రైతు రుణమాఫీపై అన్నీ అబద్ధాలే
నేను పొడుగున్న అంటున్నావ్.. నిన్ను లిల్లీపుట్ అనాలా?.. సీఎం అబద్ధాల బురదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుడే ఎక్కువ.. రెండుసార్లు గెలుస్తారని అనడం పగటి కలలు కనడమే’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గెలిí³స్తే ఐదేళ్లలోపు ప్రభుత్వాలు పోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ‘అదృష్టం బాగుంటే ఐదేళ్లు ఉంటావు.
మంచిగా ప్రవర్తించు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది. రెండుసార్లు అధికారంలో ఉంటానని పగటి కలలు కనకు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ తీస్తున్నావు. సీఎం కుర్చీ గౌరవం తగ్గిస్తున్నావు. రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఒకటి వర్షాలతో వచ్చిన వరద అయితే...రెండోది చిల్లర ముఖ్యమంత్రి అబద్ధాల వరద. మోరీల కంపును మించిపోయింది ముఖ్యమంత్రి నోటి కంపు. ప్రభుత్వంలో ఉన్నాననే సోయి..ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నా అనే ఇంగితం లేక మాట్లాడుతున్నాడు.
పదే పదే నా పొడుగును గురించి దుర్భాషలాడుతున్నావు. నేను పొడుగే. తెలంగాణ ఉద్యమం నన్ను మరింత ఎత్తుకు చేర్చింది. నీ బుద్ధి కురుచ. నీ చరిత్ర కురుచ. నీ భాష కురుచ. నీ కురుచతనం వల్ల నీకు కలిగిన ఆత్మనూన్యత వల్ల పదేపదే నా పొడుగు గురించి మాట్లాడుతున్నావు. నేను తాటి చెట్టంత ఎదిగిన. నువ్వు వెంపలి చెట్టంత కూడా ఎదగలే. నిన్ను లిల్లీపుట్ అని నేను అనలేనా. సన్నాసి అని నేను అనలేనా.. నా ఎత్తు ఎంత ఉంటే ఎందుకు. ఇప్పటికీ 20 సార్లు మాట్లాడివ్ నా ఎత్తు గురించి’అని తీవ్రస్థాయిలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రుణమాఫీ ఎక్కడ అయిందో చెప్పు...
‘రుణమాఫీ పూర్తి చేశా అని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అబద్ధాలు చెప్పినవ్. రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తావా? కొండారెడ్డిపల్లి చౌరస్తా లేదా మా సిద్దిపేట వెంకటాపురం పోదామా? వెంకటాపురం గ్రామంలో 122 మంది ఉంటే.. 82 మందికి కాలేదు. రుణమాఫీ విషయంలో సీఎంకు, వ్యవసాయశాఖ మంత్రి మాటల మధ్య తేడాలున్నాయి. రెండు లక్షలపైన మిత్తి ఉంటే కట్టిన వాళ్ల లిస్ట్ పంపుతున్నానని, దమ్ముంటే వాళ్లకు మాఫీ చెయ్యి అని ఆ వివరాలు హరీశ్‌రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment