హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఉన్న మీనాక్షి ఎనర్జీని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేసేందుకు వేదాంత తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ నుంచి ఆమోదం పొందింది.
రుణ భారంతో ఉన్న మీనాక్షి ఎనర్జీని విక్రయించడానికి పిలిచిన టెండర్లలో విజయవంతమైన బిడ్డర్‌గా వేదాంతను ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో మీనాక్షి ఎనర్జీకి 1,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఉంది.
ఈ పవర్ ప్లాంట్‌ను స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిర్వహించాలని వేదాంత యోచిస్తోంది. అలాగే వినియోగదారులతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. కొనుగోలు ప్రక్రియలో భాగంగా రుణదాతలకు ముందస్తుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment