సాక్షి, పాట్నా : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స కోసం అనుమతి లబించింది. మెడికల్ బోర్డు సిఫార్సుల మేరకు ఆర్జేడీ నేతకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఏ వ్యాధితో బాధపడుతున్నారన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు.
పశుగ్రాసం కేసులో లాలూకు న్యాయస్ధానం 14 ఏళ్ల జైలు శిక్ష, రూ 60 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. రెండు కేసుల్లో వేర్వేరుగా ఏడేళ్ల జైలు శైక్ష, ఒక్కో కేసులో రూ 30 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ న్యాయమూర్తి శివ్ పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతో సహా 18 మందిని దోషులుగా నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment