సాక్షి, రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయిస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. తీర్పు ప్రతిని చదివిన అనంతరం వచ్చే సోమవారం లోగా తాము హైకోర్టుకు వెళతామని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ చెప్పారు.
ఇటీవల లాలూ సోదరి మరణించిన నేపథ‍్యంలో పెరోల్ కోరుతూ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. పశుగ్రాస కుంభకోణం కేసుకు సంబంధించి డిసెంబర్ 23న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం దోషిగా నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment