గోల్డ్ బాండ్ స్కీమ్ 4వ విడత నెలాఖర్లో | Sovereign gold bond scheme's fourth tranche to open by June-end | Sakshi
Sakshi News home page

గోల్డ్ బాండ్ స్కీమ్ 4వ విడత నెలాఖర్లో

Published Wed, Jun 1 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

గోల్డ్ బాండ్ స్కీమ్ 4వ విడత నెలాఖర్లో

గోల్డ్ బాండ్ స్కీమ్ 4వ విడత నెలాఖర్లో

న్యూఢిల్లీ: నాలుగో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) స్కీమ్ జూన్ నెల చివరిలో ప్రారంభం కానున్నది. తాజా గోల్డ్ బాండ్ స్కీమ్ అంశంపై కసరత్తు చేస్తున్నామని, ఇది ఈ నెల చివరిలో ప్రారంభం కావొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ తెలిపారు. ఎస్‌జీబీ స్కీమ్‌కు ఇన్వెస్టర్ల స్పందన అంతంత మాత్రంగానే ఉందని, దీనికి పలు అంశాలు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గోల్డ్ బాండ్ల డీమ్యాట్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. రానున్న 1-2 నెలల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింట్ అమల్లోకి రావచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement