Dera baba
-
ఎన్నికల వేళ డేరా బాబాకు పెరోల్ ఆమోదం.. ఈసీకి కాంగ్రెస్ లేఖ
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ.. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.హర్యానా ఎన్నికల సమయంలో జైలు నుంచి డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. అదేవిధంగా 2019లొ డేరా బాబా చేతిలో హత్యచేయబడిన జర్నలిస్ట్ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్‌ను వ్యతిరేకించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంద’ని అన్నారు. డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాహోరీగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటాన్ని హర్యానా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2017లో జైలు పాలైన డేరా బాబా.. 2020లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 40 రోజుల పాటు పెరోల్‌పై విడుదల కావటం గమనార్హం. ఎన్నికల ముందే డేరా బాబాను ఇలా పెరోల్‌పై విడుదల చేయటంపై కాంగ్రెస్, ప్రజా సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ -
ఫర్లో తో డేరా బాబా బయటకు?
హర్యానాలోని సునారియా జైలు నుంచి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా)కు 21 రోజుల పాటు ఫర్లో లభించింది. ఈ సమయంలో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో గల బర్నావా ఆశ్రమంలో ఉండనున్నారు. రామ్ రహీమ్ తన ఇద్దరు అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరి 19న రామ్‌రహీమ్‌కు 50 రోజుల పెరోల్ లభించింది. ఈ దరిమిలా అతనికి పదేపదే పెరోల్ లేదా ఫర్లో లభించడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. కాంపిటెంట్ అథారిటీ నిబంధనల ఆధారంగా గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరోల్ లేదా ఫర్లో మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో హర్యానా ప్రభుత్వం కేవలం రామ్ రహీమ్ మాత్రమే కాకుండా హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 80 మందికి పైగా ఖైదీలకు పెరోల్ లేదా ఫర్లో సౌకర్యం అందజేస్తున్నట్లు స్పష్టం చేసింది.ఫర్లో అంటే ఏమిటి?ఫర్లో అంటే ఎవరైనా ఖైదీ అతని కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు హాజరు కావడం లేదా అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడిని పరామర్శించడం లాంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం జైలు నుండి తాత్కాలికంగా విడుదల చేయడం. ఫర్లో సాధారణంగా స్వల్ప కాలానికి మాత్రమే ఇస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత, ఖైదీ తిరిగి జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఫర్లో షరతులను జైలు అధికారులు నిర్ణయిస్తారు. ఎవరైనా ఖైదీకి ఫర్లో మంజూరు చేసేటప్పుడు అధికారులు సదరు ఖైదీ చెప్పే కారణం, అతని ప్రవర్తన, అతను తప్పించుకునే అవకాశం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.పెరోల్ అంటే ఏమిటి?పెరోల్ అంటే ఖైదీ తన జైలు శిక్షలో కొంత భాగాన్ని పూర్తి చేసిన చేసిన అనంతరం షరతులతో కూడిన విడుదలకు అనుమతి కల్పిస్తారు. ఇది ఖైదీ ప్రవర్తనను గుర్తించి ఇస్తారు. ఇది ఖైదీని సమాజంలో తిరిగి చేర్చేందుకు ఉపకరిస్తుంది. పెరోల్ సమయంలో ఖైదీ జైలు అధికారులు పర్యవేక్షణలో ఉంటాడు. అలాగే నిర్ధిష్ట ప్రాంతంలో ఉంటూ, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. -
డేరా బాబాకు ఎదురు దెబ్బ
ఇద్దరు మహిళల అత్యాచార కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రామ్ రహీమ్‌కు తరచుగా పెరోల్ ఇవ్వటంపై హర్యానా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి హైకోర్టు నుంచి కచ్చితమైన అనుమతి లేకుండా రామ్ రహీమ్‌కు ఎటువంటి పేరొల్ మంజూరు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19న ఆయన పెరోల్ మంజూరు అయింది. ఇప్పటివరకు గడిచిన పది నెలల్లో ఇది ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి ఆయన పెరోల్ పొందారు. తాజాగా ఆయన మరోసారి తనకు పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వం తీవ్ర అసహం వ్యక్తం చేసింది. గతంలో రమ్ రహీం వలే.. ఎంతమంది దోషులకు పెరోల్ ఇచ్చారో? ఎన్ని రోజులు ఇచ్చారో? ఎంత మందికి పెరోల్స్ ఆమోదం పొందాయో అనే పూర్తి వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే రామ్ రహీం మూడు ముఖ్యమైన సందర్భాల్లో 91 రోజులు పెరోల్‌పై జైలు బయట వచ్చారు. 21 రోజులు నవంబర్‌లో, 30 రోజులో జూలైలో, 40 రోజులు గత జనవరిలో తన పుట్టిన రోజు సందర్భంగా పెరోల్ పొందారు. ఇక..తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీంను 2017లో హర్యానాలోని పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అయినకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనకు తరచు పెరోల్ జారీ చేయటంలో రాజకీయ కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్వమించు పలు ఎన్నికలు. ఎందుకుంటే రామ్ రహీం అభిమానులు, భక్తులు ఎక్కువగా మాల్వా సామాజిక వర్గానికి ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గం ఓట్లు హర్యానాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లలో ప్రాబల్యం కలిగిఉంటారు. ఈ నేపథ్యంలో రామ్ రహీంకు పెరోల్ వచ్చేలా చేసి.. తన అనుచరులు, భక్తులైన మాల్వా సామాజిక వర్గం ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2022, ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికల సయయంలో 21 రోజుల పెరోల్ పొందారు. అదే ఏడాది హర్యానా మున్సిపల్ ఎన్నికల వేళ జూన్‌లో కూడా 30 రోజుల పెరోల్ పొందారు. గత ఏడాది అక్టోబర్‌లో సైతం హర్యానాలోని అదమ్‌పూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయనకు 40 రోజులు పెరోల్ లభించింది. -
డేరా బాబాకు మరోసారి పెరోల్
న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరు అయింది. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో దోషి అయిన గుర్మిత్ శుక్రవారం మరోసారి మంజూరైన పెరోల్‌పై 50 రోజుల పాటు జైలు నుంచి విడుదల కానున్నారు. అయన ఇప్పటికే పలుమార్లు పెరోల్‌పై విడుదలైన విషయం తెలిసిదే. అయితే తాజాగా మంజూరైన పెరోల్తో ఆయన ఇప్పటివరకు గడిచిన రెండేళ్లలో ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి జైలు నుంచి పెరోల్‌పై బయటకు కావటం గమనార్హం. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్‌పై వెళ్తూ రావడం చేస్తున్నారు. చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ -
డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ..
చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా మరోసారి 30 రోజుల పెరోల్ లభించింది. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్ పై వెళ్తూ రావడం చేస్తున్నారు. గడిచిన మూడేళ్ళలో బాబా గుర్మీత్ మొత్తం ఆరు సార్లు బయటకు వెళ్లి రాగా ఇది ఏడో సారి కావడం గమనార్హం. జనవరిలో చివరిసారిగా పెరోల్ పై వచ్చిన డేరా బాబా సుమారు 40 రోజులు బయట గడిపారు. ఆ వ్యవధిలో బాబా ఆన్లైన్ లో సత్సంగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో తన పుట్టినరోజు వేడుకల్లో కత్తితో కేకును కట్ చేసి ఐదేళ్ల తర్వాత ఇలా పుట్టినరోజుని జరుపుకుంటున్నానని ఇలాంటి పుట్టినరోజులు కనీసం అయిదు జరుపుకోవాలని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. హర్యానా ముఖ్యమంత్రి కూడా ఆరోజు మాట్లాడుతూ బాబా బెయిల్ గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఆయన బెయిల్ పై వచ్చినా కూడా అది పద్దతి ప్రకారమే జరుగుతుంది కదా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ అతడికి బెయిల్ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డేరా బాబా విషయంలో కోర్టుకు హర్యానా ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు.. -
మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్..
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవలే పెరోల్‌పై విడుదలైన డేరా బాబా రామ్ రహీం మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాలా కాలం తర్వాత జైలు జీవితం నుంచి విముక్తి లభించిన ఆనందంలో ఆయన సంబరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద తల్వార్‌తో కేక్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో డేరా బాబాను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు, అదంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ప్రభుత్వం ఆయనను జైలు నుంచి విడుదల చేసిందని మండిపడ్డారు. డేరా బాబా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. Rape convict Ram Rahim celebrated his freedom by cutting a cake with a sword. Several of his followers joined him in his celebration. It's absolute shamelessness on the part of the Haryana government. They have done this to gain votes: @BrindaAdige@aishvaryjain pic.twitter.com/4oYnYcpSVH — TIMES NOW (@TimesNow) January 23, 2023 సీర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించించి సీబీఐ కోర్టు. 2017లో ఈ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి సుంజారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబా. అయితే అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. మరో మూడు నెలల్లోనే మరోసారి 40 రోజుల పెరోల్‌పై విడుదల అయ్యాడు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. డేరా బాబాపై ఓ హత్య కేసు కూడా ఉంది. చదవండి: మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి -
డేరా బాబాకు 40 రోజుల పెరోల్
చండీగఢ్: డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గతంలోనూ అంటే గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన కోర్టు ఇతడికి పెరోల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన యూపీలోని బర్నావా ఆశ్రమానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచే ఆన్లైన్ ద్వారా పలు సత్సంగ్‌లు నిర్వహించారు. వీటికి కొందరు హరియాణా బీజేపీ నేతలు సైతం హాజరయ్యారు. తాజా పెరోల్ సమయంలో ఈ నెల 25న జరగనున్న డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ జయంత్యుత్సవాల్లో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు -
డేరా బాబా.. హార్డ్‌కోర్ క్రిమినల్ కాదంట!
డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జడ్ ఫ్లస్ లెవల్ సెక్యూరిటీ అందించడం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఖలిస్థాన్ ప్రేరేపిత సంస్థల నుంచి డేరా బాబాకు ప్రాణహాని ఉందన్న కారణం చెబుతూ.. జెడ్‌ఫ్లస్ లెవల్ ప్రొటెక్షన్ కల్పించింది హర్యానా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. అభ్యంతరాలపై హర్యానా సర్కార్ వివరణ ఇచ్చుకుంది. ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మీద ప్రస్తుతం బయట ఉన్న డేరాబాబాకు జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీ అందించడం తప్పేం కాదని సమర్థించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ‘డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ హార్డ్ కోర్ క్రిమినల్ ఏంకాదు. శిక్షలు అనుభవిస్తున్న కేసుల్లోనూ స్వయంగా ఆయనే హత్యలు చేయలేదు. నేరపూరిత కుట్ర, సహ నిందితుడిగా మాత్రమే ఉన్నారు. హర్యానా ప్రిజనర్స్ యాక్ట్ కూడా ఆయన్ని హార్డ్ కోర్ క్రిమినల్‌గా పరిగణించకూడదని చెబుతోంది’ అని జైళ్ల శాఖ రూపొందించిన ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. 2017లో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో హర్యానా జైళ్ల శాఖ 21 రోజుల ఫర్లాగ్ జారీచేయగా.. ఫిబ్రవరి 7వ తేదీన బయటకు వచ్చిన గుర్మీత్ తన గురుగ్రామ్ ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే పంజాబ్ ఎన్నికలను ప్రభావం చేసేందుకే డేరా బాబా బయటకు వచ్చాడని, పైగా ఒక క్రిమినల్‌కు జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ అందించడం ఏంటని? అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోర్టు. వివరణ.. సునారియా జైళ్ల సూపరిడెంట్ సునీల్ సంగ్వాన్ ఈ మేరకు హర్యానా ప్రభుత్వం తరపున హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. హర్యానా అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నాకే గుర్మీత్‌కు ఫర్లాంగ్ జారీ చేసినట్లు వెల్లడించారు. డేరా చీఫ్‌ను హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్(టెంపరరీ రిలీజ్)యాక్ట్ కింద హార్డ్‌కోర్ క్రిమినల్‌గా పరిగణించరాదని ఏజీ జనవరి 25నే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశంలో భద్రతా కేటగిరీ X, Y, Y-Plus, Z మరియు Z-Plus. చివరిది జెడ్ ఫ్లస్ వర్గం ప్రముఖులకు మాత్రమే కేటాయించబడుతుంది. ఈ కేటగిరీలు కాకుండా.. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కవర్ కేవలం ప్రధాని, వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు కూడా ఎస్పిజి భద్రత కల్పించారు. కానీ ఇది తరువాత Z-ప్లస్ కేటగిరీకి మార్చేశారు. Z-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులు మొబైల్ సెక్యూరిటీకిగానూ 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం ఇద్దరిని (ప్లస్ ఎనిమిది మంది) అందిస్తారు. Z-Plus స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందిస్తారు. -
డేరా బాబా విడుదల
-
అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు!
హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు స్వల్ప ఊరట లభించింది. డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మంజూరు అయ్యింది. అదీ ఎన్నికల వేళ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.. 2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల ఫర్లాగ్ జారీ చేశారు. దీంతో ఈ సాయంత్రం(సోమవారం) గుర్మీత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు తన మెడికల్ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు మాత్రమే జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు ఫర్లాగ్ జారీ కావడం విశేషం. చట్టం ప్రకారం ఫర్లాగ్ ప్రతీ ఖైదీ హక్కు.. అందుకే ఆయనకు జారీ చేశాం అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా తెలిపారు. అయితే ప్రత్యేకించి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. అయితే పొరుగు రాష్ట్రం పంజాబ్‌లో ఎన్నికలకు రెండు వారాల ముందే రహీమ్‌సింగ్ విడుదలకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పంజాబ్ మాల్వా రీజియన్‌లో డేరా బాబాకు ఫాలోవర్లు ఎక్కువ. పైగా పంజాబ్ అసెంబ్లీ 117 స్థానాల్లో.. 69 మాల్వా రీజియన్‌లోనే ఉన్నాయి. ఇక హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రంకాగా.. డేరా బాబా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే డేరా సచ్ఛ సౌధా మద్దతుతోనే 2007లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. డేరా బాబా జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం భారీ ఎత్తున్న కార్యక్రమాల్ని నిత్యం నిర్వహిస్తూ.. సోషల్ మీడియాలో డేరాబాబాను, డేరా సచ్ఛ సౌధాను ట్రెండ్ చేస్తూ ఉంటారు. -
డేరా బాబాకు రహస్య పెరోల్
చండిఘర్ : మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా అధినేత గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ (డేరా బాబా)బాబాకు రహస్యంగా పెరోల్ మంజూరైంది. ఒకరోజు పెరోల్‌పై డేరా బాబా బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి డేరా బాబాకు హరియాణా ప్రభుత్వం అక్టోబర్ 24 న పెరోల్ మంజూరు చేసింది. అయితే పెరోల్ లభించిన విషయం మీడియాకు కూడా తెలియకుండా హరియాణా ప్రభుత్వం జాగ్రత్తపడింది. భారీ బందోబస్తు మధ్య గత నెల 24న గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూడడానికి డేరా బాబాను తీసుకొచ్చారు. ఆ రోజు సాయంత్రం వరకూ డేరా బాబా ఆసుపత్రిలో తన తల్లి దగ్గరే ఉన్నారు. డేరా బాబాకు పెరోల్ వచ్చిన విషయాన్ని రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ ధ్రువీకరించారు. రామ్ రహీమ్ గుర్గావ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్ల కోసం జైలు సూపరింటెండెంట్ నుంచి తనకు వినతి వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు, శనివారం మధ్యాహ్నం రాష్ట్ర జైలు మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అన్ని నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని రామ్ రహీమ్‌కు పెరోల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలడంతో హర్యానాలోని పంచకుల సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్షను 2017లో విధించింది. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 32 మంది మరణించిన విషయం తెలిసిందే. -
దుబ్బాకలో మరో డేరాబాబా
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో మరో డేరాబాబా (స్వామీజీ), ఆయన అనుచరుడి రాసలీలల భాగోతం బట్టభయలు కావడం తీవ్ర చర్చానీయాంశగా మారింది. తనకు జరిగిన అన్యాయంపై ఓ వివాహిత దుబ్బాక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడంతో స్వామీజీతో పాటు ఆయన అనుచరుడి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక సీఐ హరికృష్ణ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇవి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌కు చెందిన ఓ మహిళ సంతోషిమాతా భక్తురాలు.. ఆమెకు సంతోషిమాతా గుడి కట్టాలన్న సంకల్పం చాలా రోజులుగా ఉంది. అయితే చీకోడ్ సమీపంలోనే కొన్నేండ్లుగా రఘు అనే వ్యక్తి ఓ స్వామీజీగా అవతారమెత్తి స్వామి సమర్థ మహరాజ్ ఈనే పేరుతో ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. చాలా మహిమ గల స్వామీజీగా పేరొందడంతో ప్రతిరోజు చాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో చీకోడ్‌కు చెందిన భాదిత మహిళ సైతం స్వామీజీకి భక్తురాలిగా మారింది. మహిళ తన మదిలో ఉన్న సంకల్పం(సంతోషీమాతా గుడి కట్టాలన్నది) స్వామీజీకి చెప్పింది. దీంతో భక్తురాలి అమాయకత్వాన్ని పసిగట్టిన స్వామీజీ రాత్రి వేళలో బాధిత మహిళకు తన అనుచరుడు నరేష్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి నేను స్వామీజీని మాట్లాడుతున్నా నీ సంకల్పం నేరవేరాలంటే నా అనుచరుడు నరేష్ రూపంలో మీ ఇంటికి వస్తాను ఆయన రూపంలో ఉన్న నన్ను సంతృప్తి పరిస్తే నీ ఆలయ సంకల్పం నేరవేరుతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటూ ఒట్టు వేయించుకొన్నాడు. ఇది నమ్మిన ఆ అమాయక మహిళపై స్వామీజీ అనుచరుడు నరేష్‌గత కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. చాలా రోజులు అవుతున్నా ఆమె సంకల్పం నేరవేరకపోవడంతో తనను మోసం చేశారని తెలుసుకున్న మహిళ తమకు ఫిర్యాదు చేసిందని సీఐ హరికృష్ణ తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు స్వామీజీతో పాటు ఆయన అనుచరుడు నరేష్‌పై అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర చర్చానీయాంశగా మారింది. -
డేరాబాబా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చండిఘర్ : ఇద్దరు మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా అధినేత గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ (డేరాబాబా)పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను జైలు సూపరిండెంట్ తిరస్కరించారు. రోహతక్ జైలులో 20 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా తన తల్లికి ఆరోగ్యం బాగాలేనందున మూడు వారాలు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. డేరాబాబా భార్య హర్జిత్‌కౌర్ ఇదే విషయమై పంజాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డేరాబాబా తల్లి నసీబ్‌కౌర్(83) గుండె ఆపరేషన్ ఉన్నందున బెయిల్ ఇవ్వాలని అడిగారు. అయితే డేరాబాబా బయటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తొచ్చన్న అనుమానంతో బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది జైలు అధికారుల విచక్షణకే హైకోర్టు వదిలేసింది. జైలు సూపరిండెంట్ డేరాబాబా ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తం చేసి అతనే బెయిల్ ఇచ్చినా తమకేం అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో జైలు సూపరిండెంట్ డేరాబాబా తల్లి ఆరోగ్యంపై నివేదికను తెప్పించుకొని పరిశీలించి ఆయన పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు. కేసు పూర్వపరాలు.. డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలడంతో హర్యానాలోని పంచకుల సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్షను 2017లో విధించింది. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 32 మంది మరణించిన విషయం తెలిసిందే. -
జర్నలిస్ట్ హత్య కేసు: డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
-
డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
పంచ్‌కుల: జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతి హత్య కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబా, మరో ముగ్గురికి జీవిత కారాగారం విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. బాబా, అతని అనుయాయులు నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్, కృష్ణలాల్ కలిసి హరియాణాలోని సిర్సా ఆశ్రమంలో 2002లో జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతిని చంపేశారు. డేరా బాబా ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ చత్రపతి తన పత్రికలో కథనం ప్రచురించడమే ఇందుకు కారణం. -
జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ (డేరాబాబా)కు జర్నలిస్ట్ హత్య కేసులో హర్యానాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జీవిత ఖైదు విధించింది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరాబాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. కాగా పూరాసచ్ పేరుతో రాంచందర్ చత్తర్‌పతి నిర్వహించే వార్తాపత్రికలో డేరా బాబా ఆశ్రమంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు వార్తలు ప్రచురితమయ్యేవి. డేరా బాబా నిర్వాకాలపై కథనాలు ప్రచురిస్తున్న క్రమంలో రాంచందర్ చత్తర్పతిని 2002 అక్టోబర్ 24న ఆయన ఇంట్లోనే కాల్చిచంపారు. ఈ హత్య కేసులో 2003లో డేరా బాబాపై కేసు నమోదు చేయగా, 2006లో కేసుపై విచారణను సీబీఐ చేపట్టింది. 2007లో కేసుకు సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. జర్నలిస్ట్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను దోషిగా నిర్ధారిస్తూ గురువారం హర్యానాలోని పంచ్‌కుల సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించి శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కృషన్ లాల్‌లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ 50,000 జరిమానా విధించింది. -
జర్నలిస్ట్ కేసులో డేరా బాబా దోషే
పంచకుల: 16 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురు దోషులుగా తేలారు. ఈ మేరకు పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇద్దరు మహిళా భక్తురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. దోషులకు శిక్షను ఈ నెల 17న ఖరారు చేయనున్నారు. దీంతో హరియాణాలోని డేరా ఆశ్రమం పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని వివరిస్తూ గుర్తుతెలియని వ్యక్తి రాసిన లేఖ 2002 అక్టోబర్‌లో ‘పూరా సచ్’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత అదే పత్రికలో పనిచేస్తున్న రామ్‌చందర్ ఛత్రపతి అనే పాత్రికేయుడిని తుపాకీతో కాల్చి చంపేశారు. -
డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై పంచకుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డేరాబాబాతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు. (జేజేల నుంచి.. జైలు దాకా...!) ఇక ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. ఈ క్రమంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డేరాబాబా దోషిగా తేలిన నేపథ్యంలో పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాపెట్టారు. (రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా) -
మరో ‘డేరా బాబా’పై రేప్ కేసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో డేరా బాబా వెలుగులోకి వచ్చాడు. తానే స్వయంగా దేవుడి అవతారం అని చెప్పుకునే దాతి మహారాజ్ బాబాపై ఢిల్లీ పోలీసులు సోమవారం అత్యాచార నేరం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మహారాజ్ ఆశ్రమం శనిధామ్‌లో రెండు సంవత్సరాల క్రితం తాను అత్యాచారానికి గురైనట్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం తనపై లైంగిక దోపిడి జరిగినప్పటికి ప్రాణ భయం వల్ల, జీవితం అల్లరి పాలవుతుందని భయపడి అత్యాచార విషయాన్ని బయటికి చెప్పలేదని ఆమె తెలిపినట్టు పోలీసు వెల్లడించారు. అలాగే ఈ బాబాకు ఢిల్లీలోని ఫతేపూర్‌లో ఆఫీసు కూడా ఉంది. ఈయన ఉత్తర భారతదేశంలోనే పాపులర్ బాబా. -
జేజేల నుంచి.. జైలు దాకా...!
ఓ మైనర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆసారాం బాపూజీకి జోధ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించిన నేపథ్యంలో స్వయం ప్రకటిత బాబాలు, స్వామిజీలు, అధ్యాత్మిక గురూజీల వివాదాస్పద వైఖరి, వారు ఎదుర్కొన్న కేసులు, పడిన శిక్షలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి స్వామిజీల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. తల్లితండ్రులను పూజించాలని, లైంగిక వాంఛలు లేని పవిత్రమైన జీవితాన్ని గడపాలంటూ ఉపదేశాలిచ్చే 79 ఏళ్ల ఆసారాం బాపూజీ అత్యాచారం కేసులో అరెస్టయి 2013 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఆధ్యాత్మిక కేంద్రంలోనే ఆసారాం తనపై అత్యాచారం చేశారంటూ ఓ టీనేజీ భక్తురాలి ఫిర్యాదుపై ఆయన అరెస్టయ్యారు.. ఆ తర్వాత మరో మహిళా అనుయాయి కూడా ఇదే ఆరోపణ చేశారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించే ఆసారాం కుమారుడు నారాయణ్ సాయి కూడా అత్యాచారం ఆరోపణలతోనే కటకటాల పాలయ్యారు. శిక్షపడిన, కేసులు ఎదుర్కొంటున్న స్వామిజీలు కొందరు... గుర్మీత్ రాం రహీమ్ : గతేడాది ఆగస్టులో అత్యాచారం కేసులో గుర్మీత్‌సింగ్‌కు ఇరవైఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. గంగానంద తీర్థపథ : కేరళ కొల్లాంలోని ఆశ్రమాన్ని నిర్వహించిన తీర్థపథ పూజా పద్ధతుల (ఆచారాల) నిర్వహణ నెపంతో ఓ న్యాయశాస్త్ర విద్యార్థినిని అయిదేళ్ల పాటు శారీరకంగా లొంగదీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి ప్రతిగా ఆ అమ్మాయి తీర్థపథ పురుషాంగాన్ని తెగ్గోసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ప్రాయశ్చిత్తంగా తానే ఆ పని చేసినట్లు ఆయన ప్రకటించుకున్నాడు. మెహందీ ఖాసిం : ఏడుగురు అమ్మాయిలను రేప్ చేసినందుకు 43 ఏళ్ల మెహందీ బాబాకు ముంబై కోర్టు 2016 ఏప్రిల్‌లో జీవితఖైదు విధించింది. మానసిక వికలాంగులైన అబ్బాయిలను ఆరోగ్యవంతులను చేసే చికిత్స కోసం అమ్మాయిలను కూడా పంపించాలని, తాను చేసే చికిత్స ద్వారా ఈ అమ్మాయిలు మానసిక వికలాంగులకు జన్మనివ్వకుండా నివారించవచ్చునని వారిపై అత్యాచారం జరిపాడు. సంతోష్ మాధవన్ అలియాస్ స్వామి అమృత చైతన్య : ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన కేసులో మాధవన్‌కు 2009లో కేరళ కోర్టు 16 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలను ఏదో నెపంతో రప్పించి, వారిని నిర్భందించి అత్యాచారం చేశాడు. స్వామి ప్రేమానంద : శ్రీలంక నుంచి 1984లో తమిళనాడులోని తిరుచిరాపల్లికి వచ్చిన ప్రేమానంద్ అక్కడ ఆశ్రమం నెలకొల్పాడు. ఇక్కడే అతడు తనపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చినట్లు 1994లో ఒక అమ్మాయి ఆరోపించింది. పదమూడు మంది మైనర్ బాలికలను రేప్ చేసిన కేసుల్లో ప్రేమానంద్తో పాటు మరో ఆరుగురికి కోర్టు శిక్ష విధించింది. జ్ఞానచైతన్య : మూడు హత్యలకు గాను 14 ఏళ్ల జైలు జీవితాన్ని గడిపి బయటికొచ్చాక ఒక బ్రిటీష్ కుటుంబాన్ని కలుసుకుని తన గత జన్మలో వారి కుమార్తె తన భార్యగా ఉందంటూ నమ్మించాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు హింసించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువతి చేసిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు మళ్లీ ఆరెస్ట్ చేశారు. రాంపాల్ మహారాజ్ : హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు వివిధ కేసుల్లో 2014లో కోర్టు జారీచేసిన అరెస్ట్ వారెంట్ నుంచి తప్పించుకునేందుకు తన భక్తులతో రాళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో గురు రాంపాల్ మహారాజ్ దాడులు చేయించాడు. కొన్ని రోజుల తర్వాత కాని పోలీసులు ఈ భారీ కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించలేకపోయారు. ఈ ముట్టడిలో ఆరుగురు చనిపోయారు. స్వామి నిత్యానంద : లైంగిక వేధింపులు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందపై కర్ణాటకలోని ఆశ్రమంలో తమను శారీరకంగా హింసించారంటూ అయిదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. సినీనటితో శృంగారం వీడియో వివాదం వెలుగుచూడడంతో 2010లో 53 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. ఇద్దరు మహిళలతో అసభ్య ప్రవర్తనపై ఒక స్థానిక టెలివిజన్ చానల్ వీడియో విడుదల చేయడంతో గ్రామస్తులు ఆశ్రమంపై దాడి చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డేరా బాబాపై ఛార్జిషీటు దాఖలు
చండీగఢ్: రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం, ఆయన ఇద్దరు అనుచరులపై సీబీఐ గురువారం ఛార్జిషీటు దాఖలు చేసింది. గుర్మీత్ రామ్ రహీం తన ఆశ్రమంలో పని చేసే ఇద్దరు యువతులపై అత్యాచారం చేయడంతో కోర్టు ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరో రెండు హత్య కేసుల్లో కూడా గుర్మీత్ రామ్ రహీం నిందితుడిగా ఉన్నాడు. డేరా ఆశ్రమంలోని తన అనుచరులను నపుంసకులుగా మార్చారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా హైకోర్టు విచారణకు ఆదేశించిన 3 సంవత్సరాల తర్వాత సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. డేరా ఆశ్రమ చీఫ్ గుర్మీత్ మాజీ అనుచరుడు హన్స్‌రాజ్ చౌహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో పాటు ఆశ్రమంలో పనిచేస్తున్న 400 మంది అనుచరులను డేరా ఆశ్రమంలో నపుంసకులుగా మార్చివేశాడని హన్స్‌రాజ్ చౌహన్ పిటిషన్లో పేర్కొన్నారు. గుర్మీత్ రామ్ రహీం రోహ్తక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
అమ్మకానికి హనీప్రీత్, గుర్మీత్ సింగ్
