natarajan
-
టీ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. మీనాక్షి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవులపై కసరత్తు ప్రారంభించిన మీనాక్షి.. పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూపు, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూపు, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారని మూడో గ్రూప్‌గా విభజించారు.పార్టీ పదవులు.. నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పదేళ్లు పార్టీలో ఉన్నవారి లిస్ట్ కోరిన ఇన్చార్జ్ మీనాక్షి. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది.కాగా, రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ పనితీరుపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిన్న(మంగళవారం) మెదక్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశమయ్యారు. ఇవాళ ఆదిలాబాద్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ మీనాక్షి నటరాజన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. -
గాంధీభవన్ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్ష
-
ఎవరు నటిస్తున్నారో తెలుసు.. మీనాక్షి మరో వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మరోసారి హెచ్చరించారు. పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు.లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా మంగళవారం గాందీభవన్‌లో మెదక్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశయిన సంగతి తెలిసిందే. పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని, గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని, పదేళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపిస్తే సరిపోదని, ప్రజల మధ్యలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. -
ప్రక్షాళన మొదలు.. ఆ నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. ఆమె నేటి నుంచి రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేపట్టారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు.పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని చెప్పిన మీనాక్షి.. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్ వల్లే సమస్యలు వస్తే.. పదవి నుంచి తొలగిస్తామంటూ ఆమె ఖరాఖండిగా చెప్పేశారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారన్న కాట శ్రీనివాస్ గౌడ్.. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా.. ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ ఇంఛార్జ్‌ని కాట కోరారు.అధికారులు తమ మాట వినడం లేదన్న మరి కొందరు నేతలు.. ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తాన్నారంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందంటూ మీనాక్షి నటరాజన్‌కు పలువురు నేతలు చెప్పారు. -
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
సాక్షి, ఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను ఏఐసీసీ ప్రకటించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు.హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లను ఏఐసీసీ నియమించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లకు కొత్త జనరల్ సెకట్రరీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. -
Natarajan: సంగీతానికి ఇన్స్ట్రుమెంట్ ఈ కుటుంబం..
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్‌లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్‌ని అందివ్వడానికి!నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.పేపర్ మిల్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్‌కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.‘నేటి స్ట్రెస్ఫుల్ లైఫ్‌కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ -
ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో రిలీజైన తెలుగు సినిమా
ఓటీటీల వల్ల సినిమాలు చూడటం అనేది బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే మొబైల్స్‌లోనే ఎక్కువగా మూవీస్ చూస్తున్నారు. వీటిలో స్ట్రెయిట్ చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్ మూవీని ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం)కొన్ని రోజుల క్రితం విజయ్ సేతుపతి 'మహారాజ' థియేటర్లలో రిలీజైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా వచ్చేసింది. ఇదే మూవీలో పోలీస్ అధికారిగా చేసిన నటరాజన్ సుబ్రమణియమ్ అనే నటుడు.. స్వతహాగా సినిమాటోగ్రాఫర్. అప్పుడప్పుడు హీరోగా కూడా పలు సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిన మూవీనే 'ఇన్ఫినిటీ'.గతేడాది తమిళంలో రిలీజైన ఈ సినిమా రివ్యూలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ని నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసి పడేశారు. బహుశా ఏ ఓటీటీ సంస్థ కూడా దీన్ని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదేమో! ఏదైతేనేం ఏదైనా టైమ్ పాస్ థ్రిల్లర్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఇదిలా ఉండగా ఇందులో హీరోగా చేసిన నటరాజన్.. గతంలో తెలుగులో 'అఆ', 'ఛల్ మోహన్ రంగా' చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం విశేషం.(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు) -
Natarajan Birthday Photos: నటరాజన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. కేక్ తినిపించిన అజిత్ (ఫోటోలు)
-
కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజన్ (25) తాంబరం రంగనాథపురంలో ఉండేవాడు. ఆ సమయంలో ముడిచూరు రోడ్డులోని ఓ బేకరీలో పనిచేస్తున్న అభినయ(28)తో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సమయంలో అభినయ తన తల్లిదండ్రులతో గొడవపడి ఇక్కడే హాస్టల్లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 29న రంగనాథపురం పెరుమాళ్ ఆలయంలో తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో అభినయను నటరాజన్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత భార్యాభర్తలు రెండు వేర్వేరు నగల దుకాణాల్లో చేరారు. అభినయ ఒక్కరోజు మాత్రమే పనికి వెళ్లి ఆ తర్వాత వెళ్లలేదు. తరువాత అక్టోబర్ 19న అభినయ హఠాత్తుగా అదృశ్యమైంది. అతడి రెండు సెల్ఫోన్లు హ్యాక్ అయ్యాయి. ఇంట్లోని 17 తులాల నగలు, రూ.20 వేలు నగదు, కొత్త పట్టుచీరలతో పరారైంది. దీంతో నటరాజన్ తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అప్పటికే నిశ్చితార్థం.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా.. షాపు ఓనర్‌తో కలిసి..) అభినయ ఆధార్‌కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు మదురై సౌత్ అరిసికర స్ట్రీట్, సోనాథరువార్ టెంపుల్ అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో అభినయ సెమ్మంచేరి యమమల్ల పురం సాలైలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హాస్టల్లో ఉన్న అభినయను పోలీసులు హుటాహుటిన అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి 4 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అభినయకు అప్పటికే వివాహమై భర్త, ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలిసింది. అభినయ ప్లాన్ చేసి నటరాజన్‌ను ప్రేమిస్తున్నట్లు నటించి తన భర్త, బిడ్డ ఉన్న విషయం దాచిపెట్టి నగలు, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అభినయ మరో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అభినయ పలువురు యువకులను పరిచయం చేసుకుని పెళ్లి పేరిట తంతు కానిచ్చి తరువాత డబ్బు, నగలతో ఉడాయిస్తున్నట్లు తెలిసింది. అభినయ సహచరుడిగా ఉన్న సెంథిల్‌కుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
కల నెరవేరింది... గతేడాది అలా.. ఈ ఏడాది ఇలా: సంతోషంలో నటరాజన్
చెన్నై: టీమిండియా ఫాస్ట్‌బౌలర్, తమిళనాడు క్రికెటర్ టి. నటరాజన్ కల ఎట్టకేలకు నెరవేరింది. తన పేరిట క్రికెట్ మైదానం నెలకొల్పాన్న ఆశయం తీరింది. స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ గ్రామంలో నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్సీజీ) స్థాపించినట్లు నటరాజన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘సకల సౌకర్యాలతో మా గ్రామంలో కొత్త క్రికెట్ గ్రౌండ్... నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్సీజీ).. నా కల నెరవేరింది. గతేడాది డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాను. ఈ ఏడాది డిసెంబరులో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు.. ఆ దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని నటరాజన్ ట్వీట్ చేశాడు. కాగా గతేడాది టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్... ఆ టూర్లోనే ఏకంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటి వరకు ఒక టెస్టు, రెండు వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లలో నటరాజన్ 13 వికెట్లు పడగొట్టాడు. కాగా తమిళనాడులోని సేలం సమీపంలో గల చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు. జయప్రకాశ్ అనే వ్యక్తి అండతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. మూలాలను మర్చిపోకుండా తనలా పేదరికం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నాడు. చదవండి: India Tour of South Africa: దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా.. ఈసారైనా కల నెరవేరేనా? Happy to Announce that am setting up a new cricket ground with all the facilities in my village, Will be named as *NATARAJAN CRICKET GROUND(NCG)❤️ * #DreamsDoComeTrue🎈Last year December I Made my debut for India, This year (December) am setting up a cricket ground💥❤️ #ThankGod pic.twitter.com/OdCO7AeEsZ — Natarajan (@Natarajan_91) December 15, 2021 -
T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా
T.Natarajan Ruled Out Of Vijay Hazare Trophy Due To Knee Injury.. తమిళనాడు ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా కనిపిస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి గాయాల బెడద అతన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా మోకాలి గాయం మరోసారి తిరగబెట్టడంతో దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ కి నటరాజన్ దూరమయ్యాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడిగా ఉన్న నటరాజన్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నప్పటికి.. ఫైనల్లో ఆడాడు. తమిళనాడు టైటిల్ గెలిచిన అనంతరం అతను చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. '' మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టడంతో టోర్నీకి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నటరాజన్ రీహాబిటేషన్ కోసం ఎన్సీఏ అకాడమీకి వెళ్లనున్నాడు. చదవండి: Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ ఇక తమిళనాడు పేసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన నటరాజన్.. 2020-21 ఆసీస్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న నట్టూ ఆసీస్ గడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ఇక నట్టూ తనదైన ప్రదర్శనతో మెప్పించాడు. యార్కర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అతను స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కీలకమవుతాడని భావించారు. ఇంగ్లండ్‌తో తొలివన్డే ఆడిన తర్వాత మొకాలి గాయం నటరాజన్‌ను టీమిండియాకు దూరం చేసింది. అంతే అప్పటినుంచి నటరాజన్ మళ్లీ టీమిండియాకు ఆడలేకపోయాడు. మోకాలి సర్జరీ అనంతరం మళ్లీ మైదానంలో అడుగుపెట్టినప్పటికీ గాయాల బెడద మాత్రం వీడలేదు. ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీలకు దూరంగా ఉన్న నట్టూ ఆ తర్వాత రెండో అంచె పోటీల్లోనే పెద్దగా ఆడలేకపోయాడు. అలా ఒక టోర్నీలో ఆడాడో లేదో మళ్లీ గాయపడడం అతని అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. చదవండి: ICC T20 Rankings: విరాట్ కోహ్లి ఔట్.. కేఎల్ రాహుల్ ఒక్కడే -
నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్...
Umran Malik to replace Natarajan: ఐపీఎల్2021 ఫేజ్2లో భాగంగా జమ్మూ కశ్మీర్ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒప్పందం కుదర్చుకుంది. కరోనా బారిన పడి లీగ్‌కు దూరమైన స్టార్ బౌలర్ నటరాజన్ స్థానంలో మాలిక్‌ను ఎంపిక చేసింది. నిబంధన 6.1 (సి) ప్రకారం అతడని జట్టులోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్ ఆ జట్టు నెట్బౌలర్లో ఒకడుగా ఉన్నాడు. అయితే వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్న హైదరాబాద్ ప్లేఆఫ్ ఆవకాశాలు గల్లంతయ్యాయి. చదవండి: IPL 2021: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్‌రౌండర్ -
ఐపీఎల్ ను వెంటాడుతున్న కరోనా మహమ్మారి
-
మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్ కూడా రద్దు చేస్తారా!
Michael Vaughan Comments On Natarajan Tests Covid Positive: ఐపీఎల్ 2021 ఫేజ్2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలు ముందు హైదరాబాద్ ఫాస్ట్‌బౌలర్ నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ సహా మరో ఐదుగురు సహాయ సిబ్బందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఘాటు వాఖ్యలు చేశాడు. ‘చివరి టెస్ట్ రద్దు చేసుకున్నట్లు ఐపీఎల్‌ను కూడా రద్దు చేసుకుంటారా?... అలా చేయరని నేను హామీ ఇస్తా...’ అంటూ మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు. కాగా టీమిండియా శిబిరంలో కరోనా కరోనా కేసులు నమోదు కావడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఐదో టెస్ట్ వాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: IPL 2021 2nd Phase DC VS SRH: నటరాజన్‌కు కరోనా.. అయినా మ్యాచ్ యథాతథం -
పాపం నటరాజన్‌కే ఎందుకిలా?
-
పాపం నటరాజన్‌కే ఎందుకిలా?
T. Natarajn Tested Corona Positive.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నట్టూ(టి. నటరాజన్)కు బ్యాడ్‌టైమ్ నడుస్తున్నట్లుంది. కాకపోతే ఏంటి చెప్పండి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో గాయపడిన నటరాజన్ అప్పటి నుంచి మళ్లీ మైదానంలోకి దిగలేదు. ఆ తర్వాత భారత్‌లో జరిగిన ఐపీఎల్ 2021 తొలి అంచె పోటీల వరకు నటరాజన్ సిద్ధమైనట్లే కనిపించాడు. అందుకు అనుగుణంగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీశాడు. అంతే మళ్లీ మోకాలి గాయం తిరగబెట్టడంతో నట్టూ దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కవుగా ఉందని తేలడంతో సర్జరీ అవసరం రావడంతో ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్లో మళ్లీ కరోనా కలకలం.. నటరాజన్‌కు పాజిటివ్! ఇంతలో కరోనా కారణంగా లీగ్ వాయిదా పడింది. ఇక సర్జీరీ అనంతరం కోలుకున్న నటరాజన్ సెప్టెంబర్ 19 నుంచి మొదలైన ఐపీఎల్ రెండో అంచె పోటీలకు సిద్ధమని.. ఎస్ఆర్హెచ్ తరపున ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే నట్టూను ఈసారి విధి మరోసారి వక్రీకరించింది. రెండో అంచె పోటీల్లో భాగంగా ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. మ్యాచ్‌కు అంతా సిద్ధమనుకున్న దశలో నటరాజన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. నటరాజన్‌కు కరోనా ఎక్కడి నుంచి సోకిందన్నది అంతుచిక్కడం లేదు. నటరాజన్‌తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురిని ఐసోలేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. వీరిలో విజయ్ శంకర్(ప్లేయర్), విజయ్ కుమార్(టీం మేనేజర్), శ్యామ్ సుందర్(ఫిజియోథెరపిస్ట్), అంజనా వన్నర్(డాక్టర్), తుషార్ ఖేద్కర్(లాజిస్టిక్స్ మేనేజర్), పెరియసామి గణేషన్(నెట్ బౌలర్) ఉన్నారు. Courtesy: IPL Twitter ఇక నటరాజన్ కరోనా నుంచి కోలుకోవడానికి కనీసం 10 రోజలైనా పట్టే అవకాశం ఉంటుంది. కరోనా లక్షణాలు.. మేజర్ లేక మైల్డ్ అనే విషయం పక్కనపెడితే రూల్స్ ప్రకారం 15 రోజులు ఐసోలేషన్‌లో గడపాల్సిందే. ఈ లెక్కన చూసుకుంటే అక్టోబర్ 7 వరకు నటరాజన్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఒక వేళ అతను కోలుకున్నా బరిలోకి దిగే సమయానికి ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పరిస్థితి దారుణంగా ఉంది. తొలి అంచె పోటీల్లో ఏడు మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే సాధించి ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. రెండో అంచె పోటీల్లో ఎస్ఆర్హెచ్కు ప్రతీ మ్యాచ్ కీలకమే. నటరాజన్‌కు కరోనా పాజిటివ్ అని తెలియగానే ఎస్ఆర్హెచ్ అభిమానులు కంగారుపడ్డారు.'' పాపం నట్టూకే ఇలా ఎందుకు జరుగుతుంది.. ఈసారి అతని యార్కర్లు చూస్తాం అనుకున్నాం.. కానీ అది జరగడం లేదు.. నట్టూకు బ్యాడ్‌టైమ్ నడుస్తుంది'' అని కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2021: గాయాల బారిన ‘సన్‌రైజర్స్’ Courtesy: IPL Twitter ఇక 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో నటరాజన్ అద్భుతంగా రాణించాడు. మొదట టీమిండియాకు నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఆ తర్వాత టి20, గబ్బా మ్యాచ్ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా నటరాజన్ ఆసీస్ పర్యటనలో 11 (వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీసి మరుపురాని సిరీస్‌గా గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. చదవండి: నటరాజన్‌కు సర్జరీ.. బీసీసీఐ స్పందన Courtesy: ESPN Cric.Info -
నటరాజన్‌కు కరోనా.. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఓ గుడ్ న్యూస్
దుబాయ్: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఎస్ఆర్హెచ్ క్యాంప్‌లో కోవిడ్ కలకలం రేపింది. సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌కు కరోనా నిర్ధారణ కావడంతో అతనితో సన్నిహితంగా మరో ఆటగాడు విజయ్ శంకర్ సహా మరో ఐదుగురిని(టీమ్ మేనేజర్ విజయ్‌కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి) ఐసోలేషన్‌కు తరలించారు. అయితే ఎస్ఆర్హెచ్ క్యాంప్‌లోని మిగతా ఆటగాళ్లందరికీ నెగటివ్ రావడంతో నేటి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేయడం విశేషం. మహమ్మారి బారిన పడిన నటరాజన్‌కు ఎలాంటి లక్షణాలూ లేవని, అతను ప్రస్తుతం జట్టు సభ్యులకు దూరంగా మరో చోట ఐసోలేషన్‌లో ఉంటున్నాడని పేర్కొంది. కాగా, ఎస్ఆర్హెచ్ బృందం మొత్తానికి ఇవాళ ఉదయం 5 గంటలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. చదవండి: ఐపీఎల్లో మళ్లీ కరోనా కలకలం.. నటరాజన్‌కు పాజిటివ్! -
ఐపీఎల్లో మళ్లీ కరోనా కలకలం.. నటరాజన్‌కు పాజిటివ్!
Natarajan tests COVID-19 positive: యూఏఈ వేదికగా ఆరంభమైన ఐపీఎల్-2021 రెండో అంచెకు కరోనా సెగ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు నటరాజన్‌కు కోవిడ్ సోకింది. ఆర్టీ- పీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, అతడిలో వైరస్ లక్షణాలేమీ కనిపించడం లేదని, ప్రస్తుతం ఐసోలేషన్‌కు పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నటరాజన్‌కు సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురిని ఐసోలేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. వీరిలో విజయ్ శంకర్(ప్లేయర్), విజయ్ కుమార్(టీం మేనేజర్), శ్యామ్ సుందర్(ఫిజియోథెరపిస్ట్), అంజనా వన్నర్(డాక్టర్), తుషార్ ఖేద్కర్(లాజిస్టిక్స్ మేనేజర్), పెరియసామి గణేషన్(నెట్ బౌలర్) ఉన్నారు. ఇక కరోనా కలకం నేపథ్యంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కాగా ఐపీఎల్ 14వ ఎడిషన్ ఆరంభంలో కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా సోకిన నేపథ్యంలో... కేకేఆర్- ఆర్సీబీ మధ్య జరగాల్సిన ఆనాటి మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో.. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనేక చర్చల అనంతరం యూఏఈలో రెండో అంచెను నిర్వహించేందుకు సిద్ధమైన బీసీసీఐ.. సెప్టెంబరు 19 నుంచి తాజా సీజన్‌ను పునః ప్రారంభించింది. ఇప్పటికే చెన్నై- ముంబై, కేకేఆర్- ఆర్సీబీ, రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్‌లు జరుగగా.. నేడు(సెప్టెంబరు 22న) ఎస్ఆర్హెచ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరగాల్సి ఉంది. చదవండి: Sun Risers Hyderabad: కేన్ మామ అదరగొట్టాడు.. అయినా అర్ధ సెంచరీ వృథా! IPL 2021: Natarajan tests COVID-19 positive, SRH-DC game on Read @ANI Story | https://t.co/vmnIDKYVWW#IPL2021 #IPL pic.twitter.com/Kx82Da2U3K — ANI Digital (@ani_digital) September 22, 2021 NEWS - Sunrisers Hyderabad player tests positive; six close contacts isolated. More details here - https://t.co/sZnEBj13Vn #VIVOIPL — IndianPremierLeague (@IPL) September 22, 2021 -
క్రికెటర్ నట్టూకు ఆ కమెడియన్ క్లోజ్ ఫ్రెండ్ తెలుసా?
చెన్నై: యువ క్రికెటర్ నటరాజన్‌ను హాస్యనటుడు యోగిబాబు సోమవారం కలిశారు. ఫిజియోథెరపీ కోసం బెంగళూరులో ఉన్న నటరాజన్‌ను కలిసిన యోగిబాబు ఆయనకు కుమారస్వామి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను నటరాజన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన మిత్రుడు యోగిబాబును కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో గుర్తిండిపోయే రోజని పేర్కొన్నాడు. -
నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా..
ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ సారధ్యంలో టీమిండియా లంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, దేశవాలీ టోర్నీల్లో ప్రతిభ ఆధారంగా లంక పర్యటనకు యువ ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే 20 మంది సభ్యులతో కూడిన భారత బి జట్టులో శ్రేయస్ అయ్యర్, నటరాజన్‌ల పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. వారిని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్.. గాయం బారిన పడ్డాడు. అతని మోకాలికి తీవ్ర గాయం కావడం వల్ల ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే నట్టూను లంక పర్యటనకు పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్.. భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడ్డాడు. శ్రేయస్ భుజానికి తీవ్ర గాయం కావడంతో అతను లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే శ్రేయస్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతన్ని లంక పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, జూలై 13 నుంచి 25 మధ్య భారత బి జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా . చదవండి: WTC FINAL: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ కోహ్లీకి గాయం? -
రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నా: నటరాజన్
-
'రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నా'
చెన్నై: యార్కర్ల స్పెషలిస్ట్.. టీమిండియా ఆటగాడు టి. నటరాజన్ మోకాలు గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభంలోనే నట్టూకు గాయం తిరగబెట్టడంతో లీగ్‌కు దూరమయ్యాడు. వైద్యుల అతన్ని పరీక్షించి మోకాలికి సర్జరీ నిర్వహించారు. తాజాగా ఇంట్లోనే ఉంటున్న నట్టూ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ''నేను రోజురోజుకీ ధృఢంగా తయారవుతున్నానంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ఈ సందర్భంగా రీహాబ్, ప్రొగ్రెస్ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు. ''22 యార్డులున్న పిచ్‌పై బౌలింగ్ చేయడానికి త్వరలోనే వస్తా. ఇప్పుడు నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. మోకాలి సర్జరీ విజయవంతం అయింది. మీ ఆశీర్వాద బలంతో త్వరగా కోలుకుంటున్నా. మీరు నాపై చూపిస్తున్న ఆభిమానానికి, ఆదరణకు.. అలాగే కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో నటరాజన్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఆఖరి టెస్టు మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన నటరాజన్ మొత్తంగా ఆసీస్ పర్యటనలో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఆసీస్ పర్యటనలో గాయపడిన నటరాజన్ ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి కోలుకున్నట్లే కనిపించినా ఎస్ఆర్హెచ్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం మళ్లీ గాయం తిరగబెట్టడంతో లీగ్‌కు దూరమయ్యాడు. చదవండి: నటరాజన్‌కు సర్జరీ.. బీసీసీఐ స్పందన -
నటరాజన్‌కు సర్జరీ.. బీసీసీఐ స్పందన
చెన్నై: ఇటీవల మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకి దూరమైన టీమిండియా పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి. నటరాజన్‌కు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. ఈ విషయాన్ని నటరాజన్ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ‘ ఈరోజు(ఏప్రిల్ 27వ తేదీ) నా మోకాలి సర్జరీ విజయవంతమైంది. నా సర్జరీలో భాగమైన నిపుణులు, మెడికల్ టీమ్, సర్జన్స్, డాక్టర్లు, నర్సులు, మిగతా స్టాఫ్‌కుకు కృజజ్ఞతలు. ఇక నా సర్జరీ విజయవంతం కావాలని విష్ చేసిన బీసీసీఐకి కూడా ధన్యవాదాలు’ అని తెలిపాడు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ‘నటరాజన్ నువ్వు త్వరగా కోలుకోవాలి. మళ్లీ ఫీల్డ్‌లో చూడాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేసింది. టోర్నీలో మోకాలి గాయంతో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ గాయం తీవ్రం కావడంతో ఏకంగా టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు. సర్జరీ అవసరమని తేలడంతో నటరాజన్ తప్పుకున్నాడు. ఇప్పుడు సర్జరీ చేయించుకున్న నటరాజన్‌కు సుదీర్ఘ విశ్రాంతి అవసరం కానంది. ఇక్కడ చదవండి: మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి ఐపీఎల్ 2021: మీకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేం Wish you a speedy recovery @Natarajan_91. We want to see you back on the field soon. 💪🏾 https://t.co/dPjCxu5baS — BCCI (@BCCI) April 27, 2021 -
ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీని మిస్సవుతున్నా
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్ ఇంకా సగం కూడా పూర్తవకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టి నటరాజన్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ టోర్నీలో మోకాలి గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన నటరాజన్.. ఆ గాయం తీవ్రం కావడంతో వైదొలగక తప్పలేదు. దీనికి సంబంధించిన అప్డేట్ను ఎస్ఆర్హెచ్ తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా స్పష్టం చేసింది. నటరాజన్ ఎమోషనల్ అవుతూ జట్టును వీడుతున్న వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ చేసింది. ఇందులో ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీని వీడాల్సి రావడం బాధిస్తోందని, కానీ తప్పడం లేదని నటరాజన్ ఎమోషనల్ అయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ ఆడిన గత మ్యాచ్‌లో నటరాజన్ ఎందుకు ఆడలేదనే అనుమానం తలెత్తింది. కాగా నటరాజన్ మోకాలి గాయంతో మ్యాచ్‌కు దూరమైన విషయాన్ని ఎస్ఆర్హెచ్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపిన తర్వాత విషయం అర్థమైంది. అతనికి మోకాలికి శస్త్ర చికిత్స అవసరం కావడంతో అతను అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది రెండు మ్యాచ్‌లే ఆడిన నటరాజన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. గత సీజన్లో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో నటరాజన్ కీలక పాత్ర పోషించాడు. దాంతోనే భారత్ సెలక్షన్ కమిటీ నుంచి నటరాజన్‌కు పిలుపు రావడంతో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయడం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు నటరాజన్. ఒకే టూర్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఏకైక భారత క్రికెటర్ నటరాజన్. View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) -
గాయాల బారిన ‘సన్‌రైజర్స్’
చెన్నై: గత ఐపీఎల్ సీజన్ గుర్తుందా.. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయాలు తీవ్రంగా వేధించాయి. ఇప్పుడు ఈ సీజన్లో అదే రిపీట్ అవుతున్నట్లే కనబడుతోంది. గడిచిన సీజన్లో తొలి మ్యాచ్‌కు ముందు కూడా కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. ప్రస్తుత సీజన్లో కూడా గాయంతో విలియమ్సన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడలేదు. ఇంకా అతను కోలుకోవడానికి వారం సమయం పడుతోంది. దాంతో తదుపరి మ్యాచ్‌కు కూడా విలియమ్సన్ అందుబాటులో ఉంటాడో లేదో అనుమానం. అదే సమయంలో మోకాలి గాయంతో నటరాజన్ మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ ఎందుకు ఆడలేదనే అనుమానం తలెత్తింది. కాగా నటరాజన్ మోకాలి గాయంతో మ్యాచ్‌కు దూరమైన విషయాన్ని ఎస్ఆర్హెచ్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. నటరాజన్‌ను వేసుకోకుండా ఖలీల్ అహ్మద్‌ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. గాయం కారణంగా ఆ యువ క్రికెటర్‌ను తుది జట్టులోకి తీసుకోలేదన్నాడు. ప్రస్తుతం అతనికి విశ్రాంతి మాత్రమే ఇచ్చామని, జట్టు నుంచి తీసేయలేదన్నాడు. ఈ సీజన్లో తొలి గేమ్ ఆడుతున్న ఖలీల్ ఎంతగానో ఆకట్టుకున్నాడని లక్ష్మణ్ పేర్కొన్నాడు. చెన్నై పిచ్ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుని విభిన్నకోణాల్లో బౌలింగ్ చేయడం బాగుందన్నాడు. ఖలీల్ బౌన్స్‌ను పేస్‌ను రాబడుతూ బౌలింగ్ చేసిన విధానం నిజంగా అభినందనీయమన్నాడు. ఒకవైపు ఓటముల.. మరొకవైపు గాయాలు 2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత నాలుగు సీజన్లగా కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతూ వస్తూ అభిమానుల ఆశల్ని వమ్ము చేయడం లేదు. ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు చేరే జట్ల అంచనాలలో ఎస్ఆర్హెచ్ ఉంది. కానీ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంతో విమర్శలు వస్తున్నాయి. వార్నర్‌తో పాటు కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, జానీ బెయిర్ స్టో, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, నటరాజన్‌లు ఆ జట్టుకు ప్రధాన బలంగా కాగా ఖలీల్ అహ్మద్, జేసన్ హోల్డర్, మహ్మద్ నబీలు కూడా చెప్పుకోదగిన ఆటగాళ్లే. ఇక్కడ స్వదేశీ బెంచ్ కంటే విదేశీ బెంచ్‌పైనే సన్‌రైజర్స్ ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ తుది జట్టులో ఉండాల్సింది నలుగురు విదేశీ ఆటగాళ్లే. దాంతో మార్పులు చేయడం కష్టమవుతోంది. ఇంకా కేన్ విలియమ్సన్ రాకుండానే సన్‌రైజర్స్ పరిస్థితి డైలమాలో పడింది. సన్‌రైజర్స్ తుది జట్టులో బెయిర్ స్టో, వార్నర్, విలియమ్సన్(ఫిట్ అయితే)లు కచ్చితంగా ఉండాల్సింది. మరి నాలుగో స్థానంలో రషీద్ ఖాన్ ఉన్నాడు. దాంతో గతేడాది ఆకట్టుకుని సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హోల్డర్‌ను వేసుకోవడానికి ఉండదు. దాంతో పేస్ విభాగం బలహీనపడుతోంది. ఇప్పుడు నటరాజన్ గాయం కావడంతో అతని స్థానంలో స్వదేశీ ఆటగాడికే చోటివ్వాలి. దాంతో ఖలీల్‌కు చోటు దక్కింది. ఇక్కడ ఖలీల్ బౌలింగ్ చేయగలడు కానీ ఆల్‌రౌండర్ కాదు. ఇదే సమస్య ఇప్పుడు సన్‌రైజర్స్‌ను వేధిస్తోంది. ఒకవైపు వరుసగా హ్యాట్రిక్ ఓటములు.. మరొకవైపు గాయాలు ఆరెంజ్ ఆర్మీకి మింగుడు పడటం లేదు. ఈ లీగ్‌లో ఇక ముందు జరిగే మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఎవరూ గాయపడకుండా అంతా సవ్యంగా సాగిపోతే ఆ జట్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు.. ఒకవేళ తొలి మ్యాచ్‌కు ముందు విలియమ్సన్, మూడో మ్యాచ్‌కు నటరాజన్ గాయపడినట్లు ఎవరికైనా గాయాలైతే మాత్రం అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ధోని భయ్యా సలహాలు ఇప్పుడు వాడుతా: నట్టూ
ముంబై: టీమిండియా బౌలర్ టి.నటరాజన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో నటరాజన్ ఎస్ఆర్హెచ్ తరపున 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత ఆసీస్‌తో సిరీస్‌కు అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న నటరాజన్ అక్కడా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తాజాగా మరోసారి ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్న నటరాజన్ ధోని గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''గతేడాది సీజన్లో ధోని భయ్యా ఎన్నో విలువైన సలహాలు అందించాడు. ఫిట్నెస్ కాపాడుకోవడంపై పలు కీలక అంశాలు చర్చించాడు. అంతేగాక బౌలింగ్‌లో స్లో బౌన్సర్స్, కట్టర్స్లో ఉండే వివిధ అంశాల గురించి చర్చించాడు. అనుభవం వచ్చే కొద్ది మరింత రాటుదేలుతావు అన్నాడు. ఒక మ్యాచ్‌లో ధోని భయ్యా నేను వేసిన బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే ధోని వికెట్ లభించింది.. కానీ నేను సెలబ్రేషన్ చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనితో చాలాసేపు చాట్ చేశాను. ఆ సమయంలో ఎన్నో విలువైన సలహాలు అందించాడు. ఇవన్నీ ఈ సీజన్లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నా. ఇక మా కెప్టెన్ వార్నర్ నన్ను ప్రోత్సహించే తీరు మరువలేననిది. నన్ను ప్రేమగా నట్టూ అని పిలిచే అతను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. అతని చొరవతోనే గతేడాది సీజన్లో అద్భుతంగా రాణించాను. అదే ప్రదర్శనను ఈ ఏడాది కొనసాగించేందుకు ప్రయత్నిస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా కేకేఆర్‌తో ఆడనుంది. చదవండి: 'ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కు సిద్ధం' కోహ్లి, రోహిత్‌ల నుంచి మెసేజ్‌లు వచ్చాయి: శాంసన్ -
ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్..
చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వాహనాన్ని అందుకున్న టీమిండియా సెన్సేషనల్ బౌలర్ టి నటరాజన్.. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని నటరాజన్ గురువారం ట్విటర్ వేదికగా తెలియజేశాడు. తనకు అందిన ఎస్యూవీ వాహనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన మీకు కృతజ్ఞతలు సర్(ఆనంద్ మహీంద్ర), భారత్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నాకు దక్కిన వరం, గొప్ప వ్యక్తుల నుంచి ప్రోత్సాహం లభించడం నాకు దక్కిన గౌరవం, నాకు బహుమతిగా ఇచ్చిన వాహనాన్ని ఈ రోజే నడిపాను, నా అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ జెర్సీని మీకోసం పంపిస్తున్నాను" అంటూ క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, నటరాజన్‌తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీలు అందుకున్నారు. Playing cricket for India is the biggest privilege of my life. My #Rise has been on an unusual path. Along the way, the love and affection, I have received has overwhelmed me. The support and encouragement from wonderful people, helps me find ways to #ExploreTheImpossible ..1/2 pic.twitter.com/FvuPKljjtu — Natarajan (@Natarajan_91) April 1, 2021 ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం నటరాజన్ సిద్దమవుతున్నాడు. గురువారమే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరాడు. నిబంధనల మేరకు ఏడు రోజుల క్వారంటైన్లో ఉండనున్నాడు. గత సీజన్లో యార్కర్లతో అదరగొట్టిన నట్టూ ఈసారి అంతకుమించి రాణించాలని సన్‌రైజర్స్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చెన్నై వేదిక ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: నా డార్లింగ్‌తో చివరి పెగ్: వార్నర్ -
ఆ సమయంలో నట్టూ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో..
న్యూఢిల్లీ: చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మూడో వన్డేలో భారత్ ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ సాధించి, 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా సాధించిన ఈ విజయానికి రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్, శార్దూల్ ఠాకూర్ (4/67) బౌలింగ్ గణాంకాలే కారణమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసి, భారత్ శిబిరంలో ఆందోళన రేపిన ఇంగ్లండ్ నవయువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్‌ను సైతం అందరూ కొనియాడుతున్నారు. అయితే, చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన టీమిండియా పేసర్ నటరాజన్‌ను మాత్రం ఎవ్వరూ గుర్తించడంలేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 6 బంతుల్లో 14 పరుగులు సాధించాల్సిన తరుణంలో అద్భుతమైన యార్కర్లను సంధించిన నట్టూపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఒత్తిడిలోనూ నటరాజన్ తన యార్కర్లతో మాయ చేశాడని, ఆఖరి ఓవర్ బౌల్ చేసే సమయంలో అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుందో ఊహించడం కష్టమేనని పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్లలో తక్కువ ఎత్తులో యార్కర్లు సంధించడం అద్భుతమైన కళ అని, అది నట్టూకు బాగానే ఉందని కొనియాడాడు. సరైన బంతులు విసిరి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువేనని వెల్లడించాడు. స్లాగ్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా బంతిని స్టాండ్స్‌లో వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించాడు. తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన యార్కర్లు సంధించగల ఆటగాళ్లలో లసిత్ మలింగ, బ్రెట్‌లీలు ముందువరుసలో ఉంటారని పేర్కొన్నాడు. చదవండి: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్ -
ధావన్‌కు వంగి వంగి దండం పెట్టిన హార్దిక్
పుణె: చివరికంటా ఉత్కంఠ రేపిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిరీస్ విజేతను తేల్చిన ఆఖరి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో, కోహ్లి సేన 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, టీమిండియా కీలక సమయాల్లో పలు క్యాచ్‌లు జారవిడిచిన విషయం విదితమే. ఐదో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్ పాండ్యా డ్రాప్ చేశాడు. లైఫ్ దొరికితే స్టోక్స్ ఎంత ప్రమాదకారిగా మారతాడో రెండో మ్యాచ్‌లో అందరూ చూశారు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ భారత్ చేజారింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో అతడి క్యాచ్‌ను మిస్ చేయగానే, ఎంత పెద్ద పొరపాటు చేశానన్నట్లుగా హార్దిక్ విస్మయం వ్యక్తం చేశాడు. ఇక పదకొండో ఓవర్లో నటరాజన్ వేసిన బంతిని షాట్ ఆడిన స్టోక్స్, గాల్లోకి లేపగా మిడ్ వికెట్లో ఉన్న ధావన్ ఏమాత్రం తడబడకుండా ఒడిసిపట్టాడు. ఇక నోబాల్‌కు ఆస్కారం ఉందా అన్న విషయంపై థర్డ్ అంపైర్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో భారత శిబిరంలో ఆనందం విరిసింది. దీంతో హార్దిక్ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతేగాక, స్టోక్స్ క్యాచ్ పట్టినందుకు గబ్బర్‌కు రెండు చేతులు జోడించి దండం పెడుతూ, మోకాళ్ల మీద కూర్చుని ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: IND vs ENG 3rd ODI: భారత్ తీన్మార్ ఆ నిర్ణయం చూసి షాక్‌కు గురైన విరాట్ కోహ్లి ! ఆ సిక్స్ దెబ్బకు.. బ్యాట్‌నే చెక్ చేశాడు! #IndiavsEngland #INDvsENG #HardikPandya #natarajan ஹர்திக் பாண்டியா டூ நடராஜன்😂😜 pic.twitter.com/NSMF4H3wZA — ஜெர்ரி🐀 (@Jerrykutty07) March 28, 2021 -
ఆ జెర్సీ వేసుకోవడం థ్రిల్ కలిగించింది: నటరాజన్
అహ్మదాబాద్: ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో టి. నటరాజన్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే స్వదేశానికి తిరిగొచ్చాకా గాయపడడంతో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా ఎన్సీఏ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో పాసైన నటరాజన్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. కాగా నటరాజన్ గురువారం టీమిండియా జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ట్విటర్ వేదికగా టీమిండియా జెర్సీని ధరించి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. 'మనకు నచ్చిన జాబ్‌లో ఉంటే జీవితంలో ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉండలేం.. చాలా రోజుల తర్వాత బ్లూ జెర్సీ వేసుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అంటూ కామెంట్ చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు నటరాజన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ద కృష్ణ కూడా తుది జట్టులోకి ఎంపికయ్యారు. కాగా ఐపీఎల్ 2020 సీజన్లో సన్‌రైజర్స్ తరపున 16 వికెట్లతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని అందరి ప్రశంసలు పొందాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని ఆసీస్ పర్యటనకు అతన్ని నెట్ బౌలర్‌గా అవకాశం కల్పించింది. అయితే అనూహ్యంగా నవదీప్ సైనీ గాయపడడంతో నటరాజన్‌కు అదృష్టం తలుపు తట్టింది. అలా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు (3,2,1) తీసి అందరి చేత ప్రశంసలు పొందాడు. ఇక గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆడిన నటరాజన్ తొలి టెస్టులోనే 3 వికెట్లు తీసి తానేంటో నిరూపించాడు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మార్చి 23 నుంచి జరగనుంది. చదవండి: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్: నటరాజన్ డౌటే! "Choose a job you love and you will never have to work a day in your life" - Thrilled to be back in blue with the boys @BCCI pic.twitter.com/gRQ3C3hZic — Natarajan (@Natarajan_91) March 19, 2021 -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్: నటరాజన్ డౌటే!
అహ్మదాబాద్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న 5 టీ20 సిరీస్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి. భుజం గాయంతో బాధపడుతున్న నటరాజన్ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో(ఎన్సీఏ) ఉన్నాడు. అతని ఫిట్నెస్ను పరిక్షించి టీ20ల్లో ఆడించాలా వద్దా అనేది మార్చి 12న తేలనుంది. అందుకే నటరాజన్ తొలి టీ20 ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎన్సీఏ మేనేజ్మెంట్ తెలిపింది. కాగా నటరాజన్‌తో పాటు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలు కూడా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తిలు ఫిట్నెస్ పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. అయితే మార్చి 12లోపు ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితే తొలి టీ20లో ఆడే చాన్స్ ఉందంటూ తెలిపింది. ఒకవేళ రిపోర్ట్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలితే మాత్రం నటరాజన్ పూర్తిగా దూరమవ్వనున్నాడు. ఇక నెట్‌బౌలర్‌గా వెళ్లి, ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీసి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: అందమైన బహుమతి.. థాంక్యూ లడ్డూ: నటరాజన్ యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్.. -
అందమైన బహుమతి.. థాంక్యూ లడ్డూ: నటరాజన్
చెన్నై: ‘‘జీవితంలో మేము అందుకున్న అత్యంత అందమైన బహుమతి నువ్వే. మా జీవితాలు ఇంత సంతోషకరంగా మారడానికి కారణం నువ్వే. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు థాంక్యూ లడ్డూ. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. మా చిన్నారి దేవత హన్విక’’ అంటూ టీమిండియా పేసర్ నటరాజన్ తన కూతురి పేరును వెల్లడించాడు. కుమార్తె జన్మించి నాలుగు నెలలు పూర్తైన సందర్భంగా భార్య, బిడ్డతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి ఈ మేరకు ఉద్వేగపూరిత కామెంట్ జతచేశాడు. కూతుళ్లే బెస్ట్ అంటూ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు. కాగా గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నటరాజన్ మైదానంలో దిగి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నెట్‌బౌలర్‌గా అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో నటరాజన్‌కు కూతురు జన్మించగా, సుదీర్ఘ ఆసీస్ టూర్లో భాగంగా తనని నేరుగా చూసే అవకాశం లభించలేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఈ తమిళనాడు ఫాస్ట్‌బౌలర్ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక నెట్‌బౌలర్‌గా వెళ్లి, ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీసి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఈ అదృష్టానికి తన కూతురి రాకే కారణమంటూ మురిసిపోయాడు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడే భారత జట్టులో నటరాజన్‌కు చోటు దక్కింది. మార్చి 12 నుంచి 20 మార్చి వరకు అహ్మదాబాద్‌లోని మొటెరా స్టేడియంలో జరుగనున్న ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్ : ‘నటరాజన్‌తో కలిసి ఆడటం నా అదృష్టం’ -
‘నటరాజన్‌తో కలిసి ఆడటం నా అదృష్టం’
న్యూఢిల్లీ: ‘‘నటరాజన్ అద్భుతమైన వ్యక్తి. ఐపీఎల్ టోర్నమెంట్లో గొప్పగా రాణించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. వాస్తవానికి తను నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే వారవారానికి తనకున్న అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయి. గబ్బా టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయంలో తన పాత్ర కూడా ఉండటం నిజంగా సంతోషకరం. ఇంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి నాకు సహచర ఆటగాడు(ఐపీఎల్) కావడం పట్ల గర్వంగా ఉంది’’ అంటూ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియా బౌలర్ తంగరసు నటరాజన్‌పై ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తనతో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఆసీస్ టూర్లో భాగంగా మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తమిళనాడు సీమర్ నట్టు.. ఆ తర్వాత టీ20, సంప్రదాయ క్రికెట్లో కూడా అడుగుపెట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా తనను నిరూపించుకున్న నటరాజన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఈ క్రమంలో విలియమ్సన్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తను చాలా నిరాడంబరంగా ఉంటాడు. అద్భుతమైన ప్రతిభ కలవాడు. టీమిండియాకు దొరికిన మంచి ఆటగాడు. అతి తక్కువ సమయంలోనే, యువ క్రికెటర్ నుంచి పరిణతి కలిగిన ఆటగాడిగా రూపాంతరం చెందాడు. (చదవండి: నటరాజన్ అరంగేట్రం.. అద్భుతమైన కథ!) నాతో కలిసి ఆడిన నటరాజన్, ఆసీస్ టూర్లో సాధించిన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది’’ అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2020 సీజన్లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన నటరాజన్, 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఇక కేన్ విలియమ్సన్ సైతం ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తుది పోరుకు కివీస్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత విలియమ్సన్ సేనతో ఫైనల్లో తలపడే జట్టు ఏదో ఖరారు కానుంది.(చదవండి: ఫైనల్‌కు న్యూజిలాండ్) -
కన్నీళ్లు ఆగలేదు: వీవీఎస్ లక్ష్మణ్
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగానే అభిమానుల గుండెలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. డ్రా చేయడం కూడా అసాధ్యమే అనుకున్న గబ్బా మైదానంలో భారత జట్టు విజయఢంకా మోగించడంతో సామాన్యులు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖుల ట్వీట్లతో సోషల్ మీడియా మోత మోగింది. దేశం మొత్తం భావోద్వేగానికి లోనైన చిరస్మరణీయ విజయం అది. అందరిలాగే తాను కూడా బ్రిస్బేన్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించగానే ఉద్వేగానికి గురయ్యాయని తెలిపాడు టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్. శుభవార్త తెలియగానే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని పేర్కొన్నాడు.(చదవండి: ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలువలేదు: గంభీర్) తాజాగా స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన లక్ష్మణ్.. ‘‘బ్రిస్బేన్ టెస్టు ఆఖరి రోజు మ్యాచ్‌ను కుటుంబంతో కలిసి వీక్షించాను. రిషభ్, వాషింగ్టన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టెన్షన్ తారస్థాయికి చేరింది. ఎలాగైనా సరే ఇండియా ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలవాలని బలంగా కోరుకున్నా. ముఖ్యంగా అడిలైడ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావించా. అంతేకాదు గబ్బా టెస్టుకు ముందు, బ్రిస్బేన్‌లో ఆడేందుకు ఇండియన్స్ భయపడతారంటూ కామెంట్లు వినిపించాయి. అయితే ఎక్కడైతే ఆసీస్‌కు మంచి రికార్డు ఉందో అక్కడే టీమిండియా అద్భుత విజయం సొంతం చేసుకుంది. అప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి’’ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) ఇక ఆసీస్ టూర్లో లభించిన అవకాశం సద్వినియోగం చేసుకున్న తమిళనాడు బౌలర్ నటరాజన్‌పై వీవీఎస్ ప్రశంసలు కురిపించాడు. ‘‘మంచివాళ్లకు మంచే జరుగుతుంది. నటరాజన్ అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. అవకాశం కోసం నట్టూ ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. మానసిక స్థైర్యంతో ముందుకు సాగాడు. బలమైన ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు’’ అని కొనియాడాడు. కాగా నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లిన నటరాజన్.. మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్ష్మణ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నటరాజన్ మైదానంలో దిగిన సంగతి తెలిసిందే. -
మొక్కు తీర్చుకున్న క్రికెటర్ నటరాజన్
సాక్షి, చెన్నై: క్రికెటర్ నటరాజన్ పళని ఆలయంలో శనివారం మొక్కులు తీర్చుకున్నారు. గుండు కొట్టుకుని ఆలయంలో పూజలు చేశారు. ఐపీఎల్ ద్వారా తన ప్రతిభ కనబరిచిన తమిళ క్రీడాకారుడు నటరాజన్ ఆస్ట్రేలియా టూర్లో తన సత్తా చాటాడు. పర్యటన ముగించుకుని సేలంలోని స్వగ్రామానికి చేరుకున్న నటరాజన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతమే పలికారు. శనివారం దిండుగల్ జిల్లా పళనిలోని సుబ్రహ్మణ్యస్వామిని నటరాజన్ దర్శించుకున్నారు. క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలి వచ్చి సెల్ఫీలు దిగారు. -
ఆ వాటమే తనకు అవకాశాలు తెచ్చిపెట్టింది: నట్టూ
చెన్నై: ఏదో ఒక ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తే చాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, నెట్ బౌలర్‌గా ఎంపికై ఏకంగా మూడు క్రికెట్ ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేశాడు ఈ సేలం కుర్రాడు. అంతే కాదు తన బౌలింగ్ ప్రతిభతో మూడు ఫార్మట్లలోనూ రాణించి టీమిండియాకు భవిష్యత్తు ఆశా కిరణంలా మారాడు. అతడే తమిళనాడుకు చెందిన టి నటరాజన్. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ అయిన నట్టూ.. తాను ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడమే కలిసొచ్చిందని అంటున్నాడు. ప్రస్తుతం సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బౌలర్లలో ఎక్కువ మంది కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, ఎడమ చేతి వాటం బౌలర్‌ని కావడమే తనకు మూడు క్రికెట్ ఫార్మాట్లలో చోటు సంపాదించిపెట్టిందని నట్టూ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలో రాణించడానికి తాను ఎంతో కఠోరంగా శ్రమించానని, కేవలం శ్రమను మాత్రమే తాను నమ్ముతానని నట్టూ తెలిపాడు. నెట్స్‌లో తాను శ్రమించడాన్ని గుర్తించిన కోచ్, కెప్టెన్లు తన బౌలింగ్‌పై పూర్తి నమ్మకంతో తనకు మూడు ఫార్మట్లలో ఆడే అవకాశాన్ని కల్పించారన్నారు. అన్ని ఫార్మట్లలో తుది జట్టులోకి తన ఎంపిక మాత్రం కేవలం ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడం వల్లనే జరిగిందని నట్టూ చెప్పుకొచ్చాడు. కాగా, ఆసీస్ పర్యటనకు నట్టూ కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. జట్టు సభ్యులు ఒక్కొక్కరిగా గాయాల బారినపడటంతో అతనికి భారత జట్టులో స్థానం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న నట్టూ..మూడు ఫార్మట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గబ్బాలో జరిగిన తన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్, మాథ్యూ వేడ్‌ల వికెట్లతో సహా మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్శించాడు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సేలం క్రికెట్ అసోసియేషన్‌కు తానెంతో రుణపడి ఉన్నానని, భవిష్యత్తులో సేలం క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నట్టూ హామీ ఇచ్చాడు. -
క్రికెటర్లకు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్
ఆస్ట్రేలియాలో అదరగొట్టిన క్రికెటర్లకు కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెటర్లకు ఊహించని బహుమతి లభించనుంది. ప్రతిభ గల వారిని ఎప్పుడూ ప్రోత్సహించే వారిలో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ముందుంటారు. టెస్ట్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆరు మంద్రి క్రికెటర్లకు మహేంద్ర ఎస్యూవీ వాహనాలు అందిస్తానని ప్రకటించారు. అది కూడా తన వ్యక్తిగత ఖాతా నుంచి అందిస్తానని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా టెస్ట్ (బోర్డర్ గావస్కర్ సిరీస్)తో అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌లకు తమ కంపెనీకి చెందిన థార్ ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇస్తానని శనివారం ఆనంద్ మహేంద్ర ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ ఆరుగురు తమ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు. Six young men made their debuts in the recent historic series #INDvAUS (Shardul’s 1 earlier appearance was short-lived due to injury)They’ve made it possible for future generations of youth in India to dream & Explore the Impossible (1/3) pic.twitter.com/XHV7sg5ebr — anand mahindra (@anandmahindra) January 23, 2021 -
నా కొడుకు లెజెండ్‌గా ఎదుగుతాడు: క్రికెటర్ తండ్రి
న్యూఢిల్లీ: ‘‘ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకం. వాషింగ్టన్ సుందర్ లెజెండ్‌గా ఎదుగుతాడు. తనకు ప్రతిభ, నైపుణ్యాలతో పాటు, ఆట పట్ల అంకితభావం, కఠిన శ్రమ, క్రమశిక్షణ కూడా ఉన్నాయి. భారత జట్టులో సుదీర్ఘ కాలంపాటు తన ఇన్నింగ్స్ కొనసాగించగలడని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అంటూ టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి సుందర్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఆస్ట్రేలియాలో భారత్ సాధించిన ఘన విజయంలో తన ప్రదర్శన సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా అశ్విన్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు దూరమైన తరుణంలో వాషింగ్టన్కు తుది జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ యువ స్పిన్నర్.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. (చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) అదే విధంగా కీలక సమయంలో రిషభ్‌పంత్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆసీస్ పర్యటన ముగించుకుని టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ తండ్రి సుందర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్, అశ్విన్, టి. నటరాజన్ వీరితో పాటు టీమిండియా మొత్తాన్ని చూస్తుంటే గర్వంతో హృదయం ఉప్పొంగిపోతోంది. వాషింగ్టన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తన ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నా’’అని చెప్పుకొచ్చారు. వద్దంటే రభస చేసేవాడు ‘‘రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి గ్రౌండుకు, అక్కడి నుంచి స్కూలు వెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే హోం వర్ పూర్తి చేసి మళ్లీ ప్రాక్టీసుకు వెళ్లేవాడు. ఒకవేళ ఏదైనా కారణాల చేత అక్కడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లో రభస చేసేవాడు. వర్షం పడుతున్నా సరే ఆటను విడిచిపెట్టేవాడు కాదు’’ అని క్రికెట్ పట్ల కొడుకుకు ఉన్న అంకితభావం గురించి వాషింగ్టన్ తల్లి చెప్పారు. అదే విధంగా.. ‘‘చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం మా ఇద్దరికి అలవాటు. తన బౌలింగ్ కంటే బ్యాటింగే ఎక్కువగా ఆస్వాదిస్తాను. తనకు నేను వీరాభిమానిని’’ అని అతడి సోదరి జ్యోతి సుందర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇక ఆసీస్ టూర్లో తమిళ యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్(టెస్టు), నటరాజన్(వన్డే, టీ20, టెస్టు) అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. -
'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా'
ముంబై: ఆసీస్ టూర్‌ను విజయవంతం చేసుకొని స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ లభించిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై వరుసగా రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోపీ గెలవడంతో పాటు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాపై ఇంకా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆసీస్ పర్యటనకు నెట్ బౌలర్‌గా వెళ్లి ఆకట్టుకున్న టి.నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.. ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ పొగడ్తలలో ముంచెత్తాడు. 'మొదట నట్టూకు ఇవే నా అభినందనలు.. నువ్వు నిజంగా జీనియస్. ఐపీఎల్లో నీతో కలిసి ఆడినప్పుడు నీ మీద ఏ ఫీలింగ్ అయితే ఉండేది దాన్ని నిలబెట్టుకున్నావు. మ్యాచ్ వరకు మాత్రమే మనద్దిరం ప్రత్యర్థులం.. ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం ఎప్పటికి మంచి స్నేహితులం అన్న విషయం గుర్తుపెట్టుకో. నీలాంటి ఆటగాడికి నేను కెప్టెన్‌గా ఉన్నందుకు గర్విస్తున్నా. నిజంగా నటరాజన్ మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి.. వికెట్ తీయగానే తన గొప్పతనాన్ని ప్రదర్శించకుండా హుందాగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. చదవండి: గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే ఐపీఎల్ 2020 సీజన్లో ఆడుతున్న సమయంలోనే నటరాజన్‌కు బిడ్డ పుట్టిందన్న వార్త తెలిసింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత పుట్టిన బిడ్డను చూడకుండా నేరుగా ఆసీస్ పర్యటనకు రావడం గొప్ప విషయం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆసీస్ టూర్‌కు నటరాజన్ ముందు ఒక నెట్ బౌలర్‌గా మాత్రమే వచ్చాడు.. దేశం కోసం ఎవరైతే కుటుంబాన్ని కూడా త్యాగం చేస్తారో వారికి అవకాశం వెతుక్కుంటూ వస్తుందనేది నటరాజన్ విషయంలో మరోసారి నిరూపితమైంది. గత ఐపీఎల్లో 16 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచిన నటరాజన్.. ఈసారి ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడనే దానికోసం ఎదురుచూస్తున్నా. అతనికి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు.. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడం నటరాజన్ శైలి' అంటూ కొనియాడాడు. కాగా నటరాజన్ ఆసీస్‌తో జరిగిన చివరి వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నటరాజన్ మెయిడెన్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడి 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. అనంతరం టెస్టు సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాకున్నా .. చివరిదైన గబ్బా టెస్టులో ఆడి తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 3 వికెట్లు తీయడం విశేషం. 32 ఏళ్లుగా బ్రిస్బేన్‌లో ఓటమి ఎరుగని ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెట్టిన టీమిండియా తుది జట్టులో నటరాజన్ ఉండడం అతని అదృష్టమనే చెప్పొచ్చు. చదవండి: సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు నిర్వహించాల్సింది -
రథంపై నటరాజన్.. సెహ్వాగ్ రియాక్షన్
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫితో ఇండియాకు చేరుకున్న భారత జట్టుకు దేశం యావత్తు ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయ సిబ్బందితో సహా అభిమానులు, ప్రయాణికులు వారికి ఘన స్వాగతం పలకగా.. ఇక తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూర్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అతడి కోసం రథం ఏర్పాటు చేసి.. ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ‘‘ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి. నటరాజన్‌కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ’’ అనే క్యాప్షన్‌తో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సారి షేర్ చేశారు సెహ్వాగ్. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు) -
ఆసీస్ టూర్: సిరాజ్ నుంచి సుందర్ దాకా
అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు.. అదే అద్భుతం జరిగిన తర్వాత దానిని ఎవరూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. నిజమే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే, బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తా చాటారు. ఎన్నో అవాంతరాలు దాటి సంప్రదాయ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆ ఆటగాళ్ల నేపథ్యం, ఈ సిరీస్‌లో నమోదు చేసిన గణాంకాలు పరిశీలిద్దాం. శభాష్ సిరాజ్.. హైదరాబాదీ బౌలర్. అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి ఆటోడ్రైవర్. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్.. ఆసీస్ సిరీస్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌కు ఎంపికయ్యాడు. టూర్లో ఉండగానే అతడి తండ్రి మరణించినా.. ఆయన కలను నెరవేర్చాలనే ఆశయంతో జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. బాక్సింగ్ డే టెస్టుతో పాటు గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన హైదరాబాదీ, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. వీరితో పాటు హాజల్‌వుడ్, స్టార్క్‌ను అవుట్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. (చదవండి: 36 పరుగులకు ఆలౌట్.. కానీ ఇప్పుడు ) రూ. 300 కోసం మ్యాచ్‌లు ఆడి.. హర్యానాలోని కర్నాల్‌లో జన్మించాడు. రైట్ ఆర్మ్ మీడియం బౌలర్. అతడి తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సైనీ.. క్రికెట్లో శిక్షణ తీసుకునేందుకు సరిపడా డబ్బు లేక ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ వాటి ద్వారా వచ్చే 300 రూపాయలతో అవసరాలు తీర్చుకునేవాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనీ వన్డేల్లో రంగప్రవేశం చేశాడు. ఇక సీనియర్ పేసర్ ఉమేశ్ గాయపడటంతో సిడ్నీ టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్‌కు కలిసొచ్చిన టూర్ తమిళనాడులోని చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. నటరాజన్ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు. ఈ క్రమంలో 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ల సలహాలు నటరాజన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఆసీస్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్ మనుకా ఓవల్ మైదానంలో ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఆ తర్వాత టీ20, గబ్బా మ్యాచ్ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు. సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్, గిల్ తండ్రి సుందర్‌కు క్రికెట్ అంటే మక్కువ. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ వాషింగ్టన్ అనే వ్యక్తి ఆయనకు అండగా నిలబడ్డాడు. ప్రోత్సాహం అందించాడు. ఈ క్రమంలో స్థానికంగా సుందర్ మంచి పేరు సంపాదించారు. అయితే తన రెండో కొడుకు జన్మించే కొన్నిరోజుల ముందు వాషింగ్టన్ మరణించడంతో ఆయన జ్ఞాపకార్థం, వాషింగ్టన్ సుందర్‌గా తనకు నామకరణం చేశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ప్రవేశించాడు. గబ్బా టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సుందర్.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 21 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక సిరాజ్, సైనీ, నటరాజన్, సుందర్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 259 పరుగులతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. -
'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా'
బ్రిస్బేన్: ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన టి.నటరాజన్ తొలి సిరీస్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టాడు.మూడు మ్యాచ్‌లు కలిపి 6.92 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీశాడు.ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం నటరాజన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే టీమిండియా ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా నటరాజన్ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు తీశాడు... కానీ నటరాజన్ విషయంలో నో బాల్స్ అంశం మాత్రం బాగా కలవరపెడుతుంది. మంచి ఫుట్‌వర్క్ కలిగిన నటరాజన్ ఆడిన తొలి టెస్టులోనే ఏడు నోబాల్స్ వేయడం విశేషం. టెస్టు మ్యాచ్‌లో నోబాల్స్ పడడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇదే అంశంపై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. 'నటరాజన్ బౌలింగ్ శైలి అద్భుతంగా ఉంది.. అతను వికెట్ తీసే విధానం కూడా చాలా బాగుంది. కానీ నో బాల్స్ విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా. టెస్టుల్లో నో బాల్స్ వేయడం అరుదు.. అలాంటిది నటరాజన్ మాత్రం ఏడు నోబాల్స్ వేశాడు. దీంతోపాటు ఒక ఓవర్ ప్రారంభంలోనే మొదటి బంతి సరిగా వేయడానికి ఐదు నో బాల్స్ వేయడం కాస్త ఆశ్యర్యం వేసింది. ఆ సమయంలో నటరాజన్‌కు ఆ బంతులు జీర్ణించుకోవడం కాస్త కష్టంగా మారి ఉంటుంది.' అని తెలిపాడు. (చదవండి: ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) కాగా గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్‌గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (4), శుభ్‌మన గిల్ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది.(చదవండి: రోహిత్ కావాలనే అలా చేశాడా!) -
నటరాజన్ అరుదైన ఘనత
బ్రిస్బేన్: ఈ సీజన్ ఐపీఎల్ మొదలుకొని వచ్చిన ప్రతీ అవకాశాన్ని సీమర్ నటరాజన్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేసి సత్తాచాటిన నటరాజన్.. టెస్టు క్రికెట్లోకి అనూహ్యంగా దూసుకొచ్చి తనకు ఏ ఫార్మాట్ అయినా ఒకటేనని చాటి చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో చోటు దక్కించుకుని టెస్టుల్లో అరంగేట్రం చేసిన నటరాజన్.. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో దుమ్ములేపాడు. లబూషేన్, మాథ్యూవేడ్‌లతో పాటు హజిల్‌వుడ్ వికెట్‌ను నటరాజన్ సాధించాడు. దాంతో ఒక అరుదైన జాబితాలో నటరాజన్ చేరిపోయాడు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం ఇన్నింగ్స్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో లెఫ్మార్మ్ సీమర్‌గా నటరాజన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆర్పీసింగ్(2005-06 సీజన్లో పాకిస్తాన్‌పై), ఎస్ఎస్ న్యాల్‌చంద్(1952-53 సీజన్లో పాకిస్తాన్‌పై)లు ఉండగా ఇప్పుడు నటరాజన్ చేరిపోయాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ తొలి ఇన్సింగ్స్‌లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. ఓవరనైట్ ఆటగాళ్లు పైన్, కామెరూన్ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు. ఈ జోడి 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్‌గా పైన్ ఔటైన తర్వాత ఆసీస్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్ 24 పరుగులు చేశాడు. నటరాజన్‌కు జతగా శార్దూల్, వాషింగ్టన్ సుందర్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్ దక్కింది. -
లెఫ్టార్మ్ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?
బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ గబ్బా స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. డేవిడ్ వార్నర్(1)ని సిరాజ్ ఔట్ చేయగా, పకోవిస్కీ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్కస్ హారిస్(5)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‌కు పంపాడు. దాంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వార్నర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ పట్టడంతో టీమిండియాకు శుభారంభం లభించింది. అనంతరం శార్దూల్ వేసిన 9 ఓవర్ తొలి బంతికి హారిస్ పెవిలియన్ చేరాడు. హారిస్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ పట్టడంతో ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్‌ను లబూషేన్, స్టీవ్ స్మిత్‌లు చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. లంచ్ సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. దాంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను వార్నర్, హారిస్‌లు ఆరంభించగా,వారికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. (ఇంత దారుణమా.. క్రికెట్‌ను చంపేశాడు!) నటరాజన్@300 ఈ మ్యాచ్ ద్వారా నటరాజన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 300వ టెస్టు ఆటగాడిగా నటరాజన్ నిలిచాడు. టెస్టుల్లో 100వ క్యాప్‌ను బాలూ గుప్తే(1960-61) ధరించగా, రెండొందలవ టెస్టు క్యాప్‌ను నయాన్ మోంగియా(1993-94) ధరించాడు. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన నటరాజన్‌కు ఎట్టకేలకు అవకాశం దక్కింది. బుమ్రా గాయం కారణంగా వైదొలగడంతో నటరాజన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. భారత్ తరఫున చివరిసారి ఒక లెఫ్టార్మ్ సీమర్ అరంగేట్రం చేసింది టెస్టుల్లో అరంగేట్రం చేసింది 2010-11 సీజన్లో. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఉనాద్కత్ అరంగేట్రం చేశాడు. ఆపై ఇంతకాలానికి నటరాజన్ ఒక లెఫ్టార్మ్ సీమర్‌గా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఇదిలా ఉంచితే, ఒక లెఫ్టార్మ్ సీమర్ భారత్ తరఫున ఆడింది మాత్రం 2013-14 సీజన్లో మాత్రమే. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జహీర్ ఖాన్ భారత్ తరఫున టెస్టుల్లో ఆడిన చివరి లెఫ్టార్మ్ సీమర్. భారత్ తుది జట్టు రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, చతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, టి నటరాజన్ ఆస్ట్రేలియా తుది జట్టు టిమ్ పైన్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, హారిస్, లబూషేన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, కమిన్స్, స్టార్క్, నాథన్ లయన్, జోష్ హజిల్‌వుడ్ The stuff dreams are made of. A perfect treble for @Natarajan_91 as he is presented with #TeamIndia's Test 🧢 No. 300. It can't get any better! Natu is now an all-format player. #AUSvIND pic.twitter.com/cLYVBMGfFM — BCCI (@BCCI) January 14, 2021 -
వాళ్లన్నట్టుగానే సైనీ కే ఓటు పడింది!
న్యూఢిల్లీ: ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేని నటరాజన్‌ను సిడ్నీ టెస్టులో ఆడించడం సరైన నిర్ణయం కాదని వెటరన్ ఆటగాళ్ల అభిప్రాయం కాబోలు నవదీప్ సైనీకే బీసీసీఐ జై కొట్టింది. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్టుకు నవదీప్ సైనీకి అవకాశం కల్పించింది. సిడ్నీ టెస్టుకు సంబంధించి తుది జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక గత మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోని మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్‌ను తీసుకుంది. కాగా, గాయపడ్డ ఉమేష్ యాదవ్ స్థానంలో నటరాజన్‌ను తీసుకునేందుకు జట్టు యాజమాన్యం యోచించగా.. ఇండియన్ వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా వంటివారు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. నటరాజన్ బదులు నవదీప్ సైనీని తుది జట్టులోకి తీసుకుని అరంగేట్రం చేయించాలని నెహ్రా మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడడంతోపాటు, సిడ్నీ ఫ్లాట్ వికెట్‌పై సైనీ ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ టీమిండియాకు పనికొస్తుందని పేర్కొన్నాడు. గాయపడిన మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వచ్చారని, సైనీని నేరుగా తీసుకున్నారని గుర్తు చేశాడు. అందుకనే మూడో పేసర్‌గా తొలి ప్రాధాన్యం సైనీకే ఇవ్వాలని సూచించాడు. అతని తర్వాత స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ఉంటారని నెహ్రా తెలిపాడు. ఇక మెల్బోర్న్ టెస్టులో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్‌పై అతను ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్‌లోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిలా సిరాజ్ బౌలింగ్ చేశాడడని నెహ్రా కొనియాడాడు. కాగా, నెట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన తమిళనాడు సేలంకు చెందిన టి.నటరాజన్ ఐపీఎల్ 2020లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి నిరూపించుకున్నాడు. యార్కర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుని ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఇదిలాఉండగా.. తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. -
వారెవ్వా.. నటరాజన్
మెల్బోర్న్: నటరాజన్.. ఈ ఐపీఎల్ ద్వారా నిరూపించుకుని భారత జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన నటరాజన్.. టెస్టు జట్టులో సైతం అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్... గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ఆ స్థానాన్ని నటరాజన్ చేజిక్కించుకున్నాడు. మూడో టెస్టు నాటికి ఎవర్ని ఎంపిక చేయాలనే దానిపై టీమిండియా మేనేజ్మెంట్ అనేక తర్జన భర్జనలు పడిన తర్వాత నటరాజన్‌ను ఎంపిక చేసింది. ఇక్కడ నటరాజన్ అదృష్టం వరించిందనే చెప్పాలి. భారత క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం నటరాజన్‌ను జట్టుతో పాటే ఉంచుకోగా అతనికి టెస్టుల్లో ఆడే అవకాశం రావడం లక్కీగానే చెప్పాలి. శుక్రవారం నటరాజన్‌ను టీమిండియా స్క్కాడ్లో చేర్చుతూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దాంతో నటరాజన్ ప్రాక్టీస్‌పై సీరియస్‌గా దృష్టి సారించాడు. మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేసే క్రమంలో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు నటరాజన్. మరొక యార్కర్ల స్పెషలిస్టుగా ఇప్పుడిప్పుడే అభిమానుల మదిలో స్థానం సంపాదించుకుంటున్న నటరాజన్.. ఓ క్యాచ్‌ను వెనక్కి పరుగెడుతూ అందుకున్న తీరు అబ్బురపరచడమే కాదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్వీటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ‘ ఈ పర్యటనలో నటరాజన్ తనకు వచ్చిన అవకాశాల్ని చాలా చక్కగా పట్టేస్తున్నాడు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. @Natarajan_91 has been grabbing his chances very well on this tour. 😁🙌 #TeamIndia #AUSvIND pic.twitter.com/sThqgZZq1k — BCCI (@BCCI) January 3, 2021 -
లక్కీ చాన్స్ కొట్టేసిన నటరాజన్
మెల్బోర్న్: టీమిండియా ప్రదాన బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా ఆసీస్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో తమిళనాడుకు చెందిన ‘యార్కర్’ సంచలనం నటరాజన్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో మిగిలున్న రెండు టెస్టుల్లో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ‘సీనియర్ సీమర్ ఉమేశ్ తీవ్రమైన ఎడమకాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. మూడో టెస్టుకల్లా పూర్తిగా కోలుకునే అవకాశం లేదు. దీంతో మూడు, నాలుగు టెస్టుల కోసం అతని స్థానంలో నటరాజన్ ఆడతాడు’ అని షా వెల్లడించారు. నెట్ బౌలర్‌గా ఉన్న నటరాజన్ తొలుత ఐపీఎల్‌లోనూ ఆపై టీమిండియాలో చోటు సంపాదించి నిరూపించుకున్నాడు. కరోనా కాలంలోనూ లక్కీ చాన్స్ కొట్టేసి టెస్టుల్లోనూ అరంగేట్రం చేయనున్నాడు. (చదవండి: రోహిత్ శర్మకు ప్రమోషన్) ఇదిలాఉండగా.. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో నటరాజన్ అరంగేట్రం చేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు (3,2,1) తీసి అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలై సిరీస్ కోల్పోయిన టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించి పరువు నిలుపుకుంది. రెండు టీ20 మ్యాచ్‌లలో వరుసగా విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో టీ20లో ఆసీస్ గెలుపొందింది. ఇక ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు సిడ్నీ వేదికగా ఈ నెల 7 నుంచి మొదలు కానుంది. (చదవండి: నెట్ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్) -
'కోహ్లికి ఇచ్చారు.. నటరాజన్‌కు ఎందుకివ్వరు'
ఢిల్లీ : టీమిండియా మేనేజ్మెంట్ ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరికి ఒకేలా రూల్స్ ఎందుకుండవని ప్రశ్నించాడు. ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టు అనంతరం విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గవాస్కర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి మాత్రమే పితృత్వ సెలవులు తీసుకునే హక్కు ఉందా..? ఈ మధ్యనే టీమిండియాలో అడుగుపెట్టిన యార్కర్ స్పెషలిస్ట్ టి. నటరాజన్‌కు పితృత్వ సెలవులు ఎందుకివ్వరు.. కొత్తగా జట్టులోకి వచ్చినంత మాత్రానా ఇలా పక్షపాతం చూపించడం కరెక్ట్ కాదు అని గెస్ట్కాలమ్లో చెప్పుకొచ్చాడు. (చదవండి : చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం) 'కోహ్లి విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును గమనిస్తే మరోసారి ఆటగాళ్లకుండే రూల్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆసీస్ టూర్ ఉన్న ఒక యువ ఆటగాడు రూల్స్ గురించి కచ్చితంగా ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉంటాడు. అతను ఎవరో కాదు.. టి. నటరాజన్. యార్కర్ల స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన అతను ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. నటరాజన్ ప్రదర్శకు ముగ్దుడైన హార్దిక్ పాండ్యా తనకి లభించిన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ నిజానికి నటారాజన్‌కు దక్కాల్సిందని తెలిపాడు. ఆసీస్ టూర్లో ఉన్న నటరాజన్ కూడా ఇటీవలే తండ్రయ్యాడు. ఐపీఎల్ 2020 సమయంలోనే అతని భార్య బిడ్డను ప్రసవించింది.. కానీ నటరాజన్ తన బిడ్డని ఇంకా చూడలేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత నటరాజన్ యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకి వెళ్లాల్సి వచ్చింది. వన్డే, టెస్టు సిరీస్ తర్వాత టెస్టు జట్టులో లేకపోయినా.. నెట్ బౌలర్‌గా నటరాజన్‌ను అక్కడే ఉంచేశారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తనకి పుట్టబోయే బిడ్డని చూసేందుకు భారత్‌కి వస్తున్నాడు. కానీ.. పుట్టిన బిడ్డని మొదటి సారి చూసేందుకు నటరాజన్ జనవరి మూడో వారం వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. కోహ్లికి ఒక రూల్... మిగతా ఆటగాళ్లకు మరో రూల్ ఉంటుందా. టీమిండియాలో ఒక్కో ఆటగానికి ఒక్కో రూల్ ఉండాలనేది జట్టు మేనేజ్మెంట్కు మాత్రమే చెల్లుతుందని' గవాస్కర్ విమర్శించాడు. కాగా కోహ్లి భార్య అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో బిడ్డకి జన్మనివ్వనుంది. (చదవండి : దీనిని 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్' అనొచ్చా..) భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియా మేనేజ్మెంట్ స్పిన్నర్ అశ్విన్‌పై పక్షపాత ధోరణి చూపిస్తుంది. అశ్విన్‌కున్న ముక్కుసూటితనంతో జట్టులో అతను ఎప్పుడు స్థానం గురించి పోరాడాల్సి వస్తూనే ఉంది. అశ్విన్ తుది జట్టులోకి ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో ఎవరికి అంతుచిక్కదు. ఒక మ్యాచ్‌లో అతని బౌలింగ్ బాగాలేకపోతే మరుసటి మ్యాచ్‌లోనే పక్కన పెట్టేస్తారు. 350 వికెట్లు.. బ్యాటింగ్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఒక ఆటగాడిని ఏ జట్టు వదులుకోవడానికి సిద్ధపడదు. ఫాంలో లేకపోతే పక్కడ పెట్టడం సరైనదే.. దానికి ఒప్పుకుంటా. కానీ ఒక ఆటగాడు మంచి ఫాంలో ఉన్నప్పుడు కూడా జట్టు నుంచి తీసేయడమనేది అతని మానసిక దైర్యాన్ని దెబ్బతీయడం అవుతుంది. టీమిండియా మేనేజ్మెంట్కు మాత్రమే ఇలాంటి విషయాలు చెల్లుబాటు అవుతాయి. ఆసీస్ టూర్లో అశ్విన్ ప్రధానపాత్ర పోషించనున్నాడనేది సత్యం.. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ తన ధోరణి మార్చుకోవాలి' అని తెలిపాడు. -
నటరాజన్ జోరు.. ఆ క్రెడిట్ వాళ్లదే: రవిశాస్త్రి
సిడ్నీ: వన్డే సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం ద్వారా టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకున్న భారత్ ప్రస్తుతం టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. అయితే వన్డే, టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం జట్టుతో లేడన్న సంగతి తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన పాండ్యాను సెలక్టర్లు టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ పాండ్యాను టెస్టు జట్టులో ఎంపిక చేసి ఉంటే బౌలింగ్ కూడా చేయాల్సి ఉంటుందని, బ్యాట్స్‌మన్‌గా మాత్రమే హార్దిక్‌ను టెస్టు జట్టులోకి పరిగణించలేమన్నాడు. పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా ఫిట్ కాలేకపోవడమే హార్దిక్‌ను టెస్టు జట్టులో ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణమని స్పష్టం చేశాడు.(చదవండి: నా దృష్టిలో అతడే గొప్ప.. కానీ నా ఓటు కోహ్లికే!) ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా విజయాల్లో హార్దిక్ పాండ్యా, నటరాజన్ కీలక పాత్ర పోషించారన్న విషయం విదితమే. మూడో వన్డేలో చెలరేగి ఆడిన పాండ్యా.. 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్స్‌తో 92 పరుగులు సాధించాడు. తద్వారా తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఇక వన్డే సిరీస్‌లో మొత్తంగా 210 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్.. టీ20లోనూ అదే జోరును కొనసాగించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ నటరాజన్ అరంగేట్రంలో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు(3,2,1) తీసి అద్భుత ప్రదర్శనతో అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. పాండ్యా సైతం తన దృష్టిలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు అతడే అర్హుడంటూ అభిమానం చాటుకున్నాడు. వీళ్లిద్దరి ప్రదర్శనపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ప్రశంసలు కురిపించాడు. ‘‘రోహిత్, బుమ్రా లేకుండా టీ20 సిరీస్ గెలవడమనేది అతి పెద్ద విజయంగా భావించాల్సి ఉంటుంది. జట్టు మొత్తం ఎంతో బాధ్యతగా ఆడింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సహజమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతడి తర్వాతే ఎవరైనా. ఈ సిరీస్‌లో బంతిని అత్యంత అద్భుతంగా స్ట్రైక్ చేసింది అతడే’’ అని కొనియాడాడు. అదే విధంగా నటరాజన్ గురించి చెబుతూ.. ‘‘తనను నెట్ బౌలర్‌గా తీసుకున్నాం. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అతడిపై నమ్మకం ఉంచిన టీం మేనేజ్‌మెంట్‌కే ఆ క్రెడిట్ దక్కుతుంది. తనలో విశ్వాసం నింపిన విధానం అమోఘం. తన సుదీర్ఘ ప్రయాణానికి ఇదో మంచి ఆరంభం’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.(చదవండి: నెట్ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్) -
నిన్ను ద్వేషించేందుకు ఒక్క కారణం చెప్పు.. వార్నర్!
సిడ్నీ: టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా బౌలర్ నటరాజన్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. నెట్ బౌలర్‌గా వచ్చి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేతో అరంగేట్రం చేసిన తమిళనాడు పేసర్ నటరాజన్.. టీ20 సిరీస్‌లో 6.91 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు. జట్టుకు కీలకమైన మ్యాచుల్లో మెరుగ్గా రాణించడం ద్వారా ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడు. దీంతో తొలి మ్యాచ్ నుంచి సహచర ఆటగాళ్లు, క్రికెట్ దిగ్గజాలు నటరాజన్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం చేరాడు. (చదవండి: చిన్నప్పటి నుంచి నేనింతే: నటరాజన్) కాస్త బాధగా ఉన్నా నటరాజన్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన అతడు... ‘‘గెలిచినా, ఓడినా, డ్రా అయినా.. మైదానం వెలుపల మేం పరస్పరం గౌరవించుకుంటాం. ఈ సిరీస్ చేజారినందుకు బాధగానే ఉన్నా.. నటరాజన్ అద్భుత ప్రదర్శనను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. ఆటను తనెంతగానో ప్రేమిస్తాడు. నెట్ బౌలర్‌గా ఈ టూర్ ప్రారంభించి.. వన్డే, టీ20ల్లో ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. నువ్వు సాధించిన ఘనత అమోఘం’’ అని కితాబిచ్చాడు. అంతేగాక సన్‌రైజర్, ఆరెంజ్ఆర్మీ ట్యాగులను ఇందుకు జతచేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘‘నిన్ను ద్వేషించడానికి ఒక్క కారణం కావాలి వార్నర్ భాయ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో వార్నర్, నటరాజన్ సహ సభ్యులన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2020 సీజన్లో మొత్తంగా 16వికెట్లు తీసి నటరాజన్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీమిండియాతో చివరి వన్డేతో పాటు, టీ20 సిరీస్ నుంచి కూడా వార్నర్ తప్పుకొన్న విషయం విదితమే. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
నేను అంపైర్‌తో మాట్లాడాను.. కానీ: కోహ్లి
సిడ్నీ: ‘‘నేను రాడ్‌తో(టకర్ రాడ్, అంపైర్) చర్చించా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అని అడిగాను. ఇది టీవీ వల్ల జరిగిన తప్పిదం.. మనం ఇంకేం చేయలేమని అతడు నాతో చెప్పాడు’’ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం నాటి మ్యాచ్‌లో జరిగిన ‘‘రివ్యూ డ్రామా’’ గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఆసీస్ కోహ్లి సేనపై గెలుపొందింది. ఓపెనర్ వేడ్, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలకు తోడు స్పిన్నర్ల పొదుపైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టుకు ఊరట విజయం లభించింది. అయితే 11వ ఓవర్లో టీమిండియా వేగంగా స్పందించి రివ్యూ కోరి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఓవర్లో భారత బౌలర్ నటరాజన్ వేసిన నాలుగో బంతి ఓపెనర్ మాథ్యూ వేడ్ ప్యాడ్లను తాకింది. దీని గురించి నటరాజన్, వికెట్ కీపర్ రాహుల్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. (చదవండి: చిన్నప్పటి నుంచి నేనింతే: నటరాజన్) ఇక ఈ అంశంపై టీమిండియా రివ్యూ కోరే లోపే భారీ స్క్రీన్‌పై రీప్లే కనిపించింది. దీంతో కెప్టెన్ కోహ్లి రివ్యూ కోరే లోపే థర్డ్ అంపైర్ అతడి అభ్యర్థన చెల్లదని ప్రకటించాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే భారత జట్టు కట్టుబడింది. అయితే చివరకు రీప్లేలో అది స్పష్టంగా అవుట్ అయినట్లు కనిపించడంతో తాము అన్యాయంగా వికెట్ చేజార్చుకున్నామని కోహ్లి సేన బాధపడాల్సి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన కోహ్లి.. సమయం ముగిసేలోపే రివ్యూ కోరినట్లు వెల్లడించాడు. ‘‘ఆ ఎల్బీడబ్ల్యూ విచిత్రమైంది. రివ్యూకు వెళ్లాలా.. వద్దా అని మేం చర్చించుకునే లోపే.. అంపైర్ తన నిర్ణయం ప్రకటించాడు. రివ్యూ కోరాలని నిర్ణయించుకునే లోపే స్క్రీన్‌పై కూడా ప్లే అయ్యింది. ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం సరికాదు. టీవీ వాళ్ల చిన్న తప్పిదం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి న పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటివి పునరావృతం కాకూడదు. మా స్థానంలో ఎవరు ఉన్నా సరే ఇలా వికెట్‌ను మిస్ చేసుకోవడాన్ని ఇష్టపడరు కదా’’ అని పేర్కొన్నాడు. -
టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు
సిడ్నీ : తమిళనాడు నుంచి టీమిండియాకు ఎంపికైన యార్కర్ బౌలర్ టి.నటరాజన్ అరంగేట్రం సిరీస్‌నే మధురానుభూతిగా మలుచుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన నటరాజన్ 6.91 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నటరాజన్‌పై తొలి మ్యాచ్ నుంచే ప్రశంసల జల్లు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నటరాజన్ ప్రదర్శన అద్బుతమని మెచ్చకున్నాడు. మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు ప్రధాన కార్యక్రమంలో కోహ్లి మాట్లాడాడు. (చదవండి : నెట్ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్) 'నటరాజన్ ప్రదర్శనపై ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. షమీ, బుమ్రా లాంటి కీలక బౌలర్ల గైర్హాజరీలో నటరాజన్ 6 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అరంగేట్రం సిరీస్‌లోనే ఇంతలా ఆకట్టుకున్న నటరాజన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్న అతను రానున్న మ్యాచ్‌ల్లో ఇదే ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా. ఒకవేళ నటరాజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన ఉంటే రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్ కానున్నాడ'ని తెలిపాడు.(చదవండి : కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే) ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, బుమ్రా, షమీ లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఒత్తిడిని దరి చేరకుండా యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడినా.. చివరి వన్డే గెలవడంతో ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే నమ్మకంతో టీ20 సిరీస్‌ను ఆరంభించాం. మొదటి టీ20లో తక్కువ స్కోరు నమోదు చేసినా బౌలర్ల అద్భుత ప్రతిభతో మ్యాచ్‌ను గెలిచాం. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లోనూ అదే ప్రతిభను కనబరిచి సిరీస్‌ను దక్కించుకున్నాం. చివరి టీ20లో ఓడినా.. జట్టులోని ఆటగాళ్లంతా సమిష్టి ప్రదర్శన కనబరిచాం. ఫీల్డింగ్ లోపాలతో పాటు బౌలింగ్‌లోనూ కాస్త మెరుగైన ప్రదర్శన వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేది 'అని కోహ్లి పేర్కొన్నాడు. -
చిన్నప్పటి నుంచి నేనింతే: నటరాజన్
సిడ్నీ: ‘‘చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు. చిన్నప్పటి నుంచి నేనింతే. వికెట్ తీసిన ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలీదు. అందుకే ఒక చిరునవ్వుతో సరిపెట్టేస్తాను. అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఏదేమైనా.. ఈ ట్రిప్ నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. బలమైన ప్రత్యర్థి జట్టుపై నేను బాగా ఆడగలిగాను. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. నా ప్రదర్శన పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నా. జట్టు సభ్యులందరూ నాకు అండగా నిలవడం వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ టీమిండియా బౌలర్ నటరాజన్ ఆసీస్ పర్యటన తాలూకు మధుర జ్ఞాపకాలు పంచుకున్నాడు. నెట్‌బౌలర్‌గా వచ్చిన తనకు వన్డే, టీ20ల్లో ఆడే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదని, వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తనకు ఛాన్స్ దక్కిందని పేర్కొన్నాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగాని, ఈ టూర్ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించేది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.(చదవండి: టీమిండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు: మెక్‌గ్రాత్) ఇక ఐపీఎల్లో మెరుగ్గా రాణించడం వల్లే ఇక్కడిదాకా వచ్చానన్న ఈ తమిళనాడు పేసర్.. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే ద్వారా అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఆ మ్యాచ్‌లో రెండు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా 3, 2 వికెట్లు, మంగళవారం నాటి ఆఖరి టీ20లో ఒక వికెట్ తీసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం నటరాజన్ మాట్లాడుతూ.. ‘‘నా బలాలేమిటో నాకు తెలుసు. నన్ను నేను నమ్ముకున్నా. పిచ్ స్వభావం గురించి వికెట్ కీపర్, కెప్టెన్‌తో ముందుగానే చర్చించేవాడిని. అందుకు అనుగుణంగానే బౌలింగ్ చేశాను. డెత్ ఓవర్లలో కట్టర్స్, యార్కర్లు వేశాను. ఐపీఎల్లో ఏం చేశానో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాను. అనుకున్నది అనుకున్నట్లుగా ఆచరణలో పెట్టాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక చివరి టీ20లో కోహ్లి సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.(చదవండి: ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా) నువ్వే అర్హుడివి: పాండ్యా కాగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నటరాజన్‌పై సహచరులు, క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆల్‌రౌండర్, టీ20 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హార్దిక్ పాండ్యా తాజాగా మరోసారి ఈ పేసర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్విటర్లో అతడితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసిన పాండ్యా.. ‘‘నటరాజన్.. ఈ సిరీస్‌లో నీ ప్రదర్శన అత్యద్భుతం. కఠిన పరిస్థితుల్లో జట్టు తరఫున అరంగేట్రం చేసి ఇంత గొప్పగా రాణించడం నీ ప్రతిభ, కఠోర శ్రమకు నిదర్శనం. నాకు తెలిసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు నువ్వే అర్హుడివి భాయ్!’’ అని అభిమానం చాటుకున్నాడు. చదవండి: నటరాజన్ అరంగేట్రం.. అద్భుతమైన కథ! Natarajan, you were outstanding this series. To perform brilliantly in difficult conditions on your India debut speaks volumes of your talent and hardwork 👏 You deserve Man of the Series from my side bhai! Congratulations to #TeamIndia on the win 🇮🇳🏆 pic.twitter.com/gguk4WIlQD — hardik pandya (@hardikpandya7) December 8, 2020 -
కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో టి. నటరాజన్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీతో ధాటిగా ఆడుతున్నాడు. ఓవర్లో నటరాజన్ వేసిన నాలుగో బంతి వేడ్ ప్యాడ్లను తాకింది. కానీ నటరాజన్.. కీపర్ రాహుల్ ఎల్బీపై అంపైర్‌కు అప్పీల్ చేసినా ఎటుంటి స్పందన రాలేదు... టీమిండియా కూడా రివ్యూ కోరలేదు. (చదవండి : అయ్యో! చహల్ ఎంత పని జరిగింది) అయితే థర్డ్ అంపైర్ చూపించిన రిప్లైలో మాత్రం వేడ్ ఔట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మైదానంలోని బిగ్స్క్రీన్పై వేడ్ ఔట్ అయినట్లు కనిపించడంతో షాక్ తిన్న కోహ్లి రివ్యూ కోరాడు. కానీ అంపైర్ కోహ్లి రివ్యూను తిరస్కరించారు. సమయం మించిన తర్వాత రివ్యూ కోరావని.. అందుకే తిరస్కరించామని అంపైర్లు చెప్పడంతో కోహ్లి ఏం చేయలేకపోయాడు. ఒకవేళ కోహ్లి రివ్యూ కోరుంటే 50 పరుగుల వద్ద వేడ్ ఔటయ్యేవాడు. అలా బతికిపోయిన వేడ్ ఆ తర్వాత మరో 30 పరుగులు రాబట్టాడు.కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే ఫలితం వేరేలా ఉండేది అని అభిమానులు పేర్కొంటున్నారు. (చదవండి : స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే స్టన్ అయ్యాడు..) -
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతడే: భజ్జీ
న్యూఢిల్లీ: ‘‘తనను చూస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు అధిగమించిన తీరు, ప్రస్తుతం ఆసీస్ టూర్లో అదరగొడుతున్న విధానం అద్భుతం. కష్టపడి పనిచేస్తూ, మనల్ని మనం నమ్ముకుంటే జీవితంలో అనుకున్నవి సాధించగలమని అతడు నిరూపించాడు. ఈ సిరీస్‌లో తనే బ్రిలియంట్ బౌలర్. తనొక ముఖ్యమైన పిల్లర్. అవసరమైన సమయంలో వికెట్లు తీసి సత్తా చాటుతున్నాడు. టీమిండియా మ్యాచ్‌లో గెలవడంలో తన పాత్ర అమోఘం. యార్కర్లు సంధిస్తున్న తీరు, డెత్ ఓవర్లలో బౌలింగ్ విధానం ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ 2020లో మెరుగ్గా రాణించిన అతడు టీ20 సిరీస్‌లో స్మిత్ వంటి ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఎదురుగా ఎవరున్నా ఏమాత్రం భయపడటం లేదు. తనలో ఉన్న ప్రత్యేకత అదే’’ అంటూ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ భారత బౌలర్ నటరాజన్‌పై ప్రశంసలు కురిపించాడు. (చదవండి: ) ఆసీస్ పర్యటనలో అద్భుతంగా ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్(టీ20) అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే జరిగితే తనతో పాటు జట్టులో కూడా సరికొత్త ఉత్సాహం నిండుతుంది. టీమిండియాకు తనొక ప్లస్. తనది గొప్ప కథ’’ అని భజ్జీ కొనియాడాడు. కాగా ఆసీస్ పర్యటనలో మెరుగ్గా రాణిస్తున్న టీమిండియా బౌలర్ నటరాజన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాండ్యా వంటి సహచర ఆటగాళ్లతో పాటు మాజీ దిగ్గజాలు మెక్‌గ్రాత్, ఇయాన్ బిషప్, టామ్ మూడీ తదితరులు అతడి ఆట తీరుకు ఫిదా అవుతున్నారు. కాగా చివరి వన్డేతో అరంగేట్రం చేసిన నటరాజన్ ఆ మ్యాచ్‌లో రెండు, తొలి 20లో 3, రెండో టీ20లో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. -
తన ఆటతో ఇంప్రెస్ అయ్యాను: మెక్‌గ్రాత్
సిడ్నీ: టీమిండియా బౌలర్ నటరాజన్‌పై ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా టూర్లో భాగంగా భారత్ నటరాజన్ రూపంలో గొప్ప ఆటగాడు లభించాడంటూ కొనియాడాడు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఇలాగే ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు. కాగా వన్డే సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న తమిళనాడు పేసర్ నటరాజన్, అరంగేట్రంలోనే రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా అప్పటికే ఆసీస్ చేతిలో 2-0తో సిరీస్ కోల్పోయిన కోహ్లి సేన చివరి వన్డేలో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. మహ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసిన అతడు.. తాను సరైన ఎంపిక అని రుజువు చేసుకున్నాడు. (చదవండి: నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్) అంతేకాక శుక్రవారం జరిగిన తొలి టీ20లో 4 ఓవర్లలో మూడు కీలక వికెట్లు(30 పరుగులు) తీసి సత్తా చాటాడు. అదే విధంగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లోనూ నిన్నటి మ్యాచ్‌లో నటరాజన్ నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 20 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగానే ఆసీస్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఈ క్రమంలో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుని బదులు తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా కామంటేటర్ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా నటరాజన్ కలిసినట్లు పేర్కొన్నాడు. (చదవండి: నటరాజన్ అరంగేట్రం.. అద్భుతమైన కథ!) ప్రస్తుతం అతడు బౌల్ చేస్తున్న తీరు అద్భుతమని, ఆస్ట్రేలియా పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడని చెప్పుకొచ్చాడు. ఇకపై తాను వికెట్లు తీసేందుకు కేవలం యార్కర్లపై మాత్రమే ఆధారపడే పరిస్థితి లేదన్నాడు. నటరాజన్ ఆటతో తనను ఇంప్రెస్ చేశాడని ప్రశంసించాడు. కాగా 2015-16 ఆసీస్ టూర్లో భాగంగా బుమ్రా, 2018-19లో మయాంక్ అగర్వాల్ మెరుగైన ప్రదర్శనతో వెలుగులోకి రాగా ప్రస్తుతం నటరాజన్ సైతం ఆస్ట్రేలియా టూర్లోనే తనదైన ముద్ర వేయడం గమనార్హం. ఇక అరంగేట్ర మ్యాచ్ నుంచి మెరుగ్గా రాణిస్తున్న నటరాజన్‌పై ఇప్పటికే మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నటరాజన్ ఫామ్ చూస్తుంటే షమీ స్థానానికి ఎసరు వచ్చేలా ఉందని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడటం వెనుక ఉన్న అతడి కఠోర శ్రమ గురించి క్రికెట్ దిగ్గజాలు ఇయాన్ బిషప్, టామ్ మూడీ సైతం ప్రస్తావిస్తూ... తనది మనసును హత్తుకునే అద్భుతమైన కథ అంటూ ట్వీట్ చేశారు. -
'నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా'
కాన్బెర్రా : ఆసీస్‌తో శుక్రవారం కాన్బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20లో టి. నటరాజన్ మరోసారి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. నిన్న జరిగిన టీ20లో జడేజా స్థానంలో కాంకషన్‌గా వచ్చిన చహాల్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచినా.. నటరాజన్ బౌలింగ్‌ను తీసిపారేసిదిగా కనిపించదు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ నటరాజన్ ప్రదర్శపై ప్రసంశలు కురిపించాడు. నటరాజన్ రాకతో టీ20 ఫార్మాట్లో మహ్మద షమీకి కష్టమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) సోనీసిక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ' టీ20 స్పెషలిస్ట్‌గా తుది జట్టులోకి వచ్చిన నటరాజన్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నా దృష్టిలో మహ్మద్ షమీ స్థానాన్ని నటరాజన్ భర్తీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లో షమీ స్థానం పదిలంగా ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. మరో పేసర్ బుమ్రాకు సరిజోడిగా కనిపిస్తున్నాడు. పైగా వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది.' అంటూ తెలిపాడు. (చదవండి : కోహ్లి.. ఇదేం వ్యూహం?) ఐపీఎల్ 13వ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన నటరాజన్‌ను ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరపున 16 వికెట్లు తీసిన నటరాజన్ యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేశాడు. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అతని ప్రదర్శనను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో అరంగేట్రం చేసిన నటరాజన్ మార్నస్ లబుషేన్ వికెట్ తీసి మెయిడెన్ వికెట్ తీశాడు. శనివారం జరిగిన టీ20లో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేసి తొలి టీ20 వికెట్ తీసిన నటరాజన్ తర్వాత ఓపెనర్ డీ ఆర్సీ షాట్‌తో పాటు మిచెల్ స్టార్క్‌ను పెవిలియన్ చేర్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : నటరాజన్
కాన్బెర్రా : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.. టి. నటరాజన్. అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్లను తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. మార్నస్ లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా మెయిడెన్ వికెట్ తీసిన ఆనందక్షణాలను నటరాజన్ షేర్ చేసుకున్న తీరు అద్భుతం. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా నటరాజన్ మ్యాచ్ అనంతరం తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. (చదవండి : 'కోహ్లి వేగం మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా') 'ఆసీస్‌తో మ్యాచ్ నాకు మంచి అనుభవంలా కనిపించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్ 232వ ప్లేయర్‌గా టీమిండియా తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా బుధవారం కెప్టెన్ విరాట్ కోహ్లి చేతులు మీదుగా క్యాప్ అందుకున్నాడు. తమిళనాడు నుంచి టీమిండియాకి ఎంపికైన 5వ ఫాస్ట్ బౌలర్ నటరాజన్.. కాగా 2002లో లక్ష్మీపతి బాలాజీ తమిళనాడు నుంచి ఫాస్ట్ బౌలర్‌గా టీమిండియాకు ఎంపికయ్యాడు. (చదవండి : నటరాజన్ ఎమోషనల్ వీడియో వైరల్) It was a surreal experience to represent the country. Thanks to everyone for your wishes. Looking forward for more challenges 🇮🇳 pic.twitter.com/22DlO9Xuiv — Natarajan (@Natarajan_91) December 3, 2020 ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఆడిన నటరాజన్ మొత్తం 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో యార్కర్లను సందిస్తూ తనదైన శైలిలో విజృంభించాడు. ఐపీఎల్ ప్రదర్శననే పరిగణలోకి తీసుకొని బీసీసీఐ నటరాజన్‌ను ఎంపిక చేసిందనడంలో సందేహం లేదు.కాగా ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో టీమిండియా ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య కాన్బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. -
నటరాజన్ ఎమోషనల్ వీడియో వైరల్..
కాన్బెర్రా : క్రికెట్లో అరంగేట్రం చేసిన ప్రతీ ఆటగాడు మొదటి మ్యాచ్‌లోనే తన సత్తా చాటాలని ఉవ్విళ్లురుతుంటాడు. అది బ్యాట్స్‌మెన్ అయితే పరుగుల వరద పారించాలని.. బౌలర్ అయితే వికెట్ తీయాలనే ఆశతో ఉంటాడు. కానీ అరంగేట్రం మ్యాచ్‌లోనే అది అందరికి సాధ్యపడకపోవచ్చు. కొందరికి మాత్రం అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆ కొందరికి చెందినవాడే టి. నటరాజన్. (చదవండి : నటరాజన్ అరంగేట్రం.. అద్భుతమైన కథ!) బుధవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో అరంగేట్రం మ్యాచ్‌లోనే నటరాజన్ మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మార్నస్ లబుషేన్‌ను బౌల్డ్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్భంగా నటరాజన్ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటరాజన్ అంతలా వైరల్ కావడం వెనుక బలమైన కారణం ఉంది.ఎక్కడో చెన్నైలోని మారుమూల గ్రామంలో కడు పేదరికం నుంచి వచ్చిన నటరాజన్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అన్ని అడ్డంకులు దాటుకొని ఇవాళ టీమిండియా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. పైగా అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి తన ఆరంభాన్ని ఘనంగా చాటాడు.అలా అని దాన్ని గొప్ప ప్రదర్శన అని చెప్పలేం. మొత్తం 10 ఓవర్ల కోటా వేసిన నటరాజన్ 70 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.. కాగా నటరాజన్ బౌలింగ్‌లో ఒక మెయిడెన్ ఓవర్ ఉండడం విశేషం. తమిళనాడులోని సేలం సమీపంలోని చిన్నపంపట్టి గ్రామం నుంచి వచ్చిన టి. నటరాజన్ అంచెలంచెలుగా ఎదిగి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన టి. నటరాజన్ యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడ్డాడు. నటరాజన్ తన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలింగ్‌తో లీగ్‌లో 16 వికెట్లు తీసి ఆకట్టుకొని టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. కాగా తొలి రెండు వన్డేల ఓటముల అనంతరం టీమిండియా సెలక్షన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సైనీ స్థానంలో నటరాజన్‌ను ఆడించే ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.(చదవండి : టీమిండియాకు ఓదార్పు విజయం) LABUSCHAGNE IS OUT ‼️ 😲 📺 Watch #AUSvIND ODI Series on #FoxCricket Ch 501 or 💻 Stream on Kayo: https://t.co/zgH4HWWwhW 📝 Live blog: https://t.co/bRMXKXu1lx 📱Match Centre: https://t.co/wCRObVso5a pic.twitter.com/AQm038gFTU — Fox Cricket (@FoxCricket) December 2, 2020 -
వన్డే: తను బాగా ఆడినా, ఆడకపోయినా సరే!
కాన్బెర్రా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ ఎట్టకేలకు టీమిండియా తుది జట్టులో సంపాదించుకున్నాడు. తద్వారా భారత జట్టుకు ఆడాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మహ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసిన నటరాజన్.. అరంగేట్ర మ్యాచ్‌లో తొలుత లబుషేన్ వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును ఇరకాటంలోకి నెట్టాడు. కెప్టెన్ కోహ్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ఈ యార్కర్ల వీరుడు బౌలింగ్‌ను కొనసాగిస్తున్నాడు. కాగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న నటరాజ్ ప్రయాణంపై క్రికెట్ దిగ్గజాలు ఇయాన్ బిషప్, టామ్ మూడీ ప్రశంసలు కురిపించారు. ‘‘ఈరోజు తను బాగా ఆడినా, ఆడకపోయినా సరే.. టి. నటరాజన్.. మనసును హత్తుకునే కథ తనది’’ అంటూ ఇయాన్ బిషప్ కొనియాడగా.. ‘‘నేడు నటరాజన్ భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్ ఆడబోతున్నాడు. తన కల ఈరోజు నిజమైంది. అత్యుద్భుతమైన స్టోరీ నటరాజన్‌ది’’ అని టామ్ మూడీ కితాబిచ్చాడు. (చదవండి: ‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’) ఎవరీ నటరాజన్?! తమిళనాడులోని సేలం సమీపంలో గల చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. కనీసం పుస్తకాలు, పెన్సిళ్లు కూడా కొనుక్కోలేని దీనస్థితిని ఎదుర్కొన్నాడు. నటరాజన్ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు.(చదవండి: అదరగొట్టిన పాండ్యా, జడేజా; 300 దాటిన స్కోరు!) నటరాజన్ ఆసక్తిని గమనించిన జయప్రకాశ్ అనే వ్యక్తి అతడికి అండగా నిలబడ్డాడు. ఆయన ప్రోత్సాహంతోనే 2011లో తనకు టీఎన్‌సీఏ 4వ డివిజన్ క్రికెట్లో పాల్గొనే అవకాశం లభించిందని, ఆయనే తన గాడ్‌ఫాదర్ అని నటరాజన్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు. అంతేగాక ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మైదానంలో దిగిన ఈ యార్కర్ కింగ్ తన షర్టుపై జేపీ నట్టు అనే పేరును ముద్రించుకుని జయప్రకాశ్‌పై అభిమానం చాటుకున్నాడు. కాగా నటరాజన్ 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ల సలహాలు నటరాజన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. రూ. 3 కోట్లకు కొనుక్కున్న పంజాబ్.. కానీ! కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 2017లో నటరాజన్‌ను కొనుగోలు చేసింది. అక్షరాలా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. దీంతో పంజాబ్ అతడిని వదులుకుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ యాజమాన్యం 2018లో కేవలం 40 లక్షలు పెట్టి నటరాజన్‌ను కొనుక్కుంది. హైదరాబాద్ జట్టులో చేరిన తర్వాత రెండు సీజన్లపాటు బెంచ్‌కే పరిమితమైన నటరాజన్.. సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో 13 వికెట్లు(11 మ్యాచ్‌లు) తీసి మరోసారి సత్తా చాటాడు. దీంతో ఐపీఎల్-2020లో ఆడే అవకాశం లభించింది. ఇక సన్‌రైజర్స్ తరఫున ఆడిన నటరాజన్ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ సారథి కోహ్లి వికెట్ తీసి పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సీజన్లో మొత్తంగా 16వికెట్లు తీసి తనదైన ముద్రవేశాడు. ముఖ్యంగా ప్లేఆఫ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్‌ను అద్భుతమైన యార్కర్‌తో పెవిలియన్‌కు చేర్చిన తీరుపై ప్రశంసలు కురిశాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్.. ‘‘ఐపీఎల్లో నా హీరో నటరాజన్’’ అంటూ కితాబిచ్చాడు. అకాడమీ స్థాపించి! అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో చోటు సంపాదించుకున్న నటరాజన్ తమ గ్రామంలోనే తన మెంటార్‌తో కలిసి ఓ క్రికెట్ అకాడమీని స్థాపించాడు. తనకున్న వనరుల సాయంతో పేదరికంలో మగ్గుతున్న ఔత్సాహిక క్రికెటర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాడు. క్రికెటర్లు కావాలన్నవారి కలను నెరవేర్చుకునేందుకు తనవంతు సాయం అందిస్తున్నాడు. కాగా నటరాజన్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పవిత్ర నవంబరు 7న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అదే సమయంలో ఇక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైనట్లు సమాచారం అందడంతో పాప వల్లే తనకు అదృష్టం వచ్చిందంటూ అతడు మురిసిపోయాడు. ఇక ఇప్పుడు వన్డేల్లో అరంగేట్రం చేయడంతో అతడి సంతోషం రెట్టింపు అయ్యింది. However he does today good or otherwise, the T. Natarajan story is so heart warming and encouraging. #IndiaDebut. — Ian bishop (@irbishi) December 2, 2020 -
పాపే నా అదృష్టం : గెడ్డం తీసేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైన మీడియం పేసర్ టీ నటరాజన్ (29) తన కూతురు రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చిందంటూ మురిసి పోతున్నాడు. తనకు పాప పుట్టం అదృష్టమనీ, నెట్‌బౌలర్ గా మాత్రమే ఎంపికైన తాను ప్రస్తుతం ప్రధాన జట్టుకు ఎంపికయ్యానని ఇంతకంటే శుభవార్త ఏమి ఉంటుందని నటరాజన్ తెలిపాడు. పాపాయి ఫోటో కూడా తానింకా చూడలేదని, వీడియోకాల్‌లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పాడు. అలాగే తన భార్య పవిత్ర ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారన్నాడు. మరోరెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. బిడ్డ పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గడ్డం కత్తిరించుకుంటానని ఈ సందర్భంగా నటరాజన్ వెల్లడించాడు. అలాగే దీనికి ముందు ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉందన్నాడు. అయితే తన బిడ్డను చూసేందుకు మాత్రం నటరాజన్ మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే. అతను మొత్తం పర్యటన ముగిసే వరకు ఉంటే, అతను జనవరి మూడవ వారంలో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పితృత్వ సెలవు మంజూరు కాగా నటరాజన్ మాత్రం తన ముద్దుల పాపాయిని చూసేందుకు మూడునెలలు ఆగాల్సి వస్తోంది. నవంబరు 7న నటరాజన్ భార్య పవిత్ర ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయ సంబరాల్లో ఉండగానే డేవిడ్ వార్నర్ ఈ శుభవార్తను అందరికీ షేర్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో పాటు పలువురు నటరాజన్‌ను అభినందనలు ముంచెత్తారు. కాగా భుజం గాయం కారణంగా చాన్స్ మిస్ అయిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో నటరాజన్ భారత టీ 2020 జట్టులో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్!) -
‘నటరాజన్.. నిప్పులు చెరిగే బంతులవి’
న్యూఢిల్లీ: తొలి రెండు మ్యాచుల్లో గెలుపు రుచి చూడని సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎస్ఆర్హెచ్ బౌలర్ల దెబ్బతో ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. భువనేశ్వర్ (4–0–25–2), రషీద్ ఖాన్ (4–0–14–3) రాణించడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా చక్కని యార్కర్లతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ (4–0–29–1) యార్కర్ షోపై బీసీసీఐ ఓ వీడియో రిలీజ్ చేసింది. (చదవండి: హెలికాప్టర్ షాట్ ఇరగదీశాడుగా..!) సెన్సేషనల్ బౌలింగ్ పర్మార్మెన్స్ అంటూ ప్రశంసించింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. అద్భుతమైన యార్కర్లతో ఆకట్టుకున్నావ్. మంచి భవిష్యత్ ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాకెట్లా దూసుకొచ్చిన బంతి మార్కస్ స్టొయినిస్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న తీరు అమోఘం అంటూ మెచ్చుకుంటున్నారు. నిప్పుల్లా దూసుకొస్తున్న బంతులతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ను బెంబేలెత్తించావని చెప్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రషీద్‌ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. కాగా, తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన నటరాజన్ గతంలో రైజింగ్ పుణె, కింగ్స్ పంజాబ్ తరపున ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. (చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం) -
ఇదిగో ‘శారద’ కుటుంబం..
సాక్షి, తెనాలి(గుంటూరు) : తెనాలిలోని ఓ బ్యాంకు శాఖ...కంప్యూటర్లోకి చూస్తున్న ఉద్యోగి, కౌంటరు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి, తన వెనుక తదేకంగా చూస్తుండటాన్ని కళ్లజోడులోంచి గమనించాడు. వెనక్కి చూస్తే, గోడకు తగిలించిన 2018 క్యాలెండర్ కనిపించింది. అందులో కనిపిస్తున్న ఫొటోను చూస్తున్న ఆ వ్యక్తి, ‘సార్ ఆ క్యాలెండరు ఇవ్వగలరా’ అంటూ అభ్యర్థించాడు. ‘దానికేం...పాతదే కదా!’ అంటూ తీసిచ్చాడు. అపురూపంగా పట్టుకుని తీసుకెళుతున్న అతడిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. మరో రెండురోజులకు ఇంటికొచ్చిన అతడి సోదరుడి కోసమని మరొకటి సంపాదిద్దామని, క్యాలెండరులోని ఫోను నెంబర్లను సంప్రదించారు. ‘పోయినేడాది క్యాలెండరు ఎందుకండీ...ఎవరు మీరు?’ అన్న ప్రశ్నకు, ‘మా నాన్న శారద ఫొటో కోసమండీ’ అన్న సమాధానం...! వినగానే సంబ్రమాశ్చర్యం...! శారద మరణతో ఆయన కుటుంబం జాడ ఎవరికీ తెలీదు. గత 64 ఏళ్లుగా సాహితీ ప్రపంచానికి ప్రశ్న మినహా ఇప్పటికీ సమాధానం లేదు. కేవలం క్యాలెండరులోని శారద బొమ్మతో ఇప్పటికి వెలుగులోకి వచ్చారు. ఆ వివరాలతో ప్రత్యేక కథనం. శారద (ఎస్.నటరాజన్) గురించి... ‘వాస్తవానికి వీసమెత్తు మారకుండా, మారినట్టు కనిపించే కుంభకోణమే ఈ శతాబ్దంలోని విశిష్టత. ఆపడానికి ఇష్టంలేని యుద్ధానికి సంవత్సరాల తరబడి సమాలోచనలు..దూరపుకొండలైన ‘శాంతి’కి సంతకాల సంరంభం..స్వంతాన కథ లేనివాడికి పాతపత్రికలు శరణ్యం...సరుకు లేని పత్రిక్కి మెరిసే ముఖచిత్రం...’ ఇలాంటి మాటలతో సాహిత్య విస్ఫోటనం చేసిన శారద అసలు పేరు ఎస్.నటరాజన్. పూర్తిపేరు సుబ్రమ్మణ్యయ్యరు నట రాజన్. తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగులు కురిపించిన తమిళ నటరాజన్ కవి, కథకుడు, నవలా రచయిత, నాటక రచయిత, వ్యాస రచయిత, లిఖిత పత్రికా సంపాదకుడు. 1937లో బతుకుదెరువు కోసం తండ్రితో కలిసి తెనాలి చేరిన నటరాజన్, హోటల్ కార్మికుడిగా చాలీచాలని సంపాదనతో తండ్రిని సాకుతూ జీవితం ఆరంభించారు. పదిహేనేళ్ల వయసులో తండ్రి పోవటంతో క్షోభతో మూర్ఛరోగానికి గురయ్యాడు. హోటల్ వృత్తిలో వుంటూనే తెలుగు నేర్చాడు. నాటి తెలంగాణ పోరాటం, ఆర్థికమాంద్యం, సామాజిక సంక్షోభాలు, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలతో ఆయన సాహిత్య సృజన వేయిరేకులై వికసించింది. భౌతికజీవితం 30 ఏళ్లయితే సాహిత్యజీవితం ఏడేళ్లు మాత్రమే. ఆ వ్యవధిలోనే శారద కలంపేరుతో నూరుకు పైగా కథలు, ఆరేడు నవలలూ రాశారు. ఆయన రచనలు ‘మంచీచెడూ’, ‘అపస్వరాలు’, ‘ఏది సత్యం’ సంచలనం రేకెత్తించాయి. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ శారద కన్నుమూశారు. తెనాలిలోనే స్థిరనివాసం.. తెనాలిలోని పాండురంగపేటలో 1955 ఆగస్టు 17న శారద కన్నుమూశారు. భార్య అన్నపూర్ణ. నిండు గర్భిణి. అప్పటికే ఇద్దరు కొడుకులున్నారు. భర్త పోయిన నెలరోజులకు జన్మించిన ఆడశిశువుకు తన భర్త పేరిట ‘శారద’గా నామకరణం చేశారు. ఊహ తెలీని చిన్న కొడుకు రాధాకృష్ణమూర్తిని ఇక్కడే తెలిసినావిడకు దత్తతనిచ్చారు. శారద రచనలు, అసంపూర్తి రచనలు, ఉత్తరాలతో సహా ఆయన స్నేహితుడైన ఆలూరి భుజంగరావుకు అప్పగించారు. భర్త ఉన్నపుడే దుర్భర దారిద్య్రంలో మగ్గిన ఆ కుటుంబం, ఆయన పోయాక ఎలా వుంటుందో చెప్పేదేముంది? పెద్దకొడుకు సుబ్రహ్మణ్యం, కుమార్తె శారదతో పట్టణం వదిలి వెళ్లిపోయారు. కట్‌చేస్తే...ప్రస్తుతం అన్నపూర్ణ భౌతికంగా లేరు. పెద్దకొడుకు నందిరాజు సుబ్రహ్మణ్యం తిరుపతిలో వుంటున్నారు. రెండో కుమారుడు నూతలపాటి రాధాకృష్ణమూర్తి తెనాలిలో నివసిస్తున్నారు. జంపని చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. చివరి బిడ్డ కడమేరి శారద కూడా చిన్న అన్నయ్యకు దగ్గరగా తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. సోదరుడు రాధాకృష్ణమూర్తి రెండో కుమార్తె శ్రీలక్ష్మికి తన కొడుకు రఘుబాబుతో వివాహం చేసి అన్నాచెల్లెలు వియ్యంకులయ్యారు. శారద బిడ్డల సంతానం, అంటే మనుమ సంతానం ప్రైవేటు/ ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిలయ్యారు. కష్టాలకు దూరంగా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. జీవనం కోసం నందిరాజు ఉమామహేశ్వరరావును అన్నపూర్ణ రెండో వివాహం చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం, హోటల్ వ్యాపారంతో సహా జీవనోపాధి కోసం ఆయన రకరకాల పనులు చేశారు. కొంతకాలం ప్రకాశం జిల్లా కామేపల్లి, గుంటూరు జిల్లా రేపల్లె, తర్వాత తెలంగాణలో వుండిపోయారు. ‘రెండో పెళ్లితో ‘మొదటి భర్త శారదతో కథ సమాప్తం’...అన్నట్టుగా మా తల్లిగారు గతంలోని విషయాలేవీ ప్రస్తావించేవారు కాదు...తమ్ముడిని తెనాలిలో దత్తత ఇచ్చినట్టు ఊహ ఉన్నందున వయసుకొచ్చాక, వెతుక్కుంటూ తెనాలి వచ్చి కలుసుకున్నా’నని సుబ్రహ్మణ్యం చెప్పారు. అప్పుడప్పుడు కలుస్తుంటాం.. ‘భర్త పోవటంతో మా తల్లిగారు ఆర్థికంగా నానా బాధలు పడ్డారు. బంధువులు పట్టించుకోలేదు. పెద్దమ్మ భర్త గంగానమ్మగుడి దగ్గర కొబ్బరికాయల కొట్ల బజారులో హోటల్ పెట్టించారు. అప్పుడప్పుడు సరుకులు ఇస్తుండేవారు. వేరే పెళ్లిచేసుకున్నాక అవికూడా మానేశారు..విధిలేని స్థితిలోనే తల్లిగారు ఊరొదిలి వెళ్లారు’ అని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆయన్ను చేసుకోవటంతో శారద తరపు అందరితోనూ సంబంధాలు బంద్ అయ్యాయి. రాకపోకలు, పలకరింపులు లేకుండా ఒంటరిగాళ్లమయ్యామని చెప్పారు. పెద్దయ్యాక ఎవరి బతుకులు వారివి అయ్యాయి. తల్లి కాలం చేయటంతో ఎవరితో ఏ సంబంధాలు లేకుండా ఈ ముగ్గురు తరచూ కలుసుకుంటూ బంధుత్వం కూడా కలుపుకొని ఆత్మీయంగా ఉంటున్నారు. ‘మగపిల్లలు చదువుల్లేకుండా తిరుగుతుంటే చెడిపోతారు...ఎవరికైనా ఇస్తే బాగుపడతాడని దత్తతనిచ్చా’నని అమ్మ చెప్పిందనీ, పెద్దవాడిని పెద్దగా చదివించే శక్తి లేకుండా పోయిందని నాకు చెప్పి ఏడ్చేది’ అని తల్లి గురించి కుమార్తె శారద గుర్తుచేసుకున్నారు. -
తెలంగాణ ఉద్యమంతో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవీ రెడ్డి, జలగం సుధీర్, లత, పీఆర్ విటల్ బాబు, సూర్య ముఖ్య పాత్రల్లో నటì ంచారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఉద్యమ సింహం’ సినిమా కేసీఆర్ జీవితకథ కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్‌గారు మాత్రమే పోరాడి తెలంగాణాను సాధించారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని కృష్ణంరాజు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి. -
జీవితాంతం గుర్తుండిపోతుంది
నటరాజన్ (కరాటే రాజు), సూర్య, పి.ఆర్. విఠల్‌బాబు ముఖ్య తారలుగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉద్యమసింహం’. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కరాటే రాజు, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సిడీని, నటుడు రవివర్మ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘కమల్‌హాసన్‌గారు నాకు కరాటే రాజా అనే పేరు పెట్టారు. నా అసలు పేరు కన్నా కరాటే రాజాగానే ఇండస్ట్రీలో తెలుసు. కేసీఆర్‌గారి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర. చాలెంజింగ్ రోల్. సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు కరాటే రాజా. ‘‘ఉద్యమ ఊపు ప్రచార చిత్రాల్లో కనిపిస్తోంది. ఖైలాష్ కేర్, వందేమాతరం శ్రీనివాస్ వంటి వారు ఈ సినిమాలోని పాటలు పాడారు. నేనూ చిన్న పాత్ర చేశాను’’ అన్నారు రవివర్మ. ‘‘బయోపిక్‌లు, ఉద్యమాల మీద సినిమాలు తీయడం కష్టం. ఈ సినిమా టీమ్ అందరిలో ఓ కసి కనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘కేసీఆర్‌గారి కథను మూడు గంటల్లో చెప్పడం కష్టం. అందుకే ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఉద్యమంలోని ముఖ్య అంశాలను తీసుకుని కథ తయారు చేశాను. ఈ నెలాఖరున చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘తెలుగు ప్రజలందరూ కేసీఆర్‌గారి గురించి తెలుసుకోవాలి’’ అన్నారు కృష్ణంరాజు. -
అవును మేం విడిపోయాం!
చెన్నై, పెరంబూరు: అవును మేం విడిపోయాం అంటున్నారు నటుడు విష్ణువిశాల్. వెన్నెలా కబడ్డికుళ్లు చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన విభిన్న కథా చిత్రాలతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ఇటీవల విష్ణువిశాల్ నటించిన రాక్షసన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆయనకు నటుడు నటరాజన్ కూతురు రజనీకి 2011లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే విష్ణువిశాల్‌కు రజనీకి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇప్పుడు కోర్టు ద్వారా విడాకులు కూడా పొందారట. దీని గురించి నటుడు విష్ణువిశాల్ మంగళవారం తన ట్విట్టర్లో పేర్కొంటూ తాను, రజనీ ఏడాదిగా విడివిడిగా జీవిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు విడాకులు మంజూరయ్యారని తెలిపారు. తమకు ఒక కుమారుడు ఉన్నాడని, అతని మంచి భవిష్యత్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా తమ కుమారుడి బాగోగులు చూసుకుంటామన్నారు. రజనీ, తానూ చాలాకాలం సంతోషంగా జీవించామని, ఇప్పుడు అనివార్యకారణాలతో విడిపోయినా, స్నేహితులుగానే మెలుగుతామని అన్నారు. ఇది ఇరు కుటుంబాల మంచి కోసమే తీసుకున్న నిర్ణయం అని నటుడు విష్ణువిశాల్ పేర్కొన్నారు. -
వెళ్లొస్తా..
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ శనివారం అందరి దగ్గర సెలవు తీసుకుని జైలు జీవితాన్ని గడిపేందుకు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. తంజావూరు నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార చెరకు సాయంత్రం చేరుకున్నారు. భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె తంజావూరులోని పరిశుద్ధ నగర్లో ఉన్న నటరాజన్ స్వగృహం అరుణానంద ఇల్లంలోనే ఉన్నారు. ఇంటి నుంచి ఆమె అడుగు బయటకు తీసి పెట్టలేదు. రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివచ్చి ఆమెకు సానుభూతి తెలియజేసి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలతో పదే పదే చిన్నమ్మతో భేటీ అయ్యారు. కుటుంబ విభేదాలతో శిరోభారం కుటుంబ విభేదాలు చిన్నమ్మకు శిరోభారంగా మారాయని సంకేతాలు ఉన్నాయి. నటరాజన్ ఆస్తుల వ్యవహారంతో పాటు, కుటుంబంలో సాగుతున్న విభేదాల పంచాయతీ చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా ఆ కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఆస్తుల విషయంగా అక్క కుమారుడు దినకరన్, తన సోదరుడు దివాకరన్ మధ్య సాగుతున్న వివాదం పరిష్కరించడం ఆమెకు కష్టతరంగా మారినట్టు తెలిసింది. అలాగే, మేనల్లుడు వివేక్ రూపంలో దినకరన్‌కు ఎదురవుతున్న సమస్యలు మరో త లనొప్పిగా మారడంతోనే ముందస్తుగానే జైలు కు వెళ్లడానికి ఆమె నిర్ణయించారని తెలుస్తోంది. ఇక, జైలు జీవితం పదిహేను రోజుల పెరోల్ లభించినా, ఇక్కడ అన్ని కార్యక్రమాల్ని 12 రోజుల్లో ముగించుకుని జైలు జీవితాన్ని అనుభవించేందుకు చిన్నమ్మ సిద్ధం అయ్యారు. మూడురోజుల ముందుగానే శనివారం ఉదయాన్నే పయన ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన కర్మక్రియల అనంతరం రాత్రంతా ఆమె ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయాన్నే బెంగళూరుకు పయనం అయ్యారు. అక్కడున్న బంధువులు, ఆప్తులు, సన్నిహితులు, పార్టీ వర్గాల నుంచి సెలవు తీసుకుని కాస్త ఉద్వేగానికి లోనైనట్టుగా కారులో ఎక్కి కూర్చున్నారు. అందర్నీ నమస్కారంతో పలకరిస్తూ ముందుకు సాగారు. ఆమె వాహనం వెన్నంటి అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్, తంగ తమిళ్ సెల్వన్ తదితరులు బయలుదేరి వెళ్లారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో తంజావూరులో బయలుదేరిన శశికళ వాహనం సాయంత్రం ఐదున్నర గంటలకు పరప్పన అగ్రహార జైలుకు చేరుకుంది. తంజావూరు నుంచి వెళ్లిన వాహనాలను, తన వెన్నంటి వచ్చిన వారందరినీ రాష్ట్ర సరిహద్దుల నుంచి వెనక్కు వెళ్లిపోవాలని శశికళ ఆదేశించడం గమనార్హం. అన్నింటినీ అధిగమిస్తారు శశికళ బయలుదేరి వెళ్లడంతో ఆమె సోదరుడు దివాకరన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన సోదరికి కష్ట కాలం అని, అన్నింటినీ అధిగమించి ఆమె తప్పకుండా బయటకు వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. కాగా, నటరాజన్‌తో ఉన్న స్నేహం మేరకు డీఎంకే ఎమ్మెల్యేలు కేఎన్ నెహ్రు, రామచంద్రన్ శశికళను ఉదయం పరామర్శించి వెళ్లారన్నారు. శశికళను అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా సంప్రదించారని, తమ సానుభూతి తెలియజేశారన్నారు. తాము స్వయంగా వస్తే, ఎక్కడ పదవులు పోతాయోనని వారికి భయం ఉండడం వల్ల అందుకే వారంతా ఫోన్ ద్వారా పరామర్శించినట్టు పేర్కొన్నారు. -
ముందస్తుగా..
ముందస్తుగానే పరప్పన అగ్రహార చెరకు వెళ్లేందుకు చిన్నమ్మ శశికళ నిర్ణయించారు. శనివారం సాయంత్రం ఆమె తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం కానున్నా రు. శుక్రవారం నటరాజన్ మృతికి కర్మక్రియలు జరగనున్నాయి. సాక్షి, చెన్నై: భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె నటరాజన్ స్వగ్రామంలో కాకుండా తంజావూరులో ఉంటున్నారు. ఆమెను పరామర్శించేందుకు రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివస్తున్నారు. గురువారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలు చిన్నమ్మను పరామర్శించారు. గంటపాటు చిన్నమ్మతో వారు భేటీ అయ్యారు. ఈ సమయంలో కళగం ఉప ప్రధానక కార్యదర్శి దినకరన్ సైతం అక్కడే ఉన్నారు. ఈసందర్భంగా నాయకులు, మద్దతుదారుల్ని ఉద్దేశించి చిన్నమ్మ కొన్ని సూచనల్ని చేసినట్టు సమాచారం. దినకరన్‌కు మద్దతుగా అందరూ నిలవాలని, మరో ఏడాదిలో తాను జైలు నుంచి వచ్చేస్తాననని, ఆ తర్వాత పార్టీ తప్పకుండా చేతుల్లోకి వస్తాయని ఆందోళన చెందవద్దన్న భరోసా ఇచ్చినట్టు సమాచారం. తాను వచ్చాకా, అన్ని సక్రమంగా సాగుతాయని, అంతవరకు ధైర్యంగా ఉండాలని, ఈ కాలంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని, వాటన్నింటినీ ఎదుర్కోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ సమయంలో చిన్నమ్మ మేనల్లుడు వివేక్ అక్కడకు వచ్చినట్టు వచ్చి దినకరన్ ఉండడంతో క్షణాల్లో వెనుదిరగడం చర్చకు దారితీసింది. అలాగే, చిన్నమ్మ సోదరుడు దివాకరన్ సైతం మౌనంగాఅక్కడి నుంచి వెళ్లడంతో కుటుంబ విభేదాలు కొట్టచ్చినట్టు కనిపించడం గమనార్హం. పెరోల్ కాలం వినియోగించుకోకూడదని.. తనకు కర్ణాటక జైళ్ల శాఖ 15 రోజుల బెయిల్ మంజూరు చేసినా, పూర్తి కాలం ఆ రోజుల్ని వినియోగించుకునేందుకు శశికళ ఇష్ట పడలేదు. ముందుగానే ఆమె జైలుకు వెళ్లేందుకు నిర్ణయించడం గమనార్హం. శుక్రవారం విలార్ గ్రామంలో నటరాజన్ మృతికి కర్మకాండ జరగనుంది. ఇందుకోసం ఉదయాన్నే ఆగ్రామానికి శశికళ వెళ్లనున్నారు. ఆ తదుపరి తంజావూరు చేరుకుని నటరాజన్ చిత్ర పట ఆవిష్కరించనున్నారు. శనివారం సాయంత్రం అందరి వద్ద సెలవు తీసుకుని తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం అయ్యేందుకు ఆమె నిర్ణయించి ఉన్నట్టు మద్దతుదారులు పేర్కొన్నారు. కాగా, తన కుటుంబంలో దివాకర్, వివేక్‌ల రూపంలోనే వివాదాలు తెరమీదకు వస్తున్నట్టు చిన్నమ్మ గుర్తించారని, అందుకే వివాదాలు మరింత పెద్దవి కాక ముందే జైలుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా, చిన్నమ్మను ఎవరెవరు వచ్చి పరామర్శిస్తున్నారో అన్న వివరాలను కర్ణాటక జైళ్ల శాఖ సేకరించి ఉన్నట్టు సమాచారం. అలాగే, వచ్చి వెళ్లే వారితో పాటు, తంజావూరు ఇంటి వద్ద వీడియో చిత్రకరణ సాగడం గమనార్హం. -
వారు అమ్మ ద్రోహులు..
సాక్షి, చెన్నై : భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మృతదేహం పక్కనే గంటల తరబడి కూర్చుండిపోయారు. బోరున విలపిస్తున్న ఆమెను ఓదర్చాడం ఎవరి తరం కాలేదు. ఇక, నటరాజన్ భౌతిక కాయానికి కన్నీటి వీడ్కోలు పలికారు. చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి తంజావూరుకు నటరాజన్ మృతదేహాన్ని తరలించారు. ఈ సమాచారంతో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పదిహేను రోజుల పెరోల్ లభించడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమెను కృష్ణగిరి వద్ద అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌తో పాటు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు పలువురు ఆహ్వానించారు. తమ వాహనంలో ఆమెను వెంట బెట్టుకుని తంజావూరుకు బయలుదేరారు. ముసిరి వద్దకు మంగళవారం అర్ధరాత్రి ఆమె చేరుకోవడతో సోదరుడు దివాకరన్ తోడయ్యారు. సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్‌లతో కలిసి తంజావూరులోని నటరాజన్ స్వగ్రామం విలార్‌కు వెళ్లారు. అక్కడ భర్త మృతదేహాన్ని చూడగానే శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. భోరున విలపించడంతో ఆమెను ఓదార్చేందుకు కుటుంబీకులు తీవ్రంగా ప్రయత్నించారు. భర్త మృతదేహం పక్కనే విలపిస్తూ అలాగే ఆమె రాత్రంతా కూర్చున్నారు. ఉదయం సైతం ఎక్కువ సమయంలో మృతదేహం పక్కనే ఆమె కూర్చుని ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పెద్దఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు విషాదంలో మునిగాయి. చిన్నమ్మకు పలు పార్టీలకు చెందిన నేతలు తమ సానుభూతి తెలియజేశారు. సాయంత్రం విలార్ నుంచి తంజావూరులో గతంలో నటరాజన్ నిర్మించిన ముల్లైవాయికాల్ స్మారక ప్రదేశానికి ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకెళ్లారు. శ్రీలంకలో సాగిన మారణహోమంలో అమాయక తమిళులు వేలాది మంది అశువులు బాయడాన్ని స్మరిస్తూ ఈ స్తూపాన్ని ఆయన గతంలో నిర్మించారు. ఆ స్తూపం వద్దే ద్రవిడ సంప్రదాయ పద్ధతిలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్రలో వేలాదిగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తరలివచ్చాయి. సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. కాగా, చిన్నమ్మ శశికళను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి పెద్ద సంఖ్య అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తంజావూరుకు తరలి వస్తున్నాయి. అయితే, అన్నాడీఎంకేకు చెందిన ఏ ఒక్కరూ అటు వైపు వెళ్ల లేదు. ఈ విషయంగా మంత్రి జయకుమార్ పేర్కొంటూ, వారు అమ్మ ద్రోహులు అని, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఇక, మక్కల్ మున్నేట్ర కళగం నేత తంగ తమిళ్ సెల్వన్ పేర్కొంటూ, అన్నాడీఎంకేకి చెందిన ఎంపీ చిన్నమ్మ పెరోల్‌కు సాక్షి సంతకం పెట్టారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు..
-
శశికళ భర్త నటరాజన్ మృతి
-
నటరాజన్ లేకపోతే జయలలిత లేదు
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలితకు రాజకీయ సహాయకుడిగా శశికళ భర్త నటరాజన్ వ్యవహరించేవారు. ఒకానోక దశలో రాజకీయాలను వదిలేద్దామని నిర్ణయించుకున్న జయలలితను అడ్డుకున్న ఆయన.. తర్వాత ఆమె వెన్నంటి ముందుకు నడిపించారు. ‘జయ రాజకీయ నీడ’గా నటరాజన్‌ను అభివర్ణించే విశ్లేషకులు ఆయన మృతి నేపథ్యంలో ప్రస్థానాన్ని గుర్తు చేస్తున్నారు. మార్చి 1989 జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సభలో జరిగిన ఘోర అవమానానికి మనస్థాపం చెంది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను తన కార్యదర్శి ద్వారా ఆమె స్పీకర్‌కు పంపారు. అయితే పోయెస్ గార్డెన్‌లోని తన అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న నటరాజన్ ఆ లేఖను తన దగ్గరికి తెప్పించుకుని దానిని జాగ్రత్తగా తన ఇంట్లో భద్రపరిచారు. తర్వాత జయను ఒప్పించి ఆమె నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు. అదే ఏడాది తేనీ ఈశ్వరన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎంకే ప్రభుత్వం నటరాజన్ ఇంటిపై తనిఖీలకు ఆదేశించింది. ఆ సమయంలో ఈ లేఖ బయటపడగా.. అధికారులు దానిని మీడియాకు కూడా విడుదల చేశారు. ఆ రకంగా జయను రాజకీయ సన్యాసం తీసుకోనీయకుండా అడ్డుకున్న నటరాజన్ తర్వాత.. ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. జయను నేనే సీఎం చేశా... ఈ మాట తరచూ నటరాజన్ నోటి నుంచి మీడియా పూర్వకంగానే వెలువడుతూ ఉండేది. తమిళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన ఎప్పటికప్పుడు పరితపిస్తూ ఉండేవారు. ఏదో ఒక రోజు జయలలిత ప్రధాని అవుతారని.. తాను తమిళనాడు ముఖ్యమంత్రిని అయి తీరుతానని నటరాజన్ తరచూ అనుచరులతో ప్రస్తావిస్తూ ఉండేవారంట. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నటరాజన్ మురుతప్ప.. ప్రభుత్వ ఉద్యోగిగా.. వ్యాపారస్థుడిగా.. అంతకు మించి జయలలితకు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఆయన.. ఆ సమయంలో కలెక్టర్‌గా ఉన్న చంద్రకళకు సహయకుడిగా పని చేశారు. ఆ సమయంలోనే ఆయన భార్య శశికళ వీడియో పార్లర్ ద్వారా జయలలితతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం క్రమంగా బలపడి.. ఎంజీఆర్ మరణం తర్వాత నటరాజన్-శశికళ దంపతులు జయ పంచన చేరారు. అప్పటి నుంచి ఆమె తీసుకునే రాజకీయ నిర్ణయం ప్రతీదాంట్లో నటరాజన్ తన ప్రభావం చూపుతూ వచ్చారు. నటరాజన్‌కి ఉన్న రాజకీయ పరిజ్ఞానాన్ని నమ్మి చీఫ్, హోం సెక్రెటరీల నియామకం దగ్గరి నుంచి.. నిధుల కేటాయింపులో సైతం ఆయన సలహాలు తీసుకుని జయలలిత నిర్ణయాలు ప్రకటించేవారు. అదిగో ఆ వ్యవహారమే తర్వాత వివాదాస్పదంగా మారింది. జయను చాలా విషయాల్లో ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నాడీఎంకే శ్రేణుల నుంచి కూడా విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఆమె మాత్రం నటరాజన్‌కు ప్రాధాన్యం ఇవ్వటం మానలేదు. జాతీయ స్థాయి నేతలు సైతం తన ఇంట ఆతిథ్యం తీసుకునేంత స్థాయికి నటరాజన్ పేరును అప్పటికే ఆయన సంపాదించుకున్నారు. అయితే ఒకానోక దశలో తన హోదాకే ఎసరు పెట్టే స్థాయికి నటరాజన్ చేరుకోవటం, పైగా మన్నార్గుడి మాఫియా పేరిట అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఆయన్ని జయలలిత వేద నిలయానికి దూరం పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఆయన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పక్కకు తప్పుకునేలా చేశాయి. జయలలిత మరణానంతరం తిరిగి తెరపైకి వచ్చిన నటరాజన్.. రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. చివరకు అక్రమాస్తుల కేసులో భార్య శశికళ అరెస్ట్ తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. -
శశికళ భర్త కన్నుమూత
సాక్షి, చెన్నై: తమిళ ప్రజల అమ్మ జయలలితకు నెచ్చెలి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్(75) మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. పుదియ పార్వై పత్రిక సంపాదకుడు అయిన నటరాజన్ గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. అనేక చికిత్సల అనంతరం ఆయన కోలుకు న్నట్టు కుటుంబీకులు భావించారు. నుంగం బాక్కం మహాలింగపురంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, ఆయన గతవారం గుండెపోటుకు గురయ్యారు. చెన్నై శివారులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున 1.30 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఎంబామింగ్ చేశారు. అనంతరం చెన్నై బీసెంట్ నగర్‌లోని నివాసంలో మధ్యాహ్నం వరకు ఉంచారు. అనంతరం తంజావూరు జిల్లాలోని నటరాజన్ స్వగ్రామం విలార్‌కు తరలించారు. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఎండీఎంకే నేత వైగో, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి తదితరులు నటరాజన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శశికళకు పెరోల్ మంజూరు నటరాజన్ మరణంతో బెంగళూరు జైల్లో ఉన్న శశికళకు 15 రోజుల పెరోల్ మంజూరైంది. ఆమెను రోడ్డుమార్గంలో తంజావూరుకు తీసు కెళ్లేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. -
శశికళ భర్త నటరాజన్ మృతి
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే మాజీ నేత శశికళ భర్త నటరాజన్(73) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 1.30కి ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై బీసెంట్ నగర్‌లోని నివాసానికి నటరాజన్ భౌతికకాయంను తరలించారు. అయితే జైలులో ఉన్న శశికళకు పెరోల్ మంజూరు కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మూడు రోజుల కింద నటరాజన్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే నటరాజన్ గతంలో కూడా లివర్ సంబంధిత వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. గతంలో నటరాజన్ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే డీఎంకేలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 1975లో నటరాజన్ శశికళను వివాహం చేసుకున్నారు. -
శశికళ భర్తకు జైలు శిక్ష : వెంటనే ఆస్పత్రి పాలు
సాక్షి, చెన్నై : శశికళ భర్త నటరాజన్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. పన్ను ఎగవేత కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో నటరాజన్‌ను వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. నటరాజన్ ఇటీవలే చెన్నై హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్‌తో పాటు, కాలేయ మార్పిడి చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారో ఇంకా తెలియరాలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పదవిలో ఉన్న కాలంలో నటరాజన్ తమిళనాడు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా పనిచేసేవారు. అనంతరం నటరాజన్, శశికళ ఇద్దరూ పోయెస్ గార్డెన్‌లోకి మారిపోయారు. నటరాజన్‌తో పాటు మరో ముగ్గురు కూడా కుట్ర, మోసం, ఫోర్జరీ, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని తెలిసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించడంతో నటరాజన్‌తో పాటు, శశికళ అక్క కుమారుడు భాస్కరన్, మరో ఇద్దరికీ సీబీఐ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. కాగ, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. -
శశికళకు మరో షాక్
-
శశికళ భర్తకు షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ కుటుంబానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్రమ ఆస్తుల కేసులో ‘చిన్నమ్మ’ కారాగారవాసం అనుభవిస్తుండగా తాజాగా ఆమె భర్తకు కూడా జైలు శిక్ష ఖరారైంది. పన్ను ఎగవేత కేసులో ఆయనను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష విధించగా మద్రాస్ హైకోర్టు సమర్థించింది. టయోటా లెక్సస్ కారు కొనుగోలు చేసినప్పుడు ఆయన పన్ను ఎగ్గొట్టినట్టు రుజువుకావడంతో ట్రయల్ కోర్టు నటరాజన్‌తో పాటు మరో ముగ్గురికి ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 1994లో కొనుగోలు చేసిన లెక్సస్ కారును 1993 మోడల్‌గా చూపించి పన్ను ఎగవేసినందుకు సీబీఐ, ఈడీ వేర్వేరుగా నిందితులు నలుగురిపై కేసు నమోదు చేశాయి. అసలైన ఇన్వాయిస్ను మార్చి రూ. 1.06 కోట్లు ఎగ్గొట్టినట్టు నిర్ధారణయింది. 2010లో ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై హైకోర్టులో అప్పీలు చేయగా అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది. -
భిక్షగాడిగా మారిన కోటీశ్వరుడు
సాకి, చెన్నై : కుటుంబ తగాదాల వల్ల భార్య, కుమారులపై కోపంతో ఓ కోటీశ్వరుడు ఇల్లు వదిలి ఆలయం మెట్లపై భిక్షాటన చేస్తున్న సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలో గల దివసూల్ ప్రాంతానికి చెందిన నటరాజన్ కోటీశ్వరుడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కోడలితో ఏర్పడిన తగాదా కారణంగా ఇంటి యజమాని నటరాజన్ భార్య, పిల్లలకు చెప్పకుండా ఇల్లు వదిలి తిరుప్పోరూర్ మురుగన్ ఆలయానికి వచ్చాడు. మూడు నెలలుగా అక్కడే ఉంటూ ఆలయంలో వచ్చే అన్నప్రసాదాలను తింటూ జీవిస్తున్నాడు. అతని కోసం భార్య, పిల్లలు అనేక ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో ఆదివారం తిరుప్పోరూర్ మురుగన్ ఆలయానికి వచ్చిన భార్య, పిల్లలకు నటరాజన్ భిక్షగాడి రూపంలో కనిపించాడు. వెంటనే వారందరూ అతడి వద్ద క్షమాపణలు చెప్పి కారులో ఇంటికి తీసుకెళ్లారు. -
అమ్మ కారు ఆమెకేనట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో జయలలితది ఒక బ్రాండ్. వేష, భాషలే కాదు రాజకీయ చతురతలో సైతం ఆమెది ప్రత్యేక శైలి. సుమారు ఏడాది క్రితం అమ్మ మరణంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోగా, ప్రస్తుతం శశికళ సంచారంతో జయ వినియోగించిన కారు ఒక కథగా మారింది. అన్నాడీఎంకేలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను ‘టీఎన్ 09–బీఇ 6167’ ఈ నంబరు ఏ వాహనానిది అని అడిగితే అమ్మ కారుదని ఠక్కున చెప్పేస్తారు. డ్రైవర్ పక్కన ఆశీనులైన అమ్మ అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ రోడ్డున సాగిపోతుంటే అభిమానులు ఆనందపరవశులై జయ జయ ధ్వానాలు చేసేవారు. ఆ వాహనం, రిజిస్ట్రేషన్ నెంబరు అన్నాడీఎంకే శ్రేణుల హృదయాల్లో అంతగా ముద్రపడిపోయింది. జయలలిత మరణం తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టన శశికళ తన చీరకట్టు, పాపిడిబొట్టు సైతం జయలలితలాగనే మార్చుకుని అదే కారుల్లో పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారు. మంత్రి పదవులను కాపాడుకోదలుచుకున్న నేతలు అమ్మకు పెట్టినట్లే చిన్నమ్మకు సైతం వంగివంగి దండాలు పెట్టారు. అయితే కార్యకర్తలు మాత్రం శశికళను ఖాతరు చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత చిక్కినపుడు రెండు టయోటా బ్రాడా కార్లు, ఒక టెంపో ట్రావలర్, ఒక టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, అంబాసిడర్ కారు, మహేంద్ర బొలెరో, స్వరాజ్ మజ్దా మేక్సీ, 1990 మాడల్ కాంటెసా కారు తదితర 9 వాహనాలను కేసులో చేర్చారు. 1996 నాటి ధరల ప్రకారం ఈ వాహనాల విలువ రూ..42.25 లక్షలుగా లెక్క కట్టారు. జామీనులో బైటకు వచ్చిన అనంతరం 6167 కారును జయ వాడటం ప్రారంభించారు. ఈ కారులోనే సచివాలయం, పార్టీ ప్రధాన కార్యాలయం సహా అన్ని కార్యక్రమాలకు జయ వినియోగించేవారు. కాగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు పెరోల్‌పై ఐదు రోజుల చెన్నైలో ఉన్న శశికళ ప్రస్తుతం 6167 కారునే వినియోగిస్తున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తరువాత పోయస్గార్డెన్లో ఉన్న ఈ కారు ఎలా, ఎప్పుడు బైటకు వెళ్లింది, ఇన్నాళ్లు ఎవరి స్వాధీనంలో ఉంది, ఒక ముఖ్యమంత్రి వినియోగించిన కారు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి నేడు శశికళ వినియోగంలోకి ఎలా వచ్చిందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై దినకర్ వర్గంలోని ఒక నేత మాట్లాడుతూ, కార్లన్నీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుకున్నందున తనపేరుపై కార్లు ఉంటే అచ్చిరాదని భావించిన జయలలిత దినకరన్ పేరున ఒకటి, అతని భార్య అనూరాధ పేరున మరో కారును కొన్నట్లు తెలిపారు. మరణించే వరకు జయలలిత ఈ రెండు కార్లనే వినియోగించగా, ఆ తరువాత దినకరన్ స్వాధీనంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సదరు కారుపై శశికళ మోజుపడటంతో మరెవ్వరూ వినియోగించ కుండా జాగ్రత్త చేయగా ఆమె కోర్కె మేరకు పెరోల్ ఐదురోజుల వినియోగానికి 6167 కారును బైట పెట్టినట్లు ఆయన వివరించారు. జయ సమాధి వద్దకు నో పెరోల్‌పై బెంగళూరు జైలు నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి, ఇంటి మధ్య తిరుగుతున్న శశికళ పనిలో పనిగా జయలలిత సమాధి వద్దకు వెళ్లాలనే ప్రయత్నాలను పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. జైలు కెళ్లే ముందు అమ్మ సమాధిని శశికళ దర్శించకున్న సమయంలో సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరచడాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. సుమారు 7 నెలల తరువాత జైలు నుండి వచ్చిన శశికళను మరలాఅమ్మ సమాధి వద్దకు అనుమతిస్తే ఎటువంటి పోకడలకు పోతారోనని పోలీసు అనుమానిస్తోంది. పెరోల్ సమయంలో రాజకీయ జోక్యం ఎంతమాత్రం ఉండరాదని షరతు విధించగా, అమ్మ సమాధిని దర్శించుకోవడం కూడా రాజకీయాల కిందకు వస్తుందని భావించి ఆమె కోర్కెను పోలీసుశాఖ నిరాకరించింది. కాగా, శశికళ సోమవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి భర్త నటరాజన్‌ను మూడో రోజు పరామర్శించారు. -
నా భర్తను కాపాడండి
సాక్షి ప్రతినిధి, చెన్నై: భర్త నటరాజన్‌ను చూసిన సమయంలో శశికళ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిసింది. భర్త దగ్గరుండి పర్యవేక్షించుకునే పరిస్థితిలేనందున మీరే కాపాడాలని వైద్యులను శశికళ వేడుకున్నారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళకు ఐదు రోజుల పెరోల్ లభించింది. బెంగళూరు జైలు నుంచి శుక్రవారం రాత్రి ఆమె చెన్నైకి చేరుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత భర్తను కలవనుండడంతో కొందరు పెద్దల సూచన మేరకు శనివారం ఉదయం 9–10.30 గంటల రాహుకాలం ముగిసిన తరువాత 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. జయలలిత సెంటిమెంట్ ఆలయమైన కొట్టూరుపురంలోని వినాయకుని గుడి వద్ద కారులో నుంచే దణ్ణం పెట్టుకున్నారు. 11.50 గంటలకు గ్లోబల్ ఆస్పత్రికి చేరుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులు ఆమెను అనుసరించారు. పరిమిత సంఖ్యలో బంధువులు ఆమె వెంటవచ్చినా ఐసీయూలో ఉన్న నటరాజన్ వద్దకు శశికళను మాత్రమే వైద్యులు అనుమతించారు. ఉద్వేగానికి గురైన శశికళ శశికళ కొద్దిసేపు ఆస్పత్రి ఐసీయూలో గడిపిన తరువాత విజిటర్స్ గ్యాలరీలో ఉండిపోయారు. బంధువులు, వైద్యులతో ఆమె మాట్లాడారు. నటరాజన్‌ను చూసిన సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆవేదన చెందుతున్న శశికళకు వైద్యులు ధైర్యం చెప్పారు. ఇటీవల నిర్వహించిన కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స సఫలీకృతమైందని, ఈ రెండు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరో పదిరోజుల్లో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఆ తరువాత డిశ్చార్జయి మూడు నెలలపాటూ ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటే ఆ తరువాత సాధారణ జీవితంలోకి అడుగుపెట్టవచ్చని శశికళకు వైద్యులు వివరించారు. భర్త ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించుకునే పరిస్థితి లేనందున మీరే కాపాడాలని వైద్యులను శశికళ వేడుకున్నారు. ఇదిలా ఉండగా, నటరాజన్ కొన్నాళ్లపాటూ ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉంటారని, నెమ్మదిగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంటూ గ్లోబల్ ఆస్పత్రి శనివారం ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. నటరాజన్‌కు శుక్రవారం ట్రాక్యోస్టమీ శస్త్రచికిత్స చేశారు. నిఘా నీడ.. నిబంధనలతో నిరాశ పెరోల్ మంజూరులో తమిళనాడు, కర్ణాటక పోలీసులు పెట్టిన నిబంధనలతో శశికళ బసచేసిన నివాసంపై తీవ్రస్థాయిలో నిఘా అమలుచేస్తున్నారు. వీరుగాక కొందరు పోలీసులు మఫ్టీలో నిలబడి శశికళ ఇంటికి ఎవరెవరు వచ్చిపోతున్నారో గమనిస్తున్నారు. జైలుకు వెళ్లకముందు అన్నాడీఎంకేలో హైడ్రామా నడిపి ఎడపాడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. తన విశ్వాసపాత్రులకు మంత్రి పదవులు ఇప్పించారు. గడిచిన ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇప్పించగా వారంతా ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. వారిలో కొందరైనా పెరోల్‌పై వచ్చిన తనను కలుసుకునేందుకు వస్తారని శశికళ విశ్వసించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు బంధువులతో మాట్లాడిన శశికళ పార్టీ నేతలు, ఇతర వీఐపీలతో మాట్లాడేందుకు శనివారం తెల్లవారుజామునే లేచి సిద్ధంగా కూర్చున్నారు. అయితే పెరోల్ నిబంధనలకు భయపడి ఎవరూ ఆమె కోసం రాలేదు. కేంద్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసుల కంటపడితే ఎటువంటి చిక్కులు వచ్చిపడతాయోనని దినకరన్ వర్గానికి చెందిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు సైతం సాహసించలేదు. ఎంపీ నవనీతకృష్ణన్, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తదితరులు శశికళ వచ్చే సమయానికి గ్లోబల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నా లోపలకు వెళ్లలేక గేటు వద్దనే నిలబడిపోయారు. పెరోల్ మంజూరులో విధించిన నిబంధనలపై టీటీవీ దినకరన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెరోల్ ఐదు రోజులను హౌస్ అరెస్ట్‌గా మార్చేశారని విమర్శించారు. జయ కారులో జల్సా బెంగళూరు జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి దివంగత జయలలిత కారునే శశికళ వినియోగిస్తున్నారు. సచివాలయానికి, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు జయలలిత ఇదే కారు (నంబరు టీఎన్ 09–6167) ను వినియోగించేవారు. జయ కాలంనాటి డ్రైవరునే పెట్టారు. జయలలిత వినియోగించే కార్లన్నీ ప్రస్తుతం ఇళవరసి ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ బసచేసిన సాధారణ కుటుంబాల ఇళ్ల మధ్య జయ కారు తిరుగాడడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. -
శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్
-
'శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్'
-
'శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్'
సాక్షి, చెన్నై : అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు వివరించింది. దీంతో ఆమెకు పెరోల్ లభించేందుకు అవకాశం లభించినట్లయింది. గత కొంతకాలంగా తన భర్త నటరాజన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్నారు. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. దీంతో ఆయనను చూసేందుకు తనకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ జైలు శాఖకు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించింది. అయితే, జైలుశాఖ నిరాకరించగా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో బహుశా ఆమెకు పెరోల్ లభించే అవకాశం ఏర్పడింది. -
నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమం
చెన్నై : శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్లోబల్ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. నటరాజన్ గత తొమ్మిది నెలలుగా గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయనకు మూత్రపిండాలు, కాలేయం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం నటరాజన్‌ను వెంటీలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీర అవయవాలు పూర్తిగా పాడవటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిపై శశికళ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో నటరాజన్‌ను కలిసేందుకు శశికళ పేరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. -
ప్రాణాపాయ స్థితిలో శశికళ భర్త
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ వీకే శశికళ భర్త ఎం నటరాజన్ తీవ్ర అస్వస్థతో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రిలో చేరారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కారణంగా ఆయన్ను పెరుంబక్కంలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటిన్‌ను విడుదల చేశాయి. గత ఆర్నెల్లుగా నటరాజన్ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాయి. వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో లివర్, కిడ్నీ ఫెయిలైనట్లు తెలిపాయి. ఊపిరితిత్తులపై కూడా వ్యాధి ప్రభావం ఉండటంతో ఆయన శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బందిపడుతున్నట్లు తెలిసింది. నటరాజన్‌కు డయాలసిస్ చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం ఎనిమిది గంటల పాటు డయాలసిస్ కొనసాగింది. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిని లివర్ స్పెషలిస్టులతో కూడిన టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి హెల్త్ బులెటిన్‌లో వివరించింది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు నటరాజన్ గతంలోనే తమిళనాడు ఆర్గాన్ షేరింగ్(టీఎన్‌ఓఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. -
హాలీవుడ్ తరహాలో ‘బోంగు’
చెన్నై: పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పేరు తెచ్చుకున్న నట్టీ(నటరాజన్) కథానాయకుడిగానూ రాణిస్తున్నారు. నట్టి నటించిన చతురంగవేటై సంచలన విజయం సాధించింది. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘బోంగు’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రిషీసింగ్ నాయకిగా నటించారు. ఇందులో మనీషా శ్రీ, అతుల్ కులకర్ణి, పావా లక్ష్మణన్, బిశ్వా, అర్జున్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ కళాదర్శకుడు సాబు సిరిల్ శిష్యుడు తాజ్ దర్శకుడిగా మోగాఫోన్ పట్టిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 2వ తేదీన విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మూవీ హీరో నట్టి మాట్లాడుతూ.. బోంగు చిత్రం చాలా బాగా వచ్చిందన్నారు. ఇది ఖరీదైన కార్లు చోరీ చేయడం ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రం అని చెప్పారు. చిత్రం చాలా ఆసక్తిగా, చాలా స్పీడ్‌గా సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా కార్ల దొంగతనం నేపథ్య చిత్రం కావడంతో యువతను బాగా అలరిస్తుందన్నారు. చిత్ర కథ, కథనాలు హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉంటాయన్నారు. అంతే కాకుండా తనకు ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకాన్ని నట్టి వ్యక్తం చేశారు. -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు
టీనగర్(చెన్నై): అన్నాడీఎంకేలో తమ కుటుంబ సభ్యులకు స్థానం లేదని.. శశికళక, ఆమె భర్త నటరాజన్‌కు 1990 నుంచే సంబంధాలు లేవని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. జయలలిత మృతిచెందిన తర్వాత అన్నాడీఎంకేలో శశికళ ఆధిపత్యం మరింతగా పెరిగినట్లు ఆమె వ్యతిరేకులు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఒక కుటుంబం సభ్యుల చేతుల్లోకి చేరుకోకూడదనేందుకు పోరాడుతున్నామని పన్నీరు సెల్వం వంటి ప్రత్యర్థి శిబిరంలోని నేతలు చెబుతున్నారు. అయితే ఎంజీఆర్‌కు, జయలలితకు వెన్నంటి నిలిచిన తాము పార్టీలోకి రావడం తప్పులేదన్న కోణంలో నటరాజన్ ఓసారి పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే శశికళ జైలుకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఆమె తన పనులను గమనించేందుకు టీటీవీ దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇటీవల ఆయన ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీలో ఇకపై తమ కుటుంబ సభ్యులెవరికీ స్థానం లేదని, కొత్తగా ఎవరినీ చేర్చుకోరని భావిస్తున్నట్లు దినకరన్ తెలిపారు. 1990 తర్వాత పోయెస్ గార్డెన్ (జయ నివాసం)లోకి ఇంతవరకు నటరాజన్ ప్రవేశించింది లేదని, చిన్నమ్మ (శశికళ) కూడా ఆయనతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించాయి. -
తన పాత్రపై స్పందించిన శశికళ భర్త
చెన్నై: జయలలిత వారసత్వం కోసం అన్నా డీఎంకేలో రసవత్తరమైన పోరు సాగుతోంది. తామే అసలైన వారసులమని జయ నెచ్చెలి శశికళ, విశ్వాసపాత్రుడు పన్నీరు సెల్వం, మేనకోడలు దీపా జయకుమార్ పోటీపడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతానికైతే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న శశికళ.. తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంపైనా పట్టు సంపాదించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో తన సోదరి కొడుకు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించి తన తర్వాతి స్థానం కట్టబెట్టారు. జయ బతికున్నప్పుడు తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టిన తన బంధువులను మళ్లీ తీసుకువచ్చారు. కాగా పార్టీలో శశికళ భర్త నటరాజన్ పాత్ర ఏమిటి? అన్నది ఎప్పుడూ రహస్యమే. ఆయన తెరవెనుకే ఉండి మంత్రాంగం నడిపిస్తుంటారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా అన్నా డీఎంకే నాయకులు చెన్నై మెరీనా బీచ్‌కు వెళ్లి ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నటరాజన్ మాట్లాడుతూ.. తానెప్పుడూ అన్నా డీఎంకే రాజకీయాల్లో తెరవెనుకే ఉంటానని చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. నటరాజన్ పలుమార్లు శశికళ పక్కన వివిధ కార్యక్రమాల్లో కనిపించారు. జయలలిత అంత్యక్రియల సమయంలో ఆయన భార్య దగ్గరే ఉన్నారు. అయితే మీడియాకు ఆయన దూరంగానే ఉంటున్నారు. అలాగే అన్నా డీఎంకే రాజకీయాల్లో తెరవెనుక ఉండే నటరాజన్.. తన భార్య శశికళకు సలహాలు ఇస్తుంటారని సమాచారం. ఇదిలావుండగా జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. శశికళ, ఆమె కుటుంబ సభ్యులపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. శశికళ కుటుంబాన్ని మన్నార్గుడి మాఫియాగా ఆయన అభివర్ణించారు. -
జైలులో శశికళ.. భర్త నటరాజన్‌కు చిక్కులు
చెన్నై: ఓ పక్క అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలులో ఉండగా ఇప్పుడు ఆమె భర్త వికే నటరాజన్‌కు కూడా కేసుల గండం మొదలైంది. సీబీఐ అధికారులు ఆయనపై గతంలో నమోదు చేసిన కేసులు తిరగబడ్డాయి. మద్రాస్ కోర్టులో ఈ కేసు ఇప్పుడు వేగం పుంజుకుంది.1994లో లెక్సస్ కార్ల దిగుమతికి సంబంధించి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు నటరాజన్ మరో ముగ్గురుపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఈ కేసు విషయంలో గత ఐదేళ్లుగా అప్పీళ్లతో నటరాజన్ ముందుకెళుతూ ఉన్నారు. అయితే, ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సీబీఐకి మెమోలు పంపించారు. దీంతో ఈ కేసు చివరి విచారణ ఈ నెల 27న జస్టిస్ ఎస్ భాస్కరన్ ధర్మాసనం ముందు జరగనుంది. 1994లో తీసుకొచ్చిన లెక్సస్ కార్లను 1993 మోడల్‌గా ఫేక్ డాక్యుమెంట్లు చూపించి, అప్పటికే వాడిన కార్లుగా చూపించారు. అవి నకిలీ పత్రాలని, వీరే కావాలని అలా సృష్టించారని, దాని వల్ల దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఈడీ అంచనా వేసింది. -
శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నటరాజన్‌కు శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయన ఇబ్బంది పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చామని అన్నారు తప్ప.. తదుపరి సమాచారం ఏమీ వెల్లడించలేదు. దాంతో నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు శశికళ సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే ఉన్నట్టుండి నటరాజన్ ఆస్పత్రి పాలు కావడం పలువురిని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడంతో, ఎమ్మెల్యేలంతా కలిసి తమ శాసనసభా పక్ష నేతగా 62 ఏళ్ల శశికళను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన శశికళ, తాను ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని చెప్పారు. ఆమె ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. -
శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
-
చిన్నఅమ్మ
• శశికళ (60) • జన్మస్థలం : మన్నార్గుడి • జన్మదినం : 26 జనవరి 1956 • తల్లిదండ్రులు : కృష్ణవేణి, వివేకానందం ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం...తమిళనాట రెండాకులు ఎక్కువే చదివింది.అందులో ఒక ఆకు... అమ్మ. ఇంకో ఆకు... చిన్నమ్మ.ఈ ఆకుల్లోనే పార్టీ కేడర్ మొత్తం సంతోషంగాకడుపు నింపుకుంటోంది.ఇప్పుడు ఒక ఆకు రాలిపోయింది.మిగిలిన రెండో ఆకుకు ‘జయ’కళ వస్తుందా?ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ తమిళ్ క్వొశ్చన్! శశికళ ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగానే కాదు, టాక్ ఆఫ్ ది కంట్రీగానూ మారారు. జయలలితను అత్యవసర స్థితిలో అపోలో ఆసుపత్రిలో చేర్పించాక ఆమెను కలుసుకుని పరామర్శించే అవకాశం ఆమె రక్త సంబంధీకులకు గానీ, గవర్నర్‌కుగానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకుగానీ, కేంద్ర మంత్రులకు గానీ, మరే ప్రముఖులకు గానీ కలుగలేదు. వచ్చినవారంతా ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి వెనుదిరుగుతున్నారు. ‘చూడాల్సిన వాళ్లను చూసాము’ అని మాత్రమే మీడియాతో అంటున్నారు. వాస్తవానికి వైద్యులు మినహా జయలలితను నేరుగా కలుసుకున్నది కేవలం ఒకే ఒక్కరు. ఆమె శశికళ మాత్రమే! పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ ప్రత్యక్షంగా సంబంధంలేని శశికళకు, జయలలితకు ఉన్న అనుబంధం అంత బలీయమైనది. కలెక్టర్ ఇంట్లో ఆయా! శశికళ జన్మస్థలం తంజావూరు జిల్లా మన్నార్‌కుడి. పాఠశాల విద్య వరకే ఆమె చదువుకున్నారు. చిన్ననాటి నుండీ సినిమా నటి కావాలని శశికళ కోరిక. సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆమె చెన్నై టీటీకే రోడ్డులో సినిమా కేసెట్ల లెండింగ్ లైబ్రరీ నడిపేవారు. ఆమె భర్త నటరాజన్ అప్పటి జిల్లా కలెక్టర్ చంద్రలేఖ దగ్గర పార్ట్‌టైమ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ‘కేసెట్ లెండింగ్ లైబ్రరీ వల్ల పెద్దగా ఆదాయం రాదు, నీ భార్య చేత వీడియో కవరేజ్ షాపు పెట్టించు’ అని నటరాజన్‌కు సలహా ఇచ్చింది చంద్రలేఖేనని అంటారు. ఆ సమయంలోనే చంద్రలేఖకు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఆలనా పాలన చూసేందుకు శశికళ ఆయాగా వెళ్లారు. వాస్తవానికి శశికళకు ఆయాగా పనిచేసే అవసరం లేదు. పెద్దవాళ్లతో పరిచయాల పట్ల ఆసక్తి ఉండడం ఆమెను అటువైపుగా నడిపించింది. శశికళ దంపతులకు పిల్లలు లేరు. బహుశా ఆ లోటును తీర్చుకునేందుకు కూడా ఆమె ఆయాగా ఉండేందుకు ఒప్పుకుని ఉండాలి. జయతో తొలి పరిచయం అది 1984వ సంవత్సరం. జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగాలను వీడియోగా చిత్రీకరించి కేసెట్లుగా అందించేందుకు ఒక వ్యక్తి కావాలని జయ చంద్రలేఖను కోరడంతో తన వద్ద ఆయాగా పనిచేస్తున్న శశికళను జయకు పరిచయం చేశారు చంద్రలేఖ. ఇలా జయకు దగ్గరైన శశికళ సినిమా వీడియో కేసెట్లను కూడా జయకు ఇస్తూ ఉన్న క్రమంలో వారి పరిచయం స్నేహంగా మారింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలోనే తనపై పార్టీ వ్యతిరేకుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నుంచి శశికళ స్నేహం జయను సేదతీర్చిందని అంటారు. స్త్రీకి స్త్రీగా ఆలంబన ఎంజీఆర్ మరణం జయకు గడ్డు పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఆ కష్టకాలంలో శశికళ జయకు ఆలంబనగా నిలిచారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామ చంద్రన్ ప్రవేశంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయి ఎన్నికల పోరాటానికి దిగినప్పుడు శశికళ ఆమెకు అండగా ఉన్నారు. జయ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినపుడు డీఎంకే సభ్యుల నుండి భౌతికదాడులకు, చీరలాగడం వంటి అవమానాలకు గురైన సమయంలో కూడా శశికళే జయకు ఓదార్పు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోనే శశికళ కూడా ఉంటూ ఆమె అంతరంగికురాలిగా మారిపోయారు. బంధువుల కేంద్ర బిందువు 1991 అసెంబ్లీ ఎన్నికల్లో జయ పార్టీ అధికారంలోకి వచ్చింది. తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే సమయంలో శశికళ బంధువులూ జయకు చేరువయ్యారు. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తత తీసుకున్నారు. శశికళ మరో సోదరుడు జయరామన్ హైదరాబాద్‌లోని జయకు చెందిన తోటకు మేనేజర్ అయ్యాడు. తర్వాత ఆ తోటలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో జయరామన్ మృతి చెందడంతో, ఆయన భార్య ఇళవరసి తన చంటి బిడ్డతో పోయెస్ గార్డెన్‌కు మకాం మార్చారు. అలా శశికళ వల్ల ‘జయ కుటుంబం’ పెద్దదయింది! బంధుగణంతో చిక్కులు, చికాకులు ఒకవైపు జయ నీడలా శశికళ ఉన్నా, ఆమె బంధువులను మాత్రం జయ ఉపేక్షించలేదు. వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకున్నారు. ముందుగా శశికళ భర్త నటరాజన్‌ను పక్కన పెట్టేశారు. ఆయనపై అనేక కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు. అప్పుడు కూడా మనసా వాచా జయతోనే ఉండిపోయారు శశికళ. పార్టీ కోశాధికారి, ఎంపీ అయిన దినకరన్‌ను పార్టీ నుండి జయ బహిష్కరించారు. దత్తపుత్రుడు సుధాకరన్‌పై కూడా గంజాయి కేసు పడింది. అలా ఒకరొకరుగా శశికళ బంధువులంతా పోయస్‌గార్డెన్ నుండి దాదాపుగా బయటికి వెళ్లిపోవలసి వచ్చింది. భర్త సహా బంధువులంతా జయ చేత తిరస్కారానికి గురైనా శశికళ మాత్రం ఆమెతోనే ఉండిపోయారు. తోడబుట్టని సోదరి.. శశి జయ ఆడంబర జీవితంలోనే కాదు అష్టకష్టాల్లోనూ శశికళ ఆమెకు భరోసాగా నిలిచారు. జయ రాజకీయ జీవితంలో 1996 తీవ్ర ఆవేదన కలిగించిన ఏడాదిగా నిలిచింది. దత్త పుత్రుడు సుధాకరన్‌కు అత్యంత ఆడంబరంగా చేసిన వివాహం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు జయ ప్రభుత్వాన్ని కుదిపివేసింది. జయ అరెస్టు అయ్యారు. ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. జయపై డీఎంకే పెట్టిన ప్రతికేసులోనూ శశికళ కూడా నిందితురాలిగా ఉన్నారు. జయ పతనానికి శశికళనే కారణమనే ప్రచారం కూడా జరిగింది. అప్పుడే తొలిసారి జయ బహిరంగంగా శశికళ గురించి మాట్లాడారు. ‘శశికళ నాకు తోడబుట్టని సోదరి, అంతేగాక ఆమె నాతోనే ఉంటారు, ఆమె గురించి ఎలాంటి ప్రశ్నలు అవసరం లేదు’ అని ప్రకటించారు. అమ్మంతటి అమ్మ చిన్నమ్మ శశికళను జయలలిత ఇలా సమర్థించడంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ శశికళ ప్రాధాన్యం పెరిగింది. జయను అమ్మ అంటుండే పార్టీ శ్రేణులు శశికళను చిన్నమ్మ అని సంబోధించడం ప్రారంభించాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా కేసుల కారణంగా జయ సీఎం కాలేక పోయారు. అప్పుడు పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్న సలహా శశికళదే. అంతేకాదు, మంత్రి వర్గాన్ని కూడా ఆమే నిర్ణయించారు. అమ్మకు జరిగే అన్ని మర్యాదలు చిన్నమ్మకు కూడా జరగడం 2001 నుంచే మొదలైంది. అన్నీ ఓర్చుకుని... అమ్మ వెంటే... 2011లో జయ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు శశికళ కుటుంబ సభ్యుల రాకపోకలు మొదలయ్యాయి. దీంతో జయలలిత శశికళను కూడా పోయెస్ గార్డెన్ నుండి బైటకు పంపివేశారు. శశికళ కుటుంబానికి చెందిన రావణన్, కలియపెరుమాళ్, మిడాస్ మోహన్‌లపై కేసులు పెట్టించారు. శశికళతో గానీ ఆమె కుటుంబ సభ్యులతో గానీ ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఈ సందర్భంలో కూడా జయపై శశికళ ఎలాంటి ప్రతిఘటన ధోరణిని ప్రదర్శించలేదు. తన వారినీ ప్రదర్శించనీయలేదు. బహిరంగ సభల్లో విమర్శలు చేయలేదు. ఇతర పార్టీ నేతలతో కూడా సంబంధాలు పెట్టుకోలేదు. అందుకేనేమో... శశికళను విడిచి జయలలిత ఎక్కువకాలం ఉండలేకపోయారు. శశికళ మళ్లీ పోయెస్ గార్డెన్‌కు పిలిపించుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అని బహిరంగంగానే చెప్పుకున్నారు. ఈ బాంధవ్యమే.. కడవరకూ జయతోనే ఉండే భాగ్యాన్ని శశికళకు కల్పించింది. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
అమ్మ చనిపోయాక.. మళ్లీ వచ్చాడు
చెన్నై: జయలలిత జీవితంలో శశికళకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విభేదాల వల్ల శశికళను ఇంట్లోంచి పంపించినా జయలలిత మళ్లీ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. అయితే జయలలిత బతికున్న రోజుల్లో తన పోయెస్ గార్డెన్ బంగ్లాలోకి శశికళ భర్త నటరాజన్‌ను అనుమతించలేదు. గత ఐదేళ్లుగా ఆయన దూరంగా ఉన్నారు. జయలలిత మరణించిన తర్వాత నటరాజన్ ఆ ఇంట్లో మళ్లీ అడుగుపెట్టారు. ఇప్పుడు అన్నా డీఎంకే రాజకీయాల్లో శశికళతో పాటు ఆయన భర్త కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోయెస్ గార్డెన్లో ప్రస్తుతం శశికళ దంపతులతో పాటు వారి సమీప బంధువులు ఉన్నారు. సోమవారం రాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత మరణించిన తర్వాత శశికళ బంధువులు అక్కడికి చేరుకున్నారు. జయలలిత భౌతికకాయం చుట్టూ వాళ్లే కనిపించారని, జయ బంధువులను దగ్గరకు రానివ్వలేదనే విమర్శలు వచ్చాయి. ఇక జయలలిత అంతిమసంస్కారాలను శశికళ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టగా, పార్టీ పగ్గాలు శశికళ చేతిలోనే ఉన్నాయి. శశికళను తన వారసురాలిని చేయాలన్నది జయలలిత చివరి కోరికని, అయితే ఆమె కోరిక నేరవేరలేదని నటరాజన్ పార్టీ నాయకులతో చెబుతూ భార్యను అందలమెక్కించేందుకు పథకం పన్నారని అన్నా డీఎంకే సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఓ సాధారణ వ్యక్తి పార్టీని నడిపించగలరని నటరాజన్ వ్యాఖ్యలు చేసినట్టుగా మీడియాలో వచ్చింది. అధికారం కోసం అన్నా డీఎంకేలో విభేదాలు వస్తాయని, పార్టీలో చీలిక తప్పదని కొందరు రాజకీయ నేతలు చెబుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఎటు దారి తీస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. -
ఎన్‌క్కిట్ట మోదాదేలో నట్టి
చాయాగ్రాహకుడిగా దక్షిణాదితో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ ప్రాచుర్యం పొందిన నటరాజన్(నట్టి) కోలీవుడ్‌లో కథానాయకుడిగాను మంచి పేరు తెచుకున్నారు. ముఖ్యంగా చతురంగ వేటై చిత్రం ఆయన్ని విజయవంతమైన హీరోగా నిలబెట్టింది.తాజాగా నటరాజన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎన్‌క్కిట్ట మోదాదే. మరో కథానాయకుడిగా రాజాజి నటించిన ఈ చిత్రంలో నటి సంచితాశె శెట్టి, పార్వతీనాయర్ కథానారుుకలుగా నటించారు. దర్శకుడు పాండిరాజ్ శిష్యుడు రాము చెల్లప్పా తొలిసారిగా మోగాఫోన్ పట్టిన ఈ చిత్రానికి నటరాజన్ శంకర్ సంగీతాన్ని అందించారు.ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఎన్‌క్కిట్ట మోదాదే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు పాండిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నటరాజన్ మాట్లాడుతూ దర్శకుడు రాము చెల్లప్పా చెప్పిన కథ చాలా నచ్చేసిందన్నారు.ఇది 1980 ప్రాంతంలో జరిగే కథా చిత్రం అని తెలిపారు.సినీ బ్యానర్లు గీచే కళాకారులు నేపథ్యంలో సాగే కథ ఇదని చెప్పారు. వారి వెనుక ఇంత రాజకీయం ఉంటుందా?అన్నది దర్శకుడు చెప్పిన తరువాతే తనకు తెలిసిందన్నారు.రజనీకాంత్ వీరాభిమానినైన తాను బ్యానర్ ఆర్టిస్టుగా నటించానని తెలిపారు.చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారని తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు పిచ్చైక్కారన్, ఇరైవి, కుట్రమే దండణై చిత్రాలను విడుదల చేసిన కేఆర్ ఫిలింస్ సంస్థ విడుదల హక్కుల్ని పొందింది.చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. -
ఈ గ్యాంగ్ మాస్ గురూ...
నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్‌గా పలు విజయవంతమైన చిత్రాలు అందించినవేలాయుధం అండ్ బ్రదర్స్‌లో ఒకరి వారసుడు అయిన బాలాజీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. యాషిక పిక్చర్స్ ద్వారా ఇండియాలో సినిమాలు విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ‘బ్లాక్ అండ్ వైట్ ది డాన్ ఆఫ్ అస్సాల్ట్’ను ‘మాస్ గ్యాంగ్’ పేరుతో తెలుగులో ఈ నెలలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను, పోస్టర్స్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. యాషిక పిక్చర్స్ భాగస్వాములు ఆనంద్, నటరాజన్ పాల్గొన్నారు. -
నటరాజన్‌తో ప్రపంచ సుందరి
నట్టి అలియాస్ నటరాజన్ సరసన ప్రపంచ సుందరి నటించనుంది. చతురంగం చిత్రంతో సక్సెస్ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్న నటరాజన్ ప్రముఖ ఛాయాగ్రాహకుడు కూడా. పలు హిందీ చిత్రాలకు పనిచేసిన ఈయన ఇటీవల విజయ్ నటించిన పులి చిత్రానికి ఛాయాగ్రహణం నెరిపారన్నది గమనార్హం. నటరాజన్ తాజాగా మళ్లీ కథానాయకుడిగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన నటించనున్న చిత్రానికి బొంగు అనే పేరును నిర్ణయించారు. ఇందులో ఆయనకు జంటగా 2014లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న రుషీసింగ్ నటించనున్నారు. ఇతర పాత్రల్లో అతుల్కుల్కర్ణి, ముండాసిపట్టి రాందాస్, రాజన్, పాండినాడు చిత్ర విలన్ శరత్లోహిత్ కౌర్, మనీషా శ్రీ, అర్జునన్ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి నవ దర్శకుడు తాజ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఈయన కళా దర్శకుడు శిబుసిరిల్ శిష్యుడన్నది గమనార్హం. ఇది రోడ్డు ప్రయాణాల్లో ఎలాంటి గోల్మాల్లు జరుగుతాయనేది తెరపై ఆవిష్కరించే కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. ప్రేమ, హాస్యం, యాక్షన్ తదితర కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రంగా బొంగు చిత్రం ఉంటుందని అన్నారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని రఘుకుమార్ నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్‌ను రజనీకాంత్ పుట్టిన రోజైన డిసెంబర్ 12 న ప్రారంభించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చెన్నై, ముంబై, మధురై,దిండిగల్ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
నేల తల్లి వైద్యుడు నటరాజన్
విష రసాయనాల చెర నుంచి నేల తల్లికి విముక్తి కల్పించేందుకు నడుంకట్టిన వైద్యుడాయన. సత్తువ కోల్పోయిన సూక్ష్మజీవులకు సజీవ శక్తిని నింపిన శక్తి ప్రదాత. గుక్కపట్టిన పుడమి కల్మషం లేని పసిపాపలా నవ్వుతోందంటే అది ఆ వైద్యుని చలవే. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులకు ప్రాణశక్తిని ఇచ్చేది పంచగవ్యమని రైతులకు నచ్చ జెప్పి, ఒప్పించి, మెప్పించి విశ్వవ్యాప్తం చేయటంలో ఆయన కృషి భగీరథుని తలపిస్తే, తను మూడు సంవత్సరాలు పగలూ, రేయనకా కష్టపడి సంపాదించిన జ్ఞానంపై పేటెంట్ కూడా పొందకుండా రైతులకు అందించిన వైనం పురాణాల్లో దధీచిని తలపిస్తుంది. పంచగవ్యకు రైతులోకంలో వేదంలా గౌరవం కల్పించిన వ్యక్తి తమిళనాడులోని కోడుమూడికి చెందిన డా. కె. నటరాజన్. ఎంబీబీఎస్ చేసి వైద్యవృత్తిలో స్థిరపడిన నటరాజన్ యాదృచ్ఛికంగా జరిగిన ఓ ఘటనతో పంచగవ్య తయారీ, దాన్ని ప్రచారం చేసే పనిని తన కర్తవ్యంగా ఎంచుకున్నారు. పదిహేనేళ్ల క్రితం మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆయన కోడిమూడిలోని శివాలయానికి వెళ్లారు. పూజాకార్యక్రమం పూర్తయ్యాక ప్రసాదంగా పంచగవ్యను ఇవ్వటం అక్కడి సంప్రదాయం. పంచగవ్యను ప్రసాదంగా ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలేమిటని నటరాజన్ పూజారిని ప్రశ్నించారు. పూజారి పంచగవ్యతో జీవరాశులకు కలిగే ప్రయోజనాలు, మొక్కలపై అది చూపే ప్రభావాన్ని నటరాజన్‌కు వివరించారు. ఇదంతా విన్న నటరాజన్‌కు ఆ క్షణంలో అదే తన జీవిత లక్ష్యంగా, భగవంతుడే తనకు కర్తవ్యాన్ని బోధిస్తున్న భావన కలిగింది. తన జీవిత పరమార్థం దానితోనే ముడిపడి ఉన్నట్టు ఆయనకు అనిపించింది. ఒక వైద్యుడిగా ప్రస్తుతం జరుగుతున్న అనారోగ్యకర పరిణామాల పట్ల అవగాహన ఉన్న ఆయనకు ఈ ప్రక్రియ సరైన పరిష్కారంగా అనిపించింది. అలా ఆయన పంచగవ్య గురించి తెలుసుకొని రైతులకు ఉపయోగపడేలా దాన్ని అందించాలని నిశ్చయించుకున్నారు. మూడేళ్ల శోధన.. పంచగవ్యకు సంబంధించిన వివరాల కోసం నటరాజన్ వేదాల ను శోధించి సమాచారాన్ని సేకరించారు. రకరకాల నిష్పత్తుల్లో వివిధ రకాల పదార్థాలను కలపి ద్రావణాన్ని తయారు చేయటం. తయారుచేసిన ద్రావణాన్ని రైతులకు ఇచ్చిపంటలపై పిచికారీ చేయించటం, వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని కొన్ని పదార్థాలను కలపటం, మరి కొన్నింటిని తొలగించటం, వాటిని కలిపే నిష్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేయటం, ఇలా రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ప్రతి రోజూ పరిశోధనలతోనే గడిచింది. మూడేళ్ల శ్రమ తరువాత పంచగవ్య వెలుగులోకొచ్చింది. నిర్ణీత ప్రమాణాలతో దానికి తుదిరూపునిచ్చారు. దీన్ని వినియోగించడంతో అన్ని పంటల్లోనూ మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వచ్చి చెబుతుండటంతో దీనిపై మరింత నమ్మకం కలిగింది. విస్తృత ప్రచారం, ఉచిత శిక్షణా తరగతులు పంచగవ్యను తయారు చేసింది మొదలు, శరవేగంతో దాని ప్రయోజనాలను రైతుల్లోకి తీసుకెళ్లారు నటరాజన్. పంచగవ్య వాడటం వల్ల కలిగే లాభాల గురించి రైతుల మనస్సుల్లో బలంగా నాటుకునేలా ప్రచారం చేశారు. ఉచిత శిక్ష ణా తరగతులు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. ఖండాంతరాల నుంచి శిక్షణ కోసం.. ఒక్క భారతదేశంలోని రైతులే గాక, విదేశాల నుంచి సైతం వచ్చి పంచగవ్య తయారీ, వాడే పద్ధతులపై నటరాజన్ వద్ద శిక్షణ పొందుతున్నారు. క్యూబా, మలేషియా, అమెరికా, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల నుంచి వస్తున్నారు. పంచగవ్య తయారీ వెనుక ఆయన కృషిని ఎవరైనా ప్రశంసిస్తే తను నిమిత్త మాత్రుడనని, పంచగవ్యకు సంబంధించిన సమాచారమంతా వేదాల్లోనే ఉందని ఎంతో వినయంగా చెబుతారాయన. పంచగవ్య అనేది ఒక అద్భుత సంపద. తరగని గని. ఎవరైనా, ఎంతైనా ఉపయోగించుకోవచ్చు అంటారాయన. పంచగవ్యను చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చని, సొంత ఆవులుంటే ఈ ఖర్చు మరింత తగ్గుతుందని అంటారాయన. రైతులు మరింత సమయం కేటాయించి, శ్రద్ధతో పంచగవ్యను తయారుచేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతార ని నటరాజన్ సూచిస్తున్నారు. పంటలపై పిచికారీ ఇలా.. వంద లీటర్ల నీటికి మూడు లీటర్ల పంచగవ్యను కలిపి పంటలపై పిచికారీ చేయాలి. పిచికారీకి ముందు ద్రావణాన్ని వడకట్టాలి. సాగు నీటి ద్వారానూ పంచగవ్యను పంటలకు అందించవచ్చు. తడులు ఇచ్చేటప్పుడు నీటివెంట ఎకరాకు 20 లీటర్ల పంచగవ్యను అందించాలి. డ్రిప్ ద్వారాను పంచగవ్యను అందించవచ్చు. విత్తనాలకు పంచగవ్యను పట్టించి విత్తుకోవచ్చు. పంచగవ్యతో నాణ్యమైన పండ్ల దిగుబడి దీన్ని పిచికారీ చేయటం వల్ల పంటల్లో పూత బాగా వస్తుంది.. ఉద్యాన పంటల్లో దీనిని పిచికారీ చేస్తే పండ్ల రసాలు మంచి రుచిగా ఉండటమే కాక నిల్వ ఉండే కాలం పదిరోజులు వరకూ పెరిగింది. మామిడి తోటల్లో పూత బాగా రావటంతోపాటు పండ్ల నిల్వ కాలం పెరిగింది. రుచి కూడా ఎక్కువ రోజుల పాటు నిలిచి ఉన్నట్టు రైతులు గుర్తించారు. సువాసన దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటుంది. పంచగవ్య మొక్కల పెరుగుదలకు ఉపయోగపడటమే కాక మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో పంచగవ్యను క్రిమిసంహారిణిగా వాడుతుండటం విశేషం. పంచగవ్య తయారీ, శిక్షణ, మార్కెటింగ్ వివరాలకోసం డా.కె.నటరాజన్ (+91 94433 58379)ను సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు.. తాజా ఆవు పేడ - 5 కిలోలు ఆవు మూత్రం - 3 లీటర్లు ఆవు పాలు - 2 లీటర్లు ఆవు నెయ్యి - 1/2 కేజీ ఆవు పెరుగు - 2 లీటర్లు చెరకు రసం - 3 లీటర్లు లేత కొబ్బరి నీళ్లు - 3 లీటర్లు పండిన అరటి పండ్లు - 12 కల్లు లేదా ద్రాక్షరసం - 2 లీటర్లు పంచగవ్య తయారీ ఇలా.. పంచగవ్య తయారీకి ఒక కుండ, ప్లాస్టిక్ క్యాన్ లేదా కాంక్రీట్‌తో కట్టిన తొట్టెను కాని ఉపయోగించాలి. లోహపు పాత్రలు వాడకూడదు. మొదట తాజా ఆవుపేడను కుండలో వేయాలి. దానిపై ఆవునెయ్యిని వేయాలి. మూడు రోజుల పాటు రోజుకు రెండు సార్లు కలియబెట్టాలి. నాలుగో రోజు మిగిలిన పదార్థాలను ఈ మిశ్రమానికి కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పదిహేను రోజుల పాటు, రోజూ రెండుసార్లు కలియబెట్టాలి. కుండపైన మూత ఉంచి వ్యాధికారక శిలీంధ్రాలు ఆశించకుండా కాపాడాలి.