
దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, ఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను ఏఐసీసీ ప్రకటించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు.
హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లను ఏఐసీసీ నియమించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లకు కొత్త జనరల్ సెకట్రరీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.