ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్ | suspension of Three teachers | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

Published Wed, Aug 13 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

suspension of Three teachers

 మనుకొండ(భామిని): మండలంలోని తివ్వ కొండ పరిసరాల్లో గల మనుమకొండ గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులను ఐటీడీఏ పీవో నటుకుల సత్యనారాయణ సస్పెండ్ చేశారు.  మంగళవారం రాత్రి  ఆ పాఠశాలను పీవో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆ సమయంలో పాఠశాలలో విధుల్లో ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.నారాయణరావుతో పాటు  ఉపాధ్యాయులు దిలీప్‌కుమార్, భువనేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన మండిపడ్డారు. వెంటనే ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి ఐటీడీఏ డీడీకి ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న ఆశ్రమ పాఠశాల కుక్ శ్రీనివాసరావు నుంచి మెనూ వివరాలను తెలుసుకున్నారు. బోధనా విషయాలపై నిశితంగా పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరు అయిన ముగ్గురు ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement