న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023–24 తొలి విడత సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. బంగారం జారీ ధరను గ్రాముకు రూ.5,926గా ఆర్థికశాఖ ప్రకటించింది. ఐదు రోజుల పాటు (19–23) స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ప్రకటిత ధరలో గ్రాముకు రూ.50 రిబేట్ లభిస్తుంది. అంటే ఆన్‌లైన్ ధర గ్రాముకు రూ.5,876గా ఉంటుందన్నమాట.
బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్ 19తో పాటు సెప్టెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకూ కూడా మరో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో ఉండే సంగతి తెలిసిందే.
(ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!)
గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీమ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయొ చ్చు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసి యేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సగ టు ధర ఆధారంగా ఎస్‌జీబీ ధరను నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment