Manukonda
-
రేవంత్...ఖబర్దార్: కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు.. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?. అక్కడ గొడవలు ఏం జరగలేదు ?.. మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది?. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?. ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్షల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన. ఖబర్దార్ రేవంత్. ఇది తెలంగాణ.. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ?శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ?ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది… pic.twitter.com/nCrAPSi05v— KTR (@KTRBRS) November 21, 2024మరో ట్వీట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానం అంటూ కామెంట్స్ చేశారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: రేవంత్.. మూసీలో అదానీ వాటా ఎంత?: కేటీఆర్ -
చందమామలా మెరిసిపోతున్న నటి ప్రణవి మానుకొండ (ఫోటోలు)
-
కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు
డోర్నకల్/వరంగల్: ప్రభుత్వ నర్సరీ ఏర్పాటు కోసం ఖబ్రస్థాన్ను ఆక్రమించారని ఆరోపిస్తూ డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన పలువురు ముస్లింలు మానుకోట జిల్లా కలెక్టర్ గౌతమ్ వాహనాన్ని అడ్డగించారు. వివరాలిలా ఉన్నాయి. అమ్మపాలెంలో ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్ బుధవారం పరిశీలించేందుకు వచ్చారు. పరిశీలన అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా ఎస్కె మునీర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలెక్టర్ వాహనాన్ని అడ్డగించారు. 21 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 571లోని 1.20 ఎకరాల బంచరాయి భూమిని ఖబ్రస్థాన్ కోసం కేటాయించారని మునీర్ తదితరులు తెలిపారు. ఆ స్థలంలో 20 మంది ముస్లింల సమాదులు ఉండగా.. ఇటీవల నర్సరీ ఏర్పాటు కోసం వాటిని తొలగించి ఆక్రమించారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి ఖబ్రస్థాన్ స్థలాన్ని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. -
ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
అల్గునూర్(మానకొండూర్) : మొదటిసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల కోసం తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి, వాగేశ్వరి, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించిన అగ్రికల్చర్ పరీక్షకు 3,502 మందికి 3296 మంది హాజరయ్యారు. ఉదయం వాగేశ్వరి కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 750 మందికి 710 మంది, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో 352 మందికి 328 మంది, జ్యోతిష్మతి కళాశాలలో 150 మందికి 135 మంది, శ్రీచైతన్య ఇంజినీరింగ్–1లో 350 మందికి 331 మంది, శ్రీచైతన్య–2లో 149 మందికి 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం వాగేశ్వరి అయాన్ డిజిటల్ సెంటర్లో 750 మందికి 712 మంది, ఇంజినీరింగ్ కళాశాలలో 350 మందికి 333, జ్యోతిష్మతిలో 150 మందికి 138, శ్రీచైతన్య–1లో 349 మందికి 325, శ్రీచైతన్య–2లో 150 మందికి 137 మంది హాజరయ్యారని పరీక్షల నిర్వాహకులు తెలిపారు. కాగా ఉదయం వాగేశ్వరి కేంద్రానికి వేములవాడకు చెందిన తిప్పారపు వెన్నెల 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో నిమిషం నిబంధన కింద అధికారులు ఆమెను అనుమతించలేదు. బయోమెట్రిక్‌తో హాజరు నమోదు విద్యార్థులందరికీ బయోమెట్రిక్‌తో హాజరు నమోదు చేశారు. నూతన విధానంలో నిర్వహిస్తున్న పరీక్షతో విద్యార్థులు మొదట కొంత ఆందోళన చెందినా..ఆ తర్వాత అంతా సర్దుకుంది. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను రెండు గంటల ముందే అనుమతించడంతో పరీక్షలు ప్రశాంతంగా రాశారు. హాల్‌టికెట్లపై గెజిటెడ్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల ఇన్‌చార్జిలే సంతకాలు చేయించి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గతంలో అల్గునూర్ చౌరస్తాలో ట్రాఫిక్ కారణంగా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు ఇన్చార్జిగా మానకొండూర్ సీఐ కోటేశ్వర్‌ను నియమించగా, ఎస్సైలు నరేశ్‌రెడ్డి, పల్లె నర్సింగ్ పర్యవేక్షించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాగేశ్వరి కళాశాల సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్‌రెడ్డి టెంట్లు కూడా ఏర్పాటు చేయించి తాగునీటి వసతి కల్పించారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు -
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
మనుకొండ(భామిని): మండలంలోని తివ్వ కొండ పరిసరాల్లో గల మనుమకొండ గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులను ఐటీడీఏ పీవో నటుకుల సత్యనారాయణ సస్పెండ్ చేశారు. మంగళవారం రాత్రి ఆ పాఠశాలను పీవో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆ సమయంలో పాఠశాలలో విధుల్లో ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.నారాయణరావుతో పాటు ఉపాధ్యాయులు దిలీప్‌కుమార్, భువనేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన మండిపడ్డారు. వెంటనే ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి ఐటీడీఏ డీడీకి ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న ఆశ్రమ పాఠశాల కుక్ శ్రీనివాసరావు నుంచి మెనూ వివరాలను తెలుసుకున్నారు. బోధనా విషయాలపై నిశితంగా పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరు అయిన ముగ్గురు ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.