ఉజ్జయిని: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తత పుత్రిక హనీప్రీత్ సింగ్‌లకు అవమానాలు ఆగేలా లేవు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన గాడిదల సంతలో రాజస్తాన్‌కు చెందిన హరిఓం ప్రజాపత్ తన రెండు గాడిదలకు గుర్మీత్ సింగ్, హనీప్రీత్లుగా పేరుపెట్టి రూ.11,000కు అమ్మివేశాడు. గుర్మీత్ సింగ్, హనీప్రీత్‌ల పేర్లను తన గాడిదలకు పెట్టడంపై స్పందిస్తూ చేసిన తప్పుకు శిక్ష తప్పదన్న సందేశం పంపేందుకే ఈ పనిచేసినట్లు వెల్లడించారు. వీటిని రూ.20,000 అమ్మాల నుకున్నప్పటికీ సరైన ధర రాకపోవడంతో చివరికి రూ.11 వేలకే అమ్మాల్సి వచ్చిందని పేర్కొన్నారు. -
జైల్లో నిద్రలేని రాత్రి
అంబాలా : డేరాబాబా గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్.. మొదటి రోజు జైల్లో నిద్రలేకుండా గడిపినట్లు పోలీసులు తెలిపారు. నిన్నమొన్నటిదాకా విలాసాల్లో మునిగితేలిన హనీప్రీత్‌కు పోలీస్ ట్రీట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా తెలుస్తోంది. పంచకుల జైల్లో ఆమె కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమెను పంచకుల నుంచి అంబాలా సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పంచకుల జైల్లో రిమాండ్ ఖైదీగా ఆమె గడిపిన క్షణాలను పోలీసులు గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ చేసిన తొలిరోజున హనీప్రీత్ జైల్లో రాత్రి భోజనం కూడా చేయలేదని తెలుస్తోంది. అధిక సమయం మౌనంగా ఉండడంతో పాటూ.. తనలోతానే మాట్లుకునేదట. హనీప్రీత్‌తో పాటు ఆమె ముఖ్య అనుచరురాలు సుఖ్దీప్ కౌర్ కూడా ఆమె ఉన్నట్లు సామాచారం. హనీప్రీత్, సుఖ్దీప్ కౌర్‌లను ఇతర మహిళ నేరస్థులతో కాకుండా ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచినట్లు తెలుస్తోంది. వీరున్న గదికి అత్యంత పటిష్టమైన బధ్రతను పోలీసులు ఏర్నాటు చేశారు. హనీప్రీత్‌ను ప్రతిక్షణం గమనించేలా ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. ఇదిలా ఉండగా.. హనీప్రీత్‌ను అరెస్ట్ చేసిన తరువాత.. గుర్మీత్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె పోలీసులను అభ్యర్తించినట్లు తెలుస్తోంది. -
హనీప్రీత్ రిమాండ్ పొడిగింపు
సాక్షి,చండీగర్: డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీస్ కస్టడీని పంచ్‌కుల కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. అత్యాచార కేసుల్లో డేరా బాబాను దోషిగా నిర్ధారించిన క్రమంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి హనీప్రీత్‌ను ఈనెల 3న హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడిన కారణంగా తాము ఆమెను ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకువెళ్లాలని పోలీసులు కోర్టుకు నివేదించారు. హనీప్రీత్ రిమాండ్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని కోరారు. హర్యానా పోలీసుల అభ్యర్థన మేరకు మూడు రోజుల పాటు ఈనెల 13 వరకూ హనీప్రీత్ రిమాండ్‌ను పంచ్‌కుల కోర్టు పొడిగించింది. -
‘డేరా బాబాకు యావజ్జీవ ఖైదు’
సాక్షి,చండీగర్: డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు జీవిత ఖైదు విధించాలని ఆయన అత్యాచార బాధితులు ఇద్దరు బుధవారం పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. రెండు అత్యాచార కేసులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆగస్ట్ 28న డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన విషయం విదితమే.అయితే అత్యాచార కేసులో ఆయన శిక్షను యావజ్జీవ ఖైదుకు పొడిగించాలని కోరుతూ బాధితులు రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారని వారి తరపు న్యాయవాది నవ్‌కిరణ్ సింగ్ చెప్పారు. డేరా బాబాను ఆయన అనుచరులు పితాజీగా భావించారని అయితే బాధితులను ఆయన శారీరకంగా, భౌతికంగా తన కస్టడీలోకి తీసుకుని వారి విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు మత, ఆథ్యాత్మిక గురువుగా తన స్ధానాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. అందుకే తాము డేరా బాబాకు 20 ఏళ్లకు బదులు యావజ్జీవ ఖైదు విధించాలని తాము కోరుతున్నామన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుల మేరకు గుర్మీత్ రామ్ రహీం సింగ్ ప్రస్తుతం హర్యనాలోని రోహ్తక్ జిల్లా సునరియ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.