
రోహ్‌తక్: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు మరోమారు పెరోల్ లభించింది. దీంతో ఆయన ఈరోజు (మంగళవారం) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేందుకు ఆయన ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పెరోల్ లభించింది. ఈ నేపధ్యంలో రామ్ రహీమ్ నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకుంటారని తెలుస్తోంది. ఆయనను స్వాగతించేందుకు ఆశ్రమంలో ఘనమైన ఏర్పాట్లు చేశారు. కాగా రామ్ రహీమ్ దీనికిముందు 2024 అక్టోబర్‌లో పెరోల్‌పై బయటకు వచ్చారు. అప్పుడు ఆయన 20 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. అప్పుడు ఆయన యూపీలోని బర్నావా ఆశ్రమానికి వెళ్లారు.
నాటి పెరోల్ సమయంలో రామ్ రహీమ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకుండా, హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధించారు. 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇదేవిధంగా 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురు కూడా దోషులుగా తేలారు.
ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
Comments
Please login to add a commentAdd a comment