హరియాణా : ఎట్టకేలకు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ మంగళవారమిక్కడ ధ్రువీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. కాగా గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమె మంగళవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన విషయం విదితమే. తాను దేశం విడిచి పారిపోలేదని, త్వరలో కోర్టులో లొంగిపోతానని హనీప్రీత్ అంతకు ముందు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆమెను హరియాణా పోలీసులు ...చంఢీగఢ్ హైవే సమీపంలో అరెస్ట్ చేశారు. కాగా గత 38 రోజులుగా ఆమె రహస్య జీవితం గడిపారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం చెలరేగిన అలర్ల కేసులో హనీప్రీత్ కోసం హరియాణా పోలీసులు గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. చిట్టచివరకు ఆమెంతట ఆమె అజ్ఞాతం వీడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment