిల్ విండో కార్యాలయ పరిధిలో లక్షన్నర రుణమాఫీకి 44 మంది రైతులు అర్హులు. అందులో 26 మందికిగాను రూ.20.55,349 మందికి రుణమాఫీ అయ్యింది. మిగిలిన వారికి పాసుబుక్, ఆధార్‌కార్డులో పేర్లు తేడా ఉండడంతో రాలేదు. రేషన్‌కార్డు ఆధారంగా పేరు మ్యాచ్ కావడం లేదని అక్కడి ప్యాక్స్ కార్యదర్శి అశోక్‌కుమార్ అంటున్నారు. బాం్యకు పేరు మాయం జనగామ యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌లో జనగామ, పాలకుర్తి, లింగాలఘణపురం, దేవరుప్పుల, రఘునాథపల్లి మండలాలకు చెందిన 500 మందికిపైగా రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి 300 మందికి అర్హత ఉంది. బ్యాంకుల వారీగా రుణమాఫీ జాబితా వివరాలు తీసుకున్న సర్కారు, అర్హుల జాబితాను ప్రకటించే క్రమంలో ‘యూనియన్ బ్యాంకు’పేరు గల్లంతు అయ్యింది. మూడు విడతల రుణమాఫీ పూర్తయిన తర్వాత, గల్లంతు జాబితాను పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఒకింత కలవరపాటుకు గురవుతున్నారు. ఇద్దరు రైతులకు ఒకే ఆధార్ నంబర్ నమోదు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రేణికుంట్ల సాంబయ్య డీసీసీబీలో రూ.60వేల రుణం తీసుకున్నాడు. అయితే మొదటివిడతతో రుణమాఫీ జరగలేదు. దీంతో రైతు విస్తరణ అధికారిని అడగ్గా.. నీ పేరుమీద రూ.2లక్షలకుపైగా రుణం ఉందని వివరాల కాపీని అందజేశారు.ఆత్మకూరు డీసీసీబీ బ్యాంకులో తన పేరుతో ఒకే ఆధార్ నంబర్‌తో 1,49,861 పంట రుణం, రూ.83,337 మరో రుణం మొత్తంగా రూ.2,33,198 ఉండడంతో ఆశ్చర్యపోయాడు. అదే గ్రామంలో రేణికుంట్ల సాంబయ్య ఉండగా ఆయన రుణాన్ని కూడా బ్యాంకర్లు తన ఆధార్ నంబర్‌తోనే నమోదు చేయడంతో తన పేరుపై రెండు లక్షలకుపైగా రుణమున్నట్టు వచి్చందని, దీంతో అర్హత ఉన్నా తాను రుణమాఫీకి అర్హత కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డు లేదని మాఫీ కాదంటున్నారు మూడేళ్ల క్రితం గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నా. ఇప్పుడు అది వడ్డీతో కలిపి రూ.1.40 లక్షలు అయ్యింది. రెండో విడతలో మాఫీ అవుతుందని అనుకున్నా, లిస్ట్‌లో పేరు లేకపోతే..ఏఈఓ దగ్గరికి వెళ్లి నా ఆధార్‌కార్డుతో పరిశీలించమని చెప్పగా రేషన్‌కార్డు లేకపోవడంతో కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సి ఉందని, రుణమాఫీ చేయకుండా నిలిపివేసినట్టు తెలిపారు. నాకు ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. – బోడపోతుల రమేష్, రైతు కొణిజర్ల, ఖమ్మం జిల్లా బాక్స్‌గా వాడాలి. రేషన్‌కార్డున్న వారికే ప్రస్తుతం మాఫీ – సర్క్యులర్ జారీ చేసిన వ్యవసాయశాఖ రుణమాఫీ కాకపోవడానికి కారణాలేంటో వ్యవసాయశాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది. వాటిని అన్ని జిల్లాల వ్యవసాయశాఖ అధికారులకు పంపించింది. వాటిని రైతులకు కిందిస్థాయి అధికారులు ప్రశ్న, జవాబుల రూపంలో వివరిస్తున్నారు. అవేంటంటే... ప్రశ్న: లక్ష లేదా లక్షన్నరలోపే నాకు రుణం ఉంది. కానీ నాకు ఇంకా మాఫీ కాలేదు ఎందుకు? జవాబు: రుణమాఫీ కుటుంబ ప్రాతిపదికన వర్తిస్తుంది. మీ కుటుంబానికి మొత్తం ప్రస్తుతం లక్షన్నర లోపు ఉంటే మాఫీ అవుతుంది. ప్రశ్న: మా కుటుంబం అందరి పేరు మీదలక్షన్నరలోపే ఉంది. అయినా మాఫీ కాలేదెందుకు? జవాబు: మీకు రేషన్‌కార్డు లేకపోవచ్చు. రేషన్‌కార్డు లేని వారి వద్దకు త్వరలో అధికారులు వచ్చి గ్రామపంచాయతీలో గ్రామకమిటీ ద్వారా కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ అవుతుంది. ఈ ప్రక్రియ చేయడానికి సమయం పడుతుంది. మీ గ్రామానికి వచ్చే ముందు ప్రతి ఒక్కరికి సమాచారం ఇస్తాం. ప్రస్తుతం రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే మాఫీ అయ్యింది. రేషన్‌కార్డు లేని వారికి విచారణ చేశాక మాఫీ చేస్తాం. ప్రశ్న : రేషన్ కార్డు ఉంది. మా కుటుంబంలో అందరి పేరు మీద లక్షలోపే ఉంది. అయినా మాకు రుణమాఫీ కాలేదు. జవాబు : ఆధార్ అనుసంధానం సమస్య వల్ల కాలేకపోవచ్చు. మీ ఆధార్ + మీ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ + పట్టాదారు పాసుబుక్ జిరాక్స్‌లతో రైతు వేదికల వద్ద వెంటనే సంప్రదించాలి. ప్రశ్న : మా కుటుంబంలో అందరం 2018 కన్నా ముందు లోన్ తీసుకున్నాం. ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేస్తున్నాము. అయినా మాకు రుణమాఫీ కాలేదు. జవాబు: మీరు రుణ ఖాతా తెరిచిన తేదీ అంటే డేటాఫ్ శాంక్షన్ పరిగణనలోనికి తీసుకుంటారు. 2018 డిసెంబర్ 12వ తేదీ కంటే ముందు మీరు రుణం తీసుకుంటే మీకు రుణమాఫీ వర్తించదు. ప్రశ్న: మా ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. పిల్లలు సెపరేట్ అయ్యారు. నాకు రేషన్‌కార్డు లేదు. నాకు లక్ష మాత్రమే లోన్ ఉంది. ఇంకా నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు ? జవాబు: మీరు ఒక్కరే అని మీరు చెప్పితే సరిపోదు. త్వరలో అధికారులందరం గ్రామాలలోకి వస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామకమిటీ కుటుంబ నిర్ధారణ చేస్తుంది. కుటుంబ నిర్ధారణ చేసిన తర్వాతనే మీకు రుణమాఫీ అవుతుంది. అప్పటివరకు మీకు లక్షలోపు రుణమున్నా ఇప్పుడే రుణమాఫీ కాదు.జాబితాలో నా పేరు రాలేదు నాపేరు తూరి్పంటి స్వామి. చౌటుప్పల్లోనియూనియన్ బ్యాంకులో గతేడాది అక్టోబర్ నెలలో రూ. 1,19,700 రుణం తీసుకున్నాను. తాజాగా ప్రభు త్వం రుణమాఫీ ప్రకటించడంతో నా లోను మాఫీ అవుతుందని అనుకున్నాను. కానీ జాబితాలో నా పేరు లేదు. బ్యాంకు, వ్యవసాయ కార్యాలయానికి వెళ్లగా నా పేరు లేదు. నాకు రుణమాఫీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభ్యుల మ«ధ్య సమన్వయలోపం బయటపడింది. పార్టీ పక్షాన గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కొంతకాలంగా ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండోవిడత రుణ మాఫీ కార్యక్రమానికి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం చర్చనీయాంశమయ్యింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని ఒకపక్క పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే.. మంగళవారం నాటి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటారనే ప్రశ్నలు ఇటు పార్టీలో అటు శాసనసభాపక్షంలో వినిపిస్తున్నాయి.శాసనసభా సమావేశాల తొలిరోజునే లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ దాకా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వైఖరికి భిన్నంగా ప్రభుత్వం నిర్వహించిన రుణమాఫీ కార్యక్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొంటే ఎలాంటి సంకేతాలు వెలువడతాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం స్పష్టతనివ్వకపోవడం వల్లే..!అసెంబ్లీలో బీజేఎల్పీ వివిధ ముఖ్యమైన అంశాలపై ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై రాష్ట్రపార్టీ నాయకత్వం స్పష్టతనివ్వక పోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. అసెంబ్లీలో కేటాయించిన గదికి సభలోంచి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వచ్చేటప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ రుణమాఫీ కార్యక్రమానికి వెళ్లిపోయారు.దీంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఇలా చేస్తే పార్టీ కేడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ ఆ కార్యక్రమానికి హాజరుకాని ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్టుగా వారు పెద్దసంఖ్యలో వాయిదా తీర్మానాలను ప్రతిపాది స్తున్నారనే అంశంపై కూడా పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.సీనియర్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ అప్పుడప్పుడు మాత్రమే సమావేశాలకు హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతోనూ ఆయన అంత సఖ్యతగా లేరనే అభిప్రాయం ఇప్పటికే పార్టీవర్గాల్లో ఉంది. మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ సొంత ఇమేజీని పెంచుకునే ప్రయత్నాల్లో మునిగినందునే సమన్వయలేమి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
మా జన్మ ధన్యమైంది
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీతో తమ జన్మ ధన్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ రైతు కుటుంబంలోనూ విషాదం ఉండకూడదని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఈ మాఫీతో లక్షలాది మంది రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు.రైతు రుణమాఫీ రెండో విడతలో భాగంగా రూ.1.50 లక్షల్లోపు రుణమున్న రైతుల రుణమాఫీ కోసం రూ.6,190 కోట్ల నిధులను మంగళవారం ఆయన విడుదల చేశారు. 5.9 లక్షల కుటుంబాలకు చెందిన 6.4 లక్షల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన చెక్కును రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. వ్యవసాయం పండుగ అని నిరూపించేందుకే ‘కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులు అప్పులుగా ఇస్తే, నష్టాల పాలయ్యామంటూ తప్పుడు లెక్కలు చూపెట్టి రుణాలు ఎగ్గొట్టి దేశాలు విడిచి పారిపోతున్నారు. కానీ రైతులు మాత్రం తాను అప్పులపాలైనా పదిమందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రుణాలు తీసుకుంటారు. అప్పుల వాళ్లు ఇంటికొస్తే ఆత్మాభిమానం దెబ్బతిని సిరులు పండించే పొలాల్లోనే పురుగుల మందు తాగి చనిపోయిన ఘటనలు జరిగాయి. అందుకే వరంగల్ డిక్లరేషన్‌లో రైతు రుణమాఫీ ప్రకటించాం. సోనియా, రాహుల్‌గాం«దీలిచి్చన మాట మేరకు వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించేందుకు రుణమాఫీ చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. తొలి విడత తర్వాత రెండు వారాలు కాకుండానే.. ‘రైతులకు రుణమాఫీ చేస్తామంటే ఎలా చేస్తారని కొందరు శాపనార్థాలు పెట్టారు. కానీ మా చిత్తశుద్ధి, పరిపాలన దక్షతతో చేసి చూపించాం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించలేరు.. ప్రణాళికలను ప్రశ్నించలేరు. తొలి విడత రైతు రుణమాఫీ చేసిన తర్వాత రెండు వారాలు కూడా కాకముందే రెండో విడత రుణమాఫీ చేస్తున్నాం.ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖింపదగినవి. గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు మాఫీ చేయకుండా చేతులెత్తేసింది. వారు పాలించిన 120 నెలల కాలంలో రుణమాఫీ కోసం రూ.25 వేల కోట్లు కూడా చెల్లించలేకపోయింది. మేం మాత్రం అధికారంలోకి వచి్చన 8 నెలల కాలంలోనే ఏకకాలంలో రుణమాఫీ చేసి, 12 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు నిధులు విడుదల చేశాం. రైతుల కోసమే ఈ రికార్డు 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయలేదు. ఇలా చేయడం ఓ రికార్డు. ఈ రికార్డు తెలంగాణ ప్రజల కోసమే. సాధారణంగా ఎన్నికలున్నప్పుడు ఓట్లడిగే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు ఇలాంటివి చేస్తుంటాయి. మేము మాత్రం రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఓట్లు లేనప్పుడు కూడా రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలబడతామనే విశ్వాసాన్ని కలిగించాం..’అని రేవంత్ చెప్పారు. మా నిబద్ధతను భట్టి అన్న నిరూపించారు ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోతే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 8 నెలల్లోనే రూ.43 వేల కోట్లు పాత అప్పులు, వడ్డీలకు కట్టారు.సామాజిక పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి, అంగన్వాడీల నుంచి ఆశా వర్కర్ల వరకు వేతనాలు.. ఇలా ఏ కార్యక్రమం ఆగకుండానే రైతు రుణమాఫీకి భట్టి అన్న నిధులు సమకూర్చారు. మా నిబద్ధతను నిరూపించారు. ఇందుకు ఆర్థిక శాఖ అధికారులు సహకరించారు..’అంటూ సీఎం అభినందించారు. సంకల్ప బలమే కారణం: డిప్యూటీ సీఎం భట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు రుణమాఫీ కోసం రాష్ట్రంలోని 16.29 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 17.91 లక్షల ఖాతాల్లో రూ.12,208 కోట్లు జమ చేశామని తెలిపారు. ‘రుణమాఫీ ఎప్పుడో చేస్తారులే అన్న ఊహలు పటాపంచలు చేశాం. ఇందుకు సంకల్ప బలమే కారణం. ప్రతి క్షణం ప్రజలకు మేలు చేసేందుకే మేం తపిస్తున్నాం.అందుకే ఒక్కరోజు కూడా అలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే ఈనెల 15న రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసి, 18న మొదటి విడత నిధులిచ్చాం. మళ్లీ రెండు వారాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రెండోవిడత నిధులు విడుదల చేశాం. రూ.2 లక్షల లోపు రుణమాఫీ ఆగస్టు నెలలో పూర్తి చేస్తాం. రైతులకిది పండుగ రోజు. బ్యాంకుల్లో ఉన్న అప్పుల భారం దిగిపోతుంటే వారు సంతోషంగా ఉన్నారు..’అని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే రైతులకు ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. రుణమాఫీకి నిధులు విడుదల చేసినందుకు గాను రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి రైతు సమాచార పత్రం తీసుకుని తమ సమస్యలు తెలియజేయాలని, నెలరోజుల్లో అర్హులైన అందరు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ చేయించే బాధ్యత వ్యవసాయ శాఖదని చెప్పారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
రుణం ఇచ్చింది.. ‘మాఫీ’కి వద్దంది!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. రుణమాఫీ కోసం అవసరమైన రూ. 31 వేల కోట్లలో రూ. 5–6 వేల కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై ఆ సంస్థ నీళ్లుచల్లింది. తెలంగాణ సర్కారు అడిగిన విధంగా రూ. 5 వేల కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు మంజూరు చేసిన ఎన్సీడీసీ.. ఆ నిధులను రుణమాఫీకి మాత్రం వినియోగించరాదని షరతు విధించింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నిధుల ధీమాతోనే... సహకార సంఘాలను, డీసీసీబీలను బలోపేతం చేయడానికి రూ. 5 వేల కోట్ల రుణ సాయం చేయాలని గతేడాది ఎన్సీడీసీని టెస్కాబ్ కోరింది. టెస్కాబ్, డీసీసీబీల నిర్వహణ తీరును పరిశీలించిన ఎన్సీడీసీ.. ఆ తర్వాత రుణం మంజూరు చేసింది. వాస్తవానికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న రూ. 31 వేల కోట్లు ఎలా సమకూరుతాయన్న విషయాన్ని ఆర్థికశాఖ రహస్యంగానే ఉంచుతోంది. రుణమాఫీ చేయాల్సిన రైతుల వివరాలను తమకు ఇవ్వాలని అడిగిన ఆర్థికశాఖ అధికారులు సదరు మాఫీ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు కూడా స్పష్టత ఇవ్వలేదు.ఇప్పటివరకు మొదటి విడత 11 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ కోసం రూ. 6,070 కోట్లను సర్దుబాటు చేసి ఆ మేరకు రైతుల అప్పు ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సుమారు రూ. 25 వేల కోట్ల నిధులను వచ్చే నెలాఖరులోగా సర్దుబాటు చేయాల్సి ఉంది. రూ. 5 వేల కోట్లు ఎన్సీడీసీ నుంచి వస్తే మిగిలిన నిధులను ఇతర రూపాల్లో సమకూర్చుకుంటామని, అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్సీడీసీ షరతు నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. రుణమాఫీకి మళ్లింపు సాధ్యమేనా? తాజాగా మంజూరైన రుణం గురించి టెస్కాబ్ వర్గాల వివరణ కోరగా రుణమాఫీకి వినియోగించవద్దని అప్పు ఇచి్చన సంస్థ ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా ఆ నిధులను రుణమాఫీకి వాడుకోలేమని పేర్కొన్నాయి. అప్పుగా ఇచి్చన నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న విషయమై ఏ క్షణంలోనైనా తనిఖీలు లేదా ఆడిట్ చేసే అధికారం ఆ సంస్థకు ఉందని చెబుతున్నాయి. అయితే ఈ రుణాన్ని టెస్కాబ్ ద్వారా డీసీసీబీలకు బదిలీ చేసి డీసీసీబీలు తీసుకొనే నిర్ణయం ప్రకారం నిధులను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నాయి.ఒకవేళ రుణమాఫీ చేసుకుంటామని సదరు డీసీసీబీలు నిర్ణయం తీసుకున్నా ప్యాక్స్‌ల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తింపజేయగలమని, అది కూడా ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రుణమాఫీ కోసం ఈ నిధులను వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నందున ఏదో విధంగా ఆ నిధులను వాడుకొనే అవకాశాన్ని పరిశీలిస్తామని, సాధ్యం కాకపోతే ప్యాక్స్‌ల ద్వారా రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం లేదా రైతులకు అందించే ఇతర సహకార కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకుంటామని టెస్కాబ్ అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడతామని అంటున్నారు. -
నేడు ఢిల్లీకి రేవంత్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. రైతు రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో వరంగల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే యోచనలో ఉన్న ఆయన, ఈ సభకు రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వనించనున్నారు.డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్లతో కలసి ఆయన రాహుల్ గాందీని కలవనున్నట్టు తెలుస్తోంది. కాగా, డిప్యూటీ సీఎం భట్టి శనివారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శనివారం ఉదయం హస్తినకు చేరుకుని ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరూ ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కూడా ఆదివారం ఢిల్లీ వెళ్తారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. -
రుణమాఫీలో మాది ఆల్ టైం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతోపాటు రుణమాఫీలో రైతులకు రూ.1.20లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హరీశ్‌రావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన లబ్ధిని వివరించారు.కేసీఆర్ పాలనలో వివిధ పథకాల కింద రైతులకు రూ.1.20 లక్షల కోట్లు నేరుగా సాయం అందించిందన్నారు. రైతుబంధు కింద 69 లక్షల మంది రైతులకు రూ.72,972 కోట్లు, రైతు బీమా కింద 1.11 లక్షల మంది రైతులకు రూ.6,488 కోట్ల తమ ప్రభుత్వ హయాంలో చెల్లించామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో కలుపుకుని రూ.29,144.61 కోట్లు చెల్లించామన్నారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.11,401 కోట్లు సాయం అందించామన్నారు. చిరుద్యోగుల వెతలు తీర్చండి ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారికి వేతనాలివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతీ నెలా 1న వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
మాఫీ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాం«దీభవన్ మొదలు గ్రామ స్థాయిలోని రైతు వేదికల వరకు అన్ని స్థాయిల్లో పార్టీ కేడర్, నాయకులు.. రైతులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామాల స్థాయిలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల చిత్రపటాలకు పాలాభిõÙకం చేశారు.నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, టీపీ సీసీ కార్యవర్గం పాల్గొన్నారు. నల్లగొండలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మంత్రి కోమటిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులకు రుణ విముక్తి కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పైసా పైసా కూడబెట్టి రైతులను రుణ విముక్తి చేస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ మల్లురవి హాజరయ్యారు. రైతు వేదికల వద్ద కోలాహలం గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. క్లస్టర్ స్థాయిలో జరిగిన ఈకార్యక్రమాల్లో రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కూడా రైతులు రైతు వేదికల వద్దకు వచ్చారు. చప్పట్ల ద్వారా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. రైతు వేదికల వద్ద రుణమాఫీ లబి్ధదారుల జాబితాలు కూడా పెట్టడంతో కాంగ్రెస్ నేతల హడావుడి కనిపించింది. కాగా శుక్రవారం మండల స్థాయిలో రుణమాఫీ సంబురాలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో గ్రామ స్థాయిల్లో జరిగే ర్యాలీల కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్షీ, యాష్కీల సమక్షంలో.. హైదరాబాద్ గాం«దీభవన్‌లో రైతు రుణమాఫీ సంబురాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, డప్పు లు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కేడర్ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యకార సొసైటీల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ రైతు లకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ ప్రారంభించిన జూలై 18 రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. -
ఇతర బకాయిలకు జమ చేసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే దఫాలో ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఆగస్టు నెల దాటకముందే మొత్తం రూ.31 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. రుణమాఫీ కింద విడుదల చేస్తున్న నిధులను రైతులకు సంబంధించిన ఇతర బకాయిల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి బకాయిలు రికవరీ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు, బ్యాంకులు రికవరీ చేసే మొత్తం కలుపుకొని రైతులను రుణ విముక్తులను చేయాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లామని గుర్తు చేశారు.ఇచి్చన మాట మేరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. 40 లక్షల బ్యాంకు ఖాతాల నుంచి రూ.31 వేల కోట్ల రైతు రుణాలు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. బ్యాంకర్లను వన్ టైమ్ సెటిల్మెంట్ అడగకుండా పూర్తిగా చెల్లిస్తున్నందుకు బ్యాంకర్లు కూడా రైతుల మాదిరి పండుగ చేసుకోవాలని భట్టి అన్నారు. రుణమాఫీ కాగానే రైతులకు అవసరమైన రుణాలు విరివిగా ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దేశం గరి్వంచదగ్గ రోజు: తుమ్మల ఇది దేశం గర్వించదగిన రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వర్షాలు మొదలయ్యాయని, రైతు రుణమాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం పండుగలా మారుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.నల్లగొండ జిల్లాకు ఎక్కువ నిధులు గురువారం తొలివిడత కింద రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ విడుదల చేసిన నిధుల్లో అత్యధికం నల్లగొండ జిల్లాకు వెళ్లాయి. ఈ జిల్లాకు చెందిన 78,463 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.454.49 కోట్లు జమ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా తీసుకుంటే అత్యధికంగా ఆందోల్ నియోజకవర్గంలో 19,186 కుటుంబాలకు రూ.107.83 కోట్లు విడుదల అయ్యాయి. -
మాకెందుకు కాలేదు మాఫీ?
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సొంత జిల్లా ఖమ్మం డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణం ఉన్నవారు 1,43,327 మంది (పీఏసీఎస్ ఖాతాలు) ఉన్నారు. వీరికి గురువారం రూ.526 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 37,625 మంది రైతులకు రూ.121 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగిలిన 1.05 లక్షల మందికి రుణమాఫీ ఎందుకు జరగలేదన్నది అంతు చిక్కడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి సహకార బ్యాంకు పరిధిలో 756 మంది లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 388 మంది రైతుల పేర్లు మాత్రమే గురువారం నాటి రుణమాఫీ జాబితాలో వచ్చాయి. మిగతా వారికి ఎందుకు రుణమాఫీ జరగలేదో కారణాలు తెలియవని బ్యాంకు అధికారులు అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిధులు బ్యాంకుల్లో జమ చేశామని పేర్కొంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు, ప్రభుత్వం చెప్పినట్టుగా లక్ష రూపాయల రుణమాఫీ జరగలేదని క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తమకు అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డు సహా పీఎం కిసాన్ నిబంధనల కారణంగానే లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేక పోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రేషన్‌కార్డుతో సంబంధం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నా.. గురువారం నాటి రుణమాఫీని పరిశీలిస్తే, కుటుంబాన్ని గుర్తించేందుకు దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వందలాది మంది అర్హు లైన రైతులు ఉన్నా, ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం విస్తుగొలుపుతోంది. బంగారాన్ని కుదవపెట్టి పాస్‌బుక్‌తో పంట రుణాలు తీసుకున్న రైతుల కు కూడా మాఫీ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విలేకరులతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. కానీ ఎక్కడా బంగారం రుణాలు మాఫీ కాలేదని రైతులు అంటున్నారు. రేషన్‌కార్డుతో పాటు పీఎం కిసాన్‌లో ఉన్న ఏ నిబంధనలను సర్కారు అమలు చేస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. జాబితాల్లో తమ పేర్లు లేవంటూ గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాకపోవడానికి కారణాలను బ్యాంకు అధికారులు కూడా చెప్పలేకపోతుండటం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా జాబితాలు వచ్చాయని, ఈ విషయంలో తమకేమీ తెలియదని కొందరంటున్నారు. తొలి విడతలోనే భారీ సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాకపోవడంతో.. వచ్చే రెండు విడతల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ జరగని మరికొన్ని కేసులు ⇒ భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కోట శైలజ 2023 ఆగస్టు 10వ తేదీన స్థానిక బ్యాంకులో రూ.97 వేలు పంట రుణం తీసుకున్నారు. కానీ ప్రస్తుత రుణమాఫీ జాబితాలో ఆమె పేరు రాలేదు. అయితే ఆమెతో పాటు అదే రోజు రుణం తీసుకున్న మరో రైతు పేరు జాబితాలో ఉంది. ⇒ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రుణమాఫీ కోసం 865 మందితో జాబితా పంపించింది. వీరు తీసుకున్న రుణం రూ.4.65 కోట్లు. లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులు 730 మంది కాగా, వారిలో 352 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. భార్యా భర్తలకు ఒకే బ్యాంకులో వేర్వేరు ఖాతా లు ఉండటం, వేర్వేరు బ్యాంకుల్లో ఇద్దరికి ఖాతాలు ఉండటం, సాంకేతిక లోపం లాంటివి కారణంగా అధికారులు చెబుతున్నారు. ⇒ నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలోని పలువురు రైతులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పొందే వారి జాబితాలో గ్రామానికి చెందిన కొంతమంది రైతుల పేర్లు లేవు. బ్యాంక్ అధికారులను అడిగితే తాము జాబితాను పంపించలేదని, హెడ్ ఆఫీస్ నుంచి ప్రభుత్వం జాబితాను తీసుకుందేమోనని సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారు 1,76,683 మంది ఉండగా, వారు మొత్తం రూ.941.29 కోట్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. కానీ రుణమాఫీలో కొంతమంది పేర్లు మిస్ అయ్యాయి. ఒక్కరికి కూడా కాలేదు.. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సహకార బ్యాంకులో లక్ష రూపాయలలోపు రుణమాఫీకి అర్హులైన రైతులు 1,407 మంది ఉన్నారు. వీరిలో గురువారం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సహకార బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ⇒ ఇదే జిల్లా కారేపల్లి సహకార సొసైటీలో 3,790 మంది రైతులు రుణమాఫీకి అర్హులు. వీరు తీసుకున్న రుణం 19.27 కోట్లు కాగా అందులో రూ.లక్షలోపు రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 3,153. వారికి ఇవ్వాల్సిన సొమ్ము రూ. 10.30 కోట్లు. కానీ గురువారం రుణమాఫీ అయిన రైతులు 668 మంది మాత్రమే కాగా వారికి సంబంధించి కేవలం రూ. 2.06 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. ⇒ మెదక్ డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పాపన్నపేట బ్రాంచి పరిధిలో రూ.లక్ష లోపు పంట రుణాలున్న మొత్తం రైతులు 1,685 మంది కాగా, వీరు తీసుకున్న పంటరుణం రూ.5.99 కోట్లు. ఇందులో కేవలం 845 మంది రైతులకు సంబందించిన రూ.2.83 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారివి ఎందుకు మాఫీ కాలేదనే వివరాలు తమకు రావాల్సి ఉందని బ్యాంకు బ్రాంచి మేనేజర్ కిషన్ తెలిపారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వేల మంది రైతుల పేర్లు కూడా రుణమాఫీ జాబితాలో లేకుండా పోయాయి.నా పంట రుణం మాఫీ కాలే నేను నేలకొండపల్లి సహకార బ్యాంక్‌లో పట్టాదారు పాస్ పుస్తకం పెట్టి రూ.50 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నా. పంట సాగు కోసమే ఈ రుణం పొందా. ప్రభుత్వం రుణమాఫీకి పెట్టిన నిబంధనల ప్రకారం నేను అర్హురాలిని. అందరిలాగే నాకు కూడా రుణమాఫీ అవుతుందని రైతువేదిక వద్దకు వచ్చా. కానీ జాబితాలో నా పేరు లేదు. దీంతో నా రుణం మాఫీ కాలేదు. అధికారులు నాకు రుణమాఫీ అయ్యేలా న్యాయం చేయాలి. – బాలిక రాంబాయి, మహిళా రైతు, భైరవునిపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా -
పావు వంతు రైతులే అర్హులా?
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ పేరిట రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం రైతాంగాన్ని మరో మారు మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధు కింద జూన్‌లో రైతులకు ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7 వేల కోట్లను రుణమాఫీ కోసం దారి మళ్లించిందని కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తాన్ని విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లుగా పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. 40 లక్షల మంది రైతులు లక్ష రూపాయల రుణం తీసుకుంటే 11 లక్షల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులే అర్హత సాధించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు రూ. 16,144 కోట్లు వెచి్చంచి.. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై పోలీసు సి బ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయా లని కేటీఆర్ ‘ఎక్స్’లో కోరారు. ఓ వాహనదారుడిని పోలీసులు దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని ప్రస్తావిస్తూ దీన్ని పోస్ట్ చేశారు. పౌరుడిపై పోలీసులు వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసు శాఖ, డీజీపీకి ఇది అంగీకారయోగ్యమైన భాషేనా అని ప్రశ్నించారు. -
మాటకు కట్టుబడి మాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని అన్నారు. రైతుల రుణ మాఫీ పథకంలో భాగంగా గురువారం సచివాలయంలో తొలి విడతగా రూ. లక్ష వరకు మాఫీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇది మరపురాని రోజు ‘నాడు కరీంనగర్లో సోనియాగాంధీ మాట ఇచ్చారు. అనంతరం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా, మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండుసార్లు మాట తప్పారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండోసారి ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో 2022 మే 6న వరంగల్‌లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రుణమాఫీ చేస్తామన్నారు. 2023 సెపె్టంబర్ 17న తుక్కుగూడాలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. వారిచ్చిన మాట ప్రకారమే నేడు సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను జమ చేస్తున్నాం. నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజు. రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9ని రుణమాఫీ కటాఫ్‌గా పెట్టాం. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం. ముందుగా ఈ రోజు రూ.లక్ష వరకు రుణ విముక్తి కల్పించాం. రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుంది. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరతాం. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి..’అని సీఎం అన్నారు. రేషన్‌కార్డు ప్రాతిపదిక కాదు ‘కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలనే అపోహ çసృష్టిస్తున్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. పాస్ బుక్‌నే కొలబద్ద. దొంగలు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. అందుకే పాసుబుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నాం. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. బ్యాంకు అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు..’అని రేవంత్ చెప్పారు. త్వరలో వరంగల్‌లో రాహుల్‌గాందీతో సభ ‘గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలకు రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ అప్పులకు మిత్తీగా ప్రతి నెలా రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్నాం. జీతాలు, పింఛన్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. రైతు రుణమాఫీలో దేశానికి తెలంగాణ మోడల్‌గా ఉండబోతుంది. 8 నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్‌గాంధీని ఆహా్వనించి వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తాం. త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఆయన్ను ఆహ్వానిస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర రైతులకు పెద్ద పండుగ: భట్టి రాష్ట్రంలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ఈ రోజు రైతు రుణమాఫీ అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రూ.7 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పజెప్పినప్పటికీ రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు. కాగా రైతు రుణమాఫీ పురస్కరించుకుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాం«దీకి ధన్యవాదాలు తెలుపుతు సమావేశంలో తీర్మానం చేశారు. కార్యక్రమం చివర్లో కొందరు రైతులకు రుణమాఫీ చెక్కులు సీఎం పంపిణీ చేశారు. -
ఒకేసారి అన్నారు.. ఇప్పుడు దశలవారీ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ సొమ్మును ఒకేసారి రైతుల ఖాతాల్లో వేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. దశల వారీగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ తదుపరి విడత ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారీగా రుణమాఫీ చేయడం వలన ఇతర రైతులు ఆ సొమ్ము కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కీలకమైన వానాకాలం సీజన్లో రైతులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కష్టం అవుతుందని అంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే కొత్త రుణాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. లక్షకు పైన ఉంటే ఎదురుచూపులే..! రుణమాఫీని గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మరో పద్ధతిలో చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రైతుకు లక్షన్నర రూపాయల రుణం ఉంటే... 18వ తేదీన ఆ రైతుకు లక్ష వరకు మాఫీ చేయరు. కేవలం లక్ష రూపాయలలో పు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు. అంటే లక్షకు పైగా రుణాలున్నవారు ఆ తర్వాత ప్రభు త్వం విడుదల చేసే నిధుల కోసం ఎదురుచూడాల్సిందేనన్న మాట. గతంలో రుణం ఎంతున్నా ప్రభుత్వం నిర్ధారించిన మేరకు అందరికీ రుణమాఫీ జరిగేది. గత ప్రభుత్వం లక్షరూపాయల లోపు రు ణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.ఆ డేటా ఆధారంగానే ఈసారి 18వ తేదీన రైతులకు రుణమాఫీ చేస్తారని అంటున్నారు. మరోవైపు రేషన్ కార్డు వెరిఫికేషన్, పీఎం కిసాన్ నిబంధన ప్రకారం అనర్హులను 18వ తేదీ రుణమాఫీ సందర్భంగా ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. గురువారం ఒక్క రోజులోనే లక్ష లోపు రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బుధవారం సెలవు అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అ లాగే బ్యాంకర్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారని, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
అవి రైతుల పాలిట ఉరితాళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులు రైతుల పాలిట ఉరితాళ్లుగా బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభివరి్ణంచారు. ఈ నిబంధనలు రైతాంగాన్ని వంచనకు, మోసానికి గురిచేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల శాపనార్ధాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయమన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని ఇచి్చన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా అద్దాల మేడలో కూర్చొని, తనకు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారనే ఆహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రూ.34 వేల కోట్ల రైతుల రుణమాఫీని బేషరతుగా చేస్తామన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నిబంధనల పేరుతో హల్లికి హల్లి సున్నకు సున్నా అన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో రే వంత్ ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సీఎం రేవంత్‌కు ఉన్న ధ్యాస రైతు రుణమాఫీ, రూ.500 బోనస్, ఆడబిడ్డలకు రూ.2500, రూ.4వేల పెన్షన్, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, కాలేజీ పిల్లలకు స్కూటీలు.. వంటి హామీలను అమలు చేయడంపై లేదన్నారు. ఫిరాయింపుల పర్వం చూస్తుంటే కేసీఆర్ జుట్టు నుంచి రేవంత్‌రెడ్డి పుట్టినట్టు ఉందని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి చదువుకున్నారా? లేదా? ‘తెల్లరేషన్ కార్డు ఎవరికి ఇస్తారు. రేవంత్‌రెడ్డి చదువుకున్నాడా? లేదా? మూడున్నర ఎకరాల తరిపొలం, ఏడు ఎకరాల కుష్కి పొలం ఉన్నవారికి మాత్రమే తెల్లరేషన్ కార్డు వస్తుంది. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వక పదేళ్లు అవుతుంది. మీరు వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు పేరుతో సగం మందికి, ఆదాయపన్ను పేరుతో 20%మందికి, రీ షెడ్యూల్ పేరుతో ఇంకొంత మందికి రుణమాఫీ ఎగ్గొడుతున్నారు. పొమ్మనక పొగబెట్టడం, ఎగబెట్టుడు తప్ప ఇంకొకటి లేదు’అని ఈటల ధ్వజమెత్తారు. -
రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు లేకపోయినా బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమేనని చెప్పారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి 11.50 లక్షల మందికి సంబంధించిన లక్షలోపు రుణాలు దాదాపు రూ.6,800 కోట్లు ఒకేసారి మాఫీ చేస్తారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత ప్రభుత్వ మార్గదర్శకాలే.. ‘రుణమాఫీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారని నిర్ధారించేందుకు రేషన్‌కార్డు ఒక్కటే ప్రామాణికం. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారో గుర్తించేందుకే ఇది తప్పనిసరి. రేషన్‌కార్డులు లేని రుణ ఖాతాలు 6 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లి పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి రుణమాఫీ చేస్తారు. రేషన్‌కార్డులు లేనివారికి రుణమాఫీ జరగదని చేస్తున్న ప్రచారం తప్పు.రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ జరుగుతుంది..’అని తుమ్మల వివరణ ఇచ్చారు.ఆ రుణాలు మాఫీ కావు: ‘బ్యాంకుల్లో బంగారంతో పాటు పాస్‌బుక్ తాకట్టుపెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేస్తాం. కానీ కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ కావు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఆదాయం పన్ను చెల్లించే బడా వ్యక్తులను గుర్తించేందుకు వినియోగించుకుంటాం. ఆదాయపు పన్ను చెల్లించే వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల్లో ఉన్న అధికారులకు రుణమాఫీ ఉండదు. నెలకు లక్ష రూపాయలకు పైన వేతనం పొందేవారికి రుణమాఫీ వర్తించదు. ఇలాంటివి 17 వేల అకౌంట్లను గుర్తించాం. మహిళా గ్రూపు అప్పులకు మాఫీ వర్తించదు’అని మంత్రి చెప్పారు.రీషెడ్యూల్డ్ రుణాలు కూడా ..‘గత ప్రభుత్వంలో తొలి విడత లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతల్లో చేశారు. రెండో విడత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సగం మందికే మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల రూ.1,400 కోట్లు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కు వచ్చాయి. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లోని తమ అప్పును రీషెడ్యూల్ చేసుకున్నారు.ఇలాంటి వారు కూడా ఈసారి రుణమాఫీ పొందనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతాయి. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు పొందితే కేవలం రూ.2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది. అందులో మహిళలకు తొలి ప్రాధాన్యతనిస్తాం. రాష్ట్రంలో 39 లక్షల కుటుంబాలకు సంబంధించి 60 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి..’అని తుమ్మల తెలిపారు. -
రుణమాఫీ-రేషన్‌కార్డ్ రూల్‌పై సీఎం రేవంత్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రైతు రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. కలెక్టర్లతో ఇవాళ సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి పాస్ బుక్‌ల ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన అని తెలిపారు.ఇదిలా ఉంటే.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజు సాయంత్రం లోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. అదే రోజు.. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులో సంబురాలు నిర్వహించాలని, వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం రేవంత్ సూచించారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
పరిశ్రమల భూములు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉన్న ప్రభుత్వం పరిశ్రమల భూము లను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణమార్కెట్ నుంచి కనీసం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కనీసం రూ.5 వేల కోట్లు వెంటనే సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ ను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.దీనికోసం హైదరా బాద్‌లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలనుకుంటోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల ‘మర్చంట్ బ్యాంకర్’కు రుణసేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణ యించారు.ఈ మర్చంట్ బ్యాంకర్ ప్రభు త్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటికి ప్రభుత్వ భూము లను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం 1% కమీషన్ చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీ షన్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.మర్చంట్ బ్యాంకర్ కోసం మళ్లీ టెండర్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి అప్పులు ఇప్పించడంలో అనువజ్ఞులైన ‘మర్చంట్ బ్యాంకర్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. అందులో భాగంగా గత నెల 23న తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనలు కోరుతూ టెండర్ ప్రకటన విడుదల చేసింది. అయితే టెండర్ ప్రకటనలో విధించిన పలు అంశాలపై మర్చంట్ బ్యాంకర్ల నుంచి కొన్ని విన్నపాలు అందాయి.వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి గత నెల 28న టెండర్ నిబంధనలు సవరిస్తూ మరో ప్రకటన విడుదల చేయడంతోపాటు బిడ్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తామని టీజీఐఐసీ ప్రకటించింది. అయితే టెండర్ డాక్యుమెంట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించిన టీజీఐఐసీ గత నెల 23న ఇచ్చిన టెండర్‌ను ఈనెల 2న రద్దు చేసింది. ఆ లోపాలను సరిదిద్ది తిరిగి ఒకటి రెండు రోజుల్లో తాజా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తోంది. బ్యాంకర్ల ఎంపిక బాధ్యత టీజీఐఐసీకిఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే అధికారం టీజీఐఐసీ నేతత్వంలోని కమిటీకి అప్పగించినా, ఆర్థికశాఖనే కీలక పాత్ర పోషించనుంది. ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే పక్షంలో సమపాళ్లలో బాధ్యతలు తీసుకొని నిర్దేశిత రుణం సేకరించాలి. పాత టెండర్ నోటిఫికేషన్ ప్రకారం బిడ్‌లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లు రూ.50 లక్షలు ధరావత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. భూములు తనఖా పెట్టడం సహా ఇతర సాంకేతిక, చట్టపరమైన అంశాలన్నీ మర్చంట్ బ్యాంకర్ ప్రభుత్వంతో సంప్రదిస్తూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన అరడజను మంది మర్చంట్ బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు ఆసక్తి చూపుతూ ఇప్పటికే బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. అయితే టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడంతో బిడ్ల దాఖలు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.రూ.10వేల కోట్లు సేకరణ లక్ష్యం...హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడంతో భూముల వేలం సాధ్యం కాదని, ఆశించిన మొత్తంలో నిధులు సమకూరే అవకాశం లేదని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. దీంతో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా కనీసం రూ.10వేల కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే బిడ్‌లో దాఖలు చేసిన మర్చంట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు కూడా వేర్వేరుగా తాకట్టు కోసం ఎంపిక చేసిన భూముల విలువ (వాల్యూయేష¯Œన్) లెక్కగట్టినట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను రూ.20వేల కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది.ఈ భూముల తాకట్టు ద్వారా లెక్కించిన విలువలో సగం మొత్తం అంటే.. రూ.10వేలు కోట్లు రుణ మార్కెట్ నుంచి అప్పు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు భావిస్తున్నట్టు తెలిసింది. 400 ఎకరాలను తాకట్టు పెట్టినా రూ.10వేల కోట్లు అప్పు పుట్టకుంటే.. అదనంగా మరింత భూమిని కూడా తాకట్టు పెట్టి అయినా రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు నెలల్లో రూ.10వేలు కోట్లు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా, కనీసం ఆరు నెలలు గడువు కావాలని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నట్టు సమాచారం. ఆర్బీఐ అడ్డుకుంటుందనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే భూముల తాకట్టు ద్వారా తెచ్చే అప్పులకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూములను కుదువపెట్టి తెచ్చే అప్పులకు ఆర్బీఐ అభ్యంతరాలు చెబితే ఏం చేయాలనే దానిపై ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. -
మళ్లీ మోసపోమప్పో..!
👉కొత్త సంక్షేమ పథకాలుఅటుంచితే బాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలు ఎక్కడ నిలిపివేస్తారోఅన్న భయం పట్టుకుంది. ప్రజలను నమ్మించి దగా చేయడం బాబుకు అలవాటేగా!– గార్లదిన్నె మండలకేంద్రానికి చెందిన ఓ మహిళ నిట్టూర్పు👉2014 ఎన్నికల్లో 600 పైగా హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను వంచించారు. అలాంటి వ్యక్తి నేడు మళ్లీ సిగ్గులేకుండా హామీలిస్తున్నారు.బాబును నమ్మలేం.– కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆగ్రహం👉పేదల బాగు కోసం సీఎం జగన్ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక కాబోతోందని విమర్శించిన వ్యక్తి.. అధికారంలోకి వస్తే అవే పథకాలు కొనసాగిస్తూ మరింత ఎక్కువ చేస్తామనడాన్ని ఎలా చూడాలి?– రాయదుర్గం పట్టణానికి చెందిన ఓ అధ్యాపకుడి విశ్లేషణసాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇష్టారాజ్యంగా హామీలిచ్చేసి, గద్దెనెక్కిన తర్వాత నమ్మి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను నిలువునా ముంచేయడం ఎలా అనే విషయం ఆయన గత చరిత్ర చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. పొరపాటున అధికారంలోకి వస్తే, ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచేసి, అన్నీ అమలు చేశానని బుకాయించడం చంద్రబాబుకు తప్ప మరెవరికీ తెలియదేమో! అందుకే బాబు నోటి నుంచి ఏది వస్తుందో అది చేయరు అన్న విషయం ప్రజల్లో నాటుకుపోయింది.నమ్మం బాబూ..!ఇప్పటికే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్, సతీమణి భువనేశ్వరి కూడా ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల సభలు నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ ప్రకటించారు. అయితే, వారి మాటలు ఎవరూ నమ్మడం లేదనేది అక్షర సత్యం. ప్రస్తుతం పెన్షన్ రూ.3 వేలు ఇస్తున్నారు. తాను నాలుగు వేలు ఇస్తానన్నా కనీసం దానిపై చర్చ జరగడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలతో టీడీపీ అభ్యర్థులు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇల్లిల్లూ తిరుగుతున్నా, ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుండటం, బాబు హామీలను కనీసం ప్రజలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఓటమి భయం ఎక్కువైనట్లు తెలిసింది.గుణపాఠం చెప్పినా మారని తీరు..2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి తదితర హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వాటిల్లో ఒక్క దాన్ని కూడా సరిగ్గా నెరవేర్చిన పాపాన లేదు. దీంతోనే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టి ‘నిన్ను నమ్మం బాబు’ అని స్పష్టం చేశారు. అయినా, గతం మరిచి నేడు మళ్లీ కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూసి జనం నవ్వుకుంటున్న పరిస్థితి.బాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు!2014–19 మధ్య కాలంలో జన్మభూమి కమిటీలను తెచ్చి పల్లెల్లో నిప్పులు పోశారని, ఏ ఒక్కరికీ లబ్ధి కలగకుండా చేశారని గ్రామీణులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాబు వచ్చి జన్మభూమి కమిటీలు ప్రవేశపెడితే తమ బతుకులు ఎంత దుర్భరంగా మారతాయోనని పేద ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేకుండా నేరుగా వలంటీర్లే ఇంటికొచ్చి పథకాల గురించి చెప్పి, అర్హులైన వారికి లబ్ధి చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉన్న ఊరిలోకే పాలన వచ్చింది. కానీ, బాబు వస్తే ఇవన్నీ అమలు చేయరేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఉన్నవే రాకుండా చేశారు.. కొత్తగా ఏమిస్తారు?ఉమ్మడి అనంతపురం జిల్లాలో రమారమి 5 లక్షల మంది వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటి వద్దకే వెళ్లి వలంటీర్లు డబ్బు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు, ఆయన అనుంగు శిష్యులు ఎన్నికల కమిషన్ మాటున పెన్షన్లు ఇంటికి రానివ్వకుండా చేశారు. ఈ విషయంపై ఇప్పటికే వృద్ధులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. పెన్షనర్లకు ఎంతో సాంత్వన చేకూరుస్తున్న వ్యవస్థనే ఆపేయించిన బాబు.. కొత్తగా రూ.4 వేలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ పెంచుతానన్న హామీతో కరపత్రాలు ఇస్తుంటే వాటిని వెంటనే చెత్తబుట్టలో వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో బాబుపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలను భయాందోళనకు గురి చేసైనా ఎన్నికల్లో గట్టెక్కాలనే దురుద్దేశంతో, బాబు ఇచ్చిన ఆదేశాలతో పచ్చ మూకలు దాడులకు దిగుతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే, టీడీపీ కుయుక్తులను గమనిస్తున్న ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లోనూ దిమ్మతిరిగే సమాధానం చెబుతారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. -
రుణమాఫీలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఘనత ముఖ్యమంత్రిదే..! దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు. ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు. -
3 లక్షల మంది రైతుల రుణమాఫీ 'సొమ్ము వెనక్కి'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద విడుదల చేసిన సొమ్ము లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదు. ఆ సొమ్ము బ్యాంకుల నుంచి తిరిగి ట్రెజరీలకే వెళ్తోంది. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్‌గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలతో లబ్దిదారులకు రుణమాఫీ సొమ్ము అందలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ వర్గాల ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 3 లక్షల మంది రైతుల సొమ్ము వారి ఖాతాల్లో జమ కాకుండా వెనక్కు వెళ్తోంది. దీనిపై రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా వ్యవసాయశాఖ స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఈ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా... ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందే తెలిసినా వ్యవసాయశాఖ నిర్లక్ష్యం... రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేక మంది రైతులకు రుణాల రెన్యువల్ సమస్య వచ్చింది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారతారు. దీంతో రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే కొందరు రైతులు అలా చెల్లించగా మరికొందరు రైతులు డబ్బుల్లేక బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో సుమారు 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయినట్లు అంచనా. అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్ కావడమో, నిలిచిపోవడమో, డబ్బు చెల్లించిన వారి ఖాతాలు మూసేయడంతో ఈ సమస్య వచ్చిపడింది. ఈ విషయంపై వ్యవసాయశాఖ అధికారులకు స్పష్టత ఉన్నా, ఇలాంటి సమస్య తలెత్తుతుందని కొందరు హెచ్చరించినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తెలిసింది. ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును జమ చేసినా, అధికారులు సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు విడతల్లో మాఫీ సొమ్ము విడుదల రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. రూ. 50 వేలలోపు రుణాలున్న 7.19 లక్షల మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం రూ. 1,943.64 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతు రుణ మాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.99, 999 వరకు రుణాలున్న రైతులకు బకాయిలను విడుదల చేసింది. ఆ మేరకు 10. 79 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 6,546.05 కోట్లు విడుదల చేసింది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు మొత్తంగా 16.66 లక్షల మంది రైతులకు రూ. 7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించినట్లయింది. -
ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే, దొర గారికి మాత్రం ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయిన సీఎం కేసీఆర్ ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గురువారం షర్మిల ట్వీట్ చేశారు. రైతులను ఓట్లు అడిగేందుకు మొహం చెల్లక రుణమాఫీ చేస్తానంటూ.. నవంబర్‌లో నిర్వహించాల్సిన మద్యం టెండర్లను మూణ్ణెల్ల ముందే ముంగటేసుకున్నారని దుయ్యబట్టా రు. కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నా ళ్లూ గప్పాలుకొట్టిన దొర ఎన్నికలకోసం డబ్బు ను పోగు చేసుకుంటున్నారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును రూ.7 వేల కోట్లకే లీజుకిచ్చారని, ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. -
నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేయని రైతుల రుణమాఫీ ఈ రెండు నెలల్లో చేస్తుందా? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు క్రమంగా ప్రైవేటుపరం చేస్తున్నారని, 56 వేల మంది ఉన్న ఆర్టీసీ కార్మికుల సంఖ్య 43 వేలకు చేరిందని, బస్సుల సంఖ్య 12 వేల నుంచి మూడు వేలకు పడిపోయిందన్నారు. ఆర్టీసీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక కార్మికుల పరిస్థితేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులకు పరిమితం చేస్తున్నారని, ఆరు నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని. వాటిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాతే పంటపొలాలు బ్యాక్ వాటర్ కారణంగా నష్టపోతున్నాయని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా సమస్య పరిష్కరించే దమ్ము లేదని, అన్నింటికీ ముఖ్యమంత్రే అని ఎద్దేవా చేశారు. మూడు నెలలైతే ఈ ప్రభుత్వం ఉండదన్నారు. కక్షపూరితంగానే బీఏసీకి పిలువలేదు ఉమ్మడి ఏపీలో సైతం ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా పిలవకపోవడం కక్షపూరిత చర్య అని ఈటల మండిపడ్డారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదన్నారు. అసెంబ్లీలో చాలా రూములు ఖాళీగా ఉన్నా.. బీజేపీ సభ్యులకు కేటాయించలేదని విమర్శించారు. -
మళ్లీ రైతు రుణమాఫీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రైతులకు మేము అండగా ఉంటున్నాం.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేశాం.. ఇప్పుడు కూడా రైతాంగానికి రుణమాఫీపై భరోసా ఇస్తున్నాం’అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. చేనేతలకు జీఎస్టీ ఎత్తేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ హక్కు చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి గిరిజనులకు భూములు, పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో దళితులకు 25 లక్షల ఎకరాల భూములను ఇచ్చామని.. వాటిని రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సమస్యలకు నెలవుగా మారిన ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో రాహుల్ పాదయాత్ర మూడో రోజు శుక్రవారం నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఎలిగండ్ల నుంచి ఉదయం 6:05 గంటలకు ప్రారంభమైన యాత్ర మరికల్, తీలేరు, పెద్దచింతకుంట, లాల్కోట చౌరస్తా మీదుగా దేవరకద్ర నియోజకవర్గంలోని పెద్దగోప్లాపూర్ వరకు సాగింది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం సాయంత్రం 4:10 గంటలకు యాత్ర పునఃప్రారంభమై దేవరకద్ర పట్టణం, చౌదర్పల్లి గేట్ మీదుగా మన్యంకొండకు 6:18 గంటలకు చేరింది. అక్కడ రాహుల్ కార్నర్ మీటింగ్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ధరణితో ఉపయోగం ఏమిటని.. అధికారంలోకి రాగానే దీని ద్వారా జరిగే తప్పులను సరి చేస్తామన్నారు. మూడోరోజు 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. దేశమంతా ఒకే జీఎస్టీ... నిరుద్యోగానికి ప్రధాన కారణం నోట్ల రద్దు.. లోపభూయిష్టమైన జీఎస్టీ అని రాహుల్ దుయ్యబట్టారు. పాదయాత్ర సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని నేతన్నలను కలిశానని.. 18 శాతం జీఎస్టీ వల్ల ఎక్కువగా నష్టపోతున్నామని వాళ్లు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. జీఎస్టీ వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారులు సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేసి దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఐదు శ్లాబుల జీఎస్టీ స్థానంలో ఒకే జీఎస్టీ విధానాన్ని తీసుకొస్తామన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ సహకరిస్తోంది.. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని రాహుల్ పేర్కొన్నారు. చదువుల కోసం యువత రూ. లక్షలు ఖర్చు చేస్తున్నా మోదీ పాలనలో ఉద్యోగాలు వస్తాయో రావోనన్న ఆందోళన వారిలో నెలకొందన్నారు. లక్షలాది పరిశ్రమలు మూతపడడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రజల మధ్య ద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తున్నాయని.. అన్నదమ్ముల మధ్య కొట్లాట పెడుతున్నాయని ధ్వజమెత్తారు. ఒకపక్క బీజేపీ హింసను, ద్వేషాన్ని ప్రేరేపిస్తుంటే.. మరోపక్క టీఆర్ఎస్ ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని.. ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో డ్రామాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణను ఒక రాజు పాలిస్తున్నాడని... ప్రజల భూములు, డబ్బు లాక్కోవడమే ఆయన లక్ష్యమని సీఎం కేసీఆర్‌పై రాహుల్ ధ్వజమెతారు. ఇదే నిజమైన భారతదేశం.. ‘జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ యాత్రలో ఎక్కడా ద్వేషం, హింస కనబడదు. ఇదే నిజమైన భారతదేశం’అని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు అందించే శక్తి, ఆప్యాయతల వల్ల తాను నిత్యం 6–7 గంటలపాటు నడుస్తున్నా అలసిపోవడం లేదన్నారు. ప్రజామద్దతుతో తన పాదయాత్ర కశ్మీర్ వరకు సాగుతుందన్నారు. -
రైతుల ‘మహాపంచాయత్’
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు. నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్‌పథ్ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ రైతుల మహాపంచాయత్ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్ పాయింట్ల వద్ద 2020 నవంబర్ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి. -
ఇవి అనుచితం ఏమీ కాదు!
దేశంలో ఉచిత పంపిణీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. కేంద్రం కూడా వీటిని కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ కొంచెం ఎక్కువ, తక్కువగా ఈ ఉచిత హామీలు ఇస్తూనే ఉన్నాయి. కొన్ని సఫలం అవుతుంటాయి. కొన్ని విఫలం అవుతుంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రగతికి ఇవి ఉపయోగపడతాయా, లేదా అన్నది కూడా ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేస్తున్న పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఉచిత హామీలపై సుప్రీంకోర్టు విచారణ చేయడం, చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ సంద ర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గౌరవ న్యాయస్థానం వారు ఈ ఉచిత పంపిణీల హామీల గురించి ఆందోళన చెందినట్లుగా ఉన్నారు. తరచుగా కోర్టులలో పిల్స్ వేస్తుండే న్యాయ వాది ఒకరు ఈ పిల్ కూడా వేశారు. ఉచిత హామీలను నిలుపుదల చేస్తూ కోర్టువారు ఉత్తర్వులు ఇవ్వాలన్నది ఆ పిటీషన్ సారాంశం. ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను కూడా న్యాయమూర్తి సలహా కోరారు. ఇందులో కోర్టుల నిర్ణయం కన్నా, ఆర్థిక సంఘం సలహా తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు. కోర్టులలో అప్పుడప్పుడు ఇలాంటివి విచారణకు వస్తుంటాయి. కానీ అవి కూడా నిర్దిష్ట ఉత్తర్వులు ఇవ్వగలవా అన్నది సందేహం. కేంద్రం కూడా ఈ ఉచితాలను కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దానికి తగ్గట్లుగానే ప్రధాని మోదీ హెచ్చరిక చేశారు. ఉచిత హామీలు అని కోర్టువారు అన్నా, వాటిని పేదల సంక్షేమ కార్యక్రమాలని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. బహుశా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ట్రెండుకు తెర తీశారని చెప్పాలి. ఆమె ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చారు. దానికి అనుగుణంగా పలు సబ్సిడీ పథకాలను అమలు చేశారు. దీన్ని పాత కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర పార్టీ నేతలు వ్యతిరేకించినా, జన బాహుళ్యం ఇందిరాగాంధీకే జేజేలు పలికింది. ఆ తర్వాత కాలంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి స్కీములను అమలు చేశారు. వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంకానివి కూడా ఉండవచ్చు. తమిళనాడులో ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత; వారికి పోటీగా కరుణానిధి ఇలాంటి హామీలు ఇవ్వడానికి వెనుకాడలేదు. మిక్సర్లు ,గ్రైండర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాగ్దానం చేశారు. రుణ మాఫీ హామీలను కూడా ఆయా జాతీయ పార్టీలు, వివిధ ప్రాంతీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో బీజేపీ సైతం రుణమాఫీ హామీలను ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో 1983లో ఎన్.టి.రామారావు కిలో రెండు రూపాయల పథకానికి హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. అది ఆచరణ సాధ్యం కాదని అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ పరిస్థితిని గమనించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము 1.90 పైసలకే కిలో బియ్యం ఇస్తామని చెప్పి అమలు చేసింది. కానీ ఆ స్కీము పేటెంట్ ఎన్టీఆర్‌దే అన్న భావన వచ్చి ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 2014లో టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీని ప్రకటించింది. ఆ తర్వాత అమలు చేయగలి గింది. ఆ సమయంలో కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల హామీ ఇచ్చినా, ప్రజలు ఆదరించలేదు. మళ్లీ 2023 ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని, అది కూడా ఒకేసారి అమలు చేస్తామని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఈ ప్రకటన చేసి వెళ్లారు. ఇది సాధ్యమా అంటే మామూలుగా అయితే కష్టమే. కానీ తాము వనరులు సమకూర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ మళ్లీ రుణమాఫీ వాగ్దానం చేసింది కానీ, పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోంది. 2014లో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలు, చివరికి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలనూ మాఫీ చేస్తామని భారీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పరిమితులు పెట్టి లక్షన్నర రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అది కూడా అరకొరగా చేసి చేతులు దులుపుకొన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చింది. వాటిలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్ల పెంపు, రైతు భరోసా వంటివి ఉన్నాయి. వాటిలో 95 శాతం అమలు చేసిన ఘనతను వైసీపీ సాధించింది. కరోనా సమయంలో జగన్ స్కీములు పేదలకు బాగా ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం ఉంది. బీజేపీ రైతులకు ఆరువేల రూపాయల చొప్పున ఉచిత పంపిణీ స్కీమును తెచ్చింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఆనాటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత రోజులలో ఆయనే ఈ హామీని ఇవ్వడం విశేషం. ఆమ్ ఆద్మీ పార్టీ మరో అడుగు ముందుకేసి పంజాబ్‌లో ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితం అని ప్రకటించి విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్లో కూడా అదే హామీ ఇస్తోంది. ఒడిషాలో బీజేడీ సంక్షేమ స్కీములపైనే రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగు తోందన్న అభిప్రాయం ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని సుప్రీంకోర్టు కంట్రోల్ చేయగలుగుతుందా? ఏపీలో తెలుగుదేశం పార్టీ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారు తెలుగుదేశం పార్టీని దీనిపై ప్రశ్నించారు. తాము చేయగలుగుతామని ఆ పార్టీ నేతలు వాదించారు. ఎన్నికల సంఘం టీడీపీని వారించలేకపోయింది. మరి కొన్నిచోట్ల కూడా ఈ హామీలు వచ్చాయి. అలాంటి హామీలు వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకోగలిగి, నిరోధించి ఉంటే గొప్ప పేరు వచ్చేదేమో! విశేషం ఏమిటంటే, కరోనా నేపథ్యంలో గౌరవ కోర్టువారే కరోనా వల్ల మరణించిన కుటుంబాల వారికి యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. మరి అది ఉచితం కింద వస్తుందో, రాదో తెలియదు. కొందరు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్లు, ఇతర సదుపాయాలు పొందు తున్నారు. ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వీరు రిటైరయ్యాక తమకు వచ్చే వేల రూపాయల సదుపాయాన్ని మాత్రం వదులుకోరు. న్యాయ వ్యవస్థ తీరుపై ఈ మధ్య రిటైర్డ్ జిల్లా జడ్జీ మంగారి రాజేందర్ ఒక ఆసక్తికర వ్యాసం రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు రిటైరయ్యాక పలు సదుపాయాలు కల్పిస్తున్న తీరును సోదాహరణంగా వివరించారు. వారికి రిటైరయ్యాక ఈ సదుపాయాలు అవసరమా అంటే ఏమి చెబుతాం! నిజంగా వీరిలో ఎవరైనా పేదవారు ఉంటే ఆదుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ హామీలు ఇవ్వాలి? ఏవి ఇవ్వరాదన్నదానిపై నియంత్రణ కష్టసాధ్యం. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకుని ఎగవేస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. దేశ న్యాయ వ్యవస్థ ఇలా రుణాలు ఎగవేసిన వారిని కూడా ఏమీ చేయలేకపోతోందన్న భావన ఉంది. రుణాలు ఎగవేసినవారు అధికార పార్టీలో చేరితే వారి జోలికి ఎవరూ వెళ్లడం లేదన్న భావన సామాన్యులలో కలుగుతోంది. ఈ నేప«థ్యంలో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టగలుగుతుందా? పార్లమెంటు ఎలా స్పందిస్తుంది? ఆయా వ్యవస్థలు ఎలా స్పందిస్తాయన్నదానిపైనే ఇవి ఏ రూపుదాల్చుతాయో చెప్పగలం. ప్రజలలో వీటిపై నిర్దిష్ట అవగాహన వచ్చేవరకూ, పేదరికం పోనంతవరకూ ఈ హామీలను ఎవరూ నిరోధించలేకపోవచ్చేమో! - కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
