సాక్షి, మహబూబాబాద్: మానుకోట కాంగ్రెస్ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. రాష్ట్ర పరిశీకురాలు మీనాక్షి నటరాజన్ ముందే కుర్చీల కోసం కొట్లాడుకున్నారు. అందరినీ సభావేదికపైకి పిలవా లని డిమాండ్ చేశారు. ఈ నెల 17న హైదరా బాద్‌లో జరిగే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ నిమిత్తం మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలోని ముఖ్యనాయకుల సమావేశం గురువారం మహబూబాబాద్‌లో జరిగింది.
ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇల్లెందు నుంచి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్, బెల్లయ్యనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చంద్రా రెడ్డిని పిలవాలని అనుకున్నారు. అయితే, అక్కడు న్న చిన్నాచితకా నాయకులు కూడా వేదికపైకి వచ్చి కూర్చోవడంతో కుర్చీలన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో ముందుగా పీసీసీ ఉపాధ్యక్షుడు విజయ రమణారావు మాట్లాడుతుండగా ‘అందరూ వేదిక పై ఉన్నారు.
మా నేత మురళీనాయక్‌ను కూడా పిలవాలి, లేకపోతే అర్హత లేని వారిని కిందికి దింపాలి’అంటూ పలువురు కేకలు వేశారు. ఈ క్రమంలో మురళీ నాయక్, బలరాంనాయక్ వర్గాల కార్యక ర్తలు ఒకరినొకరు గల్లాలు పట్టుకుని తోసుకున్నారు. ఇరువర్గాల నినాదాలతో సభాస్థలి దద్దరిలింది. మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకొని విజ్ఞప్తి చేయ డంతో వేదికపై ఉన్న అందరూ కిందికి దిగారు. ఆ తర్వాత ఆమె ముఖ్యులతో మాట్లాడించారు.
Comments
Please login to add a commentAdd a comment