చండీగఢ్: రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ చేయటం అంత సులభమైన పనేమి కాదు. నిత్యం ఎండలో నిలబడి ట్రాఫిక్ సూచనలు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. అలా.. రోడ్డుపై గొడ్డలి పట్టుకుని వాహనదారులను బెదిరిస్తూ హల్‌చల్ చేస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఈ వీడియోలో.. ఓ బైక్‌పై ముగ్గురు యువకులు రాగా.. వారి వైపు గొడ్డలితో దూసుకెళ్లారు పోలీసు. వారిని కాలితో తన్నుతున్నట్లు కనిపిస్తోంది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం, ముగ్గురు ఎక్కటంతో అలా చేసినట్లు తెలుస్తోంది.
హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడ్డలి పట్టుకుని బైక్‌పైన ఉన్న వారిని బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ గద్దరించారు. మంగళవారం ఉదయం ఫరిదాబాద్‌లోని బాటా చౌక్‌లో ఈ సంఘటన జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ దర్యాప్తునకు ఆదేశించాం. వీడియోలోని వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఆ గొడ్డలిని వాహనదారుల నుంచి లాక్కున్నట్లు తెలిసింది. నిజానిజాలు వెల్లడైన తర్వాత చర్యలు తీసుకుంటాం.’ అని హర్యానా పోలీస్ ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి!
Comments
Please login to add a commentAdd a comment