పాట్నా : పశుగ్రాస కుంభకోణంలో మూడున్నరేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పెరోల్ కోరనున్నారు. ఆదివారం మరణించిన తన సోదరి గంగోత్రి దేవి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన పెరోల్‌పై విడుదలయ్యే అవకాశం ఉంది. రాంచీలోని జైలు అధికారుల ద్వారా గంగోత్రి దేవి మరణించారన్న సమాచారం లాలూకు చేరవేశామని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. మరోవైపు ఈ రోజు ఆదివారం కావడంతో అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి సకాలంలో ఆయన పెరోల్ పొందడం కష్టమని తేజస్వి ఆందోళన వ్యక్తం చేశారు.
తమ మేనత్త భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లాలూ కన్నా నాలుగేళ్లు పెద్దయిన గంగోత్రి తమ్ముడి విడుదల కోసం శనివారం రోజంతా ప్రార్థనలు చేశారని లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ తెలిపారు. పశుగ్రాస స్కాం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ పదిలక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment