
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవులపై కసరత్తు ప్రారంభించిన మీనాక్షి.. పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూపు, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూపు, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారని మూడో గ్రూప్‌గా విభజించారు.
పార్టీ పదవులు.. నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పదేళ్లు పార్టీలో ఉన్నవారి లిస్ట్ కోరిన ఇన్‌చార్జ్ మీనాక్షి. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది.
కాగా, రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ పనితీరుపై ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిన్న(మంగళవారం) మెదక్, మల్కాజ్‌గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశమయ్యారు. ఇవాళ ఆదిలాబాద్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ మీనాక్షి నటరాజన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment