
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ కంటే ముందే నాయకులు బాహాబాహీకి దిగారు. ముస్తాబాద్ మండలం నుంచి ఉమేష్ రావు వర్గం కొంతమందిని జాయిన్ చేసుకునేందుకు తీసుకువచ్చింది. తాను మండలాధ్యక్షుడిగా ఉండగా తమకే తెలియకుండా ఎలా జాయిన్ చేసుకుంటారంటూ బాల్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ చీటి ఉమేశ్ రావు, సంగీతం శ్రీనివాస్ వర్గాల పేరిట రెండు వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ నాయకులు.. కుర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గందరగోళంగా మారింది.
ఇదీ చదవండి: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా?
Comments
Please login to add a commentAdd a comment