విడుదల చేసిన ప్రభుత్వం
ఇప్పటివరకు రూ.20.68 వేల కోట్ల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచి్చన రూ. 2 లక్షల రుణమాఫీ హామీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది. ఇప్పటివరకు మూడు విడతల్లో 22.37 లక్షల మంది రైతుల రుణాల కింద రూ. 17,933 కోట్లు బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం, శనివారం పాలమూరు వేదికగా నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెక్కును రైతులకు అందజేశారు. తద్వారా ఇప్పటివరకు రూ.20.68 వేల కోట్లు రుణమాఫీ కింద బ్యాంకులకు విడుదల చేసినట్లయింది. శనివారం పాలమూరులో ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని 3,13,897 మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. తద్వారా నాలుగు విడతల్లో రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరిగినట్టు.
భవిష్యత్తులో రూ.2 లక్షలపైన ఉన్నవారికి..
రూ. 2 లక్షలపైన రుణాలు పొందిన రైతులకు కూడా రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గతంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే రూ. 2 లక్షలపైన ఉన్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి ఈ రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులు లెక్కలు తీశారు. శనివారం సీఎం ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని రేషన్‌కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు, పేర్లలో తప్పులు దొర్లిన 3,13,897 మంది రైతుల రుణ ఖాతాలకు జమచేస్తారు. తరువాత రూ. 2లక్షల పైన అప్పులున్న రైతులకు జమచేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment