రైతు రుణమాఫీపై పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.
ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారని, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment