త్వరలో మూడవ విడత గోల్డ్ బాండ్లు | central governament ready to third installment gold bonds | Sakshi
Sakshi News home page

త్వరలో మూడవ విడత గోల్డ్ బాండ్లు

Published Fri, Mar 4 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

త్వరలో మూడవ విడత గోల్డ్ బాండ్లు

త్వరలో మూడవ విడత గోల్డ్ బాండ్లు

న్యూఢిల్లీ: మొదటి రెండు విడతల్లో దాదాపు రూ.1,044 కోట్లు సమీకరించిన నేపథ్యంలో... మూడవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్‌లో ప్రారంభమైన మొదటి విడత స్కీమ్‌లో 916 కేజీల పరిమాణంలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.246 కోట్లు సమీకరించుకోగలిగింది. జనవరిలో డిమాండ్ భారీగా 3,071 కేజీలకు చేరింది. తద్వారా రూ.798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. అయితే ఈ దఫా లక్ష్యాల గురించి ఆయన ఏమీ తెలపలేదు. వ్యక్తుల విషయంలో సావరిన్ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్ ను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని 2016-17 బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement