హింసకు పాల్పడింది వీరే..
హింసకు పాల్పడింది వీరే..
Published Wed, Sep 20 2017 4:53 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
సాక్షి, చండీగఢ్: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన హింసాకాండలో పాల్గొన్న పదిమంది ఫొటోలను హరియాణా పోలీసులు విడుదల చేశారు. పలువురు డేరా మద్దతుదారులు పంచ్‌కులలో జరిగిన హింసలో పాలుపంచుకున్నట్టు ఈ ఫొటోల్లో కనిపించింది. నిరసనకారులు మీడియా ఓబీ వ్యాన్లను దగ్ధం చేస్తూ, రాళ్లు విసురుతూ.. వాహనాలను ధ్వంసం చేస్తూ కనిపించారు.
హర్యానా పోలీసులు 43 మంది పేర్లతో మోస్ట్ వాంటెడ్ జాబితాను విడుదల చేసిన రెండు రోజుల అనంతరం ఈ ఫొటోలను వెల్లడించారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ది మొదటి పేరు కావడం గమనార్హం. అంతకుముందు హనీప్రీత్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్‌లపై పోలీసులు లుక్‌అవుట్ నోటీస్ జారీ చేశారు.
Advertisement
Advertisement