రేవంత్‌.. మూసీలో అదానీ వాటా ఎంత?: కేటీఆర్‌ | BRS KTR Sensational Comments Over Adani And Congress-BJP | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. మూసీలో అదానీ వాటా ఎంత?: కేటీఆర్‌

Nov 21 2024 12:44 PM | Updated on Nov 21 2024 12:44 PM

BRS KTR Sensational Comments Over Adani And Congress-BJP

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇదే సమయంలో అదానీతో కాంగ్రెస్‌, బీజేపీ అనుబంధం దేశానికే అవమానం అంటూ కామెంట్స్‌ చేశారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి, ‍బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు. అదానీతో కాంగ్రెస్-బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం.. అరిష్టం.  
రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో!
ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు!
తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి!
మీరు అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి!

తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో 
మీ భడే భాయ్ వాటాఎంత?
మీ అదానీ భాయ్ వాటా ఎంత? 
మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement