third installment
-
రేపు మూడో విడత రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మూడో విడత కింద గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ నెల 2వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. గతనెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. కాగా అధికారంలోకి వచి్చన తర్వాత 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది.ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత రుణమాఫీ చేయనుంది. అయితే రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు.. ఆ అదనపు మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఆ అదనపు మొత్తాలను చెల్లించారు? ఇంకా ఎంతమంది చెల్లించాల్సి ఉంది? చెల్లించని వారికి ఇప్పుడు రుణమాఫీ కాకపోతే తర్వాత చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
టీకా కేంద్రాలు పెంచండి!
సాక్షి, న్యూఢిల్లీ›: మూడో విడత వ్యాక్సిన్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు, ఆసుపత్రుల మౌలిక వసతుల విస్తరణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కార్యాచరణ ప్రణాళికను సూచించింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్మెంట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సిన్ మూడో దశ సంక్లిష్టతలను నివారించేందుకు కోవిన్ ప్లాట్‌ఫామ్‌ను నవీకరించినట్టు శర్మ వివరించారు. రాష్ట్రాలు సరైన, సమయానుసారమైన డేటాను అప్లోడ్ చేయాలని చెప్పారు. ఇలా చేయండి.. ప్రైవేట్ ఆస్పత్రులు, పారిశ్రామిక సంస్థల ఆసుపత్రులు, పరిశ్రమల సంఘాలు మొదలైన వాటితో సంప్రదింపులు జరపడం ద్వారా అదనపు ప్రైవేట్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, టీకా నిల్వలను, వాటి ధరలను కోవిన్ పోర్టల్‌లో ప్రకటించే ఆసుపత్రుల సంఖ్యను పర్యవేక్షించాలని, రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, 18–45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికి ‘ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే’ ఉంటుందని ప్రచారం చేయాలని, టీకా, రిపోర్టింగ్, నిర్వహణ గురించి వాక్సినేషన్ సెంటర్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కేంద్రం సూచించింది. కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను సమీక్షించాలని తెలిపింది. అదనపు డెడికేటెడ్ హాస్పిటల్స్‌ను గుర్తించడం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో డీఆర్డీవో, సీఎస్ఐఆర్ తదితర ఏజెన్సీల సాయంతో ఫీల్డ్ హాస్పిటల్ సౌకర్యాలను సిద్ధం చేయడం, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న పడకలు, ఐసీయూ పడకలు ఏర్పాటు చేసుకోవడం, తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూసుకోవడం, రోగుల నిర్వహణ, అంబులెన్స్ సేవలను బలోపేతం చేయడానికి అవసరమైన మానవ వనరులను మోహరింపు, లోటు మౌలిక సదుపాయాలున్న జిల్లాలకు తగిన రెఫెరల్ లింకేజీలను, అదనపు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం, పడకల కేటాయింపు కోసం కేంద్రీకృత కాల్ సెంటర్ ఆధారిత సేవలను ఏర్పాటు చేయడం, అందుబాటులోని పడకల కోసం రియల్ టైమ్ రికార్డును నిర్వహించి, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచడం, కోవిడ్ సంరక్షణను అందించడానికి మార్గదర్శకాలను రూపకల్పన, ఇంట్లో ఒంటరిగా ఉన్న రోగులకు టెలి–మెడిసిన్ సౌకర్యాలు కల్పన వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. -
వేగంగా ‘ కాకతీయ’ మూడో విడత!
6,250 చెరువుల పునరుద్ధరణే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మూడో విడత పనుల్లో చిన్న నీటి పారుదల శాఖ వేగం పెంచింది. ఓవైపు పరిపాలనా అనుమతులు, మరోవైపు టెండర్లు, ఇంకోవైపు పనుల ఆరం భాన్ని వేగంగా పూర్తి చేస్తోంది. ఈ విడతలో 6,250 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్న శాఖ ఇప్పటికే రూ.1,959.82 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చింది. మొత్తంగా 46,531 చెరువులను లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 8,045 పనులను ఆరంభించింది. ఇందులో రూ.1,632 కోట్ల తో 8,022 చెరువుల పనులను శాఖ పూర్తి చేసింది. ఇక రెండో విడతలో 9,016 చెరు వులకు అనుమతులివ్వగా ఇందులో రూ.1,966.78 కోట్ల వ్యయంతో కూడిన 8,887 చెరువుల పనులను ఆరంభించారు. రెండో విడత పనులకు జూన్ డెడ్ లైన్ ఇక గతేడాది రెండో విడత ఆరంభ సమ యానికే మొదటి విడత చెరువులే భారీగా పెండింగ్ ఉండటంతో రెండో విడత చెరు వుల పునరుద్ధరణ మార్చిలో ఆరంభమైంది. దీంతో పనులు చేసేందుకు జూన్, జూలై వరకు కేవలం 3 నెలల సమయమే దొరి కింది. అనంతరం భారీ వర్షాల వల్ల చాలా చెరువుల్లో నీరు చేరడంతో పనులు ఆలస్య మయ్యాయి. తిరిగి జనవరి నుంచి పనులు ఆరంభించినా ఇప్పటివరకు కేవలం 3,500 చెరువులను మాత్రమే పూర్తి చేయగలిగారు. మరో 6,500 చెరువులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి పూర్తికి ఈ ఏడాది జూన్ టార్గెట్‌గా నిర్ణయించారు. ఇక రెండో విడత పనుల జాప్యం కారణంగా మూడో విడతలో కేవలం 6,250 చెరువులకు మాత్రమే శాఖ పరిమితం అయింది. ఇందులోనూ వర్షాలు తక్కువగా కురిసిన మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల చెరువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక గతేడాది వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను మూడో విడతలో ప్రాధాన్యం కల్పించారు. ప్రస్తుతం వరకు రూ.1,959.82 కోట్లతో 6,250 చెరువులకు అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా, అందులో రూ.1,079.48 కోట్లతో 3,889 చెరువులకు ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు వచ్చాయి. ఇందులోనూ 2వేల చెరువులకు టెండర్లు పిలవగా, సుమారు వెయ్యి పనులు మొదలయ్యాయి. ఈ వారం లోనే మరో 2వేల చెరువులు ఆరంభించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మూడో విడత చెరువుల్లో వీలైనన్ని ఎక్కువ చెరువు లను పూడికతీత ద్వారా జూలై నాటికి సిద్ధం చేయాలని మిగతా పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. -
ఈ నెల 8 నుంచీ మళ్లీ పసిడి బాండ్లు
న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకం మూడవ విడతకు వచ్చే మంగళవారం నాడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... ♦ బాండ్లకు దరఖాస్తులను మార్చి 8వ తేదీ నుంచీ 14వ తేదీవరకూ సమీకరిస్తారు. మార్చి 29న బాండ్లను జారీ చేస్తారు. ♦ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), గుర్తింపు పొందిన పోస్టాఫీసుల్లో బాండ్ల విక్రయం జరుగుతుంది. ♦ సావరిన్ గోల్డ్ బాండ్లపై మొత్తాలను తిరిగి చెల్లించే సమయంలో వ్యక్తులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని 2016-17 బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. ♦ 5, 10, 50, 100 గ్రాములు డినామినేషన్లలో 5-7 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ అవుతాయి. ♦ ఒక వ్యక్తి వార్షికంగా 500 గ్రాములకన్నా అధికంగా బాండ్ల కొనుగోలుకు అవకాశం లేదు. ♦ పెట్టుబడుల సమయంలో మెటల్ విలువ ప్రాతిపదికన వడ్డీరేటును లెక్కిస్తారు. ♦ తొలి విడత స్కీమ్‌లో 916 కేజీల పరిమాణంలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.246 కోట్లు సమీకరించింది. ♦ రెండో విడతలో ఇది 3,071 కేజీలకు చేరింది. తద్వారా రూ.798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. -
త్వరలో మూడవ విడత గోల్డ్ బాండ్లు
న్యూఢిల్లీ: మొదటి రెండు విడతల్లో దాదాపు రూ.1,044 కోట్లు సమీకరించిన నేపథ్యంలో... మూడవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్‌లో ప్రారంభమైన మొదటి విడత స్కీమ్‌లో 916 కేజీల పరిమాణంలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.246 కోట్లు సమీకరించుకోగలిగింది. జనవరిలో డిమాండ్ భారీగా 3,071 కేజీలకు చేరింది. తద్వారా రూ.798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. అయితే ఈ దఫా లక్ష్యాల గురించి ఆయన ఏమీ తెలపలేదు. వ్యక్తుల విషయంలో సావరిన్ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్ ను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని 2016-17 బడ్జెట్లో ప్రతిపాదించారు.