బీజేపీ జెండా కప్పుకుని చనిపోతానని మోదీకి హామీ ఇచ్చారు: కేటీఆర్
రేవంత్ ప్రస్థానమే ఏబీవీపీలో కాషాయ జెండాతో మొదలైంది
ప్రభుత్వం స్పందించకుంటే రైతుల కోసం ఉద్యమ బాట
నోటీసులు అందాయి.. 24న మహిళా కమిషన్ ముందు స్వయంగా హాజరవుతానని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి పల్లెత్తు మాట అనడం లేదు. అంతేకాదు తన రాజకీయ ప్రస్థానం బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో కాషాయ జెండాతోనే ప్రారంభమైందని మోదీకి రేవంత్ చెప్పారు. బీజేపీ కాషాయ జెండా కప్పుకుని చనిపోవాలన్నదే తన కోరిక అని కూడా మోదీకి రేవంత్ చెప్పినట్లు మాకు సమాచారం.
ప్రధానితో ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో రేవంత్ వెల్లడించాలి. రేవంత్ తదుపరి మజిలీ బీజేపీయే..’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శనివారం బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందంటూ రేవంత్ తమకు పదవులు కూడా పంచుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే తన బృందంతో కలిసి రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు.
రుణమాఫీ వైఫల్యాలపై గ్రామాలకు..: ‘‘రాష్ట్రంలో రైతు రుణ మాఫీ డొల్ల. వంద శాతం రైతు రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ చెప్తుంటే.. మరోవైపు రుణమాఫీ కాని వారికోసం ప్రత్యేక కౌంటర్లు పెడతామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీ కాని రైతుల వివరాలను గ్రామస్థాయి నుంచి సేకరించి రాష్ట్ర ప్రభుత్వా నికి అందిస్తాం..’’ అని కేటీఆర్ చెప్పారు. సోమవారం నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు గ్రామాల వారీగా ప్రతీ గడపకు వెళ్లి వివరాలు సేకరిస్తాయన్నారు.
రైతు పేరు, కుటుంబ వివరాలు, తీసు కున్న రుణం, బ్యాంకు పేరు తదితర వివరాలతో ఒక ప్రొఫార్మా తయా రు చేసి కార్యకర్తలకు ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు లేదా నియో జకవర్గ ఇన్‌చార్జులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారని వివరించారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాకా ఈ వివరాలను అందజేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతా మని... మాఫీ చేయని పక్షంలో గ్రామస్థాయి నుంచీ ప్రత్యక్ష నిర సన కార్యక్రమాలతో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ దాడులు: సర్కారు రుణమా ఫీలో విఫలం కావడంతో దాని నుంచి దృష్టి మళ్లించేలా కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగుతోందని కేటీఆర్ ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ ఆఫీసుపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కమలాసన్‌రెడ్డి వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులపై సీఎం సొంత మీడియా దాడి చేస్తుంటే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం రేవంత్, ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారని ఆరోపించారు.
24న మహిళా కమిషన్ ముందుకు..: మహిళా కమిషన్ ముందు హాజరుకావాలంటూ తనకు నోటీసులు అందాయని కేటీఆర్ ధ్రువీకరించారు. 24న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు తాను స్వయంగా హాజరై 8 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన దురాగతాల వివరాలను అందజేస్తానని చె ప్పారు. కొల్లాపూర్, షాద్‌నగర్ తదితర చోట్ల మహిళలపై జరిగిన దాడులు, అఘా యిత్యాలను గుర్తుచేస్తానని తెలిపారు. అసెంబ్లీ లో మహిళా ఎమ్మెల్యేలను సీఎం దూషించినా ఆయ నపై చర్యలు లేవని చెప్పారు. ఆర్టీసీలో మహిళల ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పానని గుర్తు చేశారు.
రుణం తీరలే.. రైతు బతుకు మారలే
‘సాక్షి’ కథనాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: ‘‘రైతు రుణం తీరలేదు, రైతు బతుకు మా రలేదు. ఒకే విడతలో రూ. రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రభుత్వా న్ని ప్రశి్నస్తే కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తూ.. నిలదీస్తే బెదిరింపులకు దిగుతోంది. అయినా తగ్గేదే లేదు. నిగ్గదీసి అడుగు తాం, నిజాలే చెబుతాం. కాంగ్రెస్ డొల్లమాటల గుట్టు విప్పుతూనే ఉంటాం..’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు.
‘రుణం తీరలే’ శీర్షికన సాక్షి ప్రధాన సంచికలో శనివారం ప్రచురితమైన కథనాన్ని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘రైతు రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో లెక్కవేశారు. కానీ కేబినెట్ సమావేశంలో రూ.31 వేల కోట్లు అని చెప్పి, బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ మూడు విడతల్లో రుణమాఫీ కింద రైతులకు ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment