ఆ బూచి చూపి బిల్డర్లపై వేధింపులకు పాల్పడుతున్నారు: హరీశ్‌రావు
కుత్బుల్లాపూర్: హైడ్రా ఏర్పాటుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని.. బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరో పించారు. అప్పుల బాధతో ఆత్మహత్మకు పాల్పడిన కొంపల్లికి చెందిన బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబసభ్యులను ఆదివారం ఆయన ఎమ్మెల్యే వివేకానందతో కలిసి పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ రంగం పెనుముప్పును ఎదుర్కొంటోందని, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం, ఆపదలో ఉన్నవారు అమ్ముకుందామంటే ప్లాట్లు అమ్ముడుపోని దుస్థితి నెలకొందన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం దేశానికే దిక్సూచిగా నిలిచిందని, నాటి సీఎం కేసీఆర్ హైదరా బాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మారిస్తే, నేడు కాంగ్రెస్ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను భయపెట్టే విధంగా హైడ్రా ఏర్పాటు చేయడంతో పెట్టుబడులు ముంబై, నోయిడా, బెంగళూరులకు తరలి పోతున్నాయని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి రియల్‌ఎస్టేట్ అంటే నాకు బాగా తెలుసు అని మాటల్లో చెప్పడం కాదు..మీరు వచ్చి వేణుగోపాల్‌రెడ్డి కుటుంబంతో మాట్లాడండి, వారి కష్టాన్ని అర్థం చేసుకోండి, భవిష్యత్‌లో మిగతా బిల్డర్లకు ఈ పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టండని çహరీశ్‌రావు అన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతులు ఎందుకు ఆలస్యమవుతు న్నాయని ప్రశ్నించారు. సీఎం రియల్ ఎస్టేట్ రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించి బిల్డర్లకు భరోసా కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment