perol
-
డేరా బాబాకు మరోసారి పెరోల్
న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరు అయింది. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో దోషి అయిన గుర్మిత్ శుక్రవారం మరోసారి మంజూరైన పెరోల్‌పై 50 రోజుల పాటు జైలు నుంచి విడుదల కానున్నారు. అయన ఇప్పటికే పలుమార్లు పెరోల్‌పై విడుదలైన విషయం తెలిసిదే. అయితే తాజాగా మంజూరైన పెరోల్తో ఆయన ఇప్పటివరకు గడిచిన రెండేళ్లలో ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి జైలు నుంచి పెరోల్‌పై బయటకు కావటం గమనార్హం. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్‌పై వెళ్తూ రావడం చేస్తున్నారు. చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ -
రాజీవ్ గాంధీ హత్య కేసు: వారిద్దరికి ఎక్కువ రోజులు పెరోల్ కుదరదు
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, భర్త మురుగన్‌కు ఎక్కువ రోజులు పెరోల్ ఇచ్చేందుకు కుదరదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి తెలిపారు. బుధవారం వేలూరు పురుషులు, మహిళా సెంట్రల్ జైలులో ఆకస్మికంగా తనఖీలు చేసి ఖైదీలకు అవసరమైన వసతులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఖైదీలు తయారు చేస్తున్న చెప్పులు, షూలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మురుగన్, నళిని, శాంతన్, ఆరుగురు ఖైదీలతో నేరుగా వెళ్లి మాట్లాడానన్నారు. ఆ సమయంలో మురుగన్, నళిని ఆరు నెలలు పెరోల్ ఇప్పించాలని కోరారని, నెల రోజులు ఇచ్చేందుకు కుదురుతుందని చెప్పానన్నారు. కోర్టు అనుమతి ఇస్తే తాము పెరోల్‌పై పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న షూ లు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. జైలులో నిషేధిత పదార్థాలు తీసుకెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గాంధీ, ఎమ్మెల్యే నందకుమార్, కార్తికేయన్, డీఆర్ఓ రామ్మూరి, సబ్ కలెక్టర్ విష్ణుప్రియ, జైళ్లశాఖ డీఐజీ జయభారతి, జైలు సూపరింటెండెంట్ రుక్మణి పాల్గొన్నారు. -
33 ఏళ్ల తరువాత నాన్నను కలిసింది
పాలక్కడ్ లేదా పాల్ఘాట్ అనే ఉళ్లో ఉంటున్న అజితకు తన తండ్రి అక్కడికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం జైలులో ఉన్నాడన్న సంగతి తెలియనే తెలియదు. ఆమె తండ్రి శివాజీని అజితకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు పోలీసులు పట్టుకెళ్లారు. దానికి కారణం రాజకీయ పార్టీ కార్యకర్త అయిన శివాజీ ఏదో హత్య చేశాడని అభియోగం. రాజకీయ కక్షలలో భాగంగా శివాజీ తన 32వ ఏట జైలుకు వెళ్లాడు. దాంతో అతని భార్యకు మతిస్థిమితం తప్పి మరణించింది. వద్దన్నా తమ ఇంటి ఆడపిల్లను చేసుకుని, పార్టీ అని తిరిగి ఈ కష్టాలన్నీ తెచ్చాడని అల్లుడి మీద కోపం పెట్టుకున్న అత్తామామలు అజితను పెంచి పెద్ద చేసే క్రమంలో ఆమె తండ్రి ప్రస్తావనను పొరపాటున చేయడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో అజిత తన తండ్రి మరణించాడని అనుకుంది. అజిత పెద్దదయ్యింది. పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇప్పుడు ఆమె వయసు 33 సంవత్సరాలు. అయితే లాక్డౌన్ సమయంలో టీవీ చూస్తున్న అజితకు గత సంవత్సరం ఖైదీల ఇంటర్వ్యూలో తన తండ్రి గురించిన ప్రస్తావన వచ్చింది. తండ్రి పేరు, హత్య కేసు వివరాలు పోలికతో ఉండటంతో అజితకు జైలులో ఉన్నది తన తండ్రే అని తెలిసింది. ఇక ఆ కూతురి మనసు ఆగలేదు. 2006లో శిక్ష పూర్తి అయినా శివాజీ యావజ్జీవ శిక్ష 2006లోనే పూర్తయ్యింది. అయితే శిక్షాకాలంలో అతను నాలుగుసార్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో జైలులో ఉండిపోవాల్సి వచ్చింది. జైలులో ఉన్న తండ్రిని విడిపించుకోవడానికి అజిత తెలిసినవాళ్లందరి దగ్గరకూ పరిగెత్తింది. చివరకు కరోనా ఆమెకు సాయపడింది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి జైలులో ఉన్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడంలో భాగంగా శివాజీకి కూడా 3 నెలల పెరోల్ ఇచ్చారు. వెంటనే అజిత వెళ్లి తండ్రిని తెచ్చుకుంది. 65 ఏళ్ల వయసు ఉన్న శివాజీ కూతురిని చూడటం ఒక ఉద్వేగం అయితే బయటికొచ్చి ఉండటం మరో ఉద్వేగం. ‘ఆయన చాలా ఆందోళన చెందాడు. కాని నా ఇంటికి వచ్చాక మెల్లగా సర్దుబాటు చెందాడు’ అని అజిత సంతోషంగా చెప్పింది. రక్త సంబంధం గొప్పతనం ఇలా ఉంటుంది. ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా అది తన రక్తాన్ని ఆనవాలు పడుతుంది. సినిమా కథల కంటే నాటకీయమైన కథలను మనకు ఇస్తూ ఉంటుంది. -
ఖైదీలకు గుడ్ న్యూస్..మరో 8 వారాలు సేఫ్‌గా!
లక్నో : భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 2,234 మంది ఖైదీలకు మరో రెండు నెలల ప్రత్యేక పెరోల్ మంజూరు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 71 జైళ్లలో ఉన్న 2,234 మంది ఖైదీను 8 వారాల పాటు పెరోల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాన్ని మరో 8 వారాలు పొడిగించాలని నిర్ణయించినట్లు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్థీ పేర్కొన్నారు. ఈ మేరకు మే 25న ఓ ప్రకటన విడుదల చేశారు. (ఖైదీకి కరోనా.. క్వారంటైన్‌కు 100 మంది ) దేశంలో మహమ్మారి వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో గరిష్టంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కేసులలో ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయల్‌పై విడుదల చేయడాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. జైళ్లల్లో సామాజిక దూరం పాటించడం చాలా కష్టతరమైన విషయం. దీంతో జైళ్లలో అధిక రద్దీ కారణంగా కరోనా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలకు ఇచ్చిన పెరోల్ గడువును మరో 8 వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. (మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ ) -
చిన్నమ్మకు పెరోల్!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మరో నెల రోజుల్లో పెరోల్ మీద బయటకు రానున్నారు. ఇందకు తగ్గ కసరత్తుల్లో కుటుంబీకులు నిమగ్నమయ్యారు. అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం, అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రం పరప్పన అగ్రహార చెరలో ఆమె ఉన్నారు. ఆమెకు విధించిన నాలుగు సంవత్సరాల శిక్షలో, ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు ముగిశాయి. ఇక ఏడాది పాటు ఆమె శిక్ష అనుభవించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది భర్త నటరాజన్ అనారోగ్య పరిస్థితి, మరణం తదుపరి పరిణామాలతో రెండు సార్లు జైలు నుంచి పెరోల్ మీద చిన్నమ్మ బయటకు వచ్చారు. రెండో సారి అయితే పదిహేను రోజులు సమయం ఇచ్చినా, ఆమె తొమ్మిది రోజుల్లోనే మళ్లీ జైలుకు వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో మార్చిలో మళ్లీ ఆమె పెరోల్ మీద బయటకు రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గ కసరత్తుల్ని కుటుంబీకులు చేపట్టారు. గత వారం కుటుంబీకులు పరప్పన అగ్రహార చెరలో శశికళను కలిసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కుటుంబ కార్యక్రమం నిమిత్తం జైలు నుంచి బయటకు వచ్చేందుకు చిన్నమ్మ అంగీకరించడంతో పెరోల్ ప్రయత్నాల మీద దృష్టి పెట్టారు. తమ్ముడి కుమారుడి వివాహం చిన్నమ్మ శశికళ సోదరుడు, అన్నా ద్రావిడర్ కళగం ప్రధాన కార్యదర్శి దివాకరన్ కుమారుడు జై ఆనంద్‌కు వివాహ ఏర్పాట్లు చేసి ఉన్నారు. మార్చి ఐదో తేదీన ఈ వివాహం తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడిలో జరగనుంది. కుటుంబంలో జరిగిన ప్రతి వివాహ వేడుకకు చిన్నమ్మ హాజరై ఉన్న దృష్ట్యా, ఈ కార్యక్రమానికి సైతం రప్పించేందుకు నిర్ణయించారు. అందుకే ఆమె అనుమతితో పెరోల్ ప్రయత్నాల మీద దృష్టి పెట్టినట్టు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. స్టాలిన్ ఓ శక్తి తంజావూరులో గురువారం ఓ వివాహ వేడుకకు చిన్నమ్మ సోదరుడు దివాకరన్ హాజరయ్యారు. ఇదే వేడుకకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా వచ్చారు. ఈ సమయంలో దివాకరన్ వేదిక మీద ప్రసంగిస్తూ స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి, ఇక్కడ ఏలేద్దామనుకుంటున్నాడని పరోక్షంగా రజనీకాంత్‌నుద్దేశించి విమర్శలు గుప్పించారు. తమిళుడే ఈ రాష్ట్రానికి పాలించాలని, తమిళుల సంక్షేమం, అభివృద్ధి, ప్రగతి కోసం ఆర్మీ దళపతి వలే డీఎంకేను నడిపిస్తున్న స్టాలిన్‌కు ఆ అర్హతలు ఉన్నాయన్నారు. అందుకే స్టాలిన్ వెంట నిలబడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఉత్తర్‌ప్రదేశ్‌లో 'డాక్టర్ బాంబ్' అరెస్ట్
కాన్పూర్ : పెరోల్‌పై ఉండి కనిపించకుండా పోయినా జలీస్ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు శుక్రవారం కాన్పూర్‌లో అరెస్టు చేశారు.1993 ముంబై వరుస పేళుళ్ల కేసులో జలీస్ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. కాన్పూర్‌లోని మసీదు నుంచి ప్రార్థన అనంతరం బయటికి వస్తున్న జలీల్ అన్సారీ యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్సారీని లఖ్‌నవూ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 'డాక్టర్ బాంబ్'గా పేరు పొందిన 68 ఏళ్ల ముంబై పేళుళ్ల కేసులో అన్సారీ రాజస్తాన్‌లోని అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే నెల ముందు అన్సారీకి 21 రోజుల పెరోల్ రావడంతో అతని స్వస్థలమైన మోమిన్‌పూర్‌కు వచ్చాడు. కాగా జనవరి 17న అన్సారీ పెరోల్ పూర్తవడంతో ఉదయం 11 గంటల కల్లా జైలుకు రావాల్సి ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ముంబైలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కాన్పూర్‌లోని మసీదు నుంచి బయటకు వస్తున్న జలీస్ అన్సారీని అరెస్టు చేశారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అన్సారీ బాంబులు సరఫరా చేసినట్లు తేలడంతో సుప్రీంకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన సిమి, ఇండియన్ మొజాహిద్దీన్ ఉగ్రవాదులకు బాంబులు ఎలా తయారు చేయాలనే దానిపై శిక్షణ కూడా ఇచ్చాడు. 1993 జరిగిన ముంబై వరుస పేళుళ్లలో 317 మంది చనిపోగా, వందల మంది గాయపడ్డారు. -
వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు..
సాక్షి ప్రతినిది, చెన్నై: నాలుగేళ్ల శిక్షాకాలం ముగిసేలోపే విడుదలవ్వాలని శశికళ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. సత్ప్రవర్తన పరిధిలో ఆమె లేనందున ముందస్తు విడుదల సాధ్యం కాదని, శిక్షాకాలాన్ని పూర్తిగా అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్ ఎన్ఎస్ మెక్రిక్ సోమవారం స్పష్టం చేశారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకర్ కూడా అదే జైల్లో నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం ప్రారంభం కాగా ప్రస్తుతానికి రెండున్నరేళ్లు పూర్తయిన దశలో సత్ప్రవర్తన కింద ముందుగానే జైలు నుంచి విడుదల అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. శశికళ, ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ సైతం విడుదల కోసం ఎదురుచూశారు.ఈ స్థితిలో కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్ ఎన్ఎస్ మెక్రిక్ వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు. శశికళ తన శిక్షాకాలాన్ని పూర్తి చేసిన తరువాతనే విడుదల అవుతారని, జైలులో సత్ప్రవర్తన కింద ఆమెను పరిగణించలేమని తేల్చేశారు. ఈ సమాచారంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం శ్రేణులు దిగాలులో పడిపోయారు. పూర్తిస్థాయి శిక్షాకాలం అంటే 2021 ఫిబ్రవరి వరకు శశికళ విడుదల కోసం వేచి ఉండక తప్పదని వాపోతున్నారు. -
తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని
చెన్నై, వేలూరు: మద్రాసు హైకోర్టు తీర్పుతో 30 రోజల పాటు ఫెరోల్‌పై వచ్చిన నళిని రెండో రోజున వేలూరు సత్వచ్చారి పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తమ్ముడితో ఏకాంత ప్రదేశంలో రహస్యంగా మాట్లాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో నళిని శిక్ష అనుభవిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్లు కోసం ఫెరోల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 30 రోజుల పెరోల్ మీద నళిని సత్‌వచ్చారిలోని రంగాపురంలో ఉన్న తమిళ్ పేరవై ప్రధాన కార్యదర్శి సింగారాయర్ ఇంటి వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. 30 రోజుల పాటు సత్‌వచ్చారిలోని పోలీస్ స్టేషన్లో నళిని సంతకం చేయాలని నిబంధన ఉండడంతో మూడవ రోజైన ఆదివారం ఉదయం సత్వచ్చారి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేశారు. వీసీకే నేతలు మాట్లాడేందుకు నిరాకరణ: నళినితో కలిసి మాట్లాడేందుకు వీసీకే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విన్నయ అరసు వేలూరులోని నళిని ఇంటి వద్దకు చేరుకున్నారు, అయితే కోర్టు అనుమతి లేనిది ఎవరినీ మాట్లాడేందుకు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అనంతరం విన్నయరసు విలేకరులతో మాట్లాడుతూ ఇదే కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని ఫెరోల్‌పై విడుదల చేసేందుకు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాము ప్రస్తుతం నళినితో మాట్లాడేందుకు వచ్చామని అయితే కోర్టు అనుమతి లేకపోవడంతో తిరిగి వెళుతున్నామన్నారు. తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని: 28 సంవత్సరాల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన నళినిని చూసేందుకు ఆమె తమ్ముడు భాగ్యనాథన్ కుమార్తెతో కలిసి నళిని ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్లు గురించి ఏకాంతంగా చర్చించారు. పోలీసు స్టేషన్ వద్ద కూడా ఏకాంతంగా మాట్లాడినట్లు సమాచారం. -
రాజీవ్‌గాంధీ హంతకురాలు నళినీకి పెరోల్
-
ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కి పెరోల్
-
అనూహ్యం: అతడిని క్షమించిన సబ్రినా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జెసికా లాల్ హత్యకేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా నిరూపించబడి యావజ్జీవ కారగార శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ(41)ను తాను క్షమిస్తున్నట్లు జెసిక సోదరి సబ్రినా లాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె ఢిల్లీ తీహార్ జైలు సంక్షేమ అధికారికి ఒక లేఖ రాశారు. దీనిలో ఆమె మనుశర్మ 12 సంవత్సరాల నుంచి జైలులో ఉన్నాడని, ఈ సమయంలో అతను సేవా సంస్థలకు, జైలులోని ఇతర ఖైదీలకు చాలా సహాయం చేశాడని ఇవన్ని అతడిలో వచ్చిన మార్పును సూచిస్తున్నాయని తెలిపారు. అతడి విడుదల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రస్తుతం మనుశర్మ తీహార్‌లోని ఓపెన్ జైల్లో ఉంటున్నాడు. జైల్లో సత్ప్రవర్తన చూపిన ఖైదీలను ఓపెన్ జైలుకు పంపిస్తామని, అందులో భాగంగానే ఆరు నెలల క్రితం అతడిని అక్కడికి తరలించినట్టు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ అజయ్ కశ్యప్ తెలిపారు. సబ్రినా లాల్ రాసిన లేఖ గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. దాని గురించి తనకు ఎటువంటి సమాచారం తెలియదని తెలిపారు. ప్రస్తుతం సిద్ధార్థ వశిష్ట అలియాస్ మనుశర్మ తన పేరు మీద ఒక సంస్థను స్థాపించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఖైదీలకు, వారి పిల్లలకు పునారావాసం కల్పిస్తున్నారు. ఒక ప్రైవేటు బార్లో పనిచేస్తున్న జెసికా లాల్ 1999లో హత్యకు గురయ్యారు. జెసిక మరణించిన రోజు మనుశర్మ మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడితో కలిసి ఆమె పనిచేస్తున్న బార్‌కు వెళ్లాడు. ఆ రోజు జెసికను మద్యం తీసుకురమ్మని మనుశర్మ ఆదేశించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ కోపంలో జెస్సికను పాయింట్ బ్లాంక్ రెంజ్లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. జెస్సికా లాల్ (ఫైల్ ఫొటో) ట్రయల్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు రేగాయి. దాంతో 2006లో ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. కింది కోర్టులో నిర్లక్ష్యం చేసిన సాక్ష్యాలను పరిశీలించిన తరువాత హైకోర్టు మనుశర్మ నేరం చేశాడని నిర్ధారించి, శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును ధ్రువీకరించింది. అప్పటి నుంచి మనుశర్మ జైలు జీవితం గడుపుతున్నారు. జైలులో ప్రత్యేక వసతులు పొందుతున్నారనే ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. అరెస్టైన నాటి నుంచి దాదాపు 15 ఏళ్ల జైలు జీవితంలో మనుశర్మకు మూడుసార్లు పెరోల్ లభించింది. 2009లో తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఒకసారి, 2011లో తన సోదరుని వివాహానికి హజరుకావడానికి, 2013లో తన మాస్టర్స్ డిగ్రీ పరీక్షల నిమిత్తం పెరోల్ తీసుకున్నారు. -
ముందస్తుగా..
ముందస్తుగానే పరప్పన అగ్రహార చెరకు వెళ్లేందుకు చిన్నమ్మ శశికళ నిర్ణయించారు. శనివారం సాయంత్రం ఆమె తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం కానున్నా రు. శుక్రవారం నటరాజన్ మృతికి కర్మక్రియలు జరగనున్నాయి. సాక్షి, చెన్నై: భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె నటరాజన్ స్వగ్రామంలో కాకుండా తంజావూరులో ఉంటున్నారు. ఆమెను పరామర్శించేందుకు రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివస్తున్నారు. గురువారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలు చిన్నమ్మను పరామర్శించారు. గంటపాటు చిన్నమ్మతో వారు భేటీ అయ్యారు. ఈ సమయంలో కళగం ఉప ప్రధానక కార్యదర్శి దినకరన్ సైతం అక్కడే ఉన్నారు. ఈసందర్భంగా నాయకులు, మద్దతుదారుల్ని ఉద్దేశించి చిన్నమ్మ కొన్ని సూచనల్ని చేసినట్టు సమాచారం. దినకరన్‌కు మద్దతుగా అందరూ నిలవాలని, మరో ఏడాదిలో తాను జైలు నుంచి వచ్చేస్తాననని, ఆ తర్వాత పార్టీ తప్పకుండా చేతుల్లోకి వస్తాయని ఆందోళన చెందవద్దన్న భరోసా ఇచ్చినట్టు సమాచారం. తాను వచ్చాకా, అన్ని సక్రమంగా సాగుతాయని, అంతవరకు ధైర్యంగా ఉండాలని, ఈ కాలంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని, వాటన్నింటినీ ఎదుర్కోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ సమయంలో చిన్నమ్మ మేనల్లుడు వివేక్ అక్కడకు వచ్చినట్టు వచ్చి దినకరన్ ఉండడంతో క్షణాల్లో వెనుదిరగడం చర్చకు దారితీసింది. అలాగే, చిన్నమ్మ సోదరుడు దివాకరన్ సైతం మౌనంగాఅక్కడి నుంచి వెళ్లడంతో కుటుంబ విభేదాలు కొట్టచ్చినట్టు కనిపించడం గమనార్హం. పెరోల్ కాలం వినియోగించుకోకూడదని.. తనకు కర్ణాటక జైళ్ల శాఖ 15 రోజుల బెయిల్ మంజూరు చేసినా, పూర్తి కాలం ఆ రోజుల్ని వినియోగించుకునేందుకు శశికళ ఇష్ట పడలేదు. ముందుగానే ఆమె జైలుకు వెళ్లేందుకు నిర్ణయించడం గమనార్హం. శుక్రవారం విలార్ గ్రామంలో నటరాజన్ మృతికి కర్మకాండ జరగనుంది. ఇందుకోసం ఉదయాన్నే ఆగ్రామానికి శశికళ వెళ్లనున్నారు. ఆ తదుపరి తంజావూరు చేరుకుని నటరాజన్ చిత్ర పట ఆవిష్కరించనున్నారు. శనివారం సాయంత్రం అందరి వద్ద సెలవు తీసుకుని తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం అయ్యేందుకు ఆమె నిర్ణయించి ఉన్నట్టు మద్దతుదారులు పేర్కొన్నారు. కాగా, తన కుటుంబంలో దివాకర్, వివేక్‌ల రూపంలోనే వివాదాలు తెరమీదకు వస్తున్నట్టు చిన్నమ్మ గుర్తించారని, అందుకే వివాదాలు మరింత పెద్దవి కాక ముందే జైలుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా, చిన్నమ్మను ఎవరెవరు వచ్చి పరామర్శిస్తున్నారో అన్న వివరాలను కర్ణాటక జైళ్ల శాఖ సేకరించి ఉన్నట్టు సమాచారం. అలాగే, వచ్చి వెళ్లే వారితో పాటు, తంజావూరు ఇంటి వద్ద వీడియో చిత్రకరణ సాగడం గమనార్హం. -
భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు..
-
శశికళ భర్త కన్నుమూత
సాక్షి, చెన్నై: తమిళ ప్రజల అమ్మ జయలలితకు నెచ్చెలి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్(75) మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. పుదియ పార్వై పత్రిక సంపాదకుడు అయిన నటరాజన్ గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. అనేక చికిత్సల అనంతరం ఆయన కోలుకు న్నట్టు కుటుంబీకులు భావించారు. నుంగం బాక్కం మహాలింగపురంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, ఆయన గతవారం గుండెపోటుకు గురయ్యారు. చెన్నై శివారులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున 1.30 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఎంబామింగ్ చేశారు. అనంతరం చెన్నై బీసెంట్ నగర్‌లోని నివాసంలో మధ్యాహ్నం వరకు ఉంచారు. అనంతరం తంజావూరు జిల్లాలోని నటరాజన్ స్వగ్రామం విలార్‌కు తరలించారు. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఎండీఎంకే నేత వైగో, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి తదితరులు నటరాజన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శశికళకు పెరోల్ మంజూరు నటరాజన్ మరణంతో బెంగళూరు జైల్లో ఉన్న శశికళకు 15 రోజుల పెరోల్ మంజూరైంది. ఆమెను రోడ్డుమార్గంలో తంజావూరుకు తీసు కెళ్లేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. -
పెరోల్‌పై వెళ్లిన ఖైదీ అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఫార్లో పెరోల్‌పై వెళ్లి తిరిగి రాని జీవిత ఖైదీ ఒకరిపై జైలు అధికారులు పోలీసు కేసు నమోదు చేశారు. శోభన్‌బాబు అనే జీవిత ఖైదీ 18 రోజుల క్రితం పెరోల్‌పై విడుదలయ్యాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో చర్లపల్లి జైలు అధికారులు అతనిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ హత్య కేసులో పన్నెండేళ్లుగా చర్లపల్లి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. క్షమాభిక్ష లభించదని మనస్తాపానికి గురై అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఇతను నార్త్ లాలగూడకు చెందినవాడు. -
పెరోల్ కోరనున్న లాలూ
పాట్నా : పశుగ్రాస కుంభకోణంలో మూడున్నరేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పెరోల్ కోరనున్నారు. ఆదివారం మరణించిన తన సోదరి గంగోత్రి దేవి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన పెరోల్‌పై విడుదలయ్యే అవకాశం ఉంది. రాంచీలోని జైలు అధికారుల ద్వారా గంగోత్రి దేవి మరణించారన్న సమాచారం లాలూకు చేరవేశామని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. మరోవైపు ఈ రోజు ఆదివారం కావడంతో అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి సకాలంలో ఆయన పెరోల్ పొందడం కష్టమని తేజస్వి ఆందోళన వ్యక్తం చేశారు. తమ మేనత్త భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లాలూ కన్నా నాలుగేళ్లు పెద్దయిన గంగోత్రి తమ్ముడి విడుదల కోసం శనివారం రోజంతా ప్రార్థనలు చేశారని లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ తెలిపారు. పశుగ్రాస స్కాం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ పదిలక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
నా భర్తను చూడాలి.. పంపించండి ప్లీజ్..
సాక్షి,చెన్నై: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు 15 రోజుల పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. కాగా, శశికళకు పెరోల్ మంజూరవుతుందని దినకరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్‌పై వ్యాఖ్యానించేందుకు దినకరన్ నిరాకరించారు. దీనిపై తాము సీబీఐ విచారణను కోరుతున్నామని చెప్పారు. పళనిస్వామి ప్రభుత్వం త్వరలోనే ఇంటిదారి పడుతుందని వ్యాఖ్యానించారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా?
వాహనదారులకు మరోషాక్. ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిన ధరలతో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల్లో నమోదైన క్షీణతకు ఇక చెల్లుచీటీ ఇచ్చినట్టేనని అంచనాలు చెబుతున్నాయి. డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ తగ్గడం, పెరిగిన డిమాండ్, ఉత్పత్తి తక్కువ కావడంతో ఇక వీటి ధరలు మోత మోగనున్నాయని సమాచారం. 2014 డిసెంబర్ నెల స్థాయిని తాకాయట. తాజా ఆయిల్ ధరల నివేదిక ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ కు రూ.63.02లుగా ఉంటే, డీజిల్ లీటర్ కు రూ.51.67కు పెరిగిందట. అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయట. గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు స్మార్ట్ ర్యాలీ కొనసాగిస్తుండటంతో పాటు, ఏడు నెలల తర్వాత మొదటిసారి, బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్, బ్యారల్ ధర 50 డాలర్లకు పెరిగిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. చాలాకాలంగా బేరిష్ మార్కెట్ గా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎనర్జీ రంగంలో మంచి అవుట్ లుక్ కనిపిస్తుండటంతో వీటి ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఉత్పత్తి పడిపోవడంతో పాటు డిమాండ్ పెరుగుతుండటం క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువ కావడానికి దోహదం చేస్తున్నాయని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు గోల్డ్ మ్యాన్ సాచే తెలిపింది. డిమాండ్ వైపు కాకుండా సప్లై వైపే ఎక్కువగా మార్పులు సంభవించడంతో, క్రూడ్ ధరల్లో ప్రభావం కనిపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జనవరిలో బ్యారల్ కు 30 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ప్రస్తుతం రికవరీ అయి 50 డాలర్లగా నమోదయ్యాయి. రూపాయి విలువ పడిపోవడం కూడా దేశీయంగా క్రూడ్ ఆయిల్ ధరలపై ఒత్తిడిని నెలకొలేలా చేస్తుందని కేర్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం రూపాయి 68-69 మధ్య నడుస్తోంది. ఒకవేళ గ్లోబల్ గా క్రూడ్ ధరలు సాధారణంగా ఉన్నా.. ప్రభుత్వం వీటి ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. 2014 మేలో మోదీ ప్రభుత్వం పాలనలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీలు దాదాపు రెండింతలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై వేసే పన్నులతోనే మోదీ ప్రభుత్వం తమ రెవెన్యూలను పెంచుకుందని వాదనలు వినిపిస్తున్నాయి.