constituency coordinators
-
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. రాష్ట్రంలోని రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా మొదలైన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాల్లో మే 5 నుండి 7 వరకు డ్రై డేగా ప్రకటించారు. అంటే ఈ రెండు రోజూలూ ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో మద్యం విక్రయాలు ఉండవు. డ్రై డేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఓటింగ్‌కు 48 గంటల ముందు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. అంతే కాదు మద్యం రవాణాను కూడా నిషేధించారు. ఈ సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 5 నుండి మే 7 వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు కిలోమీటర్ల పరిధిలోగల అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎవరైనా మద్యం దుకాణాన్ని తెరిచి, విక్రయాలు సాగిస్తున్నారని తేలితే సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
ఆ లోక్‌సభ సీటులో విజయం.. కేంద్రంలో అధికారం?
దేశ రాజధాని ఢిల్లీలోని ఆ లోక్‌సభ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారో వారే కేంద్రంలో అధికారం చేపడతారట. కొన్నాళ్లుగా ఇలానే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ ఈ స్థానం. 2009 పార్లమెంట్ ఎన్నికలకు కొంతకాలం ముందు ఈ సీటు ఉనికిలోకి వచ్చింది. ఈ స్థానంపై ఇప్పటి వరకు మూడు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో ఎన్నికలకు ఈ స్థానం ఎదురు చూస్తోంది. ఈ సీటుకు సంబంధించిన అత్యంత విశేషమేమిటంటే ఈ సీటును గెలుచుకున్న పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. 2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2014, 2019లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను నిలబెట్టడంతో ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. అయితే ఈసారి బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కమల్జిత్ సెహ్రావత్, కాంగ్రెస్ మద్దతు కలిగిన ఆప్ నేత మహాబల్ మిశ్రా మధ్య గట్టిపోటీ నెలకొంది. 2014లో ఆప్ రెండో స్థానంలో ఉండగా, 2019లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని బీజేపీ రెండుసార్లు సొంతం చేసుకుంది. 2014లో బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ 2.68 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన అత్యధికంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి బీజేపీ వర్మకు టికెట్ కేటాయించలేదు. బీజేపీకి చెందిన సెహ్రావత్‌కు ఇవి మొదటి లోక్‌సభ ఎన్నికలు. ఒకవేళ సెహ్రావత్ ఎన్నికైతే ఆమె ఈ స్థానానికి తొలి మహిళా ఎంపీ అవుతారు. పశ్చిమ ఢిల్లీ 24.88 లక్షల మంది ఓటర్లు కలిగిన అతిపెద్ద లోక్‌సభ స్థానం. దేశ రాజధాని ఓటర్లలో ఇది దాదాపు 17 శాతం. ఇందులో 13.27 లక్షల మంది పురుషులు, 11.61 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానం కూడా ఇదే. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో పది అసెంబ్లీ స్థానాలున్నాయి. -
వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డిని అనంతపురం, హిందూపురం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అదనంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ డిప్యూటీ రీజినల్ కో–ఆర్డినేటర్‌గా టీజేఆర్ సుధాకర్ బాబును నియమించినట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
వైఎస్సార్సీపీ ఆరో జాబితా విడుదల
గుంటూరు, సాక్షి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో.. పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది. మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. ఆరో జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది వైఎస్సార్సీపీ అధిష్టానం. ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా.. 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్పులు జరిగాయి. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 10 స్థానాలకు(4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్ సీపీ 6వ జాబితా విడుదల... నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబందించి జాబితాను మంత్రి మేరుగ నాగార్జున,సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు.#YSJaganAgain#Siddham pic.twitter.com/asgTtiOE18 — YSR Congress Party (@YSRCParty) February 2, 2024 వై నాట్ 175 నినాదంతో.. ప్రజలకు జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని.. రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వైఎస్సార్సీపీ తొలి జాబితా ఇదే వైఎస్సార్సీపీ రెండో జాబితా ఇదే! ఉత్తరాంధ్రలో ఆ ఇద్దరికీ.. అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డిని, అలాగే.. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, అసెంబ్లీ నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియమించింది వైఎస్సార్సీపీ. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ మూడో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ నాలుగో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ ఐదో జాబితా ఇదే! -
జన బలమే గీటురాయి..
సాక్షి, అమరావతి: నిరంతరం ప్రజాక్షేత్రంలో గడుపుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మనసులకు మరింత చేరువైన నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. సామాజిక న్యాయంలో మరో అడుగు ముందుకేశారు. బీసీలు, మహిళలకు ప్రాధాన్యమిస్తూ సామాజిక సాధికార ఛాంపియన్ అని మరోసారి రుజువు చేసుకున్నారు. మహిళలు, యువతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ 24 శాసనసభ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో జాబితాను ఖరారు చేశారు. గతంలో అగ్రవర్ణాలకు అవకాశం కల్పించిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో తాజాగా ఐదు చోట్ల బీసీలను సమన్వయకర్తలుగా నియమించడం గమనార్హం. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11వతేదీన 11 శాసనసభ స్థానాలకు నూతన సమన్వయకర్తలను ప్రకటిస్తూ వైఎస్సార్ సీపీ మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు జాబితాల్లో కలిపి మొత్తం 35 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. ► కురుబ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణను అనంతపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జోలదరాశి శాంత హిందూపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించగా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి,, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీచరణ్‌ను పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీలు, మైనార్టీలకు పెద్దపీట.. రెండు దఫాల్లో ప్రకటించిన 35 శాసనసభ స్థానాల సమన్వయకర్తల జాబితాను పరిశీలిస్తే సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీకి పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీలకు, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించడం గమనార్హం. ఇక ఐదు శాసనసభ స్థానాలకు మహిళలను సమన్వయకర్తలుగా నియమించారు. పది స్థానాల్లో యువతీ యువకులకు సమన్వయకర్తలుగా అవకాశం కల్పించారు. మొత్తమ్మీద 35 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు 9 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 11 మంది, మైనార్టీలు ముగ్గురు, అగ్రవర్ణాలు 9 మంది (రెడ్డి, కాపు, వైశ్య) చొప్పున ఉన్నారు. 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా గత 55 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, చరిత్ర ఎరుగని విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్ జనరంజక పరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ)తో రూ.2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందగా అందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం గమనార్హం. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో తీసుకొచ్చిన మార్పులు కళ్లెదుట కనిపిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించడం సాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. చేసిన మంచిని ప్రజలకు చెప్పి వారితో మమేకమై మరింత మేలు చేయడానికి ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజలతో మమేకం కాకుండా వారి మనసులు చూరగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం జగన్ తేల్చి చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా అవసరమైన చోట్ల నూతన సమన్వయకర్తలను నియమిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా జాబితా మీడియాతో బొత్స, సజ్జల సామాజిక సమీకరణాలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాను రూపొందించామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నూతన ఇన్ఛార్జీల జాబితాను విడుదల చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మండల, నియోజకవర్గ నేతలతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తర్వాతే జాబితాను విడుదల చేశామన్నారు. గెలుపే ప్రామాణికంగా 27 మంది ఇన్‌ఛార్జీలతో రెండో జాబితాను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ జాబితాను సీఎం జగన్ ఖరారు చేసినట్లు చెప్పారు. సామాజిక సమీకరణాలు, ప్రజల ఆదరాభిమానాలు, అంతిమంగా పార్టీ గెలుపే లక్ష్యంగా జాబితాను రూపొందించామన్నారు. భారీ విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం తన శ్రేణుల్లో తొణికిసలాడుతుండగా ప్రతిపక్షంలో పూర్తి అయోమయ వాతావరణం నెలకొందన్నారు. పొత్తులు తేల్చుకోలేక, సీట్ల పంపిణీ చిక్కుముడులు వీడక, నియోజకవర్గాల్లో అభ్యర్ధులే లేక విపక్షాలు నిరాశలో కొట్టు మిట్టాడుతున్నాయన్నారు. ఇవాళ విడుదల చేసిన జాబితాలో అవకాశాలు దక్కని వారి సేవలను పార్టీపరంగానూ, ఇతరత్రా వినియోగించుకుంటామని చెప్పారు. పార్టీ అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందన్నారు.175 స్ధానాల్లో గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, ఆ దిశగానే ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. -
సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస.. కుర్చీలతో పరస్పర దాడులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ కంటే ముందే నాయకులు బాహాబాహీకి దిగారు. ముస్తాబాద్ మండలం నుంచి ఉమేష్ రావు వర్గం కొంతమందిని జాయిన్ చేసుకునేందుకు తీసుకువచ్చింది. తాను మండలాధ్యక్షుడిగా ఉండగా తమకే తెలియకుండా ఎలా జాయిన్ చేసుకుంటారంటూ బాల్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ చీటి ఉమేశ్ రావు, సంగీతం శ్రీనివాస్ వర్గాల పేరిట రెండు వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ నాయకులు.. కుర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గందరగోళంగా మారింది. ఇదీ చదవండి: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా? -
సవితమ్మపై అసహనం.. ఓవరాక్షన్ చేస్తే దెబ్బలు తింటారు.. బీకే మౌనం!
పెనుకొండ (సత్యసాయి జిల్లా): జిల్లా టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. బీకే పార్థసారథి అల్లుడు, కర్ణాటకకు చెందిన శశిభూషణ్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా మంది అగ్ర నాయకులు పార్టీకి దూరమయ్యారు. తాజాగా ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఓ పార్టీకి జిల్లా అధ్యక్షుడు అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వర్గపోరుకు ఆజ్యం పోస్తూ కింది స్థాయి కార్యకర్తలు ప్రత్యక్షంగా ఆయనపై నోరు పారేసుకునే దుస్థితి నెలకొంది. మరో వైపు ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న మడకశిర నియోజకవర్గంలో అగ్రవర్ణాల అధిపత్యాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకలాపాలకు దళితులు దూరమయ్యారు. ఇందుకు బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుక వేదికగా మారింది. రెండ్రోజుల క్రితం పరిగిలో.. నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులకు చేరుకున్న నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్రలను బీకే పార్థసారథి చేపట్టారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం పరిగి మండలం బీర లింగేశ్వరాలయం నుంచి పైడేటి వరకూ సాగిన పాదయాత్రకు సవితమ్మ వర్గీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ విషయం గిట్టని బీకే... తన పక్కనే నడుస్తున్న సవితమ్మపై అసహనానికి గురయ్యారు. విషయాన్ని గుర్తించిన సవితమ్మ ప్రధాన అనుచరుడు వెంటనే బీకేపై రెచ్చిపోయాడు. ప్రధాన నాయకుడిని ఉద్దేశించి ఓవరాక్షన్ చేస్తే దెబ్బలు తింటారని హెచ్చరించాడు. నీ చేత ఏమీ కాదంటూ సవాల్ విసిరాడు. భారీ ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తల మధ్య అలా మాట్లాడడంతో బీకే మౌనం వహించి, తలదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మడకశిర: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర వేదికగా బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా స్థాయి నాయకులందరూ పాల్గొన్న ఈ వేడులకు అందరూ ఊహించినట్లుగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన వర్గీయులు దూరంగా ఉన్నారు. దళితులను కాదని.. మడకశిర నియోజకవర్గంలో ఈరన్నకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్గా టీడీపీ అధిష్టానం ఆయనను నియమించింది. ఆ సమయంలో పార్టీ పటిష్టతకు ఆయన శ్రమించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈరన్నను తొలగిస్తూ పార్టీ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి అప్పగించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఈరన్నకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రతి అంశంలోనూ ఈరన్న ఎదుగుదలను పూర్తి స్థాయిలో అణచివేశారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ముద్రించిన కరపత్రాల్లో దళిత నాయకుల పేర్లు లేకపోవడంపై ఈరన్న, ఆయన వర్గీయులు అసహనానికి గురయ్యారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేని, దళిత నేతలను అవమానించేలా వారి పేర్లు లేకుండా కరపత్రాల ముద్రణ కాస్త వివాదాస్పదమైంది. దీంతో టీడీపీకి దళితుల అవసరం తీరిపోయిందని, గుండుమల గుత్తాధిపత్యం కింద తాము ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయలేమంటూ శతజయంతి వేడుకలకు దళిత నాయకులు మూకుమ్మడిగా దూరమైనట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఈరన్న లేని లోటు ఈ ఉత్సవాల్లో స్పష్టంగా కనబడింది. సోషల్ మీడియా వేదికగా వర్గపోరు బీకే, సవితమ్మ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. సామాజిక మాధ్యమాలు వేదికగా రోజూ ఒకరిపై ఒకరు పోస్టింగ్‌లు చేస్తుండడం చర్చానీయాంశమయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు వర్గాలు ప్రత్యక్ష దాడులకు తెగబడడం ఖాయమని ఆ పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు బహిరంగంగానే పేర్కొంటున్నారు. -
ఏపీ టీడీపీ: సర్దుకుంటున్న సీనియర్లు..!
సాక్షి, అమరావతి: ప్రజాదరణ కోల్పోయి సోషల్ మీడియా, అనుకూల మీడియాకు పరిమితమైన టీడీపీ నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది. వరుసగా ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ సీనియర్ నాయకులు చాలావరకూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటలు బీటలు వారడంతో నాయకుల్లో తీవ్ర నైరాశ్యం, అభద్రతా భావం నెలకొంది. తిరుపతి ఉప ఎన్నికలో సైతం ఓటమితో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జూమ్, సోషల్ మీడియాలో హడావుడి చేయడమే కానీ తమ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని పలువురు టీడీపీ నేతలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేసిన సీనియర్లు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ముఖ్య నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. పార్టీ బాధ్యతలను మోసేందుకు మాజీ మంత్రులు ఎవరూ ముందుకు రాకపోవడంతో జూనియర్లు, బయట పార్టీల నుంచి వచ్చిన వారిని పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల్ని ఇటీవల ప్రకటించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు లాంటి సీనియర్ నాయకులు చేతులెత్తేయడంతో వీరాంజనేయులుకు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ, గుంటూరు పార్లమెంటు జిల్లాలకు నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్‌కుమార్‌లను అధ్యక్షులుగా చేశారు. నెట్టెం రఘురాం చాలా ఏళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత ఉదయభానుని ఢీకొట్టే సత్తాలేక కాంగ్రెస్ నుంచి శ్రీరాం తాతయ్యను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అప్పగించారు. గుంటూరులో పత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్ లాంటి చాలామంది సీనియర్లున్నా శ్రావణ్‌కి బాధ్యతలు ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు అన్ని పార్లమెంటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల్లో కానరాని నేతలు.. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిల వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. దాదాపు 100కిపైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు చురుగ్గా లేరని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఏ కార్యక్రమం తలపెట్టినా స్పందన లేదని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. చాలామంది ఇన్‌ఛార్జిలు నియోజకవర్గాల్లో క్యాడర్‌కే అందుబాటులో లేరు. పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్లు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి ఎవరో ఇంతవరకూ స్పష్టత లేదు. నూజివీడు, గన్నవరం, పామర్రు, ఏలూరు, పోలవరం లాంటి పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. -
వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్తల నియామకం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలను నియమించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ కింద పేర్కొన్న నేతలను సమన్వయకర్తలుగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా: 1. ప్రత్తిపాడు నియోజకవర్గం : పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ 2. జగ్గంపేట నియోజకవర్గం : ముత్యాల శ్రీనివాస్ 3. అమలాపురం నియోజకవర్గం : పినిపె విశ్వరూప్ 4. రాజమండ్రి సిటీ నియోజకవర్గం : రౌతు సూర్యప్రకాశరావు 5. ముమ్మడివరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుత్తల సాయితో పాటు పితాని బాలకృష్ణను అదనపు సమన్వయకర్తగా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా: 6. పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా మేకా శేషుబాబు (ఎమ్మెల్సీ)తో పాటు గున్నం నాగబాబును నియోజకవర్గపు అదనపు సమన్వయకర్తగా నియమించారు. కృష్ణా జిల్లా: 7. విజయవాడ (వెస్ట్) నియోజకవర్గం : షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ 8. విజయవాడ (ఈస్ట్) నియోజకవర్గం : బొప్పన బావకుమార్, కార్పొరేటర్ ప్రకాశం జిల్లా: 9. గిద్దలూరు నియోజకవర్గం : ఇల్లూరి వెంకటేశ్వరరెడ్డి (ఐ.వి.రెడ్డి) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: 10. గుడూరు నియోజకవర్గం : మేరిగ మురళీధర్ కర్నూలు జిల్లా: 11. ఆళ్ళగడ్డ నియోజకవర్గం : డా.రామలింగారెడ్డి 12. శ్రీశైలం నియోజకవర్గం : బుడ్డా శేషురెడ్డి