సుమంత్ హీరోగా వస్తోన్న కొత్త మూవీ.. గ్లింప్స్ అదుర్స్! | Sumanth and Meenakshi MAHENDRAGIRI VARAHI Movie First Glimpse | Sakshi
Sakshi News home page

Mahendragiri Varahi Movie: సుమంత్ హీరోగా మహేంద్రగిరి వారాహి.. గ్లింప్స్ అదుర్స్!

Published Mon, Nov 27 2023 7:15 PM | Last Updated on Mon, Nov 27 2023 8:02 PM

Sumanth and Meenakshi MAHENDRAGIRI VARAHI Movie First Glimpse - Sakshi

సుమంత్ , మీనాక్షి గోసామి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై  కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ  గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. 

క్రిష్ మాట్లాడుతూ...'మహేంద్రగిరి వారాహి టైటిల్ బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యే కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నా' అని అన్నారు.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement