
సాక్షి, హైదరాబాద్: అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు.. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?. అక్కడ గొడవలు ఏం జరగలేదు ?.. మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది?. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?. ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్షల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన. ఖబర్దార్ రేవంత్. ఇది తెలంగాణ.. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.
ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?
అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?
అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ?
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ?
ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది… pic.twitter.com/nCrAPSi05v— KTR (@KTRBRS) November 21, 2024
మరో ట్వీట్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానం అంటూ కామెంట్స్ చేశారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రేవంత్.. మూసీలో అదానీ వాటా ఎంత?: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment