రేపు మూడో విడత రుణమాఫీ | third installment of the loan will be waived on August 15: Telangana | Sakshi
Sakshi News home page

రేపు మూడో విడత రుణమాఫీ

Published Wed, Aug 14 2024 5:31 AM | Last Updated on Wed, Aug 14 2024 5:52 AM

third installment of the loan will be waived on August 15: Telangana

వైరా బహిరంగ సభలో నిధులు జమ చేయనున్న సీఎం రేవంత్‌ 

రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలకు వర్తింపు 

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ మూడో విడత కింద గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ నెల 2వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. గతనెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. కాగా అధికారంలోకి వచి్చన తర్వాత 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత రుణమాఫీ చేయనుంది. అయితే రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు.. ఆ అదనపు మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఆ అదనపు మొత్తాలను చెల్లించారు? ఇంకా ఎంతమంది చెల్లించాల్సి ఉంది? చెల్లించని వారికి ఇప్పుడు రుణమాఫీ కాకపోతే తర్వాత చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement