గుంటూరు, సాక్షి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో.. పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది. మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. ఆరో జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది వైఎస్సార్‌సీపీ అధిష్టానం.
ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా.. 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్పులు జరిగాయి. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 10 స్థానాలకు(4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.
వైఎస్సార్ సీపీ 6వ జాబితా విడుదల...
— YSR Congress Party (@YSRCParty) February 2, 2024
నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబందించి జాబితాను మంత్రి మేరుగ నాగార్జున,సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు.#YSJaganAgain#Siddham pic.twitter.com/asgTtiOE18
వై నాట్ 175 నినాదంతో.. ప్రజలకు జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని.. రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
వైఎస్సార్‌సీపీ తొలి జాబితా ఇదే
వైఎస్సార్‌సీపీ రెండో జాబితా ఇదే!
ఉత్తరాంధ్రలో ఆ ఇద్దరికీ..
అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డిని, అలాగే.. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, అసెంబ్లీ నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియమించింది వైఎస్సార్‌సీపీ.
‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ మూడో జాబితా ఇదే!
Comments
Please login to add a commentAdd a comment