Haryana police
-
ఈ రెజ్లర్ ఎవరో గుర్తుపట్టగలరా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గానూ..
-
Monu Manesar: గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్
వివాదాస్పద గోసంరక్షుడు, బజరంగ్దళ్ సభ్యుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని భివానీలో ఇద్దరు వ్యక్తుల హత్య, నూహ్‌లో అల్లర్లను ప్రేరేపించిన కేసులో మోను మనేసర్‌ను మంగళవారం సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనేసర్‌ను హర్యానా పోలీసులు రాజస్ధాన్ పోలీసులకు అప్పగించనున్నారు. కాగా గత ఫిబ్రవరిలో హర్యానాలో ఇద్దరు ముస్లింలను సజీవ దహనం చేసిన కేసులో మోనుపై కేసు నమోదైంది. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ మమతా సింగ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా అభ్యంతరకరమైన పోస్టుపై మోనును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌పై మోనూ వాంటెడ్‌గా ఉన్న ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు. రాజస్థాన్ పోలీసులు మోను మనేసర్‌ను కోర్టు ద్వారా కస్టడీలో తీసుకోవచ్చని తెలిపారు. అసలెవరీ మోను మనేసర్ మోను మనేసర్ అలియాస్ మోహిత్ యాదవ్ బజరంగ్దళ్ సభ్యుడు. అంతేగాక గో సంరక్షుడు కూడా. ఇతరు గురుగ్రామ్‌లోని మనేసర్ ప్రాంతానికి చెందినవాడు. ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరిని కారుతో సహా సజీవ దహనం చేసిన కేసులో మోను కీలక నిందితుడిగా ఉన్నాడు. అదే విధంగా హర్యానాలోని నూహ్‌లో కొన్ని రోజులపాటు మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హిందువులు తలపెట్టిన ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన హింసలో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు చనిపోయారు.. అయితే ఈ యాత్రలో మానేసర్ పాల్గొన్నాడనే సమాచారంతోనే కొందరు దాడికి తెగబడ్డారు. వాహనాలను దగ్ధం చేశారు. కాగా రాజస్థాన్ భరత్పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నసీర్, జునైద్‌లను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజే హర్యానాలోని లోహారులో ఓ కారులో కాలిపోయిన స్థితిలో వారి మృతదేహాలు గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసి మోను మనేసర్‌ను నిందితుడిగా చేర్చారు. చదవండి: ‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా? -
Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు
చండీగఢ్: గత నెల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా అల్లర్లతో సంబంధముందన్న కారణంతో బజరంగ్దళ్ సభ్యుడు గోసంరక్షకుడైన బిట్టు బజరంగీని అరెస్టు చేశారు హర్యానా పోలీసులు. నూహ్ జిల్లా గురుగ్రామ్ పరిసర ప్రాంతాల్లోని జరిగిన అల్లర్లలో ఐదుగురు మరణించగా సుమారు 70 మంది గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఒక మసీదు ధ్వంసం కాగా వందలాది వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అల్లర్లు చెలరేగడానికి ప్రధానంగా బజరంగ్దళ్ కార్యకర్తలైన బిట్టు బజరంగీ, మోను మనేసర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని వారిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో హర్యానా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బిట్టు బజరంగీని ఫరీదాబాద్ లోని తన ఇంటి వద్దే పారిపోతుండగా వెంటాడి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డవడంతో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో పోలీసులు సాదా దుస్తుల్లో కనిపించగా వారి చేతుల్లో కర్రలు తుపాకులు కనిపించాయి. అతడితో పాటు అతడి అనుచరులను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు ఈ బృందంలోని ఒక పోలీస్ అధికారి. పోలీసుల విధులకు ఎవ్వరు ఆటంకం కలిగించినా విడిచిపెట్టేది లేదని.. సోషల్ మీడియాని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అసత్య సమాచారంతో తప్పుదోవ పట్టించినా సహించేది లేదని అన్నారు. బిట్టు బజరంగీ అలియాస్ రాజ్ కుమార్ ఒక సాధారణ పండ్ల వ్యాపారి. ఫరీదాబాద్ లోని దాబువా మార్కెట్ లో పండ్ల వ్యాపారం చేసుకునే అతను ఒక గోసంరక్షణ గ్రూపును కూడా నిర్వహిస్తున్నాడు. గత నెలలోనే అతడిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. నూహ్ అల్లర్ల తర్వాత గోసంరక్ష బజరంగ్ చీఫ్ పైనా కేసు నమోదైంది. స్థానిక నూహ్ ఎమ్మెల్యే చౌదరి అఫ్తాబ్ మాట్లాడుతూ బిట్టు బజరంగ్, మోను మనేసర్ ఇద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలననే అల్లర్లు చెలరేగాయని ప్రజలు వారిపై కోపంగా ఉన్నారని అన్నారు. बिट्टू बजरंगी को हरियाणा पुलिस ने किया गिरफ्तार पहले सुदर्शन न्यूज के रेजिडेंट एडिटर मुकेश कुमार जी की गिरफ्तारी अब गौरक्षक #BittuBajrangi की गिरफ्तारी ये कैसा अमृतकाल है खट्टर साहब ? स्वतंत्रता दिवस के दिन गौरक्षक की गिरफ्तारी क्यों ? pic.twitter.com/7PlI99F7QR — Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) August 15, 2023 ఇది కూడా చదవండి: Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం -
నగరంలోని సైకిళ్లన్నీ మాయం.. కారణం తెలిసి పోలీసులే షాక్!
చండీగఢ్: హరియాణాలోని పంచకుల జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా సైకిళ్లు మాయమవుతున్నాయి. ఒక్కసారిగా సైకిళ్లు మాయమవుతున్నట్లు ఫిర్యాదులు పెరగటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే కేసు ఛేదించారు. అయితే.. పోలీసులే విస్తుపోయే సంఘటన ఎదురైంది. నగరంలోని సైకిళ్లన్నింటిని ఒకే వ్యక్తి ఎత్తుకెళ్లటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచకుల జిల్లాలోని మంజ్రి గ్రామంలో రవి కుమార్(32) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. పంచకుల జిల్లా మొత్తం తిరుగుతూ సైకిళ్లు ఎత్తుకెళ్లే పని పెట్టుకున్నాడు. ఇటీవలే సెప్టెంబర్ 14న సెక్టార్ 26లో సుమారు రూ.15,000 విలువ చేసే సైకిల్‌ను మాయం చేశాడు. సెక్టార్స్ 2,4,7,9,10,11,12,12A,20, 21,25లలో సైకిళ్లు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల తర్వాత రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. నిఘా కెమెరాల ఆధారంగా మొత్తం 62 సైకిళ్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘సీసీటీవీ ఫుటేజ్, సైబర్ టెక్నాలజీ ఆధారంగా పంచకుల జిల్లా మొత్తం ఒకే వ్యక్తి సైకిళ్లు దొంగతనం చేసినట్లు తేలింది. ఈ సైకిళ్లు గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర ఉన్నాయి.’ అని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన సైకిళ్లను అత్యంత తక్కువ ధరకు రూ.2,000లకే అమ్మటం.. వచ్చిన డబ్బును మత్తుపదార్థాలు కొనుగోలు చేసేందుకు వినియోగించటం చేస్తున్నాడు. ‘2021లో లుథియానా నుంచి చండీగఢ్‌లోని రాయ్‌పుర్ ఖుర్ద్‌కు మకాం మార్చాడు రవి. జిరాక్‌పుర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. తన ఉద్యోగం పోయిన క్రమంలో మత్తుకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత పంచకులకు మారి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నాడు.’ అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపాడు. ఇదీ చదవండి: భర్తను చితకబాది.. భార్యను లాక్కెళ్లి ఆరుగురు గ్యాంగ్ రేప్! -
Viral video: రోడ్డుపై గొడ్డలితో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్!
చండీగఢ్: రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ చేయటం అంత సులభమైన పనేమి కాదు. నిత్యం ఎండలో నిలబడి ట్రాఫిక్ సూచనలు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. అలా.. రోడ్డుపై గొడ్డలి పట్టుకుని వాహనదారులను బెదిరిస్తూ హల్చల్ చేస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఈ వీడియోలో.. ఓ బైక్‌పై ముగ్గురు యువకులు రాగా.. వారి వైపు గొడ్డలితో దూసుకెళ్లారు పోలీసు. వారిని కాలితో తన్నుతున్నట్లు కనిపిస్తోంది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం, ముగ్గురు ఎక్కటంతో అలా చేసినట్లు తెలుస్తోంది. హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడ్డలి పట్టుకుని బైక్‌పైన ఉన్న వారిని బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ గద్దరించారు. మంగళవారం ఉదయం ఫరిదాబాద్‌లోని బాటా చౌక్‌లో ఈ సంఘటన జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ దర్యాప్తునకు ఆదేశించాం. వీడియోలోని వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఆ గొడ్డలిని వాహనదారుల నుంచి లాక్కున్నట్లు తెలిసింది. నిజానిజాలు వెల్లడైన తర్వాత చర్యలు తీసుకుంటాం.’ అని హర్యానా పోలీస్ ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
బగ్గా అరెస్ట్; మూడు రాష్ట్రాల పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు ఇవాళ ఢిల్లీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బగ్గా అరెస్ట్ మూడు రాష్ట్రాల పోలీసుల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’గా మారింది. బగ్గా అరెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే.. 50 మంది పోలీసులు.. అరెస్ట్ శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఢిల్లీలో బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 50 మంది పోలీసులు మిస్టర్ బగ్గా ఢిల్లీ ఇంటిలోకి చొరబడి అతడిని అరెస్టు చేశారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ఆరోపించారు. తలపాగా ధరించే సమయం కూడా ఇవ్వకుండా అతడిని బలవంతంగా లాక్కుపోయారని అన్నారు. కిడ్నాప్ అంటూ కేసు దాదాపు 10-15 మంది పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి, తన కుమారుడిని కొట్టి బయటకు లాక్కొచ్చారని బగ్గా తండ్రి ప్రీత్ పాల్ ఆరోపించారు. వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తన ఫోన్‌ను లాక్కున్నారని.. బగ్గా ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ ఆయన కేసు పెట్టారు. దీంతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు సమాచారం లేదు తజిందర్ సింగ్ అరెస్ట్‌పై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే పంజాబ్ పోలీసులు మాత్రం ఈ ఆరోపణను తోసిపుచ్చారు. ముందస్తు సమాచారం ఇచ్చామని.. దీనికి అనుగుణంగానే తమ బృందం ఒకటి గురువారం సాయంత్రం నుంచి జనక్‌పురి పోలీస్ స్టేషన్లో ఉందని వెల్లడించారు. హరియాణా టు ఢిల్లీ తజిందర్ సింగ్‌ను మొహాలి తీసుకెళుతుండగా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. తజిందర్ సింగ్ తండ్రి కిడ్నాప్ కేసు పెట్టడంతో ఈ మేరకు వ్యవహరించినట్టు హరియాణా పోలీసులు తెలిపారు. దీంతో హరియాణా నుంచి ఢిల్లీకి తజిందర్ సింగ్‌ను తీసుకొచ్చారు. బగ్గాను కిడ్నాప్ చేయలేదని, తమ రాష్ట్రంలో నమోదైన కేసు ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామని హరియాణా పోలీసు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించినా వినిపించుకోలేదని పంజాబ్ పోలీసులు వాపోయారు. టార్గెట్ కేజ్రీవాల్ తజిందర్ సింగ్‌పై మొహాలి జిల్లాలోని సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్‌లోని సైబర్ సెల్లో కేసు నమోదైంది. విద్వేష ప్రకటనలు చేయడం, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో బగ్గా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై కేజ్రీవాల్ స్పందనపై అసంతృప్తితో అతడు రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విచారణకు సహకరించనందుకే.. బగ్గాపై కేసు వ్యవహారంలో పంజాబ్ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఐదుసార్లు నోటీసులు పంపిన తర్వాత కూడా విచారణకు సహకరించేందుకు బగ్గా నిరాకరించడంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, విషపూరితమైన, ద్వేషపూరితమైన పదజాలం వాడుతూ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు. పంజాబ్ అభ్యర్థనకు హైకోర్టు నో తజిందర్ సింగ్‌ను హరియాణాలోనే ఉంచాలన్న పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనను పంజాబ్- హరియాణా హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. హరియాణా పోలీసులు బగ్గాను ఢిల్లీ పోలీసులకు అప్పగించడంతో పంజాబ్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హరియాణా పోలీసుల జోక్యం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పంజాబ్ అడ్వకేట్ జనరల్ (ఏజీ) అన్మోల్ రతన్ సిద్ధూ. హైకోర్టులో వాదించారు. ఢిల్లీ పోలీసులను బగ్గాతో కలిసి హరియాణా సరిహద్దు దాటనివ్వవద్దని కూడా కోర్టును అభ్యర్థించారు. (క్లిక్: సీఎంకు బెదిరింపులు.. బీజేపీ నేత అరెస్ట్) -
భారీ ఉగ్రకుట్ర భగ్నం
చండీగఢ్: భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ అండతో ఖలిస్తాన్ వేర్పాటువాదులు వేసిన పథకాన్ని పోలీసు బలగాలు బట్టబయలు చేశాయి. హరియాణాలోని కర్నాల్ గురువారం వేకువజామున జరిపిన సోదాల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌కు పేలుడు పదార్థాలతో వెళుతున్న వాహనం పట్టుబడింది. అందులో ఉన్న మూడు ఐఈడీలతోపాటు, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరియాణా డీజీపీ పీకే అగర్వాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేంద్ర నిఘావర్గాల సమాచారం మేరకు పంజాబ్, హరియాణా పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత ఇన్నోవా వాహనం వెనుకే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తోపాటు నాలుగు వాహనాల్లో పోలీసులు అనుసరించారు. బస్తారా టోల్ ప్లాజా వద్ద ఇన్నోవాను అడ్డగించి అందులోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని లూధియానాకు చెందిన భూపీందర్ సింగ్, ఫిరోజ్‌పూర్ జిల్లాకి చెందిన పర్మీందర్ సింగ్, గురుప్రీత్ సింగ్, అమన్‌దీప్ సింగ్‌లుగా గుర్తించారు. వాహనంలో ఉన్న 2.5 కిలోల చొప్పున బరువైన మూడు పాత్రల్లో ఉన్న ఆర్డీఎక్స్ను, పాక్ తయారీ పిస్టల్, రూ.1.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో అందజేయడానికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వీరు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న హర్వీందర్ సింగ్ రిందా వీరికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేశాడు. వీటిని ఎక్కడెక్కడికి తరలించాలో ప్రత్యేక యాప్ ద్వారా సూచనలు చేస్తున్నాడని డీజీపీ తెలిపారు. గతంలో కూడా వీరు పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను తరలించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో ముందుగానే గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో ఇతడు ఆయుధాలను, డ్రగ్స్‌ను జార విడుస్తున్నాడని అన్నారు. పట్టుబడిన నలుగురికి కర్నాల్ న్యాయస్థానం 10 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఉగ్రవాదుల కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్లు పంజాబ్ డీజీపీ వీకే భావ్రా అన్నారు. అనుమానిత ఉగ్రవాదుల వాహనాన్ని దాదాపు 300 కిలోమీటర్ల దూరం వెంబడించామన్నారు. బుధవారం రాత్రి ఫిరోజ్‌పూర్ నుంచి మొదలై గురువారం ఉదయం కర్నాల్‌లో ఈ సుదీర్ఘ ఛేజింగ్ ముగిసిందని చెప్పారు. -
క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..
Cricketer Yuvraj Singh Arrested: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ వెంటనే అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్లో పాల్గొన్న యువరాజ్.. తోటి క్రికెటర్ చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్డౌన్ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు.. యువరాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం -
అనుచిత వ్యాఖ్యలు: బుల్లితెర నటిపై కేసు నమోదు
నిమ్న వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీవీ నటి యువికా చౌదరి మీద కేసు నమోదైంది. దళితులను చులకన చేస్తూ ఆమె మాట్లాడిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సామాజిక కార్యకర్త రాజత్ కల్సన్ సదరు నటిపై చర్యలు తీసుకోవాలంటూ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువికా షెడ్యూల్డ్ కులాల మీద అవమానకరమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మే 26న అందిన ఈ ఫిర్యాదు మేరకు నటి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. కాగా బిగ్‌బాస్ నటి యువికా మే 25న ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇందులో షెడ్యూల్డ్ కుల వర్గాలను కించపరిచేలా మాట్లాడింది. దీంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడమే కాక ఏకంగా యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సదరు నటి తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరింది. తను మాట్లాడినదానికి సరైన అర్థం కూడా తెలియదని, అందువల్లే ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇదిలా వుంటే ఇటీవలే నిమ్న కులాల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బుల్లితెర నటి మున్మున్ దత్తా మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) చదవండి: మా అమ్మ ముందే నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు: నటి అరెస్ట్‌కి డిమాండ్.. నటి యువిక క్షమాపణలు -
సోనిపట్‌లో గ్యాంగ్స్టర్ల ఆటకట్టు..
చండీగఢ్ : ఖాకీలకు సవాల్ విసురుతున్న 11 మంది కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లను హర్యానా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోనీపట్‌కు సమీపంలోని బహల్గర్ ప్రాంతంలోని స్ధావరంపై పోలీసులు దాడి చేయగా వారిపై గ్యాంగ్స్టర్లు కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్స్టర్లకు గాయాలయ్యాయి. మొత్తం 11 మంది గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిపై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, హత్యాయత్నం, లూటీ, కిడ్నాపింగ్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను క్రిషన్, పవన్, నీతూ, దినేష్, మహిపాల్, రవిందర్, అమిత్, ప్రమోద్, సునీల్ పునియా, రవిందర్లుగా గుర్తించారు. కాగా గ్యాంగ్స్టర్ల కాల్పుల్లో గాయపడిన ఓ పోలీస్తో సహా ముగ్గురిని స్ధానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్స్టర్ల నుంచి అక్రమ ఆయుధాలు, రూ 10.23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన గ్యాంగ్స్టర్లలో కొందరి తలలపై పోలీసులు గతంలో ఒక్కొక్కరిపై రూ 50,000 రివార్డు ప్రకటించారు. -
ఎట్టకేలకు హనీప్రీత్ అరెస్ట్
-
ఎట్టకేలకు హనీప్రీత్ అరెస్ట్
హరియాణా : ఎట్టకేలకు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ మంగళవారమిక్కడ ధ్రువీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. కాగా గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమె మంగళవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన విషయం విదితమే. తాను దేశం విడిచి పారిపోలేదని, త్వరలో కోర్టులో లొంగిపోతానని హనీప్రీత్ అంతకు ముందు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను హరియాణా పోలీసులు ...చంఢీగఢ్ హైవే సమీపంలో అరెస్ట్ చేశారు. కాగా గత 38 రోజులుగా ఆమె రహస్య జీవితం గడిపారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం చెలరేగిన అలర్ల కేసులో హనీప్రీత్ కోసం హరియాణా పోలీసులు గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. చిట్టచివరకు ఆమెంతట ఆమె అజ్ఞాతం వీడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హింసకు పాల్పడింది వీరే..
సాక్షి, చండీగఢ్: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన హింసాకాండలో పాల్గొన్న పదిమంది ఫొటోలను హరియాణా పోలీసులు విడుదల చేశారు. పలువురు డేరా మద్దతుదారులు పంచ్కులలో జరిగిన హింసలో పాలుపంచుకున్నట్టు ఈ ఫొటోల్లో కనిపించింది. నిరసనకారులు మీడియా ఓబీ వ్యాన్లను దగ్ధం చేస్తూ, రాళ్లు విసురుతూ.. వాహనాలను ధ్వంసం చేస్తూ కనిపించారు. హర్యానా పోలీసులు 43 మంది పేర్లతో మోస్ట్ వాంటెడ్ జాబితాను విడుదల చేసిన రెండు రోజుల అనంతరం ఈ ఫొటోలను వెల్లడించారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ది మొదటి పేరు కావడం గమనార్హం. అంతకుముందు హనీప్రీత్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్‌లపై పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. -
గుర్గావ్లో ఏం జరుగుతోంది?
గుర్గావ్ : సంచలనం రేపిన హర్యానాలోని స్కూల్లో బాలుడి హత్య కేసు అటు పోలీసు అధికారులను పరుగులు పెట్టించడంతోపాటు స్కూల్ యజమాన్యానికి చుక్కలు చూపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బస్సు కండక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా స్కూల్ పరిపాలన విభాగానికి చెందిన అధికారులను కూడా అరెస్టు చేసింది. గత రాత్రి అరెస్టు చేసిన వారిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోపక్క, ఈ స్కూల్ గుర్తింపు విషయంపై విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ స్పందిస్తూ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్లక్ష్యం చేసిందని తాము కూడా అంగీకరిస్తున్నామని, అయితే, 1200మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని స్కూల్ గుర్తింపును రద్దు చేయలేమని తెలిపారు. ఈ కేసును సీబీఐ అధికారులకు అప్పగించాలంటూ పెద్ద మొత్తంలో స్కూల్ ముందు ధర్నాకు దిగిన వారిలో దాదాపు 50మందిపై లాఠీ చార్జీ చేసి గాయపరిచిన అరుణ్ అనే సీఐని కమిషనర్ సస్పెండ్ చేశారు. స్కూల్లో చాలా లోపాలున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనంటూ బాలుడి తండ్రి డిమాండ్ చేయడంతోపాటు నేడు వారు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్థానిక పోలీసుల విచారణతో తాము సంతృప్తిగా లేమని, వారు ఏదో కుట్రలు చేస్తున్నారని, నిజనిజాలు లోకానికి తెలిసేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలంటున్నామని చెప్పారు. వీరి తరుపు న్యాయవాది కూడా అత్యవసర వాదనల పేరిట సుప్రీం బెంచ్ ముందుకు పిల్‌ను తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ కేసు మీద పద్నాలుగు టీంలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఒక టీం ముంబయిలోని స్కూల్ యజమాన్యం వద్దకు వెళ్లింది. స్కూల్ సీఈవో ర్యాన్ పింటోను పోలీసులు ప్రశ్నించనున్నారు.