Telangana: నేటి నుంచి రైతు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమపై వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రూ.25,001 నుంచి రూ.25,100 వరకున్న రుణమాఫీపై ట్రయల్ నిర్వహించారు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలను ఈ నెల 30 వరకు మాఫీ చేస్తారు. 6,06,811 మంది రైతులకు రూ.2005.85 కోట్లు మాఫీ చేయనున్నారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా రూ.25 వేలలోపు రుణాలను 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. రైతులకు శుభాకాంక్షలు: నిరంజన్‌రెడ్డి రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రైతాంగం తరఫున ధన్యవాదాలు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగురంగానికి కేసీఆర్ ఆసరాగా నిలిచారు. ఆకలితో తండ్లాడిన తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు. పంట మారి్పడి వైపు రైతులను ప్రోత్సహించి దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తాం. -
40.66 లక్షల మందికి రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి 40.66 లక్షల మంది రైతులు అర్హులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ), వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించాయి. రూ.25వేల లోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేస్తా మని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఈ నెలలో రూ.1,198 కోట్లు విడుదల చేయనున్నారు. అయితే, నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేయకుండా సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయిం చారు. తక్కువ మొత్తంలో పంట రుణం తీసుకున్న చిన్న, సన్నకారు రైతుల్లో ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రూ.24,736 కోట్లు విడతలవారీగా మాఫీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ అమలు మార్గదర్శకాల్లో ఇచ్చే నిబంధనల ఆధారంగా రైతుల సంఖ్యతోపాటు మాఫీ మొత్తం కూడా కొంత తగ్గే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. కేటగిరీలవారీగా నివేదిక.. రుణమాఫీకి సంబంధించి కేటగిరీలవారీగా ఓ నివేదికను వ్యవసాయశాఖ ప్రభుత్వానికి పంపింది. రూ.25వేల వరకు ఉన్న రుణాలను ఒక కేటగిరీగా, రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రెండో కేటగిరీగా, రూ.50వేల నుంచి రూ.75వేల వరకు మూడో కేటగిరీగా, రూ.75వేల నుంచి రూ.లక్ష వరకు నాలుగో కేటగిరీగా పేర్కొన్నారు. ఇక రూ.లక్ష పైన ఎంత రుణం తీసుకున్నప్పటికీ రూ.లక్ష మాత్రమే మాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్ 11వ తేదీ వరకు ఉన్న రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తారు. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేశాక, రూ.50వేల వరకు ఉన్న రుణాలను కూడా ఒకేసారి మాఫీ చేయాలంటే రూ.3,104 కోట్లు కావాలి. ఈ ఏడాది బడ్జెట్లో రుణమాఫీకి రూ.6,225 కోట్లు ప్రతిపాదించినందున రూ.50వేల వరకు ఉన్న రుణాలను కూడా ఒకేసారి చెక్కుల ద్వారా మాఫీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో రుణమాఫీ సందర్భంగా రైతులకు తలెత్తిన ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక అధికారి తెలిపారు. -
జ్యోతిరాదిత్య X కమల్‌నాథ్
న్యూఢిల్లీ/గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో రైతు రుణ మాఫీ, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఆందోళనలు చేపడతామంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా చేసిన హెచ్చరికపై రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ స్పందించారు. ‘ఆయన (సింధియా) తనకు నచ్చినట్లు చేయొచ్చు. ఆయన్ను ముందుగా ఆందోళనలకు దిగనివ్వండి. చూద్దాం’ అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్లకు వర్తించేదే తప్ప ఐదు నెలలకు కాదంటూ వ్యాఖ్యానించారు. పంటనష్టం సర్వే, రైతు రుణమాఫీ విషయంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరచూ సింధియా తప్పుపడుతున్నారు. సోనియానే చూసుకుంటారు! మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని పార్టీ చీఫ్ సోనియా నియమిస్తారని ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శనివారం గ్వాలియర్‌లో చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. -
‘చంద్రబాబుకు అందుకే అంత ఆక్రోశం’
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలకు చంద్రబాబు చేయలేని మేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారని..అందుకే ఆయనకు ఆక్రోశం ఎక్కువయిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. 2014 లో రైతుల రుణాలు, బంగారం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసింది చంద్రబాబు కాదా... అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే నాలుగు, ఐదు విడతల రుణమాఫీ జీవో ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు.బడ్జెట్లో రుణమాఫీకి నిధులను కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ నిధులను ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పై చర్చకు రావాలని టీడీపీ నేతలను కన్నబాబు సవాల్ విసిరారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన వాగ్దానాన్ని కూడా అమలు చెయ్యని అసమర్థుడు చంద్రబాబు’ అని వ్యాఖ్యనించారు. ఎన్నికల కోడ్ సమయం లో కేబినెట్ సమావేశాలు పెట్టారు కదా..? అప్పుడేందుకు చెల్లించలేదని చంద్రబాబును నిలదీశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హామీ ని నెరవేరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని సమృద్ధిగా వర్షాలు కురిసాయని.. సీఎం జగన్ పాలనలో రైతులకు సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. -
రుణమాఫీ గజిబిజి
సాక్షి, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై సర్కారు కసరత్తు ప్రారంభించింది. మాఫీ అమలుకు సంబంధించి మార్గ దర్శకాలను ఖరారు చేసే ప్రక్రియ ను వ్యవసాయశాఖ మొదలు పెట్టింది. రుణమాఫీని ఎలా, ఎప్పటినుంచి అమలు చేయాలి? అర్హులను ఎలా గుర్తించాలి? గత రుణమాఫీ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తాయి? ఈసారి అటువంటి విమర్శలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తది తర అంశాలపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు. అందులో భాగంగా అసలు రుణమాఫీ ఎంత చేయాల్సి వస్తుందన్న దానిపై లెక్కలు తీస్తున్నారు. అయితే రుణమాఫీకి ఎంత సొమ్ము అవసరమన్న దానిపై గందరగోళం నెలకొంది. బ్యాంకు లెక్కలకు, వ్యవసాయశాఖ లెక్కలకు మధ్య పొంతన లేకుండా పోయింది. రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా ఈ గందరగోళం నెలకొంది. ఏది సరైన సమాచారమన్న అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బ్యాంకులు మాత్రం రూ.20 వేల కోట్లు రుణమాఫీకి సరిపోతాయని సర్కారుకు విన్నవించగా, వ్యవసాయ వర్గాలు రూ.26 వేల కోట్లు అవసరమని అంచనా వేశాయి. బ్యాంకులైతే తమ అంచనాను ఆర్థికశాఖకు కూడా అందజేసినట్లు సమాచారం. అయితే ఈ లెక్కలు ఏమేరకు సరిగ్గా ఉన్నాయనే దానిపై అధికారుల్లో పలు సందేహాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుత రుణమాఫీకి కటాఫ్ తేదీని 2018 డిసెంబర్ 11గా ప్రకటించింది. కటాఫ్ తేదీని ప్రకటించిందేకానీ, ఎప్పటినుంచి అమలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. చెరకు, పసుపు రైతులను మరిచారా? బ్యాంకర్లు, వ్యవసాయశాఖ వర్గాలు మాత్రం గత రుణమాఫీ కింద చివరి విడత సొమ్ము చెల్లించిన నెల నుంచి పరిగణలోకి తీసుకుంటున్నాయి. 2017 సెప్టెంబర్ నాటికి గత రుణమాఫీ పూర్తిగా చెల్లించిన నెలగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి 2018 డిసెంబర్ 11 వరకు లెక్కలోకి తీసుకున్నట్లు వారంటున్నారు. ఆ ప్రకారమే తాము రుణమాఫీకి అర్హులను, సొమ్మును అంచనా వేశామని అంటున్నారు. బ్యాంకర్లు చెరకు, పసుపు రైతులను పరిగణలోకి తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దానివల్ల బ్యాంకర్లు తక్కువ సొమ్ము చూపారని వ్యవసాయాధికారులు అంటున్నారు. తాము ఆ రైతులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, అందుకే రూ.26 వేల కోట్ల వరకు లెక్క తేలిందంటున్నారు. అయితే ఎప్పటినుంచి అమలు చేస్తారన్న తేదీ ఖరారు చేసి మార్గదర్శకాలు విడుదల చేశాకే రైతుల సంఖ్య, చెల్లించాల్సిన సొమ్ముపై స్పష్టత రానుంది. 39లక్షల మంది రైతులకు మాఫీ! రెండోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి రుణమాఫీ చేస్తానని అధికార పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్ష రూపాయలు మాఫీ చేస్తానని ప్రకటించింది. అందులో భాగంగానే గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించింది. అయితే ఎన్ని విడతలనే విషయాన్ని మాత్రం సర్కారు ప్రకటించలేదు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించి అమలుచేసింది. 35.29 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో నిధులు కేటాయించి మాఫీ చేసింది. మొదటి విడత 2014–15లో రూ.4,040 కోట్లు, రెండో విడత 2015–16లో రూ.4,040 కోట్లు, 2016–17లో మూడో విడత రూ 4,025 కోట్లు, నాలుగో విడత 2017–18లో రూ.4,033 కోట్లు మాఫీ చేసింది. ఈసారి ఎన్ని విడతలుగా మాఫీ చేస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. మార్గదర్శకాలు వచ్చాకే.. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. గత డిసెంబర్ 11వ తేదీని కటాఫ్‌గా ప్రకటించగా, డిసెంబర్ 31 వరకు ఎస్ఎల్బీసీ వద్ద లెక్కలున్నాయి. ఆ లెక్కల ప్రకారం చూస్తే 48 లక్షల మందికి రూ.31 వేల కోట్లు రుణాలు తీసుకున్నట్లు ఉంది. అయితే లక్ష లోపు రుణాలు ఉన్నవారెందరనేది తేలాల్సి ఉంది. అంతేకాదు అంటే డిసెంబర్ 11వ తేదీకి, డిసెంబర్ 31వ తేదీకి మధ్య భారీ తేడా కనిపిస్తుంది. ఎందుకంటే గత రబీకి సంబంధించి అనేక మంది రైతులు ఆ తేదీల మధ్య కొత్త రుణాలు తీసుకొని ఉంటారు. కాబట్టి వారిని మినహాయించాల్సి ఉంది. ఏదేమైనా వ్యవసాయశాఖ మాత్రం 39లక్షల మంది రైతులకు రూ.26 వేల కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గత రుణమాఫీకి ఇప్పటికీ రైతుల సంఖ్య మరో నాలుగు లక్షలు పెరిగే అవకాశముంది. రైతుబంధు తర్వాతేనా! ఈ ఖరీఫ్ రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికీ రైతులకు అందజేసే ప్రక్రియ కొనసాగుతోంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్‌లో 50లక్షల మంది రైతులకు రూ.6,900 కోట్లు రైతుబంధు కింద చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకు 33లక్షల మందికి రూ.3,500 కోట్లు రైతుబంధు సొమ్ము చెల్లించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి తెలిపారు. ఇంకా మిగిలిన రైతులకు త్వరలో చెల్లిస్తామని ఆయన చెబుతున్నారు. రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తయిన తర్వాత రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు బ్యాంకులు రైతులకు సహకరించాలని కోరుతున్నారు. రైతులకు పంటరుణాలు సక్రమంగా ఇవ్వాలని, రుణమాఫీతో ముడిపెట్టకుండా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ విన్నపాన్ని బ్యాంకర్లు పెడచెవిన పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
రైతన్నల ఆత్మాభిమానమే నా లక్ష్యం
సాక్షి, అమరావతి : రైతన్నలు ఆత్మాభిమానంతో జీవించేలా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. అన్నదాతలు పండించిన ప్రతి గింజకూ న్యాయం జరగాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల కళ్లల్లో వెలుగులు చూడడమే తన ఆశయమని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతు బాంధవుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు తొలి లేఖ రాశారు. ఇందులో తన ప్రాధమ్యాలను వివరించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు... ఆత్మ బంధువులు, అన్నదాతలైన రైతన్నలకు మీ జగన్ నమస్కరిస్తూ రాస్తున్న లేఖ.. డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతిఏటా జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన బాటను మరింత మెరుగు పరిచేందుకు మన ప్రభుత్వం నవరత్నాలతో ముందుకు వచ్చింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా. ఈ ఏడాది అక్టోబరు నుంచే ప్రతి రైతు కుటుంబానికీ రూ.12,500 రైతు భరోసా కింద అందించబోతున్నాం. ఈ డబ్బును బ్యాంకులు ఇంతకు ముందున్న మీ అప్పులకు జమ చేసుకోకుండా నేరుగా మీ చేతికే అందించబోతున్నాం. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.8,750 కోట్ల మేర పెట్టుబడి సహాయం అందబోతోంది. 15.36 లక్షల కౌలు రైతులకూ మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. రూ.2 వేల కోట్లతో విపత్తుల సహాయనిధి తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రూ.2,000 కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని నెలకొల్పుతున్నాం. శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 ప్రోత్సాహకంగా ప్రకటిస్తూ జీవో జారీ చేశాం. ఈ రోజు నుంచే ఆ డబ్బును అందించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ శీతల గిడ్డంగులు, గోదాముల నిర్మాణంతో పాటు అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాం. కౌలుదారులకు మేలు చేస్తాం.. భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతూ, కౌలుదారులకు సైతం మేలు చేసేలా 11 నెలల పాటు సాగు ఒప్పందం ఉండేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకురాబోతున్నాం. తద్వారా కౌలు రైతులకు అన్ని రకాలుగా మంచి చేయాలని నిర్ణయించాం. వ్యవసాయానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోయిన రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందిస్తాం. ఆ డబ్బు రైతు కుటుంబం చేతికే అందిస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందిస్తున్నాం. సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు అదనంగా రూ.4 బోనస్ రెండో ఏడాది నుండి ఇవ్వబోతున్నాం. పామాయిల్ రైతులకు రూ.85 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించబోతున్నాం. పొగాకు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకున్నాం. నాఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు భూసార కార్డులు, రాయితీపై విత్తనాల సరఫరా, సకాలంలో ఎరువుల పంపిణీ, రాయితీపై సూక్ష్మపోషకాల సరఫరా వంటి వాటికి చర్యలు తీసుకుంటున్నాం. కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిరోధించడానికి చర్యలు చేపడతాం. ప్రతి నియోజకవర్గంలో ప్రయోగశాలలు, ప్రతి గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. చివరిగా ఒక్క మాట... పండించిన ప్రతి ధాన్యపు గింజపై అది ఎవరు తినాలో దేవుడు రాసి పెడతాడన్నది నానుడి. కష్ట జీవులైన రైతులు, వారి కుటుంబాల్లో ఆనందాలను నింపేలా మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికీ.. అవినీతిని నిర్మూలించడానికి సాగిస్తున్న కృషికి దేవుడి దీవెనలు, మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నా. ప్రతి రైతన్నకూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు’’ రూ.84 వేల కోట్ల పంట రుణాలు బ్యాంకుల నుంచి ఈ ఏడాది రైతులకు రూ.84,000 కోట్లు రుణాలుగా అందజేయాలని నిర్ణయించాం. రూ.లక్ష వరకు పంట ఋణాలు తీసుకున్న రైతులు గడువు లోపు తిరిగి చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీ ఉండదు. వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియంను ఇక ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.2,163 కోట్ల బీమా ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. పగటి పూటే 9 గంటల విద్యుత్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇచ్చే సామర్థ్యాన్ని తీసుకువచ్చేలా రూ.1,700 కోట్లు ఖర్చు చేసున్నాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం. -
రుణం.. మాఫీ అయ్యేనా!
పంట రుణాల మాఫీ కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాల చెల్లింపునకు సమయం ఆసన్నం కావడంతో ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అసలు రుణ మాఫీ ఉందా.. లేదా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తీసుకున్న రుణ మొత్తాన్నిగానీ.. లేదంటే వడ్డీగానీ చెల్లించాలని రైతులకు బ్యాంకర్లు ఫోన్లు చేస్తున్నారు. దీనికితోడు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తున్న రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘పాత బకాయిలు చెల్లించండి.. లేదంటే వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకోండి’ అని బ్యాంకర్లు చెబుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు పంట రుణాణం మాఫీ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినప్పటికీ ఈ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడకపోవడంతో ఖరీఫ్ పంట కాలానికి రుణ వితరణ నిలిచిపోయింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గత ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ.880 కోట్ల వరకు పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారం 2018 డిసెంబరు 11వ తేదీ కన్నా ముందుగా తీసుకున్న రుణాలన్నింటికీ మాఫీ వర్తింపచేసే అవకాశముంది. ఈ మేరకు జిల్లాలో దాదాపుగా రూ.475 కోట్ల వరకు పంట రుణాలు మాఫీ కావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2.72 లక్షల మంది రైతులు ఉండగా.. ఇందులో సుమారు 1.40 లక్షల మంది రైతులు రుణాలు పొందారు. వీరిలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 95 వేల మంది ఉండొచ్చని అంచనా. పాత రుణాలను 2018 డిసెంబరు 11 తర్వాత రెన్యూవల్ చేసుకున్నా మాఫీ వర్తిస్తుంది. కానీ, డిసెంబరు 11 తర్వాత రెన్యూవల్ చేసినా మాఫీ పరిధిలోకి తాము రామని రైతులు ఆందోళన చెందుతు న్నారు. పాత రుణాలన్నింటికీ మాఫీ వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నా.. రైతుల్లో నమ్మకం కలగటం లేదు. పెరుగుతున్న వడ్డీ భారం పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు వడ్డీతో సహా అసలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ వర్తింపజేస్తారు. కాగా, రుణ మాఫీపై స్పష్టత వచ్చేవరకు అప్పు చెల్లిం చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీరాయితీ రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో బ్యాంకులకు విడుదల చేయకపోవడంతో కొందరు బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాలకు ఐదేళ్ల నుంచి రిబేటుని సర్కారు విడుదల చేయకపోవడం కారణంగా సంఘాలు కూడా ప్రస్తుతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఫలితంగా రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో పంట రుణ మాఫీ మార్గదర్శకాలను త్వరితగతిన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పంట రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు తమకు ఇంకా అందలేదని సమాధానమిచ్చారు. రెన్యూవల్ చేసుకోవాలని చెబుతున్నారు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేసేందుకు పెట్టుబడికి డబ్బులు లేవు. గత ఏడాది మే నెలలో నా పేరు మీద ఉన్న 4ఎకరాల పొలానికి ఎస్బీఐ బ్యాంకులో రూ.99 వేల పంట రుణం తీసుకున్నా. రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తారని చెప్పడంతో రెన్యూవల్ చేయించుకోలేదు. వారం రోజుల క్రితం పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళితే ‘రుణమాఫీ తర్వాత అవుతుంది.. మొదట మీ బాకీ రెన్యూవల్ చేసుకోండి. రుణం పెంచి ఇస్తాం’ అని బ్యాంకు అధికారులు చెప్పారు. – బాలమోని కృష్ణయ్య, అవురుపల్లి. మాడ్గుల అప్పు చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామంటున్నారు తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట్‌కు చెందిన రైతు సైదుపల్లి వెంకట్‌రెడ్డి 2014లో తలకొండపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకున్నారు. ప్రభుత్వం సంవత్సరానికి 25 శాతం చొప్పున నాలుగు విడతలుగా మాఫీ చేసినా వడ్డీకే సరిపోయింది. అసలు రూ.లక్ష అలాగే మిగిలింది. రూ.లక్షలోపు పంట రుణాన్ని మాఫీ చేస్తానని సీఎం ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందోనని ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నాడు. ఖరీఫ్ సీజన్ రావడంతో రుణాల కోసం బ్యాంకుల వెళ్తే.. పాత అప్పు చెల్లిస్తేనే రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు అంటున్నారు. మాఫీ కోసం ఎదురుచూస్తున్నాం నాకు మా గ్రామ శివారులో ç2ఎకరాల 14గుంటల భూమి ఉంది. గతేడాది నందిగామలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.86 వేలు పంట రుణం తీసుకున్నా. ఇవిమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాఫీ కోసం ఎదురుచూస్తున్న. ఖరీఫ్ సాగు పెట్టుబడుల కోసం బ్యాంకుకు వెళ్తే రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. –ఓజిని విఠలయ్య, వీర్లపల్లి, నందిగామ మండలం. -
రుణమాఫీ బకాయిలు చెల్లించేలా ఒత్తిడి చేద్దాం
సాక్షి, అమరావతి: తాము అధికారంలో ఉండగా చేసిన రైతు రుణమాఫీ మొత్తంలో బకాయి ఉన్న నాలుగు, ఐదో విడత వాయిదాలు వెంటనే చెల్లించేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీ సమావేశంలో నిర్ణయించారు. రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలు చేస్తామంటున్నారని, ఈ ఖరీఫ్‌లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం నిలిపేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం పార్టీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై పెరిగిన దాడులను ఖండించాలని చంద్రబాబు నాయకులకు సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అవినీతి గురించి చెబితే సన్మానాలు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారనే విషయాన్ని పలువురు నేతలు ప్రస్తావించగా అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అనేది తేలిపోయిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును మొదట కేంద్రానికి ఇస్తామన్నారని, ఇప్పుడు ప్రభుత్వమే చేపడతామంటోందని పలువురు నేతలు తెలిపారు. ఇప్పటికే రైతులు ఒక సీజన్ కోల్పోయారని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.నాలుగు వేల కోట్లు తెచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేస్తామనడం సరికాదని కొందరు నాయకులు తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుకు నిలిచిపోయే పరిస్థితి తెచ్చారన్నారు. ప్రభుత్వాలు మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపేయడం సరికాదని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందిద్దామని చంద్రబాబు తెలిపారు. ఎక్కువకాలం మౌనం వద్దు... ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వాలనే నినాదం బాగా పనిచేసిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. సామాజిక సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఈ ఎన్నికల్లో పనిచేశాయని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంగా ఎక్కువ కాలం మౌనంగా ఉండటం కూడా మంచిది కాదని పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులతో ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలపై అందులో చర్చించాలని, మంగళవారం ఉదయం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, ఎమ్మెల్యేలు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవర ప్రసాద్, నారా లోకేష్, అశోక్ బాబు, టీడీ జనార్దన్, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వర రావు, కాలువ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేం రైతుల్ని జైళ్లకు పంపం
బదౌన్/వంత్లి: తాము అధికారంలోకి వస్తే రుణం తిరిగి చెల్లించలేని రైతులను జైళ్లకు పంపబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. యూపీలోని అమ్లా, గుజరాత్‌లోని వంత్లిలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ‘వేలాది కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించారు. అదే, రూ.20 వేలు అప్పు తీసుకుని చెల్లించలేని రైతులను మాత్రం జైళ్లలో పెట్టారు. ఇలా ఇక జరగదు. రుణాలు తీసుకున్న బడా వ్యాపారవేత్తలను జైళ్లకు పంపుతాం. రుణం చెల్లించలేని ఒక్క రైతును కూడా జైలుకు పంపబోం’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం ఉండరాదన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లోని తమ కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చేశాయన్నారు. ‘ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు బడ్జెట్లుంటాయి. ఒకటి సాధారణ బడ్జెట్ కాగా మరోటి రైతు బడ్జెట్. రైతు బడ్జెట్లో కనీస మద్దతు ధరలను, రైతు బీమా చెల్లించే మొత్తం కూడా ముందుగా ప్రకటిస్తాం’ అని రాహుల్ తెలిపారు. ‘కాపలాదారే దొంగ(చౌకీదార్ చోర్ హై)అని ఎస్పీ– బీఎస్పీ ఎన్నడూ విమర్శించకపోవడానికి కారణం.. ఆ రెండు పార్టీల అసలు గుట్టు మోదీ వద్ద ఉండటమే’ అని ఎస్పీ, బీఎస్పీలపై ఆరోపణ చేశారు. ‘నోట్లు రద్దు చేసిన మోదీ ప్రజల ధనాన్ని లాగేసుకున్నారు. ఆ డబ్బును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని, పేదల అకౌంట్లలో జమ చేస్తుంది’అని పేర్కొన్నారు. -
గాంధీజీ భారత్, గాడ్సే భారత్
న్యూఢిల్లీ: ప్రేమను పంచే మహాత్మాగాంధీ భారత్, ద్వేషాన్ని నూరిపోసే గాడ్సే భారత్.. ఇందులో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గాంధీజీ భారత్ లేక గాడ్సే భారత్.. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. ఒక వైపు ప్రేమ, సోదరభావం, మరో వైపు ద్వేషం, భయం. గాంధీజీకి భయం లేదు. ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ అప్పటి బ్రిటిష్ పాలకులతో ప్రేమగానే మాట్లాడారు. కానీ, వలస పాలకులపై ద్వేషాన్ని నూరిపోసిన వీర సావర్కర్ మాత్రం తనను క్షమించి వదిలేయాలంటూ బ్రిటిష్ వారిని ప్రాధేయపడ్డారు’ అని తెలిపారు. ‘మేకిన్ ఇండియా అంటూ తరచూ మాట్లాడే మోదీ.. ధరించే దుస్తులు, చెప్పులు, సెల్ఫీలు తీసుకునే ఫోన్..ఇవన్నీ చైనాలో తయారైనవే’ అంటూ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతు రుణ మాఫీ అమలు చేశామన్నారు. నేడు సీడబ్ల్యూసీ భేటీ అహ్మదాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండు రోజులకే ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచి దేశానికి గట్టి రాజకీయ సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ముందుగా అహ్మదాబాద్‌లోని సబర్మతీ గాంధీ ఆశ్రమంలో ప్రార్థనా సమావేశం నిర్వహించి, ఆ తర్వాత సర్దార్ పటేల్ జాతీయ స్మారకంలో సీడబ్ల్యూసీ భేటీ అవనుంది. -
మోసం చేయడానికే.. ‘అన్నదాత సుఖీభవ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సీఎం చంద్రబాబు నాయుడు స్తోత్రంలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇది మధ్యంతర బడ్జెటో లేక పూర్తిస్థాయి బడ్జెటో టీడీపీ నాయకులకే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ రాబోయే ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడారు. ఇది కేవలం ఎన్నికల బడ్జెటే అంటూ తేల్చిచెప్పారు. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప నిజంగా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గాలు లేవన్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, బాబు మాయ మాటలను నమ్మరని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయని చంద్రబాబు.. రైతులను మరోసారి మోసగించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు సరిగా లేవని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదించిన రైతు రుణమాపీలో ఇంకా రూ.8,200 కోట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నాటికి రైతుల అప్పులు రూ.1.37లక్షల కోట్లకు చేరాయని ఆయన అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఇళ్ల మంజూరు కేవలం రూ.4,099 కోట్ల రూపాయల కేటాయింపులతో ఎలా సాధ్యమని రామకృష్ణ ప్రశ్నించారు. -
‘పీఎం కిసాన్’కు ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులకు తోడ్పాటు అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతులు తమ గుర్తింపు కార్డు కింద ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి నెలలో ఇచ్చే తొలి విడతలో మాత్రం ఇది ఐచ్ఛికమేనని (ఆప్షనల్) పేర్కొంది. తొలి విడత నగదు పొందేందుకు ఆధార్‌కు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండో విడత నుంచి నగదు పొందాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం లేఖ రాసింది. పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిబ్రవరి 1 నాటికి భూరికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది. రైతుకు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆ భూములన్నింటిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే పీఎం కిసాన్ పథకం అమలుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో నోడల్ యూనిట్లను, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. -
అధికారంలోకి వస్తే రుణమాఫీ
పట్నా: లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఆహార శుద్ధి పరిశ్రమలను బాగా ప్రోత్సహిస్తామన్నారు. బిహార్ రాజధాని పట్నాలో మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రం తెచ్చిన పంట బీమా పథకం పేద రైతులు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కొందరు పెద్ద వ్యాపారవేత్తల జేబుల్లోకి చేరుస్తోందని రాహుల్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల దుస్థితిని మారుస్తామనీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కాంగ్రెస్ ఇటీవల అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ప్రజలందరికీ కనీస ఆదాయాన్ని కూడా కల్పిస్తామనీ, 2014లో బీజేపీ ఇచ్చిన రూ. 15 లక్షల అబద్ధపు హామీలాంటిది ఇది కాదని రాహుల్ చెప్పారు. రాహుల్‌కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ అన్నారు. -
ఈ నెల నుంచే ‘పీఎం కిసాన్’ సాయం
న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు తెచ్చిన పీఎం కిసాన్ పథకం నగదు సాయాన్ని ఈ నెల నుంచే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన్ మం త్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) కింద ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 12 కోట్ల మంది లబ్ధి పొందే రైతులు న్నారని.. రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. ‘ఈ పథకం గతేడాది డిసెంబర్ నుంచి వర్తించనుంది. బడ్జెట్ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించారు. భూముల రికార్డుల డేటా కూడా సిద్ధంగా ఉంది. అలాగే చిన్న, సన్నకారు రైతుల వివరాలు మా దగ్గర ఉన్నా యి..’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆదివారం తెలిపారు. -
6 వేల విలువేంటో వారికేం తెలుసు?
లేహ్/జమ్మూ/శ్రీనగర్: రైతులకు ఆరు వేల రూపాయలు ఎంత ముఖ్యమనే విషయం ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చునే వారికి తెలియదంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ్టపై ఆదివారం విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులను ఆకట్టుకునే ఉద్దేశంతో ఐదెకరాల్లోపు సాగు భూమి ఉన్న వ్యవసాయదారులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్రం తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రైతులకు ఇచ్చేది రోజుకు 17 రూపాయలేనా, ఇది వారిని అవమానించడమేనంటూ ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలకు స్పందనగా జమ్మూ కశ్మీర్లో మాట్లాడుతూ ‘పీఎం–కిసాన్ ఒక గొప్ప పథకం. పేద రైతుకు ఈ రూ.6 వేలు ఎంత ముఖ్యమో ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చునే వారికి అర్థం కాదు. ఈ రాష్ట్రంలో కూడా చాలా మందికి ఈ పథకం వల్ల లబ్ధి జరుగుతుంది. ఆదివారమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మార్గదర్శకాలు పంపిస్తా’ అని అన్నారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని విజయపూర్‌లో మోదీ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీని కాంగ్రెస్ ఎన్నికల గిమ్మిక్కుగా వాడుతోందని మోదీ ఆరోపించారు. ‘2008–09లో రూ. 6 లక్షల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించి, అధికారంలోకి వచ్చాక, రూ. 52 వేల కోట్ల విలువైన రుణాలనే మాఫీ చేసింది. మాఫీ పొందిన వారిలో 30 లక్షల మంది అనర్హులే ఉన్నట్లు కాగ్ తేల్చింది’ అని మోదీ అన్నారు. భరతమాత బిడ్డలకు సాయం చేస్తాం.. 1947లో దేశ విభజన కారణంగా ఈ దేశ పౌరులు కాకుండా పోయిన భారతి బిడ్డలను కాపాడతామని చెప్పారు. కశ్మీరీ పండితుల మహా నిష్క్రమణం తననెప్పుడూ గుండెల్లో బాధకు గురిచేస్తుంటుందని మోదీ వెల్లడించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ .. శ్రీనగర్, లడఖ్, లేహ్, విజయ్‌పూర్, కఠువా తదితర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. లేహ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రజలు -
ఈసారి ‘రైతన్న’ బడ్జెటే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాబోయే సాధారణ బడ్జెట్లో రైతులకు భారీగా తాయిలాలు ప్రకటించాలని యోచిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెటే అయినా చిన్న, సన్నకారు రైతుల్ని ఆకర్షించే నిర్ణయాలు తీసుకునే చాన్సుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం యోచిస్తున్న చర్యల్లో..పంట సాగుకు ముందే నగదు రూపంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు మంజూరు చేయడం లాంటివి ఉన్నట్లు తెలుస్తోంది. పంటల దిగుబడులు పెరిగినా ధరలు తగ్గకుండా ఉండేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే వీలుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభ నివారణకు ఇటీవల బీజేపీ జాతీయ మండలి తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతులకు చేసిన దాని పట్ల బీజేపీ వర్గాలే సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలంటే వ్యవసాయ రంగానికి ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీపై ఒత్తిళ్లు అధికమైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ఏడాది ప్రకటించే బడ్జెట్ సంప్రదాయాల్ని తోసిరాజని, వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిపెట్టామని జైట్లీ ఇటీవల∙అన్నారు. రైతులకు భారీ పథకం ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బీజేపీ రైతు విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికల్లో కొన్ని 1. రైతులకు నేరుగా నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ 2. రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు 3. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు -
కాంగ్రెస్.. ఓ లాలీపాప్ కంపెనీ
ఘాజీపూర్/వారణాసి: రుణమాఫీ విషయంలో దేశంలోని రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు భిన్నంగా ఆ పార్టీ రైతులకు లాలీపాప్స్(చిరు తాయిలాలు) అందించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాని లాలీపాప్ కంపెనీగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా శనివారం ఘాజీపూర్, వారణాసిలో రూ.98 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అనర్హులకే రుణమాఫీ చేశారు ‘కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఓ 800 మంది రైతుల రుణాలను మాఫీ చేసి చేతులు దులుపుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఈ లాలీపాప్ కంపెనీ(కాంగ్రెస్) మర్చిపోయింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 22 పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను పెట్టుబడి వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచింది. అంతేకాదు పూర్వాంచల్ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహేల్దేవ్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. వారణాసిలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సౌత్ ఏసియా రీజినల్ సెంటర్(ఐఎస్ఏఆర్సీ) క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ, దీన్ని జాతికి అంకితం చేశారు. దక్షిణాసియాలో వరి పంటపై పరిశోధనలకు, శాస్త్రవేత్తల శిక్షణకు ఐఎస్ఏఆర్సీ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రధాని మోదీ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడాక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేశాక ఇప్పుడు మోదీకి రైతులు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవాచేసింది. -
కర్ణాటకలో అభివృద్ధిరహిత అవినీతి
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో గర్వం పెరిగిందని, వారి దృష్టంతా అభివృద్ధి రహిత అవినీతిపైనే ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పదవుల కోసం పోటీపడటానికే అధికారంలో కొనసాగుతున్నారని, రుణమాఫీ పేరిట తెచ్చిన పథకం రైతులపై పేల్చిన ఒక హేయమైన జోక్ అని ఘాటుగా స్పందించారు. మోదీ శుక్రవారం కర్ణాటక బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ‘కర్ణాటక ప్రజలు అవినీతిరహిత పాలనను కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అభివృద్ధిరహిత అవినీతిని అందిస్తోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో పదవుల పంపకం మ్యూజికల్ చైర్స్ గేమ్ తరహాలో సాగుతోందని విమర్శించారు. రూ.44 వేల కోట్ల మేర రైతు రుణాల్ని మాఫీ చేస్తామని సీఎం కుమారస్వామి ప్రకటించినా, దాని అమలు నత్తనడకన సాగుతోందని, ఇప్పటి వరకు కేవలం 800 మంది రైతులకే లబ్ధి చేకూరిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేసేవారికి ఎలాంటి ఐడీ కార్డులు అవసరం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో యువత అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మోదీ వెల్లడించారు. ఇందుకోసం ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంట్రెప్రెన్యూర్‌షిప్, ఎక్సలెన్స్ అనే 4 ‘ఈ’లపై ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలిపారు. నాలుగేళ్లలో 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, ఒక నిట్, 14 ట్రిపుల్ ఐటీలు, 103 కేంద్రీయ విద్యాలయాలను స్థాపించినట్లు గుర్తు చేశారు. -
రైతు స్వేదంతో రాజకీయ సేద్యం
గత సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంత రైతులు బీజేపీ ప్రభుత్వాన్ని ఓటమి అంచుల్లోకి తీసుకుపోవడం, ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను రైతులు సాగనంపడం, రైతుబంధు పథకంతో తమను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వానికి రైతులు ఘనవిజయం కట్టబెట్టడం చూస్తుంటే.. ఓటింగ్ సమయంలో రైతులు నిర్ణయాధికారాన్ని శక్తిమంతంగా ప్రకటించే స్థితికి చేరుకున్నారని భావించక తప్పదు. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 11 తర్వాత భారత రాజకీయాల్లో వ్యవసాయం కేంద్ర బిందువై కూర్చుంది. కానీ ఇది వ్యవసాయ పునరుజ్జీవనానికి తోడ్పడుతుందా అన్నదే ప్రశ్న. ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా వెల్లడైంది. గత సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు మత ఆగ్రహాన్ని చక్కగా ప్రదర్శించారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో పాలక బీజేపీని ఓటమి అంచులదాకా తీసుకురావడం అనేది ఆ ప్రాంతంలో తీవ్రమైన వ్యవసాయ దుస్థితిని స్పష్టంగా చాటి చెప్పంది. గ్రామీణ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం, వీధుల్లోకి వచ్చిన రైతుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలు వ్యవసాయం ప్రధానంగా ఉండే హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో పాలక ప్రభుత్వాలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన పరాజయం ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగానే చిత్రిం చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ తనకు అధికారమిస్తే వ్యవసాయ రుణాల మాఫీని, వరిపంటకు అధిక గిట్టుబాటు ధరలను కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష నగదు ప్రోత్సాహం కలిగించిన అపార ప్రజాదరణతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అద్వితీయ విజయం సాధించారు. దేశంలోనే ప్రప్రథమంగా అమలైన ఈ వినూత్న పథకం ద్వారా తెలంగాణలోని భూ యజమానులు సంవత్సరానికి ఎకరా భూమికిగాను రూ. 8,000ను వ్యవసాయ దిగుబడి ఖర్చులను ప్రభుత్వం నుంచి సహాయకంగా పొందారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లోని 58 లక్షలమంది రైతులకు అందించి రికార్డు సృష్టించింది. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018–19 బడ్జెట్లో రూ. 12,000 కోట్లమేరకు కేటాయించింది. ఈ పథకం కింద రైతుకు అందించే నగదును రూ. 10,000కు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వెంటనే జార్ఖండ్ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎకరా భూమికి రైతుకు రూ. 5,000లను అందించే పథకాన్ని ప్రకటించి తెలంగాణ బాటలో నడిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయ రుణాల మాఫీపై ఎన్నికల ప్రచార సమయంలో చేసిన హామీని అమలు చేస్తూ సంతకాలు పెట్టడంలో ప్రదర్శించిన వేగాన్ని పరిశీలించినట్లయితే, వ్యవసాయానికి సంబంధించినంతవరకు ఈ రాజకీయ అత్యావశ్యకతను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని స్పష్టంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కోరైతుకు గరి ష్టంగా 2 లక్షల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. దీనికయ్యే ఖర్చు దాదాపు రూ.35,000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో వ్యవసాయ రుణాల మాఫీకోసం వరుసగా రూ. 18,000 కోట్లు, రూ. 6,100 కోట్లను ఖజానా నుంచి వెచ్చించనున్నాయి. ఈ రుణమాఫీలు పూర్తిగా అమలయితే 83 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతుల రుణమాఫీ వల్ల జమాఖర్చుల పట్టీలు (బ్యాలెన్స్ షీట్స్) అస్తవ్యస్థమవుతాయని, పైగా ఇది చెడు సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు, ప్రణాళికా కర్తలు మొత్తుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రుణమాఫీలపై తిరుగులేని విధంగా ప్రకటన చేశారు. ‘రైతులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. ఈ దేశం మీది. మీ రుణాలను మొత్తంగా మాఫీ చేయవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయి. వ్యవసాయ రుణ మాఫీలను చేసేంతవరకు ప్రధానిని మేం నిద్రపోనీయం. ఒకవేళ మోదీ ఈ పనిచేయనట్లయితే, నూటికి నూరు శాతం కాంగ్రెస్ అందుకు పూనుకుంటుందని మాట ఇస్తున్నా. ‘రాహుల్ గాంధీ వాదనలో కాస్త హేతువు ఉంది మరి. 2014 ఏప్రిల్ నుంచి 2018 ఏప్రిల్ మధ్యకాలంలో మన దేశ కార్పొరేట్ రంగం నుంచి రాబట్టలేని రూ. 3.16 లక్షల కోట్ల మొండి బకాయిలను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం రద్దు చేస్తున్నా ఘనత వహించిన మన ఆర్థికవేత్తలూ లేక బ్యాంకర్లు కిమ్మనడం లేదు. గావుకేకలు పెట్టడం లేదు. ఆర్తనాదాలు చేయడం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించగా చాలాచోట్ల గ్రామీణ ప్రజలు నాతో ఇదే విషయమై వాదులాటకు దిగారు. కార్పొరేట్ కంపెనీల భారీ రుణాలను ఉన్నపళాన రద్దు చేస్తున్నప్పుడు రైతుల రుణాలను ఎందుకు రద్దు చేయరు అనేది వారి ప్రశ్న. నిజానికి వారి ఆగ్రహం కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పైకి మళ్లింది. ఎందుకంటే కార్పొరేట్ రుణాలను రద్దు చేయడం ఆర్థిక ప్రగతికి దారితీస్తుందని ఆయన రికార్డుపూర్వకంగా ప్రకటించారు. మరోవైపున ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక రైతు రుణ మాఫీని ప్రకటించినప్పుడు, అది జాతీయ బ్యాలెన్స్ షీట్లను దెబ్బతీస్తుందని, నైతికపరంగా అది అపాయకారి అని నాటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అయినప్పటికీ, హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఓటర్లు ఇచ్చిన స్పష్టమైన తీర్పు వ్యవసాయాన్ని భారత రాజకీయరంగం కేంద్రపీఠంలోకి తీసుకొచ్చింది. రాజకీయ ఎజెండాలో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం లభించింది. దీని సందేశం చాలా స్పష్టంగానూ, బిగ్గరగానూ వినిపించింది. బహుశా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికల తీర్పు వ్యవసాయ సమాజంలో కొట్టొచ్చినట్లుగా ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించినట్లు సంకేతాలు వెలువరించింది. మతం, కులం, సిద్ధాంతాలు ప్రాతిపదికన రాజకీయ పార్టీల విభజన విధానాలకు దాటి ఆలోచిస్తున్న రైతాంగం, ఇప్పుడు తమ సామూహిక ఓటింగ్ శక్తిని వాస్తవంగా గ్రహిస్తున్నారు. ప్రభుత్వాలను అమాంతంగా పడదోయగల శక్తి తమకుందని ఇటీవలి ఎన్నికలు వారికి స్పష్టంగా బోధపర్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలను కూడా ఈ ప్రధానాంశం తప్పనిసరిగా ప్రభావం చూవవచ్చు. జనాభాలో దాదాపు 50 శాతం మంది అటు ప్రత్యక్షంగానో, ఇటు పరోక్షంగానో వ్యవసాయరంగంలో మునిగివున్న దేశంలో, ఎట్టకేలకు రైతులు తమను తాము మరింత ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకునే స్థితికి చేరుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు ఘనీభవించిపోయాయి. ఇటీవలే ఓఈసీడీ జరిపిన అధ్యయనం ప్రకారం, భారత్‌లో గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులు యధాతథంగా ఉండిపోయాయని తెలుస్తోంది. అంతకుముందు యూఎన్సీడీఏడీ (అంక్టాడ్) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, అంతర్జాతీయంగానే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణం కారణంగా 1995 నుంచి 2005 వరకు స్తబ్దతలో ఉండిపోయాయని తేలింది. ఇక ఇటీవల నీతి అయోగ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2011–12 నుంచి 2015–16 మధ్య అయిదేళ్ల కాలంలో వ్యవసాయోత్పత్తి వేగంగా పెరిగినప్పటికీ వ్యవసాయంలో వాస్తవాదాయం అర్థ శాతం కంటే అంటే 0.44 శాతం కంటే తక్కువగా ఉందని తెలిసింది. మన దేశంలో రైతులు నిజంగానే పంటలు పండించడం అనే శిక్షకు గురైనట్లుంది. కొన్ని మినహాయింపులను దాటి చూస్తే, ప్రతి సంవత్సరం వారు పండిస్తున్న పంటల దిగుబడి ఖర్చుకు తక్కువ రాబడినే నిత్యం పొందుతూ వస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి దేశ ఆర్థిక భారం మొత్తాన్ని అనాయాసంగా రైతులపై మోపుతున్నారు. రైతు తన జీవిత పర్యంతం అప్పులతోటే పుట్టడం, అప్పులతోటే బతుకీడ్చటం నిజంగా నరకప్రాయమైనది. బతకాలంటే అప్పు చేయక తప్పని పరిస్థితి. మరోవైపున ఆ తీసుకున్న అప్పు పర్వతభారంలాగా పెరిగిపోతూ ఉంటుంది. రైతు జీవితం పొడవునా అలుముకున్న ఆర్థిక దుస్థితి ఇదేమరి. దేశంలోని 17 రాష్ట్రాల్లో లేక దాదాపుగా సగం దేశంలో వ్యవసాయ కుటుంబం సగటు ఆదాయం సంవత్సరానికి కేవలం రూ.20,000 మాత్రమే అని ఎకనమిక్ సర్వే 2016 ప్రకటించడం దేశాన్ని నివ్వెరపర్చింది. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయ ఆవరణంలో ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది. ఈ రాజకీయ మూలమలుపు వ్యవసాయదారులను నూతన పునరుజ్జీవన దిశగా నడిపిస్తుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మాల్యా, అంబానీల నుంచి వస్తాయి!
కొరియా(ఛత్తీస్‌గఢ్): అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. అందుకు అవసరమైన నిధులు నీరవ్ మోదీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా వంటి వారి నుంచి వస్తాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ మాల్యా రూ.10 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయారని, నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 35 వేల కోట్లతో పరారయ్యారని రాహుల్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో రూ. 36 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి రమణ్‌సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో చివరిదైన రెండో దశలో 72 స్థానాలకు పోలింగ్ 20న జరగనుంది. -
మూడేళ్లయినా ఎక్స్‌గ్రేషియాకు దిక్కులేదు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన యువ కౌలు రైతు అప్పుల బాధ తాళలేక గంగవరపు హరిబాబు (30) 2015 జూలై 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరపు నర్సింగరావు ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు హరిబాబు కుటుంబ భారాన్ని తనపై వేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్న నాలుగు ఎకరాలు భూమితోపాటూ మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, 10 ఎకరాల్లో పొగాకు, రెండెకరాలలో కంది సాగు చేశాడు. రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పొగాకుకు రూ. లక్ష రుణం పొందాడు, బంగారం తాకట్టు పెట్టి రూ.45 అప్పు తెచ్చాడు. మరో రూ. 4 లక్షలు నెలకు వందకు రూ. రెండు వడ్డీకి ప్రైవేటుగా అప్పుతెచ్చాడు. పరిస్ధితి అనుకూలించకపోవటంతో 25 క్వింటాళ్ల పొగాకు మాత్రమే దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర రాక చివరికి రూ. మూడున్నర లక్షల అప్పు మిగిలింది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక మనస్తాపం చెందిన హరిబాబు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిబాబు కుటుంబానికి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. రుణ మాఫీ కాలేదు.. రుణమాఫీ కోసం అధికారుల వద్దకు 20 సార్లు తిరిగాం. సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాం. మాకు న్యాయం జరగలేదు. అధికారులు పట్టించుకోలేదు. రూ.120తో పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం ఉంటే సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. దీని వల్లా ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. ఉపయోగం లేనçప్పుడు పార్టీ ఎందుకు? సభ్యత్వం ఎందుకు? – కిరణ్, మృతుని సోదరుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు పొగాకు పచ్చాకు ముఠాకు కూలి డబ్బుల బకాయిలను వడ్డీకి తెచ్చి చెల్లించాం. తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఇంకా అప్పులపాలయ్యాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. – మృతుడి తండ్రి నర్శింగరావు -
బిగ్ బీ పెద్ద మనుసు
తెరపైనే కాదు నిజ జీవితంలోను సూపర్ స్టార్‌నే అని నిరూపించుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. రుణాల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నలు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు అమితాబ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ బిగ్ బీ ప్రకటించారు. ఈ సందర్భంగా అమితాబ్ ‘మన కోసం త్యాగాలు చేస్తున్న రైతన్నలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను. గతంలో ఆంధ్ర, విదర్భకు చెందిన రైతుల రుణాలు మాఫీ చేశాను. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రైతుల రుణాలు మాఫీ చేయాలని భావిస్తున్నాను అని తెలిపారు. అంతేకాక ‘యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులను మేము గుర్తించాము. వారి మొత్తం రుణాలూ కలిసి రూ.5.5 కోట్ల రూపాయలుగా తెలిసింది. ఈ మొత్తాన్ని నేను చెల్లించాలని భావిస్తున్నాను. మనకోసం ఎనెన్నో త్యాగాలు చేస్తున్న అన్నదాతలకు నాకు తోచిన ఈ చిన్న సాయం చేయడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చే విషయం’ అని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. వ్యభిచార గృహాల్లో ఉన్న వారి కోసం... కేబీసీ కరంవీర్‌లో కనిపించిన అజీత్‌సింగ్‌కు కూడా సాయం అందచేస్తానని బిగ్ బీ తెలిపారు. ఎంతో మంది యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేశారు. వారంతా చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. వారి పునరావాసం, రక్షణల కోసం పాటుపడుతున్న అజీత్‌సింగ్‌కు తాను శనివారం చెక్కును పంపనున్నట్లు అమితాబ్ ప్రకటించారు. -
