హీరో ధనుష్‌పై మరో పిటిషన్‌ | Madurai‍ couple another case filed against hero dhanush | Sakshi
Sakshi News home page

హీరో ధనుష్‌పై మరో పిటిషన్‌

Published Mon, Apr 3 2017 7:50 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

హీరో ధనుష్‌పై మరో పిటిషన్‌

హీరో ధనుష్‌పై మరో పిటిషన్‌

చెన్నై: తమిళ హీరో ధనుష్‌ను కోర్టు పిటిషన్లు వెంటాడుతున్నాయి. ధనుష్‌ తమ కుమారుడు అంటూ మధురై మేలూర్‌కు చెందిన కదిరేశన్‌–మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనుష్‌ ఒంటిపై పుట్టుమచ్చలను లేజర్‌ చికిత్స ద్వారా చెరిపివేశారని, ఇందుకు కొన్ని ఆధారాలను ప్రభుత్వ వైద్యులు కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.

తాజాగా సోమవారం కదిరేశన్‌ దంపతుల న్యాయవాది మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో నటుడు ధనుష్‌ వేసిన రిట్‌ పిటిషన్‌లో ఆయన సంతకం నకిలీదని, సంతకం నకలును తమకు అందించాల్సిందిగా మధురై కోర్టును కోరారు. దీనిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా ధనుష్‌ పుట్టుమచ్చలను లేజర్‌ టెక్నాలజీతో పుచ్చుమచ్చలు తొలగించుకున్నారని ప్రభుత్వ వైద్యుల బృందం కోర్టుకు ఓ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

ఈ  కేసు ఏప్రిల్‌ 11న విచారణకు రానుంది. వైద్యుల నివేదికపై న్యాయస్థానం ఏం తీర్పు వెల్లడించనుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ధనుష్‌పై మరోకేసు నమోదు కావడంతో కేసుల పరంపరతో అతడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement