meenakshi
-
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ చార్జిగా మీనాక్షి నటరాజన్
-
రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మారుస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీని తప్పించి, ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజుకు జార్ఖండ్ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వీరితోపాటే మరో ఏడుగురు సీనియర్ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన కొద్దిరోజులకే ఇన్ చార్జ్‌గా ఉన్న మాణిక్‌రావ్ థాక్రేను గోవాకు పంపిన ఏఐసీసీ, కేరళ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న దీపాదాస్ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అదనంగా కట్టబెట్టింది. అప్పటి నుంచి ఆమె పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే పారీ్టనేతలకు ఆమె అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ.. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తట్టిలేపింది. ఆమె సారథ్యంలో సీఎల్పీ భేటీ నిర్వహించి సరిదిద్దే ప్రయత్నం చేసినా,.. ఈ అంశం ఏఐసీసీకి చేరింది. ఆమెస్థానంలో పూర్తిస్థాయి నేతకు బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించారు. రాహుల్ టీమ్ నుంచే.. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 1999లో ఎన్ఎస్యూఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2002–2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమెను, 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా రాహుల్‌గాంధీ ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాహుల్ టీమ్‌లో ఉన్న ఆమె 2009లో మంద్సౌర్ నుంచి ఎంపీగా పోటీ చేసి.. 1971 నుంచి అక్కడ గెలుస్తున్న లక్ష్మీనారాయణ్ పాండేను ఓడించారు. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.అయినా రాహుల్ టీమ్‌లో కొనసాగిన ఆమె భారత్ జోడోయాత్ర, న్యాయ్‌యాత్రలో క్రియాశీల పాత్ర పోషించారు. 2023 ఆగస్టు 6న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమెను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించారు. భూదా న్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తాజాగా ఆమెకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అంశంపై చర్చించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా ఢిల్లీ వచ్చారనే ప్రచారం జరిగింది. ఆయన ఢిల్లీ చేరే సమయానికే ఏఐసీసీ నుంచి కొత్త ఇన్చార్జ్పై ప్రకటన వెలువడింది. జార్ఖండ్‌కు కొప్పుల రాజు రాహుల్ టీమ్‌కే చెందిన కొప్పుల రాజును జార్ఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఏఐసీసీ నియమించింది. 15 ఏళ్లుగా పార్టీ మేనిఫెస్టో, విధాన రూపకల్పన, పార్టీపరంగా కేంద్రంపై లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయనకు జార్ఖండ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆయన ఓడిపోయారు. -
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
సాక్షి, ఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను ఏఐసీసీ ప్రకటించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు.హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లను ఏఐసీసీ నియమించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లకు కొత్త జనరల్ సెకట్రరీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. -
2025లో టాలీవుడ్ ని శాసించనున్న రష్మిక, శ్రీలీల, మీనాక్షి
-
సెలబ్రిటీల దీపావళి ముచ్చట్లు.. భయం లేకపోవడమే వెలుగు..!
జీవితం వెలుగుతుంది. జీవితం వెలుతురు సందర్భాలను తీసుకొస్తుంది. జీవితం ఎప్పుడూ నిరాశ, నిçస్పృహలనే చీకట్ల మీదకు ఆశ, ఆవేశం అనే వెలుతురు కిరణాలు పంపుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల ఈ రంగేళిని సరి సమంగా స్వీకరించి ముందుకు సాగమని చెబుతుంది దీపావళి. వెలుతురును వరస కట్టుకోమని పెద్ద పెద్ద చప్పుళ్లతో అరిచి చెప్పే పండుగ ఇది. ఈ సందర్భంగా సెలబ్రిటీల వెలుతురు ముచ్చట్లు...నా జీవితంలో వెలుగులు నింపిన సంఘటన నేను మిస్ ఇండియా కిరీటం గెలవడం. మా నాన్నగారు మాకు దూరమైన తర్వాత ఇది జరిగింది. నా కంటే ఎక్కువగా మా కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురైన క్షణాలు అవి. ఇలా మా జీవితాల్లో వెలుగులు నిండిన ఈ సమ యాన్ని నేను మర్చిపోలేను. నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు. దీపావళి పండక్కి ఆయన ఇంటికి వచ్చేవారు. అందువల్ల ఇంట్లో పండగ సందడి భలేగా ఉండేది. ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చేవారు. ఆయన లేకపోయినా ఆ ఆనవాయితీని కొనసాగేలా చూస్తున్నాను. మా హర్యాణలో దీపావళికి గాలిపటాలు ఎగరేస్తాం. వీధుల్లో పిల్లల ఆటపాటలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు నియమంగా. ఇక షాపింగ్ చేయడం, నచ్చిన ఫుడ్ తినడం, దీపావళి వెలుగుల్లో సరదాగా గడపడం... ప్రతిసారి లాగే ఈసారి కూడా దీపాళికి ప్లాన్ చేశాను.ఇప్పుడే కాదు.. నా చిన్నప్పటి నుంచీ నేను క్రాకర్స్ కాల్చను. కానీ ఎవరైనా క్రాకర్స్ కాల్చుతుంటే దూరంగా నిల్చుని చూస్తూ ఆనందిస్తుంటాను. చీకటి, వెలుగులు ఉన్నట్లే... మన జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు, మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ముఖ్యం. మన బౌండరీస్పై మనకు ఓ అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ సానుకూలంగానే ఆలోచించాలి. ఇలా ఉండటం సులభమని నేను చెప్పడం లేదు. కానీ ఉండగలగాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా బాల్యంలో ప్రతి ఏడాది దీపాళికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం. దాదాపు ఇరవైమంది కుటుంబ సభ్యులం కలిసి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందుకే దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో క్రాకర్స్ కాల్చడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా తాతగారు దీపాళికి పెద్దస్థాయిలో లక్ష్మీపూజ ఘనంగా జరిపేవారు. అప్పట్లో క్రాకర్స్ కొనిచ్చేవారు. పిల్లలు క్రాకర్స్ బాక్స్‌లను కలిసి కాల్చేవారు. ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్ళు. బాగుండేది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇప్పుడు కాల్చడం లేదు. అయితే ఒకసారి పండక్కు వెళ్లి కాలని లక్ష్మీబాంబులను ఏరుకుని, వాటిని విప్పి అందులోని పొడిని ఓ పేపర్లో ఉంచి, ఆ పేపర్ చివరన వెలిగించాను. నా అంతట నేనే ఓ లక్ష్మీబాంబును తయారు చేసుకుంటున్నానని ఫీలైపోయాను. కానీ దురదృష్టవశాత్తు నా రెండు వేళ్లు కాలిపోయాయి. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని తెలియకుండా దాచాను. కానీ అమ్మ గమనించి మందలించింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే పిల్లలందరికీ చెబుతున్నా... క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కాల్చే క్రాకర్స్‌పై మీకు అవగాహన లేకపోతే దూరంగా ఉండండి. అత్యుత్సాహం చూపకండి. నేను సరదాగా చేసిన పిచ్చిపనిలాంటివి చేయకండి. కొన్ని కారణాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు నేను దీపాళిని మా అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ ఏడాది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంటి వాతావరణంలో నేను పెరిగింది తక్కువ. బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. కాలేజీ కూడా అంతే. ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటాను. సమాజంలో ఎలా మెలగాలో నాకు నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మీపై మీరు భరోసా ఉంచండి. ధైర్యంగా ఉండండి. నైతిక బాధ్యతతో ఉండండి. అప్పుడు క్లిష్టపరిస్థితులను నెగ్గుకు రావొచ్చు మీరు. నమ్మిన దానిపట్ల ధైర్యంగా నిలబడుతూ తలెత్తుకు జీవించండి. నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్న సంగతులు ఇవి. భయం లేకపోవడమే వెలుగని నేను భావిస్తుంటాను. (చదవండి: మన ముంగిళ్లలో వెలుగు పూలు) -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘జ్యువెల్ థీఫ్’
కృష్ణసాయి, మీనాక్షీ జైస్వాల్ జంటగా నటించిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రేమ, అజయ్, శివారెడ్డి, శ్రావణి, శ్వేతారెడ్డి నటించారు. మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ఆడియో లాంచ్ వేడుకకి ముఖ్య అతిథులుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ లవిదియ, అతిథిగా నటి ఎస్తేర్ హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కృష్ణ సాయి మాట్లాడుతూ– ‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’’ అన్నారు. ‘‘కృష్ణసాయికి తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇది’’ అన్నారు పీఎస్ నారాయణ. ‘‘ఈ మూవీలో మంచి పాత్ర చేశాను’’ అన్నారు నటి ప్రేమ. -
నటిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. తల అడవిలో, మొండెం..
కరీనా కపూర్ హీరోయిన్గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్రస్తావన సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన నటి మీనాక్షి థాపర్ గురించి! ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమెకు ఇదే చివరి సినిమా! చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్రత్యేక కథనం..సినిమా ఛాన్స్‌కు ముందు1984 అక్టోబర్ 4న మీనాక్షి థాపర్ జన్మించింది. డెహ్రాడూన్‌లో తన విద్యాభ్యాసం జరిగింది. సినిమాల మీద ఆసక్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావడానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2011లో 404 అనే హారర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవలేదు.సెట్స్‌లో అదృశ్యంతర్వాత మధుర్ భండార్కర్ సినిమా 'హీరోయిన్'లో ఛాన్స్ వచ్చింది. కరీనా కపూర్‌తో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని సంబరపడిపోయింది. త్వరలోనే నటిగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చని భావించింది. అంతలోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్‌కి రాగా అక్కడే ఆమె అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న నటి తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు డిమాండ్అందులో మీనాక్షి మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సురిన్‌తో కలిసి అలహాబాద్‌కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మూడు రోజుల తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 లక్షలు పంపండి.. మూడు రోజులు మాత్రమే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే తను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. రోజులు గడుస్తున్నాఈ బెదిరింపులకు నటి తల్లి లొంగలేదు. ఆర్మీలో పని చేస్తున్న తన కుమారుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. రోజులు గడుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొరకలేదు. ఒకరోజు అమిత్, ప్రీతి(వీరిద్దరూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీనాక్షిని హత్య చేసినట్లు అంగీకరించాడు.శరీరాన్ని ముక్కలుగాఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన తర్వా ఆమె తల, మొండెం వేరు చేశారు. అలహాబాద్‌లో ప్రీతి ఇంటికి దగ్గర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లో తన శరీరాన్ని ముక్కలుగా కోసి పడేశారు. తలను అలహాబాద్ నుంచి లక్నోకు వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో నుంచి అడవిలో విసిరేశారు. 2018లో న్యాయస్థానంలో నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది.స్నేహితుల అత్యాశ వల్ల 27 ఏళ్ల వయసుకే నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక తల్లికి తీరని కడుపుకోత మిగిలింది.చదవండి: సింగర్‌పై బాటిల్ విసిరిన ఆకతాయి.. అయినా సహనం కోల్పోకుండా.. -
రిక్షానే ఆసరాగా.. 'చినాబ్ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..
'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.' జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది. ఏ దారీ దొరక్క.. భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్ బిల్స్ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం. మరో ఆప్షన్ లేక.. "ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్ బిల్స్ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి. ఇవి చదవండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత -
Meenakshi Chaudhary: "గుంటూరు కారం" మీనాక్షి చౌదరి కళ్ళు చెదిరే అందాలు ఆరబోసింది.
-
సుమంత్ హీరోగా వస్తోన్న కొత్త మూవీ.. గ్లింప్స్ అదుర్స్!
సుమంత్ , మీనాక్షి గోసామి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. క్రిష్ మాట్లాడుతూ...'మహేంద్రగిరి వారాహి టైటిల్ బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యే కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నా' అని అన్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే..
కేరళలో అతి ప్రాచీనమైన యద్ధకళ కలరిపయట్టు . దీన్ని యుద్ధాలు చేయడానికి ఉపయోగించే ఓ గొప్ప కళగా చెబుతారు. పురాణాల ప్రకారం ఈ కళకు అగస్త్యముని, పరశురాముడి మూలకర్తలుగా చెబుతుంటారు. అలాంటి కలరిపయట్టులో 80 ఏళ్ల బామ్మ అసామాన్యమైన ప్రతిభను కనబర్చడమేగాక ఎందరికో గురువుగా ఆ యుద్ధకళకు సంబంధించిన పాఠాలు చెబుతుంది. అది కూడా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఆ విద్యను నేర్పిస్తుంది. ఈ బామ్మ పద్శశ్రీ అవార్డు గ్రహిత కూడా. ఆమె కత్తి లేదా కర్ర పడితే చూపు తిప్పుకోలేరు. అంతలా ముగ్ధమనోహరంగా లయబద్ధంగా విన్యాసం చేస్తుంది. వివరాల్లోకెళ్తే..కేరళలో 80 ఏళ్ల బామ్మ మీనాక్షి గురక్కల్ని చూస్తే మహిళలు ఎందులోనూ తీసుపోరు అనుకుంటారు. ఎలాంటి సౌకర్యాలు, ప్రోత్సాహం లేని ఆ కాలంలోనూ కేరళలో అతి ప్రాచీన యుద్ధ విద్య, మార్షల్ ఆర్ట్స్‌లో పుస్తకాల్లో స్థానం దక్కించుకున్న ఓ గొప్ప కళ అయిన కకలరిపయట్టును ఈ బామ్మ అవలీలగా చేస్తుంది. అది కూడా ఆరుగజాల చీరలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఆమె ప్రతి కదలిక అత్యంత మనోహారంగా ఉంటుంది. ఆమె ఈ విద్యను ఏడేళ్ల వయసు నుంచే నేర్చుకుంది. తన తండ్రి కలరి బృందం ప్రదర్శనను చూస్తూ పెరిగిన ఆమె తనకు తెలియకుండానే ఆ కళపై ఆసక్తి పెంచుకుంది. అలా ఆమె తన చెల్లెలు ఇద్దరూ ఈ కళను నేర్చుకున్నారు. ఆ కళలో మరింత నైపుణ్యం సంపాదించడం కోసం రాఘవన్ మాస్టర్ వద్ద చేరింది. కొన్నేళ్ల తర్వాత ఆ గురువునే వివాహం చేసుకుంది. వారిద్దరు కలిసి ఆ కలరిపట్టు తరగతులు నిర్వహిస్తారు. కానీ ఎవ్వరి వద్ద డబ్బులు వసూలు చేయరు. కానీ ఆ విద్య నేర్చుకున్న విద్యార్థులే చివర్లో తమ సామర్థ్యానికి తగిన విధంగా గురుదక్షిణ చెల్లిస్తే తీసుకోవడమే తప్ప ప్రత్యేకండా వారు ఏమి తీసుకోరు. ఈ విద్యను కేరళలో యుద్ధాలు చేసే యోధులకు నేర్పేవారట. ఆ తర్వాత క్రమేణ ఈ కళ క్షీణించింది. మీనాక్షి లాంటి బామ్మల కారణంగా ఇలాంటి సంప్రదాయ నృత్య కళ లాంటి యుద్ధ కళ కనుమరగవ్వకుండా ఉంది. ఏ కళ అయినా జీవం పోసుకుని కలకలం ఉండాలంటే..మన సంప్రదాయలను సంస్కృతిని గౌరవించినప్పుడే సాధ్యం. అందుకు ఉదహరణే ఈ మీనాక్షి బామ్మ. ఆమె కర్ర పట్టుకుని చేసిన కలరిపయట్టు యుద్ధం నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Midhun Malathi Mohan (@iam_midhun_mohandas) (చదవండి: క్యాండిల్ సిస్టర్స్: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!) -
మిర్చి కంటే హాట్‌గా మీనాక్షి చౌదరి..(ఫోటోలు)
-
మహిషాసురమర్థినిగా మీనాక్షి అమ్మవారు
మధురై: కదంబ వన రాణి మీనాక్షి అమ్మవారు తమిళనాడులోని మధురైలో కొలువై ఉన్నారు. ప్రస్తుతం మీనాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మీనాక్షి దేవాలయం పాండ్య దేవాలయాలలో ప్రముఖమైనదిగా వెలుగొందుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మధుర మీనాక్షి సుందరేశ్వర్ ఆలయానికి మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మీనాక్షి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా శమీ మందిరం రెండవ ప్రాకారంలో ఘనమైన అలంకారం చేశారు. నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారు మహిషాసురమర్థిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు మూలస్థాన గర్భగుడిలోని మీనాక్షి అమ్మవారికి అభిషేకం, అలంకరణలు నిర్వహించి కల్పపూజ, సహస్రనామ పూజలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు #madurai | மதுரை மீனாட்சி அம்மன் கோவிலில் நவராத்திரி 8-வது நாள் விழாவை முன்னிட்டு மகிஷாசுரமர்த்தினி அலங்காரத்தில் எழுந்தருளி அருள்பாலித்தார்.#spiritual | @SRajaJourno | @k_for_krish | @imanojprabakar | @JSKGopi @LKGPONNU @kasaayam | #மீனாட்சியம்மன் @LPRABHAKARANPR3 @abplive pic.twitter.com/8EwLquBYV3 — arunchinna (@arunreporter92) October 22, 2023 -
అందమైన మోసం
పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భరత నాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ (సినిమా అనేది ప్రపంచంలో అత్యంత అందమైన మోసం) ఉపశీర్షిక. ఈ చిత్రంలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కేవీఆర్ మహేంద్రతో కలిసి సూర్య తేజ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘భరత నాట్యం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి. -
కాంగ్రెస్ సభలో కుర్చీల కొట్లాట
సాక్షి, మహబూబాబాద్: మానుకోట కాంగ్రెస్ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. రాష్ట్ర పరిశీకురాలు మీనాక్షి నటరాజన్ ముందే కుర్చీల కోసం కొట్లాడుకున్నారు. అందరినీ సభావేదికపైకి పిలవా లని డిమాండ్ చేశారు. ఈ నెల 17న హైదరా బాద్‌లో జరిగే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ నిమిత్తం మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలోని ముఖ్యనాయకుల సమావేశం గురువారం మహబూబాబాద్‌లో జరిగింది. ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇల్లెందు నుంచి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్, బెల్లయ్యనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చంద్రా రెడ్డిని పిలవాలని అనుకున్నారు. అయితే, అక్కడు న్న చిన్నాచితకా నాయకులు కూడా వేదికపైకి వచ్చి కూర్చోవడంతో కుర్చీలన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో ముందుగా పీసీసీ ఉపాధ్యక్షుడు విజయ రమణారావు మాట్లాడుతుండగా ‘అందరూ వేదిక పై ఉన్నారు. మా నేత మురళీనాయక్‌ను కూడా పిలవాలి, లేకపోతే అర్హత లేని వారిని కిందికి దింపాలి’అంటూ పలువురు కేకలు వేశారు. ఈ క్రమంలో మురళీ నాయక్, బలరాంనాయక్ వర్గాల కార్యక ర్తలు ఒకరినొకరు గల్లాలు పట్టుకుని తోసుకున్నారు. ఇరువర్గాల నినాదాలతో సభాస్థలి దద్దరిలింది. మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకొని విజ్ఞప్తి చేయ డంతో వేదికపై ఉన్న అందరూ కిందికి దిగారు. ఆ తర్వాత ఆమె ముఖ్యులతో మాట్లాడించారు. -
దుల్కర్‌కు జోడీగా..?
తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, వరుణ్‌తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్’ చిత్రంలోని హీరోయిన్ చాన్స్ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుందట. -
రూ.1,440 కోట్ల డీల్, వేదాంత చేతికి మీనాక్షి ఎనర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఉన్న మీనాక్షి ఎనర్జీని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేసేందుకు వేదాంత తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నుంచి ఆమోదం పొందింది. రుణ భారంతో ఉన్న మీనాక్షి ఎనర్జీని విక్రయించడానికి పిలిచిన టెండర్లలో విజయవంతమైన బిడ్డర్‌గా వేదాంతను ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో మీనాక్షి ఎనర్జీకి 1,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఉంది. ఈ పవర్ ప్లాంట్‌ను స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిర్వహించాలని వేదాంత యోచిస్తోంది. అలాగే వినియోగదారులతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. కొనుగోలు ప్రక్రియలో భాగంగా రుణదాతలకు ముందస్తుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది. -
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు.. చందాదారుల చాటున పిటిషన్లు!
