Sovereign Gold Bond
-
గోల్డ్ బాండ్ గ్రాము @ రూ. 5,611
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2022–23.. తదుపరి దశలో భాగంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రాముకి రూ. 5,611 ధరను నిర్ణయించింది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఇష్యూ సోమవారం(6న) ప్రారంభంకానుంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్) ధర రూ. 5,611ను ఆర్బీఐ నిర్ణయించింది. కాగా.. ఆర్బీఐతో సంప్రదింపుల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకి నామినల్ విలువకు రూ. 50 డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే ఇందుకు ఇన్వెస్టర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది.వెరసి గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ. 5,561కు లభించనుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసే సంగతి తెలిసిందే. వీటిని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్(ఎస్‌హెచ్‌సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా విక్రయిస్తారు. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి రిడెంప్షన్‌ను అనుమతిస్తారు. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండును తగ్గించే బాటలో 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దేశీ పొదుపు సొమ్మును ఫిజికల్ గోల్డ్‌కు కాకుండా సావరిన్ గోల్డ్ కొనుగోలువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పూర్తి స్వచ్చత(999)గల బంగారం సగటు ధరను బాండ్లకు నిర్ణయిస్తారు. ఒక గ్రామును ఒక యూనిట్‌గా కేటాయిస్తారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లను కనిష్టంగా 1 గ్రాము, గరిష్టంగా 4 కేజీలవరకూ కొనుగోలుకి అనుమతిస్తారు. హెచ్‌యూఎఫ్‌లకు 4 కేజీలు, ట్రస్ట్‌లకు 20 కేజీల వరకూ యూనిట్ల కొనుగోలుకి వీలుంటుంది. -
గోల్డ్ బాండ్ల ధర గ్రాము రూ.2,901
24 నుంచి 28 వరకూ ఆఫర్ ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచీ ఏప్రిల్ 28వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ బాండ్ ధర గ్రాముకు రూ.2,901 అని ఒక ప్రకటనలో తెలిపింది. బాండ్లు మే 12వ తేదీన జారీ అవుతాయి. సబ్‌స్క్రిప్షన్‌కు వారం ముందు (సోమవారం–శుక్రవారం) ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 ప్యూరిటీ గోల్డ్ ధర గ్రాముకు సగటున రూ.2,951గా నమోదయ్యింది. దీనితో ముందే నిర్ణయించిన ప్రకారం– బాండ్ ధరను రూ.50 రిబేట్ ప్రాతిపదికన రూ.2,901గా స్థిరీకరించారు. ఈ బాండ్‌పై వార్షిక వడ్డీ 2.75 శాతం. తొలి ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రతి ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. బాండ్ల కాలపరమితి ఐదవ ఏడాది నుంచీ ‘ఎగ్జిట్’ ఆప్షన్‌తో ఎనిమిది సంవత్సరాలు. ఒక వార్షిక సంవత్సరంలో గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. బ్యాం కులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్, బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బాండ్లు అందుబాటులో ఉంటాయి. -
గోల్డ్ బాండ్ స్కీమ్ 4వ విడత నెలాఖర్లో
న్యూఢిల్లీ: నాలుగో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్ జూన్ నెల చివరిలో ప్రారంభం కానున్నది. తాజా గోల్డ్ బాండ్ స్కీమ్ అంశంపై కసరత్తు చేస్తున్నామని, ఇది ఈ నెల చివరిలో ప్రారంభం కావొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ తెలిపారు. ఎస్జీబీ స్కీమ్‌కు ఇన్వెస్టర్ల స్పందన అంతంత మాత్రంగానే ఉందని, దీనికి పలు అంశాలు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గోల్డ్ బాండ్ల డీమ్యాట్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. రానున్న 1-2 నెలల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింట్ అమల్లోకి రావచ్చని తెలిపారు.