తీవ్ర అనారోగ్యంతో మరణించిన తన భర్త నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 15 రోజుల పెరోల్ కోసం ఏఐఏడీఎంకే బహిష్కృత చీఫ్ వీకే శశికళ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. నటరాజన్ ఈరోజు తెల్లవారుజూమున ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న నటరాజన్‌ను గతవారం గ్లెన్‌ఈగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రికి తరలించారు. నటరాజన్‌కు 2017లో లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.