సాక్షి, అమరావతి: భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొన్ని చిట్ గ్రూపులను మూసివేసిన నేపథ్యంలో యాజమాన్యం తన చందాదారులను రంగంలోకి దించింది. చిట్ గ్రూపుల మూసివేతను సవాల్ చేస్తూ వారి ద్వారా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేయించింది. పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కూడా వేర్వేరు. పిటిషన్లు వేర్వేరు అయినప్పటికీ అందులో పేర్కొన్న వివరాలన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. పేరా నంబర్లు సైతం ఒకటే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా పిటిషనర్ల తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన మీనాక్షి అరోరాను రంగంలోకి దించడం గమనార్హం. ఆమె ఒక్కో కేసుకు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (సుప్రీంకోర్టు వెలుపల వాదించే కేసుల్లో) తీసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా తెలిసింది. అంత పెద్ద మొత్తం తీసుకునే సీనియర్ న్యాయవాదిని నియమించుకునే సామర్థ్యం సాధారణ చందాదారులైన పిటిషనర్లకు ఉంటుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. చిట్ గ్రూపు చందాదారుల తరఫున బుధవారం వాదనలు వినిపించిన మీనాక్షి అరోరా పిటిషనర్ల తరఫున కంటే మార్గదర్శి గురించే ఎక్కువగా వాదించడం విశేషం. మార్గదర్శి చరిత్ర, టర్నోవర్, చందాదారుల వివరాలను నివేదించారు. ఇప్పటివరకు మార్గదర్శిపై చందాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ నిరంతరాయంగా మార్గదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు. సీఐడీ కేసులపై మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా పొందిందని తెలిపారు. చందా తాలుకూ చెక్కు మొత్తాన్ని 7 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా మార్గదర్శి యాజమాన్యం 30 రోజుల తరువాత చెల్లించిందని, ఇంత చిన్న కారణంతో చిట్ గ్రూపును మూసివేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు, వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా నేరుగా చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య జోక్యం చేసుకుంటూ చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున నేరుగా హైకోర్టును ఆశ్రయించామని మీనాక్షి అరోరా పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం ఉన్నా నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. చిట్ గ్రూపుల మూసివేతకు బదులు అధికారులు జరిమానా విధించి వదిలేసి ఉండాల్సిందన్నారు. మీనాక్షి అరోరా వాదనలను ముగించడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
మోదీని నిలదీసినందుకే రాహుల్‌పై కక్ష
సాక్షి, హైదరాబాద్: జాతి సంపదను అదానీ వంటి పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న ప్రధాని మోదీని నిలదీసినందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీపై కక్షగట్టి ఎంపీ పదవి నుంచి తప్పించారని మాజీ ఎంపీ, రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ ధ్వజమెత్తారు. దేశ సంపద అవిరైపోతుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని రాహుల్ డిమాండ్ చేయడం మోదీకి నచ్చలేదని, అందుకే పార్లమెంటుకు రాకుండా చేశారని విమర్శించారు. రాహుల్ గాందీపై అనర్హత వేటును నిరసిస్తూ రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గాం«దీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ప్రజలపక్షాన పోరాడుతున్న వ్యక్తిని కేంద్రం వేధిస్తోందని... ఈ నేపథ్యంలో ప్రజలు రాహుల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ విషయంలో మోదీ, అమిత్‌షాలు చేస్తున్న రాజకీయ కుట్రలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటం చేస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజలు వ్యతిరేకించాలన్నారు. నటరాజన్ పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తూ పోస్టుకార్డులను పోస్టు చేశారు. దీక్షా కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ సిద్దేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో పీసీసీ మాజీ చీఫ్ వి. హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, టీపీసీసీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
Adilabad: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు..
Mukhra Sarpanch Meenakshi Gadge Inspiring Journey: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా అనే చిన్న పల్లెను చూస్తే సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుంది అనిపిస్తుంది. మూడేళ్లలో దీనిని ఇలా తీర్చిదిద్దింది సర్పంచ్ మీనాక్షి గాడ్గె. అందుకే ఆమెకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది.ఎందుకో చదవండి... నూట అరవై కుటుంబాలు 700 జనాభా ఉన్న ఆ చిన్న ఊరు ఎంత ముచ్చటగా ఉంటుందంటే ప్రతి ఊరు ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. మూడేళ్ల క్రితం వరకూ అది అన్నింటిలాగే ఒక మామూలు పల్లె. మూడేళ్లలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. నూతన గ్రామపంచాయతీ ఒకప్పుడు అనుబంధ గ్రామంగా ఉన్న ముఖరా 2019లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న సుభాష్ గాడ్గె తన భార్య మీనాక్షిని సర్పంచ్‌గా పోటీ చేయమని ప్రోత్సహించాడు. అక్షరాస్యత అంతంత మాత్రమే ఉన్న ఆ గ్రామంలో ఇంటర్ వరకూ చదివి అందరితో స్నేహంగా ఉండే మీనాక్షి ఆ పదవికి తగినదేనని ఊరంతా భావించింది. ఏకగ్రీవంగా ఆమెను సర్పంచ్‌గా ఎన్నుకుంది. ఈ నిర్ణయం మీనాక్షిని బాగా కదిలించింది. తన మీద ఇంత విశ్వాసం ఉంచిన గ్రామానికి పూర్తిగా సేవ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. అన్నీ మంచి పనులే మీనాక్షి సర్పంచ్ అయిన వెంటనే చేసిన మొదటి పని ఊళ్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టించడం. దాంతో ఊరు ఒక్కసారిగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా మారిపోయింది. ఆ తర్వాత తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వృ«థానీరు ఆ గుంటలో పోయేలా చూసిందామె. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఊరి బయట పెద్ద వాగు వానొస్తే పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగేది. మీనాక్షి వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలువల వల్ల శుభ్రత ఏర్పడింది. పాత భవనంగా ఉన్న స్కూలును కొత్త భవన నిర్మాణం చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాదు ఇంగ్లిష్ మీడియంలో చెప్పడానికి టీచర్లను నియమించింది. దాంతో 1 నుంచి 5 వరకు ఊళ్లో ప్రతి ఒక్క విద్యార్థి ఈ ప్రభుత్వ బడిలోనే చదువుతున్నాడు. డయల్ 100కు ఒక్క కాల్ లేదు ‘గత మూడేళ్లుగా మా ఊరి నుంచి డయల్ 100కు ఒక్క కాల్ కూడా వెళ్లలేదు’ అంటుంది మీనాక్షి. దానికి కారణం సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడమే. దాని వల్ల సగం గొడవలు లేకుండా పోయాయి. మద్యం తాగితే జరిమానా విధిస్తారు. అంతేకాదు గ్రామమంతా శాకాహారాన్ని అలవాటు చేసుకుంది. ఆరోగ్యం కోసం శాకాహారాన్ని ప్రచారం చేయడం వల్ల ఈ మార్పు వచ్చింది. ఊరిలో చిన్న అంగడి కూడా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తుంది. ఇక ఊరిలో నలభై వేల చెట్లు ఉన్నాయి. హరితహారంలో భాగంగా పదివేల మొక్కలు నాటి వాటిని పూర్తిగా కాపాడుకున్నారు. ఊళ్లోనే ఒక నర్సరీ ఉంది. వీటన్నింటి వల్ల ఊరు చల్లటి నీడలో ఉంటుంది. ఇందువల్లేనేమో కరోనా ఈ ఊరు దరిదాపులకు రాలేదు. మహిళా విజేత ఇన్ని మంచి పనులు చేసింది కనుకనే మీనాక్షిని మార్చి 4న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్–2023’ కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘మహిళా విజేత’ పురస్కారంతో సత్కరించనుంది. ‘నా భర్త, పిల్లలు, ఊరి ప్రజలు... వీరందరి సహకారం వల్లే ఈ పురస్కారం’ అని మీనాక్షి అంది. చెత్తను ఎరువుగా అమ్మి ముఖరాలో తడి చెత్త – పొడి చెత్త విభజనను ప్రతి ఒక్కరూ పాటిస్తారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి రైతులకు అమ్మి పంచాయతీకి లాభం సంపాదించిపెడుతోంది మీనాక్షి. ఎరువు అమ్మకం ద్వారా 6 లక్షలు వస్తే వాటిలో నాలుగు లక్షలు వెచ్చించి ఊళ్లో 6 కె.వి. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారయ్యే కరెంటులో 4 కిలోఓల్టులు పంచాయతీ ఉపయోగించుకున్నా 2కిలో ఓల్ట్లను పవర్ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా లాభం రానుంది. – ఇన్పుట్స్: గొడిసెల కృష్ణకాంత్ గౌడ్, సాక్షి, ఆదిలాబాద్ చదవండి: జంగిల్ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి -
సీఎం జగన్ కలిసిన చెస్ క్రీడాకారిణి కోలగట్ల మీనాక్షి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్, అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం, ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్ ఫండ్ నుంచి రూ.1 కోటి నిధిని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రికార్డులు నెలకొల్పిన మీనాక్షి.. ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. వరల్డ్ నెంబర్ 1 అండర్ 12 గర్ల్స్ చెస్ 2023 (ఫిడే ర్యాంకింగ్స్), వరల్డ్ నెంబర్ 1 అండర్ 11 గర్ల్స్ చెస్ 2022, వరల్డ్ నెంబర్ 2 అండర్ 10 గర్ల్స్ చెస్ డిసెంబర్ 2021, ఉమెన్ ఫిడే మాస్టర్ 2022, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ 2021 టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రితో మీనాక్షి, తల్లిదండ్రులు పంచుకున్నారు. మీనాక్షి ప్రతిభను సీఎం ప్రశంసించారు. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: ఆశా మాలవ్యకు సీఎం జగన్ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం -
Use Me Works: వేస్ట్ నుంచి బెస్ట్
మన చుట్టూ పేరుకు పోతున్న రకరకాల వ్యర్థాల నుంచే కొత్త అర్థాలను వెతకచ్చు. ఆ అర్థాల నుంచి ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తోంది ఢిల్లీ వాసి మీనాక్షి శర్మ. ఫ్యాబ్రిక్ డిజైనింగ్‌లో కోర్సు చేస్తూనే... విపరీతంగా పేరుకుపోతున్న ఫ్యాబ్రిక్ వ్యర్థాల గురించీ ఆలోచించింది. అంతటితో ఆగిపోకుండాఆ వ్యర్థాల నుంచే ఎంతోమందికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. దిల్లీ చుట్టుపక్కల నుంచి నెలకు 200 కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్‌ను సేకరించి, 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మెట్రో నగరాల్లో వాతావరణ పరిస్థితుల గురించి మనలో చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ, రకరకాల కాలుష్యాలని నివారించడం మాత్రం మనవంతు బాధ్యత అనుకోం. ఈ బాధ్యతారాహిత్యం మనకే కాదు మన ముందుతరాలకూ నష్టమే అంటోంది దిల్లీలో అప్స్లైకింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి వర్క్’ని విజయవంతంగా కొనసాగిస్తున్న మీనాక్షి శర్మ. కుతుబ్ మినార్ దగ్గర 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన క్రియేటివ్ స్టూడియోలో 30 మంది మహిళలు కుట్టుపని చేస్తూ కనిపిస్తారు. చుట్టుపక్కల ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వేస్ట్ క్లాత్స్ ఉన్న సంచులు నిండుగా కనిపిస్తుంటాయి. వాటిని చూపిస్తూ 34 ఏళ్ల మీనాక్షి శర్మ తన స్వీయానుభవాలను వివరిస్తుంటుంది. ‘వనరులను గౌరవించడం ఎలాగో మా అమ్మానాన్నలను చూస్తూ పెరిగాను. పాత వస్తువులను తిరిగి మరో వాడుకోదగిన వస్తువుగా ఎలా మార్చేవారో వారిని చూసే నేర్చుకున్నాను. చదువుకోవడానికి జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చిన నేను డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నాను. ఆ సమయంలో ఫ్యాషన్ పరిశ్రమలో టన్నులకొద్దీ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు మిగిలిపోతున్నాయని తెలుసుకున్నాను. ‘ఆ వేస్టేజ్‌ని తిరిగి ఉపయోగంలోకి తేలేమా..?’ అని ఆలోచించాను. ► పేద మహిళలకు ఉపాధి కాలేజీ పూర్తయ్యాక కెరియర్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైనది అని ఆలోచించి, వ్యర్థాలవైపుగా కదిలాను. ఇళ్లలో పనులు చేసేవారూ, చిన్న చిన్న కూలి పనులకు వెళ్లే మహిళలను కలిశాను. వారికి కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి, డెకార్ ఐటమ్స్ చేయడం మొదలుపెట్టాను. క్లాత్ బ్యాగులు, ఇతర యాక్సెసరీస్, గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ తయారవుతాయి. ముఖ్యంగా పుట్టినరోజు, పండగ రోజుల్లో ఇంటి అలంకరణలో ఉపయోగించే ఐటమ్స్‌ని మహిళలు శ్రద్ధగా తయారు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ని ఈ క్లాత్ ఐటమ్స్ రీ ప్లేస్ చేస్తాయి. వీటివల్ల ఇక్కడి మహిళలకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంద’ని వివరిస్తుంది మీనాక్షి శర్మ. ► ఫ్యాక్టరీ టు వార్డ్రోబ్ వీరు తయారు చేసే వస్తువులలో ఫ్యాషన్ ఉపకరణాలు, అందమైన పూలతీగలు, కుషన్ కవర్లు, క్విల్ట్‌లు, బ్యాగులు, రగ్గులు.. వంటివి ఉంటాయి. ‘వ్యర్థాలను సేకరించడం పెద్ద సవాల్’ అంటారు మీనాక్షి. ‘ఇళ్లు, ఫ్యాక్టరీలు, బొటిక్స్ నుంచి స్క్రాప్ అంతా డంప్ చేసే ప్రదేశాలకు చేరుకుంటుంది. మేం ఆ డంపింగ్ నుంచి ఈ వ్యర్థాలను సేకరిస్తాం. కొన్నిసార్లు ప్రజలే తమ పాత దుస్తులను మా స్టూడియోకి కొరియర్లో పంపుతారు. వాటిని బాగు చేసి, అప్‌సైక్లింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని చెప్పే మీనాక్షి పదేళ్లుగా ఈ స్టూడియోని నిరంతరాయంగా నడుపుతోంది. తన ‘యూజ్ మి’ స్టూడియో నుంచి వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది ఈ పర్యావరణ ప్రేమిక. ముఖ్యంగా పిల్లలకు వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తే ‘వృ«థా అంటూ ఏదీ ఉండదని’ గ్రహించి వారు జీవితమంతా ఆ విధానాలనే అవలంబిస్తారని తన వర్క్‌షాప్స్, ఆన్లైన్ క్లాసుల ద్వారా మరీ మరీ చెబుతుంది. మీనాక్షి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వెంచర్‌కి అమెరికా, లండన్ తదితర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. ఆలోచనతోపాటు ఆచరణలో పెట్టిన పని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందో తన సృజనాత్మక విధానాల ద్వారా చూపుతుంది మీనాక్షిశర్మ. -
స్ఫూర్తి..:వెటకారం చేసిన నోళ్లే... వేనోళ్ల పొగిడాయి!
‘క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్’ అని పిలుచుకునే సిమ్లా(హిమాచల్‌ప్రదేశ్)లో డ్రైవింగ్ అనేది అంత సులభమేమీ కాదు. అలాంటి చోట ‘సూపర్ డ్రైవర్’గా ప్రశంసలు అందుకుంటోంది మీనాక్షి నేగి. కిన్నార్ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షికి ‘డ్రైవింగ్’ను వృత్తిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రిలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది కానీ కుదరలేదు. తమ ఇద్దరు పిల్లలను బైక్ మీద స్కూలుకు తీసుకెళుతుండేది మీనాక్షి. అప్పుడప్పుడూ ఇరుగింటి, పొరుగింటి వారు కూడా తమ పిల్లల్ని బైక్‌పై బడికి తీసుకెళ్లడానికి మీనాక్షి సహాయం తీసుకునేవారు. ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకునేవారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే, డ్రైవింగ్‌నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు? అనుకుంది మీనాక్షి. తన ఆలోచనకు ఎవరూ‘యస్’ చెప్పలేదు. ఇక వెటకారాలు సరేసరి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ట్యాక్సీ (కార్) కొనుగోలు చేసింది. వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి. భర్త, అత్తామామలను ఒప్పించడం చాలా కష్టం అయింది. ‘ఏనుగును మేపడం ఎంతో ఇది అంతే’ అన్నారు. సరిగ్గా అదే సమయంలో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. బండి తెల్లముఖం వేసింది. వాయిదాలు కట్టడం మీనాక్షికి కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెలో ధైర్యం సడలలేదు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా!’ అనుకుంది. అదే నిజమైంది. లాక్డౌన్ ఎత్తేశారు. మెల్లగా బండి వేగం పుంజుకుంది. ‘డ్రైవింగ్ వృత్తిలో మగవాళ్లు మాత్రమే ఉంటారు... అని చాలామంది నమ్మే సమాజంలో ఉన్నాం. మహిళలు నడిపే వాహనాల్లో ప్రయాణించడానికి తటపటాయిస్తుంటారు. అలాంటి వారికి నా డ్రైవింగ్‌తోనే సమాధానం చెప్పాను. వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది, భర్త,అత్తమామలు కూడా మెచ్చుకోవడం మరో ఆనందం’ అని చెబుతుంది నలభై రెండు సంవత్సరాల మీనాక్షి. హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ట్యాక్సీ నడుపుతుంది మీనాక్షి. అయితే, ప్రయాణికుల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇస్తుంది. మీనాక్షి ఇప్పుడు పేదమహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పిస్తుంది. ‘ఉపాధి అనేది తరువాత విషయం. డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్ విజయాలకు ఇది పునాది’ అంటుంది మీనాక్షి. మీనాక్షి నేగి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? సిమ్లాలో ఫస్ట్ ఉమెన్ ట్యాక్సీడ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేయాలనేది ఆమె కల. యూనియన్ సరే, అంతమంది మహిళా ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కడి నుంచి వస్తారు? అనే సందేహం ఉంటే, మీనాక్షి నేగి నుంచి స్ఫూర్తి పొందిన మహిళలను పలకరించండి చాలు. నేగి కల సాకారం కావడానికి ఎంతోకాలం పట్టదని తెలుసుకోవడానికి! -
‘ఖిలాడి’ హీరోయిన్ల అందాలు చూడతరమా
-
ఇచ్చట టీజర్ వచ్చింది
సుశాంత్, మీనాక్షి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఎస్. దర్శన్ దర్శకత్వంలో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ఈ టీజర్లో నో పార్కింగ్ అని బోర్డ్ ఉన్నచోట తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను సుశాంత్ పార్క్ చేస్తే, కాలనీవాసులు దాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత కథ ఏంటనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
రెండు గోడల మధ్య చిక్కుకున్న చిన్నారి
ఒంగోలు: ఆరేళ్లపాప రెండు గోడల మధ్య ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటలకుపైగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాప సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈ సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీ మూడో లైనులో గురువారం జరిగింది. లక్కె ముద్దుల కృష్ణ, ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నారు. రెండిళ్ల మధ్య సన్నని ఖాళీ వదులుకున్నారు. కనీసం అడుగు గ్యాప్ కూడా లేదు. కృష్ణ ఆరేళ్ల కుమార్తె మీనాక్షి ఆడుకుంటూ ఆ గ్యాప్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. కదల లేని స్థితిలో పాప కేకలు విని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది పాపకు తాడు అందించి బయటకు తీసుకొద్దామని చేసిన యత్నం విఫలమైంది. మరికొంత మంది కర్ర సాయంతో బయటకు తీసేందుకు యత్నించగా అది కూడా విఫలమైంది. పాప తండ్రి అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో పాటు ఒంగోలు ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు, బాలికను రక్షించేందుకు పరిస్థితిని అంచనా వేసి గోడలను పగలగొట్టక తప్పదని నిర్ణయించుకున్నారు. పాపకు దెబ్బ తగలకుండా గోడకు తమ వద్ద ఉన్న అధునాతన యంత్రాలతో రంధ్రం చేసి గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు. అనంతరం పాపను సురక్షితంగా బయటకు తీశారు. అప్పటి వరకూ జరుగుతున్న తతంగాన్ని ఉగ్గబట్టి చూస్తున్న జనంతో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
తారల తళుకులు
-
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ ప్రారంభం
-
ఆరోగ్యగీతం
‘నాదమే నిధి... తాళం పెన్నిధి... రాగం సన్నిధి... గాత్రం దివ్యౌషధం. మ్యూజిక్ థెరపీకి మూలం సంగీతమే... మాధ్యమమూ సంగీతమే. వెస్టర్న్ సొసైటీ ఈ వైద్యాన్ని శాస్త్రబద్ధం చేసుకుంది. గాత్రాన్ని... రాగాన్ని పేటెంట్‌తో చట్టబద్ధమూ చేసుకుంది. యూనివర్సిటీల్లో పాఠాలను బోధిస్తోంది. మరి... మన నాదాన్ని మనం కాపాడుకోకపోతే ఎలా? మన సంగీత నిధి మీద పేటెంట్ భరతమాతకే ఉండాలి. ఈ శేష జీవితం మన శాస్త్రీయ సంగీత వైద్యం కోసమే’ అంటున్నారు కర్ణాటకకు చెందిన డాక్టర్ మీనాక్షీ రవి. ‘నాదమయం’ అనే అక్షరాల వెంటే పాదముద్రలున్నాయి. ఆ పాదాలు ఆ సంగీత నిలయంలోకి దారి తీస్తున్నాయి. లోపల అరవై దాటిన ఓ సంగీత సరస్వతి కర్ణాటక సంగీతం గానం చేస్తున్నారు. ఆమెతోపాటు ఓ పదేళ్ల పిల్లవాడు సాధన చేస్తున్నాడు. ‘తల పై కెత్తి నా చేతిని చూడు నాన్నా’ అంటూ ఆగారామె. ఆ పిల్లవాడు తదేకంగా గాల్లోకి లేచిన ఆ చేతినే చూస్తూ ఆమె పలికినట్లు పలుకుతున్నాడు. ‘తాళం మర్చిపోతున్నావు’ అని ఆమె గుర్తు చేయగానే తాళం వేస్తూ పాట అందుకున్నాడా పిల్లాడు. ఆ దృశ్యాన్ని ఫొటో తీయబోతే ఆమె రాగం తీస్తూనే మరో చేత్తో ఫొటో తీయవద్దన్నట్టు వారించారు. పక్కనే ఉన్న పిల్లవాడి తల్లి కూడా ఫొటో వద్దని సంజ్ఞ చేసింది. కొన్ని క్షణాలకు గానం ఆపి... ‘‘పిల్లవాడిని ఫొటో తీయకండి’’ అన్నారామె. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆమె ‘‘ఈ అబ్బాయి స్పెషల్ కిడ్. మ్యూజిక్ థెరపీతో నాలుగైదేళ్లలో నార్మల్ కిడ్ అయిపోతాడు. ఇప్పుడు మీరు పేపర్లో ఫొటో వేస్తే రేపటి నుంచే స్కూల్లో మిగిలిన పిల్లలు అతడిని ఏడిపిస్తారు. ఇప్పుడు ఫొటో చూసి గుర్తు పెట్టుకున్న వాళ్లు ఈ పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ‘ఆ పిల్లాడే కదూ, ఆ అమ్మాయే కదూ’ అని ఈ పిల్లల్ని గుర్తు చేసుకుంటారు. వీళ్లు జీవితం మొత్తం ఒకప్పుడు వీళ్లు ‘స్పెషల్ కిడ్’ అనే ముద్రను మోయాల్సి వస్తుంది. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అన్నారామె. ఆమె భావం అర్థం కాగానే పిల్లల పట్ల ఆమెకున్న బాధ్యతకు ఎనలేని గౌరవం కలిగింది. సంగీతంతో పరిపూర్ణత్వం ఆ సంగీత సరస్వతి పేరు విదుషి మీనాక్షీరవి. మీనాక్షి ఆమె పేరు, విదుషి సంగీతంలో ఆమె సాధించిన గౌరవం. పుట్టింది కర్ణాటక రాష్ట్రం, మాండ్యాలో. తాత శంకర శాస్త్రి సంగీతం మాస్టారు. మీనాక్షి తొలి గురువు కూడా ఆయనే. ఆమె డబుల్ ఎం.ఎ. (సోషల్ వర్క్, కర్నాటిక్ మ్యూజిక్) చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి మహిళా శిశు సంక్షేమ శాఖలో తహసీల్దార్ కేడర్ ఉద్యోగంలో చేరారు. కరడుగట్టిన అవినీతి మధ్య ఇమడలేక ఏడాదికే ఆ ఉద్యోగాన్ని వదిలేశారామె. అప్పటి నుంచి సంగీతాన్నే జీవితంగా మలుచుకున్నారు. సంగీతం కోసమే జీవించడం మొదలుపెట్టారు. మనిషికి పరిపూర్ణత్వం సిద్ధింపచేసే గొప్ప లక్షణం సంగీతంలో ఉందన్నారామె. నాదవైద్యం ‘‘శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం, సామాజిక పరివర్తన, ఆధ్యాత్మిక మార్గంలో జీవించే పరిణతి... ఈ నాలుగు కోణాల్లో మనిషిని పరిపూర్ణం చేసేది సంగీతమే. అందుకే మనిషికి ఎదురయ్యే శారీరక, మానసిక, సామాజిక సమస్యల నుంచి విముక్తి కోసం సంగీతాన్ని ఒక మాధ్యమంగా చేసుకున్నాను. నేను ప్రయోగాత్మకంగా చేసిన మ్యూజిక్ థెరపీ మంచి ఫలితాలనిస్తోంది. దీని మీద నా రీసెర్చ్‌ని కొనసాగిస్తున్నాను. ఇందుకోసం నాలాగ ఆలోచించే మరికొందరం కలిసి ‘ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)’ను స్థాపించాం. నేను జనరల్ సెక్రటరీని. ఈ వేదిక నుంచి ప్రతి నాలుగు నెలలకోసారి ఒక వర్క్‌షాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. బెంగళూరులో స్థాపించిన ‘మీరా సెంటర్ ఫర్ మ్యూజిక్ థెరపీ, హైదరాబాద్‌లోని నాద సెంటర్ ఫర్ మ్యూజిక్ థెరపీలు ఐఎమ్టీఏతో కలిసి పని చేస్తున్నాయి. మ్యూజిక్ కాన్సర్ట్లలో పాడటం వల్ల స్పెషల్ కిడ్స్‌కి స్టేజ్ ఫియర్ పోతుంది. స్పెషల్ కిడ్స్‌తో కలిసి కాన్సర్ట్ చేయడంతో నార్మల్ కిడ్స్‌లో పరస్పరం సహకరించుకోవాలనే తత్వం అలవడుతుంది. ఇలా పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కోర్సు డిజైన్ చేశాను. ‘నాద మంథన’ పుస్తకంలో సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు సంగీతం ఎలా ప్రభావం చూపుతుందో రాశాను. ఇప్పుడు ‘కర్నాటిక్ మ్యూజిక్ థెరాపుటిక్ పర్స్పెక్టివ్’ అని మరో పుస్తకం రాస్తున్నాను. వీటిలో మ్యూజిక్ థెరపీ గురించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ప్లేటో, అరిస్టాటిల్ కూడా సంగీతానికి ఆరోగ్యాన్ని చేకూర్చే లక్షణం ఉందని రాశారు. ప్రపంచ యుద్ధాల సమయంలో సైనికుల పునరావాస కేంద్రాల్లో సంగీతంతో సాంత్వన కలిగించిన ఉదాహరణలున్నాయి. అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ 1944లో మ్యూజిక్ థెరపీలో గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రవేశపెట్టింది, 1950లో మ్యూజిక్ థెరపీ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించారు. వందల ఏళ్ల వెస్టర్న్ మ్యూజిక్‌ని వాళ్లు అంతగా శాస్త్ర బద్ధం చేసుకుంటున్నారు. మనదేశంలో వేల సంవత్సరాల నుంచి అపారమైన సంగీత నిధి ఉంది. మనం పట్టించుకోకపోతే మన సంగీతాన్ని కూడా పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు చేసి వాళ్లు పేటెంట్ తీసుకుంటారు. ఇప్పటికే భారతీయ సంప్రదాయ సంపద తరలిపోతోంది కూడా. అందుకే మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధంగా నిరూపించడానికి పరిశోధన చేస్తున్నాను. మ్యూజిక్ థెరపీతో స్వస్థత పొందిన ప్రతి స్టూడెంట్ డెవలప్‌మెంట్‌నీ నోట్స్ రాస్తున్నాను. మందులు వాడాల్సిన అవసరం లేకుండా మ్యూజిక్ థెరపీతో జీవిస్తున్న కేస్ స్టడీలను రికార్డు చేస్తున్నాను. శాస్త్రీయ పరీక్షకు నిలిచేటట్లు ప్రతిదీ గ్రంథస్థం చేస్తున్నాను. మన సంపదకు పేటెంట్ మనదేశంలోనే ఉండాలనేది నా ఆశయం’’ అన్నారు మీనాక్షి. దిగులు కరిగింది ప్రభుత్వ ఉద్యోగం మానేసిన తర్వాత మీనాక్షి ఫ్యామిలీ కౌన్సెలర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. కర్ణాటకలో తొలి ఫ్యామిలీ కౌన్సెలర్ ఆమె. వైవాహిక జీవితంలో మహిళలు ఎదుర్కొనే దైన్య స్థితిని వర్ణించడానికి మాటలు చాలవు. వాటిని దిగమింగి బతుకీడుస్తూ క్రమంగా మానసికంగా ఒడిదొడుకులకు గురవుతుంటారు. అలాంటి వాళ్లకు మాటలతో ఓదార్చి, ధైర్యం చెప్పడంతో సరిపోవడం లేదని గ్రహించారు మీనాక్షి. మ్యూజిక్ థెరపీతో ఓ ప్రయత్నం చేశారు. అది విజయవంతమైంది. పురంధర దాసు కీర్తనల్లో కుటుంబ బంధాల కీర్తనలు మహిళల్లో గూడుకట్టుకుని ఉన్న దిగులును కన్నీటి రూపంలో కరిగించేశాయి. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా మూడు వేల మంది మ్యూజిక్ థెరపీతో మనసు తేలిక పరుచుకుని వైవాహిక బంధాలను చక్కబరుచుకున్నారు. మ్యూజిక్ థెరపీ కోసం కౌన్సెలింగ్ కీర్తనలతో ఎనిమిది సీడీలు విడుదల చేశారామె. ఇప్పుడు స్పెషల్ కిడ్స్‌కి మ్యూజిక్ థెరపీ ఇస్తూ ఈ అంశం మీద విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. నేను గానం.. ఆయన తాళం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి నా రోల్‌మోడల్. అయితే భగవంతుడు నన్ను కీర్తనల ఆలాపనకు పరిమితం చేయకుండా మ్యూజిక్ థెరపిస్టుగా మార్చాడు. ఈ స్పెషల్ వైద్యం నాతో ముగిసిపోకుండా తర్వాత తరానికి కొనసాగడం కోసం శిక్షకులను తయారు చేయడం నా బాధ్యత. నా భర్త ఎన్.జి. రవి మృదంగ విద్వాంసులు. స్పెషల్ కిడ్స్‌కి రిథమ్ థెరపీ ఇస్తారాయన. మా పిల్లలిద్దరూ జీవితాల్లో సెటిలయ్యారు. మా శేష జీవితం సంగీతవైద్య పరిశోధనకే అంకితం. – విదుషి డా. మీనాక్షీరవి, ఫ్యామిలీ కౌన్సెలర్, మ్యూజిక్ థెరపిస్ట్ మనసు బాగోలేకపోతే సంగీతం వింటాం. మనసు కోలుకుంటుంది. తనువు బాగుండకపోయినా సంగీతం ఔషధంలా పనిచేస్తుంది... అంటున్నారు విదుషి డాక్టర్ మీనాక్షీరవి ఈ నెల 24వ తేదీ, ఆదివారం హైదరాబాద్, హైటెక్ సిటీ ఫీనిక్స్ఎరీనాలో నాదమయ సంగీత సభ, త్యాగరాజ, పురందర దాస ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. అందులో స్పెషల్ కిడ్స్ సంగీతాలాపన చేస్తారు. – వాకా మంజులారెడ్డి -
అమెరికాలో భారతీయ జంట మృతి
న్యూయార్క్: అమెరికాలోని ఓ జాతీయ పార్కులో 800 అడుగుల ఎత్తు ఉన్న ఒక కొండ అంచు నుంచి కిందకు పడి ఓ భారతీయ జంట దుర్మరణంపాలైంది. మృతులను విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షి మూర్తి (30)గా గుర్తించారు. 2014లో పెళ్లిచేసుకున్న వీరు కేరళలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోసెమిటీ వ్యాలీ జాతీయపార్కులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ పార్కులో నిట్టనిలువుగా 800 అడుగుల ఎత్తు ఉండే టఫ్ట్ పాయింట్ అనే కొండ అంచు ప్రాంతం నుంచి విశ్వనాథ్, మీనాక్షిలు కింద పడ్డారు.గత బుధవారం ఉద్యానవన సందర్శకులు మృతదేహాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా గురువారం తీవ్రంగా శ్రమించి ప్రమాద స్థలి నుంచి శవాలను వెలికితీశారు. న్యూయార్క్‌లో నివసించే ఈ జంట ఇటీవలే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌జోసే నగరానికి మారారనీ, అక్కడి సిస్కో కంపెనీలో విశ్వనాథ్ ఉద్యోగం చేసేవారని అధికారులు గుర్తించారు. ప్రపంచమంతా తిరుగుతూ తమ అనుభవాలను ‘హాలిడేస్ అండ్ హ్యాప్పీలీ ఎవర్ ఆఫ్టర్స్’ అనే బ్లాగ్‌లో రాసేవారు. పార్కు అధికార ప్రతినిధి జేమీ రిచర్డ్స్ మాట్లాడుతూ ‘వారు కింద పడటానికి కారణమేంటో మాకు ఇంకా తెలియదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదొక తీవ్ర విషాద ఘటన’ అని అన్నారు. ఇదే పార్కులో ఈ మేలో ఆశిష్ పెనుగొండ (29) అనే భారతీయుడు హాప్ డోమ్ అనే ప్రాంతానికి ఎక్కుతుండగా కిందపడి మరణించాడు. ఈ ఏడాదిలోనే పది మంది మృతి యోసెమిటీ వ్యాలీ అడవి, కొండలతో నిండిన, అందమైన జాతీయపార్కు. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ దారులు ప్రమాదకరంగా ఉంటాయి. ‘అడుగులు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఇక్కడ కచ్చితంగా జారిపడతారు’ అని రిచర్డ్స్ తెలిపారు. ఈ ఏడాదిలోనే యోసెమిటీ వ్యాలీ పార్కులో ప్రమాదవశాత్తూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన పదిమందిలో ఆరుగురు ఇక్కడి కొండలు ఎక్కుతున్నప్పుడే ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయారు. విశ్వనాథ్, మీనాక్షిలు పడిపోయిన ‘టఫ్ట్ పాయింట్’ అనే కొండ అంచు నుంచి చూస్తే యోసెమిటీ పార్కు మొత్తం, యోసెమిటీ జలపాతం, ఎల్ క్యాపిటన్ కొండ బాగా కనిపిస్తాయి. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు ఈ కొండ అంచుకు వస్తారు. -
మీనాక్షీ
అమ్మవారి మీద ముత్తు స్వామి దీక్షితుల వారు రచించిన ఎన్నో కృతులలో ‘మీనాక్షీ! మే ముదం దేవా!’ అన్న కృతి చాలా ప్రసిద్ధం. అందులో ఆమెను దీక్షితుల వారు ‘మీన లోచనీ! పాశమోచనీ!’ అని కూడా సంబోధిస్తారు. జగజ్జననిని ఆరాధించే భక్తులకు చేపల ఆకారంతో అత్యంత సుందరంగా ఉండే ఆ కన్నుల నుంచి ప్రసరించే కటాక్ష వీక్షణం– కడగంటి చూపు– కావాలి. ఫలానా దుఃఖం పోగొట్టమనీ, ఫలానా సుఖం కలిగించమనీ ఆమెను ప్రత్యేకంగా వేడుకోనక్కర్లేదు. ఆమె చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే భావిస్తారు.ఇలా భావించటం వెనుక ఒక ప్రకృతి విచిత్రం ఉన్నది. ప్రకృతిలో ప్రాణులన్నిటికీ తమ సంతానం మీద మమతానురాగాలు ఉండటం స్వాభావికం. కోతులలో పిల్ల కోతులు, తల్లి పొట్టను తామే గట్టిగా కరచుకొని తల్లితో వెళుతుంటాయి. బిడ్డ శ్రద్ధగా ఉంటేనే తల్లి సహకారం లభిస్తుంది. ఇది ‘మర్కట కిశోర న్యాయం’. పిల్లి పిల్లలది మరో దారి. తల్లి పిల్లి పిల్లను అతి జాగ్రత్తగా నోట కరచుకొని తనతో తీసు కువెళ్లి వాటిని సురక్షితంగా ఉంచుతుంది. ఇక్కడ తల్లి ప్రమేయమే ఎక్కువ, పిల్లలేమీ చేయనక్కర్లేదు. ఇది ‘మార్జాల కిశోర న్యాయం’. పక్షులు పిల్లల్ని మోయవు. కేవలం గుడ్లు పెడతాయి. వాటిని అవసరమైనంత మేరకు తమ శరీరాలతో పొదిగి, తమ శరీరం వేడిని వాటికిచ్చి, అవి ఎదిగేందుకు దోహదం చేస్తాయి. పక్షుల పిల్లలకు ఆ మాత్రమే చాలు. తాబే ళ్లది వేరే మార్గం. తల్లి తాబేలు గుడ్లు పెట్టి ఎటో వెళ్లి పోతుంది. ఎటు వెళ్లినా ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుందట. చేపలలో మాతృత్వం మరీ చిత్రం. చేప కూడా గుడ్లు పెడుతుంది. పెట్టిన తరువాత వాటికి దూరంగా జరుగుతుంది. దూరాన్నుంచి వెనక్కు తిరిగి తన చూపులు మాత్రం ఆ గుడ్ల మీద ప్రసరింపజేస్తుంది. ఆ తల్లి చేప చల్లని చూపు శక్తి వల్ల, గుడ్లు పొదిగి పిల్లలై తమ జీవితాలు తాము జీవిస్తాయి. అలాగే భగవతికీ భక్తులకూ ఉండే సంబంధం కూడా తల్లీ బిడ్డలవంటి సంబంధమే. అమ్మవారిని ‘మీనాక్షి’ అనటంలో ఉద్దేశం ఆమె కళ్లు మీనాల ఆకారంలో అందంగా ఉంటాయని వర్ణించటమే కాదు. తల్లి చేప తన చల్లని చూపుల మంత్రంతో తన బిడ్డలకు వృద్ధిని కలిగించినట్టు, జగ జ్జనని కూడా తన భక్తులకు చల్లని చూపుల మంత్రం ద్వారా సర్వైశ్వర్యాలని ప్రసాదించగలదన్న సూచనను కూడా గమనించమంటారు పెద్దలు. – ఎం. మారుతి శాస్త్రి -
స్క్రీన్ టెస్ట్ శ్రీదేవి స్పెషల్ క్విజ్
► ‘సిరిమల్లె పువ్వా...’ అంటూ శ్రీదేవి సందడి చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమా దర్శకుడెవరు? ఎ) బాలచందర్ బి) కె. రాఘవేంద్రరావు సి) కె.విశ్వనాథ్ డి) భారతీరాజా ► మా ‘బంగారక్క’ సినిమాలో శ్రీదేవి సరసన నటించిన హీరో ఎవరు? ఎ) చంద్రమోహన్ బి) మురళీమోహన్ సి) మోహన్‌బాబు డి) శోభన్‌బాబు ► శ్రీదేవి కనిపించబోతున్న చివరి సినిమా? ఎ) దబాంగ్ 3 బి) థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ సి) గోల్డ్ డి) జీరో ► బాలీవుడ్లో ఏ హీరోతో శ్రీదేవి ఎక్కువ సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) మిథున్ చక్రవర్తి బి) జితేంద్ర సి) రిషీ కపూర్ డి) అమితాబ్ బచ్చన్ ► శ్రీదేవి ఒకప్పటి స్టార్ కమెడియన్ సరసన హీరోయిన్గా నటించారు. ఎవరా హాస్యనటుడు? ఎ) రేలంగి బి) రాజబాబు సి) రమణారెడ్డి డి) పద్మనాభం ► ‘మామ్’ శ్రీదేవికి 300వ చిత్రం. ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరు? ఎ) విశాల్ శేఖర్ బి) ఏ.ఆర్. రెహమాన్ సి) ఇళయరాజా డి) దేవిశ్రీ ప్రసాద్ ► శ్రీదేవి ముద్దు పేరేంటో తెలుసా? ఎ) మున్నీ బి) చిన్ని సి) బుజ్జి డి) పప్పీ ► శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’కు నిర్మాత ఎవరు? ఎ) యశ్ రాజ్ బి) బోనీ కపూర్ సి) యశ్ జోహార్ డి) సాజిద్ నడియాడ్వాలా ► శ్రీదేవితో 24 సినిమాలు చేశాను. తను ఒప్పుకుంటే 25వ సినిమా కూడా తీస్తానని ఇటీవల ప్రకటించిన టాలీవుడ్ దర్శకుడెవరు? ఎ) కె.బాపయ్య బి) కె.రాఘవేంద్రరావు సి) కె.యస్.ఆర్. దాస్ డి) కె.చంద్రశేఖర్ రెడ్డి ► ‘2002 వరకు చూడలేదే ఇంత సరుకు..’ అంటూ చిన్న యన్టీఆర్, ఆర్తీ అగర్వాల్ స్టెప్పులేసిన సాంగ్ పెద్ద యన్టీఆర్, శ్రీదేవి నటించిన ఓ సూపర్‌హిట్ సాంగ్‌కు రీమిక్స్. అది ఏ పాటో కనుక్కోండి? ఎ) ఆకుచాటు పిందె తడిచే బి) ఇది ఒకటో నంబర్ బస్సు సి) జాబిలితో చెప్పనా డి) తెల్లా తెల్లని చీరలోని చందమామ ► ‘బాబు’ అనే తమిళ సినిమాలో ఈ నలుగురి నటుల్లో ఒక నటుడికి శ్రీదేవి కూతురిగా నటించింది. ఆ నటుడెవరు? ఎ) రజనీకాంత్ బి) చారుహాసన్ సి) కమల్‌హాసన్ డి) శివాజీగణేశన్ ► తెలుగులో శ్రీదేవితో 31 సినిమాల్లో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) యన్టీఆర్ డి) అక్కినేని నాగేశ్వరరావు ► బాలీవుడ్లో శ్రీదేవి ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 5 బి) 4 సి) 11 డి) 7 ► తెలుగు ‘పదహారేళ్ల వయసు’ తమిళ మాతృక ‘పదినారు వయదినిలే’కి శ్రీదేవి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? (ఇందులో నటించిన రజనీకాంత్ పారితోషికం కంటే ఆమెకు 6 వేల రూపాయలు ఎక్కువ) ఎ) 25,000 బి) 15,000 సి) 12,000 డి) 9,000 ► శ్రీదేవి బాల నటిగా తెరంగేట్రం చేసినప్పుడు ఆమె వయసెంత? ఎ) 3 బి) 2 సి) 6 డి) 4 ► సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేలోపు ఫస్ట్ ఇన్నింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిన మధ్యలో శ్రీదేవి కనిపించిన టీవీ షో పేరేంటి? ఎ) బిగ్ బాస్ బి) కౌన్ బనేగా కరోడ్‌పతి సి) మాలినీ అయ్యర్ డి) దస్ కా దమ్ ► శ్రీదేవి నటిగానే మనకు తెలుసు కానీ మనకు తెలియని ఒక అద్భుతమైన టాలెంట్ ఆమెలో దాగి ఉంది. అదేంటో మీకు తెలుసా? ఎ) సింగింగ్ బి) రైటింగ్ సి) పెయింటింగ్ డి) టెన్నిస్ ప్లేయర్ ► శ్రీదేవి హిందీ పరిశ్రమకి వెళ్లిన కొత్తలో ఆమె చేసిన పాత్రకు ఫేమస్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పారు. ఎవరా హీరోయిన్? ఎ) హేమ మాలినీ బి) రేఖ సి) జయాబచ్చన్ డి) మీనాక్షి శేషాద్రి ► ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది? ఎ) తునైవన్ బి) బడిపంతులు సి) నా తమ్ముడు డి) బాబు ► శ్రీదేవి నటించిన సూపర్‌హిట్ సినిమాలోని స్టిల్ ఇది. ఈ సినిమా పేరేంటి? ఎ) ఆఖరి పోరాటం బి) క్షణ క్షణం సి) గోవిందా గోవిందా డి) జగదేక వీరుడు – అతిలోక సుందరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) డి 4) ఎ 5) బి 6) బి 7) డి 8) బి 9) బి 10) ఎ 11) డి 12) ఎ 13) డి14) డి 15) డి 16) సి 17) సి 18) బి 19) బి20) (డి) -
అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ..
ఊహ తెలియని స్థితిలో వివాహం... ఆపై పిల్లలు.. జీవితంలో ఆటుపోట్లు తట్టుకోలేక వదిలేసిన భర్త.. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండకుండానే కష్టాలు.. కన్నీళ్లే జీవితం. కన్న బిడ్డలతో కలిసి రైలుకిందపడి ప్రాణాలు తీసుకోవాలని.. అదే రైలు ఎక్కి పరాయి రాష్ట్రంలో మూడేళ్ల అజ్ఞాతం. తర్వాత అత్తింటికి చేరుకుంటే అయినవాళ్ల సూటిపోటి మాటలు. తండ్రిలా ఆదరించాల్సిన బావ దారుణ ప్రవర్తన! ఇమడలేక అత్తింటిని వదులుకుని పట్నం చేరుకుంది. ఆత్మస్థైర్యంతో అడుగేసింది. చదువులు నేర్చింది. విధినెదిరించి విజయకేతనం ఎగురవేసింది. అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ఒకసారి బాబుకు ‘పెద్ద అమ్మవారు’ పోసింది. ఒళ్లంతా చీము కారుతోంది. ఇతర ఇళ్లలో దుస్తులు ఉతికి రాత్రి ఇంటికి చేరుకున్న నేను బాబును చూసి తట్టుకోలేకపోయాను. 18 కి.మీ. దూరంలోని అనంతపురం ఆస్పత్రికి బాబును, పాపను ఎత్తుకుని ఒక్కదాన్నే చీకట్లో నడుచుకుంటూ వెళ్లా. నా పరిస్థితి తలుచుకుని బాగా ఏడుపొచ్చింది. పిల్లలకు అన్నం పెట్టేలేక.. కష్టాలు భరిస్తూ బతకడం ఇక సాధ్యం కాదని అనుకున్నా. పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నా.. కానీ బతికి సాధించాలని నిర్ణయం తీసుకున్నా.. జీవితంలో నిలదొక్కుకున్నా.. నా బిడ్డలకు మంచి జీవితం ఇచ్చా. – మీనాక్షి మూడేళ్ల అజ్ఞాతంలో ఆదర్శ జీవితం.. పిల్లలతో కలిసి నేను ఎక్కిన రైలు ఎక్కిడికి పోతోందో కూడా నాకు తెలియదు. అటుఇటు చూసే లోపు ఓ పెద్ద ఊళ్లో రైలు ఆగింది. నేను ప్లాట్‌ఫాంపై దిగాను. చూస్తుంటే అంతా కన్నడలో రాసి ఉంది. అక్కడి వారి మాటలను బట్టి హుబ్లీ అని తెలుసుకున్నాను. నాకు భాష రాదు. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్లోనే ఓ బెంచిపై కూర్చొని ఉండిపోయాను. ఇంతలో ఒకావిడ నా దగ్గరకు వచ్చి వివరాలు అడిగింది. తెలుగులో చెప్పాను. ఆమెకు అర్థమైనట్లు ఉంది. తన పేరు రాధారాణి అని పరిచయం చేసుకుని తనతో పాటు మమ్మల్ని పిలుచుకెళ్లి, తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చారు. మూడు నెలల తర్వాత నేను బెల్గాంలో ఉన్నట్లు తెలుసుకున్నాను. మూడేళ్లలో ఎక్కడా ఎలాంటి పొరబాటు లేకుండా ఆదర్శంగా జీవనం సాగించాను. అప్పటికి భాష నేర్చుకున్నా. ఓ ప్రమాదంలో రాధారాణి చనిపోయారు. దీంతో మళ్లీ ఒంటరిదానయ్యా. ఇక అక్కడ ఉండిబుద్ధి కాలేదు. 2003లో అనంతపురానికి తిరిగి వచ్చాను. 12వ ఏటనే పెళ్లి చేశారు మాది నిరుపేద కుటుంబం. అనంతపురం పాతూరు సమీపంలోని రాణి నగర్లో ఉండేవాళ్లం. అమ్మనాన్న దుస్తులు ఉతికితే వచ్చే సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. 1996లో నేను ఏడో తరగతి చదువుకుంటుండగా (12వ ఏట) మా మేనమామ లక్ష్మీనారాయణతో నాకు పెళ్లి చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలోని అత్తారింటిలో అడుగుపెట్టాను. పెళ్లైనా రెండేళ్లకు పాప పుట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు చెప్పాపెట్టకుండా మా ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని నెలల తరువాత తిరిగొచ్చాడు. 2000 సంవత్సరంలో మాకు బాబు పుట్టాడు. ఆ తర్వాత నా భర్త మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. బతుకుపై చిరు ఆశ జీవితంపై విరక్తితో పిల్లలను తీసుకుని రైలు కిందపడి చనిపోవాలని అనుకున్నాను. ఇద్దరు పిల్లలను తీసుకుని అనంతపురం రైల్వే స్టేషన్‌ని చేరుకున్నాను. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. నా కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చిన్నోడు ఒడిలో నిద్రపోతున్నాడు. పాప బుడిబుడి అడుగులతో ఆడుకుంటోంది. వారి మొహం చూస్తే బాధేసింది. ఇంతలో రైలు కూత దగ్గర కావడంతో చిన్నోడు ఉలిక్కిపడి లేచాడు. వాడి ఏడుపు నన్ను బతుకుపై ఆశలు రగిలింది. ఆత్మహత్య చేసుకునే ఆలోచనను విడిచి ఆగిన రైలు ఎక్కేసాను. ఆదుకున్న ఆర్డీటీ 2009 ఆగస్టులో ఆర్డీటీ సంస్థ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సార్‌ని కలిసి నా పరిస్థితి మొత్తం వివరించాను. డ్రైవర్‌గా ఉద్యోగం కల్పిస్తే పిల్లలను చదివించుకుంటానని ప్రాధేయపడ్డాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. నాకు డ్రైవింగ్ సరిగా రాకపోయినా జాబ్ ఇచ్చారు... నేను సరిగ్గా నడపలేనని చెప్పాను. అందుకు ఆయన... ‘నీలాంటి వాళ్లను ఎంకేరేజ్ చేయాలి. అందుకే అవకాశం ఇచ్చాను... ట్రైనింగ్ అవ్వు’ అంటూ గ్యారేజి డ్యూటీ వేశారు. అక్కడ పనిచేయిస్తూ ఆరు నెలల్లో డ్రైవింగ్ బాగా నేర్పారు. గ్యారేజీలో రెండున్నర ఏళ్లు పనిచేశా. అక్కడ వాహన మరమ్మతులు పూర్తిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏటీఎల్ వాహనానికి డ్రైవర్‌గా పంపారు. మూడేళ్లు పనిచేశాను. అటు తరువాత అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మూడేళ్లు పనిచేశాను. పనిచేస్తూనే టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అక్కడే నా జీవితం మారిపోయింది. హెవీ లైసెన్స్ తీసుకుంటానని మాంఛో సార్‌కి చెప్పాను. టెస్ట్‌లో ఫెయల్ అయితే లైసెన్స్ ఫీజు జీతం నుంచి కట్ చేస్తా, పాస్ అయితే తానే కడతానని అన్నారు. నేను టెస్ట్‌లో పాస్ అయ్యాను. బతుకే కష్టమైంది ఇద్దరు చిన్న పిల్లలు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయాలో... పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాలేదు. కులవృత్తిని నమ్ముకుని దుస్తులు ఉతుకుతూ జీవించాలని అనుకుని ప్రతి రోజూ మదిగుబ్బ నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆత్మకూరుకు వచ్చి అక్కడి నుంచి బస్సులో అనంతపురం చేరుకునేదాన్ని ఐదారు ఇళ్లు ఒప్పుదల చేసుకుని దుస్తులు ఉతికి తిరిగి ఇంటికి వెళ్లిపోయేదాన్ని. అయినవాళ్లూ ఇబ్బంది పెట్టారు మూడేళ్ల తర్వాత అనంతపురానికి వచ్చిన నేను నేరుగా మదిగుబ్బకు పోయాను. నా భర్త చనిపోయినట్లు తెలిసింది. ఆ సమయంలో నా భర్త అన్నవాళ్లూ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. చాలా దారుణంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి ప్రవర్తనతో అక్కడ ఇమడలేక పిల్లలను తీసుకుని అనంతపురానికి చేరుకున్నాను. బాబానగర్‌లో చిన్న గది అద్దెకు తీసుకున్నాను. అక్కడికి దగ్గరలోని గుల్జార్ పేటలో ఐదారిళ్లలో దుస్తులు ఉతికేందుకు ఒప్పందం చేసుకున్నాను. నెలకు రూ. 1,500 వచ్చేది. దాంట్లోనే బాడుగ కట్టి, పిల్లలను పోషించుకునేదాన్ని. అలా నాలుగేళ్ల పాటు గడిచింది. మలుపు తిప్పిన డ్రైవింగ్ గుల్జార్‌పేటకు గవర్నమెంట్ ఐటీఐ మీదుగా రోజూ వెళ్లేదానిని. పొదుపు సంఘం సభ్యులకు కుట్టు, డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు డీఆర్డీఏ బోర్డు కనిపించింది. ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చుకుంటానని అడిగాను. 8వ తరగతి పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. నేను ఏడవ తరగతి వరకే చదువుకున్నాను. రాత్రి బడికి వెళ్లి 8వ తరగతి చదవాలని నిర్ణయించుకున్నాను. రాత్రి బడికెళితే పిల్లలను చూసుకోవడం కష్టంగా ఉంటుందని, బాబుని విజయవాడలోని క్రిష్టియన్ స్కూల్లో చేర్పించాను. పాపను గుమ్మఘట్ట హాస్టల్లో చేర్పించాను. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపన నన్ను వారిని దూరం చేసింది. రాత్రి బడికి వెళ్లి చదువుకుని 2008లో పరీక్ష రాసి 8వ తరగతి పాస్ అయ్యాను. తర్వాత ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చకుంటానని చెప్పాను. 2008 డిసెంబరులో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేశాను. 2009లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. డ్రైవింగ్‌లో మెళుకువలు, నిబంధనల గురించి విద్యార్థులకు క్లాస్ నిర్వహిస్తున్న మీనాక్షి డ్రైవింగ్ స్కూల్ పెడితే.. చాలా మంది మహిళా అధికారులు, తెలిసిన వారు డ్రైవింగ్ నేర్పించు అని అడిగేవారు. ఒక మహిళ డ్రైవర్ అవసరం ఇంత ఉందా అని అప్పుడు నాకు అనిపించి, సొంతంగా ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2016లో మాంఛోసార్ని కలిసి విషయం చెప్పాను. ఆలో చన మంచిదేనని అయన ప్రోత్సహించారు. ఆర్డీటీలో జాబ్‌కు రాజీనామా చేసి, బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. స్పందన పేరుతో సేవ నేను ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. నాలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్ధేశంతో స్పందన సంస్థ స్థాపించి రైతు బజార్లో కార్యాలయం ఏర్పాటు చేశాను. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే గడుపుతాను. ఎవరైనా వారి వద్ద ఉన్న పాత దుస్తులు తెచ్చి కార్యాలయంలో ఉంచి వెళ్లవచ్చు. వాటిని పేదలు వచ్చి తమకు నచ్చినవి ఉచితంగా తీసుకెళతారు. నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదనేది నా కోరిక. అందుకే పేదవారికి ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలతో ఫీజు కట్టించి లైసెన్స్ ఇప్పిస్తుంటాను. -
గ్రహణం
చాలా సేపట్నుంచి బస్టాపులో నిలబడి ఉంది మీనాక్షి. సిటీ బస్సులు రాలేదు. ఎందువల్లనో తెలీదు. తను కాలేజీ నుంచి రావటానికి ముందుగానే బస్సులన్నీ వెళ్లిపోయాయా? అలా జరిగివుండదు. అలాగే అనుకున్నా వేరే రూట్లో వెళ్లే బస్సులయినా రావాలిగా. ఒక్క బస్సు కూడా రాలేదు!రోడ్డుమీద ఆటోలు జోరుగా వెళ్లిపోతున్నాయి. కొంతమంది నడిచి వెళ్తున్నారు. సిటీ బస్సులు ఎందువల్ల తిరగడంలేదో మీనాక్షికి అర్థం కాలేదు.సరిగ్గా అప్పుడే రోడ్డుకు అవతలివైపు వున్న హోటలు పక్క పాన్ షాప్ యజమాని యాభైయేళ్ల మనిషి రోడ్డుదాటి మీనాక్షి దగ్గరగా వచ్చి.. ‘‘అమ్మాయ్.. నీకు తెలీదేమో ఇవాళ సిటీ బస్సులు తిరగవు. ఆటోలో ఇంటికి వెళ్లు’’ అన్నాడు.‘‘ఎందుకండీ?’’ మీనాక్షి అడిగింది.‘‘సిటీ బస్సుడ్రైవర్ల మధ్య ఏదో గొడవ జరిగి కొట్టుకున్నారట. అప్పటి నుంచీ బస్సులు తిరగడంలేదు. ఈ విషయం నీకు తెలీదు అనుకుంటాను. రోజులాగే కాలేజ్ నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డావు. ఎంత సేపు నిలబడినా సిటీ బస్సులు రావు. ఆటోలో ఇల్లు చేరు’’ అని వెళ్లిపోయాడు.మీనాక్షికి ఏమీ పాలుబోలేదు. ఆటోలో ఇంటికి వెళ్లవచ్చు. కానీ ఆటోకి సరిపడా డబ్బులు లేవు. సిటీ బస్సుకే డబ్బులున్నాయి. ఆటోలో ఇంటికి వెళ్లినా తన మేనత్త ఆటోవాడికి డబ్బులు ఇవ్వదు. తనని తిట్టిపోస్తుంది. ఆమె వట్టి డబ్బు మనిషి. పరమ గయ్యాళి. నీతి నియమాలు లేవు. డబ్బే ప్రధానం ఆమెకు. డబ్బుకోసం ఎంత నీచానికైనా సిద్ధపడుతుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మీనాక్షి తల్లి అనారోగ్యంతో చనిపోయింది. మీనాక్షి తండ్రి శ్రీపాదం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మీనాక్షి ఒక్కతే కూతురు కావడంతో మీనాక్షిని చెల్లెలు సూర్యలక్షి ఇంట్లో వుంచాడు. మీనాక్షి పెంపకానికి చెల్లెలికి కొంత డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసుకుని.. శ్రీపాదం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కూతురి మీద చాలా ప్రేమ. అందుకే శక్తికి మించిన పని అయినా మీనాక్షిని కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. మీనాక్షి ఇంటర్ చదువుతోంది. ఇంటర్ చదువుతున్నా డిగ్రీ పూర్తి చేసిన దానిలా కనబడుతుంది. వయసునుమించిన ఎదుగుదల. మీనాక్షికి తల్లి పోలిక వచ్చింది. తల్లి అందంతో పాటూ.. తల్లి భారీతనం కూడా వచ్చింది.ఆలోచనలో వుండగానే మీనాక్షి ముందు అంబాసిడర్ కారు ఆగింది.అందులో మీనాక్షితో పాటు.. కాలేజీలో చదివే అమ్మాయి వకుళ కనపడింది.‘‘మీనాక్షీ... వచ్చి కారెక్కు. ఈ రోజు సిటీ బస్సులు తిరగవట.’’ అని మీనాక్షిని పిలిచింది వకుళ.డ్రైవర్ సీటులో కూర్చున్న లావుపాటి మనిషి కూడా మీనాక్షిని పిలిచాడు.‘‘నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు’’ అన్నది వకుళ మీనాక్షి సంశయాన్ని చూసి. మరోకప్పుడయితే మీనాక్షి కారు ఎక్కేది కాదు. కానీ వకుళ పిలవడంతో వెళ్లి కారెక్కి వకుళ పక్కన కూర్చుంది. కారు బయల్దేరింది. సిటీబస్సు డ్రైవర్ల గొడవ గురించి వకుళ చెబుతున్నప్పుడే వకుళ ఇల్లు వచ్చేసింది. కారు దిగి మీనాక్షికి చెప్పి వకుళ వెళ్లిపోయింది.‘‘మీ ఇల్లు ఎక్కడ?’’ కారు నడుపుతున్న మనిషి అడిగాడు.మీనాక్షి చెప్పింది.కారు బయల్దేరింది. కొంత దూరం వెళ్లి ఊరి బయటవున్న కాలనీలో ఒక మేడ ముందు ఆగింది.‘‘ఇక్కడ ఆపారేం?’’ అనుమానంగా అడిగింది మీనాక్షి.‘‘ఈ ఇంట్లో నా భార్య అనారోగ్యంతో ఉంది. ఒక ముఖ్యమైన మందు సీసా ఇవ్వాలి. నువ్వు కూడా దిగిరా’’ అన్నాడు.‘‘నేనెందుకు?’’‘‘చెబుతాను. ఈ మధ్య నీ వయసులో అచ్చం నీలాగే ఉండే మా కూతురు జబ్బు చేసి చనిపోయింది. ఆ దిగులుతో నా భార్య మంచం పట్టింది. నా భార్య మనసు తేలికపడుతుందని రమ్మంటున్నాను ప్లీజ్. కాదనకు’’ అర్థింపుగా అన్నాడు.మీనాక్షిది జాలిగుండె. ఇంకేమీ ఆలోచించకుండా కారుదిగి అతని వెనకే వెళ్లింది. అతను మేడమీద ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్లాడు. మీనాక్షి ఆ గదిలో అతను చెప్పిన అతని భార్య కోసం చూస్తున్నప్పుడు తలుపు మూసి బోల్టు వేశాడు. ఆ గదిలో ఎవరూ లేరు.తలుపు ముయ్యటం చూసి మీనాక్షి భయపడి ‘‘ఏమిటీ మోసం? నేను వెళ్లాలి. తలుపు తెరవండి.’’ అన్నది ఆందోళనగా.అతను నవ్వి ‘‘నువ్వు వెళ్లలేవు. నిన్ను మీ అత్త నాకు అమ్మేసింది. డబ్బు కూడా ఇచ్చేశాను. అందుకే తీసుకొచ్చాను’’ అన్నాడు.‘‘ఎవరు నువ్వు? నన్నేం చెయ్యబోతున్నావు?’’‘‘నిజం చెప్పినా సరే..! నువ్వు నన్నేం చెయ్యలేవు. నేను అమ్మాయిల బ్రోకర్ని. నీలాంటి అందమైన అమ్మాయిలను పట్టుకుని చెన్నై, ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న బ్రోతల్ కంపెనీలకు అమ్ముతూ వుంటాను. అది నా వృత్తి. నీ మేనత్త సూర్యలక్ష్మి నిన్ను నాకు అమ్మింది. డబ్బు కూడా ఇచ్చాను. అవకాశం కోసం చూస్తున్నాను. ఇవాళ వచ్చింది. నువ్వు చిక్కావు. అక్కడ నీకు ఏ లోటూ వుండదు. ఖరీదయిన బట్టలు, నగలు, నీకు మంచి ఫ్యూచర్ వుంటుంది. డబ్బుకు లోటు వుండదు. దిగులుపడకు. నవ్వుతూ వుండు.’’ అన్నాడు. మీనాక్షికి ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో ‘‘నేను నీ కూతురులాంటి దాన్ని. నన్ను వదిలిపెట్టు’’ అన్నది చేతులు జోడించి.‘‘అమ్మాయిల వ్యాపారం చేసే నాకు సెంటిమెంట్లు వుండవు. నాకు డబ్బే ముఖ్యం. నేను నా తమ్ముడి కూతుర్నే చెన్నై కంపెనీకి అమ్మాను’’ అన్నాడు నవ్వుతూ.‘‘అరిచి గోల చేస్తాను’’ బెదిరించింది మీనాక్షి.‘‘నువ్వు అరిచినా ప్రయోజనం వుండదు. నీ అరుపులు ఎవరికీ వినపడవు’’ అని పెద్దగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే బయట నుంచి ఎవరో తలుపును గట్టిగా నెట్టారు. బోల్టువూడి కింద పడింది. తలుపు తెరుచుకోగానే మీనాక్షి తండ్రి శ్రీపాదంతో పాటు నలుగురు పోలీసులు లోపలికి వచ్చారు.వాళ్లను చూసి అతడు పరిగెత్తబోయాడు. పోలీసులు అతడిని గట్టిగా పట్టుకున్నారు.తండ్రిని చూసి మీనాక్షి సంతోషంతో.. ‘‘నాన్నా నేను ఇక్కడున్నట్లు నీకెలా తెలిసింది?’’ అన్నది.‘‘నేను బస్టాపు ముందు నుంచి కార్లో వెళుతూ, నువ్వు వీడి కారులో ఎక్కడం చూశాను. వీడి గురించి నాకు తెలుసు. వీడి పేరు జగదీష్. అమ్మాయిల బ్రోకర్‌గా ఈ సిటీలో వీడికి మహాగొప్ప పేరుంది. వీడి కారును ఫాలో అయ్యాను. ఇంట్లోకి తీసుకెళ్లడం చూశాను. నిన్ను మోసంతో తీసుకువచ్చాడని అర్థమైంది. దాంతో పోలీసులను తీసుకొచ్చాను’’ చెప్పాడు శ్రీపాదం.జగదీష్ గింజుకుంటున్నాడు పోలీసుల చేతుల్లో..‘‘లక్ష్మి అత్తే నన్ను వీడికి అమ్మిందట’’ మీనాక్షి చెప్పింది.శ్రీపాదం పోలీసు ఇన్స్పెక్టర్తో అదే చెప్పాడు.‘‘ఎవర్నీ వదిలేది లేదు. ఆమెకీ శిక్ష తప్పదు. పదండి ఆమెను కూడా పట్టుకుందాం’’ అన్నాడు ఇన్స్పెక్టర్. అమ్మాయిల బ్రోకర్ జగదీష్‌ను ఎక్కించుకున్న పోలీసు జీపు సూర్యలక్ష్మి కోసం బయల్దేరింది. జొన్నలగడ్డ అరుణ -
మెగాఫోన్ పట్టిన మరో ఛాయాగ్రాహకుడు
తమిళసినిమా: ఛాయాగ్రాహకులు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది చాలా కాలంగానే వస్తోంది. దివంగత ప్రఖ్యాత కెమెరామెన్ బాలుమహేంద్ర దర్శకుడిగానూ పలు కళాఖండాలను తెరపై ఆవిష్కరించిన విషయం తెలిసిందే.అదే విధంగా కేవీ.ఆనంద్, మిజయ్ మిల్టన్ వంటి ఛాయాగ్రాహకులు సక్సెప్‌ఫుల్ దర్శకులుగా రాణిస్తున్నారు.తాజాగా పీజీ.ముత్తయ్య వారి బాటలో పయనానికి రెడీ అయ్యారు.ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి మదురైవీరన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. వి.స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ రెండవ కొడుకు షణ్ముగ పాండియన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సహాబ్ధం అనే చిత్రం ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. కాగా మదురై వీరన్ చిత్రంలో నవ నటి మీనాక్షి కథానాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలో సముద్రకని, వేల్.రామమూర్తి, మైమ్‌గోపీ, పీఎల్.తేనప్పన్, మారిముత్తు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, బాలసరవణన్ నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న మదురై వీరన్ చిత్ర తుది భాగాన్ని ఆగస్టులో మదురైలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు పీజీ.ముత్తయ్య తెలిపారు.ఈయనే ఛాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి తెలుపుతూ ఇది జల్లికట్టు నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు.ఇందులో విదేశం నుంచి సొంత ఊరుకు తిరిగొచ్చే యువకుడిగా షణ్ముగపాండియన్ నటిస్తున్నారని చెప్పారు. దీనికి సంతోష్ దయానిధి సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం నటుడు విజయకాంత్ ఆవిష్కరించారు. -
ఏ కష్టమొచ్చిందో!
♦ శృంగేరి వద్ద నదిలో దూకిన బ్యాంకు ఉద్యోగిని ♦ మైసూరులో ఇన్ఫోసిస్ టెక్కీ అనుమానాస్పద మృతి ♦ ఒకేరోజు రెండు విషాదాలు బొమ్మనహళ్లి/తుమకూరు/ మైసూరు: రాష్ట్రంలో ఒకేరోజు ఇద్దరు ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్నాయి. బెంగళూరులోని బసవేశ్వరనగరలోని హెచ్డిఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శిల్ప (26) అనే అమ్మాయి చిక్కమగళూరు జిల్లా శృంగేరి పుణ్యక్షేత్రం వద్ద తుంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శిల్ప స్వస్థలం తుమకూరు. ఐదేళ్లుగా ఆ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ పీజీ హాస్టల్లో ఉంటోంది. బుధవారం ఆమె బ్యాంకుకు వెళ్లకుండా, చిక్కమగళూరు సమీపంలోని ఉన్న శృంగేరికి వెళ్ళి అక్కడ దైవదర్శనం చేసుకుంది. అనంతరం దేవస్థానం సమీపంలోని తుంగా నదిలో దూకింది. వెంటనే అక్కడ ఉన్న పర్యాటకులు కాపాడటానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు సుమారు గంటకుపైగా గాలించగా, కిలోమీటర్ దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. అయితే ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు వివరాలు లభించలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో సోదరుడు రాజశేఖర్ ఆమె ఉంటున్న హాస్టల్‌కు వెళ్లాడు. ఇంకా రాలేదని సిబ్బంది చెప్పారు. బ్యాంకుకు వెళ్లి అడగా, డ్యూటీకి రాలేదని చెప్పడంతో అనుమానంతో బుధవారం రాత్రి బసవేశ్వర నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆమె ఫోటోలను అన్ని పీఎస్‌లకు పంపారు. శృంగేరి పోలీసులు ఆమె ఆత్మహత్య విషయాన్ని బెంగళూరు పోలీసులకు తెలిపారు. ఆమె అవివాహిత, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి మైసూరులోని హెబ్బాళలో ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న మీనాక్షి (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో తన గదిలో శవమై తేలింది. మీనాక్షి స్వస్థలం గుల్బర్గ. మైసూరులో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ హెబ్బాళలో ఉంటోంది. అయితే గత నాలుగు రోజులుగా మీనాక్షి డ్యూటీకి రాకపోవడంతో ఆమె స్నేహితులు మీనాక్షికి ఫోన్ చేయగా స్పందన లేదు. అదే సమయంలో గురువారం మీనాక్షి అద్దెకుంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగు ప్రజలు హెబ్బాళ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు విరగ్గొట్టి చూడగా మీనాక్షి మృతదేహం కనిపించింది. ఆమె మరణంపై దర్యాప్తు సాగుతోంది. -
ఏసీబీకి చిక్కిన కర్నూలు డీఎంహెచ్‌వో
కర్నూలు: డీఎంహెచ్‌వో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ కర్నూలు డీఎంహెచ్‌వో మీనాక్షి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం మీనాక్షి నివాసంతో పాటు ఆమె బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇక్కడ పనిచేసిన డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు పట్టుకోగా.. ఇప్పుడు మీనాక్షి కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆమె అక్రమాస్తులపై దృష్టి సారించారు. -
హీరో ధనుష్‌పై మరో పిటిషన్
చెన్నై: తమిళ హీరో ధనుష్‌ను కోర్టు పిటిషన్లు వెంటాడుతున్నాయి. ధనుష్ తమ కుమారుడు అంటూ మధురై మేలూర్కు చెందిన కదిరేశన్–మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనుష్ ఒంటిపై పుట్టుమచ్చలను లేజర్ చికిత్స ద్వారా చెరిపివేశారని, ఇందుకు కొన్ని ఆధారాలను ప్రభుత్వ వైద్యులు కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం కదిరేశన్ దంపతుల న్యాయవాది మరో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నటుడు ధనుష్ వేసిన రిట్ పిటిషన్లో ఆయన సంతకం నకిలీదని, సంతకం నకలును తమకు అందించాల్సిందిగా మధురై కోర్టును కోరారు. దీనిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా ధనుష్ పుట్టుమచ్చలను లేజర్ టెక్నాలజీతో పుచ్చుమచ్చలు తొలగించుకున్నారని ప్రభుత్వ వైద్యుల బృందం కోర్టుకు ఓ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఏప్రిల్ 11న విచారణకు రానుంది. వైద్యుల నివేదికపై న్యాయస్థానం ఏం తీర్పు వెల్లడించనుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ధనుష్‌పై మరోకేసు నమోదు కావడంతో కేసుల పరంపరతో అతడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. -
పుట్టుమచ్చలు తీయించేసిన ధనుష్
చెన్నై: హీరో ధనుష్ కేసును మధురై కోర్టు సోమవారం మరోమారు విచారించింది. గతంలో ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు.. ధనుష్ తమ బిడ్డే అంటున్న కదిరేశన్, మీనాక్షి దంపతులు చెబుతున్న పుట్టుమచ్చల ఆనవాళ్లను పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ధనుష్ శరీరంపై పుట్టు మచ్చల కోసం పరీక్ష చేయగా.. అవి కనిపించలేదు. దీంతో పుట్టుమచ్చలను తొలగించుకున్నారా? అనే దానిపై వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ వైద్యుల బృందం ధనుష్‌కు పరీక్షలు జరిపి పుట్టు మచ్చలను తొలగించుకున్నారని నిర్ధారించింది. లేజర్ టెక్నాలజీతో పుట్టు మచ్చలు తొలగించుకున్నట్లు సోమవారం కోర్టులో నివేదించింది. వైద్యుల నివేదికపై విచారణ జరిపిన కోర్టు అనంతరం కేసును ఏప్రిల్ 11కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. -
ధనుష్ సర్టిఫికేట్లు ఫేక్!
ఆయన కోర్టుకు సమర్పించిన జన్మధ్రువపత్రంలో పేరు లేదు వృద్ధ దంపతుల లాయర్ స్పష్టీకరణ ప్రముఖ తమిళ హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ వృద్ధ దంపతులు వేసిన కేసు కొత్త మలుపుతిరిగింది. పుట్టుకతో శరీరంపై వచ్చిన మచ్చలను వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ.. లేజర్ చికిత్సతో పుట్టుమచ్చలను మాయం చేయవచ్చునని, ఇప్పుడు తమిళ హీరో ధనుష్ ఆ పనే చేశాడని వైద్యులు కోర్టులో స్పష్టం చేయడంతో రజనీకాంత్ అల్లుడైన ఈ హీరోకి కోర్టులో చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. లేజర్ చికిత్సతో ధనుష్ తన పుట్టుమచ్చలు తొలగించుకున్నాడని డాక్టర్లు కోర్టుకు సమర్పించిన నివేదికతో స్పష్టమైందని వృద్ధ దంపతుల తరఫు న్యాయవాది మంగళవారం మీడియాకు తెలిపారు. కోర్టులో ధనుష్ సమర్పించిన జన్మధ్రువపత్రం జీరాక్స్ లో అతని పేరు లేదని, కాబట్టి ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ కాదేమోనని అనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ధనుష్ తమ కొడుకేనంటూ తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వృద్ధ దంపతుల వాదనల్లో నిజం లేదని ధనుష్ పేర్కొనడం కోర్టుకు తెలిపాడు. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం కదిరేశన్ దంపతులు కోరినట్టు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ చికిత్స ద్వారా పుట్టుమచ్చలను రూపుమాపారని సోమవారం కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. దీంతో కదిరేశన్ దంపతుల వాదన నిజమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. -
పుట్టుమచ్చలు చెరిపేశాడు
పుట్టుకతో శరీరంపై వచ్చిన మచ్చలను మాయం చెయ్యొచ్చా? అనడిగితే... చేసేయొచ్చు. వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ... లేజర్ చికిత్సతో పుట్టుమచ్చలను మాయం చేయవచ్చు. ఇప్పుడు తమిళ హీరో ధనుష్ ఆ పనే చేశాడని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అతడికి కోర్టులో చిక్కులు తప్పేట్లు కనిపించడం లేదు. ధనుష్ తమ కుమారుడేనని తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం... వాళ్ల వాదనల్లో నిజం లేదని ధనుష్ పేర్కొనడం తెలిసిన విషయాలే. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం కదిరేశన్ దంపతులు కోరినట్టు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ చికిత్స ద్వారా పుట్టుమచ్చలను రూపుమాపారని సోమవారం కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. దీంతో కదిరేశన్ దంపతుల వాదన నిజమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. -
అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి
ధనుష్ చాలా పాపులర్. ఇది మనందరికీ తెలుసు. మరీ ఇంత పాపులర్ అనుకోలేదు. ‘నా కొడుకంటే నా కొడుకు’ అని కొట్టుకునేంత పాపులర్! ఎన్డీ తివారీని ‘మా డాడీ.. మా డాడీ’ అని ఒకబ్బాయన్నాడు. కోర్టులు తేల్చాయి. ఇప్పుడు ధనుష్‌ను నా కొడుకంటే... నా కొడుకని లొల్లి చేస్తున్నారు ఇద్దరు నాన్నలు. కోర్టులు తేల్చాలి. ఇదీ సంగతి. ఎవర్ని ముంచుతారో... ఎవర్ని తేలుస్తారో? ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూసి ఎంజాయ్ చేసినవాళ్లు ‘కొడుకుకు ప్రేమతో’ అన్న ఈ సినిమా చదివి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం... ధనుష్ ఎవరు? సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు. ఒకప్పటి తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు. తెలుగులో ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలు తీసిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తమ్ముడు. మనకు ఇంతవరకే తెలుసు. అయితే ఇవన్నీ అబద్ధాలు అంటోంది ఓ వృద్ధ తమిళ జంట. ‘అతడు మా రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డ’ అంటున్నారు. అంతే కాదు... ‘కావాలంటే పుట్టుమచ్చలు పరీక్షించుకోండి. డీఎన్ఏ టెస్టులు చేసుకోండి. ధనుష్ ముమ్మాటికీ మా బిడ్డే’ అంటూ న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆ దంపతుల పేర్లు ఆర్. కదిరేశన్, మీనాక్షి. కోర్టు ఈ వృద్ధ దంపతుల వాదనను అర్థం చేసుకుని, ధనుష్‌కి సమన్లు జారీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరీ కదిరేశన్?? ధనుష్ మామగారైన సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరో కాకముందు బస్ కండక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. యాదృచ్ఛికమో.. మరొకటో... కదిరేశన్ కూడా కండక్టరే. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు. ఇటీవలే రిటైర్ అయ్యారు. చెన్నైకు సుమారు 500 కిలోమీటర్లు దూరంలో మధురై జిల్లాలోని మేలూర్ ఆయన స్వగ్రామం. కదిరేశన్‌కు ముగ్గురు పిల్లలు. ముగ్గురిలో ధనుష్ చిన్నోడని ఆయన చెబుతున్నారు. ‘‘ధనుష్ అసలు పేరు కలైసెల్వన్. మేలూర్‌లో రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించాడు. పదవ తరగతి వరకూ నగరంలోని ఆర్.సి. హయ్యర్ సెకండరీ స్కూల్, గవర్నమెంట్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్స్‌లో చదువుకున్నాడు. 12వ తరగతి కోసం శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్‌లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాం. కానీ, చదువు మధ్యలోనే మానేసి, సినిమా పిచ్చితో చెన్నై చేరుకున్నాడు. కçస్తూరి రాజాతో చేతులు కలిపాడు. అప్పట్నుంచీ మాకు దూరమయ్యాడు. మా కుమారుణ్ణి కలవాలని మేము చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మీరే మాకు న్యాయం చేయాలి’’ అని కదిరేశన్ దంపతులు కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. నెలకు 65 వేలు కావాలి! కదిరేశన్ కోర్టులో ధనుష్ మా కుమారుడే అని పేర్కొనడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు 65 వేలు ఇప్పించాల్సిందిగా కోరారు. మరో ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ, వాళ్లు తమ ఆరోగ్యానికీ ఇతర నెలవారీ ఖర్చులకు సరిపడా డబ్బులు ఏర్పాటు చేయలేకపోతున్నారని తెలిపారు. కదిరేశన్, మీనాక్షి దంపతుల వాదనలు విన్న తర్వాత జనవరి 12లోపు న్యాయస్థానం ముందు హాజరు కావాలని ధనుష్‌ని న్యాయమూర్తి ఆదేశించారు. గతేడాది నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది. ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్లను సమర్పించారు. ధనుష్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘తుళ్లువదో ఇళమై’ 2002 మేలో విడుదలైంది. తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లో ధనుష్‌ను చూసి గుర్తు పట్టామని కదిరేశన్ దంపతులు చెబుతున్న మాట. అయితే చిత్ర పరిశ్రమలో ఇటువంటి కేసులు కొత్తేమీ కాదు. ‘నేనే చిరంజీవి పెద్ద కుమారుణ్ణి’ అంటూ గతంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్, ‘నేను ఫలనా సినీ ప్రముఖుడికి ఫలానా’ అని మరికొందరు మీడియా, మానవ హక్కుల సంఘాలు, న్యాయస్థానాల ముందుకు వచ్చి తమ వాదనలు వినిపించారు. సదరు కేసులన్నీ కొన్ని రోజులకే కంచికి చేరుకున్నాయి. ధనుష్ కేసు మాత్రం కోర్టు సాక్షిగా కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. దీనిపై పలు వాదనలు జరిగాయి. మేలూర్ కోర్టులో కేసు కొట్టేయవలసిందిగా ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. బర్త్ సర్టిఫికేట్లో పేరు లేదా? న్యాయస్థానంలో ధనుష్ సమర్పించిన బర్త్ సర్టిఫికేట్ జూన్ 21, 1993లో ఇష్యూ చేసినట్టు ఉందని కదిరేశన్ పేర్కొన్నారు. అందులో ఉన్నట్టు జూలై 28, 1983న ధనుష్ జన్మించాడనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ‘అయినా... పదేళ్ల తర్వాత ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్లో పిల్లాడి పేరు ఎందుకు లేదు? అప్పటికి అతను ఐదవ తరగతికి వచ్చుంటాడు కదా?’ అని ప్రశ్నించారు. ఆర్.కె. వెంకటేశ్ ప్రభు రాజాగా ఉన్న తన పేరును ధనుష్‌గా 2003లో మార్చుకున్నట్టు ఈ హీరో విన్నవించగా, 2002లోనే ధనుష్‌గా తన పేరును ఈ హీరో పేర్కొన్నట్టు స్పష్టం చేసే పేపర్లను కదిరేశన్ దంపతులు న్యాయస్థానం ముందుంచారు. దాంతో కేసు జటిలమైంది. పుట్టుమచ్చ... తప్పలేదు రచ్చ! కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే... కదిరేశన్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా... అసలు కదిరేశన్ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్‌కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. అప్పుడు పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి 28లోపు న్యాయస్థానం ముందు ధనుష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దాంతో మంగళవారం విజయలక్ష్మి, కస్తూరి రాజాలతో కలసి ధనుష్ మేలూర్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు రిజిస్టార్ సమక్షంలో మేలూర్ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్ ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించారు. అనంతరం ఈ కేసు వాదనను గురువారానికి వాయిదా వేశారు. అయితే గురువారం నాడు డీఎన్ఎ టెస్ట్ కోసం కదిరేశన్ దంపతులు కోర్టుకు సమర్పించాల్సిన నివేదికలను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని న్యాయస్థానం కేసుని మార్చి 9కి వాయిదా వేసింది. కోర్టులో ఏం తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధనుష్... కస్తూరి రాజా కొడుకే – విసు కస్తూరి రాజా దర్శకత్వం వహించిన తొలి తమిళ చిత్రం ‘ఎన్ రాసావిన్ మనసిలే’ పాతికేళ్ల క్రితం విడుదలైంది. అంతకుముందు ఆయన దర్శక–నిర్మాత–నటుడు విసు దగ్గర 16 సినిమాలకు పని చేశారు. ఆ విధంగా విసుతో కస్తూరి రాజా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ‘ధనుష్ తమ కుమారుడే’ అని కదిరేశన్ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో విసు పెదవి విప్పారు. ‘‘కస్తూరి రాజా కుటుంబం నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. ధనుష్ పుట్టినప్పుడు కస్తూరి రాజా నా దగ్గరే పని చేస్తున్నాడు. ధనుష్... కస్తూరి రాజా–విజయలక్ష్మిదంపతుల కొడుకే. అందులో సందేహం లేదు’’ అంటూ తన కుటుంబంతో కలసి చిన్నప్పుడు ధనుష్ దిగిన ఫొటోను బయటపెట్టారాయన. సిక్స్ ఇయర్స్... స్వీట్ మెమరీ! కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ చిన్నప్పటి ఫొటోలు... అంటూ కొన్ని ఫొటోలను బయటపెడితే... ధనుష్ కూడా తన చిన్న నాటి ఫొటోను ఆ మధ్య ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో తన సిస్టర్స్ విమల గీత, కార్తీకా దేవితో కలసి ఉన్నాడు బుజ్జి ధనుష్. అప్పుడు తన వయసు ఆరేళ్లని ఈ హీరో పేర్కొన్నారు. ‘అవి గోల్డెన్ డేస్. మరచిపోలేనివి’ అని కూడా అన్నారు. మరి.. పదో తరగతి వరకూ తమ దగ్గరే ఉన్నాడని కదిరేశన్ దంపతులు చెబుతున్న నేపథ్యంలో ఆరేళ్ల వయసులో సోదరీమణులతో కలసి ధనుష్ దిగిన ఫొటో ఎక్కణ్ణుంచి వచ్చింది? – సత్య పులగం -
42లో 32 హిట్...
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, ‘బేబి’ మీనాక్షి, విమలారామన్ ముఖ్య పాత్రల్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒప్పం’. మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని దిలీప్‌కుమార్ బొలుగోటి సమర్పణలో ఓవర్సీన్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘కనుపాప’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా పాటలను ప్రదర్శించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ –‘‘మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో 42 సినిమాలు రాగా 32 సినిమాలు మంచి హిట్ సాధించాయి. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అంధుడిగా మోహన్ లాల్ నటన అద్భుతం. తెలుగు ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చేలా ఉంటుంది. ‘ఒప్పం’ను తెలుగులో విడుదల చేయడంలో నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి సహాయపడ్డారు’’ అని దిలీప్‌కుమార్ బొలుగోటి చెప్పారు. -
హత్య కేసులో మహిళకు ఏడేళ్ల జైలు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు రూపల్ సీఐ కృష్ణమోహన్ గురువారం తెలిపారు. సోములదొడ్డిలో 2014 మే 6న వినాయకుని విగ్రహాల తయారీ విషయంలో రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. ఘటనలో చిన్న తిమ్మరాజు అనే వ్యక్తిని శ్రీనివాసులు భార్య మీనాక్షి, ఆమె కుమారుడు(మైనర్) దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సీఐ తెలిపారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పట్లో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాల పరిశీలన, సాక్షుల విచారణ అనంతరం మీనాక్షిపై నేరం రుజువు కావడంతో ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష సహా రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మైనర్‌కు సంబంధించిన కేసు జువైనల్ జస్టిస్ బోర్డు(జేజేబీ)లో విచారణలో ఉంది. -
మీనాక్షి.. ఎంతపని చేసింది!
మొరాదాబాద్: ఇద్దరు పరాయి పురుషులతో కలిసి ఉండగా చూసి, గోలచేశాడని భర్త నాలుకను కోసిపారేసిందో భార్య! ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగిన ఈ సంఘటన వివరాలను మొదరాబాద్ పోలీసులు మీడియాకు చెప్పారు. వారి కథనం ప్రకారం.. సంబల్ పట్టణానికి చెందిన జితేంద్ర అనే యువకుడు కొద్ది రోజుల కిందట తన భార్య మీనాక్షితో కలిసి మొరాదాబాద్ కు వలస వచ్చాడు. ఇటుకబట్టీల్లో కూలీగా పనిచేసే అతను.. ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన జితేంద్ర.. తన ఇంటి బెడ్ రూమ్ లో దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. ఇద్దరు పరాయి మగవాళ్లతో మీనాక్షి దగ్గరగా ఉండటాన్ని చూసి.. వారిపై దాడికి యత్నించాడు. అంతలోపే మీనాక్షి, అతని ప్రియులు కలిసి జితేంద్రను బంధించారు. పదునైన చాకుతో మీనాక్షి తన భర్త నాలుకను కోసేసింది. తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కొద్దిసేపటికి రక్తం మడుగులో పడిఉన్న జితేంద్రను ఇరుగుపొరుగువారు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. జితేంద్రకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తొమ్మిది కుట్లువేసి నాలుకను సరిచేశారు. ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర కుటుంబసభ్యులను పిలిపించారు. మీనాక్షికి పెళ్లికి ముందే చాలామందితో సంబంధాలున్నాయని, పెళ్లయ్యాక కూడా విచ్చలవిడిగా ప్రవర్తించేదని, సొంత ఊళ్లో పరువు కాపాడుకునేందుకే మీనాక్షిని తీసుకుని జితేంద్ర మొరాదాబాద్ వచ్చాడని, అయినా కూడా ఆమె మారలేదని బాధితుడి బంధువులు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రేమవివాహం చేసుకున్న రెండు నెలలకే..
పెళ్లైన రెండు నెలలకే..ఉపాధ్యాయురాలు ఆత్మహత్య నలుగురిపై వరకట్నం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అంగవైకల్యం అడుగడుగునా అవాంతరాలు సృష్టించింది. మొక్కవోని దీక్ష ముందుకు నడిపించింది. విధి పరీక్షకు ఎదురొడ్డి నిలిచింది. లక్ష్యం దిశగా సాగించిన అక్షర యజ్ఞంలో విజయం వరించింది. జీవితం నేర్పిన పాఠం.. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దారి చూపింది. ఇలా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని మలుపు.. ప్రేమ. రోజూ వెంట నడుస్తుంటే.. ఏడడుగులు వేస్తాడనుకుంది. నిన్ను నిన్నుగా ప్రేమిస్తానంటే.. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా భ్రమపడింది. ఆస్తిపాస్తులు లేవని తెలిసినా.. జీవితాంతం తోడుంటానంటే కలల ‘రాజు’గా భావించింది. పెళ్లికి ముందే వేసిన తప్పటడుగు.. అతని ప్రేమలోని ‘లోపాన్ని’ బయటపెట్టింది. పెద్దలు.. పోలీసులు.. మూడుముళ్లతో ఒక్కటి చేసినా, ఆ ప్రేమ డబ్బును వరించింది. పుట్టింటికి దూరమై.. మెట్టినింటి వేధింపులకు విసిగిపోయి.. కట్టుకున్నోడి అసలు రూపం బయటపడి.. ఈ జీవితం ఇక చాలనుకుంది. లోకం విడిచి వెళ్లిపోయింది. ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని కిందిమాలగేరికి చెందిన లలితమ్మ, రంగన్న(లేట్)లకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చివరి అమ్మాయి మీనాక్షి(27). ఈమె పుట్టుకతో వికలాంగురాలు. కష్టపడి తల్లిదండ్రులు చదివించారు. 2012 సంవత్సంలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా మీనాక్షి ఎంపికై బేతంచర్లలోని ఓ పాఠశాలలో విధుల్లోకి చేరింది. అనంతరం మంత్రాలయం మండలం తుంగభద్ర దగ్గర ఉన్న కాచాపురం ఎంపీపీ స్కూల్‌కు బదిలీపై వచ్చింది. అయితే మీనాక్షి పట్టణంలోని శివ సర్కిల్ దగ్గర టీ స్టాల్ నిర్వహిస్తున్న గొల్ల రాజుతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని.. పెళ్లిచేసుకుంటానని రాజు నమ్మించడంతో కొన్ని రోజులు సహజీవనం చేశారు. జీతం తల్లికి ఇవ్వకుండా రాజుకు ఇచ్చేది. తర్వాత పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేస్తుండటంతో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. చివరకు కుల పెద్దలు ఇద్దరికి శ్రీ రామస్వామి దేవాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. స్థానిక ఎస్ఎంటీ కాలనీలోని ఇంటి నెంబర్ 1/3026లో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత అప్పులు ఉన్నాయి.. రూ. 5 లక్షలు కావాలని వేధించటం మొదలు పెట్టాడు. రాజు తల్లి సోమమ్మ, అన్న బ్రహ్మ, బావ రాఘవేంద్ర కూడా ఒత్తిడి చేశారు. వీరందరూ రోజు మానసికంగా హింసించటమే కాక కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. అడిగినమేర డబ్బు ఇవ్వలేదని భర్త రాజు ఇంటికి రాకుండా, ఫోన్ చేస్తే ఊర్లో లేనని చెప్పి తల్లి దగ్గర ఉండేవాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన మీనాక్షి బుధవారం రాత్రి ఇంట్లో చీర తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తలుపు వేసి ఉండటంతో అనుమానం వచ్చిన ఇంటి పక్కల వారు గురువారం మిద్దెపై నుంచి తొంగి చూశారు. మీనాక్షి చీరకు వేలాడుతూ కనిపించటంతో పట్టణ పోలీసులకు సమాచార మందించారు. వెంటనే డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని ఆరాతీశారు. మృతురాలు రాసిన సూసైడ్ నోట్ కనిపించడంతో స్వాధీనం చేసుకున్నాడు. మృతురాలు అన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు భర్త గొల్ల రాజుతో పాటు సోమమ్మ, బ్రహ్మ. రాఘవేంద్రలపై వరకట్న వేధింపుల కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసిన ట్లు డీఎస్పీ తెలిపారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టుం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఉపాధ్యాయురాలి మృతిపై పలు అనుమానాలు.. ఉపాధ్యాయురాలు మీనాక్షి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. శారీరకంగా వికలాంగురాలైన మీనాక్షి ఇంటి వెంటిలేటర్‌కు చీరతో ఉరి వేసుకోవడం, సూసైడ్ నోట్ కింద పేరు రాయకపోవడాన్ని చూస్తే మీనాక్షిది ఆత్మహత్యనా? లేక హత్యనా? అనే అనుమానం తలెత్తుతోంది. పోలీసుల విచారణలో ఇది తేలనుంది. -
భర్త వేధింపులతో మెడికో ఆత్మహత్య
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిత్యం వేధిస్తుండడంతో మనస్థాపం చెందిన ఓ వివాహిత మంగళవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం పట్టణంలో జరిగింది. అనంతపురం పట్టణానికి చెందిన చంద్ర, లక్ష్మి దంపతుల కుమార్తె మీనాక్షి బెంగుళూరులో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించిన శ్రీనివాస్‌ను పెళ్లిచేసుకుంది. దాంతో తల్లిదండ్రులు ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు. ఆస్తిలో హక్కులేకుండా రాయించుకుని వారు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి మీనాక్షి భర్త శ్రీనివాస్‌తో అనంతపురంలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. క్లాసులు ఉన్నప్పుడు బెంగుళూరు వెళ్లి వస్తోంది. వీరికి నాలుగు నెలల చిన్నారి ఉంది. తను ఆశించిన ఆస్తి దక్కకపోవడంతో మద్యానికి అలవాటుపడిన శ్రీనివాస్ భార్యను తరుచూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మీనాక్షి మంగళవారం వేకువజామున ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రంతా బార్లో గడిపిన శ్రీనివాస్ వేకువజామున ఇంటికొచ్చి చూస్తే భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
రంగనాథ్‌కు కన్నీటి వీడ్కోలు
♦ బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు ♦ కదలివచ్చిన తెలుగు చిత్రసీమ.. మంచి నటుడిని కోల్పోయామని ఆవేదన ♦ ఇంతపని చేస్తాడని ఊహించలేదని కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు ♦ రంగనాథ్‌ది ఆత్మహత్యేనని తేల్చిన పోస్ట్‌మార్టం నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ అంత్యక్రియలు ఆదివారం బన్సీలాల్‌పేట హిందూ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆయన కుమారుడు నాగేంద్ర దహన సంస్కారాలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, సన్నిహితులు, తెలుగు చిత్ర సీమ ప్రముఖులు రంగనాథ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రంగనాథ్ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం అనంతరం ఫిల్మ్‌నగర్‌లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యాలయానికి తరలించారు. అక్కడ తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులంతా రంగనాథ్‌కు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ఆయన మరణంతో తెలుగుచిత్ర సీమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రంగనాథ్ భౌతికకాయాన్ని గాంధీనగర్‌లోని ఆయన పెద్ద కుమార్తె నీరజ నివాసానికి అక్కడి నుంచి బన్సీలాల్‌పేట శ్మశాన వాటికకు తరలించారు. తండ్రి మరణవార్త తెలియగానే కుమారుడు నాగేంద్ర, చిన్న కుమార్తె శైలజ బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పెద్ద కుమార్తె నీరజ మాట్లాడుతూ కొన్నిరోజులుగా గడ్డం కూడా తీసుకోకుండా తన తండ్రి డల్‌గా ఉన్నారని చెప్పారు. ఆధ్యాత్మిక చింతన, ఉన్నత విలువలతో జీవించిన తమ తండ్రి .. అభిమానులను కూడా తమలాగే చూసేవారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రంగనాథ్ కుమారుడు నాగేంద్ర మాట్లాడుతూ తన తండ్రి సున్నితభావంతో ఉండేవా రని, తక్కువగా మాట్లాడినా ఎక్కువగా పనిచేసేవారని చెప్పారు. తన తండ్రితో నెల క్రితమే మాట్లాడానని, తన తల్లి చనిపోయిన తర్వాత పనిమనిషి మీనాక్షి ఆయనకు వంటచేసిపెట్టేదని అన్నారు. అందుకే ఆమె పట్ల ఆదరణ చూపారన్నారు. ఇదిలా ఉంటే రంగనాథ్ వంటమనిషి మీనాక్షి పేరుతో లక్షన్నర రూపాయలతో ఒకటి, మూడున్నర లక్షలతో మరో ఫిక్స్డ్ డిపాజిట్లను ఆంధ్రాబ్యాంక్‌లో వేశారని, మీనాక్షికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చే యాలని ఇటీవల రంగనాథ్ నగర మంత్రి తల సాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫోన్ చేసి అపాయిం ట్మెంట్ కోరినట్లు సన్నిహితులు తెలిపారు. తర్వాత తింటా అన్నారు: వంటమనిషి శనివారం మధ్యాహ్నం 12.30కి వంటచేసి భోజనం చెయ్యమంటే ఆకలిగా లేదని, రెండున్నర గంటలకు తింటానని చెప్పారని వంటమనిషి మీనాక్షి చెప్పింది. తన కోసం కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలగా ఉందని చెప్పింది. పస్తుండి ప్రాణం తీసుకున్నారు! గంభీరమైన కంఠం... ఆకట్టుకునే ఆహార్యంతో వెండి, బుల్లితెరలపై వెలిగిన నటుడు రంగనాథ్. చనిపోయే రోజు మాత్రం పూర్తిస్థాయిలో పస్తు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆయన మృతదేహానికి గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ రమణమూర్తి పోస్టుమార్టం నిర్వహించారు. గొంతుపై ఉన్న మచ్చలతో పాటు ఇతర ఆనవాళ్ల నేపథ్యంలో రంగనాథ్‌ది ఆత్మహత్యగా వైద్యులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం కడుపులో ఉన్న ద్రావణాలు (విస్రా) సేకరించారు. ఆయనను ఆఖరిసారిగా చూసింది పనిమనిషి మీనాక్షే. శనివారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో వంట పూర్తి చేసిన ఈమె.. భోజనం చేయమని చెప్పి వెళ్లింది. అయినప్పటికీ రంగనాథ్ ఏమీ తీసుకోలేదని తేలింది. ఆత్మహత్య చేసుకునే సమయానికి కడుపులో ఉన్న ఘన, ద్రవ పదార్థాలు అలానే మిగిలిపోతాయి. రంగనాథ్ మృతదేహంలో ఆహారానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని రమణమూర్తి తెలిపారు. మరోవైపు ఎప్పుడూ నీట్ షేవ్‌తో ఉండే రంగనాథ్ కొన్ని రోజులుగా గడ్డం కూడా గీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన శనివారం సాయంత్రం ఓ సన్మానానికి హాజరుకావాల్సి ఉంది. అయినప్పటికీ మృతదేహం ముఖం మాసిన గడ్డంతో ఉందని తెలిపారు. వీటిని బట్టి ఆయన ఆత్మహత్య హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, తీవ్ర మానసిక వేదనతో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. -
అకారణంగానే చెంప చెళ్లుమనిపించిందా?
చెన్నై: 'తుపాకి' నటి మీనాక్షి.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించడం వివాదం రేపింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్ర సహాయ దర్శకుడిపై మీనాక్షి చేయిచేసుకుంది. చెన్నై పాత మహాబలిపురం రోడ్డులోని ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారట. సదరు సహాయ దర్శకుడికి మద్దతుగా యూనిట్ సభ్యులు, ఇతర టెక్నీషియన్లు ఆందోళనకు దిగారు. అకారణంగా,. అన్యాయంగా ఆమె కొట్టిందంటూ వారంతా మండిపడ్డారు. సహాయ దర్శకుడికి క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఆమెను షూటింగ్ స్పాట్ నుంచి కదలనివ్వబోమని పట్టుబట్టారు. దీంతో మీనాక్షి.. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కు క్షమాపణలు చెబుతూ, లేఖ రాసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని, బుద్ధిగా ఉంటానని మీనాక్షి చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తుపాకి' చిత్రంలో హీరోయిన్ కాజల్ స్నేహితురాలి పాత్రలో నటించిన మీనాక్షి.. ప్రస్తుతం నేర్ముగమ్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. అయితే ఇద్దరి మధ్య బయటకు చెప్పుకోలేని గొడవ ఏదైనా జరిగిందా? అసలు ఏం జరిగిందనేది ఎవరికీ అంతుబట్టక మల్లగుల్లాలు పడుతున్నారట. మీనాక్షి ఎందుకు అలా ప్రవర్తించిందనే విషయం ఎటూ తేలక సినీజనం ఆరా తీస్తున్నారు. -
విధి వంచిత
క్రైమ్ ఫైల్ మార్చి, 2012... ముంబై... ‘షాట్ రెడీ’ అన్న మాట వింటూనే చేతిలోని స్క్రిప్టు పక్కన పెట్టి లేచింది మీనాక్షి. హుషారుగా వెళ్లి కెమెరా ముందు నిలబడింది. యాక్షన్ అని చెప్పగానే డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. క్షణాల్లో సీన్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అద్భుతంగా కరుణ రసాన్ని పండించింది. ఆమె నటన చూసి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. డెరైక్టర్ కట్ చెప్పగానే చప్పట్ల వర్షం కురిపించారు. ఆనందంతో పొంగిపోయింది మీనాక్షి. గొప్ప నటి కావాలన్న తన లక్ష్యం తప్పక నెరవేరుతుందని ఆ చప్పట్ల వర్షం తనకి చెబుతున్నట్టుగా అనిపించిందామెకి. ‘‘వెల్డన్ మీనాక్షీ... అదరగొట్టేశావ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కీపిటప్’’... వెన్ను తట్టాడు డెరైక్టర్. ‘‘థాంక్యూ సర్’’ అంది మీనాక్షి వినయంగా. నెక్స్ట్షాట్ డైలాగులు తీసుకొచ్చి చేతిలో పెట్టాడు బాయ్. వెళ్లి చదువుకుంటూ కూర్చున్న మీనాక్షి, ఎవరో వచ్చి నిలబడినట్టు అనిపించడంతో తల ఎత్తి చూసింది. ఎదురుగా ఓ వ్యక్తి, ఓ అమ్మాయి ఉన్నారు. అతని వయసు ముప్ఫై పైనే ఉంటుంది. ఆ అమ్మాయి ముప్ఫయ్యేళ్లకు చేరువలో ఉండివుంటుంది. ‘‘నమస్తే మేడమ్, మీరు మీనాక్షిగారు కదూ. మీరంటే నాకు చాలా ఇష్టం’’... సంబరపడిపోతూ అందా అమ్మాయి. ‘‘నాక్కూడా మీరంటే ఎంతో గౌరవం మేడమ్. ఎక్కడో నేపాల్ నుంచి వచ్చి బాలీవుడ్లో స్థానం సంపాదించారు. మీరు నిజంగా గ్రేట్’’ అన్నాడా వ్యక్తి. ‘‘నేనంత గొప్పదాన్నేం కాదండీ. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. చిన్నప్ప ట్నుంచీ నటనంటే పిచ్చి. అందుకే కాలు మీద కాలు వేసుకుని బతికేంత డబ్బు ఉన్నా, ఇక్కడికి వచ్చాను’’ అంది మీనాక్షి. ‘‘అలా అనకండి మేడమ్. మీలాంటి వాళ్లే మాకు స్ఫూర్తి. మా ఇద్దరికీ నటనంటే ఆసక్తి. అందుకే అదృష్టం పరీక్షించుకుందా మని వచ్చాం. అనుకోకుండా మిమ్మల్ని కలిశాం. చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడతను ఆనందంగా. ‘‘టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రయత్నించండి. నేను కూడా నాకు తెలిసినవాళ్లకు చెబుతాను’’ అంది మీనాక్షి. వాళ్లిద్దరి ముఖాలూ సంతోషంతో వెలిగాయి. మరోసారి కలుస్తామని చెప్పి వెళ్లి పోయారు. మళ్లీ స్క్రిప్టు చదువుకోవ డంలో మునిగిపోయింది మీనాక్షి. ఏప్రిల్, 2012... దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు ఇన్స్పెక్టర్. ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇన్స్పెక్టర్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. అతడి ముఖంలో విసుగు, ఆతృత, కోపం, బాధ... రకరకాల హావభావాలు కదలాడు తున్నాయి. కాసేపలాగే చూసి... ‘‘ఏంటి సర్ ఆలోచిస్తున్నారు? పది రోజులు దాటింది నేను కంప్లయింట్ ఇచ్చి. ఇంతవరకూ ఏ ఉపయోగం లేదు’’... అరిచినట్టే అన్నాడతను. ఇన్స్పెక్టర్ కోపం తెచ్చుకోలేదు. ‘‘నాకర్థమవుతోంది నవరాజ్ నీ బాధ! కానీ ఏం చేయమంటావ్. ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాం.’’ ‘‘ఏంటి సర్ ప్రయత్నించేది! అక్కడ నా చెల్లెలు ఎలా ఉందో, ఏమైపోయిందో, వాళ్లు తనని ఏం చేశారో. మా అమ్మ గుండె పగిలేలా ఏడుస్తోంది. నేను పిచ్చోడిలా తిరిగిన చోటు తిరక్కుండా తిరుగుతున్నాను. వయసులో ఉన్న పిల్ల సర్. తనకేదైనా అయితే’’... దుఃఖం పొంగుకొచ్చింది నవరాజ్కి. ఇన్స్పెక్టర్ మనసంతా అదోలా అయిపోయింది. అయినా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఏం చెప్ప గలడు? ఏదైనా తెలిస్తే కదా చెప్పడానికి! ఉన్నట్టుండి నేపాల్‌కు చెందిన నవ రాజ్ థాపా స్టేషన్‌కి వచ్చాడు. తన చెల్లెలు మీనాక్షీ థాపాని ఎవరో కిడ్నాప్ చేశా రంటూ కంప్లయింట్ ఇచ్చాడు. మీనాక్షి బాలీవుడ్ నటి. అప్పటికే ఓ హారర్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరో సినిమాలో చేస్తోంది. కొన్ని మోడలింగ్ ప్రాజెక్టులు చేసింది. మరికొన్ని చేతిలో ఉన్నాయి. అలాంటి సమయంలో ఆమె ఉన్నట్టుండి మాయమైపోయింది. రెండు రోజులు వరుసగా షూటింగుకు రాకపోవ డంతో దర్శక నిర్మాతలు, నేపాల్‌లో ఉన్న మీనాక్షి కుటుంబానికి ఫోన్ చేశారు. వాళ్లు ముంబై వచ్చి వెతికారు. కానీ ఆమె జాడ తెలియలేదు. ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంది. దాంతో మీనాక్షి అన్న నవరాజ్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. ‘‘మాట్లాడరేంటి సర్... నా చెల్లెలు ఏమయ్యింది? తను క్షేమంగానే ఉందం టారా?’’... జీరబోయిన గొంతుతో అడిగిన ప్రశ్నే అడుగుతున్నాడు నవరాజ్. ఏమీ చెప్పలేక నీళ్లు నములుతున్నాడు ఇన్స్పెక్టర్. అంతలో ఓ కానిస్టేబుల్ వేగంగా లోపలికి వచ్చాడు. ‘‘సర్... మీనాక్షిగారి ఫోన్ కొద్దిసేపటి క్రితం ఆన్ అయ్యింది. పది నిమిషాల తర్వాత మళ్లీ ఆఫ్ అయిపోయింది.’’ అలెర్ట్ అయ్యాడు ఇన్స్పెక్టర్. ‘‘లొకేషన్ ట్రేస్ చేశారా?’’ ‘‘చేశాం సర్. ముంబైలోనే ఉన్నారు. అంతే కాదు సర్. బ్యాంక్‌వాళ్లు ఫోన్ చేశారు. ఇవాళ ఉదయం మీనాక్షి అకౌంట్ నుంచి అరవై వేలు డ్రా అయ్యాయట.’’ చివ్వున లేచాడు ఇన్స్పెక్టర్. ‘‘నవరాజ్... క్లూ దొరికింది. ఈ రెండు ఆధారాలూ చాలు, మీనాక్షి దగ్గరకు చేరుకోవడానికి. పదండి వెళ్దాం’’ అన్నాడు టోపీ పెట్టుకుంటూ. నవరాజ్ లేచాడు. మరో రెండు నిమిషాల్లో వాళ్లు ఎక్కిన వాహనం రయ్యిన దూసుకుపోయింది. ముంబై శివార్లలో ఉన్న ఓ కాలనీ దగ్గర ఆగింది పోలీస్ జీపు. దిగి చుట్టూ చూశాడు ఇన్స్పెక్టర్. ఖరీదైన మనుషు లెవరూ ఆ కాలనీలో ఉండటం లేదని అక్కడి ఇళ్లను చూస్తేనే తెలుస్తోంది. ‘‘లొకేషన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘రండి సర్’’ అంటూ ముందుకు నడిచాడు ఓ కానిస్టేబుల్. కొన్ని సందులు దాటి ఓ ఇంటి ముందు ఆగాడు. ఇదే అన్నట్టు సైగ చేశాడు. ఇన్స్పెక్టర్ సిగ్నల్ ఇచ్చాడు. టీమ్ అందరూ ఒక్కసారిగా తలుపు పగులగొట్టి లోపలకు వెళ్లారు. వాళ్లని చూస్తూనే లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులూ హడలిపోయారు. ఎలా తప్పించుకుందామా అని చూశారు. కానీ ఏ దారీ కనిపించక లొంగిపోయారు. ‘‘మీనాక్షి ఎక్కడ?’’... అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘మీనాక్షి ఎవరు?’’ అన్నాడొక వ్యక్తి. అంతే... చెంప ఛెళ్లుమంది. భగ్గు మంటోన్న చెంపను తడుముకుంటూ నోరు విప్పాడతను. అతడు చెప్పింది విని అవాక్కయిపోయారు పోలీసులు. అలహాబాద్‌లోని ఓ చిన్న హోటల్... పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లు తోంది. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తున్నారు. పోలీసులంతా చకచకా టై మీదికి వెళ్లారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వాటర్ ట్యాంక్ మూత తీసి అందులోకి దిగారు. నీటి అడుగున ఉన్న... ప్లాస్టిక్ సంచుల మూటలను బయటకు తీశారు. వాటిని చూస్తూనే ‘‘మీనాక్షీ’’ అంటూ అరిచి కుప్పకూలాడు నవరాజ్. ‘‘అమిత్ జైస్వాల్, ప్రీతీ సురీన్... ఏదీ కూడా దాచకుండా చెప్పండి. లేదంటే నాలో రాక్షసుణ్ని చూస్తారు’’... గర్జించాడు ఇన్స్పెక్టర్. అమిత్ చెప్పడం మొదలు పెట్టాడు. అది వింటే మనిషన్నవాడు, మనసున్నవాడు ఎవడూ తట్టుకోలేడు! అలహాబాద్‌కు చెందిన అమిత్ ‘లా’ చదివాడు. లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. అతనికి అసిస్టెంట్‌గా చేరింది ప్రీతి. ఇద్దరూ హద్దులు దాటారు. అది అమిత్ భార్యకి, పిల్లలకి తెలిసి పెద్ద గొడవ జరిగింది. అయినా ప్రీతిని వదల డానికి ఇష్టపడలేదు అమిత్. ఆమెను తీసుకుని రాత్రికి రాత్రే ముంబై వచ్చేశాడు. ఇద్దరికీ నటనంటే ఇష్టం కావడంతో సిని మాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ సమయంలోనే ఓ షూటింగ్ స్పాట్లో మీనాక్షిని కలిశారు. ఆమె ఎంతో అభిమానంగా మాట్లాడింది. దాంతో పరిచయాన్ని కొనసాగించారు. తరచూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకునే వారు. కలిసి భోజనాలు చేసేవారు. తీరిగ్గా ఉన్నప్పుడు పార్టీలూ చేసుకునేవారు. అదెంత ప్రమాదకరమో మీనాక్షి అంచనా వేయలేకపోయింది. కాల సర్పాలతో తిరుగుతున్నానని తెలుసుకోలేక పోయింది. ఆ సర్పాలు తనను కాటు వేస్తాయని ఊహించలేకపోయింది. ఓరోజు మీనాక్షికి ఫోన్ చేసి, తమ స్వస్థలమైన అలహాబాద్‌లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం రమ్మంది ప్రీతి. ఆ రోజు షూటింగ్ లేకపోవడంతో వెళ్లింది మీనాక్షి. ముగ్గురూ అలహాబాద్ వెళ్లి ఓ చిన్న హోటల్లో బస చేశారు. అక్కడ మీనాక్షిని బంధించారు అమిత్, ప్రీతి. తర్వాత ‘మీనాక్షిని కిడ్నాప్ చేశాం, పదిహేను లక్షలు ఆమె అకౌంట్లో జమ చేస్తే వదిలేస్తాం’ అంటూ మీనాక్షి ఫోన్ నుంచే ఆమె తల్లి కమలకు మెసేజిచ్చారు. కమల దగ్గర అంత డబ్బు లేదు. కొడుకు నవరాజ్తో కలిసి ఎలాగో అరవై వేలు కూడగట్టి, మీనాక్షి అకౌంట్లో వేసింది. దాంతో వాళ్లకి పదిహేను లక్షలు ఇచ్చేంత సీన్ లేదని అర్థమైంది ఇద్దరికీ. అప్పుడే... ఆ క్షణమే మీనాక్షిని గొంతు నులిమి చంపేశారు. తలను నరికేశారు. మొండెంను ముక్కలు చేసి, ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వాటర్ ట్యాంక్‌లో పడేశారు. తలను ప్యాక్ చేసి, బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరారు. అలహాబాద్ నుంచి ముంబై వచ్చే దారిలో బస్సులోంచి తలను విసిరేశారు. చాచి కొట్టాడు ఇన్స్పెక్టర్. ‘‘పాపం అమాయకురాలిని పొట్టనబెట్టుకున్నారు. మీరు మనుషులా’’ అన్నాడు ఛీదరింపుగా. ‘‘తను బాగా డబ్బున్న అమ్మాయి నని, హాబీగా యాక్టింగ్ చేస్తున్నాని మీనాక్షి చెప్పింది సర్. అందుకే మేం సెటిలవ్వ డానికి తనని ఉపయోగించుకోవాలను కున్నాం. కానీ తనకంత సీన్ లేదని తర్వాత అర్థమైంది. అందుకే చంపేశాం.’’ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతోన్న ప్రీతిని చూసి మండు కొచ్చింది ఇన్స్పెక్టర్. తర్వాత పోలీసు లాఠీలు ఆ ఇద్దరి శరీరాల మీద నృత్యం చేశాయి. ఆ మానవ మృగాలు కటకటాల వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాయి. - సమీర నేలపూడి -
నటి మీనాక్షితో లిప్‌లాకా?
తమిళసినిమా: ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణ అంశం హీరోహీరోయిన్ల లిప్ లాక్ సన్నివేశాలు. అలాంటిది అదీ ఒక హీరో లిప్ లాక్ సన్నివేశంలో నటించాలని అనగానే కరెంట్ షాక్ కొట్టినట్లు వద్దు బాబోయ్ అంటూ పారిపోవడం ఆ చిత్ర యూనిట్నే ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త నటుడు రఫీ కథానాయకుడిగా పరిచయమవుతూ హైటెక్ పిక్చర్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నేర్ముగం. మీరానందన్, మీనాక్షి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మిరండవన్ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీకృష్ణ కథ, కథనం, దర్శకత్వం బాధ్యత లు నిర్వహిస్తున్నారు. పాండియరాజన్, జిన్నా, సిజర్ మనోహర్, నెల్లై శివ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మానసికంగా వేదనకు గురైన మనుషుల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం నేర్ముగం అని తెలిపారు. అలాంటి ఏడు జంటలు అడవిలో పడే పాట్లే చిత్ర కథ అని చెప్పారు. వాళ్లలో ముఖ్య జంటగా హీరోహీరోయిన్లు రఫీ, మీనాక్షి నటిస్తున్నారని చెప్పారు. ఒక సందర్భంలో హీరో హీరోయిన్ను లిప్ టూ లిప్ ముద్దు పెట్టుకోవాల్సి వస్తుందని, ఆ విషయాన్ని నటి మీనాక్షికి చెప్పి ఆమె సమ్మతించేలా కన్వెన్స్ చేశామని అన్నారు. హీరో రఫీకి ఈ చుంభనం విషయం చెప్పగానే మీనాక్షితో లిప్‌లాకా? అంటూ బెదిరిపోయారని పేర్కొన్నారు. ఏదో నటనపై ఆశతో తానే నిర్మాతగా చిత్రాన్ని చేస్తున్నానని, పెళ్లి అయిన వాడికి ఈ లిప్‌లాక్ సన్నివేశాలు ఏంటని, ఈ విషయం తన భార్యకు తెలిస్తే విడాకుల వరకూ వెళుతుందని, అందుకే చచ్చినా చేయనని అన్నారని వివరించారు. చివరకు ఆ సన్నివేశాన్ని వేరే జంటతో చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు. యువతను, ప్రేమికుల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రంలో ప్రేమ, సెంటిమెంట్, హాస్యం, థ్రిల్లర్, యాక్షన్ ఉంటాయని తెలిపారు. -
రేప్ చేస్తారన్న భయంతో...
న్యూఢిల్లీ: ''ప్రేమే నేరమా ? మా అన్న, అగ్రవర్ణ యువతి ప్రేమించుకోవడం పాపమా ? అందుకు మేము బలి పశువులం అవుతున్నాం. 15 ఏళ్ల చెల్లిని, నన్నూ రేప్ చేయాల్సిందిగా మా ఊర్లో ఖాప్ పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఊరికి దూరంగా దిక్కులేని వాళ్లుగా మేమూ, మా కుటుంబం బతుకుతోంది. ప్రేమించిన పాపానికి.... మా అన్న చేయని నేరానికి అరెస్టై జైల్లో బతుకుతున్నాడు. మేము ఊరెళ్లాలంటే ఎక్కడ రేప్ చేస్తారేమోనని అణుక్షణం భయంతో చస్తున్నాం. ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయం మమ్మల్ని వెంటాడుతోంది. ఊరికెళితే మాకు రక్షణ లేదు. రేప్ చేసే మూకలు మా కోసం కాచుకు కూర్చున్నాయి. వారి కంటపడితే ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రేప్ చేస్తారు. వారి కట్టుబాటు, సంస్కారం అలాంటిది. ఇక్కడ మాత్రం గుర్తుతెలియని వ్యక్తుల్లా గుట్టు చప్పుడు కాకుండా ఎంతకాలం బతకాలి, ఎలా బతకాలి? మా పరిస్థితి, మా నరక యాతన గురించి ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి, మానవ హక్కుల కమిషన్‌కు, షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు లేఖలు రాశాం. ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు రక్షణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. కేసు విచారణలో ఉంది'' అని 23 ఏళ్ల మీనాక్షి కుమారి తన గోడును మీడియా ముందు వెల్లబోసుకుంది. ఆమెది దళిత కుటుంబం. వారిది ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పేట్ సమీపంలోని సంక్రోట్ గ్రామం. ఢిల్లీ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామంలో జాట్లు ఏడువేల మంది ఉండగా, దళితులు 250 మంది ఉన్నారు. మీనాక్షి అన్న 25 ఏళ్ల రవి కుమార్ రెండేళ్ల క్రితం జాట్ కులానికి చెందిన 21 ఏళ్ల కృష్ణ గాఢంగా ప్రేమించుకున్నారు. వారు పెళ్లి చేసుకుంటే జరగబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన రవి కుమార్ కుటుంబం అందుకు వారించింది. వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన రవి కుమార్ వేరే పెళ్లి చేసుకోవాల్సింది తాను ప్రేమించిన యువతి కృష్ణకు నచ్చచెప్పాడు. వారి ఇంట్లో వాళ్లు కూడా ఆమెను తీవ్రంగా హింసించారు. దాంతో ఆమె హర్యానా రాష్ట్రానికి చెందిన వారి కులస్థుడినే పెళ్లి చేసుకొంది. అతనితో కాపురం చేయలేక కొంతకాలానికి ఊరికి పారిపోయి వచ్చింది. పాత ప్రేమికులు మళ్లీ కలుసుకున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసిన జాట్ కులస్థులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోలీసుల చేత రవి కుమార్‌ను కొట్టించారు. మాదకద్రవ్యాల కేసులో ఇరికించి మీరట్ జైలుకు పంపించారు. ఊరిలో ఖాప్ పంచాయతీ సమావేశమై రవి కుమార్ ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేయాలని, వారి మొఖాలకు మసిపూసి నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పింది. అదృష్టవశాత్తు అదే సమయంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు మీనాక్షి కుటుంబ సభ్యులందరూ ఢిల్లీకి వచ్చి ఇక్కడే ఉన్నారు. మీనాక్షి పెద్దన్నయ్య సుమిత్ కుమార్ ఢిల్లీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఊరి నుంచి పొరుగింటి వారు ఫోన్ చేసి ఖాప్ పంచాయతీ తీర్మానం గురించి తెలిపారు. ఊరికి రావద్దని సలహా ఇచ్చారు. దాంతో సుమిత్ కుమార్ ఢిల్లీ శివారులో ఓ గుర్తు తెలియనిచోట కుటుంబ సభ్యులను ఉంచారు. మే నెలలో అరెస్టైన రవి కుమార్‌కు జూన్ 26వ తేదీన బెయిల్ వచ్చింది. బయటకు వస్తే ప్రాణాపాయం ఉండడంతో రవి కుమార్ బెయిల్‌పై విడుదల కాకుండా మీరట్ జైల్లోనే ఉంటున్నాడు. మీనాక్షి కుటుంబం రక్షణ కోసం న్యాయవాది రాహుల్ త్యాగి సుప్రీం కోర్టులో కేసు వాదిస్తున్నారు. ఖాప్ పంచాయతీలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ వాటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. రవికుమార్‌పై మోపిన అభియోగాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, అన్యాయంగా వ్యవహరించిన గ్రామ పెద్దలపై, యూపీ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని తాను కోరుతున్నానని చెప్పారు. దేశంలోని న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సుప్రీం కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. -
ఐటమ్ సాంగ్స్‌తో ప్లస్సే
ఇవాళ ఐటమ్‌సాంగ్ లేని చిత్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు ఇలాంటి పాటల కోసమే ప్రత్యేకంగా శృంగార తారలుండేవారు. అయితే ఇప్పుడా బాధ్యతను కూడా ప్రముఖ హీరోయిన్లే మోసేస్తున్నారు. నయనతార, శ్రుతిహాసన్, శ్రియ, ప్రియమణి, చార్మిలాంటి వాళ్లందరూ సింగిల్ సాంగ్‌కు ఆడేసిన వారే. దీంతో ఆయా చిత్రాలకు పిచ్చ పిచ్చగా ప్రచారం, తద్వారా ఆదాయం వచ్చింది. తాజాగా ఐటమ్‌సాంగ్ గర్ల్ లిస్టులో నటి మీనాక్షి చేరిపోయింది. కరుప్పుస్వామి గుత్తగైదార్ చిత్రం ద్వారా కరణ్‌కి జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ముంబయి బ్యూటీ మీనాక్షి. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయికి చేరలేకపోయింది. మూడేళ్లకు పైగా తమిళ తెరకు దూరమైన భామ తాజాగా మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. పస్తుతం రెండు చిత్రాల్లో హీరోయిన్‌గాను ఒక చిత్రంలో సింగిల్ సాంగ్‌కు నటిస్తోంది. దీని గురించి మీనాక్షి మాట్లాడుతూ, ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం సూదాడి చిత్రంలో పార్తీపన్‌కు జంటగా నటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్ నటించనున్నట్లు చెపింది. ఇటీవల ముంబయి వచ్చిన చిత్ర దర్శకుడు వెట్రిమారన్ సూదాడి చిత్ర కథ చెప్పి పార్తీపన్ సరసన నటించమని అడిగినట్లు తెలిపింది. పాత్ర నచ్చడంతో అంగీకరించానంది. చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చీర ధరించిన పాత్ర గ్లామరస్‌గా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభమై వచ్చే ఏడాది మధ్యలో విడుదలవుతుందని చెప్పింది. ఈ చిత్రంతోపాటు నందాకు జంటగా విళంగం చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పిం ది. ఇది నటనకు అవకాశం వున్న పాత్ర అంది. విక్రమ్ ప్రభు చిత్రంలో ఐటమ్‌సాంగ్ చేస్తున్న విషయం గురించి ప్రస్తావిం చగా అవును దర్శకుడు ఎళిల్ తన వెళ్లైక్కార దొరై చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ చేయమని అడిగాారని చెప్పిం ది. విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పరిచయ సన్నివేశంలో వచ్చే ఈ పాటకు దర్శకుడు వెంకట్‌ప్రభుతో కలసి నటించినట్లు వెల్లడించింది. హీరోయిన్గా నటిస్తూ ఐటమ్‌సాంగ్ చేస్తే ఇమేజ్‌కు భంగం వాటిల్లదా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఒక రకంగా ఐటమ్‌సాంగ్‌లో నటించడం వలన అధిక ప్రచారం జరిగి ప్లస్ అవుతుందనే అభిప్రాయాన్ని మీనాక్షి వ్యక్తం చేసింది. -
భయం పుట్టిస్తున్న ప్రేమ
తమిళ సినిమా, న్యూస్‌లైన్: ప్రేమ అంటే ఏహ్యభావం పుడుతుందేమోనన్న భయమేస్తోందని చెబుతోంది నటి నజ్రియా నజీమ్. గ్లామర్ పేరుతో జుగుప్సాకరమైన సన్నివేశాల చిత్రీకరణను ఖండిస్తూ సంచలన హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ మలయాళి కుట్టికి మంచి అవకాశాలు తలుపులు తడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్థం వరకు ఈ బ్యూటీ కాల్షీట్స్ డైరీ ఫుల్ అట. ప్రస్తుతం బాలాజీ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న నజ్రియా కొన్ని ప్రత్యేక విషయాలను వెల్లడించారు. అవేమిటో ఆమె నోటనే విందాం. అదృష్టం అంతా ఒకేసారి నన్ను వరించిందని చెప్పాలి. నేను తొమ్మిదో తరగతి వరకు దుబాయ్‌లో చదివాను. దుబాయ్‌లో నాకు ఎల్కేజీ నుంచే స్నేహితులున్నారు. ఇప్పుడు వాళ్లందరినీ మిస్ అవ్వడం బాధగా ఉంది. ఆ తరువాత తిరువనంతపురంలో చదివాను. అక్కడి పాఠశాలలో ఎన్నో కట్టుబాట్లు, రెండు జడలు వేసుకోవాలి. యూనిఫామ్ దుస్తులు ధరించా లి వంటి షరతులతో ఏమిటో జీవితం అని ఫీలైన సందర్భం లేకపోలేదు. అలాంటి సమయంలో ఆదిరై, పార్వతి, అనామిక, మీనాక్షి వంటి స్నేహితురాలు లభించడం సంతోషకరమైన విషయం. అప్పటి నుంచి పాఠశాల జీవితం ఆనందమయమనే చెప్పాలి. యువి అనే నా మ్యూజిక్ ఆల్బమ్ యూ ట్యూబ్‌లో ప్రేక్షకులను అలరించింది. తిరువనంతపురంలోని కళాశాలలో బి.కాం చదవడానికి సిద్ధమయ్యాను. అయితే ఆ కళాశాలలో అడ్మిషన్‌కు మాత్రమే వెళ్లాను. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పటికి ఎవరైనా అధ్యాపకులు తారస పడితే తప్పకుండా కళాశాలకు రమ్మని అంటుంటారు. నటి మీరానందన్, మేగ్నారాజ్ కలిస్తే ఊరు చుట్టేస్తాం. ఎక్కడ మంచి హోటల్ ఉంటే అక్కడ చేరిపోతాం. మేగ్నారాజ్ చికెన్ ఐటెమ్స్ బాగా లాగించేస్తోంది. మీరానందన్ రకరకాల దోసెలు ఆరగిస్తుంది. నాకు మాత్రం ఈ రెండూ ఇష్టమే. తమిళ చిత్రాలే ఎక్కువ నేను ఎక్కువగా చేస్తున్నది తమిళ చిత్రాలే. నేరం, రాజారాణి, నయ్యాండి చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి. తిరుమణం ఎన్నుమ్ నిక్కా చిత్రం త్వరలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నా కాల్షీట్స్ డైరీ పుల్ అయ్యింది. మరిన్ని నూతన అవకాశాలు వస్తున్నాయి. రాజారాణి చిత్రంలో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నటుడు ఆర్య ఎప్పుడే నవ్విస్తుంటారు. ఆర్య నా కిప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. నేనిప్పుడు సంపాదిస్తున్నానని అనవసరంగా ఏది పడితే అది కొనను. సినిమా రంగానికి రాకముందు నాకవసరం అయిన దాన్ని నాన్నే సమకూర్చేవారు. ఇప్పుడు కూడా ఏమి కావాలన్నా నాన్ననే అడుగుతా. నేను నటినైన తరువాత మంచి హ్యాండ్‌బ్యాగ్స్ ఖరీదైన సెల్ఫోన్లు కొనుక్కున్నాను. ఏ చిత్రం చూసినా ప్రేమ పాత్రలే. అయితే కథా కోణం మారుతుంది కాబట్టి అలాంటి పాత్రలు చేయడం నాకు బోర్ అనిపించడం లేదు. అయితే సినిమాల్లో ప్రేమించి, ప్రేమించి నిజ జీవితంలో ప్రేమ మీద ఏహ్యభావం కలుగుతుందేమోనన్న భయం మాత్రం కలుగుతోంది. ఎవరినైనా ప్రేమించాలనే కోరిక కలిగినా సినిమాల్లో అదే కథ చేస్తున్నాం, జీవితంలోనూ అది అవసరమా అనే భావం కలగకూడదుగా అంటోంది సంచలన నటి నజ్రియా. -
నవజాత శిశువుకు కామెర్లు... ఏం చేయాలి?
నాకు పదిరోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. మూడు కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది. పుట్టిన మూడో రోజున పాపకు జాండిస్ కనిపించింది. అదే తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. దీనికేమైనా ఆయుర్వేద మందులు అవసరమా? నాకు పాదాల మీద కొద్దిగా వాపులున్నాయి. వీటికి సరియైన సలహాలను సూచింప ప్రార్థన. -మీనాక్షి, బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాద్. జాండిస్‌ను ఆయుర్వేదంలో ‘కామల’ అంటారు. వాడక భాషలో పచ్చకామెర్లు అని అంటారు. నవజాత శిశువునకు పుట్టిన రెండో రోజుల తర్వాత వచ్చే కామలను ప్రాకృతంగానే పరిగణిస్తారు. కాలేయం క్రియాసామర్థ్యం పరిపక్వతకు చేరుకునే సమయంలో శిశువు బాహ్యవాతావరణానికి సర్దుబాటు కావలసిన పరిస్థితిలో కనిపించే తాత్కాలికమైన మార్పు మాత్రమే ఈ కామల. ఒకటి రెండు వారాల్లో క్రమేణా తగ్గిపోతుంది. ప్రత్యేకమైన మందులేమీ అవసరం లేదు. అదేగాని పుట్టిన 48 గంటలలోపు కామల కనబడితే దాన్ని వ్యాధిగా గుర్తించి పరీక్షలు జరిపి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని జన్మగత వైకల్యాలు కారణం కావచ్చు. ఉదాహరణకు, కాలేయం నుంచి ‘బైలురుబిన్’ బయటకు వచ్చే నాళం మూసుకుని ఉండటం లేదా అధికస్థాయిలో ఎర్రరక్తకణాల విధ్వంసం మొదలైనవి. కాబట్టి మీరేమీ గాబరా పడవద్దు. శిశువునకు మీ పాలను తాపిస్తూ ఉండటం, సాధారణంగా చేసే శిశురక్షణ ప్రక్రియలను పాటిస్తే సరిపోతుంది. ప్రసవమైన మూడు నాలుగు వారాల వరకు తల్లీబిడ్డలకు ఇన్ఫెక్షన్లు రాకుండా పరిశుభ్ర వాతావరణాన్ని పాటించడం అత్యవసరం. మీరుండే గదిలోనికి ఎవ్వరినీ రానీయవద్దు. తల్లి, వైద్యుడు, ధాత్రి (నర్సు) తప్ప ఇతరులెవ్వరూ శిశువుని తాకకుండా చూసుకోండి. సాధారణంగా ప్రసూతులలో (బాలింతలలో) కొంచెం రక్తహీనత ఉండవచ్చు. నడుంనొప్పి, పాదాలవద్ద కొద్దిగా వాపులు కొందరిలో కనిపించవచ్చు. మీరు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కఠోర పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. బయటి ఆహారం, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మొదలైనవి మంచివి కావు. తాజాగా వండిన వేడి ఆహారం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, తాజాఫలాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మంచిది. ప్రతిరోజూ ఉదయం బార్లీ నీళ్లు, ఆవు మజ్జిగ తాగండి. నువ్వులు, బెల్లం తినండి. రోజూ రెండు లీటర్ల ఆవుపాలు తాగితే మీకు స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది. ఆహారంలో అల్లం, వెల్లుల్లి, తగురీతిలో తినడం మంచిది. అదేపనిగా పడుకోకుండా కొంచెం శారీరక శ్రమ కలిగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. రెండుపూటలా ఐదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రసవానంతరం ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే ఈ కింద సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 బాలింత కాఢ నెం. 1 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి రెండు చెంచాలు రెండు వారాలు తాగండి. ఆ తర్వాత... బాలింత కాఢ నెం. 2 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి చెంచాలు రెండు వారాలు తాగండి. శిశువునకు : అరవిందాసవ (ద్రావకం): ఐదుచుక్కలు ఉదయం, ఐదు చుక్కలు సాయంత్రం తాగించాలి (తేనెతో). వీలుంటే శిశువుని (బట్టలు లేకుండా) ప్రభాత సూర్యకిరణాలలో ఐదునిమిషాలు ఉంచితే మంచిది. ‘బలాతైలం’తో శిశువునకు మృదువుగా అభ్యంగం చేసి, అనంతరం సున్నిపిండితో, వేడినీటి స్నానం చేయించండి. గమనిక : శిశువుతో శారీరకంగానూ, మానసికంగానూ చాలా సున్నితంగా, నాజూకుగా వ్యవహరించాలని ఆయుర్వేద ప్రాచీన శిశువైద్యనిపుణుడు ‘కశ్యపుడు’ స్పష్టీకరించాడు. కొంతమంది మంత్రసానులు, నాటువైద్యులు, శిశువుల కాళ్ళు, చేతులు అతిగా వంకరలు తిప్పుతూ వ్యాయామాలు చేయిస్తుంటారు. అది ప్రమాదకరమని గుర్తుంచుకోండి. అలాంటివి చేయించి శిశువును క్షోభకు గురిచేయవద్దు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
సర్వం కోల్పోయాను..నన్ను ఆదుకోండి: మాజీ కోచ్ మీనాక్షి
ముంబై: విధి వక్రిస్తే ఎంతటి వారైనా కూలబడక తప్పదు. కాలం కలిసిరాక పోతే ఎవరు ముందైనా అర్రులు చాస్తూ చేతులు కట్టుకు నిలబడాల్సిందే. ఇటువంటి విషాద గాథే మన మీనాక్షి విషయంలో జరిగింది. ఇంతకీ ఆమె ఎవరో అనామకురాలు మాత్రం కాదు. ఒకప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్ గా పని చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుత పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 2011లో అకస్మికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్తను కోల్పోవడమే కాకుండా, తన కాలికి కూడా తీవ్రంగా గాయకావడంతో ఉన్నతమైన ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది. ఉన్న తన సొంత ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బులు కూడా ఆమె వైద్య ఖర్చులకే సరిపోవడంతో ప్రస్తుతం పదేళ్ల కుమారుడితో 'ఒంటరి' గా పోరాడుతోంది. ఈ విషయాన్నిఆమె క్రీడల మంత్రి నారద్ రాయ్ దృష్టికి తీసుకు వచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీన మంత్రిని కలిసిన ఆమె తన ప్రస్తుతం పడుతున్న కష్టాలను కన్నీళ్ల రూపంలో వెళ్లగక్కింది.' నేను సర్వం కోల్పాయను. నా వద్ద తాకట్ట్టు పెట్టడానికి తల తప్ప ఇంకా ఏమీలేదు. నాకు ఉద్యోగం కల్పిస్తే, పదేళ్ల బాబుతో జీవితాన్ని గడపడానికి దారి చూపించిన వారవుతారు' అని అభ్యర్థించింది. క్రీడాశాఖా మంత్రి ఉద్యోగ భరోసా కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఒకవేళ ఎస్ఏఐలో రెండోసారి కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తే.. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని పేర్కొంది.