ఊపందుకుంటున్న రైతుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ : రుణాల మాఫీ తదితర డిమాండ్లపై మధ్యప్రదేశ్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైన రైతుల పది రోజుల సమ్మె శనివారం నాటికి హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు విస్తరించింది. ‘గావ్ బంద్’ పేరిట ప్రారంభించిన ఈ సమ్మె ప్రభావం మొదటి రోజు పెద్దగా కనిపించలేదు. రెండోరోజు కొద్దిగా కనిపించింది. మరికొన్ని రోజుల్లో కూరగాయలు, పాల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయి గ్రామీణ జీవనం పూర్తిగా స్తంభించిపోతుందని, దాని ప్రభావం పట్టణ ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుందని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో సమ్మెకు సమన్వయకర్తగా పనిచేస్తున్న రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ తెలిపింది. దేశవ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతోపాటు భూ సంస్కరణలను అమలు చేయాలని, పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో సమ్మె ప్రభావం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తోంది. గతంలో నాసిక్ నుంచి ముంబై వరకు దాదాపు 40 వేల మంది రైతులతో భారీ ర్యాలీ జరిగిన విషయం తెల్సిందే. ఆ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కారణంగానే రైతుల నుంచి ఈసారి అంతగా స్పందన లేనట్లుంది. మధ్యప్రదేశ్‌లో కూడా సమ్మె ప్రభావం ఈ రోజు అంతంత మాత్రంగానే కనిపించింది. పలు కూరగాయల మార్కెట్లు యథావిధిగానే తెరచి ఉన్నాయి. గతేడాది జూన్ నెలలో పోలీసు కాల్పుల్లో నలుగురు రైతులు మరణించిన మండసార్‌లో సమ్మె ప్రభావం కొద్దిగా కనిపించింది. మార్కెట్‌కు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ధరలు కొద్దిగా పెరిగాయి. కొన్ని చోట్ల కూడళ్లలో రైతులు సింబాలిక్‌గా పాలను, కూరగాయలను వీధుల్లో పారబోస్తున్నారు. ఈ ఆందోళన తీవ్రమైతే పాలు, కూరగాయలకు కొరత ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో సమ్మె తీవ్రం కానుట్లు సమ్మెకు సంఘీభావం ప్రకటించిన అన్ని రైతు సంఘాలు తెలియజేస్తున్నాయి. -
రైతన్న కన్నెర్ర
దుబ్బాక ఎస్బీఐ పరిధిలో 1,606 మంది రైతులు తీసుకున్నరూ.9 కోట్లతో పాటు వడ్డీ రూ.2 కోట్లు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. గురువారం దుబ్బాక ఎస్బీఐ ఎదుట దాదాపు గంట పాటు బైఠాయించి.. నిరసన తెలిపారు. దుబ్బాక : ‘రైతులకు రుణమాఫీ అన్నారు.. రైతు ప్రభుత్వమన్నారు.. పొద్దస్తమానం అన్నదాతల జపం చేసిండ్రు.. రైతుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వమే బ్యాంకు అధికారులతో రుణాలు చెల్లించాలని నోటీసులిప్పించడం చూస్తుంటే ఇదేమి ప్రభుత్వమో తెలియడం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు ఆరోపించారు. బ్యాంకు అధికారులు అందించిన నోటీసులతో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆర్అండ్బీ నుంచి గురువారం దుబ్బాక ఎస్బీఐ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎస్బీఐ పరిధిలో 1606 మంది రైతులు రూ.9 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని, అధికారంలోకి రాగానే రైతులకు పంట రుణాలన్నింటినీ దశల వారిగా మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించారు. రూ.9 కోట్ల అసలు రుణంతో పాటు మిత్తి మరో రూ.2 కోట్లు ఇవ్వాలని సంబంధిత రైతులకు నోటీసులివ్వడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ వర్తించదా..? రూ.వేల కోట్లతో బ్యాంకులకు ఎగనామం పెట్టిన బడా బాబులను విడిచిపెట్టి కాయాకష్టం చేసుకుని జీవించే రైతులను బెదిరించడం బ్యాంకు అధికారులకు తగదన్నారు. నోటీసులందుకున్న రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. నోటీసులందుకున్న రైతులకు ప్రభుత్వమిచ్చే రుణమాఫీ పథకం వర్తించదా అని రఘునందన్ ప్రశ్నిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కావాలని దుబ్బాక బ్యాంకు నుంచి ముందుగా రైతులకు నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినోళ్లకే బ్యాంకు అధికారులు వ్యక్తిగత రుణాలు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు రుణాలు మాఫీ అయ్యేంతవరకు బీజేపీ దశల వారీగా ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలేష్‌గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షులు తోట కమలాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విభీషన్‌రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎన్ చారి, మండల అధ్యక్షుడు మంద అనిల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సత్తు తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రుణమాఫీ పేరుతో నిలువుదోపిడీ
శ్రీకాకుళం అర్బన్: రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి వారిని నమ్మించి అధికారంలోకి వచ్చాక అన్నదాతను నిలువుదోపిడీ చేసిన ఘనత చంద్రబాబుదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు దుయ్యబట్టారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతు సాధికారికత సంస్థ ద్వారా రుణ ఉపశమన పథకం లెక్కల్లో మాత్రం లక్షల రూపాయలలు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు చూపిస్తున్నారే తప్ప అందులో వాస్తవం లేదన్నారు. ఇందుకు ఉదాహరణగా జిల్లాలోని ఆమదాలవలస మండలంలో కూన రాజు అనే రైతుకు గత రెండు విడతలుగా ఇచ్చామన్న రూ.44,040.25 తన ఖాతాలో జమ కాలేదన్నారు. సరికదా మూడో విడతగా ఇచ్చిన బాండు రూ.10,757.17 ఈనాటికీ రైతు ఖాతాలో జమ కాలేదని చెప్పారు. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోగా వేలాది మంది తొలగించారని ధ్వజమెత్తారు.ఒకవైపు ఇసుక మాఫియా, మరోవైపు మద్యం మాఫియా, భూమాఫియా ఎటుచూసినా అధికారులపై భౌతికదాడులు, దళితులపై దండయాత్రలు, పనుల్లో అవకతవకలు, కొల్లగొట్టిన వేల కోట్లు రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో అడుగడుగునా అవినీతి ఘటనలే చోటుచేసుకున్నాయని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు టి.కామేశ్వరి, మండవిల్లి రవి, తంగుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘అధికారంలోకి రాగానే రుణమాఫీ’
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. తాజాగా తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పదిరోజుల్లోగా రైతు రుణ మాఫీపై విధానం ప్రకటిస్తామన్నారు.గుజరాత్ సీఎం విజయ్ రూపానీని రబ్బర్ స్టాంప్‌గా అభివర్ణించిన రాహుల్ బీజేపీ చీఫ్ అమిత్ షా రాష్ట్రంలో రిమోట్ కంట్రోల్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల రుణాలు రూ 1.25 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ రైతు రుణ మాఫీ కోసం తాము కోరితే అది తమ విధానం కాదన్నారని చెప్పారు. పటేల్ ప్రాబల్య అమ్రేలి జిల్లాలో జరిగిన ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. మోదీ 22 ఏళ్లుగా రైతుల గురించి మాట్లాడుతున్నా వారికి ఏమీ చేయలేదని, రైతుల భూములు గుంజుకుని, సాగు నీటిని పారిశ్రామికవేత్తలకు తరలించారని ఆరోపించారు. రైతులకు కనీసం పంట బీమా కూడా అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్లో పటేళ్లు, దళితులు,రైతులు, అంగన్వాడీలు సహా అన్ని వర్గాలవారు తొలిసారిగా నిరసన బాటపట్టారని అన్నారు. కేవలం విమానాల్లో తిరిగే మోదీ స్నేహితులు ఐదు,పది మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వారిలో కొందరు నానో కారు రూపొందించేందుకు రూ 33,000 కోట్లు పొందారని పరోక్షంగా రతన్ టాటాను ఉద్దేశించి పేర్కొన్నారు. -
కౌలురైతుపైకరుణేదీ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కౌలు రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో వేలాది మంది రుణమాఫీ కోaసం రైతు సాధికార సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం శూన్యం. అసలు రుణమాఫీకి సంబంధించిన వివరాలు చెప్పేందుకు ఏ శాఖా బాధ్యత తీసుకోకపోవడంతో వారి కష్టాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రైతుసాధికార సంస్థను ముట్టడించడానికి కౌలు రైతులు సన్నద్ధమవుతున్నారు. 3లక్షల మంది కౌలురైతులు జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 2013 డిసెంబర్ 31 నాటికి 53 వేల మంది కౌలు రైతులు రుణ అర్హత కలిగి ఉన్నారు. ఐదు వేలకుపైగా రైతు మిత్ర గ్రూపులు, మూడు వేల జీఎల్‌జీ గ్రూపులు ఉన్నాయి. వీరి పేరుమీద సుమారు రూ.165 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకూ జిల్లాలో కౌలు రైతులకు కేవలం రూ.40 కోట్లకు మించి రుణమాఫీ వర్తించలేదు. అసలు కౌలు రైతులకు ఎంత రుణమాఫీ వస్తుందన్న లెక్కలూ అధికారుల వద్ద లేవు. 2014 ఆగస్టు 14న రుణమాఫీ కోసం ప్రభుత్వం జీఓ నంబర్ 174 విడుదల చేసింది. నిబంధన ప్రకారం జిల్లాలో రైతుమిత్ర, జాయింట్ లైబులిటీ గ్రూప్ (జేఎల్‌జీ), రుణ అర్హత గుర్తింపు కార్డులు ఉన్న కౌలు రైతులకు రుణమాఫీ చేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇది జరిగి మూడేళ్లయినా కౌలు రైతులకు మాఫీ వర్తించలేదు. భూ యజమానులకే మాఫీ అవుతున్నట్టు స్పష్టమవుతోంది. పెండింగ్ పెట్టిన బ్యాంకులు బ్యాంకులు రుణ మాఫీ వివరాలు అప్లోడ్ చేసేటప్పుడు కౌలు రైతుల వివరాలు ఆన్లైన్ చేయకుండా పెండింగ్ పెట్టాయి. దీంతో కౌలు రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇప్పటికి మూడు విడతల్లో ఆరు దఫాలుగా రుణమాఫీ ప్రక్రియ జరిగింది. ప్రతిసారీ రైతు సాధికార సంస్థకు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు వేల సంఖ్యలో కౌలు రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. కానీ అవి పరిష్కారం కావడంలేదు. ఈ రోజుకీ రైతు సాధికార సంస్థ చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఆయా శాఖల నుంచి సరైన సమాచారం రావడం లేదు. అసలు రుణమాఫీ తమ బాధ్యత కాదని ఎవరికి వారు చేతులు దులుపుకునే యత్నం చేస్తున్నారు. రూ.50వేల లోపే ఉన్నా.. రూ.50 వేలలోపు రుణం ఉన్నవారికి ఒకే దఫాలో మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. 90 శాతం మంది కౌలు రైతులకు రూ.50 వేల లోపే రుణం ఉంటుంది. అంటే కౌలు రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ జరిగి ఉంటే రూ.150 కోట్ల వరకూ ఇవ్వాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా రూ.40 కోట్లు మాత్రమే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అప్పుల ఊబిలో.. రుణమాఫీ కాకపోవడం వల్ల కౌలు రైతులు ప్రైవేటు అప్పులపై ఆధార పడాల్సి వస్తోంది. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు కొత్తగా వారికి అప్పులు ఇవ్వడం లేదు. పాత బాకీకి వడ్డీ భారం పెరిగిపోతోంది. దీంతో కొన్ని బ్యాంకులు రైతుల ధాన్యం, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన డబ్బులు, వ్యక్తిగతంగా బ్యాంకులో దాచుకున్న డబ్బునూ వడ్డీ కింద మినహాయించుకుంటున్నాయి. రైతు మిత్ర గ్రూపులు ప్రతినెలా కొంత సొమ్ము పొదుపు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో గ్రూపు కింద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పొదుపు డబ్బులు ఉంటాయి. ఈ మూడేళ్ల కాలంలో వడ్డీల రూపంలో ఈ పొదుపు డబ్బులు కరిగిపోయాయి. మరోవైపు గ్రూపులో అందరికీ రుణమాఫీ వర్తించకుండా, కొంతమందికి రావడం వల్ల ఆయా గ్రూపుల్లో అనైక్యత, విభేదాలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల చాలామంది రైతులు బ్యాంకుల ముఖం చూడడం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రేపు రైతు సాధికార సంస్థ ముట్టడి రాష్ట్రంలో కౌలు రైతులకు రూ.594 కోట్ల మేర అప్పులు ఉంటే ఇప్పటి వరకూ రూ.144 కోట్లు మాత్రమే మాఫీ అయింది. మిగిలిన రూ.450 కోట్లు ఒకే దఫాలో మాఫీ చేయాలి. సర్వే నంబర్లు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇతర నిబంధనలు సడలించి రుణమాఫీ అమలు చేయాలి. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. ఈ నెల 31న రైతు సాధికార సంస్థను ముట్టడిస్తాం. కె.శ్రీనివాస్, కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి -
‘ఒక పైసా మాఫీ’
సాక్షి,ఆగ్రాః యూపీలో రైతు రుణమాఫీ ప్రహసనంలా మారింది. రూ 10, రూ 100 చెక్కులు అందుకున్న రైతులు విస్తుపోతుంటే తాజాగా మధురకు చెందిన ఓ రైతు తన రూ 1.5 లక్షల రుణ బకాయిలపై కేవలం ఒక పైసా మాఫీ అవడంతో కంగుతిన్నాడు. మధుర జిల్లాలోని గోవర్ధన్ తహసిల్‌కు చెందిన చిద్ది అనే రైతుకు ఆరేళ్ల కిందట కిసాన్ క్రెడిట్ ద్వారా రూ లక్షన్నర పంట రుణం తీసుకున్నాడు. అతనికి కేవలం 5 బిఘాల భూమి మాత్రమే ఉంది. జిల్లా అధికారులు చిద్దికి ఇచ్చిన సర్టిఫికెట్లో అతను చెల్లించాల్సిన రుణంలో కేవలం ఒక పైసా మాఫీ అయినట్టుగా ఉంది. దీనిపై సదరు రైతు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇది బ్యాంక్ అధికారుల తప్పిదమా లేక ఒక పైసానే మాఫీ అయిందా అనేది అర్థం కావడం లేదని వాపోయారు. రైతులతో అధికారులు చెలగాటమాడుతున్నారని చిద్ది అన్నారు. మరోవైపు ఇదే తరహా లోన్ తీసుకున్న ఇతరులకు పూర్తి మొత్తం మాఫీ అయిందని చెప్పారు. అధికారులకు లంచాలు ఇవ్వని రైతులకే తమ లాంటి పరిస్థితి ఎదురైందని చిద్ది, అతని కుమారుడు ఆరోపించారు. అయితే సాంకేతిక కారణాలతోనే తప్పులు దొర్లాయని మధుర జిల్లా మేజిస్ర్టేట్ అరవింద్ మల్లప్ప వివరణ ఇచ్చారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ అనుసంధానం చేసిన రైతులకు తొలి దశలో రుణ మాఫీ వర్తింపచేశామని తెలిపారు.సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే మలివిడతలో చిద్ది రుణం మాఫీ అవుతుందని ఆయన హామీ ఇచ్చారు. -
రిక‘వర్రీ’
జిల్లాలో పావలా వడ్డీ రుణాలందించిన బ్యాంకులకు రికవరీ బెడద పట్టుకుంది. తీసుకున్న లింకేజీ రుణాలు తిరిగి చెల్లించేందుకు మహిళా సంఘాలు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో కొత్త రుణాలు మంజూరు ఆగిపోగా.. రుణాలు చెల్లించిన సంఘాలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతుల రుణమాఫీ తరహాలోనే పావలా వడ్డీ రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో సంఘాలు రుణాలు చెల్లించకుండా మొండికేసినట్టు తెలుస్తోంది. నీలగిరి : జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు 59,600 ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల్లో 2013-14కు గాను 29 వేల సంఘాలకు రూ.519 కోట్లు రుణాలు బ్యాంకర్లు ఇచ్చారు. దీంట్లో ఇప్పటి వరకు రూ.200 కోట్ల రుణాలను తిరిగి చెల్లించారు. మిగిలిన రుణాలను సంఘాలు చెల్లించడం లేదు. రుణాలు తిరిగి చెల్లించాల్సిందిగా బ్యాంకర్లు సంఘాలకు నోటీసులు కూడా జారీ చేశారు. డీఆర్డీఏ పీడీ అయితే ఏకంగా ‘సంఘదర్శిని’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రుణాలు చెల్లించాల్సిందిగా సంఘాలను కోరుతున్నారు. గామ సంఘాలు మొదలుకుని జిల్లా సమాఖ్య వరకు అన్ని సమావేశాల్లోనూ రుణాలు చెల్లించాల్సిందిగా కోరుతున్నా, ఫలితం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సంఘాల రుణాలు మాఫీ చేశారు కాబట్టి... ఇక్కడి ప్రభుత్వం కూడా మాఫీ చేస్తుందన్న ఆశతో సంఘాలు ఎదురుచూస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం సంఘాల రుణమాఫీ సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు నెత్తినోరు బాదుకుంటున్నా సంఘాలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికైనా పావలా వడ్డీ రుణాలు మాఫీ చేస్తాయన్న ధీమాను సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకర్లు.. గతంలో తీసుకున్న రుణాలు సంఘాలు చెల్లించకపోవడంతో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. 2014-15కు గాను 32,506 సంఘాలకు రూ.803 కోట్ల రుణాల లక్ష్యాన్ని ఖరారు చేశారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు మాసాలు కావస్తున్నా, ఇప్పటివరకు కేవలం 4 వేల సంఘాలకు రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చారు. డీఆర్డీఏ లెక్కల ప్రకారం ఇప్పటికే 6 వేల సంఘాలకు రూ.180 కోట్లు మంజూరు చేయాలి. కానీ రుణాల రికవరీ పడిపోవడంతో ఆ ప్రభావం కొత్త రుణాలపై పడింది. ఊసేలేని వడ్డీ బకాయిలు... వడ్డీలేని రుణాల పథకం కాబట్టి సంఘాల తరఫున ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 10వతేదీలోగా సంఘాలకు ఖాతాలకు వడ్డీ జమకావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు నయాపైసా కూడా ప్రభుత్వం వడ్డీ విడుదల చేయలేదు. ఈ మొత్తం సుమారూ. 20 కోట్లు వరకు ఉంటుందని అధికారుల అంచనా. ఇదిగాక వడ్డీలేని పథకం ప్రారంభమైన కొత్తలో పాత బకాయి తాలుకు రూ.24 కోట్లు రావాల్సి ఉంది. బకాయిల మొత్తాన్ని సంఘాల నుంచి బ్యాంకర్లు బలవంతంగా రాబట్టుకున్నారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలానికి గాను ప్రభుత్వం వడ్డీ విడుదల చేయకపోవడంతో సంఘాలపై బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. పట్టించుకోని జిల్లా యంత్రాంగం గతంలో జిల్లా యంత్రాంగం డీఆర్డీఏ పనితీరు పట్ల ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండేది. ప్రసుత్తం ఆ భారం మొత్తాన్ని ప్రాజెక్టు డెరైక్టర్ మీదకు నెట్టివేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. సంఘాలు రుణాలు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం బిజీబిజీగా ఉండడంతో డీఆర్డీఏ పట్ల అంత ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రికవరీ కావట్లేదు ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా రుణా లు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో సంఘాలు రుణా లు చెల్లించడం లేదు. కొన్ని సంఘాలు తిరిగి చెల్లింపులు చేస్తున్నా...మిగిలిన సంఘాలు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం మిగతా వాటి మీద పడుతోంది. దీనిపై సంఘాలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు ఫర్వాలేదు. - చిర్రా సుధాకర్, డీఆర్డీఏ, ప్రాజెక్టు డెరైక్టర్