Gold Bond Scheme
-
గోల్డ్ బాండ్స్.. లక్కీ చాన్స్!
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. బడ్జెట్లో మోదీ సర్కారు బంగారంపై గురి పెట్టింది. అనూహ్యంగా దిగుమతి సుంకాన్ని సగానికిపైగా తగ్గించడంతో కొత్తగా సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో పెట్టుబడి పెట్టేవారికి ధర భారీగా దిగొచి్చంది. మరోపక్క, పాత బాండ్ల చెల్లింపులపై (రిడెంప్షన్లు) భారాన్ని కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది. తాజా నిర్ణయంతో గోల్డ్ బాండ్ స్కీమ్ మరింత ఆకర్షణీయంగా మారుతుందంటున్నారు విశ్లేషకులు!బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఈ ఏడాది బడ్జెట్లో 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా రూ. 5,000 మేర పడిపోయాయి. దీంతో గత కొద్ది రోజులుగా బంగారం షాపులు కళకళలాడిపోతున్నాయి. మళ్లీ ధర పెరిగిపోతుందేమోనన్న ఆత్రుతతో పసిడి ప్రియులు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా పుత్తడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో డిమాండ్ పుంజుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ధర భారీగా తగ్గడం వల్ల ఈ ఆరి్థక సంవత్సరంలో కొత్తగా విడుదల చేసే గోల్డ్ బాండ్లకు కూడా గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో భౌతిక రూపంలో బంగారం డిమాండ్‌ను తగ్గించడంతో పాటు ప్రజల పొదుపు మొత్తాలను పసిడిలోకి కాకుండా ఆరి్థకపరమైన సాధనాల్లోకి మళ్లించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా వీటి ద్వారా ప్రభుత్వం రూ. 72,274 కోట్ల నిధులను సమీకరించింది. అప్పట్లో గ్రాము రూ.3,100... 2015 నుంచి 2017 వరకు మూడేళ్లలో జారీ చేసిన గోల్డ్ బాండ్లకు గ్రాము రేటు రూ.3,100 నుంచి రూ.3,500 స్థాయిలో ఉంది. తాజా బడ్జెట్‌కు ముందు గ్రాము మేలిమి బంగారం ధర రూ.7,200 పలికింది. గోల్డ్ బాండ్ గడువు వ్యవధి (మెచ్యూరిటీ) 8 ఏళ్లు. అంటే, గతంలో జారీ చేసిన బాండ్ల గడువు తీరుతుండటంతో ఇప్పుడు ప్రభుత్వం తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. రేటు రెట్టింపునకు పైగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాపై భారం కూడా భారీగా ఉంటుంది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఒక్కో గ్రాముపై రేటు భారీగా దిగొ చ్చింది. అంతర్జాతీయంగా పసిడి ధరల ట్రెండ్ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే, బాండ్ రిడెంప్షన్లపై సర్కారు చెల్లింపులు తగ్గుతాయి. 130 శాతం రాబడి... గోల్డ్ బాండ్ల గడువు తీరిన తర్వాత, రిడెంప్షన్ తేదీకి ముందు 24 క్యారెట్ల బంగారం 3 రోజుల సగటు ధర ప్రకారం రూపాయిల్లో చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ బాండ్ స్కీమ్ కింద ఎనిమిదేళ్ల క్రితం 2016 ఆగస్ట్‌లో జారీ చేసిన సిరీస్–1 బాండ్ల గడువు ఈ నెలలోనే ముగుస్తుంది. అప్పట్లో ఒక్కో గ్రాముకు రూ.3,119 చొప్పున ఇన్వెస్టర్లు చెల్లించారు. దీనికి వార్షికంగా 2.75 శాతం వడ్డీ కూడా జమవుతుంది (ప్రస్తుతం వడ్డీ 2.5 శాతంగా ఉంది). తాజా రేటు ప్రకారం రూ. 6,900–7,000 స్థాయిలో రిడెంప్షన్ ధర ఉండొచ్చని అంచనా. దీని ప్రకారం చూస్తే, వడ్డీ కూడా కలిపితే ఇన్వెస్టర్లకు 130 శాతం లాభాలు వస్తున్నట్లు లెక్క. అయితే, ప్రభుత్వ గ్యారంటీ ఉండటం, వార్షికంగా 12–13 శాతం రాబడులు పక్కాగా లభిస్తుండటంతో గోల్డ్ బాండ్లకు వన్నె తగ్గదని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్సెప్టెంబర్లో మరో విడత! బడ్జెట్లో సుంకం కోత నిర్ణయం నేపథ్యంలో తాజా గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం వాయిదా వేస్తూ వచి్చంది. చివరిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్జీబీలను జారీ చేశారు. గత రెండు ఆరి్థక సంవత్సరాల్లో ఏటా నాలుగు సార్లు చొప్పున ఎస్జీబీలను కేంద్రం అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి విడత బాండ్లను సెపె్టంబర్లో జారీ చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారు. గ్రాము ధర ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రూ. 7,000కు అటుఇటుగా నిర్ణయించే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి భారీ గా డిమాండ్ ఉంటుందని రిద్దిసిద్ధి బులియన్స్ ఎండీ పృధ్విరాజ్ కొఠారి అభిప్రాయపడ్డారు. ఈ ఆరి్థక సంవత్సరంలో మూడు విడతల్లో బాండ్ల జారీ ఉంటుందని అంచనా. తద్వారా ప్రభుత్వం రూ.18,500 కోట్లను సమీకరించే అవకాశం ఉంది. అమెరికాలో వడ్డీరేట్ల కోత సంకేతాలు, భౌగోళిక–రాజకీయ ఉద్రికతలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. -
గోల్డ్ కంటే గోల్డ్ బాండ్లు బెటరా? చివరి తేది.. దరఖాస్తు విధానం..
బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఫిజికల్ గోల్డ్‌తో పాటు అంతే విలువ గల సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎస్జీబీ గోల్డ్ కోసం ఈ నెల 12 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అవకాశం కల్పించింది. భౌతిక బంగారంతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి. చోరీ భయం అసలే ఉండదు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ బాండ్లను పరిశీలించొచ్చు. 20 కిలోల వరకూ కొనుగోలు గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ గడువు ఎనిమిదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4 భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌పై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఈ బాండ్స్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది. ఆర్బీఐ ఇష్యూ చేసిన ధర యూనిట్‌కు రూ.6,213గా ఉంది. ఎక్కడ కొనుగోలు చేయాలంటే.. కమర్షియల్ బ్యాంకుల్లో ఈ సావరిన్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్ఛేంజ్ సంస్థలు అంటే నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో కొనుగోలు విధానం.. నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి. మెనూలో ఈ-సర్వీసెస్/ ఇన్వెస్ట్మెంట్ అనే సెక్షన్లో ‘సావరిన్ గోల్డ్ బాండ్’ ఆప్షన్ క్లిక్చేయాలి. షరతులు, నియమాలు చదివి ప్రొసీడ్‌పై నొక్కాలి. సావరిన్ గోల్డ్ బాండ్‌కు అవరమైన వివరాలు అందులో నమోదు చేసి డిపాజటరీ పార్టిసిపేట్ (ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్)ను ఎంచుకోవాలి. అనంతరం రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత పర్చేజ్ ఆప్షన్ వస్తుంది. ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల సంచలన నిర్ణయం మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ప్రక్రియ ముగుస్తుంది. -
18 నుంచి 22 వరకు మూడో విడత గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడవ విడత డిసెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 12–16 తేదీల్లో నాల్గవ విడత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటి విడత జూన్ 19 నుంచి 23 వరకూ (బాండ్ జారీ ధర గ్రాముకు రూ.5,926), రెండవ విడత సెపె్టంబర్ 11 నుంచి 15 వరకూ (ధర గ్రాముకు రూ.5,923) అమలయిన సంగతి తెలిసిందే. -
తాజా గోల్డ్ బాండ్ @ రూ. 5926
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023–24 తొలి విడత సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. బంగారం జారీ ధరను గ్రాముకు రూ.5,926గా ఆర్థికశాఖ ప్రకటించింది. ఐదు రోజుల పాటు (19–23) స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ప్రకటిత ధరలో గ్రాముకు రూ.50 రిబేట్ లభిస్తుంది. అంటే ఆన్లైన్ ధర గ్రాముకు రూ.5,876గా ఉంటుందన్నమాట. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్ 19తో పాటు సెప్టెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకూ కూడా మరో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో ఉండే సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీమ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయొ చ్చు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసి యేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సగ టు ధర ఆధారంగా ఎస్జీబీ ధరను నిర్ణయిస్తారు. -
తాజా గోల్డ్ బాండ్ స్కీమ్.. ఎప్పటి నుంచో తెలుసా?
న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడిపెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్, సెప్టెంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో రానుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 19 నుంచి 23వ తేదీ వరకూ అలాగే సెప్టెంబర్ 11 నుంచి 15 వ తేదీల్లో గోల్డ్ బాండ్ స్కీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. గోల్డ్ బాండ్లు– షెడ్యల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. -
గ్రాము సార్వభౌమ బంగారం ధర ఎంతంటే!
సార్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ) 2016–17 సిరీస్ 3లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు విక్రయించాలని అనుకుంటే గ్రాము ధరను రూ.5,115గా ఆర్బీఐ ప్రకటించింది. ఎస్బీజీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. కాకపోతే ఐదేళ్లు నిండిన తర్వాత నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు ఆర్బీఐ అనుమతిస్తుంది. ఈ క్రమంలో ఎస్జీబీ 2016–17 సిరీస్ 3 ఇష్యూని 2016 నవంబర్ 17న ఇష్యూ చేయగా.. 2021 నవంబర్ 17తో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఐదేళ్లు ముగిసిన అనంతరం రెండో విడత ఉపసంహరణకు ఆర్బీఐ అవకాశం కల్పిస్తోంది. 2022 మే 17వ తేదీ నుంచి ఉపసంహరించుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. గత వారం రోజుల బంగారం సగటు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా ఎస్జీబీ రిడెంప్షన్ రేటును ఆర్బీఐ ఖరారు చేసింది. 2016లో ఇష్యూ ధర గ్రాము రూ.2,957గా ఉండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్జీబీలను ఆర్బీఐ జారీ చేస్తుంటుంది. భౌతిక బంగారంలో పెట్టుబడులను డిజిటల్ వైపు మళ్లించేందుకు కేంద్ర సర్కారు తీసుకొచ్చిన వినూత్న పెట్టుబడి పథకం ఇది. ఎస్‌జీబీలో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. 8 ఏళ్ల పాటు పెట్టుబడిని ఉంచి గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే వచ్చే లాభంపై పూర్తి పన్ను మినహాయింపు కూడా ఉంది. -
ఆలయ ఆభరణాలతో ఆదాయం
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో వినియోగంలో లేని బంగారు ఆభరణాలను ఎస్బీఐ గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో చాలా దేవాలయాలకు ఆదాయం భారీగా పడిపోయింది. ఉత్స వాల నిర్వహణ, దేవాలయాల నిర్వహణ ఖర్చులు ప్రస్తుతం ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందడానికి వీలుగా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాలయాల అధీనంలో ఉన్న బంగారు నగలలో వినియోగించకుండా ఉన్న వాటిని సేకరించి బంగారు కడ్డీలుగా మార్చి స్టేట్ బ్యాంకు గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయనున్నారు. ఏయే దేవాలయాల్లో ఎంత బంగారం దీని పరిధిలోకి వస్తుందో లెక్కలు తేల్చాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో సమావేశమయ్యారు. కాగా, పెద్ద మొత్తంలో ఉన్న వెండిని కూడా బ్యాంకులో తొలుత బంగారంలోకి మార్చి ఆ బంగారాన్ని గోల్డ్ బాండ్ పథకం కింద ఎస్బీఐలో ఉంచనున్నారు. దేవుడి పేరుతో పాసు పుస్తకాలు.. దేవాలయాలభూములకు దేవుడి పేరుతో పట్టా తీసుకోనున్నారు. చాలా భూములు అన్యాక్రాంతమైన నేపథ్యంలో కమిషనర్ కొద్దినెలలుగా ఇతరుల చేతుల్లోని భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టి సారించారు. 2,622 ఎకరాల భూమిని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఆయా దేవాలయాల్లోని దేవుడి పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. -
త్వరపడండి, ప్రారంభమైన గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021–22లో నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ సోమవారం నుంచీ ప్రారంభమైంది. 16వ తేదీ వరకూ నాలుగు రోజులు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.4,807. ఆన్లైన్లో దరఖాస్తుదారులు, డిజిటల్ విధానంలో చెల్లింపుదారులకు ధరలో గ్రాముకు రూ.50 తగ్గుతుంది. అంటే గ్రాముకు ధర రూ.4,757 మాత్రమే. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 2021 వరకూ మొత్తం ఆరు దఫాలుగా గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరుగుతుంది. దేశంలో బంగారానికి భౌతికంగా ఉన్న డిమాండ్‌ను దేశీయ పొదుపుల్లోకి మార్చడానికి ఉద్దేశించి 2015 నవంబర్‌లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈల ద్వారా గోల్డ్ బాండ్ కొనుగోలు చేసుకోవచ్చు. బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఒక ఇన్వెస్టర్ లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఒక గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోగ్రాముల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ట్రస్ట్‌లకు ఈ పరిమితి 20 కిలో గ్రాములు. 2015 నవంబర్ నుంచి 2021 మార్చి నాటికి ఈ పథకం కింద 63.32 టన్నుల పరిమాణానికి సంబంధించి బంగారం బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.25,702 కోట్ల సమీకరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ 12 ఇష్యూల్లో భాగంగా రూ.16,049 కోట్ల బాండ్లను (32.35 టన్నులు) జారీ చేసింది. అంటే ఇప్పటి వరకు మొత్తం బంగారం బాండ్ల జారీలో సగానికి పైగా గత ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి. చదవండి: Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ -
జనవరి 11 నుంచి గోల్డ్ బాండ్ స్కీమ్
ముంబై: వినియోగదారులకు జనవరి 11వ తేదీన మరో గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులోకి రానుంది. జనవరి 15వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020–21 సిరిస్‌లో ఇది పదవదికాగా, ఇప్పటికే తొమ్మిది పూర్తయ్యాయి. తాజా ఇష్యూలో గ్రాము ధర రూ.5,104 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం వెలువరించిన ఒక ప్రకటన తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఆన్లైన్లోనే చెల్లింపులు చేసిన వారికి గ్రాము బాండ్‌పై రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంటే గ్రాము ధర రూ.5,054కే లభిస్తుందన్నమాట. గడచిన మూడు ఇష్యూ ధరలు ఇవీ... 2020 డిసెంబర్ 28 నుంచి జనవరి 1వ వరకూ అందుబాటులో ఉన్న తొమ్మిదవ సిరీస్ బాండ్ ఇష్యూ ధర కన్నా తాజా ధర రూ.104 అధికంగా ఉండడం గమనార్హం. నవంబర్ 9 నుంచి 13 వరకూ అందుబాటులో ఉన్న ఎనిమిదవ గోల్డ్ బాండ్ స్కీమ్ ధర రూ.5,177. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్16 మధ్య జరిగిన ఏడవ విడత బాండ్ల జారీకి సంబంధించి పసిడి విలువ గ్రాముకు రూ.5,051గా ఉంది. 37 దఫాల్లో రూ.9,653 కోట్ల సమీకరణ 2019–20 ఆర్బీఐ నివేదిక ప్రకారం, 2015 నవంబర్ నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా (37 దఫాలు) రూ.9,652.78 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. -
మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్
ముంబై: వినియోగదారులకు ఆగస్టు 31న మరో గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకూ ఇది అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8 బాండ్ జారీ తేదీ. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020–21 సిరీస్‌లో ఇది ఆరవది కాగా, ఇప్పటికే ఐదు పూర్తయ్యాయి. తాజా ఇష్యూలో గ్రాము ధర రూ.5,117 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెలువరించిన ఒక ప్రకటన తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఆన్లైన్లోనే చెల్లింపులు చేసిన వారికి గ్రాము బాండ్‌పై రూ.50 తగ్గింపు లభిస్తుంది. ఆగస్టు 3 నుంచి 7వ తేదీ వరకూ జరిగిన ఐదవ విడతలో గ్రాము ధర రూ.5,334గా ఉంది. తాజా విడత గ్రాము ధరకు ఆగస్టు 26 నుంచి ఆగస్టు 28వ తేదీ మధ్య మూడు ట్రేడింగ్ రోజుల సగటును ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. 37 దఫాల్లో రూ.9,653 కోట్ల సమీకరణ 2019–20 ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, 2015 నవంబర్ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకూ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా (37 దఫాలు) రూ.9,652.79 కోట్లను సమీకరించడం జరిగింది. 38.98 టన్నుల విలువైన గోల్డ్ బాండ్ విక్రయం జరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 6.13 టన్నుల విలువైన గోల్డ్ బాండ్ల జారీ ద్వారా రూ.2,316.37 కోట్లను సమీకరణ జరిగింది. ఎనిమిదేళ్ల కాల వ్యవధితో కూడిన ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన వారు, కోరుకుంటే ఐదవ ఏట నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. -
గోల్డ్ బాండ్ ధర రూ.3,890
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20 నాల్గవ సిరీస్ సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పథకం 13వ తేదీ వరకూ చందాదారులకు అందుబాటులో ఉంటుంది. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం- గోల్డ్ బాండ్ ధర గ్రాముకు రూ.3,890. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే, రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే వీరికి గోల్డ్ బాండ్ రూ.3,840కే లభిస్తుందన్నమాట. లేదంటే నిర్దేశిత బ్యాంక్ బ్రాంచీలు, పోస్టాఫీసుల ద్వారా గోల్డ్ బాండ్లకు చందాదారులు కావచ్చు. 2015 నవంబర్‌లో కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గించి, ఈ కొనుగోళ్ల మొత్తంలో కొంత మొత్తం పొదుపుల్లోకి మళ్లించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. గ్రాము నుంచి ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) 500 గ్రాముల వరకూ పసిడి కొనుగోళ్లకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుంటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు సంబంధిత సంస్థలు 20 కేజీల వరకూ కొనుగోలు చేసే అవకాశం ఉంది. -
గోల్డ్ బాండ్ స్కీమ్ 9వ తేదీతో ముగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సౌర్వభౌమ బంగారం బాండ్ల పథకంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో మూడో విడత పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. గ్రాముకు రూ.3,499గా ధర నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్ ఈ నెల 5న ఆరంభం కాగా, ఈ నెల 9వ తేదీన ముగుస్తుంది. ఆగస్టు 14వ తేదీన అర్హులైన వారికి బాండ్లను జారీ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అటువంటి ఇన్వెస్టర్లు గ్రాముకు చెల్లించాల్సింది రూ.3,449 మాత్రమేనన్న మాట. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో బంగారం ధర నూతన గరిష్టాలకు చేరిన తరుణంలో ప్రభుత్వం బాండ్ల ఇష్యూను చేపట్టడం గమనార్హం. ఇందులో పెట్టుబడులను కనీసం 8 ఏళ్లు కొనసాగించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరపై ఏటా 2.5 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లించడం జరుగుతుంది. మెచ్యూరిటీ సమయానికి మార్కెట్ ధర ప్రకారం బాండ్లపై చెల్లింపులు జరుగుతాయి. -
24 నుంచి తాజా గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) తాజా సబ్స్క్రిప్షన్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది మొదటి గోల్డ్ బాండ్ స్కీమ్. మార్కెట్ విలువకన్నా గ్రాముకు రూ.50 తక్కువగా బాండ్ విలువ ఉంటుంది. వార్షిక వడ్డీ 2.75 శాతం. తొలి ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రతి ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఈ బాండ్లకు ఏప్రిల్ 24–28 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. బాండ్ల కాలపరిమితి ఐదవ ఏడాది నుంచి ‘ఎగ్జిట్’ ఆప్షన్‌తో ఎనిమిది సంవత్సరాలు. ఒక వార్షిక సంవత్సరంలో గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. సబ్‌స్క్రిప్షన్‌కు వారం ముందు (సోమవారం–శుక్రవారం) ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 ప్యూరిటీ గోల్డ్ ధర సగటును బాండ్ ధరగా స్థిరీకరించడం జరుగుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్, బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బాండ్లు అందుబాటులో ఉంటాయి. -
రేపటి నుంచి తాజా గోల్డ్ బాండ్ స్కీమ్
వరుసలో ఐదవది... 9వ తేదీ వరకూ దరఖాస్తులు బాండ్ల జారీ తేదీ 23 న్యూఢిల్లీ: ఐదవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచీ ప్రారంభం కానుంది. దరఖాస్తుల దాఖలుకు గడువు సెప్టెంబర్ 9. బాండ్ల జారీ 23న జరుగుతుంది. ఇప్పటి వరకూ 4 విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. ఇందులో మూడవ విడత వరకూ జారీ అయిన బాండ్ల ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్లలో ఇప్పటికే ప్రారంభమయింది. ఈ నెల 29వ తేదీనే మూడవ విడత బాండ్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక సెప్టెంబర్ 23వ తేదీ జారీ అయ్యే బాండ్లతో కలుపుకుంటే... రెండు విడతల బాండ్ల ఎక్స్ఛేంజీల ట్రేడింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నమాట. విధానం ఇదీ..: 2015 అక్టోబర్ 30న పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. బాండ్లకు సంబంధించి తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఒక గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత ఎగ్జిట్ ఆఫర్ ఉంటుంది. ఇన్వెస్టర్ దృష్టి ఫిజికల్ గోల్డ్ వైపు నుంచి మళ్లించడం ఈ పథకం లక్ష్యం. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం రూ.919 కోట్లు సమీకరించింది. మొదటి మూడు విడతల్లో 4.9 టన్నుల పసిడికి సంబంధించి రూ.1,318 కోట్ల విలువైన పెట్టుబడులను సేకరించింది. -
గోల్డ్ బాండ్ స్కీమ్ 4వ విడత నెలాఖర్లో
న్యూఢిల్లీ: నాలుగో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్ జూన్ నెల చివరిలో ప్రారంభం కానున్నది. తాజా గోల్డ్ బాండ్ స్కీమ్ అంశంపై కసరత్తు చేస్తున్నామని, ఇది ఈ నెల చివరిలో ప్రారంభం కావొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ తెలిపారు. ఎస్జీబీ స్కీమ్‌కు ఇన్వెస్టర్ల స్పందన అంతంత మాత్రంగానే ఉందని, దీనికి పలు అంశాలు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గోల్డ్ బాండ్ల డీమ్యాట్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. రానున్న 1-2 నెలల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింట్ అమల్లోకి రావచ్చని తెలిపారు. -
మూడవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్
తగ్గిన స్పందన! న్యూఢిల్లీ: మూడవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్బీజీ) స్కీమ్‌కు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాదాపు రూ.329 కోట్ల విలువైన 1,128 కేజీలకు మాత్రమే డిమాండ్ వచ్చింది. రెండవ విడతతో పోల్చితే ఈ డిమాండ్ దాదాపు సగమే కావడం గమనార్హం. మూడు విడతలూ కలిసి రూ.1,322 కోట్ల విలువ రూ.4,916 కేజీలకు సబ్స్క్రిప్షన్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడించాయి. మార్చి 8వ తేదీ నుంచి 14వతేదీ వరకూ మూడవ విడత స్కీమ్ అమలయ్యింది. తొలి సమాచారం ప్రకారం 64,000 మంది నుంచి దరఖాస్తులు అందాయి. బాండ్లు మార్చి 29న జారీ అవుతాయి. 2015 నవంబర్‌లో 916 కేజీలు, ఈ జనవరిలో 2,872 కేజీలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. గోల్డ్ స్కీమ్ విజయానికి కసరత్తు... మరోవైపు గోల్డ్ డిపాజిట్ పథకం విజయవంతం చేయడానికి కేంద్ర కసరత్తు చేస్తోంది. దాదాపు 800 బిలియన్ డాలర్ల విలువ చేసే 20,000 టన్నుల బంగారం బీరువాలకు పరిమితమవుతోందని, దీనిలో సగాన్నైనా మార్కెట్లోకి తీసుకురావాలని భావించిన కేంద్రానికి తీవ్ర నిరాశే ఎదురయ్యింది. కేవలం 3 టన్నుల డిపాజిట్ మాత్రమే ఇప్పటివరకూ నమోదైంది. మరోవైపు, దాదాపు 44 కేజీల బంగారాన్ని.. గోల్డ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని యోచిస్తున్నట్లు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయం వర్గాలు తెలిపాయి. ఇందుకోసం వివిధ బ్యాంకుల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, వచ్చే వారం అధికారిక ప్రకటన రాగలదని పేర్కొన్నాయి. సిద్ధి వినాయక దేవాలయం వద్ద దాదాపు 160 కేజీల బంగారం ఉన్నట్లు అంచనా. -
ఈ నెల 8 నుంచీ మళ్లీ పసిడి బాండ్లు
న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకం మూడవ విడతకు వచ్చే మంగళవారం నాడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... ♦ బాండ్లకు దరఖాస్తులను మార్చి 8వ తేదీ నుంచీ 14వ తేదీవరకూ సమీకరిస్తారు. మార్చి 29న బాండ్లను జారీ చేస్తారు. ♦ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), గుర్తింపు పొందిన పోస్టాఫీసుల్లో బాండ్ల విక్రయం జరుగుతుంది. ♦ సావరిన్ గోల్డ్ బాండ్లపై మొత్తాలను తిరిగి చెల్లించే సమయంలో వ్యక్తులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని 2016-17 బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. ♦ 5, 10, 50, 100 గ్రాములు డినామినేషన్లలో 5-7 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ అవుతాయి. ♦ ఒక వ్యక్తి వార్షికంగా 500 గ్రాములకన్నా అధికంగా బాండ్ల కొనుగోలుకు అవకాశం లేదు. ♦ పెట్టుబడుల సమయంలో మెటల్ విలువ ప్రాతిపదికన వడ్డీరేటును లెక్కిస్తారు. ♦ తొలి విడత స్కీమ్‌లో 916 కేజీల పరిమాణంలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.246 కోట్లు సమీకరించింది. ♦ రెండో విడతలో ఇది 3,071 కేజీలకు చేరింది. తద్వారా రూ.798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. -
త్వరలో మూడవ విడత గోల్డ్ బాండ్లు
న్యూఢిల్లీ: మొదటి రెండు విడతల్లో దాదాపు రూ.1,044 కోట్లు సమీకరించిన నేపథ్యంలో... మూడవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్‌లో ప్రారంభమైన మొదటి విడత స్కీమ్‌లో 916 కేజీల పరిమాణంలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.246 కోట్లు సమీకరించుకోగలిగింది. జనవరిలో డిమాండ్ భారీగా 3,071 కేజీలకు చేరింది. తద్వారా రూ.798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. అయితే ఈ దఫా లక్ష్యాల గురించి ఆయన ఏమీ తెలపలేదు. వ్యక్తుల విషయంలో సావరిన్ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్ ను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని 2016-17 బడ్జెట్లో ప్రతిపాదించారు. -
5 నుంచి గోల్డ్ బాండ్ల స్కీమ్
* 20 వరకూ ఆఫర్ * 26న బాండ్ల జారీ * వడ్డీ 2.75 శాతం న్యూఢిల్లీ: పసిడి బాండ్ పథకాన్ని నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రారంభిస్తోంది. పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన బాండ్లపై 2.75 శాతం వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు ... * నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు * బ్యాంకులు, నోటిఫై చేసిన నిర్దిష్ట పోస్టాఫీసుల ద్వారా గోల్డ్ బాండ్ల అమ్మకం జరుగుతుంది. బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. * కొనుగోళ్లకు సంబంధించిన బాండ్లు 26న జారీ అవుతాయి. * బాండ్ల జారీ ఇది మొదటి విడత. తదుపరి దశల్లో మళ్లీ బాండ్ల జారీ జరుగుతుంది. * కనిష్టం 2 గ్రాముల విలువ నుంచి గరిష్టంగా 500 గ్రా. వరకూ బాండ్లను కొనొచ్చు. * ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 500 గ్రా. పసిడి బాండ్లను మాత్రమే కొనుగోలు చేసే వీ లుంది. జాయింట్ హోల్డర్ల విషయంలో తొలి వ్యక్తికి ఈ పరిమితి వర్తిస్తుంది. * బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. ఐదేళ్ల నుంచీ ‘ఎగ్జిట్’ ఆఫర్ ఉంటుంది. * బాండ్ల విలువ భారత రూపాయిల్లో ఉంటుంది. బాండ్ల జారీకి ముందు వారం (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) భారత బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రకటించిన 99.9 ప్యూరిటీ పసిడి ధర సగటు విలువను ధరగా నిర్ణయిస్తారు. రిడంప్షన్(తిరిగి బాండ్లను నగదుగా మార్చుకోవడం) విషయంలోనూ ధర లెక్కింపు ఇదే ప్రాతిపదికన జరుగుతుంది. * ఐదేళ్లకు ముందే బాండ్లను నగదుగా మార్చుకోవాలనుకునేవారి సౌలభ్యం కోసం కమోడిటీ ఎక్స్ఛేంజీలలో ఈ బాండ్ల ట్రేడింగ్ జరుగుతుంది. * భారతీయులుసహా భారతీయ సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టీలు, యూనివర్సిటీలు, దాతృత్వ సంస్థలు మాత్రమే బాండ్లు కొనుగోలు చేయడానికి ఆర్హత కలిగి ఉంటాయి. * రుణాలకు హామీగా బాండ్లను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పసిడిపై ఇస్తున్న రుణానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనలే దీనికీ వర్తిస్తాయి. * గోల్డ్ బాండ్ల వడ్డీపై పన్ను, కేపిటల్ గెయిన్ ట్యాక్స్ అమలవుతుంది. బాండ్ల పంపిణీపై కమిషన్ ‘సబ్స్క్రిప్షన్ విలువ’పై 1%గా ఉంటుంది. -
రూ.15 వేల కోట్ల గోల్డ్ బాండ్లు వస్తున్నాయ్!
ద్వితీయార్ధంలో జారీకి కేంద్రం ప్రణాళికలు న్యూఢిల్లీ : బంగారానికి డిమాండ్ తగ్గించడం కోసం కేంద్రం సావరీన్ గోల్డ్ బాండ్ల జారీకి చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (2015-16, అక్టోబర్-మార్చి)లో రూ.15,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లను జరీచేసే ప్రణాళికల్లో ఉంది. ఈ బాండ్ల స్కీమ్‌కు సంబంధించి మరో నెలరోజుల్లో కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర లభించే అవకాశాలున్నాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు విడతలవారీగా ఈ బాండ్ల జారీని చేపట్టనునున్నారు. ప్రతియేటా భారతీయులు కొనుగోలు చేసే దాదాపు 300 టన్నుల విలువైన పుత్తడిలో(కడ్డీలు, నాణేల రూపంలో) కొంత భాగాన్ని డీమ్యాట్ రూపంలో ఉండే గోల్డ్ బాండ్లలోకి మళ్లించాలనేది ప్రతిపాదిత పథకం ఉద్దేశం. పోస్టాఫీసులు, బ్రోకర్ల ద్వారా ఈ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణలో భాగంగానే ఈ గోల్డ్ బాండ్ పథకం ఉంటుంది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గించడంతో పాటు నిధుల సమీకరణకు కూడా ఈ స్కీమ్ వీలు కల్పిస్తుందనేది ప్రభుత్వం యోచన. ప్రతిపాదితన స్కీమ్ ప్రకారం... 2, 5, 10 గ్రాములతో పాటు ఇతరత్రా డినామినేషన్లలో బంగారానికి సమానమైన విలువగల గోల్డ్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. కనీస కాలపరిమితి 5-7 ఏళ్లుగా ఉంటుంది. నిర్ధేశిత వడ్డీరేటు ఆధారంగా వచ్చే రాబడిని మెచ్యూరిటీ తర్వాత బంగారం రూపంలోనే చెల్లిస్తారు.